Friday, August 27, 2010

ఎవరిది దొడ్డిదారి?


Brahmanical attitudes are a major hurdle in India’s emergence as a humane society.- Dr.Amrik Singh

ఎవరిది దొడ్డిదారి?
వేల సంవత్సరాలు, వందల తరాలు
అప్రకటిత రిజర్వేషన్లు, అభివృద్ధి ఫలాలు
అప్పనంగా దండుకున్న అగ్రకులాలదా !

అభివృద్ధిలో అవసరం లేదు
కనీసం అవకాశంలో సమానత్వం కోసం పోరాడి
రిజర్వేషన్లు తెచ్చుకుని
వాటి అమలుకు ఇప్పటికీ పోరాడుతున్న దళితులదా !

లోపాయకారి రిజర్వేషన్లు ఇప్పటికీ మీవే
కులప్రాతిపదికన అధికారాన్ని రిజర్వు చేసుకునేదీ మీరే
MNC లలోనూ "మీ వోళ్ళకే" ఉద్యోగాలనుకునేదీ మీరే
ఇన్నాళ్ళు దౌర్జన్యంగా ప్రయాణించారు కాబట్టి
మీ దొడ్డిదారి రహదారిగా మారిందా?
ఇప్పుడు రాజ్యాంగం ప్రకటించిందికాబట్టి
మా పోరాటమార్గం మీకు దొడ్డిదారిగా కనిపించిందా?

ఓ అగ్రకుల మాలిన్యమా
నీ పేరు నిప్పురవ్వా!

*****MNC లలోని అప్రకటిత రిజర్వేషన్ల గురించి పరిశోధనా వ్యాసం ఈ లంకెలో చూడండి.


*****

55 comments:

Unknown said...

I you are owning a company then how you will recurit the employees?
Ans:-
Based on the reservation or a based on talent or skill?

I am belongs to uppercast and my father is a watchmen in a government office and we are not even middle class people. I don't have any reservation or money to grow up.

But still I am worked at USA, London & Singapore. How?

Because of Only my talent, hard work, dedication, determination, and rich family principles with honest life.

Now I am feeling very happy that I am not belongs to reserved category. Reason If I have reservation then I will settle as one more watchemen

As a student I hate reservations. But now I want the reservations such that all upper cast poeple will depend on their skills and work hard for to achive the biggest goals in their life.

I am not against about SC/ST categories. I will alwasy see them as my family members. I don't have any kind of negative feelings on them.

I hate only peple who mis-utilize the reservations.

A upper cast watch men son is able to work in abroad without having any financial background? why cannot a reserved category person will reach highest possition in life without using any reservations.

In this case can you tell the difference between me and reservation candidate.

If you are confident about your self and you depend only on your own skills then no one can stop you.

That is the fundamental principle of life and I hope that you understood What I mean!

Kathi Mahesh Kumar said...

@మోనార్క్: మొదటగా talent,skill and reservations are not mutually exclusive. క్రింద నేను ఇచ్చిన లంకె equally talented and skilled dalits are discriminated because of caste అనేది చాలా clear గా నిరూపించబడింది. It is about social attitudes, not just your personal behavior. కాబట్టి, నేనైతే ఇలా చెయ్యను అనేది అసలు argument కాదు.

కులపరమైన రిజర్వేషన్లకు ఒక చరిత్ర ఉంది. అది ఆర్థికపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కాబట్టి మీరు రెంటినీ కలిపి వాదించడం సరైన పద్దతి కాదు.

Traditinally upper caste had all the social-economic and political advantages. ఆ cumulative advantage/reservation ని అధిగమించాలంటే ఈ కులపరమైన రిజర్వేషన్ తప్పదు. అగ్రకులాల్లోనూ ఆర్థికపరమైన exemptions ప్రభుత్వాలు కల్పించాయి. కానీ అవకాశపరమైన రిజర్వేషన్లు కులపరంగా అవకాశాలు కోల్పోయిన sections కు మాత్రమే అనేది ప్రస్తుతం ఉన్న సిద్ధాంతం. దాన్ని రాజకీయంగా పోరాడి మారిస్తే అగ్రకులాల పేదలకూ రిజర్వేషన్లు లభిస్తాయి. I am all for it. Till that time, please don't mix us issues.

Apparao said...

ప్రైవేటు రంగం లో రిజర్వేషన్ కావాలి అని గోడ మీద వ్రాస్తే , నేను చదివి నాకు పక్కింట్లో ప్రవేశానికి రిజర్వేషన్ కావాలి అని అడిగా
పక్కింటి అంటీ ,అంకులే సొంతమా ? మాకు కూడా కావాలి అని అడిగితె అమాయకత్వమే
MNC లలో రిజర్వేషన్లు ఉండవు , తమరే అర్ధం చేసుకోవాలి

Kathi Mahesh Kumar said...

@అప్పారావు శాస్త్రి: ప్రైవేటు పరిశ్రమలకు ఫ్రీగా భూములూ, పవర్ సబ్సిడీలు, ట్యాక్స్ హాలిడేలూ ఎవరి డబ్బుతో ఇస్తున్నారు? That is out of states money, straight out of OUR collective resource.కాబట్టి అవి పక్కిల్లు, పొరుగిల్లూ కాదు.

ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీలూ,సేవలూ ఎంజాయ్ చేసే ప్రైవేటు రంగానికి ఆ సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. అమెరికాలో affirmative action ఉన్నట్లే ఇక్కడా రిజర్వేషన్ పాలసీ అమలవ్వాలి. అది ఎలా ఉండాలి అనేదాంట్లో చర్చ అవసరమేమోగాని, ఉండాలా వద్దా అనేది అసలు చర్చనీయాంశం కానే కాదు.

అయినా, ఇక్కడున్న వ్యాసం క్వాలిఫికేషన్ ఉన్నా దళితులను కులం కారణంగా ఉద్యాగాల్నుంచీ వంచితుల్ని చెస్తున్నారని. Do you support such discriminatory social attitudes?

Apparao said...

ax మినహాయింపులు ఉన్నాయ్ , ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం మన దేశం లోకి రావడం వల్ల రూపాయి బలపడుతుంది అని.
income tax act , కంపెనీస్ act అత్యంత పటిష్టం గా ఉన్నాయ్
అందులో ఎ లొసుగులు ఉండవ్
ఇంతకీ మీ పోరాటం అగ్ర వర్ణాల మీదా ? అవినీతి ప్రభుత్వాల మీదా ?
మీ ప్రశ్నలు , పోరాటాలు రాజకీయ నాయకుల మీద, ప్రభుత్వాల మీద చేస్తే ఫలితం ఉంటుంది.

Kathi Mahesh Kumar said...

@అప్పారావ్ శాస్త్రి: నా చర్చ కార్పొరేట్ చట్టాల గురించి కాదు.ఈ సమాజంలో వ్యాపారం చేస్తూ, స్టేట్ resources, security, subsidies పై ఆధారపడుతూ ఉన్న MNC ల సామాజిక బాధ్యత గురించి.

నాపోరాటమంటారా...అది అగ్రవర్ణ ఆధిపత్యభావజాలం మీద. అదే భావజాలానికి ప్రతినిధిత్వం వహిస్తున్న ప్రభుత్వాల మీద. ప్రభుత్వాలతోనూ, రాజకీయ వ్యవస్థతోనో పోరాటం నడుస్తూనే ఉంది. ఇది కూడా అందులో భాగమే.

Ravitheja said...

@ మహెష్
1) దళితులను కులం కారణంగా ఉద్యాగాల్నుంచీ వంచితుల్ని చెస్తున్న సందర్భం బూతద్దం పెట్టివేతికిన కానరాదు
కానీ కులం కారణంగా నేడు అగ్రవర్ణాలవారిని ఉద్యాగాల్నుంచీ వంచితుల్ని చేస్తున్నారు

Do you support such discriminatory social attitudes?

2)మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసనా చూడండి అన్నట్లు ఉంది
ఏనాడో తరాల ముందు జరిగిన అన్యాయానికి ఈ నాటి అగ్రవర్ణాల లో ఉన్న పేదలు బలి అవ్వాలా ?
మరి అగ్రవర్ణాలలో పేదలకి రిజర్వేషన్స్ అవసరం లేదా
ఇది కుల ప్రాతిపదికన జరిగే అన్యాయం కదా

కృష్ణప్రియ said...

హ్మ్మ్.. మీరు చెప్పిన వ్యాసం చూశాను. నాకెందుకో నమ్మ బుద్ధి అవటం లేదు. ఒక ఇంజనీర్ పోస్ట్ కి కులం/మతం పేరు తో వివక్ష చూపిస్తారని!!!

రెండవ పేజీ లో అన్నట్టు బహుశా.. ఎయిర్ హోస్టెస్, లాబీ లేడీ, లాంటి ఉద్యోగాలకి అందం గా స్మార్ట్ గా ఉన్నవాళ్ళని, గడ గడా మాట్లాడేవారిని తీసుకుంటారంటే నమ్మశక్యంగా ఉంది కానీ..

నేనే సరిగ్గా గమనించలేదేమో లెండి.. నాకైతే టీం లంచ్ కి వెళ్ళినప్పుడు శాకాహారం ఎవోఇడ్ చేసేవాళ్ళు, చేయని వాళ్ళు గా తప్ప ప్రత్యేకం గా కులం, వర్గం తెలియదు.

సర్ నేం ల బట్టి అంటున్నారు.. మా పక్క క్యూబ్ లో ఉన్న అమ్మాయి కత్తి పద్మజ వైదిక బ్రాహ్మలు,
నాకు తెలుగు వాళ్ళైతే తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల వాళ్ళవి చెప్తే తెలుస్తుంది.. తెలుసుకోవాలని "ఎంక్వైరీ" చేస్తే తెలుస్తుంది అనుకుంటా..

ఇంకో విషయం.. సాఫ్ట్వేర్ లో అయితే అన్ని ఉద్యోగాలూ హెచ్ ఆర్ నుండైతే రావు. వేరే కంపెనీల్లో చేసే స్మార్ట్ ఇంజనీర్ల వేట ద్వారా చాలా వరకూ వస్తాయి (నేను చూసినంతలో...)

తెలిసీ తెలియని దనం తో ఏదైనా తప్పు గా మాట్లాడితే క్షమించగలరు..

కృష్ణప్రియ/

Apparao said...

MP మరియు MLA అభ్యర్దులకి రిజర్వేషన్లు ఉన్నాయ్ కదా ?
ఎందుకు ?
మీ కుల / మత నాయకుడిని ఎన్నుకుంటే కుల/మత అభిమానంతో మీ సమస్యలని పరిష్కరిస్తాడని
మీ ప్రాంతపు MLA /MP మీ కుల / మత పు వాడయితే మీ కు కూడా 500 రూపాయలకే ఎకరం భూమి ఇస్తాడు :))
ఒకసారి హైదరాబాద్ లో ఒక మతం వారు నివసించే ప్రదేశానికి వెళ్లాను, అక్కడి రోడ్లు అన్నీ గతుకులు గుంటలు
చిన్న వానపడితే ఆ ప్రాంతం అంటా మునిగి పోతుంది. ఆ ప్రాంతానికి MLA ఆ మతపు వాడే , ఏమి ఉద్ధరించాడు ఆ ప్రాంతాన్ని
అయినా వాడికే ఓటు వేసి గెలిపించిన మూర్ఖులని తిట్టుకున్నా.
మీ కుల / మతపు వాళ్ళు అధికారాలలో మంత్రి పదవులలో ఉన్నారుగా వాళ్ళని అడగాలి
మాయావతి ప్రభుత్వం లో ఎంత మని దళితులకి న్యాయం జరిగింది?

Kathi Mahesh Kumar said...

@రవితేజ: అంత సమగ్రమైన స్టడీ ముందుపెడుతుంటే బూతద్దం పెట్టినా కనిపించదంటున్నరే....may be you have not gone through the link.

Please read it.
http://www.thesundayindian.com/18112007/section.asp?sname=%27Cover+Feature%27&idate=%2718%2F11%2F2007%27

కులంకారణంగా అవకాశాల నుంచీ దూరంగా ఉంచిన దళితులకు రిజర్వేషన్ ద్వారా అవకాశాలు కల్పించడం ఒక సోషియల్ జస్టిస్ మోడల్. Cumulative advantage ని ఇన్ని తరాలు వాడుకున్న అగ్రకులాలు ఈ అరవై సంవత్సరాల రిజర్వేషన్ల వల్ల అన్యాయమైపోతున్నాయనే వాదన వ్యక్జ్తిగతంగా చెల్లుతుందేమోగానీ సామాజికంగా కాదు.

అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ కల్పించాలనే వాదనను నేను సమర్థిస్తాను. కానీ అవి discrimination వల్ల కోల్పోయిన అవకాశాల్లో కాదు. ఆర్థిక స్వావలంబనలో.Don't mix caste discrimination with poverty. రెండూ వేరు వేరు. రిజర్వేషన్ విధానం కులవివక్ష ద్వారా అవకాశాల్ని అందుకోలేని దళితుల కోసం నిర్దేశించబడినవి. అవి అందుకోసమే ఉంటాయి.

Ravitheja said...

@ మహెష్ I am talking about present not past

1)can you differentiate what are the oppetunities lost becoz of "discrimination" and poverty
2)Now a days every upper cast poor student is losing opportunities becoz of "Reservation discrimination " but not of poverty

I lost lot of educational and career opportunities because of "Reservation discrimination " but not poverty.

Discrimination happened in social culture it can be neutralized by reservations in educations but why on govt jobs

In 2009 SBI clerk postings Out of 2laks ppl only 4 OC got jobs is it fair.......?thousands of examples you can get like this

Ravitheja said...

@K. మహేష్ కుమార్ I am talking about present not past

Reservations upto educations OK then Y for jobs also

Kathi Mahesh Kumar said...

@అప్పారావు శాస్త్రి: విద్య-ఉద్యోగ-రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించగానే egalitarian society ఏర్పడిపోదు. We are just infants in that social engineering process. కొన్ని వేల సంవత్సరాల social model ని పక్కనపెట్టి కొత్త ప్రయోగం మొదలెట్టి అరవై సంవత్సరాలైనా కాలేదు. మీరప్పుడే ultimate goal కనిపించడం లేదంటే అది మీ తొందరపాటు తనమే అవుతుంది.

ప్రజాస్వామ్యంగా రాజ్యాంగంలో డిక్లేర్ చెయ్యగానే ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యం వచ్చేసిందా? Its a process, we have to fight for it on a daily basis. అలాగే, రాజకీయ రిజర్వేషన్ల వల్ల హఠాత్తుగా కులజనుల్లో, మతజనుల్లో అభివృద్ధి వచ్చెయ్యదు. అదొక process. ఆ విధానంలో aberrations లేవని ఎవరు చెప్పారు? Empowerment would lead to development అది సమాజం నుంచీ మొదలై రాజకీయం కావాలా, రాజకీయంతో మొదలై సమాజానికి రావాలా లేక రెండూ ఒకేసారి జరగాలా అనేది ఎప్పటికీ తెగని చర్చ. ప్రస్తుతానికి అన్ని వైపుల నుంచీ ప్రయత్నాలు మాత్రం ప్రారంభమయ్యాయి. మీరు ఉదహరించిన కుల/మతపరమైన రాజకీయ రిజర్వేషన్లు అందుకు ఉదాహరణ. కేవలం అరవై సంవత్సరాల ఆధారంగా అది పనికిరాదు అనెయ్యడం అంత సమర్థనీయం కాదు.

ఇక మీరు specific గా మాయావతి గురించి అడిగారు కాబట్టి చెబుతాను. మాయావతి ముఖ్యమంత్రి అయ్యిన తరువాత దళితులపై జరిగే అత్యాచారాలు గణనీయంగా తగ్గాయి. ఉత్తరప్రదేశ్ లో law and order చాలా అభివృద్ధి చెందింది.If you have any doubts please consult National Crime Records Bureau.

@కృష్ణప్రియ: Its good that you have not experienced such a thing. May be for a simple reason that you don't belong to that section. Have you ever thought of it?

ఇక్కడ ఇంటిపేరుతో కులాన్ని ఎలా చాలా మంది గుర్తిస్తారో నార్త్ ఇండియాలో సర్ నేమ్ తో గుర్తిస్తారు. రిక్రూట్మెంట్ టైంలో సర్టిఫికేట్లో అన్నీ ఉంటాయి. అంత చక్కగా తెలిసాక అది conscious గా కాకపోయినా subconscious గా influence చేస్తోంది అనేది ఈ study తేటతెల్లం చేసిన విషయం.

నిజానికి ఈ స్టడీలో కొన్ని ఇంటర్వ్యూలను సీక్రెట్ క్యామెరాతో చిత్రించారు. Body language of upper caste interview panel showed clear indication of discrimination.

Kathi Mahesh Kumar said...

@రవితేజ: I am talking about present too. Not past. (Please read the study)

Conscious deprivation of "ACCESS" is the opportunity lost for Dalits for centuries and even now. That is not the case with upper caste poor. Poverty is not a social discrimination, its a economic status. The remedy here is economic upliftment. Not "reservation".

If you have lost opportunity because of reservation, my sympathy is with you individually. But, collectively as a society this model is the only model available at present time.So, I would say you bear with it. Or if you have an alternate agreeable model please propose it.

In first 20 years of reservations in education, could only secure majority Dalits 4th class employee jobs i.e. sweepers, chapracies (traditionally they are any way were doing that). How many more years would you want Dalits to wait for education and then compete for jobs when upper caste with its all social comfort was way before any Dalit's imagination?

I have no knowledge of the SBI clerk postings you were talking about. Provide me with more information, let me have a look at it.

Apparao said...

ఒప్పుకుంటున్నా మీ వాదనని
మీ కులానికి రిజర్వేషన్లు అన్ని రంగాలలోనూ ఇవ్వాలని అధిస్తానాన్ని అడుగుతా
సరేనా ?
ఇంతకీ మీకు ఎన్ని ఏళ్ళు కావాలి ఏయే రంగాలలో రిజర్వేషన్లు కావలి ?
నాకు లిస్టు పంపించండి, మీ తరుపున నేను, మీకులపు నాయకుడి దగ్గరికి వెళ్లి మాట్లాడతాను
భారత దేశం లోని ప్రతి ఒక్క దళితుడూ ధనవంతుడు అయ్యేవరకు రిజర్వేషన్లు కల్పించాలని పట్టుపడతాను
>>>అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ కల్పించాలనే వాదనను నేను సమర్థిస్తాను. కానీ అవి discrimination వల్ల కోల్పోయిన అవకాశాల్లో కాదు. ఆర్థిక స్వావలంబనలో.
అని అన్నారుగా
దళితులకు రిజర్వేషన్ కల్పించాలనే వాదనను నేను సమర్థిస్తాను. కానీ ఎన్ని ఏళ్ళు గడిచినా అభివ్రుది చెందకుండా, ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేని అసమర్దులకి కాదు

Praveen Mandangi said...

ఓసారి దిగుమర్తి సురేష్ గారు అన్నారు "రిజర్వేషన్ అనేది ఆపరేషన్ ఆకర్ష్ లాంటి. దాని వల్ల ప్రయోజనం ఉంటుందనుకునేవాళ్లు సమర్థిస్తారు, తమ అవకాశాలు పోతాయనుకునేవాళ్లు వ్యతిరేకిస్తారు" అని. నిజమే కానీ ఇక్కడ మహేష్ గారి పాయింట్ అఫ్ వ్యూలో కూడా చూద్దాం. కొన్ని సార్లు కులం పేరు చెప్పకపోయినా ఇంటి పేరు ఆధారంగా కులం పేరు తెలిసిపోతుంది. ఆచార్య అని ఇంటి పేరు ఉంటే బెంగాలీ బ్రాహ్మణుడు అని, పాత్రొ అని ఇంటి పేరు ఉంటే ఒరియా బ్రాహ్మణుడు అని, అగ్నిహోత్రి అని ఇంటి పేరు ఉంటే పంజాబీ బ్రాహ్మడు అని, ఘోష్ అని ఇంటి పేరు ఉంటే బెంగాలీ కాయస్తుడు అని, శ్రీవాస్తవ అని ఇంటి పేరు ఉంటే హిందీ కాయస్తుడు అని ఇలా గుర్తు పట్టేస్తారు. కులం అధారంగా రిక్రూట్మెంట్లు జరిగే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి.

చదువరి said...

అసలు ఈ స్టడీ కొత్తగా చెప్పినదేంటో అర్థం కావడం లేదు. ప్రైవేటు కంపెనీల్లో కూడారిజర్వేషన్లు పెట్టాలి అని చెప్పడమే ఈ స్టడీ ఉద్దేశమైతే, దానికి ఇంత బారాటి స్టడీ అక్కర్లేదు.

ఇది "సమగ్రమైన స్టడీ" కానే కాదు. స్టడీ అంటే అన్ని కోణాలనూ పరిశీలించాలి. లేకపోతే అసలు స్టడీ చెయ్యడం ఎందుకు? ఆ అవసరం లేదనుకున్నారో ఏంటో గానీ, ఈ "పరిశోధనా" స్టడీ కంపెనీల ఆలోచనావిధానాన్ని పరిశీలించినట్టు లేదు. కంపెనీలు నిజంగానే నుముఖంగా లేకపోతే దానికి కారణం ఏమిటో సమగ్రంగా పరిశీలించినట్టు కనబళ్ళేదు. రిజర్వేషన్లను అమలు చేసాక, సహోద్యోగుల మధ్య ఎలాంటి సంబంధాలుంటున్నాయో స్టడీ చేసిందా ఈ పరిశోధనా వ్యాసం? రిజర్వేషన్ కారణంగా మిగతా అన్ని అర్హతలు కలిగిన వ్యక్తిని పక్కనపెట్టి, ఒక వ్యక్తి ప్రమోషన్ పొందితే తక్కిన ఉద్యోగుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి వాతావరణంలో వీళ్ళంతా కలిసి ఒక జట్టుగా పని చెయ్యగలిగే స్థితి ఉందా? ఏ చిన్న తేడా జరిగినా, అత్యాచార నిరోధక చట్టాలను ప్రయోగించే అవకాశమున్న ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు సభ్యులు కలిసిమెలిసి పని చేసుకుపోయే వాతావరణం ఉందా?

పై విషయాల పట్ల కంపెనీల్లో ఆందోళన ఉందేమో గమనించారా? ఎందుకంటే.., సంస్థ విజయం జట్టుల విజయాలపై ఆధారపడి ఉంటుంది. జట్టు విజయాలు సాధించాలంటే జట్టులో మానవ సంబంధాలు పటిష్టంగా ఉండాలి. ఈ విషయాల మీద ఈ ’పరిశోధన’ చేసిన వాళ్ళు తమ ’రహస్య కెమెరాల’తో ’స్టడీ’ చేసారా?

ఇవేవీ ఆలోచించకుండా.., ’దళితులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు, కంపెనీలకు సామాజిక స్పృహ లేదు’ అంటూ వ్యాసాలు రాసుకుపోతే అవి రాజకీయ వ్యాసాలౌతాయి. ఇది ఒక పక్షపాత, నిరాశాపూరిత ’స్టడీ’గా కనిపిస్తోంది. పరిష్కారాలు కనుక్కోటం కోసం చేసిన ’స్టడీ’ కాక, రిజర్వేషనేతర వర్గాలపై దుమ్మెత్తి పోసేందుకు చేసిన ’స్టడీ’గా అనిపిస్తోంది. అవతలి కోణాన్ని చూపించని ’స్టడీ’ ’స్టడీ’యే కాదు. సరైన పరిష్కారాలు చూపించని ’స్టడీ’ ’స్టడీ’యే కాదు. ఇదొక రాజకీయ స్టంటు, అంతే! ఈ బాపతు రాజకీయ స్టంట్లకు మనకు కొదవే లేదు. ఒకటో తరగతి నుంచీ ఇంగ్లీషులోనే చదువు చెప్పాలని, తెలుగులో చెప్పకూడదనీ కొందరు ’మేధావు’లు ఇచ్చిన నివేదికలు, చేసిన స్టంట్లూ ఇట్టాంటివే!

కృష్ణప్రియ said...

Mahesh గారు,

Yes.. I thought of that!. అందుకే Disclaimer నా కామెంట్ లో వాడాను. మీరన్నట్టు conscious గా కాకపోయినా subconscious గా..
దాన్ని ఎవరు మార్చగలరు? సమాజం ఈ విధం గా ఎదగాలి అంటే మనం మన sir names ని త్యజిస్తే మంచిదేమో?

నా బిడ్డ, పక్కవారి బిడ్డ ఒకటే చాక్లేట్ కోసం వస్తే.. నేను దాచి మా పాప కే పెడతానేమో..లేదా ఇచ్చినా ముక్క చేసేటప్పుడు ఒకటి పెద్దదీ, రెండోది చిన్నదీ వస్తే..పెద్ద ముక్క నా బిడ్డ కే ఇస్తానేమో.. మనిషి గా నేను ఎదిగితే.. తల్లి గా ఆ వివక్ష చూపనేమో.. (ఇది పిచ్చి ఎగ్జాంపుల్.. ఒక చాక్లెట్ కోసం నేనిలా చేస్తాను అని కాదు.. )
conscious గా చేస్తే.. అది చట్టరీత్యా నేరం కదా ..

MNC ల్లో అంతటా ఇలా జరుగుతుందని ఆ study చెప్తుంటే.. అది నిజంగా సమాజానికి దర్పణం అయితే అది శొచనీయం. నాకు ఇలాంటి experience ఇంకా ఎదురవకపోవటం నా అదృష్టం ఐతే.. నాలాగా అందరూ అదృష్టవంతులవ్వాలని కోరుకుంటూ..

Kathi Mahesh Kumar said...

@చదువరి: నిజమే...ఈ పరిశోధన కొత్తగా ఏమీ చెప్పలేదు. కొన్ని ఆధారాలు చూపించింది అంతే. ఇప్పటి వరకూ ఇలాంటివి లేవని వాదించేవాళ్ళకు కొన్ని నిజాల్ని అంకెలతో సహా చెప్పింది. అంతే.

ఒక SC/ST అట్రాసిటీ/రేప్/హత్య కేసు జరిగిన దగ్గరికి వెళ్ళి అగ్రకులాల అభిప్రాయం సేకరించకుండా స్టడీ చేశాను అన్నట్టుంది మీ "సమగ్రత"పై ఆరోపణ. ఈ స్టడీ చేసింది రాజకీయనాయకులు కారు. అకడమీషియన్స్. వాళ్ళకు రాజకీయ అజెండా లేదు. అమెరికాలో ఇలాంటిదే చేశారు ఇంకో ఉదాహరణ కోసం ఇండియా వచ్చారు అంతే.

Their focus essentially is to show that there is social inequality in MNCs. ఇక మీరు లేవనెత్తిన ప్రశ్నల్లో ఎన్నో damaging suggestions ఉన్నాయి. వాటి గురించి నేను చర్చించ దలుచుకోలేదు.

ఇలాంటి స్టడీలు లేకపోతే ఉన్న నిజాల్నే ఒప్పుకోని చాలా మంది పరిష్కారాలు చూపిస్తేమాత్రం ఒప్పుకుంటారా! రిజర్వేషన్ విధానం ఒక పరిష్కారంగానే ఇప్పుడు అమలౌతోంది.దాన్ని మాత్రం వ్యతిరేకించడం లేదూ!

మార్పు కోరుకుంటూ ఈ స్టడీలుగానీ, కేవలం రిజర్వేషనేతర వర్గాల మీద దుమ్మెత్తి పొయ్యడానికి స్టడీలు నిజంగా అవసరమంటారా?

@అప్పారావు శాస్త్రి: ఇప్పుడు మీరు చర్చల్లోంచి ఎకసెక్కాల్లోకి దిగారు.
అవకాశాలు ఇవ్వడం లేదు మొర్రొ అని ప్రతి రంగంలో మొత్తుకుంటుంటే, అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకొలేని అసమర్ధులు అని అభియోగం మోపుతున్నారు.Not a fair assessment.Please get your facts right.

@కృష్ణప్రియ: I wish the day comes, when everybody is as lucky as you.

dynamite said...

బాబు కత్తి, ఏ కంపెనీ లో ఏ కులాని రిజర్వేషన్ ఇస్తున్నారో చెప్పి పుణ్యం కట్టుకో - మా కులపు పిలకాయలు చాన మంది ఉన్ద్యోగాలు రక బాధపడుతున్నారు.

Anonymous said...

ఇది ఇప్పుడు ఎందుకు పెట్టారు?

౧. నిప్పురవ్వని ఎండగడటానికా?
౨. ప్రవేట్ లో కుడా రిజర్వేషన్లు ఉండాలి అనా?
౩. subconscious ఉండే అసమానతల గురించా?

చివరి రెండిటిలో ఒక దాని మీద ఐతే నేను కామెంట్ రాస్తాను, మొదటి దాని కోసం ఐతే అనవసరం.

మొదటి దాని కోసం కాకపొతే, టపాలో మేటర్ ఎడిట్ చేస్తే, విషయం పక్కకి వెళ్ళదు.. అప్పుడు బాగుంటుంది.

వీర said...

మహేష్, మీరు ఇంత క్రితం టపాలలో దళితులకు ఒక మోడల్ ఫాలో ఐతె అభివృద్ది చెందుతారని రాశారు కదా. మీదగ్గర సొల్యుషన్ ఉంచుకొని అమలు చేయకుందా ఇలా రాయటం వలన మీరు సాధించేదేమిటి? ఆమోడల్ ఎంత వరకు మీరు అమలు లో పేట్టటానికి ప్రయత్నించారు. దాని ఫలితాల మీద ఎమైనా అప్ డెట్స్ మీ దగ్గర ఉన్నాయా?
---------------------------
నవతరంగం లో మీ మిత్రుడు రాసిన దానికి యం.బి.యస్. ప్రసాద్ గారు మొదలుకొని చాలా మంది పెద్దలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తరు. వాటికి ఇప్పటివరకు ఆయన(పేరు గుర్తుకు రావటం లేదు) సమాధానమీయ లేదు. అలాగే వారు తప్పు జరిగిందని వొప్పుకోలేదు. వారి నుంచి ఎవిధమైన సమాధానం లేదు. ఇటువంటి వారు పని చేసె పెపర్ లో రాసిన వాటి గురించి మీరు ఎందుకు చాలా సీరియస్ గా తీసుకుంటారు?

Ravitheja said...

If Reservation is a solution it will be appreciated by the most .

But it is like punishment for the some innocent ppl .....

ఆ నాడు దళితులూ ఎదుర్కొన్న కులవివక్ష కి ఈనాడు అగ్రవర్ణాలు ఎదుర్కొంటున్న "రిజర్వేషన్ " తరహ వివక్షకి తేడా ఏమిటి?

Here a solution is crating more complicated problem and initiating new racism which creates a sympathy on OC's who could not get a GOVT job

Kathi Mahesh Kumar said...

@తార: నిప్పురవ్వ ఎవరు? ఇక్కడ చర్చ ఎవరినీ ఎండగట్టడానికి కాదే? విషయం ఇప్పటివరకూ పక్కకి వెళ్ళలేదు. కాబట్టి మీరు ఏ మేటర్ గురించి చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు.

@వీర: అప్పుడు చెప్పిన మోడల్ ఒక aspirational నమూనా. అది ఫాలో అవ్వడానికి తగిన వనరులు, నాయకత్వం లేదనేది నేను అదే టపా చివర్లో చెప్పాను. మీరు చదవలేదా?

ఇక యం.బి.యస్. ప్రసాద్ విషయం...నేను విషయాలతో, సిద్ధాంతాలతో, అలోచనలతో విబేధిస్తానే గానీ ఒక భిన్నాభిప్రాయం ఆధారంగా వ్యక్తుల్ని ద్వేషించను. ఒకవేళ కొందరు వ్యక్తుల్ని నేను ద్వేషించానంటే దానికి వ్యక్తులు కారణమౌతారుగానీ వారి ఆలోచనలు (కొన్ని) నాకు ఎప్పటికీ నచ్చొచ్చు. నవతరంగంలో ఆర్ట్ ఫిల్మ్స్ కి సంబంధించిన చర్చ ఒక conclusion కి వచ్చే ముగిసింది. మీరు ఒకసారి చూడండి.

Apparao said...

మహేష్ గారికి రిజర్వేషన్లు కాదు కావలిసినది
ఆయనకీ కామెంట్స్ కావాలి
ఇప్పుడు కుదరట్లేదు కాని వీలయితే రేపు ఒక పోస్ట్ వ్రాస్తా
మీరు సామాన్య ప్రజలని తిట్టి మీరు సాధించేది లేదు
అస్సలు ఈ పోస్ట్ అనవసరం గా వ్రాసారని పిస్తోంది

Kathi Mahesh Kumar said...

@అప్పారావుశాస్త్రి: మీకు టైం లేకపోతే టైం ఉన్నప్పుడు వచ్చి రాయండి. అంతేగానీ ఏవో గాలివాటు ఆరోపణలు ఎందుకు?

కామెంట్లతో నేను కట్టుకునే కోటేమే లేదిక్కడ. నేను ఎవరినీ తిట్టడమే లేదు. మరి సామాన్యజనాల్ని తిడితున్నానని నిర్థారణలేల? నా బ్లాగులో నేను పోస్టురాశాను అడిగినవాళ్ళకు జవాబులు ఇస్తున్నాను, ఇందులో అవసరానవసరాలు నాకు గానీ మీకెందుకు?

వీర said...

మహేష్, నాకు టపాదొరికింది. మీ మిత్రుడు Mr. MBS ప్రసాద్, Mr. జంపాల చౌదరి అడిగిన వాటికి ఏ సమాధానాలు ఇవ్వలేదు. ఈక్రింది టపాని చూసేది. వారు ఇతను రాసినది ఖండించారు. సి.బి.రావ్ కూడా ఇన్నయ ని సమవేసం వివరాలు అడిగి మీబ్లాగులో రాశారు. దానికి ఇతని నుంచి ఏవిధమైన సమాధానం లేదు. చదవండి మీకే అర్థమౌతుంది.
http://navatarangam.com/2010/05/in-memory-of-veturi/

Kathi Mahesh Kumar said...

@వీర: ఓహో దీని గురించా! నేను దాని గురించి నా బ్లాగులో ఒక వ్యాఖ్య రాశాను. In spite of the correctness of the facts, I liked the idea. That's why I am proposing అని. ఇక నరేష్ నున్నా గారి తరఫున వకాల్తా నేను పుచ్చుకోలేను లెండి. దానికి ఆయనే సరి.

కాకపోతే అటువంటివారు పనిచేసే పేపర్ లో రాసిన వారి గురించి చర్చలు అనవసరం అనే మీ ఆలోచనతో నేను ఏకీభవించలేను. That is not an acceptable proposition at all.

Kathi Mahesh Kumar said...

@రవితేజ: Reservation in present form is appropriated by most. That's why it stays on.If a day comes when most people feel it as punishment, it will be gone. We are a parliamentary democracy !

krishna said...

@ మహేష్ గారు,
మనోడు అని మన దేశస్తుల పట్ల, మన తెలుగువారు పట్ల, మన ఊరి వారి పట్ల, మన పక్కింటివారి పట్లా, మన ఇంటివారి పట్లా పక్షపాతం చూపించడం మానవనైజం కదా! అలాగే జాతులు, మతాలు...
కులమేంటి, మతం ఏమిటీ అని లౌకిక దేశం లో ఇలాగే వుంటుంది.
నాకు తెలిసి అయితే మనిషి, ప్రతి మనిషినీ తన మానవజాతికి చెందిన వాడని పక్షపాతం చూపాలి..
లేదా తన గురించి తప్ప ఇంకెవరి గురించి పట్టించుకోకూడదు అన్నంత స్వార్ధపరుడైనా కావాలి.
తల్లి తండ్రి, పిల్లా పెళ్లాం , దోస్తూ దుష్మనూ అంతా మాయ..
ఏక్‌నిరంజన్...

Ravitheja said...

parliamentary wont work for democracy it works for Votes only.
That is the main cause why still discrimination is there even after 60 years.దేవుడా నన్ను ఎందుకు ఈకులం లో పుట్టిన్చావు అని ఎ ఒక్క (OC) విద్యార్ది బాధపడని కౌన్సిలింగ్ ఎ దేశం లో జరిగిందా ?(గత అరవయి సంవస్తరాలలో )
కేవలం కులం కారణగా మంచి విద్య అర్హతలు ఉంది కుడా ఉన్నత చదువులకు దూరం ఇన పేద (కర్మ కాలి అగ్ర వర్ణ ) విద్యార్దులు ఎంత మందో...?

చదువులో అవసరం లేదు
కనీసం అవకాశంలో సమానత్వం కోసం పోరాడినా దక్కక
రిజర్వేషన్లుతో దెబ్బతిన్న , ఇంకా దెబ్బ తింటున్న అగ్రవర్ణ విద్యర్డులదా తప్పు .

అటు GOVT లో ఉద్యోగాలు రాక పోతే తెలిసిన వాళ్ళ అండ దండలతో నో , రెఫెరెన్సు లతోనో నౌకరి సంపాదించుకోవడం తప్పా ?

అవును అది దొడ్డి దారే ఎం చెయ్యలి ?
govt రిజర్వేషన్స్ తో "రహ దారి ని " మూసేస్తే ఇంకా బతక వద్దా?
మూయండి అన్ని దారులు మూయండి ప్రైవేటులో కుడా రిజర్వేషన్స్ పెట్టండి ...........

krishna said...

typo corrected..

కులమేంటి మతమేంటి అని అడిగే మన లౌకిక దేశంలో లౌకికత్వం, సర్వ జాతి సౌభ్రాతృత్వం ..నేతి బీరకాయలో నేతి చందం .. ఇలాగే వుంటుంది.

Anonymous said...

Mahesh garu, I want you to discuss about the Dalits who have 2-3 jobs (govt) per family and still uses reservations for their children. If you say that reservations are mainly based on caste and we must not combine economic aspects with it, then when will the underdeveloped will come up? Don't you think its a pure upper caste mentality of developed dalits? And How many of dalits those r having good jobs will be ready to claim them as open category in future?

Kathi Mahesh Kumar said...

@కృష్ణ చైతన్య: ఎంత మంది దళిత కుటుంబాల్లో రెండు మూడు ఉద్యోగాలున్నాయి? వాళ్ళ శాతమెంత? అదే అంకెలు అగ్రకులాలకు తియ్యండి. అలా ఎన్ని తరాలు వాళ్ళ ఇళ్ళలో ఉద్యోగాలున్నాయో లెక్క కట్టండి? Will you do that? Shall we calculate this way and compensate Dalits? Just think about it !

Shedding reservation though slow, but is happening. 3rd generation are generously giving up reservation. I call it generous simply because, other side is not demonstrating that magnanimity. Just look at so much hue and cry happening on reservations.

ఆర్థిక వెనుకబాటుతనానికి చెయ్యాల్సిన కార్యక్రమాలు livelihood కి సంబంధించినవి. రిజర్వేషన్ల purpose వేరు. Both are happening. Don't mix these two and argue.

@రవితేజ: You have no argument to make. Your emotional rhetoric is no answer at all.

@కృష్ణ: Good. We have already legitimized ఉత్తరం- దక్షిణం, add కులం to that more openly. Let this nation have true గృహయుద్దం.

Apparao said...

మహేష్ గారు మీకు కొన్ని శుభవార్తలు
1 . భారత దేశం లోని ప్రతి ఒక్క దళితుడూ ధనవంతుడు అయ్యేవరకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసాయట
2 . మాయావతి ప్రభుత్వం లో 98% దళితులకి రిజర్వేషన్ కల్పిస్తారట. మాయావతి విగ్రహాలు కట్టే contract ను దళితులకే ఇస్తారట
3 . వేల సంవత్సరాలు, వందల తరాలు అప్రకటిత రిజర్వేషన్లు, అభివృద్ధి ఫలాలు అప్పనంగా దండుకున్న అగ్రకులాల వారిని భారతదేశం నుండి భాహిస్కరిస్తారుట
4 . ప్రవైటు రంగం లో నే కాదు పచారీ కొట్లో పొట్లాలు కట్టే ఉద్యోగానికి కూడా రిజర్వేషన్లు పెడతారట
ఈ క్రింది లైను కో అన్ని క్షుణ్ణం గా వ్రాసారు
http://google.co.in/

ఒకప్పుడు మీరు ఇచ్చిన లింకే ఇది,

మీకోసం ఇంకో లింకు
http://targetstudy.com/articles/47/impact-of-reservation-on-the-quality-of-education.html

మరొక లింకు
http://anvvapparao.blogspot.com/2010/02/blog-post_09.html

అరవై ఏళ్ళు గా మాగొప్ప అభివృద్ధి సాధించి నందుకు శుభాకాంక్షలు

Krshychait said...

As u said correctly, Our country is still in a adoloscent stage after attaining independence. Though we are democratic we are still in feudalistic society as it was the case since our civilisation started. The matters of caste, creed and religion form a common bond for many of us...Ours is a society which would celebrate a person on the basis of his region or caste...

Tell me what has become of Ambedkar, a great national icon post-independence? He has almost become a symbol for Dalits though it is doubtful if any of his followers follow his ideology and anyone who debates of his ideology is treated as a Upper-Caste bigot.

Likewise, there are many in the society who have become great icons because of their achievements... But it has become a sad commentary of India that we often debate a person's credentials due to his caste....

Reading the comments above make a depressed reading as it makes me feel that commenting on a post makes me either pro or ante- reservations.. It is a pity that an educated circle like this can't have a proper debate...Let us shed our personal egos and debate the issue which has been highlighted....

Apparao said...

krshany గారు

ఈ బ్లాగ్ రచయిత , "రిజర్వేషన్లు ఉండాలా వద్దా?" ఒక వేల ఉండాలంటే ఏ ఏ విషయాలలో ఉండాలి ఎంతవరకు ఉండాలి ? " అని అడిగి ఉంటె మీరు అన్నట్లు ఇది చర్చనీయాంశం అయి ఉండేది , దాని మీద మా అభిప్రాయాలు చెప్పేవాళ్ళం , కాని ఈ బ్లాగ్ రచయిత అగ్రవర్ణాలు దూషిస్తూ వారి అభివృద్దికి అగ్రవర్ణాలు ఆటంకం అని ఆరోపించడం వల్ల , ఈ బ్లాగ్ రచయిత వివేకాన్ని కోల్పోవడం వల్ల అందరూ ఇలా వాక్యానించారు.
కనుక మహేష్ గారు వ్రాసిన దానిని మరొకసారి చదివి దానిలో విలువలు ఉన్నాయోలేదో ఆలోచించండి దయచేసి.

Kathi Mahesh Kumar said...

@అప్పారావు శాస్త్రి: మళ్ళీ టపాని బాగా చదువుకోండి.

నేనన్నది రిజర్వేషన్లు దొడ్డిదారి అనే అగ్రకులాల వారిని భావజాలాన్ని "అగ్రకుల మాలిన్యమా" అని.

కులజాఢ్యం ముఖ్యంగా అగ్రకుల ఆధిపత్యభావజాలం అభివృద్ధికి ఆటంకం అనేది నేను కొత్తగా చేసిన అరోపణా కాదు. అది సత్యదూరం అంతకన్నా కాదు. అదే నేను ఉటంకించిన వ్యాసంలో నిరూపించబడింది. దానికి నేను వివేకాన్ని కోల్పోయాననో లేక నా వివేకరహిత ఆరోపణ వల్ల మీరు వివేచనో కోల్పోయారో అని చెప్పబూనడం సమర్థించ దగిన విషయం కాదు.

Anonymous said...

మహెష్ గారు మీరు మీ బ్లాగ్ లలొ మీకు నచిన విదంగా మీ అభిప్రాయలను వ్రాస్తారు కాని ఎవరైనా కామెంట్ చెస్తే ఎందుకు మీరు వితండంగా వాదిస్తారొ అర్థం కావడం లేదు మీరు మీ బ్లాగ్ లొ మీకు నచిన విదంగ రాసుకొవచు కాని ఇతరులు అడిగినపుడు కాస్త reasonable గా సమాధానం చెప్పడం మీ భాధ్యత అంతే కాని ఎవరికి మీ పై వ్యక్తిగతంగా కొపం లేదని గ్రహించండి నెను బ్లాగులకి కొత్త కాని ఈ మద్య చాలా బ్లాగ్లలొ మిమ్ములని టార్గెట్ చెసుకొనే comments వస్తున్నాయి అందుకని ఇలా రాయవలసి వస్తుంది నెను మీకంటె వయసులొకాని అనుభవం లొ కాని చాల చిన్న వాన్ని ఎమైనా తప్పుగా రాస్తె క్షమించండి

Krshychait said...

Apparao garu, daya chesi, Mahesh garu post chesina link gurinchi matladandi...

Manam avesham tho kaaka kasstha alochana tho munduku vasthe mana samajanni marchukovachchu.. Manam mana kosam oka arogyakaramaina samajanni korukovali...anyatha bhavinchaddandi

Kathi Mahesh Kumar said...

@కృపాల్: నా వాదనను నేను సమర్ధించుకోవడం వితండవాదం ఎలా అవుతుంది? Does being reasonable means agreeing with what people unreasonably propose?

Anonymous said...

reasonable గా మాట్లడటం అంటె ఇతరులతొ ఎఖీభవింఛమని కాదు మీరు నమ్మిన సిద్దంతాలని విషయాలని మిగిలినవారికి అర్తమయ్యెలా కన్విన్సింగ్ గా చెప్పండి అంతే కాని నా బ్లాగ్ నా ఇష్తం అనడం కరక్ట్ కాదు కదా

Kathi Mahesh Kumar said...

@కృపాల్: చర్చించేంత వరకే చర్చ. అవమానిస్తేనో లేదా నేనేం రాయాలో ఎలా రాయాలో నియంత్రిస్తేనో నా బ్లాగు నుంచీ గెట్ లాస్ట్ అనే హక్కు నాకు ఎప్పుడూ ఉంది. I reserve that right here.

Apparao said...

మీ దళిత ఉద్యమం లో భాగంగా అగ్రకులాలని దూషించడం కూడా అత్యంత హేయం. ఖండనీయం. ఉద్యమానికి అవమానం.

Anonymous said...

మీరు ఎమి రాయలో ఎవరు నియంత్రించరు కాని మీరు రాసిన విషయాల వలన భాద పడ్డవాల్లు మీతో argue చెస్తారు వారికి సమధానం చెప్పల్సిన భాధ్యత మీకు ఉంది కదా నెను వారితొ argue చెయ్యను అంటె మీరు నమ్మిన సిద్దాంతాన్ని మీరు సరైన పద్దతిలొ చెప్పడం లెదు అనే కదా

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

>>మీ దళిత ఉద్యమం లో భాగంగా అగ్రకులాలని దూషించడం కూడా అత్యంత హేయం. ఖండనీయం. ఉద్యమానికి అవమానం.

I totally agree with this. పై కామెంటు వెనక ఉన్న బాధని తప్పకుండా అందరూ అర్థం చేసుకోవాలి. ఒకవేళ మిగతా వాదనలో ఏమైనా బలహీనతలున్నా, వాటిని అడ్డు పెట్టుకొని అంతర్లీనంగా ఉన్న ఆక్రోశాన్ని నిర్ల్యక్ష్యం చెయ్యకూడదు.

అదే సమయంలో, మెజారిటీ జాతులని అత్యంత హీనంగా అతి దారుణంగా చిత్రీకరించే గ్రంధాలనూ, బూజుపట్టిన భావాలనూ, పవిత్రమైనవి అని నెత్తినపెట్టుకోవడం కూడా మిగిలిన వారి దృష్టిలో "అత్యంత హేయం ఖండనీయం అవమానకరం " అయ్యుండొచ్చుకదా!!

Kathi Mahesh Kumar said...

@కృపాల్: సహేతుకమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. సమాధానం లేకపోతే నా దగ్గర లేదని చెప్పడానికి సందేహించను. నా దగ్గర సమాధానం లేదన్నంత మాత్రానా నా అభిప్రాయాలు మార్చుకోవాలని వాళ్ళు కోరుకోవడంలోనూ అర్థం లేదు. ఎందుకంటే నేను ఎవర్నీ రిఫార్మ్ చెయ్యడానికి రాయడం లేదు.

నేను నమ్మినదాన్ని ఇతరులతో నమ్మించడం నా పని కాదు. నా బ్లాగు ఉద్దేశం అది కాదు. It is just to express what I feel and think.

ఇక్కడ కొచ్చి అనవసరంగా మనోభావాలు గాయపరుచుకోవడం వాళ్ళ problem నాది కాదు. They are free to express their angst else where(they actually do), I have no issues with it. But, I don't encourage hooliganism in my blog. Because I like my space. I respect it.So, I ask them to get lost.

@వీకెండ్ పొలిటీషియన్: I also agree with it in principle.

కాకపోతే ఒక మాట, చారిత్రాత్మకంగా దళితుల్ని sub-humans గా treat చేసిన అగ్రకులాలు ఇప్పుడు దళిత సృహ ఉదయించి ధిక్కారానికి పూనుకునేసరికీ శాంతి మంత్రం జపిస్తే, శాంతికపోతాలు ఎగురవేసి మిఠాయిలు పంచే స్థితికి దళిత ఉధ్యమం ఇంకా రాలేదు. ధిక్కారం ఇప్పుడే మొదలయ్యింది, పోరాటం చాలా ఉంది. ఈ క్రమంలో చారిత్రాత్మక తప్పిదాల్ని లెక్కకట్టడం, బాధ్యుల్ని చెయ్యడం, బాధ్యత తీసుకోమనడం ఒక అవసరం. దాన్ని ధూషణగా భావిస్తే, వారి భావజాల ఖండనను నిందగా భావిస్తే దళిత ఉధ్యమం చెయ్యగలిగేది ఏమీ ఉండదు.

ఈ శాంతి మంత్రం కూడా ఒక లోపాయకారి కుట్రగానే ప్రస్తుతం దళిత ఉధ్యమం భావిస్తోంది. When upper castes come clean and share socio-political and economic spaces that are deserved by Dalits, the intensity might neutralize. But not now and not at this point in time.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Mahesh,

I appreciate your clarification. I respect the ideological position taken by you though mine would be a little different.

మైత్రేయి said...

అసలు ఉటంకించిన వ్యాసం లో నిజం ఎంతో కృష్ణగారు తప్ప ఎవరూ చర్చించక పోవటం నాకు ఆశ్చర్యంగా ఉంది. కంపెనీ ఓనర్ ఒక కులం వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలనుకొంటే అది జరుగుతుంది కానీ ఫారెన్ వాళ్ళు ఓన్ చేస్తున్న కంపెనీల్లో ఓనర్ తో నిమిత్తం లేకుండా ఉద్యోగులు అలా చెయ్యటం ఎలా సాధ్యం? అసలు M N C లలో రిక్రూట్ మెంట్ అంత అల్లాటప్పా గా జరగదు. ఇలాంటివి జరిగితే కంపెనీలు సీరియస్ గా తీసుకొని ఉద్యోగం లోంచి పీకేస్తారు. అప్పుడు కుల సేవ సంగతి అలా ఉంచి మొదలుకు మోసం వస్తుంది. ఎన్ని క్వాలిఫైడ్ రెస్యూమేలలో కులంకారణంగా ఎన్ని రిజెక్ట్ చేసారో గణాంకాలు ఉన్నాయా? ఇవి ఏఏ కంపెనీల్లో సేకరించిన వివరాలో తెలుసా? ఇవన్నీ రాజకీయ నాయకులు చెప్పే బయాస్డ్ మాటల్లా మాత్రమే నాకు అనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమ నేపద్యంలో ఇలాంటివి చాలా చిత్రమైన లెక్కలు చూస్తునాము.

Kathi Mahesh Kumar said...

@మైత్రేయి: మీ సందేహాల్లో చాలా వరకూ ఆరోపణలే ఉన్నాయి. Understandable!
Please check the following link as well.
http://business.outlookindia.com/article.aspx?102075

Pradeep said...

Mahesh,
I read all your links and read all through the comments. Lets hit the bulls eye.

In MNCs / Tata's / Private Corporates do the same survey on based on their Educational background ... [I mean from their basics from 10th standard and who is consistently performing] and work experiences. Just dont count caste. Now come with results ... might be 5% of total workforce will be under performance [which are recruited by using CASTE card / other RECOMMENDATIONS ] and those employees also cannot sustain with the competition. The companies also cannot sustain the competition they are facing, if they have an Engineer with 40% Ability designed a mission critical piece that run / ruin the company. That's why corporate India goes for Merit.

Any Takers ....?

Kathi Mahesh Kumar said...

@Pradeep: I can understand your "meritocracy myth".

Let me ask you a simple question,when societal resources are not distributed exclusively or primarily on the basis of individual merit how can you even think of speaking about merit now?

When education, opportunities, access are never based on merit,how meaningful and relavant is to talk about merit now?

Whats exactly is merit except but a cumulative advantage an individual got from society ! The same is being sought on the name of reservation.

Merit is not just marks. It also includes enabling environment and challenges one faces to get them. Can merit exist without it?

One person runs 100 meter dash with adequate training and other individual is running the same race with empty stomach. Don't you know the difference?

And for your kind information there are more management quota and donation seats than reserved seats. Doesn't your merit logic apply there? Caste based reservations also have a cut off point. To do post graduation minimum is 50% and for open category is 55%. Do you really think 5% matters? Do you really understand the teaching - learning and evaluation methodology that determines so called merit?

Pradeep said...

Mahesh,

Q: when societal resources are not distributed exclusively or primarily on the basis of individual merit how can you even think of speaking about merit now?
A: Then you should start your own PWG / Communists group to Distribute Societal Resources to all.

Q: When education, opportunities, access are never based on merit,how meaningful and relavant is to talk about merit now?
A: Thats exactly my point. "education, opportunities, access are never based on merit" -- Thats when an OC candidate will become more hardworker and will be on top of line. -- refer to free lunch and own lunch comment I made on other post.


Q: Merit is not just marks. It also includes enabling environment and challenges one faces to get them. Can merit exist without it?
A: Try to Change the entire system that gives admissions & Recruitment policies based on Marks. The same merit limit is changed based Caste. Thats my point.

Q: One person runs 100 meter dash with adequate training and other individual is running the same race with empty stomach. Don't you know the difference?
A: Exactly I know the difference. That why some candidates OCs will run all 100m and some will start at 75m and some other will start at 50m for the last 60 years. How many more years you want to run from that point? Those people starting at 75 / 50 also could not meet the OCs, thats why they cant make it to MNCs.
Lets take life as Series of 100 m dash. One OC candidate starts at very beginning and Reserved candidate has been running all his Educational Sprints for only 25m. You are already ahead of race and why do you want start ahead in Job Race.
Lets say you got a Job in PRIVILEGED race, why do you need PRIVILEGED race in Promotions? Can you please answer this Question to the Point.

Q:And for your kind information there are more management quota and donation seats than reserved seats, Doesn't your merit logic apply there?
A: for Education
I dont agree with this. Lets take a Govt Medical College / Engg College.
Total Seats : 100
Mgmt Quota : 0% = 0
SC / ST : 27% = 27
BC / OBC : 25% = 23%
Here 50 - 50
Prvt College
Total Seats : 100
Mgmt Quota : 10% = 10
Remaining : 90% as per Quotas.
Here some in balance - but they are getting money from 10% to run the show. If they afford education in Mgmt Quota they need not struggle in daily life for Bread & Butter.

For MNCs / Private Companies: If any Company owned by group of people thats their business how to run the Business with in limits imposed by Statutory bodies. If a person has Merit and can help the business then any business man wont loose that candidate for the cost of same caste lazy / unskilled people. If he is doing that he is serving his community at his own money and business risk.

Q: Caste based reservations also have a cut off point. To do post graduation minimum is 50% and for open category is 55%. Do you really think 5% matters?
A: You are talking of Cutoff marks but not actual aspirants competition. Do you have statistics
that Average % of OCs and Reserved candidates. The examples of I mentioned on your other post I am the person has seen all that process.

Q: Do you really understand the teaching - learning and evaluation methodology that determines so called merit?
A: I do. thats not about Reservations. Thats methodology of Education. we are deviating the point here.

Pradeep said...

Mahesh .. any response for me for my question ...

Q: One person runs 100 meter dash with adequate training and other individual is running the same race with empty stomach. Don't you know the difference?
A: Exactly I know the difference. That why some candidates OCs will run all 100m and some will start at 75m and some other will start at 50m for the last 60 years. How many more years you want to run from that point? Those people starting at 75 / 50 also could not meet the OCs, thats why they cant make it to MNCs.
Lets take life as Series of 100 m dash. One OC candidate starts at very beginning and Reserved candidate has been running all his Educational Sprints for only 25m. You are already ahead of race and why do you want start ahead in Job Race.
Lets say you got a Job in PRIVILEGED race, why do you need PRIVILEGED race in Promotions? Can you please answer this Question to the Point.

Unknown said...

Hi Mahesh,

I have read your blogs. They are good and informative but always in one point of view.

I cannot tell you what to write or how to think, But there are many positive things you are ignoring or not writing.

Coming to reservations in private sectors, I have some opinions and would like share.

Lets start from the Independence.

In 1947, there was social injustice. It might have been there from centuries, But the point is its there and it needs to eliminated.

(The idea is not to take revenge on others who did the injustice.)

Constitution provided both following to eliminate the social injustice.

1. Reservations is way for Economic uplift. Since people (some) would respect rich. There will not be any dependency.

2. SC/ST atrocity Act can stop people from doing more discrimination.

First lets talk about reservations:

Dr. B.R. Ambedkar estimated this can be achieved in 15 years and gave an option as it can extended further if its needed.

Has the SC/ST people have developed economically and are they not being discriminated.

The goal has not been achieved completely but the situation is improved. If there is no progress at all, then we should take another approach.

The situation is improved. We have president and chief ministers from these castes. please do not question as we don't have any prime minister from Dalits. the day will come.

The people who got benefited by the reservations are repeatedly getting benefited and the people who did not get benefited are further not getting the benefits.

The people who got repeatedly benefited are not giving a chance to people who never benefited but showing them as a reason to continue the reservations.

These people who get benefited should be disqualified for further reservations. this can be helpful for the people who never got benefited.

If the ratios are not proportionate, then some of this reservations can be given for a different cause.

Coming to the second point:

Social justice cannot be achieved without the change in people who are causing it. You can not change some one, by putting sword on their neck. It can only be achieved by education.

As many mentioned this SC/ST atrocity Act itself causing more discrimination by people in the name of self defense.

These issues should be addressed first, before providing reservations in private sector.

-Manoj