Wednesday, September 22, 2010

మళ్ళీ... మరో బలి

ఈ సారి కలకత్తా అమ్మాయిని ముంబై కుర్రాడు హైదరాబాద్ లో ప్రేమ పేరుతో బేస్ బాల్ బ్యాట్ తో మోది హతమార్చాడు.
మహిళలపై హింస విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్, హైదరాబాద్ నెంబర్ టూ అంటూ పత్రికలు గర్వంగా కాలరెత్తేసాయి.
సంబరాలు జరుపుకుందామా? సిగ్గుతో తల వంచుకుందామా? మార్పుకోసం ఏమైనా చేద్దామా? అనేవి ప్రశ్నలు.
ఈ ప్రశ్నకు సాధానాలు వెతుకుతూ ఒక మీటింగ్ కు వెళితే...అక్కడ ఆ వయసులో లేని కొందరు వయస్కులు,

మోరల్ క్లాసులు కావాలన్నారు.
స్పిరిట్యువాలిటీ కాపాడుతుందన్నారు.
అర్జంటుగా యువతని పాశ్చాత్యధోరణి నుంచీ రక్షించాలన్నారు.
స్నేహం, ఆకర్షణ, ప్రేమ మానసిక దౌర్బల్యాలని తేల్చేశారు.
నిజమా! నిజమా! ఇవే సమాధానాలా?

***

15 comments:

ఆ.సౌమ్య said...

మీకు లేటెస్ట్ న్యూస్ తెలిసినట్టు లేదు. నిన్న వైజాగ్ లో ఇంటర్నెట్ కెఫే లో ఒకమ్మాయికి మెడపై కత్తితో కోసి పారిపోయాడొక పౌరుడు. ఆ అమ్మాయి ICU లో ఉంది, కోలుకుంటున్నాదని వార్త.

ఈ అబ్బాయిల తల్లితండ్రులు ఏం చేస్తున్నారో నాకర్థం కావట్లేదు.

Praveen Mandangi said...

మా తమ్ముడు వైజాగ్ గీతం కాలేజిలో ఇంజినీరింగ్ చదివే రోజుల్లో ఒకమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. చాలా రోజులపాటు ఆ అమ్మాయి వెంటపడ్డాడు. ఆ అమ్మాయి పోలీస్ కంప్లెయింట్ ఇస్తానని మా ఇంటికి ఫోన్ చేసింది. అక్కడ ఓ సినిమా స్టోరీ లాంటిది జరిగింది. ఆ అమ్మాయివాళ్ల ఇంటికి వెళ్లి అమ్మాయి తండ్రిని ఎదిరించి అమ్మాయిని తీసుకొద్దాం అని తన ఫ్రెండ్స్ తో అన్నాడు. ఇది సినిమా కాదురా, రియల్ లైఫ్. అమ్మాయే ఒప్పుకోకపోతే ఆమె తండ్రిని ఎదిరించి ఏమి లాభం? అని అతని ఫ్రెండ్స్ చెప్పారు. అయినా అర్థం చేసుకోలేదు. సినిమాలలో చూస్తుంటాం కదా. హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి హీరోయిన్ తండ్రిని తిట్టి నీ కూతురి మెడలో తాళి కడతానని చాలెంజ్ చేస్తాడు. నిజ జీవితంలో అలాగే చేద్దామనుకున్నాడు. అతని ఆలోచనని అతని ఫ్రెండ్స్ ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. కొన్ని రోజులపాటు ఏడ్చాడు. హీరో హీరోయిన్ దగ్గర పోకిరి వేషాలు వెయ్యడమే హీరోయిజంగా చూపించే సినిమాలు చూసే ఈ యాసిడ్ దాడులు లాంటివి జరుగుతున్నాయి.

Unknown said...

boys maatrame kaadu girls kuda haddu meerakunda vunte ilaantivi jaragakunda vuntai. hyderabad vishayame teesukondi, atanu rammante eevida vellipovadamena, aa dress chuste telusutundi aa ammai akkadiki anta dooram ninchi vellinda leka aa intlone vuntunda ani. tappu atanidi maatrame kaadu. aa ammaidi kuda, tallitandrulu entho kashtapadi boledu kharchu chesi veellani chaduvukosam pampiste, ida veellu chese ghana kaaryam. ilaanti panlu cheste chivariki ilaane vuntundi mari. talli tandrulu kuda enthasepu pillalaki kaavalasinata money icheste saripothundani anukuntaru kani vaalla pravartana gurinchi pattinchukoru. vaallato gadapataniki veellaki time saripodu kaadhu time dorakadu. eppatiki telusukuntaaro emo.

Kathi Mahesh Kumar said...

@విమర్శకుడు: Should we judge this incident by their psychological state or our ethical assumptions?

chanukya said...

నేను విమర్శకుడితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

మోరల్ క్లాసులు చెబితే మోరల్ విలువలు పెరిగిపోతాయా? పిల్లలు మనల్ని చూసి మనం నేర్పించే వాటిని చూసి మోరల్స్ గ్రహిస్తారు.

మన విలువల్ని కొత్త తరం మీద రుద్ది వాళ్ళని కంఫ్యుజన్ కి గురిచేయకుండా, వాళ్ళ మోరల్ స్తాండర్డ్స్ వాళ్ళే పెంచుకునే మంచి పౌరులుగా పెంచడమే పేరెంట్స్ చెయ్య గలిగిన పని.

సుజాత said...

అబ్బాయిల తల్లిదండ్రుల సంగతి ఒప్పుకుంటా! అంతకంటే ముందు అమ్మాయిల తల్లిదండ్రులూ, గార్డియన్లూ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని ఉంది నాకు!


విపరీతమైన డబ్బు,విచ్చలవిడి స్వేచ్ఛ..ఈ రెండూ చేతిలో ఉన్న యువత వాటి విలువను తెలుసుకోలేకపోయినపుడు ఇలాంటి స్నేహాలు విషాదాంతాలకే దారి తీస్తాయి. ప్రాణాలు తీయడం ఘోరమైన తప్పే! ఆ తప్పుకు పరిస్థితులు ఎలా దారి తీశాయో ఒక్కసారి గమనించండి!

ప్రేమను టైమ్‌పాస్ గా తీసుకోవడం ఒక ఫాషన్ అయినపుడు మనం ఈ సానుభూతి ఎవరివైపూ చూపించకుండా ఊరుకుంటే మంచిది. ఇక్కడ ఎవరూ ఏమీ తెలీకుండా చేయడం లేదు. అందరికీ అన్నీ తెలిసే పూర్తి స్పృహతోనే చేస్తున్నారు.

వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో మల్టిపుల్ ప్రేమలని సమర్థించడం ఎవరిని వాళ్ళు మోసం చేసుకోడమే! ఈ విషయం ఇప్పటి యువత ఎప్పుడు తెల్సుకుంటుందో!

సంబరాలూ చేసుకోనక్కర్లేదు!సిగ్గుతో తల దించుకోవాల్సిందే! నైతిక విలువలంటే ఏమిటో తెలీకుండా పిల్లల్ని పెంచుతున్నందుకు!

మీటింగ్ కి ఆ వయసు వాళ్ళనే పిల్చి ఉంటే "అవును, తప్పేముంది? ఎంతమందితో కావాలంటే అంతమందితో తిరుగుతాం? మా స్వేచ్ఛను కాదనడానికి ఎవరికీ హక్కులేదు"అనేవాళ్ళేమో! అదేనా మనక్కావలవసిన ఐడియల్ సమాధానం!

ఆ వయస్కులు మాత్రం ఇన్ని తరుణోపాయాలు చెప్పిన వాళ్ళు తల్లిదండ్రుల పాత్ర ఏమిటో,ఎలా ఉండాలో చెప్పలేదా పాపం?

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

అసలైనా ఈ వయొలెంట్ ప్రేమలూ, పవిత్ర ప్రేమలూ మనుషులకి నూరిపోసే సినిమాలూ కధలూ ఎదురైనప్పుడు, పిల్లలతో అందులోని లోటుపాట్లని చర్చిస్తే కొంత వరకు వాటి దుష్ప్రభావాన్ని నిలువరించొచ్చు అనిపిస్తుంది.

ఎవడో ప్రేమించి మోసం చేశాడని హడావిడి చేసే మహిళా సంఘాలు ముందు అది పెద్ద విషయమే కాదనే చైతన్యాన్ని మహిళల్లో కలిగించే ప్రయత్నం చెయ్యాలిగానీ, టీవీల ముందు ఆ అమ్మయిలు తమ జీవితమంతా ఏదొ పెద్ద నాశన మైపోయినట్టు, పెళ్ళి మాత్రమే ఒక స్త్రీ కి జీవిత పరమావధి అన్నట్టు సీను క్రియేట్ చెయ్యడం చాలా బాధాకరం.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

>> మీటింగ్ కి ఆ వయసు వాళ్ళనే పిల్చి ఉంటే "అవును, తప్పేముంది? ఎంతమందితో కావాలంటే అంతమందితో తిరుగుతాం? మా స్వేచ్ఛను కాదనడానికి ఎవరికీ హక్కులేదు"అనేవాళ్ళేమో!

చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. హ్మ్మ్.. అలా అని వుండేవారే కానీ, తాము కోరుకున్నది జరగనప్పుడు చచ్చిపోవడం లేదా చంపడం లాంటివి ఎందుకు జరుగుతున్నాయో ఆ వయసు పిల్లలనుండైతే కొంతవరకూ మనకు విలువైన సమాచారం లభించే అవకాశం కూడా వుండేదేమో!

Kathi Mahesh Kumar said...

@సుజాత: I feel...Only solution is by respecting the emotions like friendship, attraction and love among youngsters. By respecting it, we can entitle them to make choices. There by empowering them to make responsible choices.

If we only condemn them and deny... them their emotions, they will never learn to deal with them responsibly. If we moral police them, it will be met with their passive and active resistance. Deviance such as violence is a collective failure of society. Let's correct it by correcting ourselves first, not the young generation

సుజాత said...

Im not talking about moral policing them all of a sudden, when they come to teenage! Im talking about the moral values that should be a part of their education.

Education given by the parents...I'm talking about!

Let's correct it by correcting ourselves first, not the young generation.......

Thats what I said!

Lets correct ourselves to the extent of having moral values and teach them to the younger generation

భావన said...

"There by empowering them to make responsible choices."
"నైతిక విలువలంటే ఏమిటో తెలీకుండా పిల్లల్ని పెంచుతున్నందుకు!"

మహేష్, సుజాత పైన చెప్పిన రెండూ ఒకటేగా. :-)

పిల్లలు ప్రేమ రాహిత్యం తో ఆడ మొగ కూడా అలాంటీ పిచ్చి చాయస్ లకు దారి తీసే అవకాశం కల్పించింది మాత్రం చాలా వరకు తల్లి తండ్రులే అనేది ఖచ్చితం గా ఒప్పుకోవాలి.

Praveen Mandangi said...

వీకెండ్ పొలిటిషియన్ గారు. మీరు చెప్పినది నిజమే. ప్రేమ పేరుతో మోసం జరిగినప్పుడు మహిళా సంఘాలు అనవసరమైన పబ్లిసిటీ ఇస్తున్నాయి. ఒకవేళ పెళ్ళే పరమార్థం అనుకున్నా మోసగాడిని పెళ్లి చేసుకోవాలా అనే డౌట్ రాదా వాళ్లకి? యాసిడ్ దాడులు లాంటివి సినిమాలు చూసే జరుగుతున్నాయి. బస్ స్టాప్ లో కనిపించిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం, అమ్మాయి ఒప్పుకోకపోతే ఈవ్ టీజింగ్ చెయ్యడం లాంటివి ఉన్న సినిమాలు యూత్ ని దృష్టిలో పెట్టుకునే తీస్తారు. ట్రైన్ లో పరిచయమైన వ్యక్తిని ట్రైన్ దిగిన కొన్ని గంటల తరువాత లేదా కొన్ని రోజుల తరువాత మరచిపోతాం. ట్రైన్ లో పరిచయమైన హీరోయిన్ ని హీరో ప్రేమించి అడ్రెస్ వెతికి పెళ్లి చేసుకోవడం సినిమాలలోనే సాధ్యం కానీ నిజ జీవితంలో సాధ్యం కాదు. ప్రేమే జీవితంగా, అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేసి తనని ప్రేమించేలా చెయ్యడమే హీరోయిజంగా చూపించే సినిమాలు ఉన్నప్పుడు యాసిడ్ దాడులు జరగనే జరుగుతాయి.

Unknown said...

Before leaving my comment, sorry for posting my comment without going through previous posts.

I intend to mention only a few points, in addition to any other worthy aspect/s we may consider.

In our society, a 'lady' is seen as an inferior object. This notion is perpetuated by social institutions too. Almost every major religion of the world sanctioned inferior status to a lady. Indeed, both the public and private spaces provides us ample evidences in this regard. Such instances certainly forms part of our sub-conscious levels and certainly makes us to look at the other gender with inferiority, with varying degrees.

I personally feel, reform should begin from multiple directions. Once such possibility is family, the primary object, which constructs the social behavior and leaves individual/s in society. Of course, same time, I am aware that the influence of society too falls invariably on family/ies too. So, under such circumstances, State should initiate stringent steps to curtails such practices. In-addition to such stringent steps, the State should try to establish new civic sense, by initiating various steps, like making school syllabus gender friendly, without any bias towards female, and should try to construct a sense of dignity of honour towards co-humans. Critical perspectives on our history, where women was presented as a degraded object, which is not right should be incorporated in our educational curriculum. Concerned organizations/individuals too should also indulge in propagation of gender sensitivity. Our society should be made to develop critical outlook, towards historical mistakes, like presenting a degraded status to co-humans like - women and other disadvantaged sections, and cultivate a sense of conscious respect to them.

Censor boards at national level and State levels too should be strengthened, by not appointing or nominating only film side related persons on the boards.

The relevance of 'Emotional Intelligence' should be propagated. In the sense - how to control ones emotional senses. Every person can try to know little bit of psychology. If conscious attempts are put further, there can be enormous changes, which can prevent instances like this. Under such circumstances, I feel, one will certainly development a harmonious outlook towards the 'other', including the other co-gender (male/female), in the society.

Shankar said...

thokkalo post ammayilaki cheema kuttuna kuda tappu abbayilade antaru janalu
rojuki enno murderlu jaruthunnayi
ammayila vishayam lo matrame meeru enduku matladukuntunnaru
tappu samajam lo ledu samajanni meeru choose drusti lo undi

tv channels rakamundu ivanni jaragaledana mee uddesam
ippude ivanni enduku vasthunnayi bayataki ?