Friday, October 23, 2009

మునెమ్మ - A manifesto on the Feminine


డాక్టర్ కేశవరెడ్డి గారి ‘మునెమ్మ’ అటుపాఠకుల్నీ ఇటు విమర్శకుల్నీ ఒక పట్టాన వదిలే నవలైతే కాదనే నిజానికి, నవల విడుదలైన సంవత్సరం తరువాత కూడా జరుగుతున్న చర్చలూ,వ్యాసాల పరంపరలు,కొనసాగుతున్న ఆలోచనలే సాక్ష్యం. ఆ నవలను కొందరు మ్యాజిక్ రియలిజంగా అభివర్ణించి-పొయటిక్ జస్టిస్ ని కొనియాడితే, మరికొందరు అరాకొరా మానసిక విశ్లేషణ చేసి, మోరలిస్టిక్ జడ్జిమెంట్లు రాసిపారేశారు. నా ప్రయత్నంగా నేను ‘నేటివ్ రీడర్’ ధృక్కోణం నుంచీ నవలని స్థానికసాంప్రదాయాల ఫోక్లోర్ ట్రెడిషన్ పంధాను ఆవిష్కరించే అసంపూర్ణ ప్రయత్నం(నా వ్యాసం పూర్తి కాలేదుమరి!) చేశాను.


మునెమ్మ నవల అందులోని పాత్రల మార్మికత,కథ లోని గాథాత్మకత దృష్ట్యా ఒక మనోవైజ్ఞానిక నవల అనేది నిర్వివాదాంశం. కానీ, ప్రాచిన- మానవమౌళిక( primitive and primordial) భావనలైన లైంగికతను మోరలిస్టిక్ దృష్టితో చూసే పురుషభావజాలం కోణం నుంచీ అర్థం చేసుకునే ప్రస్తుతపోకడలలో ఒక objective analysis ఈ నవలపై జరగలేదు అనేది నా నమ్మకం. ‘మునెమ్మ’ కేశవరెడ్డి పైత్యానికి ప్రతీకగా సాక్షి పేపర్లో కాత్యాయని విరుచుకుపడ్డా, కొందరు సాహితీ మిత్రులు ఆవిడ అర్బన్-ఎలీటిస్ట్- మిస్ ఇంటర్ప్రిటేషన్ కు సాగిలపడ్డా, అదంతా అనలిటికల్ సైకాలజీలోని నవీనపోకడలు (ముఖ్యంగా కార్ల్ యంగ్)- సాహిత్యంలో ఆ పోకడల్ని అన్వయించడం తెలియకపోవడమే అనే నిజాన్ని బహుచక్కగా వివరించిన వ్యాసం పసుపులేటి పూర్ణచంద్రరావు గారు ద సండే ఇండియన్ (19th Oct,2009)లో రాసిన "మునెమ్మ - ఒక ‘ఫండమెంటల్’ కథ! : A manifesto on the Feminine" అనే వ్యాసం.


ఆ వ్యాసం లంకెను ఇక్కడ ఇస్తున్నాను (పేజి నెంబర్ 42- 47). చదివి మీ అభిప్రాయాల్ని తెలిపితే, చర్చ ఇక్కడా ప్రారంభించొచ్చు.


****

3 comments:

రమణ said...

మునెమ్మ నవల మీద సమీక్ష, వ్యాసాలు కాకుండా, నవల చదివాక నా అభిప్రాయాలు పంచుకుంటాను. కేశవరెడ్డి గారి 'అతడు అడవిని జయించాడు ' నవల చదివా. మంచి నవల. చూద్దాం 'మునెమ్మ ' నవల ఎలా ఉంటుందో.
ఏమయినా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

మరువం ఉష said...

నేను 'అతడు అడవిని జయించాడు ' చదివాను. ఈ వ్యాసం త్వరలో చదువుతాను. ఇక్కడ చర్చ మొదలుపెట్టినందు థాంక్స్. త్వరలో రాగలననే ఆశ.

చక్రపాణి said...

క్లిష్టమైన సైకో అనాలసిస్/సైకాలజీ గురించి ఇంత సరళంగా తెలుగులోనైతే నేనెక్కడా చూడలేదు. ఈయనెవరన్నా ఇరగదీశాడు?

పూర్ణచంద్రరావు గారి గురించి తెలియడం ఇదే మొదటిసారి. పరిచయం చేసినందుకు థాంక్స్. ఆయన రచనలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి.
-చక్రి