tag:blogger.com,1999:blog-280520459726971533.post3028156330349266100..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: మహిళ నుంచీ, ‘మానవి’గా మారిన ఒక స్త్రీ కథKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-280520459726971533.post-15645612947573598342011-03-27T10:00:33.469+05:302011-03-27T10:00:33.469+05:30సీరియల్ గా సగం చూసాక నవల కొని చదివాను అస్తిత్వ ఆవే...సీరియల్ గా సగం చూసాక నవల కొని చదివాను అస్తిత్వ ఆవేదన కు ఒక మార్గం చూపించారు ఓల్గా ఈ పదేళ్ళలో మరింత ఆలోచనా శక్తీ మరింత ధైర్యం స్త్రీలలో పెంపొందాయి ఆత్మ గౌరవాన్ని నిలుపుకునే వసంత ఆమె స్నేహితురాలు పద్మ అనుకుంట ఒకతని తో సహజీవనం సాగిస్తూ ఉంటుంది ఆమె అలాగే మరో కోణంలో మరో స్నేహితురాలు ఉద్యోగం బాధ్యతలో మునిగి పిల్లల్ని చుసుకోలేకపోతున్నానని బాధ పడుతుంది స్త్రీ ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంత అవసరమో అంత హార్దిక స్వాతంత్ర్యం కూడా అని చెప్పే దశాబ్దం క్రితం దైనా ఎవెర్ గ్రీన్ నవల ...దీనికి ప్రేరణ డాలస్ హౌస్...అనే ఆంగ్ల నాటకం ...ఇక సురేష్ అన్నేళ్ల తర్వాత మరో స్త్రీని ప్రేమిన్చడమనేది......లాజిక్ కి అందదు...కొన్నిటికి సమాధానాలు ఉండవు ... తన వృత్తిని ప్రవృత్తిని అర్ధం చేసుకున్న మనిషి దొరకడం వల్ల అని నా ఉద్దేశం వసంత ఇల్లాలు మాత్రమే జీవన సహచరి కాదు..ఇది చాల మంది జీవితాల్లో ముఖ్యంగా కళాకారుల సాహిత్య కారుల జీవితాల్లో గొప్ప ప్రొఫెషనల్స్ జీవితాల్లో సహజం .....అయతే అందరి అసంతృప్తికీ సమాధానం ఉండక పోవచ్చు ..ఇందులో స్త్రీ పురుషుని సహాయం లేకుండా కూడా ఉండగలదనే విషయాని వసంత చేత , లేలుండా ఉండలేడని పద్మ చేత....నిరూపించే చిత్రణ చాల బాగా చేసారు ఓల్గా......మీ సమీక్ష బాగుంది మహేష్ గారు ...ప్రేమతో....జగతిdhaathrihttps://www.blogger.com/profile/08678352721155884686noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-4369528839140339882008-11-11T20:14:00.000+05:302008-11-11T20:14:00.000+05:30@మధుశ్రీ: మీధృక్పధం చాలా సహజంగా వుంది. కాకపోతే,ఇలా...@మధుశ్రీ: మీధృక్పధం చాలా సహజంగా వుంది. కాకపోతే,ఇలాంటి సంబంధాలు చాలా వ్యక్తిగత పరిధిలో ఏర్పడుతాయి, వాటి వివరాలు ఆబంధంలో వున్న ఇద్దరికీతప్ప మిగతావారికి తెలిసేవికావు.

అందుకే హిందీలో "ప్యార్ కియానహిజాతా హోజాతాహై అంటారు". ఇలాంటి సంబంధాలు పెట్టుకోరు. అలా జరిగిపోతాయి అంతే!

మనంవారి మానసిక,శారీరక,సమయ పరిధిలో ఉండముగనక,వీటి గురించి కూలంకషంగా అర్థం చేసుకోలేము.అందుకే, మన వ్యక్తిగతధృక్కోణం నుంచో లేక సామాజిక విలువల నేపధ్యం నుంచో బేరీజుచేసి ఒక judgment వెలువరించేస్తాము.లేదా, "నేనైతే ఇలాచెయ్యను." "కొందరుమగాళ్ళు ఇలాగే చేస్తారు" లాంటి generalization చేసి, మనకు అర్థమయ్యేవిధంగా ఈ సంబంధాల్ని నిర్వచిస్తాము.ఇది సహజంగా జరిగే ప్రక్రియ.We are conditioned to do that.

"అభిరుచులు కలిసిన ప్రేమల"గురించి నేను చెప్పింది ఒక possibility మాత్రమే.సురేష్ కు భార్యమీద అభిమానం లేదు అనేది చాలావరకూ నిజం కాకపోవచ్చు. ఎందుకంటే,తను రహస్యంగాకూడా ఈ సంబంధాన్ని కొనసాగించుండొచ్చు.కానీ,వసంతకు నిజాయితీగా ఈ విషయం చెబుతాడు. అది అతని వ్యక్తిగత నిబద్ధతకు చిహ్నంకదా!

పైగా, సురేష్ వసంతని నిర్లక్ష్యం చెయ్యలేదు. తను అప్పుడు చిక్కుకున్న పరిధిలో సాధ్యమైనంతవరకూ "న్యాయం" చెయ్యడానికే ప్రయత్నించాడు. లేదా కనీసం అన్యాయం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించాడు అని చెప్పుకోవచ్చు.

వసంత తన ఆక్రోశాన్నీ,అక్కసునూ,ఉక్రోషాన్నీ తెలియజెప్పే ప్రయత్నంలో, అసలే అందిగ్ధంలోవున్న సురేష్ కు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ పరిస్థితుల్లో సురేష్ కొంత కటువుగా ప్రవర్తించినా, లేక స్వాంతనకోసం నీలిమ దగ్గరికి బయల్దేరినా తప్పుపట్టలేము.

అదొక మానసిక సంఘర్షణ సమయం.అప్పుడుకూడా సురేష్ "నీ దిక్కున్నచోట చెప్పుకో" అనలేదు.He has committed a mistake from our point of view for sure,కానీ అతడు దుర్మార్గుడైతే కాదనిపిస్తుంది.

@ప్రతాప్:హయ్యో !సమీక్షలో మొత్తం కథ ఎక్కడ చెప్పానండీ. నేను చూపింది అస్తిపంజరాన్ని మాత్రమే, నిజానికి ఈ నవలలో కథనం, సంభాషణల్లో మొత్తం జీవం ఉంది. చదవండి.You will not miss out anything.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-55978901354379798652008-11-11T19:35:00.000+05:302008-11-11T19:35:00.000+05:30ఈ నవల నేనూ చదివాను. "ప్రేమ ఎప్పుడు ఎవరికి పుడుతుం...ఈ నవల నేనూ చదివాను.
"ప్రేమ ఎప్పుడు ఎవరికి పుడుతుందో..చెప్పలేం"...
అవును, వసంతకా వయసైపోయింది. ఇద్దరు పిల్లల తల్లి. పైగా అభిరుచులు కలిసిన ప్రేమ కాదని వంక ఒకటి. అభిరుచులు కలిస్తే స్నేహంగా ఉండాలి కానీ అభిరుచులు కలిసిన వాళ్లందరితోనూ సంబంధాలు పెట్టుకుంటారా సురేష్ లాంటి భర్తలు? పెళ్ళైన పాతికేళ్ళకు గుర్తొచ్చాయా అభిరుచులు? వసంత ఇష్టాలేమిటో, అభిరుచులేమిటొ తెలుసుకోడానికి సురేష్ ఏనాడైనా ప్రయత్నించాడా?

"అబ్బ, రోజంతా చాకిరీ, పని..మార్పు లేని జీవితం" అని వసంత కూడా విసిగిపోయి మరో కిషోర్ తో ఇదే రకమైన ప్రేమ వెలగబెడితే సురేష్ వసంత లాగా ఏడ్చి ఊరుకుంటాడా?

విషయం ఏమిటంటే....అందరూ కాకపోయినా కొందరు మగాళ్లకు కొన్నాళ్ళకు , మార్పు కావాలి. దానికి మారుపేర్లే....ఈ అభిరుచులు కలిసిన ప్రేమలూ, వంకాయలూనూ!మధుశ్రీhttps://www.blogger.com/profile/01613227583890959060noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-74939237872009361612008-11-11T17:30:00.000+05:302008-11-11T17:30:00.000+05:30Good review.కానీ కథ మొత్తం రివ్యూ లో చెప్పేస్తే ఎల...Good review.
కానీ కథ మొత్తం రివ్యూ లో చెప్పేస్తే ఎలా అండి. అస్సలే నేను చదవాలని కొనిపెట్టుకొన్న నవల.ప్రతాప్https://www.blogger.com/profile/03415615154576959736noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-32920063114978859622008-11-11T14:46:00.000+05:302008-11-11T14:46:00.000+05:30@సుజాత:చాలావరకూ వసంతలకు లావణ్యలాంటి కూతుళ్ళే ఉంటార...@సుజాత:చాలావరకూ వసంతలకు లావణ్యలాంటి కూతుళ్ళే ఉంటారు.తల్లులు చాలామంది కూతుర్ని "మంచి అమ్మాయిలాగా"నే పెంచుతారు.అమ్మాయిలకుండాల్సిన మంచివ్యక్తిత్వం మూస మన సమాజంలో ఇంకా తయారవ్వలేదనుకుంటాను.

ఇలాంటి పనులకు సురేష్ లు ఎందుకు చేస్తారు అనేదానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేం.ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలాపుడుతుంది చెప్పలేం. దాన్ని ఎలా నియంత్రించాలి అనేది ఆ పరిస్తితుల్లో మనిషి చేతుల్లో వుండదు.

ఇక వసంత-సురేష్ లు పాతికేళ్ళు కాపురం చేసినా ప్రేమ లేకపోవడం అంటారా..ఇక్కడ వారిమధ్య "ప్రేమ లేదు" అనేదాన్ని బహుశా రెండుకోణాలనుంచీ చూడాలి. మొదటిది అభిరుచులు,ఆలోచనలూ కలిసిన నీలిమ-సురేష్ ల ప్రేమలాంటి 'ప్రేమ' ఈ సంబంధంలో లేదు. రెండోది పెళ్ళి చేసుకుని సంసారం సాగిస్తున్నారుకాబట్టి కేవలం దాన్నొక 'బాధ్యత'గా భావిస్తూ కలిసి బ్రతికారేగాని, అనుభవైక్యమైన ప్రేమ వారిమధ్య లేకుండా ఉండివుండొచ్చు.

సురేష్ భార్యగా గుర్తింపునీ, మంచితల్లిగా సామాజిక గౌరవాన్నీ, మంచి గృహిణిగా తన బాధ్యతనీ వసంత నెరవేర్చినా, సురేష్ నీలిమలో పొందిన ప్రేమ వసంత ఇవ్వలేకపోయుండచ్చు.

నిజానికి నవలలోని కొన్ని భాగాలు (ముఖ్యంగా శాంతితో వసంత పెట్టుకునే గిల్లికజ్జాలు) చదివితే, అసలు వసంతకు "ప్రేమ అంటే ఇదీ !" అనే స్పృహేవున్నట్లుగా కనపడదు. అంటే తను పెళ్ళైందికాబట్టి, భర్త బాగోగులు చూసింది. తల్లికాబట్టి పిల్లల జీవితాల్ని చక్కదిద్దే(?) ప్రయత్నం చేసింది. గృహిణికాబట్టి ఇల్లే సర్వస్వం అనుకుంది. ఇందులో "ప్రేమ" ఎక్కడుందో...కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా!

ప్రేమ అనేది కలిసి జీవితాన్ని పంచుకున్నంతమాత్రానా వచ్చే default setting కాదు. చాలామంది బాధ్యతలు నిర్వర్తించడం ప్రేమ అనుకుంటారు. ఇక్కడ వసంత పాత్ర చేసేదీ అదే. పెద్ద కుమార్తె లావణ్య-వసంతల మధ్యనున్న తల్లీకూతుళ్ళ ప్రే....మ చూడండి.దాన్ని ప్రేమ అందామంటారా?

కనీసం తల్లీపిల్లలమధ్య unconditional ప్రేముండాలని మనం నమ్ముతాంకదా! కానీ ఇక్కడ నిజం ఎదురుగా నిల్చునేసరికీ, ప్రేమలు ఎలా "హుష్ కాకి" అయిపోయాయో చూడండి. అంటే, వారి మధ్య ఉన్నది, బాధ్యతతో కూడిన బంధం. అదీ అవసరాన్నిబట్టి మారిపోయే సంబంధం. భార్యాభర్తలుగా వసంత-సురేష్ మధ్యకూడా ఇలాంటి సంబంధమే పాతికసంవత్సరాలుగా నడిచుండొచ్చు. కొంచెం అతిశయంగా అనిపించినా అదొక possibility. కాదనగలమా?

చివర్లో భర్తనికూడా ఒక సమమానమైన సాధారణ ‘మనిషి’లాగా,వసంత చూడగలగటమే తను సాధించిన వ్యక్తిగత పరిణితి.అందుకే తను మానవి అయ్యింది.

@శారద: స్వేచ్చ కూడా చదువుతానండీ. suggest చేసినందుకు ధన్యవాదాలు.నిర్ణయం దాదాపు పూర్తయినట్లే ఈ వారాంతరంలోపు బ్లాగులో పోస్ట్ చేస్తాను.

@భవాని: మళ్ళీ ఇప్పుడు చదవండి ఇంకా బాగా అనుభవించగలరు.

@శ్రీ: చదివెయ్యండి సార్ ఓపనైపోతుంది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-46981215433273884242008-11-11T14:30:00.000+05:302008-11-11T14:30:00.000+05:30mahEsh gArU,I totally agree with you. I read it a ...mahEsh gArU,
I totally agree with you. I read it a few years ago and thought it is an awesome book. If you haven't already read, read vOlgA's "swEcca" too. That too is quite a thought provoking book.
Aside-
I am still waiting for your story's (nirNayam) part-3 :) It was quite nice.
regards
SharadaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-65575146495721869522008-11-11T12:04:00.000+05:302008-11-11T12:04:00.000+05:30ఇలాంటి వివాహేతర సంబంధాలు ఏర్పడినపుడు ఒక వ్యక్తిత్వ...ఇలాంటి వివాహేతర సంబంధాలు ఏర్పడినపుడు ఒక వ్యక్తిత్వం అంటూ లేని సగటు భార్యలు ఎలా కుదేలై పోతారో ఈ నవల చూపిస్తుంది. మనిషిగా ఎలా మారాలో చెపుతుంది.

కానీ ఇది నవల కాబట్టి నవత అనే కూతుర్ని ప్రవేశ పెట్టి ఆమె ద్వారా వసంతలో మార్పు వచ్చినట్టు చూపించింది ఓల్గా. మరి ఇద్దరూ లావణ్య లాంటి కూతుళ్ళే ఉంటే వసంతలు ఏం చెయ్యాలో చెప్పలేదు.

సరే, ఇవన్నీ పక్కనపెడితే ఇలాంటి పనులకు సురేష్ లు ఎందుకు వొడిగడతారో, పాతికేళ్ళు కాపరం(ఈ నవల్లో ఎటువంటి కలతలూ లేకుండ అన్యోన్యంగా ఉంటారు వసంత, సురేష్ లు) చేసిన భార్య మీద "ప్రేమ" లేకపోవడం ఏమిటో అంతుబట్టదు. 'నువ్వు సురేష్ ని ప్రేమిస్తున్నావా" అంటే వసంత "ప్రేమించడం ఏమిటో నాకు తెలియదు, నేను సురేష్ భార్యగా ఉండాలి అంతే" అంటుంది.మరి సురేష్ భార్య హోదా చాలు అనుకున్నామె గుండెలు పగిలేలా ఏడ్చి,ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తుంది. నవల చదివిన వారికి ఆమె కేవలం "సురేష్ భార్య హోదా" కోసమే ఏడుస్తుందని అనిపించదు.

చివర్లో తన కాపరం నీటిమీద బుడగ అని తెలిసాక సురేష్ ని చూసినా ఆమెలో ఏ స్పందనా కలక్కపోవడం...అది ఓకే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-50146424939914834672008-11-11T06:08:00.000+05:302008-11-11T06:08:00.000+05:30I read this story long back in vipula/chatura........I read this story long back in vipula/chatura........before even knowing who volga is....may be in my 7th class or so. I just gave up all the hope of finding this story again. Somehow it influenced me a lot. Thank you very much for letting me know about this novel.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-27677821395879396472008-11-11T04:00:00.000+05:302008-11-11T04:00:00.000+05:30Hi Kathi,You have choosen a nice subject and provi...Hi Kathi,

You have choosen a nice subject and provided good analysis.

BTW. I have just read the post in which you wrote about your son's Krishna getup.

Your son looks wonderful in Lord Krishna getup.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-51985252247307063222008-11-11T01:20:00.000+05:302008-11-11T01:20:00.000+05:30Kathi,Good Analysis. Nothing to add from my side. ...Kathi,

Good Analysis. Nothing to add from my side. Keep up the good work.SaveNativeshttps://www.blogger.com/profile/03197699845894140861noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-60031521477166448162008-11-11T00:53:00.000+05:302008-11-11T00:53:00.000+05:30ఆసక్తికరంగా ఉంది ఈ పుస్తకం. తప్పక చదవడానికి ప్రయత్...ఆసక్తికరంగా ఉంది ఈ పుస్తకం. తప్పక చదవడానికి ప్రయత్నిస్తాను.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.com