Tuesday, December 23, 2008

ప్రేమ్ ‘ఆత్మహత్య’ కుమార్ఈ టపా చదివిన కొందరు సాక్షి లోని వార్త లంకె అడిగారు. అది దొరక్క ఆ వార్తాంశాన్ని స్కాన్ చేయించి టపాల పెడుతున్నాను.
ఇప్పుడే ‘సాక్షి’ పేపర్లో ఒక వార్త చూసి వస్తున్నాను. ప్రేమ్ కుమార్ అనే ఒక ఎమ్మెస్సీ విద్యార్థి తన ప్రేమికురాలు ఇన్నాళ్ళ స్నేహానికి కటీఫ్ చెప్పేసి, ప్రేమకు గుడ్ బై చెప్పిందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్తకు ఖచ్చితంగా యాసిడ్ ఘటనకున్న కవరేజీ, మైలేజీ రెండూ ఉండవు. ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ చదివినా, "ఒక అమ్మాయికోసం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా?" అని ఆ కుర్రాడి మానసిక స్థితిని ప్రశ్నిస్తారేతప్ప ఆ అమ్మాయి ప్రవర్తనని హర్షించకపోయినా ఖచ్చితంగా గర్హించరు. కారణం...తప్పెప్పుడూ అబ్బాయిదే ఉంటుందనే మన ప్రఘాఢ విశ్వాసం.అబ్బాయిలు emotional గా ఉండకూడదనే Social conditioning.


యాసిడ్ ఘటనలో ఎన్కౌంటర్ చేసి చంపినా పాపం లేదనుకున్న వాళ్ళందరి ముందూ ఈ సంఘటన పెడితే, ‘అబ్బాయి పిరికితనంతో ఈ పనిచేసుండకుండా ఉండాల్సింది’ అంటారే తప్ప, మోసం చేసిన అమ్మాయిని శిక్షించమని ఒక్కరూ అనరు. దానికున్న లాజిక్ ఒక్కటే, ఆ కుర్రాళ్ళు అమ్మాయిని బౌతికంగా దాడి చేసి హింసకు గురిచేసారు కాబట్టి వారికి ఆ శిక్ష కావాలి. కలిసి తిరిగి, ఆశలు రేపి పుటుక్కున బంధాన్ని తెంచుకుని ఆత్మహత్యకు ఉరికొల్పేంత మానసిక క్షోభపెట్టిన అమ్మాయి హింసమాత్రం మనకు కనిపించదు. కారణం...నాకూ తెలీదు.


వయసులోని ప్రేమల్ని..వయసుకు రాని ప్రేమల్నీ సహానుభూతితో అర్థం చేసుకునే తల్లిదండ్రులూ, సమాజం రానంతవరకూ యాసిడ్లతో పాటూ ఆత్మహత్యలూ జరుగుతూనే ఉంటాయి. మనం బ్లాగుల్లో మీడియాలో చదివో చర్చించో కొంత బరువు దింపుకుంటూనే ఉంటాం. పదండి, యాసిడ్ చర్చలకు కేటాయించిన సమయంలో నూరోవంతు ఈ ప్రేమ(ప్రేమ్ కుమార్) కోసం కేటాయిద్దామా!


****

41 comments:

Rajendra Devarapalli said...

మీరు అర్జంటుగా ఈ బొమ్మను మార్చాలి,భీభత్సం గా ఉంది.

Kathi Mahesh Kumar said...

@రాజేంద్ర: బొమ్మ మార్చాను చూడండి!

KumarN said...

మహేష్,

You are missing the point.

ఇక్కడ కండీషనింగ్ ప్రసక్తి కన్నా కూడా, వయొలెంట్ గా రియాక్ట్ అవ్వడం అనే చర్య లో ఉన్న intrinsic-wrong ని మర్చి పోతున్నారు మీరు (right and wrong perspective లోనే కాదు, బలమైన విజువల్ వాల్యూ లో కూడా).

మీరు చెప్పిన ఒక విషయం నిజమే. నేను చిన్నప్పుడెప్పుడో చదివిన కథలో తప్పెప్పుడూ కొంచెం బలమైన వర్గానికి చెందిన వాళ్ళదే అయి ఉంటుంది అని చూసే/వినే జనాలు కంక్లూషన్స్ లోకి జంప్ అయిపోతారు(తప్పు నడిచే వాడిదయినా, సైకిల్ వాడు నడిచే వాణ్ణి గుద్దితే సైకిల్ వాడిది తప్పు, స్కూటర్ వాడు సైకిల్ని, కార్ వాడు స్కూటర్ ని గుద్దితే..well..you get the idea జనాలు వెంటనే గుమిగూడి, socialistic/communistic న్యాయాన్ని వెంటనే అమలు చేస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే)

అలాగే ఇక్కడా అమ్మాయిల పట్ల కొంత un-deserved సాఫ్ట్ కార్నర్ ఉంటుండొచ్చు..కాని అది కారణం కాదు, తప్పు ఎవరిదో నిర్ణయించడానికి.

నేను ఇంతకు ముందు సుజాత గారికీ, వరూధిని గారికీ మొరపెట్టుకున్నా.

ఒక వయొలెంట్ ఘటన జరిగిన తర్వాత, మూల కారణాల విశ్లేషణ ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండటానికి, ముందు ముందు పిల్లలకి టీచ్ చేయడానికి ఉపయోగించాలే తప్పితే, ఇలా ఆ ఘటన లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వ్యక్తుల తప్పు శాతం ఎంత అని నిర్ణయించడానికి కాదు అని. ఆ వందల కామెంట్లల్లో నేను చెప్పింది వాళ్ళు వినిపించుకున్నట్లు లేరు.

మళ్ళీ చెపుతున్నా.. ఇక్కడ ముమ్మాటికీ ఆ అబ్బాయిదే తప్పు. ఆ అమ్మాయిది 0.01% శాతం కూడా లేదు. బోల్డ్ లెటర్స్లో ఊహించుకోండి.

కారణం:

ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడానికి, ఆ అమ్మాయికి ఎంత హక్కు ఉందో, అందులోంచి ఎప్పుడైనా బయటికి వెళ్ళిపొయే హక్కు ఆ అమ్మాయికి పూర్తిగా ఉంది. అది ఆ అమ్మాయి జన్మ హక్కు అది. అవును, హృదయం దృష్ట్యా చూస్తే ఆ ఎప్పుడు పడితే అప్పుడు అలా బయటకు వెళ్ళడానికి ఆ హక్కు లేదు. నిజమే. కాని జరిగింది అక్కడ క్రిమినల్ యాక్ట్. ఆత్మ హత్య అయినా, యాసిడ్ దాడి అయినా అది ఇల్లీగల్. అన్ లాఫుల్ విషయాలు జరిగినప్పుడు చూడాల్సింది, ఎవరిది తప్పు ఆ యాక్ట్ వరకీ అనీ, అంతే కాని ఎవరు ఎవరికి చాక్లెట్లు ఇచ్చారు అని కాదు. ఆశ పెట్టడం తప్పు అని ఆ అమ్మాయిలని అందరూ అనే మీరు, ఆశ ఊరికే పడ్డారా ఇవతలి వాళ్ళు అని ప్రశ్నించరే?

At the end of the day, a girl has every right to walk out of a relationship on any day, just like the way a guy has.

Stop being crying babies.

oremuna said...

నిజంగానె పిరికివాడు.

Anonymous said...

కత్తిగారూ,

ఆయనెవరో(మన బ్లాగరే) గుర్తులేదు కానీ, ఆ మాత్రం స్వేచ్చ వాళ్ళకి(ఆడపిల్లలకి) ఉండాలని చెప్పారు, ఆ యాసిడ్ సంఘటనల సిరీస్‌లో.

మీమీద యుద్దానికి రాగలరు కాచుకోండి.

పరిమళం said...

మహేష్ గారూ !నేనూ చదివానండీ .ప్రాణం విలువ ఎవరిదైనా ఒక్కటేనండీ .సహజ మరణానికి ,యాక్సి డెంట్ కి ,హత్యకూ ,వ్యత్యాసం ఉంటుంది కదండీ .క్రూరంగా కాల్చి వేయటం అమానుషం కాదా ?ఇప్పుడు నేను ఆ అమ్మాయిని సమర్ధించట్లేదు కాని పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకోవాలి కాని ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఏమి సాధిస్తారు ?ఒకమ్మాయే జీవితం అనే భ్రమ లోంచి బైటకు వస్తే , తల్లి ,తండ్రి , చదువు ,దేశమూ ......ఎన్నో వున్నాయి .ఇవన్నీ ఖచ్చితంగా ఒక అమ్మాయి కంటే గొప్పవి కాదా ?బాధ్యతలను విస్మరించి ఆత్మ హత్య చేసుకుంటే తల్లి తండ్రుల కెంత గుండె కోత ?
ఇక మానసిక క్షోభ అంటారా , మనసొక సరోవరం .విసిరిన ప్రతి రాయీ అలలను రేపుతుంది .కల్లోలం చేస్తుంది .కొద్దిసేపటికి అలలు ఆగి పోతాయ్.సరస్సు ప్రశాంతమౌతుంది .మనసొక సరస్సైతే జీవితంలోని ఒడిదుడుకులు రాళ్ళు .
కాలం అన్ని గాయాలను మాన్ప గలదు .కాని ఆ ఓర్పు లేని వారే ఇలా ఆత్మ హత్యలకు పాల్పడతారు .యండమూరి గారంటారు ...అతి పెద్ద కష్టం మరణమే నని , దాని ముందు మిగిలినవన్నీ చిన్నవే నని . లోకంలోని ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది ,కాని మరణాన్ని మనం ఆపలేం .అటువంటిది మరణాన్ని చేజేతులా కొని తెచ్చుకొనే వాళ్ల గురించి ఏం మాట్లాడతాం ?జాలి పడటం తప్ప ?

Anonymous said...

looks like you were dumped sometime in past..:) just joking.

Did you think(know) why she had to do that? How u concluded that she betrayed him? She might be right also? You agree or not, our society is male dominated. If he cannot dare to live, he cant dare to love. I think she made right decision.

As usual he did the wrong, ignoring his dependents :(

- Chandra

Naveen Garla said...

ఈ విస్తుగొలిపే వార్త చూడండి, కుటుంబ తగదాల వల్ల యేటా ౩౦వేల ఆడవారు ఆత్మహత్య చేసుకొంటూంటే, 57వేల మగవారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంట. అంటే దాదాపు రెండు రెట్లు అధికం. ఎవడయ్యా, 'మగోడు' సబలుడన్నది...

పూర్తి పాఠం ఇక్కడుంది:

http://epaper.timesofindia.com/Default/Scripting/ArticleWin.asp?From=Archive&Source=Page&Skin=TOI&BaseHref=TOIBG%2F2008%2F12%2F23&ViewMode=GIF&GZ=T&PageLabel=3&EntityId=Ar00302&AppName=1

ఆడవారు భౌతిక దాడులకు కాచుకొంటూంటే, మగవారు మానసికంగా నలిగిపోతున్నారన్నమాట...
అంకెలెలా ఉన్నా...మొత్తానికి మనిషికి సుఖం లేదంతే...

Kathi Mahesh Kumar said...

@కుమార్: I think you missed my point.నేను చెప్పిందీ సామాజిక ప్రవర్తనలో ఆడమగా ఇద్దరికీ ఒకటే స్థాయిని కల్పించమని మాత్రమే. ముఖ్యంగా ప్రేమల విషయంలో. అమ్మాయికి ప్రేమలో walk out అయ్యో హక్కు "సమానం" కానీ అది mutually agreed పంధాలో జరగాలి అన్నదే నా ఉద్దేశం.

అబ్బాయి బలవంతపెట్టినా అమ్మాయి తప్పించుకు తిరిగినా రెండూ తప్పే.యాసిడ్ ఘటనలో అబ్బాయిది తప్పైతే ఇక్కడ అమ్మాయిదీ తప్పే అనాలి.ఆది ఘోరకలి అనే నిర్ణయానికొస్తే, ఇక్కడ పరిణామం మరణం కాబట్టి అలాంటి స్పందననే కలిగించాలి.కానీ అలా జరగలేదు. అందుకే ఈ వివక్షకు కారణం conditioning అన్నాను.

నిజానికి నా అసలు పాయింట్ చివరి లైన్లో ఉంది చదవండి.

Anonymous said...

Naveen garu..thanks for the info. "ఆడవారు భౌతిక దాడులకు కాచుకొంటూంటే, మగవారు మానసికంగా నలిగిపోతున్నారన్నమాట..."..Idi addirindi.

Bhaskar

మనోహర్ చెనికల said...

మనం చెయ్యాల్సింది, రెండూ తప్పే అని చెప్పడమేమో!

మధురవాణి said...

మహేష్ గారూ..
మీరు చెప్పిన ప్రతీ మాటా నిజ్జంగా నిజం. సరైన విషయాన్ని చర్చకి తీసుకొచ్చారు.
నేను కూడా ఇదే విషయం మీద పోస్టు రాద్దామనుకుంటున్నాను.
మీ పుణ్యమా అని ఇవ్వాళ రాసేసాను :)
వీలున్నప్పుడు మీరూ ఓసారి చూడండి.
http://madhuravaani.blogspot.com/

Unknown said...

అమ్మాయి కోసం అబ్బాయి చచ్చినా- అబ్బాయి కోసం అమ్మాయి చచ్చినా- చచ్చినోళ్ళదే తప్పు. ప్రేమ ఈ రోజు పోతే రేపు మళ్ళా దొరుకుతుంది కానీ ప్రాణం రాదు కదా! అస్సలు ప్రేమ కోసం ప్రాణం తీయడమేంటి/తీసుకోవడమేంటి? చంపడమైనా(యాసిడ్ పోయడమైనా), చంపుకోవడమైనా రెండూ తప్పే. అరే! కాదంటే చచ్చిపోవటమేనా? ఇలా అయితే ప్రపంచ జనాభా సగం కూడా మిగిలి వుండేది కాదు! మీ వాదనలు కొన్ని "ఎడ్డెం అంటే తెడ్డెం, తెడ్డెం అంటే ఎడ్డెం" అన్నట్టుగా వుంటాయి! కారణమేదైనా దౌర్జన్యం/బల ప్రయోగం నీచం.

నాగప్రసాద్ said...

ఇదే కథ రివర్స్ అయ్యుంటే స్పందన మరో లాగుండేదేమో."ప్రేమించి మోసం చేసిన ప్రేమికుడు" అని పెద్ద పెద్ద అక్షరాలతో వార్త దావానలంలా వ్యాపించి వుండేది.

ఇక అమ్మాయిల విషయానికొస్తే, వాళ్ళతో ఒక్కసారి పరిచయం పెంచుకుంటే అంతే, అబ్బాయిల పని గోవిందా.

ఒకసారి నాకు యాహో మెస్సెంజర్లో ఒకమ్మాయి పరిచయం అయ్యింది. +2 చదువుతుందని చెప్పింది. పరిచయం అయిన అరగంటలోపే నాకు తన ఫోన్ నెంబర్ తో పాటుగా, చిరునామా కూడా ఇచ్చింది. అంత చిన్న అమ్మాయితో ఫ్రెండ్ షిప్ ఎంటని రెస్పాన్స్ ఇవ్వడం మానేసా. అంతే నాకు మైల్స్ మీద మైల్స్ పంపడం చేసింది. నాకు చిరాకొచ్చేసి యాహూ మైల్ కాని మెస్సెంజర్ కాని వాడడం మానేశా.

ఇక కొద్దిమంది మా ఫ్రెండు గాళ్ళైతే ఎప్పుడో సంవత్సరం, రెండేళ్ళ క్రితం ఆర్కుట్ లో పరిచయం అయిన అమ్మాయిలని ఇప్పటికీ వదిలించుకోలేక తలపట్టుక్కూచున్నారు. మధ్యలో మానసికంగా డిస్ట్రబ్ అయ్యి పరీక్షల్లో మార్కులు కూడా తగ్గిపోయాయి పాపం. ఇప్పుడు కోలుకున్నాక అనవసరంగా పరిచయం పెంచుకోవడం మనది కూడా తప్పేలే అని సర్దుకుపోతున్నారు. చివరిప్రయత్నంగా వదిలించుకోవడానికి మైల్స్ లో బూతులుతిట్టి పంపినా కూడా వదలడం లేదు. అవే మిస్డ్ కాల్సు. ఏం మనసు బాగోలేదా అంటూ మైల్స్.

మిగతా విషయాల్లో ఏమో కాని, అమ్మాయిలతో స్నేహం కానీయండి, ప్రేమ విషయంలో కాని అబ్బాయిలు చాలా చాలా వీక్.

మా ఇంకో ఫ్రెండు గాడితో ఒకమ్మాయి రెండు నెలలు బాగా మాట్లాడి, వున్నట్లుండి మాట్లాడటం ఆపేసింది. మనోడికి ఒక్కసారిగా మాట్లాడటం ఆపేసరికి పిచ్చెక్కినట్లైంది. ఈలోగా ఆ అమ్మాయి ఇంకొకడిని తగులుకుందేమో అని డౌటు మొదలైంది. అంతే వెంటనే ఆ అమ్మాయి మైల్ ఐడిని హ్యాక్ చేసి, నిర్ధారణ చేసుకునే దాకా మనోడికి నిద్ర కూడా కరువైంది. తరువాత ఎలాగొలా లాలించి, బుజ్జగించి, అచ్చిక బుచ్చికలాడి, మచ్చికచేసుకుని దారిలోకి తెచ్చుకునేసమయానికి ఒక సెమిస్టర్ కాలం పూర్తయ్యింది.

పైన జరిగిన సంఘటనలన్ని ఇంటర్నెట్ పరిచయాలకు సంబంధించినవే. ఇక ముఖ పరిచయాల స్నేహమో/ప్రేమో అయితే అబ్బాయిలు ఇంకెంత నలిగిపోయేవారో.

అయ్ బాబోయ్! అబ్బాయిలకి అన్యాయం జరిగిందనే సరికి వీరావేశం వచ్చేసి గుర్తుకువచ్చినవన్నీ రాసేశాను. మహేశ్ గారు క్షమించెయ్యండి.

చివరిగా ఒక సినిమా డైలాగు.
"ట్రాన్స్ ఫార్మర్లకి, అమ్మాయిలకి ఎంత దూరంగా వుంటే అంత మంచిది. కరెంటు తీగలెక్కి ఆడుకుంటే, కాకిలా మాడి మసై పోవడం ఖాయం".

స్వేచ్చ said...

మహెష్ గారు మీరు నీను బాధ పడటం వేస్ట్ అండి....
జురాస్సిఖ్ పార్క్ లొ స్పేల్ బెర్గ్ చెప్పినట్టు....

"లైఫ్ విల్ ఫైండ్ ఇట్స్ వే"

ఇంక ఈ సంగటనకి వస్థే...మనకి అంటే మన దేశానికి రోజుకి మూడు లేదా నాలుగు ప్లేట్స్ చొప్పున మిగిలాయని సంతొసించడమే

Purnima said...

>> అబ్బాయి బలవంతపెట్టినా అమ్మాయి తప్పించుకు తిరిగినా రెండూ తప్పే.యాసిడ్ ఘటనలో అబ్బాయిది తప్పైతే ఇక్కడ అమ్మాయిదీ తప్పే అనాలి.ఆది ఘోరకలి అనే నిర్ణయానికొస్తే, ఇక్కడ పరిణామం మరణం కాబట్టి అలాంటి స్పందననే కలిగించాలి.

How do you mean?! ఇప్పుడయితే వచ్చి చంపుతున్నారు ఒకేసారి.. మీ ప్రకారం జరిగితే, "నే చస్తా.. ఛస్తా.." అంటూ బతకుండగానే చంపుకుతింటారు. మొన్నెప్పుడో ప్రేమించటం లేదని ఓ పిల్ల, తన ప్రియుణ్ణి బ్లేడుతో గాయపరచిందట. ఇప్పుడు దీన్ని వెనకేసుకొస్తే మీ ఆవేశానికి అర్థం ఉంది కానీ.. మీరు చెప్పిన కేసులో అమ్మాయిదేం తప్పో అర్థం కావటం లేదు.

@kumar: Kudos to your comment

లక్ష్మి said...

మహేష్ గారూ, ఇక్కడ తప్పు ఎటు చూసినా ఆ అబ్బయిదే అనిపిస్తుంది. రెండు రకాలుగా అనుకుందాము, ఒకటి ఆ అమ్మాయి ఇతన్ని నిజం గా నే ప్రేమించి ఉండవచ్చు కానీ కొంత కాలం తర్వాత అతను తనకి లోంగ్ రన్ లో పనికి రాడు, తేడా మనిషి అనిపించి తన దారి తను చూసుకుని ఉండవచ్చు. లేదా ఆ అమ్మాయే తేడా మనిషి అయ్యుండచ్చు. మొదటి ఖేస్ లో అతను తన తప్పు తెలుసుకుని మారాలి, రెండో కేస్ లో అలాంటి అమ్మాయి పీడా వదిలినందుకు సంతోషించాలి. ఇవేవీ చెయ్యకుండా ఎటువంటి ఆలోచనా లేకుండా చచ్చాడూ అంటే అతను కేవలం ప్రేమిస్తున్న అన్న భావనని ప్రేమించాడు, ఎప్పుడైతే ఆ భావనకి దెబ్బ తగిలిందో జీవితంలో ఓడిపోయాను అని పిరికిగా ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు ఈ కుర్రకారు ప్రేమించెయ్యాలి అన్న భావనని వదులుకుంటే ఇన్ని చావటాలూ, చంపటాలూ ఉండవేమో

Anonymous said...

మీరు అన్నట్టు అమ్మాయి పై చర్య తీసుకోవడం సాద్యం కాదు. ఎందుకంటే చట్టాలన్ని అమ్మాయిలకి అనుకూలంగా ఉంటాయి. వరకట్న వ్యతిరేక చట్టం పంజాబ్ లో ఎలా ఆడవారు ఎలా మగవారిని హింసించటానికి ఆయుదంగా వాడుకున్నారో అందరికి తెలుసిన విషయమే. కాబట్టి మనకంటూ ఒక సమాజం ( అఖిల భారత పురుష సమాజం) అవసరం. ఇలాంటి సంఘటనలను ఎదుర్కోడానికి. రండి పదండి , నడుం బిగించండి. మన హక్కులను కాపాడుకుందాం. మనపై జరుగుతున్న మానసిక హింసను ఎదుర్కొందాం.


ఇట్లు

పేరు కూడా చెప్పుకోలేని
ఒక మహిళా భాదితుడు.

Anonymous said...

మీరెక్కడుంటారు?
ఆ ప్రాంతంలో నేను పుట్టి ఉంటే బాగుండేది.
మీరు చెప్పిన సన్నివేశం నేను పుట్టిన్నుంచీ
చూడలేదు. అబ్బాయిలు వెంటపడినా, వేదించుకు
తిన్నా అమ్మాయిదే తప్పు అనటం చూసాను.
ఇంక విషయానికొస్తే మోసాన్ని కానీ,
మానసికంగా పెట్టే బాధని కానీ పత్రికల్లో
నిరూపించటం, యాసిడ్ దాడిని వివరించినంత
సులభం కాదు కనుక అలా రాసారేమోనని నా
ఉద్దేశ్యం. తప్పొప్పులు నిర్ణయించకుండానే రాయటం
మంచిది కాదు అనుకొనుంటారు. కొన్నిసార్లు, మొత్తం
తెలిసినా తప్పొప్పులను నిర్ణయించటం అంత ఈజీ కాదేమో.

పైగా దేశంలో శారీరక బాధలకు ఇచ్చినంత
విలువ మానసిక బాధలకు ఇవ్వరు కదా.
ఉదాహరణకు, పెళ్ళైన అమ్మాయి భర్తను
భరించలేకపోటానికి అతను తాగుబోతైనా
అయ్యుండాలి, కాల్చుకు తినేవాడయినా అయ్యుండాలి.
అంతేకానీ, అతను పట్టించుకోపోయినా, గౌరవించకపోయినా,
మాట్లాడకపోయినా అదో పేద్ద జీవిత సమస్యలా
ఫీల్ అవకూడదు అని చెప్తారు.

నాగప్రసాద్ said...

@అఙ్ఞాత వ్యక్తికి.

అఙ్ఞాత గారు, భార్యా బాధితుల సంఘం అని ఒకటి వుంది. అందులో ఇప్పుటి దాకా నాలుగులక్షల మందికి పైగా సభ్యులు(భార్యా బాధితులు)వున్నారు. మీక్కూడా వీలైతే అందులో చేరండి. నా కామెంటు మీకు అభ్యంతరకరంగా అనిపిస్తే దయచేసి క్షమించి వదిలెయ్యండి.

వివరాల కోసం క్రింది పత్రికలోని 19 వ పేజీ చదువుకొనగలరు.
http://www.indiantelugu.com/book_release.php

Kathi Mahesh Kumar said...

@పూర్ణిమ: మీరు బహుశా సాక్షిపత్రికలోని వార్త పూర్తిగా చదవలేదనుకుంటాను.చదువుంటే ఆ కుర్రాడి సూసైడ్ నోట్ లో (కుర్రాడి తరఫున) ఆ అమ్మాయిని చేసిన పనేమిటో తెలిసేది.

శారీరకంగా బలమైన మగాళ్ళు(కొంతమంది) పశుబలాన్ని వాడితే, మానసికంగా బలమైన ఆడవాళ్ళు (కొంతమంది) సున్నితంగా మనసుల్ని తెగనరుకుతారు. ఒకటి కనిపించే గాయంమైతే మరోటి కనీసం చెప్పుకోలేని వేదన.అందుకే రెంటికీ సమానస్పందన రావాలంటే ఈ విషయాల గురించి తల్లిదండ్రులకీ సమాజానికీ సరైన అవగాహన కావాలన్నాను.

Kathi Mahesh Kumar said...

@భవాని: social conditioning మరియూ apathy రెండువైపుల్నించీ ఉంది.మిగతా పక్షం గురించి నేను నా బ్లాగులో రాసాను. ఇప్పుడు ఈ ఘటనతో మరో పక్షాన్ని ముందుంచాను అంతే."మేల్ కొలుపు" అని ఇదివరకూ నా బ్లాగులో ఈ విషయంపై రెండు టపాలు రాసాను చూడండి.

Kathi Mahesh Kumar said...

@పరిమళం: నేను యాసిడ్ అటాక్ ను సమర్ధించనట్లే ఈ ఆత్మహత్యనూ సమర్ధించడం లేదు. కేవలం ఈ పరిస్థితికి దారితీసిన పరిస్థితుల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో వివక్షాపూరితంగా స్పందించే సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను.మూలాలను అర్థం చేసుకోవడాని ఇంకా తయారుగా లేని మన మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రశ్నిస్తున్నాను/ప్రశ్నించుకుంటున్నాను.

@చంద్ర: I was actually dumped once. Let me tell you,its no fun.

@నవీన్ గార్ల: మంచి సమాచారం ధన్యవాదాలు. మీ ఆఖరి లైన్ అదిరింది.

@మనోహర్: అదే నేనూ చేసింది. రెండూ తప్పే!

@నాగప్రసాద్: చాలా నిజాలు చెప్పేసావ్!

@లక్ష్మి: ఆత్మహత్య చేసుకుని అబ్బాయి తప్పుచేసినా, ఆ అమ్మాయి కనీసం తనతో చర్చించకుండా ఏకక్షంగా నిర్ణయం తీసుకోవడం తప్పని మాత్రమే నా ఉద్దేశం. ఆ అబ్బాయిని ignore చేసి ఫోన్లోకూడా మాట్లాడకుండా సతాయించాల్సిన పని లేదు.She could have discussed with him cordially. అన్నది మాత్రమే నా పాయింట్.

@అనామకుడు: మీ బాధ అర్థం చేసుకోదగ్గదే. మిత్రులొకరు మీకోసం ఒక సలహా ఇచ్చారు చూడండి.

@నరేష్: "ప్రేమ ఈ రోజు పోతే రేపు మళ్ళా దొరుకుతుంది" అనే మాట నేనంటే.."పవిత్ర ప్రేమ ను అవమానిస్తావా!!!" అంటూ ఒకప్పుడు చాలా వ్యాఖ్యలొచ్చాయి. ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నట్టు ప్రవర్తింస్తున్నది నేను కాదు. మొత్తంగా ఈ mainstream సమాజం. ఈ విషయం గుర్తించగలరు.

Indian said...

ఆడదాని వల్ల అర్ధ రాజ్యాలే పోయాయి అన్న. ఆడ జీవికి స్వార్ధం పుట్టుకతో వస్తుంది, ఇందు లో కొందరే కమిట్మెంట్ తో లవ్ కొనసాగిస్తుంటారు. ఇలాంటి ఆడవాళ్లు వీడుకకపోతే వేరోకవాడి వల్ల లాభం వుంటే వాడి వైపే ఇంట్రెస్ట్ చూపిస్తారు.ఇటువంటి అగయిత్యాలు అన్నింటికీ మూలం ఫ్యామిలి లో సెల్ఫ్ portection ఇచేతటువంటి మాటలు పెద్దల నుండి పిల్లలకు చేరాక పోవటం ఒక ఎత్తు ఐతే, పాఠశాలల్లో మనిషి ఆలోచనల్ని నాశనం చేసేటట్టు గ వుండే కళాశాలల్లో ని భోధనా విధానాలే కారణాలు.వీటికి సంజాయిషీ చెప్పవలసింది వారి వారి తల్లితండ్రులు గురువులే.-రాజశేఖర్

Anonymous said...

మీరు చెప్పినట్టు ఈ ఆత్మహత్యనూ సమర్థించలేం ఆసిడ్ అటాక్ ను సమర్థించలేం.ఒక విషయం గమనించాను బ్లాగుల్లో గాని, పత్రికలలో గాని, మీడియాలో గాని ఏమి జరిగినా వెంటనే స్పందించి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో చెప్పేసి చేతులు దులుపుకుంటాం గాని సమస్య మూలాలను మాత్రం అర్థం చేసుకోం.ఇలా అర్థం చేసుకోకుండా ఎంత చర్చించినా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు.ఎప్పటికి మారతామో మనం.
snehamolakatalla.wordpress.com

KumarN said...

నేను చెప్పిందీ అదే మహేశ్.

ఒక అమ్మాయి డంప్ చేస్తే, తప్పు ఆ అమ్మాయి మీదకి తోయకుండా, he should learn to deal with it, అనే చెప్పా నేను కూడా.

అయినా ఈ "మానసిక" బాధలు/గాయాలు పుట్టినప్పటినుంచి రోజూ తగుల్తూనే ఉంటాయి కదా. చిన్నప్పుడు మన అక్కో/అన్నో మన చింత పిక్కను లాక్కున్నప్పట్నుంచీ, పక్క సీట్ వాడు షేర్ని మనకంటే ఎక్కువ ప్రైస్ కి అమ్ముకున్నప్పటి దాకా సాగేవే.

నేను ఎక్కువ డిటైల్స్ లోకి వెళ్ళడం ఇష్టం లేదు కాని, అమ్మాయిలు అత్యంత ఘోరంగా, వాళ్ళని ప్రాణం లాగా చూసుకున్న అబ్బాయిలని/భర్తలనీ మోసం చేయగా నేను అత్యంత దగ్గరగా చూసాను, విన్నాను. కొన్ని సార్లు సహాయం కూడా చేసాను.

కాని, as I said, when a relationship hits the dead end, and a guy crashes into pieces, after thoroughtly betrayed/deceived/cheated by the girl/woman/wife....it's his responsibility to pick up those pieces and move on.
After all, it's his life. And when kids are involved, sometimes the choice is to keep moving with the same woman. After all, it's not just HIS life anymore in those cases.

Life is nothing but sorting out priorities, and a violent reaction should never precede any others. A violent/criminal act may have root causes, but they don't justify the very act.

That said, I see the pain. More and more men are facing this. Life throws a curve ball at times.

@Purnima-> Thanks for endorsing.

Anonymous said...

http://www.sakshi.com/main/homepage.aspx

can u plz give us the link to the news ?

Anonymous said...

mahesh,confusing post.

i thought you said, women should have sexual freedom ie sex without committments is okay, and needn't result in marriage or something serious.

why are you expecting committment from this girl now ?

and also, all the time, love needn't result in marriage, according to what you said. so guys should get prepared for it too, right? instead of killing themselves if girls can have freedom, just like men?

Kathi Mahesh Kumar said...

@రాజు: నేను ఇదివరకూ చెప్పిన వ్యక్తిగతస్వాతంత్ర్యానికీ ఇప్పుడు చెబుతున్న స్పందనలోని సమానత్వానికీ ఏవిధమైన వైరుధ్యం లేదు.
ప్రేమ వ్యక్తిగత విషయం.కాకపోతే దానికున్న precondition, mutual agreement.పరస్పర అంగీకారంతో ప్రేమలో ఉన్న అమ్మాయీ-అబ్బాయిలకు 'falling in love' హక్కుతోపాటూ 'falling out of love' అధికారం కూడా ఉంటుంది.కాకపోతే అదికూడా mutual గా జరగాలి. ఇక్కడ అమ్మాయి ఏకపక్షంగా ప్రవర్తించడమేగాక అబ్బాయిని మోసం చేసింది.మోసం మోసమే. ముఖ్యంగా (పరస్పర)వ్యక్తిగతనిర్ణయాన్ని తుంగలోతొక్కి మోసం చెయ్యడం వ్యక్తి నిబద్ధతను ప్రశ్నార్థకం చేసే విషయం.అందుకే,ఇక్కడ అబ్బాయి ఆత్మహత్యను సమర్ధించకపోయినా,అమ్మాయి ఉద్దేశంలోని సంకుచితతత్వం యాసిడ్ ఘటనకు కలిగించిన స్పందన రావాలేమో అన్నాను.

@కుమార్: మీరు క్రింది లంకెద్వారా ఈ విషయంపై నేను ఇదివరకూ రాసిన టపా చదవండి.
http://parnashaala.blogspot.com/2008/05/blog-post_3978.html

@రాజశేఖర్: నిజమే మార్చాల్సినవి చాలా ఉన్నాయి.మనవంతు ప్రయత్నం మనం చేద్దాం.

@స్నేహ:సమస్య మూలాలు అందరికీ తెలుసు. కానీ నిజాయితీగా చర్చించే ధైర్యం మన closed society లో కొరవడింది.ఎంతసేపూ pretend చెయ్యటమేతప్ప తరువాత తరాన్ని protect చెయ్యడానికితగ్గ చర్యలు చేపట్టడంలో విఫలమౌతున్నాము.

Kathi Mahesh Kumar said...

Dear All,
సాక్షి లోని వార్తాంశాన్నికూడా జోడించాను చూడండి.

బుజ్జి said...

there are many news items about "girls also committing suicide" in love affairs, we see them in news papers. they are not given publicity equal to the acid incident. Acid incident is entirely different from suicide. there is nothing to compare these two incidents ..

సుజాత said...

రెండూ తప్పే! చంపడం, లేదా చావడం! ప్రేమకు సంబంధించి ఈ రెండేనా మార్గాలు? జీవితం అనే మాటకు విలువే లేదా? ఆమె ఇతడిని డంప్ చేసింది. సరే! ఆ తర్వాత ఇతడు ఏమేమి చేసుండచ్చు, బతికుంటే? బాగా చదూకోనుండొచ్చు, మంచి ఉద్యోగం చేసుండొచ్చు, మంచి భార్య దొరికుండొచ్చు,తల్లిదండ్రుల్ని సుఖపెట్టుండవచ్చు,కనీసం ఒకరిద్దరికి తన జీవితంలో మరువలేని సహాయం చేసి ఉండొచ్చు, ఒకరిద్దరి జీవితాలని నిలబెట్టే అవకాశం దక్కి ఉండొచ్చు....! ఇన్ని తీపి అనుభవాలను ఒద్దనుకుని క్షణికమైన వేదనతో చావుని ఆశ్రయించే వారి పట్ల నాకే రకమైన సానుభూతీ లేదు. అయినా డంప్ చేయగానే చావాలంటే రోజుకెంత అమ్మయిలు చావాలో ఆలోచించండి! కుమార్ గారు చెప్పినట్టు మానసిక గాయాల అనేకం తగుల్తూనే ఉంటాయి! అందులో ఇదొక చిన్న దెబ్బ మాత్రమే! ప్రేమకంటే, ఆ మాటకంటే జీవితంలో అన్నింటికంటే విలువైనది జీవితం మాత్రమే! ఒకసారి పొగొట్టుకుంటే అన్న్నీ మరోసారి దొరికే అవకాశం ఉంటుంది, జీవితం తప్ప!

సుజాత said...

కుమార్ గారు,

"ఒక రిలేషన్ షిప్ లోకి ఎంటరయ్యే హక్కు ఎంత ఉందో ఆ రిలేషన్ షిప్ లోనుంచి బయటికి వెళ్ళే హక్కూ ఆ అమ్మయికి అంతే ఉంది" అనే మాట నిజమే! కానీ అది ఇద్దరూ ఒకే intellectual level లో ఉన్నప్పుడు మాత్రమే! అవతలి వాడు వెధవో, మరోటో అయినపుడు "నాకిష్టమైనన్ని రోజులు ఈ బంధంలో ఉంటా, తర్వాత తెంచుకుంటా" అంటే ఇలాగే ...జరిగేది! అవును, ఇది ఆ అమ్మాయి హక్కు అని శాంతంగా ఆలోచించే వారు ఎంతమంది ఉంటారంటారు? అబ్బాయిలు హృదయం దృష్టి ఎక్కువగా పెట్టి ఆలోచిస్తారనుకుంటా! నేను నా టపాలో చెప్పింది అదే...స్నేహాలు కాస్త చూసుకుని చేయండి అమ్మాయిలూ అని!

Anonymous said...

ప్రేమ్ కుమార్ చావుకు గిరాకీ లేదనా మీ భాద... పిల్లవాడు చనిపోయాడు అని కాదన మాట.. బాగుందండి....

వరంగల్ అమ్మాయిల మీద దాడి పైశాచికం కాబట్టి కొద్దిగా చూసేవాళ్ళకు కొద్దిగా లాభం ఉంది, ఎంటంటే ఆ అమ్మాయి మీద సానుభూతి చూపించి మంచి వారని అనిపించుకోవచ్చు, వ్యగ్రత(నరికేస్తాం,చంపేస్తాం) చూపించి ధైర్యస్తులని అనిపించుకోవచ్చు కదా మా ప్రేక్షక దేవుళ్ళు అందుకే ఆ న్యూస్ పాపులర్..... పైగా ఆ అమ్మాయి బతికుంది, భాదతో మంచ మీద ఉంటే ... మైకు పెట్టి "ఇప్పుడెలా ఉంది" , మీ పీలింగ్స్ ఏంటీ అని అడుతుంటే .... చూసేవాళ్ళకు అడిగే వాళ్ళకు మంచి ఎంజాయ్ మెంట్ ఉంటుంది కదా..... ఇక్కడ న్యూస్లో ... ఉరేసుకున్నోడు పోయాడా యే... మైకు పెట్టడానికి చుట్టూపక్కల జనాలు తప్ప...ఆ పిల్లవాడు తర్ఫువారు లేరాయే ...తరవాత కనబడ్డా న్యూస్ ప్రేష్ నెస్ ఉండదు కదా ... గిట్టుబాటు లేని న్యూస్ కదా...పైగా.. ఆ పిల్లని బుక్ చేద్దమని తిక్కవెద్దవలా చనిపోయాడు. మోసం చేసే అమ్మాయిలకు గుణపాఠం నేర్పిస్తాడట...ఎవరు నేర్చుకుంటారండీ బాబు ఈ పాఠాలు..... మన తాతల కాలంలో నుంచి సినిమాలు,సీరియల్స్,పేపర్సు నవల్స్ ఒకటేమిటీ అన్నీ - "అబ్బాయిలు ప్రేమించి కడుపు చేసి పారిపోతారు" అని వందల వేల విదాలుగా చెప్పి చూపించారు అమ్మాయిలు తిరగటం మానేశారా అబ్బాయిలు చేయ్యటం మానేసారా..లేదు అప్పటిలో ఇళ్ళలో గుట్టుగా జరిగేవి ...ఇప్పుడూ పార్క్లులు మెదలు ఎక్కడ పడితే అక్కడ మాకు గిరాకీలు పెరిగుతున్నాయి...బాల్యవివాహాలు ఎందుకు పోయాయిరా బాబు అనిపిస్తుంది ఒక్కోసారి.....చోద్యం కాక పోతే... కనీసం ఆ పిల్లకి ఇప్పటి కన్నా జ్ఞానం వచ్చి తిరగటం మానేసిందేమో...వీడు అంత కావలనుకున్నోడయితే పిల్ల తండ్రి దగ్గరికిపోయే లేక ఎదోకటి చేసి ప్రూవ్ చేసుకోవాలిగాని..అయినా పెళ్ళి చేసుకునే ఉద్దేసం ఉంటే తండ్రితో మాట్లాడదాం అని ఆలోచనలు వస్తాయికి కాని ..ఇలా తిరగటానికి మాత్రమే ఇంతరెష్ట ఉంటె ఇంతే... సూసైడ్ నోట్లో ... నాతో తిరిగటం మానేసింది అని రాసడు గాని పెళ్ళి గురించి వీడి , జీవన ఆదయం గురించి ఏమనా రాశాడా.... ఎదో దేశ సేవ చేస్తున్నాను అని పీల్ అయి పిరికి పంద లా చచ్చాడు... అంత పిరికి వాడు బతికి ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకుని వేదించి ఉంటే ...ఆ న్యూస్ పాపులర్ అయ్యేది....మీకు కళ్ళూ చల్ల బడేవి గిరికీ ఉంటుంది కదా...పైగా పిల్లోడు మాహా కవి సానుబూతి కోసం కళ్ళు దానం చేయ్యండీ అని రాసడు నిజంగా ఇచ్చే ఉద్దేశ్యం ఉన్నోడయితే ...ఐ హాస్పిటల్ కి ఫోన్ చేసో మరేదో చెయ్యాలి గదా. ఇన్ని ఉండ బట్టే సంచలనం కాలేదు... దీనికి సంచలనం రేగలేదని మీ భాద ఆపేశేయండి..... ఈ సారి ఎవరన్న చచ్చిపోయేదాకా వైట్ చేసి సంచలనం చేసేద్దాం.....

అన్ని రకాల మీడియాల సంఘం అద్యక్షుడు
విలాసరావు

Anil Dasari said...

ఈ ప్రేమలేంటో, వాటికోసం చావులేంటో .. నాకర్ధం కావు.

Anonymous said...

thanks for the link mahesh.

vilasarao garu, well said.

Anonymous said...

mahesh,

how do you know the girl dint arrange a meeting with him,and tell him, she's no more interested in him, as their ideals,views etc don't match and its getting tiresome for her.sure, the suicide note doesnt mention if she tried to get the mutual agreement to "Fall out" of the relationship.

and may be still the guy's trying thinking,"aadavari maatalaku arthaale verule" etc.

lets say the guy dint agree for her to fall out, should it be the only reason for women to stay in relationship? even if they dont like the person?

this applies for guys too.if one of them cant bear the other person, and the other person persists to stay...this is not business deal.if your heart isn't in something,no one can be in relationships.

its better if guys and girls understand this, and accept that all not people in relationships turn out compatible with each other. some just fall into it out of attraction and realize the bitter truth, the other person isnt their "type" later.

n the rest of it, vilasarao garu has put it very well.

Anonymous said...

I dont see any difference between the emotions of the male in both the stories (acid attack & suicide). They just reacted in a moment of rage.

A girl has a right to say NO to the unwanted advances of the acid attacker. She has an equal right to say NO at any point in a mutually consenting relationship.

Lets not make a hero out of the helpless guy who committed suicide.

Peace.

Anonymous said...

విలాసరావు గారు బాగా చెప్పారు!! claps claps..
Acid case లో, అమ్మాయి మీద యాసిడ్ పొయ్యాటానికి ఆ వెధవకు హక్కు ఎలా లేదో, అలాగే, ఈ విషయం లో కూడా, తన ప్రాణం తీసుకునే హక్కు ప్రేం కుమార్ కు కూడా లేదు. ఇలా వాళ్ళ ప్రాణాలో, ఇంకొకళ్ళ ప్రాణాలో తీసే హక్కు ఎవడిచ్చారు వీళ్ళకు? ఇవన్నీ క్షణికావేశాం లో చేసే పిచ్చి పనులే... ఎవ్వరి మీద సానుభూతి చూపించనక్కర్లేదు.

పిచ్చోడు said...
This comment has been removed by the author.
Vinay Chakravarthi.Gogineni said...

koncham sanubhooti choopinchataaniki kooda..inta allochinche me meeda naaku sanubhuthi kalugutondi............