Tuesday, December 22, 2009

భాష గోల


ఒకప్పుడు ప్రపంచంలోని ప్రజలంతా ఒకటిగా ఉండేవారట.
కలిసికట్టుగా. ఐకమత్యంగా. సంఘటితంగా. ఒకటిగా.
ఆ ఐకమత్యంవలనొచ్చిన బలంతో, ఒక పెద్ద స్థంభాన్నికట్టి స్వర్గానికి చేరుకుందామని జనం ప్లానేశారు.
ఆ ఒంటిస్థంభం మేడ నిర్మాణం మొదలయ్యింది. ఆ..వీళ్ళేంకడతార్లే అని దేవతలు ఊరుకున్నారట.
కానీ ఆ మేడ రోజురోజుకీ పెరిగి స్వర్గాన్ని చేరేదాకా వచ్చేసింది.
దేవుడు ఆ స్థంభాన్ని ఒకసారి కూల్చేసాడు.
జనం మళ్ళీ కలిసి ఇంకొకటికట్టారు.
మళ్ళీ దేవుడు కూల్చేసాడు.
జనం మళ్ళీకట్టారు...దేవుడు కూల్చేసాడు...జనం మళ్ళీ కట్టారు.
దేవుడికి దడ మొదలయ్యింది...ఇలా అయితే మనుషులందరూ స్వర్గానికి హైవేలో ఎప్పటికైనా వచ్చేస్తారని తెలిసొచ్చింది.

వెంఠనే...దేవుడు భాషని సృష్టించాడు.
అప్పట్నుంచీ ఇప్పటివరకూ మనుషులంతా ఒకటికాలేకపోయారు.
కొట్టుకుంటూనే ఉన్నారు. స్వర్గాన్ని అందుకోలేకపోయారు.

**** 

13 comments:

వాసు said...

ఇప్పుడు మొదలైన యాస గోల తో స్వర్గానికేమి ఖర్మ, ఉట్టికెగిరినా ఎక్కువే.
Mahesh, Very well said.

వేణు said...

బావుందండీ టపాలో వ్యంగ్యం! భాష- భావ ప్రసారాన్ని ఎంత అద్భుతంగా నిర్వహిస్తుందో... అపార్థాలను కూడా అంతే చక్కగా సృష్టించగలదు.

Bolloju Baba said...

adbuthamgaa undi.

good timing

అడ్డ గాడిద (The Ass) said...

Very well said with an old story. kani jananiki idi chaladu

Ramani Rao said...

:) బాగుంది

duppalaravi said...

Apt and appropriate!

Kalpana Rentala said...

లెస్స పలికితీరి మహేష్
కల్పన

Chirag Ali said...

well said Mahesh

Ali

మరువం ఉష said...

అంతే కదా మాట కలవనిదే మనసు కలవదు. మనిషిని మనిషిని విడతీసేది ఆ మనసులోని ఆలోచనే. బాగుంది ఈ అంశం.

భావన said...

దేవుడు కాదండి భాష ను సృష్టించింది.. ఈ మనుష్యుల లో intellectuals. దేవుడు అలా చిద్విలాసం గా చూసి నవ్వుతున్నాడూ మన లీల లను ;-)
బాగుంది మహేష్.. Very timely.. :-)

$h@nK@R ! said...

hmmm...

madhavarao.pabbaraju said...

శ్రీ మహేష్ గారికి, నమస్కారములు.

భాష గురించి చాలా బాగా చెప్పారు. మరి దీనినిబట్టి చూస్తే, "దేశ భాషలందు తెలుగు లెస్స" ఏమవుతుంది? ఏదిఏమైనా, ఈ గొడవలన్నీ వస్తాయనే, నేను "దేవుడు భాష అయిన సంస్కృతాన్ని" ఎంచక్కా ఎన్నుకున్నాను, స్వర్గానికి వెళ్ళవచ్చని.

భవదీయుడు,
మాధవరావు.

karlapalem Hanumantha Rao said...

చిన్న కర్ర తో పెద్ద పోటే పొడిచారు!