Tuesday, March 23, 2010
LSD – హిందీ సినిమా పెద్దమనిషి అయ్యింది !
సినిమా పేరు ‘లవ్ సెక్స్ అన్డ్ ధోకా’.
సినిమా ప్రారంభమగానే పేర్లుపడుతన్నప్పుడు కాసేపు నవ్వుకున్నాను.
తరువాత అబ్బురపడ్దాను…
ఫిల్మ్ మేకర్ ఆలోచనను అభినందించాను.
సినిమాను ఆనందించాను.
సినిమా అయిపోయిందేమో అనిపించినప్పుడు ‘పక్కవాళ్ళు ఏమనుకుంటారో’ అని చూడకుండా చప్పట్లు కొట్టాను.
కానీ నాతోపాటూ థియేటర్లో చాలా మంది చప్పట్లు కొట్టడంతో ఈ సినిమా పవరేమిటో అర్థమయ్యింది.
రాత్రి నిద్రపట్టింది.
నిద్ర లేచి ఇదొక మాస్టర్ పీస్ అని డిసైడ్ అయ్యాను. ఇంకా ఆ సినిమా "షాక్" లోనే ఉన్నాను.
మాస్టర్ పీస్ అనగానే సత్యజిత్ రే లా ఉంటుందా లేక గురుదత్ లా ఉంటుందా? కనీసం ఆదిత్య చోప్రా లా ఉంటుందా? అని అడక్కడి. ఎందుకంటే మాస్టర్స్ ఎవరూ మరొకర్ని ఇమిటేట్ చెయ్యరు. దిబాకర్ బెనర్జీ అలాంటోడే. ఇప్పటి వరకూ తను తీసి చిత్రాలు “కల్ట్” చిత్రాలుగా నిలబడితే LSD ఖచ్చితంగా ఒక మాస్టర్ పీస్ అనే విషయంలో నాకు మాత్రం ఎటువంటి సందేహం లేదు.
కాబట్టి ఇక్కడ సమీక్ష రాయడం లేదు. సినిమా చూడమని మాత్రమే చెబుతున్నాను. Just go watch it.
Posted by
Kathi Mahesh Kumar
at
10:14 AM
4
comments
Labels: సినిమాలు
Monday, March 22, 2010
పశువధ - గొడ్డుమాంసం
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పశువధలపై బ్యాన్ విధించింది.
ఒక అడుగు ముందేసి పశుమాసం ఉన్నా,తిన్నా, అమ్మినా దాన్ని నేరంగా పరిగణిస్తూ ఏడుసంవత్సరాల వరకూ శిక్షను ప్రతిపాదించింది.
ఈ బ్యాన్ అప్రజాస్వామికం అన్న ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం "రాష్ట్రంలోని పశుసంపదను కాపాడాలంటే ఈ చట్టం తప్పదు"ఆని.
నిజమే...ఎకలాజికల్ సమతౌల్యాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న చాలా విపరీతమైన పరిణామాల్ని అడ్డుకోలవసిందే.
దానికి నీరు, మట్టి, గాలి,చెట్టుతో పాటూ పశుసంపదను కాపాడాల్సిందే.
కానీ ఈ నిర్వచనంలో వచ్చే ‘పశువు’లో గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులూకూడా వస్తాయి.
కానీ చిత్రంగా ఈ హిందుత్వ బీజేపీ ప్రభుత్వానికి ఇవేమీ కనిపించలేదు.
కేవలం "ఆవు" మాత్రమే కనిపించింది.
నిజానికి ఇప్పటికే అమలులో ఉన్న Prevention of Cow Slaughter and Cattle Preservation Act, 1964 మరింతగా ఉపయోగరమనే వాదన ఉంది.
ఎందుకంటే, అందులో ఆవులతోపాటూ పాలిచ్చే గేదెల్ని చంపడాన్ని చట్టవ్యతిరేకంగా పరిగణించింది.
సమస్య పాల ఉత్పత్తి అనేవాదన కొందరు వినిపించినప్పటికీ ఒట్టిపోనంతవరకూ ఆవుల్ని ఎవరూ చంపరనే ఇంగితజ్ఞానం చాలు ఈ వాదనకు చుక్కలు చూపించడానికి.
మొత్తానికి బీజేపీ ప్రభుత్వం తన హిందుత్వ అజెండాని ముందుపెట్టి మఠాల్ని, అగ్రకుల మైనారిటీలను సంతృప్తిరిచే బాటపట్టింది.
మాంసం తినే అగ్రకుల హిందువుల్ని బుజ్జగిస్తూనే గొడ్డుమాంసం తినే దళితులు, ముస్లింమైనారిటీలు, విదేశీయుల హక్కుల్ని విజయవంతంగా ఈ బ్యాన్ కాలరాసింది.
మరీ ముఖ్యంగా చికెన్, మటన్ తినలేని పేదకు అందుబాటులో ఉండే పౌష్టికాహారమైన గొడ్డుమాంసాన్ని చట్టవ్యతిరేకం చెయ్యడం ద్వారా ఈ ప్రభుత్వం సాధించిందేమిటో ప్రశ్నార్థకమే.
ఇలాంటి కేసుల్లో ఏడుసంవత్సరాల జైలు శిక్ష ప్రతిపాదించడం మరో హాస్యాస్పదమైతే తలాతోకా లేని ఈ చట్టం హిందుత్వ అజెండాని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి భవిష్యత్తులో రాజకీయంగా పనికొస్తుందనుకునే బీజేపీ తెలివితక్కువతనం మరో జోకు.
Posted by
Kathi Mahesh Kumar
at
12:33 PM
24
comments
Labels: సమాజం
Thursday, March 18, 2010
ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను
కౄరమైన పిచ్చిగాలి చెంప పగులగొట్టాను
ముక్కలైన జీవితాన్ని చేతికెత్తుకున్నాను
పగిలిన అద్దం ముందు నగ్నంగా నిలిచాను
నా మీద నాకే ఆవేశం
హుందాగా సూర్యుడ్ని "మూర్ఖుడా" అని తిట్టాను
రంగుల లోకపు వైతాళికులకు వెతికివెతికి "థూ" అన్నాను
తూర్పునుండీ పడమరకు చెప్పులులేకుండా నడిచాను
దారిలో పడి ఉన్న కంకరరాళ్ళను మీద చల్లుకున్నాను
విభ్రమ స్ఫూర్తితో కొండకోనల్ని చీల్చిపారే నీటికి
ఏ సముద్రం చేరే కోరికో?
లేదా,మందగతిన ఇసుక ఒడిలో కూరుకుపోయే నిర్వేదమో
నాలోనేను లేనన్నది ప్రశ్న
ఇక ఆమెకళేబరాన్ని అక్కునచేర్చుకుని రోదించేదెట్లా?
ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను
మరాఠీ మూలం: నామ్ దేవ్ ఢపాళ్
ఆంగ్లానువాదం: దిలీప్ చిత్రే
తెలుగుసేత: హరీష్. జి.
Posted by
Kathi Mahesh Kumar
at
12:09 PM
4
comments
Labels: కవిత
Thursday, March 11, 2010
ఆ వ్యాఖ్యలు నావి కావు
పానశాల, పైత్యం బ్లాగుల్లో నా పేరుతో వస్తున్న వ్యాఖ్యలు నావి కావు. ఆ బ్లాగుల్లో నేను వ్యాఖ్యలు రాయను. Because they mean nothing to me.
నా పేరు, మెయిల్ ఐడి, బ్లాగు URL వివరాలు ఉపయోగించుకుని కొందరు impostures are trying play mischief. ఇప్పుడు వీళ్ళపైత్యం ముదిరి మహిళా బ్లాగర్ల ఐడిలు కూడా ఉపయోగించి వ్యాఖ్యలు రాస్తున్నారు. I condemn it.
కూడలిలోకి ఈ ప్యారడీబ్లాగులు (మళ్ళీ)రావడాన్ని నేను స్వాగతిస్తున్నాను. నామీద వ్యక్తిగతంగా జరుగుతున్న దాడిపై నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న హంగామాతో నాకొచ్చేనష్టం ఏమీ లేదు. నిజానికి వీళ్ళ వెధవతనం మరింతగా జనానికి తెలిసేఅవకాశం ఎక్కువ. కాబట్టి I Actually wish they can sustain for longer period than they did earlier.
భారతీయ సంస్కృతిని, హిందూమతాన్నీ కాపాడటానికి నా భావజాలంతో పోరాడ్డానికి వచ్చామని చెప్పుకుంటున్న ఈ పైత్యవాదుల తాగుబోతుల వీరంగం ఎప్పుడూ సభ్యమైన హద్దులో ఉండదు. ఎందుకంటే వీళ్ళకు తెలిసిన సంస్కృతి, మతం యొక్క స్థాయి అదే. So, I welcome them to make my points much more valid and just.
Posted by
Kathi Mahesh Kumar
at
8:49 PM
4
comments
Labels: వ్యక్తిగతం
Tuesday, March 9, 2010
నగ్న దేవతలు
A super-hero Hanuman holding Sita, by the Ravi Varma Press, 1910's
Posted by
Kathi Mahesh Kumar
at
12:37 PM
29
comments
Labels: సమాజం
నువ్వెళ్ళిపో ప్రియా !
| నువ్వెళ్ళిపో ప్రియా నన్ను నాకలల్ని మూటకట్టుకోనీ నీతోగడిపిన గతసంవత్సరాల్ని ఎక్కడపెట్టానో వెతకనీ ఆ తెగినదారాల అల్లికను కనిపెట్టనీ ఆ పగిలిన ముక్కల్ని ఎక్కడ తోసేశానో చూడనీ హమ్మయ్య ! దొరికాయి. అవింకా కొత్తగానే ఉన్నాయి బయట ట్యాక్సీ ఎదురుచూస్తోంది అందులో నీకు మాత్రమే స్థలముంది నువ్వెళ్ళిపో ప్రియా! (మూలం స్పైక్ మిలిగన్ ) |
Posted by
Kathi Mahesh Kumar
at
9:50 AM
1 comments
Labels: కవిత



















