Monday, May 18, 2009

హేట్ బ్లాగర్లకు అంకితం

"Opinions are like assholes.
Everybody has one."
-The Dead Pool (1988)

ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ హేట్ బ్లాగర్లతో సమస్యేమిటంటే.....

"Opinions are like assholes. Everybody's got one and
everyone thinks everyone else's stinks."
తోవచ్చింది అసలు తంటా.
మనకంపు మనకు ఇంపేగానీ, పక్కొడు పేలిస్తేమాత్రం కంపుకంపే!

జైహో!

*******

7 comments:

గీతాచార్య said...

a LONG and LOUD laugh.

S.S. I agree.

rAsEgA said...

ఐతే మీరు బ్లాగ్లోకపు డర్టీ హారీ అన్నమాట :)

శరత్ said...

ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నారే :))

మాగంటి వంశీ మోహన్ said...

గంగాభాగీరథీసరస్వతీయమునా సమానమయిన (అవునా? కృష్ణా గోదావారీ ఆరోనంబరుకాలువలు కాదా ?) బ్లాగ్ లోకంలో ఎవరి అభిప్రాయం "చెప్పు"కోడానికి, వెలిబుచ్చడానికి , "వల్లె"వెయ్యడానికి అపరిమితమయిన స్వేచ్ఛ ఉందండీ.

అబ్బో ఇంకేం ? మరి ఆ నీళ్ళు చక్కగా నెత్తి మీద జల్లుకుని కూర్చోవచ్చుగా!

మరి వినేవాళ్ళకి కూడా ఆ నీళ్ళు నెత్తి మీద జల్లుకోము అని ఆనందభైరవి రాగంలో "వినదగునెవ్వరు జెప్పిన" అంటూ వడ్డన చేసుకునే హక్కు సంపూర్తిగా ఉన్నది అని చెప్ప ప్రయత్నం. అలాగే వారి మిత్రబృందం, భజనబృందం, వారి అనూయాయులు (ఛా - అనునూయులు కాదా?) వీరందరికీ కూడా ఆ హక్కు సంప్రాప్తిస్తుంది అని శాక్య మునీశ్వరులు సరుగుతోట వద్ద సుబ్బారావు చెవిలో చెప్పిన విధంబెట్టిదనగా.....

ఏమిటిదీ - నువ్వు మాట్టాడేది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు, నిన్ను తగలెయ్య. సరిగ్గా చెప్పలేవా?

ముందు పక్కకెళ్ళి పొరబాటున ఇటొచ్చానని మళ్ళీ తొంగిచుసే తంపులమారి తాయారమ్మ/న్నయ్య - వస్తున్నా అక్కడికే వస్తున్నా

మీకు అంతా తెలుసు అనుకుంటే ఇది చదవఖ్ఖరలేదు, నేను చెప్పే మాటలు విననఖ్ఖరలేదు అని వినయపూర్వకంగా ఘంటంతో తాటాకుల మీద వ్రాస్తూ, చెప్పవలసిన విషయాన్ని ఘంటాపథంగా నొక్కి వక్కాణిస్తూ, ఘంటచుట్ట సువాసనతో మీకు ప్రసాద, నైవేద్యాలు నివేదించడమయినది.

అన్నిటికన్నా ముందు .......మ్మ్మ్...మ్మ్మ్మ్...మ్మ్మ్...మ్మ్మ్....మ్మ్మ్మ్మ్...మరేమో...మ్మ్మ్మ్మ్..మ్మ్మ్మ్మ్మ్..

ఓరోరీ మదుమదోన్మత్తా, మయసభాభవన నిర్మాతా, మణిమయ సింహాసనములలో మంకెన పువ్వులు గుచ్చిన మారీచ తనయా, వివరింపుము, త్వరగా వివరింపుము..శరీర పైత్యము పెరుగుచున్నది...

కొంతమంది పడకెక్కి గుర్రు పెట్టేంతవరకూ తమ "వ్రాతవాసి" చూపిస్తూనే ఉంటారు. ఎలానా? ....తమ సుందరమయిన వ్రేళ్ళు ముక్కులోనో, దరహాసధురీణమయిన పళ్ళమధ్యో, లేకపోతే అనువుగాని శరీరభాగాలమీదో, ఇవతలోళ్లంతా చెత్తగాళ్ళు అంటూ, అనుకుంటూ బ్లాగులో బరికేస్తో, అవతలిబ్లాగువాడి వ్రాతలమీద బండరాళ్ళు విసురుతోనో - ఎక్కడో ఒకచోట అన్నమాట.....ఛా అంతేనా..అంతేనా అంటే మరింకొంచెం ఉంది... అలా తమ తామర వికసింపచేస్తూ ఇతరులకి ఆ వికాసాన్ని చేష్టలతో చూపిస్తూ ఆనందం కలుగచెయ్యడమే వారి పని. అలాగే కొంతమందికి కట్టుకున్న పంచె, ఉత్తరీయం ఊరకే దులుపుకోవటం, వీలున్నప్పుడు ఉన్న పిలకకు వేసిన ముడే వేస్తూ ఉండటమో, లేపోతే పక్కనోడి బ్లాగు వ్రాతలమీద ముదిరిపోయిన బెండకాయలాటి వ్యంగ్య వ్యాఖ్యలేయ్యటమో, అలా కాదనుకుని అసురులని దులపటమో అలవాటయితే, ఆడవాళ్ళలో కొంతమందికి అద్దాల దగ్గరే నిలబడి అవి పగిలిపోయేదాకా తీక్షణంగా కొప్పు సరిచేసుకోవటం, ఇలా అన్నమాట..ఇలా బోలెడు "ఉద్యాన"హరణాలు చెప్పుకోవచ్చు.

ఓహో! నువ్వు ఎక్కడినుంచి మొదలెట్టి ఎక్కడికి వెళ్తున్నావో నీకయినా తెలుసా...

ఆహా మనోరంజకంగా!

సరే కానీ మరి...రేపు కలుద్దాం...ఇవ్వాళ్ళ కొంచెం సుబాహుడి దగ్గరకి వెళ్ళి శూర్పణఖ సువార్త వివరాలు వినిరావాలి

Krishna said...

మీ ప్రాస బాగుంది అండి
everyone thinks
everyone else's stinks

Vinay Chakravarthi.Gogineni said...

ento......................

$h@nK@R ! said...

heheheh heheeh