tag:blogger.com,1999:blog-280520459726971533.post8429060541272730381..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: సాంప్రదాయం - ఆధునికతKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-280520459726971533.post-53053485712647541132009-07-17T18:51:21.370+05:302009-07-17T18:51:21.370+05:30@నాగప్రసాద్: ఇక్కడ సమస్య ఆధునికత-సంప్రదాయం. అంతే క...@నాగప్రసాద్: ఇక్కడ సమస్య ఆధునికత-సంప్రదాయం. అంతే కానీ కుల వివక్ష కాదు. మహేష్ అయినా, నాగ ప్రసాద్ అయినా, నేనయినా & ఎవరైనా వాళ్ళ అనుభవాలు, అభిప్రాయాలూ మాత్రమే చెప్పగలరు, చెప్తారు కూడా ! చెప్పిన దాన్ని గురించి మాట్టాడ్డం మానేసి, "నువ్వది అప్పుడు చెప్పలా, నువ్విది ఇప్పుడు చేయలా ..." అనే కాడికి, ఈ బ్లాగ్ దాకా రావడం అనవసరం.

నేను అనుకునేది: సంప్రదాయం అనేది చాలా బలమైన వ్యవస్థ/వ్యసనం. దాన్ని పడగొట్టాలంటే ఇంకా పెద్ద బలం కావాలి. ఆధునికత సంప్రదాయాన్ని విస్మరిస్తుంది, కాని పెద్దగా ఖండించదు. అది చాలదు. సంప్రదాయాన్నిబలంగా ప్రశ్నించడం, ఖండించడం, ధిక్కరించడం చేసినపుడే ఆ వ్యవస్థని పడగొట్టగల౦. ఆ వ్యసనాన్ని వదిలించుకోగలం.

"అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష !" అని అంటేనే నాకు కాలుద్ది. అట్టనే అకారణంగా "నీకు తెలిసినదల్లా తప్పు" అనే ఆధునికత అన్నా కాలుద్ది. రెండు కూడా చేసే పని ఒకటే, నిర్దేశించడం. కొన్ని వర్గాలు సమయానుకులంగా వీటిని వాడుకుంటూ అధికారం చలాయిస్తూ ఉంటాయి. దారి ఏదైనా, చలాయించేది అధికారమే.

ప్రశ్నించ లేని సంప్రదాయం, అర్థం లేని ఆధునికతా రెండూ కూడా వ్యర్థమే. మనకు కావాల్సింది నిర౦తర మార్పు. హేతుబద్ధమైన ఆధునికత ! నిర౦తర మార్పు లేని నాడు, ఈ నాటి ఆధునికత కూడా రేపటి సంప్రదాయం గా మిగిలిపోతుంది.తెలుగోడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-87008009769887148502009-07-17T10:57:19.114+05:302009-07-17T10:57:19.114+05:30@వెంకటరమణ: ఆధునికత-సాంప్రదాయం వేరువేరు కాదు. అవి జ...@వెంకటరమణ: ఆధునికత-సాంప్రదాయం వేరువేరు కాదు. అవి జీవితాన్ని చూసే రెండు భిన్నమైన ధృక్కోణాలు(visions). అవి భిన్నంగా ఉన్నా వచ్చే నష్టం లేదు. Because they can coexist and be in transition for most of the time.

కానీ,నాసమస్య ఆ "మార్పు continuum"లోని అఘాధాల్ని మర్చిపొమ్మని, ఆదికాలానికీ-ఆధునిక యుగానికీ లంకెకట్టి వాదించే నియో-సాంప్రదాయవాదుల హిపోక్రసీతోనే.

ఈ విషయం అర్థం చేసుకోకుండా మళ్ళీ సాంప్రదాయం - ఆధునికతకు అదే కాంట్రాస్టుని చూపుతున్న నాగప్రసాద్ గారి వాదనతో నాకు కొంచెం చిరాకొచ్చింది. సాంప్రదాయం అంతా బంగారమూ కాదు. ఆధునికత అంతా శృంగారమూ కాదు. రెంటిలోనూ లోటుపాట్లున్నాయి. కానీ మార్పు దిశగా ప్రయాణించాలంటే ఆధునిక ఒక అవసరం. ఆ అవసరాన్ని అందిపుచ్చుకుంటూ కూడా కేవలం లిప్ సర్విస్ చేసే ద్వంద్వప్రవృత్తినే నేను వ్యతిరేకించేది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-51921637585952660932009-07-17T10:47:38.675+05:302009-07-17T10:47:38.675+05:30మీరు చెప్పినవి ఒప్పుకోక తప్పని నిజాలు.
అయితే నాగ...మీరు చెప్పినవి ఒప్పుకోక తప్పని నిజాలు.
అయితే నాగప్రసాద్ గారు చెప్పినట్లు, ఆధునికవాదం-సాంప్రదాయవాదాల సమన్వయమే మేలని నా అభిప్రాయం కూడా. ఈ సమన్వయం ఎంతవరకు అని చెప్పటం క్లిష్టతరం. ఇది ఎవరికి వారు తరచి చూసుకోవాల్సిన అంశం.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-3082219633362014022009-07-16T22:49:19.669+05:302009-07-16T22:49:19.669+05:30మీ పోస్ట్ లు ఎంతో educative.ఎన్నో విషయాలు ఎంతో ins...మీ పోస్ట్ లు ఎంతో educative.ఎన్నో విషయాలు ఎంతో insight ,కలిగిస్తాయి.
చాలా బాగా విశ్లేషిస్తారు ఎవిషయాన్నయినా.మీ నాలేడ్జీకి జోహార్లు ..Satyamevajayatehttps://www.blogger.com/profile/09409789705550943349noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-18823909755226752272009-07-16T22:07:20.233+05:302009-07-16T22:07:20.233+05:30@నాగప్రసాద్: ఉచిత సలహాలిచ్చి నన్ను సంస్కరించాలనుకు...@నాగప్రసాద్: ఉచిత సలహాలిచ్చి నన్ను సంస్కరించాలనుకునేవాళ్ళ లిస్టు చాలా పెద్దది. మీరూ అందులో చేరతానంటా మీ ఇష్టం. కాకపోతే ఒక మాట నేను సంస్కరింపబడాలని కోరుకోవటం లేదు. I am happy the way I am. So,thank you.

నేను హిందుత్వ గురించి రాస్తే వెతుక్కుని వచ్చేవాళ్ళు నా బ్లాగులోని (మీ దృష్టిలో)అర్థవంతమైన టపాలు కూడా వెతుక్కోండి. లేకపోతే నా మానాన నన్ను వదిలెయ్యండి.

పరిష్కారాలు చెప్పడానికి నేను డాక్టర్నో, మతగురువునో కాదు. సంఘసంస్కర్తని అంతకన్నా కాదు. కాబట్టి నా బాధ నాకు నచ్చిన వాటిని నేను చెప్పుకుంటూ ఉంటాను. అంతకు మించి మరేమీ చెయ్యను. కాబట్టి నన్ను క్షమించెయ్యండి.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-8188272614087469232009-07-16T21:07:29.162+05:302009-07-16T21:07:29.162+05:30>>"నేను ఏం చెయ్యాలో, ఏమిరాయాలో మీరేనిర్...>>"నేను ఏం చెయ్యాలో, ఏమిరాయాలో మీరేనిర్దేశిస్తే ఎలా?"

ఈ టపా వరకు నా అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. అంతేకాని, మీరు ఏమిరాయాలో, ఏం చెయ్యాలో నేను ఎక్కడ నిర్దేశించాను.

>>"ఇక విమర్శలంటారా! వాటివల్ల ఉపయోగం లేదని మీరనుకుంటే ఇక్కడ చర్చలెందుకు? మీ ఆపసోపాలెందుకు?"

నేను "కేవలం విమర్శిస్తే ఉపయోగం ఉండదు." అన్నాను. అంటే, దాని అర్థం విమర్శలు వద్దని కాదనుకుంటా. విమర్శతో పాటుగా పరిష్కారం కూడా ఉంటే బాగుంటుందని అన్నాను పోనీ ఉచిత సలహా ఇచ్చాను అనుకోండి.

>>"మీరెంతసేపూ నేను రాసే హిందుత్వ విమర్శ, బ్రాహ్మణుల(అదెప్పుడు చేశానబ్బా!) విమర్శ మాత్రమే చదువుతుంటే నాదా తప్పు? కులవివక్ష గురించి నేను చాలా సార్లు చాలా టపాల్లో చెప్పాను."

మీరు రాశారో, నేను చదవలేదో, ఒకవేళ మీరు రాసి ఉంటే ఆ లింకులేవో ఇవ్వొచ్చుగా.

నా వరకూ నా అభిప్రాయం వెలిబుచ్చాను. అది మీకు నచ్చాలని, వాటితో మీరు ఏకీభవించాలని, అందులోనివి మీరు పాటించాలని రూలేం లేదు.

మీ బ్లాగు మీది, మీ రాతలు మీవి, మీ అభిప్రాయాలు మీవి, నా అభిప్రాయాలు నావి. ఖేల్ ఖతం.నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-79433762639200710192009-07-16T19:59:10.495+05:302009-07-16T19:59:10.495+05:30@నాగప్రసాద్:మీ అర్ధాలు మీవి. నా అర్థాలు నావి. మీ అ...@నాగప్రసాద్:మీ అర్ధాలు మీవి. నా అర్థాలు నావి. మీ అర్ధాలతో నేను ఏకీభవించడం లేదు. నా అర్థాలతో మిమ్మల్ని ఏకీభవించమనట్లేదు. కాబట్టి ఖేల్ ఖతం.

మీరెంతసేపూ నేను రాసే హిందుత్వ విమర్శ, బ్రాహ్మణుల(అదెప్పుడు చేశానబ్బా!) విమర్శ మాత్రమే చదువుతుంటే నాదా తప్పు? కులవివక్ష గురించి నేను చాలా సార్లు చాలా టపాల్లో చెప్పాను. అవి మీకు కనిపించవులెండి.

ఇక విమర్శలంటారా! వాటివల్ల ఉపయోగం లేదని మీరనుకుంటే ఇక్కడ చర్చలెందుకు? మీ ఆపసోపాలెందుకు?

పరిష్కారమంటారా! అవి నా దగ్గరలేవు. ఆచరణ నేను చెయ్యను. కేవలం బ్లాగు రాసుకుంటాను. మీకేమైనా అభ్యంతరమా?

నేను ఏం చెయ్యాలో, ఏమిరాయాలో మీరేనిర్దేశిస్తే ఎలా? I have my reasons for writing the way I do. If you want to contribute to the discussion. Please do so. కేవలం రంధ్రాన్వేషణ మీ ధ్యేయమైతే నమస్కారం.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-46335484719462923802009-07-16T19:39:44.199+05:302009-07-16T19:39:44.199+05:30సాంప్రదాయం మతం మీద ఆధారపడినప్పటికీ, అది కేవలం ఫలనా...సాంప్రదాయం మతం మీద ఆధారపడినప్పటికీ, అది కేవలం ఫలనా విధంగా జీవిస్తే మనిషి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు బ్రతుకుతారని చెబుతుంది.

సాంప్రదాయం ఎక్కువగా మనిషి జీవన విధానం, ఆరోగ్యం, దైవభక్తి చుట్టూ తిరుగుతుంది.

అదే ఆధునికమైతే కార్పోరేట్ కంపెనీల చుట్టూ, డబ్బు చుట్టూ తిరుగుతుంది.

ఆధునికమెంత వరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి. లేదంటే కార్పోరేట్ ధన దాహానికి బలి అవ్వడం ఖాయం.

>>"హిందూమతంలో "కులవివక్ష నశించాలి" అని మనమంటే, అసలు అనాదిగావస్తున్న హిందూమతంలో కులప్రస్తావనే లేదంటారు."

మీరు కులవివక్ష నశించాలి అని ఎప్పుడు రాశారు. నేనింత వరకు చూడలేదు. మీరు ఎంతసేపూ బ్రాహ్మణులని, హిందుత్వాన్ని విమర్శించారే తప్ప ఎప్పుడూ కూడా పరిష్కారం గురించి చెప్పలేదు.

కేవలం విమర్శిస్తే ఉపయోగం ఉండదు. దానికి ఏదైనా పరిష్కారం చెప్పి, ఆచరణలో పెడతేనే సాధ్యమయ్యేది.

వీరేశలింగం లాంటి వాళ్ళు ఆచరణలో పెట్టడం వలననే, అప్పట్లో ఉన్న సాంఘిక దురాచారాలను చాలా వరకు రూపుమాపగలిగారు.నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-56906502026080163242009-07-16T19:35:46.742+05:302009-07-16T19:35:46.742+05:30meeru great saar..
good postmeeru great saar..

good postsknoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-80551996238826032882009-07-16T18:13:29.622+05:302009-07-16T18:13:29.622+05:30@గోగినేని వినయ్ చక్రవర్తి: Modernity,liberalism అన...@గోగినేని వినయ్ చక్రవర్తి: Modernity,liberalism అనేవి ఒక నిర్వచనానికి లొంగే పోకడలు కావు. అందుకే నిర్వచించలేదు. నా నిర్వచనం చెప్పినా ఎవరికీ ఉపయోగం లేదు.

అదెట్లాగో ఒక ఉదాహరణ ద్వారా చెబుతాను. ఒక పెళ్ళికావలసిన అమ్మాయి నాన్న ఆధునిక భావాలు కలిగిన వాడు అనుకుందాం. తన కూతురికి...
"నేను వెతికినవాళ్ళలో నీకు ఇష్టమైతేనే ఒకర్ని పెళ్ళిచేసుకో" అని ఒకరు చెప్పొచ్చు.
"నీ ఇష్టమొచ్చినవాడ్ని చూపించు. వాడితో పెళ్ళిచేస్తాంకానీ ఒకే కులమోడైతే చాలు." అని మరొకరు అనొచ్చు.
"నువ్వు ప్రేమించిన ఎవరైనా ఫరవాలేదమ్మా, తెలుగోడైతే చాలు" అని ఒకరనొచ్చు.
"హిందువైతే చాలు" అని మరొకరు.
"భారతీయుడైతే చాలు" అని మరొకరు.
"ఎవడినా ఫరవాలేదు. డబ్బులుంటే చాలు" అని మరొకరు.
"ఎవరైనా ఫరవాలేదు. మగాడైతే చాలు" అని మరొకరు.
"అడామగాఎవరైనా చాలు" అనే వాళ్ళు మరొకరు.

పైన చెప్పిన అన్నీ ఆధునికాలే విశాలదృక్పధాలే. కానీ వాటిల్లోకూడా స్థాయిలున్నాయి. అంటే modernity is highly subjective and often personal. అందుకే దాన్ని నేను ఇతరులకోసం నిర్వచించలేను.మీరు చెప్పిన morals కి కూడా ఇదే వర్తిస్తుంది.(ఈ విషయం మార్తాండ ప్రవీణ్ చెప్పలని ప్రయత్నించి నేను విఫలమయ్యాను. బహుశా మీకైనా అర్థమవుతుందేమో!)

కాకపోతే ఒకటి. ఆధునికం అన్నది ఒక alternative vision. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఆలోచనా ధోరణికి కొంచెం భిన్నమైనది. అంతే!

మీరు టెక్నాలజీని value neutral అని ఎందుకనుకుంటున్నారు? Each technology comes with its own set of "values" attached to you. కాబట్టి just access to technology is not very deferent from adopting to different set of values.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-14747117764077587252009-07-16T17:48:11.221+05:302009-07-16T17:48:11.221+05:30The idea of justice demands comparisons of actual ...The idea of justice demands comparisons of actual lives that people can lead rather than a remote search of ideal intuitions. -A Sen.Balahttps://www.blogger.com/profile/12506208121761898151noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-13778190947494348282009-07-16T16:36:27.366+05:302009-07-16T16:36:27.366+05:30@ప్రవీణ్: మీరెక్కువగా సంబంధం లేని విషయాలే మాట్లాడత...@ప్రవీణ్: మీరెక్కువగా సంబంధం లేని విషయాలే మాట్లాడతారు అనేదానికి ఈ వ్యాఖ్యా ఉదాహరణ.టపాకూ మీ వ్యాఖ్యకూ ఏమైనా సంబంధం ఉందా?

ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించాను. మీతో విబేధించాను గనక తిట్లదండకం మొదలెడతారు. అది మీకున్న అలవాటు. కాబట్టి బహుశా మీ వ్యాఖ్యలు ఇకపై ఈ టపాలో కనిపించవనుకుంటాను.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-84833629814893636822009-07-16T16:36:20.767+05:302009-07-16T16:36:20.767+05:30ఆధునికత అందించే వస్తుసామాగ్రిని అమితంగా ప్రేమించి,...ఆధునికత అందించే వస్తుసామాగ్రిని అమితంగా ప్రేమించి,కాంక్షించి వాటికి అనుగుణంగా విలువల్ని తాకట్టు పెట్టే ఈ టింకరశాస్త్రులు క్రీస్తుపూర్వంలో ఎప్పుడో చెప్పబడిన పుక్కిటిపురాణాల్ని ఉటంకిస్తూ, జరిగిన - జరుగుతున్న నిజాల్ని మర్చి, గత కాలపు వైభవంలో బ్రతకమంటారు. ఆధునికతకూ ఆదికాలానికీ మధ్య అగాధమే లేదంటారు. As if ఇప్పుడే హిమాలయాల నుంచీ తపస్సుతరువాత వచ్చి, గడ్డం మీసాలు గొరిగి కార్పొరేట్ ఆఫీసు గుమ్మం తొక్కిన ఫీలింగిస్తారు. వేదాలు,ఉపనిషత్తుల కాలం నుంచీ ఈ కాలానికి మనం ప్రయాణించడానికి మధ్యన సవాలక్ష మార్పులొచ్చి "ఆదిసాంప్రదాయం" చంకనాకిపోయిందని మనం చెబితే, అమెరికాలో బీరుమగ్గు చేతిలో పట్టుకుని అర్జంటుగా "వీడొక సంస్కృతి ద్రోహి. దేశద్రోహి" అని తీర్మానాలు (ఫత్వాలు) జారీచేస్తారు.

technologyni andipuchhukovatam veru............adhunikata antu minimum morals fallow kaakapovatam veru..............
paina pera maatram excellent...
baaga chepparu...........Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-13614169618839234272009-07-16T16:33:07.151+05:302009-07-16T16:33:07.151+05:3060 years vunname pelli chesukunte adhunikata fallo...60 years vunname pelli chesukunte adhunikata fallow avutunnatta......em matladutnnaru meeru

bane vundi gani littlebit confusion...............
one thing naaku anipinchindi...meeru vallu veellu ani kakunda....
sampradaayam adhunikata ante ento full fledged ga analysis cheste bagundedemo...em ledu koncham confusing ga vundi..............Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-12121981655043437942009-07-16T16:24:21.630+05:302009-07-16T16:24:21.630+05:30నేనేమీ సంబంధం లేని విషయాలు మాట్లాడడం లేదు. ఆధునికత...నేనేమీ సంబంధం లేని విషయాలు మాట్లాడడం లేదు. ఆధునికతని అంగీకరించడం ఇష్టం లేని వాళ్ళు ఆధునికవాదులమని చెప్పుకుంటున్నారు. ఇలాంటి హిపోక్రైట్లు ఉన్న సమాజంలో ఆధునికత అనే పదానికి అర్థం ఎంత వరకు ఉంటుందనేది ప్రశ్న.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-21875469962753719572009-07-16T16:21:52.851+05:302009-07-16T16:21:52.851+05:30@ప్రవీణ్: మీరు ఎక్కడిదో లంకె ఇక్కడికేస్తున్నారు. ఆ...@ప్రవీణ్: మీరు ఎక్కడిదో లంకె ఇక్కడికేస్తున్నారు. ఆ విషయంలో సమస్య మీరు వాడిన అభ్యంతరకరమైన భాషది. ఆధునికత కాదు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-34368051951456211292009-07-16T16:19:41.832+05:302009-07-16T16:19:41.832+05:30ఆధునికత ఎక్కడ ఉంది మహేష్ గారు? 60 ఏళ్ళ స్త్రీ భర్త...ఆధునికత ఎక్కడ ఉంది మహేష్ గారు? 60 ఏళ్ళ స్త్రీ భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకోవచ్చు అంటే కొంత మంది స్వయం ప్రకటిత ఆధునికవాదులు అంగీకరించలేకపోయారు. ఆడవాళ్ళు విమానాలు నడుపుతున్నా ఆడవాళ్ళ విషయంలో ఇంకా సంకుచిత నమ్మకాలని వదులుకోలేని స్థితిలో ఉన్నారు మన వాళ్ళు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com