Friday, October 31, 2008

హిందూ - ఇస్లాం టెర్రరిజం సేమ్..షేమ్ !

మొత్తానికి హిందూ- ముస్లిం అతివాదులు ఈ ఒక్క విషయంలోమాత్రం "భాయీ..భాయీ" అయిపోయారు. ఎప్పుడో అయిపోయినా, మాలేగావ్ బ్లాస్టుల నేపధ్యంలో జరిగిన తవ్వకాల్లో ఈ విషయం బహిరంగంగా బయల్పడింది. కొంతమంది హిందూ సాంప్రదాయవాదులు, "హమ్మయ్య ఇప్పటికైనా మన హిందువులు మేల్కొని ఎదురుదాడికి దిగారు" అంటున్నారు. మరికొందరు "ఒక ఆడదిచేసిన ధైర్యం మన మగాళ్ళు చేయలేకపోయారు" అంటూ ఆ వీరనారిని కీర్తించి, నిర్వీర్యులైన మగహిందువుల్ని ఎత్తిపొడుస్తున్నారు. ఈ మొత్తం సాహసంలో హిందూమగటిమికి దొరికిన ఆసరా..ఆ "సాధ్వి"తోపాటూ అనుమానితులుగా అరెస్టయిన ఇద్దరు రిటైర్డ్ అర్మీ ఆఫీసర్లు.


ఇంగ్లీషు మీడియా హిందూ టెర్రరిజాన్ని ఖండిస్తూ పుంఖాలు పుంఖాలుగా సమయం,స్థలం వెచ్చిస్తుంటే, హిందీ మీడియా అటూఇటూకానీ ధోరణి అవలంభిస్తోంది. "అసలు హిందూ తీవ్రవాదం అనేమాటే తప్పు, ఇది కేవలం స్వాభిమానంతో జరిగిన ప్రతిఘటన" అని సానుభూతిపరులు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు "హిందువులు చేస్తే అది ధర్మరక్షణ, ముస్లింలు చేస్తే దేశద్రోహం -తీవ్రవాదం" అని తేల్చేస్తున్నారు. "తేడా ఏమిటయ్యా?" అంటే, "ఇది దేశభక్తి అది విచ్చిన్నశక్తి" అని వేదాంతాలు వల్లెవేస్తున్నారు.


హిందూ మతవాద రాజకీయపార్టీలు మాత్రం, "అబ్బే వాళ్ళతోమాకస్సలు సంబంధం లేదు" అని చేతులు దులిపేసుకుని, వారి నిబద్ధతను ప్రకటించేసారు. హిందూఅతివాద సంఘాలు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు కనబడుతూ,చాపకిందనీరులా 'జష్న్'(పార్టీ) జరుపుకుంటున్నారు. వారికి ఇదొక విజయం. హిందూమతం ఇస్లాంకు ఇచ్చిన "ఈంట్ కా జావాబ్ పథర్". రెండుమూర్ఖత్వాలకీ బలయ్యింది మాత్రం అమాయకులు,సామాన్యులు, ఈ మతాలు పట్టని మామూలు మనుషులు. మొత్తానికి ఇస్లాం-హిందూ టెర్రరిజం సేమ్..షేమ్...


ఎప్పటిలాగే, (భారతదేశంలో) ఇటు ఇస్లాం తీవ్రవాదానికీ అటు హిందూ తీవ్రవాదానికీ నాకైతే పెద్దతేడా తెలిసిరావడం లేదు. రెండువైపులా మూర్ఖులే. మతాన్ని అడ్డంపెట్టుకుని అరాచకాన్ని చేస్తున్న అసాంఘిక,అమానవీయ శక్తులే. దేశద్రోహులే. దండనార్హులే. దుండగులే. ఈ రెంటినీ వేరుగా చూడలేకపోవడానికిగల కొన్ని కారణాలను ఇక్కడ రాస్తున్నాను.

1.ఇద్దరూ హింసను ప్రేరేపించేవాళ్ళే. ఇద్దరికీ పారామిలిటరీ శిక్షణా శిబిరాలుంటాయి. ఒకరు బాంబుల్ని వాడటం నేరితే, మరొకరు కర్రసామూ,కత్తులు తిప్పటం, శూలాలువాడటం సగౌరవంగా నేర్పుతారు. ఇప్పుడు కొత్తగా RDX కూడా చేరినట్టుంది. ఈ పనులన్నీ చెయ్యడానికి ఒకరికి విదేశాలు సహాయపడుతుంటే, మిగిలినవాళ్ళకి విదేశాల్లోవుండే హిందూ సోదరులు సహాయం చేస్తున్నారు. 'తీవ్రవాదం కాదు దేశభక్తి' అని చెప్పుకుంటున్నప్పుడు, ఇలా ట్రైనింగ్ ఇచ్చేబదులు ఆర్మీలో చేరమని ప్రేరేపించొచ్చుగా! ఆర్మీనుంచీ రిటైర్డైనవాళ్ళని మాత్రం మళ్ళీ రిక్రూట్ చేసుకున్నట్లు కనబడుతున్నారు.

2.ఇతరులు ఇస్లాంలో చేరితే తప్పులేదుగానీ, ముస్లింలు మతం విడిచివెళ్తే మాత్రం వారు ద్రోహులూ, చంపడానికి అర్హులు. ఈ విషయంలో ఇక్కడా పెద్ద తేడా లేదు.హిందువులు కాని గిరిజనుల్ని,ఆదివాసుల్నీ హిందూమతంలో చేర్చుకుంటారుగానీ, హిందువులు వేరే మతంలోకి వెళితేమాత్రం "మతంమార్పిడులు జరిగిపోతున్నాయహో!" అని ఒకటే గోల.

3.ముస్లింలు కానివార్ని 'కాఫిర్లు' సమానహోదాకు అర్హులుకాదు అని ఇస్లాం తీవ్రవాదులు భావిస్తారు. హిందూవులు మాత్రం తక్కువతినకుండా,"The foreign races in Hindusthan [India] must either adopt the Hindu culture and language, must learn to respect and hold in reverence Hindu religion, must entertain no idea but those of the glorification of the Hindu race and culture, i.e., of the Hindu nation and must loose (sic) their separate existence to merge in the Hindu race, or may stay in the country, wholly subordinated to the Hindu Nation, claiming nothing, deserving no privileges, far less any preferential treatment — not even citizen's rights.-Golwalkar, 1939
అన్న నమ్మకాన్ని నరనరాలా జీర్ణించుకుంటారు.

4. అవమానాన్ని అనుభవించిన తరువాతగానీ, ముస్లింలు హింసాత్మక ప్రతిఘటనకు పూనుకోకూడదని చెబుతూనే, ముస్లింలపై అన్యాయాలు జరిగిపోతున్నాయని చిలువలుపలువలు చేసిచెప్పి హింసకు ప్రేరేపిస్తారు. హిందుత్వవాదులు చేసేదికూడా exact ఇదే! మొదటగా హిందూమతం పెద్దప్రమాదంలో ఉందనే ప్రాపగాండా సృష్టించడం. తరువాత, దీనికి కారణం ఒకవైపు ముస్లింలు, మరోవైపు క్రైస్తవులూ అన్న భయాందోళనల్ని నాటుకునేలా చెయ్యటం. ఈ భయాన్నీ అపనమ్మకాన్నీ ఆసరాగా చేసుకుని హింసకు ప్రేరేపించడం.

5. హిందూ మతత్వశక్తులు ఇప్పటివరకూ అల్లర్లలో ఇతర ఘటనల్లో షుమారు 5,000 మంది భారతీయులప్రాణాల్ని తీస్తుంటే, ఇస్లాం తీవ్రవాదులు కూడా ఆంతో లేక అంతకంటే ఎక్కువ ప్రాణాల్ని పొట్టనబెట్టుకునుంటారు.

6.ఇద్దరికీ భారతీయ చట్టాలమీద నమ్మకం లేదు. భారతీయతకు అతీతంగా ఒకరు హిందూ రాష్ట్రం మంటే మరొకరు ఇస్లాం స్థాపించబడాలంటారు.

7. దొందుదొందే! ఈ మూర్ఖుల వలన మొత్తం జాతి కొట్టుకుఛస్తోంది. ప్రశాంతత కరువౌతోంది. సామాన్యుల ప్రాణాలు బలౌతన్నాయి.

ఇవి ఎవరు చేసినా, ఏమతమౌఢ్యులు చేసినా చట్టరీత్యా నేరం, రాజ్యాంగ రీత్యా అనంగీకారం. కేవలం బ్యాన్ చెయ్యడంకాదు, ఏకంగా వీరికి మనుగడే లేకుండా చేసినా హర్షనీయమే, స్వాగతించాల్సిన పరిణామమే! ఒక మతంవాళ్ళు చేస్తే మంచి, మరో మతంవాళ్ళు చేస్తే చెడ్డ అని ఎవరికి గొడుగుపట్టినా, రక్తంతో తడిచేదిమాత్రం మనమే!


కాబట్టి, నావరకూ మానవత్వానికి మించిన మతం లేదు. ఒక సెక్యులర్ దేశపు పౌరుడిగా మతాన్ని ఇంట్లోవదిలొస్తానేతప్ప, మిగతా చోట్ల అది అప్రస్తుతం, అనవసరం.

****

23 comments:

సుజాత said...

"మానవత్వానికి మించిన మతం లేదు". ఇది ప్రతి భారతీయ పౌరుడికీ తెలుసు.కానీ మతాన్ని పాటించకపోతే, మతాన్ని అనుసరించకపోతే అదేదో దైవ ద్రోహమన్న అపరాధ భావన! ఎంచేతో మరి!

నాగప్రసాద్ said...

మతముల పేరిట మత్సరంబులు పెరిగి
మదియించి కొట్టుకొని సచ్చేరయా
మనువు వంశము నుండి మనుషులందరు పుట్టు
మతం లెన్నుండునో తెలియండయా!

మనిషికి తెలియని మర్మమేది లేదు
తానెవరో మాత్రము తెలియలేదు
బయటి విషయముల తెలియు తననుండి తెలియదు
తన్ను తానెరుగుటకు తీరికేయుండదు!


ఓం నమో శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమః

Indian Minerva said...

ఇద్దరికీ బాగా గడ్డి పెట్టారు కాబట్టి ఈ టపా లౌకికమో కాదో తెలియదు!!?? చూద్దాం, కామెంట్ల్ని నేనుకూడా ఆసక్తిగా గమనిస్తుంటాను. Bye the way చాలా బాగా చెప్పారు. ఈ హిందూ తీవ్రవాదం గురించి విన్నానుగానీ ఇంకా చదివే భాగ్యానికి నోచుకోలేదు మీరు link ఇస్తే మాత్రం మిస్సవ్వను. Thanks.

దేవన said...

మీరు మాలెగావ్ విషయం లో అప్పుడే ఒక నిర్ణయానికి రావడం బాగలేదు. ఈ విషయం లో ఇంకొంచెం లోతుగా అంటే, కేవలం ఆంగ్ల మీడియా నే కాకుండా వేరే సోర్సు ల ద్వారా కూడా కొంచెం పరిశోధన చేసి వుండాల్సింది.

ప్రపంచం లోనే శాంతి కి పరమత సహనానికి మారు పేరు అయిన హిందువుల లో కూడా కొంత మంది అతివాదులుగా అవుతున్నారు అంటే, అది ఈ సెక్యులర్ పార్టీలు, ప్రభుత్వాలు ఆడుతున్న వికృత రాజకీయ క్రీడా వలనే. నిన్న అస్సాం లో ప్రభుత్వం విఫలమవడం వలన జరిగిన పేలుళ్ళ కి జనాలకి ఆగ్రహం వచ్చి ఇద్దరు CRPF జవాన్లని, మరో ఇద్దరు పోలీసు వాళ్ళని హతమార్చారు.

మీరు హిందూ మతాన్ని, అన్య మతాలని ఒకే ఘాటున కట్టి వేయడం అంత సబబుగా లేదేమో.

Sujata said...

Mahesh garu

Well timed. After watching the ghasty images of Assam blasts, I felt very sad. I hoped that at least Hindu terrorism is not equipped with RDX and other dangerous chemical stuff. But because it is available so easily anywhere in this country, terrorist attacks could take place with anyone's involvment.

Hindu extremism, should be condemned as much as we condemn Islamic extremism. It is perhaps Islamophobia. But this new phobia surfased by extremist hindutva is new. Terrorism is a crime against humanity.

But the public reaction in Assam yesterday, is surprising. People are angry and upset with the system (Government) We need more army men, more police men and more political will to stop this.

Kathi Mahesh Kumar said...

@సుజాత: మతంలోని మూలసిద్దాంతాల్నికాక, పైపై మెరుగులైన ఆచారసాంప్రదాయాల్ని గుడ్డిగా పాటిస్తూ, ఇదే మతమనుకునే చాలామంది మనసమాజంలో వుండబట్టే, ఈ విపరీతధోరణులు ఉంటున్నాయి. ఏమతానికైనా పరమావధి మానవుడి సంతోషం. అదే కల్పించని మతమేల? ఒకవేళ అలాంటి మానవనాశక మతమే వుంటే, అది నిజంగా మనకు కావాలంటారా?

@నాగప్రసాద్: బాగా చెప్పారు.

@indianminerva: హిందూ తీవ్రవాదం గురించి ఇదివరకు కూడా ఒకసారి బ్లాగుల్లో దుమారం రేగిందండీ! అవన్నీ ఒకసారి వెదకి మరీ (సోమవారంలోగా)లింకులిస్తాను చదవండి.

@దేవన అనంతం:ఇస్లాం టెర్రరిజం మీద,క్రైస్తవుల బలవంతపు మతమార్పిడులమీదా మనం అభిప్రాయాలు ఏర్పరుచుకునేముందు, ఎంతలోతుగా ఆలోచించి, ఎన్ని సోర్సులను బేరీజుచేసి నిర్ణయానికి వస్తాము?

మీరు హిందూమతంలోని "కొంతమంది" గురించి చేసినవాదన, ఇస్లాం టెర్రరిజానికి మాత్రం సరిపోలదంటారా! 20 కోట్లమంది భారతీయ ముస్లింలలో తీవ్రవాదులెంతమంది?

ఇక రాజకీయ పార్టీలూ, సూడో సెక్యులర్/సూడో హిందూ ప్రభుత్వాల రాజకీయక్రీడను ఇస్లాం టెర్రరిజానికి కూడా ఒక కారణంగా చెబితే మీరు అంగీకరిస్తారా?

హిందూ మతంలోని పరమతసహనం బహుశా ఒకప్పటిమాటగా అనిపిస్తుంది. హిందూమతతత్వార్టీల ప్రాపగాండాతో, అర్థం లేని భయలాపుట్టగా హిందూమతస్తులు మారిపోతున్నారు. అనుమానం,భయం, అపనమ్మకం వున్నచోట ఏమతమైనా మనుషుల్లోని రాక్షసుణ్ణే బయటకు రప్పిస్తుందితప్ప మంచిని కాదు.

నాకు అన్యమతాలూ, హిందూమతం అన్నీ ఒక్కటే. హిందూమతానికున్న ప్రత్యేకమైన కొమ్ములేమిటో నాకు తెలీదు.మిగతామతాలలోని తక్కువేమిటో నాకు అర్థం కాదు. అన్నీ మంచే చెబుతాయి. సంతోషంగా మనిషి జీవించాలనే చెబుతాయి. మూర్ఖులూ,మతఛాంధసులూ,రాజకీయనాయకులూ,దొంగస్వాములూ,ముల్లాలూ మతంలోని లొసుగుల్ని ఆధారం చేసుకుని ప్రజలకు నరకం చూపిస్తున్నారు. మతాన్ని వాడుకుంటున్నారు. నాకు తెలిసింది అంతే!

@sujata: ధన్యవాదాలు. ప్రభుత్వమంటే మనకు డైరెక్టుగా కనిపించేది పోలీసులూ,ఆర్మీ లేక రాజకీయనాయకులు. తాత్కాలికమైన కోపంతో సాధారణ ప్రజలు వీరిని అటాక్ చెయ్యటం అర్థం చేసుకోదగిన పరిణామమే. కాకపోతే, ఇంత కోపానికి గురయ్యేవరకూ ప్రభుత్వాలు visible action తీసుకోకపోవడంకూడా దీనికొక కారణమయ్యుండొచ్చు.

ఏదిఏమైనా, ఇప్పుడు కావలసింది same mind.ఈ మతం అనే పేరెత్తే అందరినీ disruption public order కింద అరెస్టు చేసిపడేస్తెగానీ కొంత తెరపి రాదు.

Anonymous said...

"ఏకంగా వీరికి మనుగడే లేకుండా చేసినా హర్షనీయమే" - మతం పేరుతో ఊచకోత వారు కోస్తున్నరు, మానవత్వం పేరుతో మీరు కొయ్యమంటున్నరు.... బాగు బాగు...
- రక్తంతో తడిచేదిమాత్రం మనమే!
ఈ "మనం" అంటే ఎవరు ? - కేవలం సెక్యూలర్ లా ??

Anonymous said...

"disruption public order కింద అరెస్టు చేసిపడేస్తెగాన" -

రష్యాకి సైబీరియాలాగా ..... మనకుకూడా ఒక క్యాంప్ ప్లాన్ చేయాలన్న మాట మన గవర్నమెంట్... బాగుంది మీ సలహ....

రమణ / Ramana said...

మహేష్ కుమార్ గారూ,
తరచూ మీ టపాలు, వ్యాఖ్యలు చదివే పాఠకుడిగా - మీకు వీలు కుదిరితే / ఆసక్తి వుంటే ఈ మాటు, హైదరాబాదు వస్తే మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసి, మీతో రెండు పెద్ద బుడ్లు కింగ్ ఫిషర్ పుచ్చుకోవాలనే కోర్కవున్న వ్యక్తగా, మీరు ఈ టపాలో వెలిబుచ్చిన అభిప్రాయలతో పూర్తిగా ఏకీభవిస్తూ - మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని వుంది. ఈ పెరుగుతున్న హింసయుత ప్రవృత్తికి (టెర్రరిజంకి) మతం ఎంత కారణం, 'అభివృధ్ధి' పేరు మీద ఏర్పడుతున్న ఆర్ధిక అంతరాలు ఎంత కారణం అని మీ అభిప్రాయం?

Kathi Mahesh Kumar said...

@రమణ: మీరు హైదరాబాద్ వచ్చే ముందు నాకు మెయిల్ చెయ్యండి (mahesh.kathi@gmail.com).ఖచ్చితంగా కలుద్దాం.

తీవ్రవాదానికీ ఆర్థికాసమానతలకీ మధ్యనున్న లంకె గురించి అడిగారు. చాలా లోతైనప్రశ్న.ముఖ్యంగా ముస్లిం యువకుల్ని తేలిగ్గా తీవ్రవాదంవైపు మొగ్గుచూపడంలో అవిద్య,నిరుద్యోగం ముఖ్యకారణాలలో కొన్నని ఒప్పుకోకతప్పదు. ఈ విషయం గురించి ముస్లిం యువత అసహనాన్ని తెలియపరుస్తూ నేను "తీవ్రవాదానికి లాజిక్ దొరికితే?" అనే టపా రాసాను. http://parnashaala.blogspot.com/2008/08/blog-post_16.html ఈ లంకెద్వారా చూడండి.

Anonymous said...

హిందు తీవ్రవాదమ తొక్క,
ప్రాణాలను తేగించే ధైర్యం ఒక్క ఇస్లామ్ కే సొంతం.
ఇక ప్రపంచం మేత్తం ఇస్లామ్ రాజ్యం తధ్యం ఒక్క ముస్లిం చావుకు వంద మంది కాఫిర్ల రక్తం తొ బదులు తీర్చుకుంటాము.
ఇస్లామ్ ని అపే శక్తి ఈ ప్రపంచంలొ ఎవరికి లేదు,అమీన్
లాఇలా హ ఇల్లాలా హు

దేవన said...

మహేష్ గారు,

20 కోట్ల మంది భారతీయ ముస్లిం ల లో వున్న తీవ్రవాదుల సంఖ్య ఎంత? అత్యధికంగా వున్న భారతీయ హిందువులలో వున్న తీవ్రవాదుల సంఖ్య ఎంత? ఏది ఎక్కువంటారు?. ఈ విషయం ఒక్క సారి ఆలోచించండి. పైగా మీరు హిందూ అతివాదుల ఫోటో మాత్రమే పెట్టారు - ఇరివురిది పెట్టాలి కదా.

ఇదే భారత దేశం లో ఎంత మంది బీద ముస్లిములు లేరు?, కేవలం పేద హిందువులను ను మతమార్పిడీలు చేసే క్రైస్తవ మషినరీలు బీద ముస్లిముల ను ఎందుకు మార్చరు?. వారు ఫత్వా విడుదల చేస్తారు, వీరు చేయరు కాబట్టి. బహిరంగంగా హిందూ మతాన్ని తూలనాడడం, అక్కడక్కడ జరిగిన పొరపాటును భూతద్దం లో చూడడం, ఇలాంటివన్నీ కేవలం హిందువుల పైనే జరుగుతాయి, ఎందుకంటె వీరు ఫత్వా లాంటిది విడుదల చేయరు కాబట్టి.

కమ్యూనిస్ట్ దేశమైన చైనా లో కూడా ఇస్లాం తీవ్రవాదం వుంది. ఇస్లాం తీవ్రవాదానికి మతం, ప్రత్యేక రాజ్యమ తప్ప మరే ఇతర ప్రాతపదిక వుండదు. రష్యాకి ఈ బెడద వుంది.

హైందవం ఒక జీవన విధానం. ఇతరాలు, అవి మతాలు. హైందవం ముమ్మాటికీ ప్రత్యేకమైనది. హైందవం లో 'kafir', 'infidel' లాంటి కాన్సెప్ట్స్ లేవు. నాకు తెలిసింది ఇంతే!!!.

బాబు ఇస్లాం,
నీవు ప్రపంచాన్నే ఒక పాకిస్తాన్ చేయాలని, ఈ ప్రపంచాన్ని పాకిస్తాన్ అంతగా అభివృద్ది పరచాలని కలలు కంటున్నావు. నీకు all the best.

Anonymous said...

నాయనా దేవన అనంతం,
ముస్లిమ్ లంతా పాకిస్తాన్ లొ మాత్రమే ఉన్నాట్లు అనుకుంటున్న ని తేలివికి జొహారు.
ఇక అబివృద్ది విశయనికి వస్తె నికు ముస్లిం రాజ్యం అయున,సౌది,దుబాయ్,మస్కట్,దొహా, వంటి దేశాలు కనపడకపోవడం ని ఆదృష్టం.
ఈ ప్రపంచం ఇస్లామ్ రాజ్యం రావడం తధ్యం.దినిని ఎ కాఫిర్ అపలేడు.అమిన్.
ఇక పాకిస్తాన్ మత్రమే ముస్లిం దేశం అనుకుంటున్న ని వంటి వారికి ...........బావి లొని కప్ప కధ గుర్తుందిగా

Kathi Mahesh Kumar said...

@ఇస్లామ్:మతం మనిషిమనుగడకు ఉపయోగపడాలేగానీ, ప్రాణాలు తీసుకోవడంలోనీ లేక ఇతరుల ప్రాణాలని తియ్యడానికో కాదు. నీలాంటి మూర్ఖులవలనే ఇస్లాం మతం, తీవ్రవాదానికి మరో పేరులా మారింది. ప్రశాంతతని కాంక్షించే కొన్ని కోట్లమంది ముస్లింలపాలిట శాపంగా పరిగణించింది.

ఇలాంటిపోకడలె పోతుంటే,ఇప్పటికి సంఖ్యల రీత్యా ప్రపంచంలో రెండవస్థానంలోవున్న ఇస్లాం, కనుమరుగయ్యే అవకాశం వుంది. ఇస్లాం రాజ్యంస్థాపితం చెయ్యడంకాదుకదా, మీలాంటివాళ్ళు ఏకంగా ఆ గొప్పమతాన్ని భూస్థాపితం చేసేస్తారు.

Anonymous said...

సార్ కత్తి మహేష్ గారు,
నెను మిమ్మల్ని గౌరవిస్తాను,కుడాలి నేనుచాలా రొజుల నుంచి గమనిస్తున్నాను,ఇస్లామ్ అంటె నే తివ్రవాదము అనే రితిలొ చాలా మంది రాసారు,దానిని సమర్ధించిన వారే తప్ప విమర్శించిన వారు లేరు,అదే మిరు ఈ టపా కాస్తా హిందువుల ప్రతికులంగా రాసివుంటె మిమల్ని అకాశాని ఎతేసేవారు.
మిరు ఇద్దరి లొని తప్పును చేప్పడం వల్లే ఈ సమస్య కాబటి

Anonymous said...

It is called Islamophobia. It is because of the aim of islamic terrorism. Even if the whole world turns Islamic, there will still be massacres. Blood is going to spill between humanity and people will kill each other to keep only shias or only sunnis alive.

Islam garu -

Unfortunately you are wrong. If on the basis or religion we kill each other, to establish ones' religion at the helm., only a religion will thrive. Not the humanity to follow it. Simple.
I feel that the Satan is ruling even as per Hindu karma sastra. This is Kaliyugam.. And these things happen. God is always the winner. Satan will never have the last smile. Its the only hope that keeps us going on.

Anonymous said...

after longtime iam seeing response from my muslim brothers.
come all muslims bothers here.give a good answers to stupids who wrote opposite to islam.

we all are fire

be muslim
die for islam
allahu akbar

Anonymous said...

మహేష్ గారు,

ఈశాన్య రాష్ట్రాల్లోని క్రైస్తవులను మరిచిపోవుట మా దురదృష్టమా?? లేక మీకు వాళ్ళ మీద ఉన్న సానుభూతా!! డొంక తిరుడు లేక క్రైస్తవ మతం మీద బాగా ఆలోచించి మీ మనసు మాట రాయండి. ప్లీజ్ ఒకరి మీద బురద జల్లే ముందు, అది నిజమా కాదా తెలుసుకో (I mean హిందూ తీవ్రవాదం గురించి).

K. D. said...

kathi mahesh garu dayachesi religions meedha articles rayakandi....
meeru comments chusinatithe meeku kuncham artham ayyi undali ... konni chettha naa ****** comments valla leniponi avesam avasaramantara .
bloglo ki kuda ee terrorism antukunattuga undhi. asalu mana country muslims evaru vari ancestors andharu hinduvule kada.

K. D. said...

http://bigb.bigadda.com/wp-content/uploads/2008/11/outlook-11.jpg

Anonymous said...

మహేశ్ గారు,
దయచేసి మతల మీద చర్చ వద్దండి,
మీ టైటిల్ హిందు-ముస్లిమ్ అని కాకుండా మత మౌడ్యం గురించి ఎక్కువ గా రాసివుంటే బాగుటుంది అని నా మనవి.

SaveNatives said...

కత్తి మహేష్ కుమార్, కత్తి లాగ వ్రాసారు. Keep it up the good work. You forgot to write about the true twin evils. They are organized and most powerful. Write about Christian Missionarry Terrorism and Communist Terrorism. Over the last 600 years they killed estimated 500 Million Natives in Europe, Americas, Africa, Asia and Australia. They penetrate Native cultures and societies and destroy Native religions, languages, social customs, Sacred Books, Gods and Goddesses.

For information read the book "The Christ Conspiracy" at http://www.truthbeknown.com/christ.htm

Also read what Southeren Baptist Church (Christian Terrorists) say about Hindus and Jews at

http://www.religioustolerance.org/sbc_pray2.htm

Please write aboutn Christian Terorism in North-East Indian States also.

Anonymous said...

To know about the Christian terrorim... (Its nicely named as imperialism).....

read a book called " Guns Germs and Steel" - Author Name : J.Diamond.