Wednesday, April 14, 2010

చివరకు మిగిలేది - అమృతం

అమృతం 'మంచి వ్యవహర్త' అనే అనిపిస్తుంది నాకు.

అదేమీ negative పదం కాదు.అలా బ్రతకనేర్వకపోతే "ఆడతనాన్ని" కాపాడుకోవడం అప్పటి/ఇప్పటి సమాజంలో కష్టమైన విషయం. సమాజానికి కావలసిన "నటన" చేస్తూనే, తన అవసరాల్నీ ఆకాంక్షల్నీ ప్రేమగా తీర్చుకునే నేర్పరి అమృతం.

Unconditional ప్రేమ అందిస్తూనే తన తరఫున్నుంచీ అన్నికండిషన్లనూ తీర్చుకునే ఒక (అ)సాధారణమైన ఆడది అమృతం. తన పరిధిలో విప్లవాలు లేవదీయకుండా లౌక్యంతో అవసరాలు తీర్చుకునే తెలివిమంతురాలు. దయానిధికి సహాయపడుతూనే తన అవసరానికి ఉపయోగపడుతుంది అమృతం. ఒకరకమైన balancing act లో తను సిద్ధహస్తురాలు.

బహుశా ఇలాంటి స్త్రీలే ఈ సమాజంలో పవిత్రంగా మనగలుగుతారు. ఆ survival instinct కి ప్రతీక అమృతం. ఆ "ముగ్ధజాణతనానికి" చిహ్నం అమృతం. అందుకే ఈ పాత్ర మగాడికి, ముఖ్యంగా దయానిధి వంటి తాత్వికుడికి అర్థం కాదు. సామాజిక "వ్యవహారాలు" తాత్వికులకి అర్థం కావు. పైగా స్త్రీలలోని వ్యవహర్తతత్వం అస్సలు కాదు.

ఎందుకో నాకు బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’కీ గురుదత్ ‘ప్యాసా’కూ చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. రెండూ నా జీవితాన్ని ప్రభావితం చేసినవే.

అమృతం పాత్రకు నవలలో భావస్వేచ్చ లేదు. అమృతం ఎప్పుడూ తనకోసం తాను బ్రతకలేదు. ఇతరులను సంతృప్తిపరచి తన "స్థానాన్ని"కాపాడుకోవటానికి బ్రతికింది. అందుకే "నటన" అమృతానికి ఒక సహజమైన అవసరం. ఇందులో నెగిటివ్ గా ఫీలవ్వడానికి ఏమీ లేదు.

భర్త జమాబందీ, అత్త జబర్దస్తీల మధ్య, పిల్లల లేమి తనను "తన ఇంటికి" దూరం చేస్తుందన్న కటికనిజం నేపధ్యంలో దయానిధితో అమృతం కలయిక జరుగుతుంది. దయానిధిపైన అమృతానికి ఎప్పుడూ ప్రేమ ఉండుండొచ్చుగాక, కానీ ఈ కలయికలోని అమృతం యొక్క ఉద్దేశం "కేవలం ప్రేమ" కాదు. అలా కాకున్నా తప్పులేదు. She did it for her survival. ఇందులో దయానిధికి జరిగిన నష్టంకూడా ఏమీ లేదు. He is rich by one experience. He got some thing more to think about.All he needed out of life was to "think about life", rather than living it.

అమృతం నైతికతను నేను ప్రశ్నించడం లేదు. అలా ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. నేను అమృతం ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాను.

‘అమృతం selflessness లో selfishness ఉంది’ అనే ప్రతిపాదన ఆ పాత్రపట్ల కఠినంగా అనిపించినా, నవలలో దానికి ఆధారాలు బోలెడు.స్వార్థపరురాలిగా ఉండటంలో తప్పులేదే? self centered గా ఉంటేతప్పు. ఇతరుల జీవితాలతో ఆడుకునే స్వార్థం ఉంటే తప్పు. కానీ అమృతం ప్రేమించే స్వార్థపరురాలు.

(ఇవి నెమలికన్ను బ్లాగులో నేను అమృతం పాత్రపై రాసిన వ్యాఖ్యలు)

****

2 comments:

Anonymous said...

I read this novel some 15 years back. Then I could not even understand Amrutam and Nidhi had an extramarital relationship. What is the difference between being selfish and and being self centred? Please explain

Kathi Mahesh Kumar said...

@ఆంధ్రుడు: నేను మాత్రమే బాగుంటేచాలు చుట్టుపక్కలవాళ్ళి చచ్చినా నాకు ఏంపెద్దతేడా రాదు అనుకుంటే self centered. నేను బాగుండాలి అనుకుంటే selfish.