tag:blogger.com,1999:blog-280520459726971533.post8566734643286559012..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: ఉరుము ఉరిమి, మంగలం మీద...Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-280520459726971533.post-31931620981352774852009-02-10T16:10:00.000+05:302009-02-10T16:10:00.000+05:30Mahesh you Rock man....don't even think about thes...Mahesh you Rock man....don't even think about these guys....Please dont write or talk about these guys in parnashaalaa....స్వేచ్చhttps://www.blogger.com/profile/07622021318106198408noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-39097935692091766042009-02-10T02:56:00.000+05:302009-02-10T02:56:00.000+05:30"At least we know that they are rogues. But people..."At least we know that they are rogues. But people like you are much more dangerous."

Is this possible not to hate this son of a bitch?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-4266780842427521072009-02-10T02:04:00.000+05:302009-02-10T02:04:00.000+05:30neelanti yedadva raatalaki comments kaaka poolu ra...neelanti yedadva raatalaki comments kaaka poolu raaltaayaa aakaasam nunchi. raasukunedi raasukoka neeku ee statistics enduku? evadiki ekkuva comments vunte vaadi blaagu goppa ayipodu. koddiga burra vaadehe.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-14823358277560188422009-02-09T23:18:00.000+05:302009-02-09T23:18:00.000+05:30Most of the times people impose own feelings to ot...Most of the times people impose own feelings to others. Mahesh, just write whatever you think is right. Let the people cry with their age old prejudices, or passive aggressive shit.Balahttps://www.blogger.com/profile/12506208121761898151noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-25730826205515259162009-02-09T22:15:00.000+05:302009-02-09T22:15:00.000+05:30@సరస్వతీకుమార్: మీరు ప్రారంభంలోనే పప్పులో కాలేసారు...@సరస్వతీకుమార్: మీరు ప్రారంభంలోనే పప్పులో కాలేసారు. మీరు కొటేషన్లు పెట్టి మరీ నాకు ఆపాదిస్తున్న ఆ రెండు స్టేట్మెంట్లూ నేనివ్వలేదు. నేనన్నది "నూరుకోట్లున్న భారతీయులకు శృంగారం ఒక పాపం. ఇదీ మన హిపోక్రసీ" అని. ఇక రెండవది కలగూరగంప బ్లాగులో కుల హింసలపై జరిగిన చర్చల్లో నేను చెప్పిన దానికి మీ వక్రభాష్యం. అక్కడ నేనన్నది "ప్రతి హింసకూ ప్రతిహింస చెయ్యాలని నిమ్నకులాలు అనుకునుంటే, ఇప్పటికి కొన్ని వేల అగ్రకుల తలలు తెగిపడుండేవి" అని.

మొత్తానికి అర్థమయ్యిందేమిటంటే, మీలాంటి మెడకాయమీద తలకాయున్న మేధావులుకూడా కుల,మత భావజాలాలకు అతీతంగా మనుషుల్లాగా ఆలోచించలేరు.నేను రాసినదాన్ని కనీసం సరిగ్గా చదవకుండా, కేవలం మీకు కావలసిన అర్థాన్ని దాన్నుంచీ గ్రహించి "దాడి" చెయ్యడానికి సిద్ధపడతారని. మీలాంటి వారే ఇలా చేస్తే, ధూంమచాలే, కాగడా శర్మా నాకిప్పుడు గౌరవప్రదమైన వారులాగా కనిపిస్తున్నారు. At least we know that they are rogues. But people like you are much more dangerous.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-75206677251224288582009-02-09T18:20:00.000+05:302009-02-09T18:20:00.000+05:30“100 కోట్ల పైగా ఉన్న భారతీయులంతా అవాంఛిత శృంగారం వ...“100 కోట్ల పైగా ఉన్న భారతీయులంతా అవాంఛిత శృంగారం వలనే జన్మించారు..” లాంటి తీర్మానాలు చేసే మీరు ద్వేషం మూట కట్టుకోకుండా ఎలా ఉంటారు?

నా సమర్ధింపు వ్యాఖ్య మీకు చిరాకు తెప్పించడానికి కారణమేమిటి? నేను టపాలో చెప్పిన దానికి విరుద్ధంగా వ్యాఖ్యానించలేదు. ఆత్మపరిశీలన కోరడానికి ఒక innocent person ను పావుగా వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు మీమీద ఉన్న అభిప్రాయమే చెప్పాను. మిగతా వారిని ప్రస్తావించే సాహసం చేయలేకపోయాను. అదే నా వ్యాఖ్యలో చెప్పాను. పైగా ఈ విషయంలో నా ప్రధానమైన complaint మీ మీదే కనుక వారి పేర్లు ఎత్తవలసిన అవసరం నాకు కనిపించలేదు.

మీ రాతలు రెచ్చగొడతాయన్నది నిర్వివాదాంశం. జరిగిన దానికి మీరే ప్రత్యక్ష కారణమని నేను అనలేదు. అలానే మీరూ అనుకోలేదని మీ టపా వలన తెలుస్తున్నది. కానీ చదివేవారు అనుకుంటున్నట్లుగా అర్ధమవుతున్నది. ఒకసారి దుష్ట సంస్కృతి ప్రారంభమైన తరువాత అది ఎలా అయినా వ్యాపించవచ్చు. ‘పానశాల’లో అదృశ్యమైన వారే మరలా వేరే పేర్లతో ప్రత్యక్షమై ఇలా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. లేదా వారు పానశాల ద్వారా ప్రేరణ పొందిన వారైనా అయి ఉంటారు.

ఆత్మపరిశీలన చేసుకోవాలా వద్దా అన్నది మీ ఇష్టం. నేను అనుకుంటున్నది నేను చెప్పాను. తెలుగు బ్లాగ్లోకం ఓ కుటుంబం అన్న ఆలోచనను పునః సమీక్ష చేసుకుని దానిని బట్టి మన ధోరణిని మార్చుకుంటే తప్పులేదనుకుంటాను. నావరకు నేను ఇది ఒక కుటుంబపు పరిధిని దాటి పెరిగిపోయిందని అనుకుంటున్నాను. దానిని బట్టి మీ stand ను మార్చుకోండని అందరికీ చెప్పాలనుకున్నాను.

మీ పేరు ఎందుకు చెప్పానంటే నేను అలా అనుకుంటున్నాను గనుకనే చెప్పాను. నాకు మీలాగా ఎవరిపేరూ ఎత్తకుండా ఎవరిని ఎక్కడ నొప్పించాలో అక్కడ నొప్పించేటట్లు రాయడం తెలీదు. మనసులో ఎవరు ఉంటే వారి పేరు రాసేస్తాను. మీరు మాత్రం “అగ్రవర్ణాల తలలు తెగుతాయి”, “భారతీయులంతా అవాంఛిత శృంగారం వలన జన్మించారు” అని స్టేట్మెంట్లిచ్చేసి ‘తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి’ అన్నట్లుగా పక్కకెళ్ళి నిలబడతారు ఎవరి పేరూ ఎత్తకుండా. అప్పుడు మీకది విపరీతంగా, దాష్టీకంగా అనిపించదా?

నేను ఆ బూతులను తేలికగా కొట్టి పడేసినది అవి మాట్లాడిన వారిని జనజీవన స్రవంతిలో కలపడానికి కాదు. ఆ బూతుల వలన బాధపడుతున్నవారి మనసులను తేలిక పరచడానికి. వారికి మగవారు చేసే పనులు తెలియదు కనుక చెప్పాలనుకున్నాను. అంతే! పైగా అది అబద్దం కూడా కాదని కాలేజి జీవితాన్ని అంతగా ఎంజాయ్ చేసిన మీకు తెలియదా?

నేను మీ emotions ను కెలుకుతున్నానని తెలుసు. కానీ మీ emotions గురించి, నాకు అంచనా ఉన్నది కనుకనే కెలికాను. నేను కెలక వద్దన్నది mass emotions గురించి. ఒక్క సంస్కార హీనుడిలో ద్వేషం రగిలినా పరిస్థితి తారుమారవుతుంది.

నేను కామెంట్లను, పాపులారిటీని ఇష్టపడను. నా భావాలు కొద్దిమందికే అని నాకు తెలుసు. వారికి అందితే చాలు.

మీకు substance లేదనే ఉద్దేశ్యం నాకు లేదు. కాకపోతే మీరు day-to-day matters గురించి చర్చిస్తారు. నాకు basic విషయాలంటే ఇష్టం. అంతే గానీ నేనో మేధావిననే ఫీలింగ్ నాకు లేదు.

‘సుధర్మ’ బ్లాగులో రాసిన సూత్రాలు నా భావాలు కాదు. ఓ సరికొత్త బోధన ఉన్న పుస్తకాన్ని తోటి బ్లాగర్లకు పరిచయం చేద్దామని ఆ పుస్తక సారాన్ని అందించాను. దాని రచయిత ‘ద్వితీయ పురుష’ (second person) లో రచన చేశాడు. శైలి బావుందని నేనూ అలానే అనువదించాను.

నాకు మీ భావాలతో, మీరు వాదించే విధానంతో విబేధమేగానీ మీ వ్యక్తిత్వాన్ని, విమర్శలను తేలికగా తీసుకునే మీ మనస్తత్వాన్ని, మీ స్నేహపూరితమైన నడవడికను నేను ఇష్టపడతానంటే మీరు నమ్మగలరా?Saraswathi Kumarhttps://www.blogger.com/profile/15028490872120601753noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-36131631861267236952009-02-09T00:46:00.000+05:302009-02-09T00:46:00.000+05:30౧. మురళితో ఏకీభవిస్తున్నాను.౨. ఒరిజినల్ పేరు ఒరిజి...౧. మురళితో ఏకీభవిస్తున్నాను.
౨. ఒరిజినల్ పేరు ఒరిజినల్ ఆలోచన కన్నా శా..నా.. గొప్పది. దాంట్లో దమ్ము అనేది ఉంటుంది గనుక.Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-46521580230694248032009-02-09T00:02:00.000+05:302009-02-09T00:02:00.000+05:30ఈ వివాదానికి సంబంధించిన బ్లాగులన్నీ ఒకేచోట:http://...ఈ వివాదానికి సంబంధించిన బ్లాగులన్నీ ఒకేచోట:
http://sarath2.blogspot.com/

తెలుగోడు బ్లాగు అడ్రస్ తెలియక ఇంకా జతచేయలేదు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-59823411090648453422009-02-08T21:53:00.000+05:302009-02-08T21:53:00.000+05:30ఎవరైనా తప్పు చేస్తే అందరూ వెళ్ళి వాళ్ళనిఇష్టానికి ...ఎవరైనా తప్పు చేస్తే అందరూ వెళ్ళి వాళ్ళని
ఇష్టానికి మందలించెయ్యటం నాకిష్టం ఉండదు.
ఏమో తెలియక చేసుండొచ్చు కదా అని అనుకుంటాను.
కానీ అర్ధంపర్ధం లేని అతని వివరణ చూశాక
చాలా చిరాకేసింది. ఇంతకు ముందులా ఆశ్చర్యం
కలగటం లేదు. ఇలాంటి వాళ్ళను ఇక్కడ చూసీ,
చూసీ అలవాటు అయిపోయింది. మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఇలాంటి వాటి కోసం వెచ్చించకపోతేనే మంచిది.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-37361816034345659402009-02-08T21:39:00.000+05:302009-02-08T21:39:00.000+05:30మురళి గారి మాటే నాది కూడానూ. అసంబద్ధమయిన విమర్శలకు...మురళి గారి మాటే నాది కూడానూ. అసంబద్ధమయిన విమర్శలకు వివరణలు అవసరం లేదు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-38940257355174453892009-02-08T20:54:00.000+05:302009-02-08T20:54:00.000+05:30జ్యోతిగారు,మీ వ్యాఖ్య చూసిన తర్వాత నేను ఈ విషయం గు...జ్యోతిగారు,
మీ వ్యాఖ్య చూసిన తర్వాత నేను ఈ విషయం గురించి మరో పోస్ట్ వెయదలుచుకోలేదు. ఈ విషయం సాగతీతకు స్వస్తిపలుకుతున్నాను. ఎప్పటిలాగే మీ కీబోర్డు నుండి ఆణిముత్యాలను అందించగలరు.
మీ అభిమాని!జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-39540255265496605742009-02-08T20:32:00.000+05:302009-02-08T20:32:00.000+05:30నా మనసులో ఉన్న భావాలను మురళి గారు చక్కగా అక్షరీకరి...నా మనసులో ఉన్న భావాలను మురళి గారు చక్కగా అక్షరీకరించారనిపిస్తుంది. నేను అంత ప్రభావవంతంగా చెప్పలేను. నూరు శాతం ఏకీభవిస్తున్నాను.Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-35230467680053603042009-02-08T19:55:00.000+05:302009-02-08T19:55:00.000+05:30ఇక్కడ అందరూ ఏమి జరిగినా అంటె పొగిడినా తిట్టినా పట్...ఇక్కడ అందరూ ఏమి జరిగినా అంటె పొగిడినా తిట్టినా పట్టించుకోమనే అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. మరెందుకిక చర్చ?సమయము వృధా అవటము,సమసి పోతున్న సమస్యలను కెలకటము తప్ప ప్రయోజనమేమున్నది?గీతాచార్య గారన్నట్లు ప్రచార టెక్నిక్లపై ఆధారపడేవారికి తప్ప మరెవరికి ఉపయోగపడని ఈ చర్చను ఇంతటితో ఆపేయమని మనవి.మనకు నచ్చని వ్యాఖ్యలొచ్చినప్పుడు వాటిని రిమూవ్ చేసే టెక్నిక్ ఎవరికన్నా తెలిస్తే పదిమందికి చెప్పండి.దానితో అసలు సమస్యలే ఉండవు.బయట పదిమందికి తెలిస్తే తెలుగు బ్లాగర్ల గురించి తక్కువ భావన ఏర్పడుతుంది.durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-75513125745928542732009-02-08T18:32:00.000+05:302009-02-08T18:32:00.000+05:30నోట్: ఈ ఏడాది నాకు పంచాగంలో రాజపూజ్యం -0 అవమానం 25...నోట్: ఈ ఏడాది నాకు పంచాగంలో రాజపూజ్యం -0 అవమానం 25, ప్రచారం 100 అని రాశారేమో చూసుకోవాలి నేమాని వారూ, పిడపర్తి వారూనూ!

మహేష్ కుమార్, మీరు చెప్పింది నిజమే. ఎవరి అభిప్రాయాలు వారు సభ్యతలు పాటిస్తూ రాసుకుంటే మరొకరికి అభ్యంతరం కావడం విచారకరం.మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-20486457041956260272009-02-08T16:49:00.000+05:302009-02-08T16:49:00.000+05:30This comment has been removed by the author.పిచ్చోడుhttps://www.blogger.com/profile/09262374759907562301noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-61791901759088492922009-02-08T15:54:00.000+05:302009-02-08T15:54:00.000+05:30నవ్వాగటం లేదు బ్రదర్! భలే దొరికారు మన బ్లాగర్లు. ఇ...నవ్వాగటం లేదు బ్రదర్! భలే దొరికారు మన బ్లాగర్లు. ఇదే నేను ఆరోజు బ్లాగర్ల మీటింగ్ లో చెప్పిన ప్రచార టెక్నిక్.

మాటల్లో చెప్పలేను కానీ నేను మనం కలసిన రోజు చెప్పినట్లుగానే మీ టపాలకి వ్యాఖ్యానించే అర్హత లేని వాళ్ళూ మీమీద కామెంట్ వ్రాయటం .... నిజంగా పెద్ద జోక్. I have laughed very loudly after a very long time. I oughtta give a party to my friends.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-46868309567831701382009-02-08T13:55:00.000+05:302009-02-08T13:55:00.000+05:30ఇప్పటికే చాలామంది చెప్పేసారు. ఈ విషయాన్ని పట్టించు...ఇప్పటికే చాలామంది చెప్పేసారు. ఈ విషయాన్ని పట్టించుకోకపోతేనే మంచిది. పట్టించుకునే కొద్దీ అది తెలుగు బ్లాగావరణాన్ని మరింత కలుషితం చేసే అవకాశం మనమే కల్పించినట్టవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరూ ఎవరికీ మద్ధతు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి బ్లాగు వారిది. తెరిచి ఉంచుతారా, మూసి వేస్తారా అనేది పూర్తిగా వారి వ్యక్తిగతమైన నిర్ణయం. మనం గమనిస్తే అర్ధం లేని రచ్చ చేసే వాళ్ళని వేళ్ళమీద లెక్కగట్టవచ్చు. 99.9% మంది చాలా ఆరోగ్యకరంగానే మసలుకుంటున్నారు. ఏదో వెయ్యిమందిలో ఒక్కరో, ఇద్దరో ఇంకో ఇద్దరి మీద అర్ధం లేని దాడి చేస్తున్నారు అని, చేతనంగా ఉన్న మిగ్లిన బ్లాగరులు బ్లాగు చోటుని అతిగా ఈ విషయం గురించి వాడుకోవడం నాకైతే రుచించడం లేదు. దాడికి గురికాబడ్డ ఆ ఒకరిద్దరు తమని తాము ఇలాంటి అల్లరి మూకల ఆరోపణల ఆధారంగా
బేరీజు వేసుకోకుండా నిరంతరంగా వారి వారి వ్యాపకాలని కొనసాగించాలని కోరుకుంటున్నాను.

బ్లాగు అనేది మన గురించి, ప్రపంచాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాము అనే దాని గురించి రాసుకునే వెసులుబాటు. మన బ్లాగు మన వరకూ ప్రత్యేకం. మన గురించి మనకే బాగా తెలుస్తుంది. కాబట్టి మనల్ని, మన బ్లాగుని ఎవరో ఇచ్చిన తీర్పుల ఆధారంగా బేరీజు వేసుకుని మన వ్యాపకాలని, వెసులుబాటుని వదులుకోవడం సరైన చర్య కాదు.ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-19776299464668265982009-02-08T12:20:00.000+05:302009-02-08T12:20:00.000+05:30అసలే బ్లాగ్ లోకం వివాదాలతో దద్దరిల్లిపోతుంటే మళ్లీ...అసలే బ్లాగ్ లోకం వివాదాలతో దద్దరిల్లిపోతుంటే మళ్లీ ఇంకోటా?? నేను సమీక్ష రాసింది మహేష్ కి 'సెలబ్రిటీ' స్టేటస్ ఇవ్వడానికి కాదు. కంప్యూటర్ ఎరా పత్రికలో నా అభ్యర్థన మేరకే శ్రీధర్ గారు ప్రతినెల బ్లాగు సమీక్ష కోసం ఒక పేజీ కేటాయించారు. అందుకే నేను ఆ భాద్యత తీసుకుని ప్రతినెల ఒక బ్లాగు సమీక్ష పంపిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా మహేశ్ తో ఏకీభవించలేదు. మెచ్చుకోలేదు. అసలు నేను అతని టపాలన్ని చదివితే కదా ,, చదివి, నాకు అర్ధమైనవాటిలొనే కామెంట్స్ రాసాను. ఏ బ్లాగులో ఐనా ఇంతే.. నేను సమీక్ష రాసినంత మాత్రాన అతని స్టేటస్ వచ్చినట్టా? మరి అంతకుముందు రమణిగారిది రాసానే.. ఆవిడ బ్లాగు మూసేసుకున్నారు. ఆ పత్రికలో వచ్చిన బ్లాగు సమీక్షలకే ఆ బ్లాగర్లకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుందా?? ఇంతకు ముందు కొత్తపాళీ, తాడేపల్లిగారు కూడా సమీక్షలు ఇచ్చారు. కంప్యూటర్ ఎరా పాఠకులకు మన బ్లాగులను , వాటిలోని మంచి ఆలోచింపచేసే టపాలు పరిచయం చేయడమే ముఖ్యం అనుకున్నాను .. అందుకే మహేశ్ బ్లాగులోని వివాదాల గురించి రాయలేదు. ఇక శంఖారావం బ్లాగులో గొడవ నిన్న జరిగింది. నేనే ఈ సమీక్ష ఇచ్చింది నెల క్రింద.. అదెలా ఇవ్వగలను. శంఖారావం బ్లాగులో మహేశ్ ది తప్పు లేదనడం అతనిని No.1 బ్లాగర్ ని చేస్తుందా?? మహేశ్ మీద ఉన్న అభియోగాలన్నీ నేను పిచ్చాపాటీ లో అడిగాను. ఇవన్నీ చూసి నేను అతనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు అనిపిస్తుందా అందరికీ..

సుజాతగారు,
నేను కూడా మీరు చెప్పినట్టే ఆలోచిస్తున్నా. నా టైం బాలేదు అని. కాని నా జాతకం, పంచాంగం చూడట్లేదు. మౌనంగా అనుభవిస్తే సరి. తప్పదు కదా.

జీడిపప్పు గారు,

ఈ విషయమై మీరు రాసినా నేను సమాధానమివ్వదలుచుకోలేదు. ఎందుకంటే బ్లాగుల్లో ఇదే నా ఆఖరి వ్యాఖ్య. నా బ్లాగులో తప్ప ఎక్కడా రాయదలుచుకోలేదు. పొగిడితే ఆనందించి, విమర్శిస్తే బాధపడి తప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏది మాట్లాడినా తప్పులు తీస్తున్నారు. సో మౌనంగా ఉండడమే మేలు కదా. మీకు ఎటువంటి సందేహాలున్నా నాకు మెయిల్ చేయండి .. తప్పకుండా సమాధానమిస్తాను.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-11627032268917168852009-02-08T11:05:00.000+05:302009-02-08T11:05:00.000+05:30ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తుల వ్యాఖ్యలని ప్రాతిపదికగ...ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తుల వ్యాఖ్యలని ప్రాతిపదికగా తీసుకుని, మనలో ఒకరు అని భావిస్తున్న వారు మనవారు అనుకున్న మరికొందరిని కించపరిచేలా వ్రాయటం, నిబద్దతని ప్రశ్నించటం చాలా భాదాకరమయిన విషయం.

అవును నిజమే కత్తిగారి భావాలని పూర్తిగా ఏకీభవించేవారు ఎవరూ ఈ బ్లాగులోకంలో లేరు. అలా అని పూర్తిగా వ్యతిరేకించేవారు లేరు. ఒక వ్యక్తిగాని అతని రచనలు గాని ఇష్టపడాలంటే తను వ్రాసిన ప్రతీది నచ్చాలని లేదు కదా. కొన్ని టపాలు నేను అంగీకరించలేనివి పర్ణశాలలో కనిపించినప్పుడూ మౌనంగా తప్పుకున్నా. నాకు నచ్చిన టపాలు వచ్చిన రొజున అభినందించా. అందరికీ అన్ని విషయాలలోను ఒకేరకమైన భావాలు ఉండాలని లేదు కదా. మద్యం త్రాగటం కొందరికి పెద్ద నేరంలా కనిపిస్తే కొందరికి ఆనందాన్ని ఇస్తుంది. మితంగా పుచ్చుకుంటే తప్పేమీ లేదు అనేవారు కొందరు, జీవితం అనేది అనుభవించటానికే ఇలాంటి రూల్స్ పెట్టుకుని నాశనం చేసుకోవద్దు అనే వారూ ఉన్నారు. అందుకే అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండాలని, సమాజం హర్షించేలానే ఉండాలని అనుకోవటం తప్పేకదా. బ్లాగులోకంలో వివాదాలు పక్కనపెడితే కత్తిగారు ఒక వ్యక్తిగా చాలా మంచివారని ఎవరయినా అంగీకరించాల్సిందే.

కత్తిగారు, మీ గురించి తెలిసిన వారంతా మీ భావవైరుధ్యం తెలిసిన వారే. మీరు ఇలాంటి వివరణలు ఇవ్వాల్సిన అవ్సరంలేదేమో ఆలోచించండి. మీకు మితృలకే కాదు శతృవులకూ కొదవలేదు. మిరు వివరణలు ఇవ్వటం మొదలుపెడితే చాలాబ్లాగుల్లో ఇలాంటి కధనాలే వస్తాయి. ఎన్నిసార్లు స్పందిస్తారు? ఇది ఒక వ్యతిరేఖ వాదం, వారి వారి వ్యక్తిగత అభిప్రాయం అని వదిలేయండి.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-47808120003986269242009-02-08T09:49:00.000+05:302009-02-08T09:49:00.000+05:30సిబిరావు గారు, కంప్యూటర్ ఎరా మాసపత్రికను గత ఎనిమిద...సిబిరావు గారు, కంప్యూటర్ ఎరా మాసపత్రికను గత ఎనిమిదేళ్లుగా ప్రతీనెలా ఒంటిచేత్తో రాసుకుంటూ వస్తున్నాను. బ్లాగులపై సమీక్ష ప్రారంభించి మన బ్లాగర్లని పాఠకులకు పరిచయం చేస్తే బాగుంటుందని మొదట్లో జ్యోతి గారు సూచించబట్టి నేను ఒక పేజీ కేటాయించాను. సమీక్షలు సమయానికి అందించడం బాధ్యత ఆవిడ తీసుకున్నారు. ఈ నేపధ్యంలో తాడేపల్లి గారు, ఇంకా పలువురుని అభ్యర్థించి ఆవిడ సమీక్షలు అందించేవారు. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను.. ప్రతీనెలా మేగజైన్ ప్రిపరేషన్ లో నాకున్న విపరీతమైన వత్తిడి వాతావరణంలో ఏ బ్లాగు సమీక్ష యొక్క పరిపూర్ణతనూ స్వయంగా పరిశీలించి మార్పు చేర్పులు చేసే సమయం నాకుండదు. ఒకవేళ బ్లాగు సమీక్షలపై నేనూ స్వయంగా స్పెండ్ చెయ్యవలసిన తీరుబడి ఉంటే ఆ సమీక్షలేవో నేను రాసేవాడిని తప్ప బయటి నుండి తీసుకునేవాడిని కాదు. ఒకవేళ అసమగ్ర సమీక్షలతో ఎందుకు కాలమ్ అనుకుంటే.. ఆ పేజీని కూడా ఇతర మా టెక్నికల్ విషయాలతో రూపొందించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. "పబ్లిష్ చేయబోయే ముందు ఎడిటర్ పాత్ర పోషించవలసి ఉంటుంది" అన్న కోణంలో మీరు మాట్లాడుతున్నారు. ప్రతీ నెలా మేగజైన్ లోని 48 పేజీల్లో బ్లాగు సమీక్ష మినహాయించి మిగిలిన 47 పేజీల కంటెంట్ కోసం రీసెర్చ్ చెయ్యడం, రాయడానికే నాకు సమయం ఇబ్బందిగా ఉంది. సో ఎక్కువమంది స్టాఫ్ ఉండే ఇతర పత్రికల మాదిరిగా నేను కేవలం ఎడిటర్ గా వ్యవహరించడం కుదరని పని. సమీక్ష రాసిన వారికే దాని బాగోగులు వదిలేస్తున్నాను.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-69204496442541217552009-02-08T08:04:00.000+05:302009-02-08T08:04:00.000+05:30మీ అభిప్రాయాలతో నాకు కొన్ని సార్లు తీవ్ర విభేదాలున...మీ అభిప్రాయాలతో నాకు కొన్ని సార్లు తీవ్ర విభేదాలున్నా కొన్ని సార్లు మీ రాతలు నచ్చుతాయి. ఇలా మీతో ఏకీభవించినపుడల్లా నాకు "భట్రాజిణి"(రాజు అంటే బాగోదేమో) "సుజాత &కో"అనే బిరుదు కూడా ఇచ్చారు దయగల ప్రభువులు. పర్లేదు. నా అభిప్రాయం ఏమిటో తెలీడమే ముఖ్యంగానీ ఇలా అయాచితంగా వచ్చి పడే దూషణ భూషణలని లెక్క చేయను. బ్లాగ్లోకంలో నా గొంతెప్పుడూ నా సొంతమే! అభిప్రాయాలతో విభేదించడమా ఏకీభవించడమా అన్నది టపాను బట్టి ఉంటుంది, బ్లాగేదైనా సరే!కొందరి అభిప్రాయాలతో విభేదించడం వల్ల అలిగో, కోపగించో నా బ్లాగు చదవటం మానేసిన వారున్నారు. ఓకే!సరే!

ఇందులో అగ్గీ, ఇనుము ఇలాంటి పోలికలే అనవసరం! నేనెవరి బ్లాగులు చదవాలో, ఎవరివి చదవక్కర్లేదో నిర్ణయించుకోవాల్సింది నేను.

ప్రతి అంశం మీదా దాని అంతు తేలే వరకూ చర్చ సాగేది ఈ బ్లాగులోనే
అనుకుంటా!

కానీ ప్రస్తుత దాడులకు, మహేష్ గారి బ్లాగుకూ ముడిపెట్టడమే నాకూ మింగుడు పడటం లేదు. ఎందుకంటే సరస్వతీ కుమార్ గారి బ్లాగు కు కూడా నేను రెగ్యులర్ పాఠకురాలిని. ఇటువంటి తీవ్ర అభిప్రాయం ఇంతకు ముందెన్నడూ వ్యక్తపరిచినట్లు అనిపించడం లేదు.

మహేష్ గారు, మీరు కూడా చట్టం లాగా మీ పని మీరు చేసుకుంటూ పొండి!

నోట్: ఈ ఏడాది నాకు పంచాగంలో రాజపూజ్యం -0 అవమానం 25, ప్రచారం 100 అని రాశారేమో చూసుకోవాలి నేమాని వారూ, పిడపర్తి వారూనూ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-48258333171603532362009-02-08T06:43:00.000+05:302009-02-08T06:43:00.000+05:30‘కంప్యూటర్ ఎరా’ లో వచ్చిన బ్లాగు సమీక్ష పై, నా వ్...‘కంప్యూటర్ ఎరా’ లో వచ్చిన బ్లాగు సమీక్ష పై, నా వ్యాఖ్య లోని ప్రశ్నలు, పర్ణశాల లో చర్చించిన సిద్ధాంతాలు, ఆచరణయోగ్యం కాదనో, లేక అవి సాధ్యం కాదనో చెప్పటానికో, అవి రాయలేదు. ఆ ప్రశ్నలు సమీక్షకులకు. ఆ ప్రశ్నలపై కూడా సమీక్షలో కొంత కేంద్రీకరిస్తే సమీక్ష సమగ్రంగా ఉండగలదని చెప్పటానికే. అందులో ఇచ్చిన ఉదాహరణలు కూడా సమీక్షకుల అవగాహనకు రాసినవే కాని పర్ణశాలకు ఎవో ఉద్దేశాలు ఆపాదించటానికి కాదు. వాస్తవంలో పర్ణశాల లో చర్చించిన విషయాలు ఎన్నో గంభీరమైనవి, విస్తృతమైనవి. అంతలోతుగా సమీక్ష ఉండాలని చెప్పటానికే ఉదాహరణగా ఇచ్చిన కల్లోల కాష్మీరం నా కొద్దు.

నా వ్యాఖ్య ఎవరికోసం, ఎందుకోసం రాయబడిందో అనే విషయం లో సందేహ నివారణకు అందులో లేవనెత్తిన ఒక ప్రశ్నకు నేనే బదులిచ్చి, ఈ ఉత్తరాన్ని ముగిస్తాను. "శంఖారావం బ్లాగులో చెప్పినట్లుగా బ్లాగులలో ముసలానికి కత్తి మహేష్ కుమారే కారణమా? " -నా జవాబు: ఇది హాస్యాస్పదమైన ఆరోపణ. నా వ్యాఖ్యలో లేవనెత్తిన ప్రశ్నలను చర్చిస్తూ, సమీక్ష సమగ్రంగా ఉండటానికై ఏమైతే రాయాల్సుంటుందో, అవి ఉదహరించి ఉండవలసినదని నేను అభిప్రాయపడ్డాను.

పర్ణశాల వంటి గంభీర బ్లాగు పై సమీక్షలను peer -review చేసి ఆ పత్రికా సంపాదకుడు ప్రచురించి వుంటే ఈ అపార్ధం కలిగేది కాదు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-12237579976588132452009-02-08T05:49:00.000+05:302009-02-08T05:49:00.000+05:30గొడవ సర్దుమణుగుతుంది అనుకునే దశలో శంఖారావంలో ఆయనేద...గొడవ సర్దుమణుగుతుంది అనుకునే దశలో శంఖారావంలో ఆయనేదో రాయటమేంటో, దానికి మహేష్ ఈ స్థాయిలో వివరణియ్యటమేంటో! ఛైన్ రియాక్షన్ లాగుంది. తర్వాతి వంతెవర్దో, ఇదెప్పటికి సమసేనో.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-88837485030369921322009-02-08T05:07:00.000+05:302009-02-08T05:07:00.000+05:30మహేష్ గారు,మీకు జ్యోతిగారు అనవసరంగా "సెలెబ్రిటీ" స...మహేష్ గారు,
మీకు జ్యోతిగారు అనవసరంగా "సెలెబ్రిటీ" స్టేటస్ ఇచ్చారు, మీరు అందుకు తగరు అని నమ్ముతాను. ఎందుకు అలా అంటున్నానో, జ్యోతిగారి పైన, మహిళా బ్లాగర్ల పైన దాడికి ముఖ్యకారకుల్లో మీరు కూడా ఒకరు అని ఎందుకు అనుకుంటున్నానో నా బ్లాగులో "జ్యోతిగారూ, మీకిది తగునా?" అన్న పోస్టులో వివరిస్తాను. Stay tuned!జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.com