Thursday, December 27, 2012

కాశీభట్ల వేణుగోపాల్ "నికషం" - ఒక చిరుస్పందన


బంగారాన్ని కాకిబంగారాన్నీ వేరుచేసి చూపించే గీటురాయి కూడా నకిలీదైతే నాణ్యత తెలిసేదెవరికి? ప్రమాణాలకు అర్థం ఏమిటి? ఏది సక్రమమో ఏది అక్రమమో తెలిపే న్యాయం మిథ్యగా మిగిలిదే జీవితంలో విలువలకు అర్థం ఏమిటి? నైతికతకు అస్తిత్వం ఎక్కడుంటుంది? ఈ ప్రశ్నల్లేని జవాబుల్ని జవాబుల్లేని ప్రశ్నల్ని శరాల్లా సంధించి మేధను, మనసును తుత్తునీయలు చేసే బ్రహ్మాస్త్రం కాశీభట్ల వేణుగోపాల్ "నికషం".

నైతికతకీ అనైతికానికీ మధ్య ‘నిర్ నైతికత’ అనే పదం ఉందోలేదో తెలీదుగానీ, తెలుగు సాహిత్యంలో postmodernist amoral content ని ideology విప్లవాత్మక స్థాయిలో గుప్పిస్తున్న అధివాస్తవిక రచయిత కాశీభట్ల. మెసేజిలిచ్చే మోరలిస్టిక్ సాహిత్యాన్నో లేక సమస్యల్ని అధిగమిస్తూ ఉన్నతులుగా బ్రతికే హీరోయిక్ జర్నీలనో ఆశించి కాశీభట్లను చదివితే అతని ఆలోచనల్ని కూడా భరించలేం. పాత్రల్ని పాత్రలుగా సహించలేం. వీలైతే మరింత అసహ్యాన్ని పెంచుకుంటాం. కాబట్టి చదివేముందు "సాహిత్యమంటే ఇది" అనే బ్యాగేజిని పరుపుకిందో, అల్మరాలోనో ఇంకా వీలైతే టాయ్ లెట్ ఫ్లష్ లో ఫ్లష్ చేసేసివచ్చి ఇతని పుస్తకాల్ని చదవడం మొదలెట్టండి. నికషం అందుకు మినహాయింపు కాదు. సో...బీ రెడీ ఫర్ ఇట్. ఇఫ్ నాట్ డోంట్ రీడ్ ఇట్.

1 comments:

Avanitanaya said...

Mahesh garu..

you have a flair for words always.

*నైతికతకీ అనైతికానికీ మధ్య ‘నిర్ నైతికత’ అనే పదం*
idea sounds good

* చదివేముందు "సాహిత్యమంటే ఇది" అనే బ్యాగేజిని పరుపుకిందో, అల్మరాలోనో ఇంకా వీలైతే టాయ్ లెట్ ఫ్లష్ లో ఫ్లష్ చేసేసివచ్చి ఇతని పుస్తకాల్ని చదవడం మొదలెట్టండి.*

what an easy way to open mind and heart for Kasibhatla's writings. Always igniting the zeal to read and read and read more!