Tuesday, December 30, 2008

కొమ్ములూ- కోరలూ-పర్ణశాల - e-తెలుగు

తెలుగు ప్యారడీ కింగ్ ఝరుక్ శాస్త్రి గారికి మిత్రుడొకరు మొదటి సారిగా 'కొకు' (కొడవటిగంటి కుటుంబరావు)గారిని పరిచయం చేసారట. ఝరుక్ శాస్త్రిగారు తన హాస్యశైలిలో 'కొకు'గార్ని ఎగాదిగా చూసి మిత్రుడితో, "అబ్బే ఈయన కొకు అవ్వడమేమిటి?! కొకు అంటే ఇంతపెద్ద కొమ్ములూ, కోరలుండాలి, అవీ భయంకరంగా కనబడాలీ, పైగా ముక్కులోంచీ పొగలూ సెగలూ రావాలి. ఇవన్నీ లేకపోతే కొకేమిటి? నేనస్సలు నమ్మను" అన్నారట.*


నిజమే, ఆవేశపూరితమైన రాతలు రాసినంత మాత్రానా పొగలూసెగలూ కక్కుతూ, ఆవేశంతో కనపడినవాళ్ళనల్లా కసకస మనిపించే కోరలతో కపడాలా? ఏమో ఈ మధ్య జరిగిన బుక్ ఫెయిర్లో, e-తెలుగు స్టాల్ దగ్గర కలిసిన కొందరు బ్లాగ్మిత్రుల స్నేహపూరిత వాక్కుల తరువాత నాకు ఈ సందేహమే వచ్చింది. నా బ్లాగులో జరిగే వాడివేడి చర్చలూ, అక్కడక్కడా వేరే బ్లాగు వ్యాఖ్యల్లో వినిపించే నా నిరసనస్వరాలూ,పదేపదే నా భావాల్నీ ‘సుత్తి’తో నిరసించే మరికొందరి ప్రయత్నాల నేపధ్యంలో కత్తి మహేష్ కుమార్ అంటే (ఫొటో ఉన్నాకూడా) ఒక భీకర స్వరూపమో లేక జగడమారి రూపమో మనసులో ముద్రేసుకున్నారనుకుంటాను. నన్ను కలిసిన మరుక్షణం "బ్లాగంత ‘ఇది’గా లేరే!", "కత్తి బ్లాగులో మాట్లాడతాడు బయటమాత్రం వింటాడు","మంచోడే మరీ అంత ప్రమాదకరం కాదు" లాంటి ప్రశంసల్తో ముంచేసారు.


మరో వైపు ,"బ్లాగులో ఫోటోలాగే వున్నావ్" "కొంచెం ఒళ్ళు పెరిగింది,జుట్టు తగ్గింది... మిగతా అంతా నువ్వే" అని కొందరంటే, ఇంకొందరు "మొదటిసారి కలిసినా ఎన్నాళ్ళుగానో తెలిసినట్లేవుంది" అంటూ స్నేహహస్తం అందించారు.


బ్లాగుల్లో ఒకప్పుడు హోరాహోరీగా పోరాడుకున్న నేనూ-తాడేపల్లిగారూ విభేధించుకుంటూ, చర్చించుకుంటూ అతిఎక్కువ సమయం ఒకరితో ఒకరు గడిపాం. ఈ మధ్యకాలంలో చదువరి గారి టపాపై వ్యాఖ్యలూ ప్రతివ్యాఖ్యలతో గడిపినా, కలిసిన మరుక్షణం ఒక కప్పు కాఫీ తాగుతూ e-తెలుగు కోసం కలిసి పనిచెయ్యాలనే నిర్ణయానికొచ్చాం. పప్పు అరుణగారి కలుపుగోలుతనం-కార్యదీక్ష, నల్లమోతు శ్రీధర్ గారి బేషరతు అభిమానం. దూర్వాసుల పద్మనాభంగారి అకుంఠిత సమర్పణభావం. వీవెన్ నిశ్శబ్ధ అంకితభావం. కేశవ్ ఉత్సాహం. ఇబ్బందిగా నవ్వుతూనే ఎవరికీ ఇబ్బంది కలక్కుండా చూసే చావా కిరణ్. ఇంకా పలువురి శ్రమ,దీక్ష చూస్తుంటే తెలుగుకు ఆధునిక హోదా కలిపించే ఉద్యమంలో నేనూ ఒక భాగాన్నేమో అనిపించింది.


ఇక 25 వతేదీన మహిళాబ్లాగర్ల హడావుడి ఇప్పటికే బ్లాగు లోకంలో విశ్వప్రసిద్ధం...

హమ్మో...నేనూ ఎమోషనల్ అయిపోతున్నాను....


ఇహ చెప్పోచ్చేదేమిటంటే! నా విభేధాలు సిద్ధాంతాలతో,ఆలోచనలతో,అభిప్రాయాలతోకానీ వ్యక్తులతో కాదు అని నేను పదేపదే నా బ్లాగులో మొత్తుకునేమాట నిఝంగా నిజం. నాకు అర్థరహితం అనిపించి సిద్ధాంతాలను నిరసిస్తాను. అలవికాని ఆలోచనలు అనిపించినవాటిని నిలదీస్తాను. స్వార్థాశయంగల అబిప్రాయాలను తెగనాడతాను. అంతమాత్రానా నాకు వ్యక్తులతో విభేధాలుండవు.కోపాన్నికూడా ఒక్క కరుకుపదంకూడా వాడకుండా తెలియజెప్పాలనే నా ప్రయత్నం. కసినికూడా కసుక్కుమనే పదరహితంగా వెళ్ళగక్కాలనే నా ఆశయం. కానీ, నా టపాలు ఎత్తిపొడుపుల్లాగా అనిపిస్తాయని ఒక మిత్రుడు చెప్పారు. అది ఉద్దేశపూర్వకమేగానీ అవి వ్యక్తుల్ని ప్రశ్నించడానికి కాకుండా వ్యవస్థలోని నాకు తెలిసిన లోపాల్ని వ్యక్తపరచడానికి మాత్రమే. వ్యక్తిస్వతంత్ర్యాన్ని నేను ప్రభోధిస్తే అది నా అనుభవాల సారమేగానీ,దాని ఆధారంగా అదే సత్యమని ఉద్భోధించే ఉద్దేశం కాదు నాది. రాజకీయ ఉద్దేశాల్నీ, కులమత భేధాల్నీ, దేశభక్తినీ సాధికారంగా ప్రశ్నిస్తానేగానీ గుడ్డిగా నమ్మే అలవాటుని ప్రోత్సహించను. అంతమాత్రానా అవంటే గౌరవం లేకకాదు.అందరూ గౌరవించేరీతిలో అవి ఉండాలనే తపనతో.


అయినా కొందరికి నా టపాలు ఘాటుగా అనిపిస్తాయి. బహుశా నా టపాల్ని ఆలోచించడానికి కాక వ్యక్తిగతజీవితానికి అన్వయించుకుని పొంతనలేక ఉక్రోషంతో, ఈ ఆలోచనల్ని నిత్యజీవితంలో అవలంభించే ధైర్యం లేక ఆక్రోశంతో అలా అనిపించొచ్చు.ఈ ఆలోచనల్ని అంగీకరిస్తే వారు బ్రతికే భద్రలోకం వీళ్ళని "మంచి వాళ్ళు కారు" అనుకుంటుందనే భయమూ కావచ్చు.


ఇంకా..ఇంకా మరెన్నోమరెన్నో కారణాలు కావచ్చు. ఆకారణాలతోనే నా బ్లాగు చదవాలి. చదవకపోతే చదివించేలా చేసే బాధ్యత నాదే! చదివితే స్పందించాలి. స్పదించకపోతే స్పందించేలా చేసే బాధ్యత నేనే తీసుకుంటాను. నావరకూ ‘పర్ణశాల’ ప్రశాంతంగానే ఉంటుంది. ఆలోచనలకు నెలవుగానే వుంటుంది.అందరికీ స్వాగతం ఆదరించేవారికీ,విమర్శించేవారికీ,విశ్లేషించేవారికీ, విభేధించేవారికీ అందరికీ... అందరికీ.. స్వాగతం.


నూతన సంవత్సర శుభాకాంక్షలు*పిట్టకథ చెప్పిన కొత్తపాళీగారికి ధన్యవాదాలు.


****

27 comments:

జ్యోతి said...

:).. good review of yourself..


Happy New Year..

శ్రీనివాస said...

"నా విభేధాలు సిద్ధాంతాలతో, ఆలోచనలతో, అభిప్రాయాలతో కానీ వ్యక్తులతో కాదు" ఇది నిఝంగా నిజం. సదుద్ధేశంతో బ్లాగు ప్రారంభించిన వాళ్లందరికీ ఇది వర్తిస్తుంది.

Purnima said...

:-)

A very happy new year!

durgeswara said...

are! nenu vraasinadi chadavaledulaa vunnade? okasaari choodamdi.

చిలమకూరు విజయమోహన్ said...

బ్లాగుల్లో విమర్శల యుద్ధం సాగించిన మీరు, తాడేపల్లిగారూ బుక్ ఫెయిర్ లో e-తెలుగు స్టాల్ లో కలుసుకున్నప్పుడు మీ ఇరువురి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచన నా మదిలో మెదిలింది.విభేధించుకుంటూ, చర్చించుకుంటూ అతిఎక్కువ సమయం ఒకరితో ఒకరు సుహృద్భావంతో మెలిగిన మీరిద్దరూ అభినందనీయులు.ఒక మంచి ఒరవడిని సృష్టించారు.

యోగి said...

"బహుశా నా టపాల్ని ఆలోచించడానికి కాక వ్యక్తిగతజీవితానికి అన్వయించుకుని పొంతనలేక ఉక్రోషంతో, ఈ ఆలోచనల్ని నిత్యజీవితంలో అవలంభించే ధైర్యం లేక ఆక్రోశంతో అలా అనిపించొచ్చు.ఈ ఆలోచనల్ని అంగీకరిస్తే వారు బ్రతికే భద్రలోకం వీళ్ళని "మంచి వాళ్ళు కారు" అనుకుంటుందనే భయమూ కావచ్చు"

చూశారా మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళని గురించి మీరు ఏమి insinuate చేస్తున్నారో? ఇలాంటివి మీ మీద వ్యతిరేకతకు కారణమేమో? ఆలోచించండి. (I am being honest, no sarcasm intended)


I wish you health, wealth and knowledge in the new year! Enjoy!!

Anil Dasari said...

పెద్ద సమస్యొచ్చి పడిందిప్పుడు. మీరంతా ఇలా ఒకరికొకరు పరిచయమైపోతే ఇక బ్లాగుల్లో ఆ వాడి, వేడి ఎక్కడుంటాయి? మహేష్ తన పద్ధతిలో తాను - పరిచయాలతో నిమిత్తం లేకుండా - ఇంతకు ముందులానే తానంగీకరించని వాటిని ఏకుతాడనుకున్నా, అందరూ అంత నిర్మొహమాటస్తులు కాకపోవచ్చు కదా.

నేను మాత్రం ఇలాంటి సమావేశాలకు రాను, రాను, రాను :-)

Kathi Mahesh Kumar said...

@యోగి: అవమానించడాన్ని(insulting)కూడా చర్చావిధానంలో భాగం అని నమ్మబలికిన మీరా నా వాక్యాల్లోలేని ఉద్దేశపూరితవ్యంగ్యాన్ని(insinuate)ఎత్తిచూపుతున్నది!

మీరు వ్యాఖ్యానించిన వెంఠనే అది నిజాయితీగా చెబుతున్న వ్యాఖ్య అని, వ్యంగ్యం కాదని చెప్పుకోవలసిన స్థితిలోకి మీరు స్వయంగా వచ్చి చేరారని గ్రహించండి.

నన్ను వ్యతిరేకించేవారిలో కొందరి మానసికతను బేరీజుచెయ్యగల కనీస జ్ఞానం నాకుంది.నా బ్లాగులో అలా చెప్పే ఆధికారంకూడా నాకుంది. మిగతా కారణాలు నాకూ తెలీదు. అందుకే ఆ తరువాత పేరా లో "ఇంకా..ఇంకా మరెన్నోమరెన్నో కారణాలు కావచ్చు. ఆకారణాలతోనే నా బ్లాగు చదవాలి. " అని చెప్పాను.

నా పాఠకుల్లో మీరు కొత్తవారు. అందునా ఇప్పటివరకూ నా పూర్తి టపాల్నికూడా చదవని వారు. అలాంటిది మీకు నాకన్నా నా పాఠకులగురించి ఖచ్చితంగా ఎక్కువ తెలీదు. కాబట్టి, సమయం చూసుకుని నా బ్లాగు టపాల్ని వ్యాఖ్యలతో సహా చదివిన తరువాత ఇటువంటి సాహసం చెయ్యండి.

@అబ్రకదబ్ర:నా విభేధాలు వ్యక్తిగతం కాదుకాబట్టి ఇప్పుడు వ్యక్తులు తెలిసినా నా పోరాటంలో మొహమాటాలుపడే ప్రసక్తే రాదు.ఇతరులుకూడా అలాంటి మొహమాటాలకు పోరనే ఆశిస్తాను.

@దుర్గేశ్వర్రావు: హయ్యో ఇప్పుడే మీ బ్లాగులో నా గురించి రాసింది చదివాను...ఎలా మిస్సయ్యానబ్బా!

యోగి said...

http://www.thefreedictionary.com/insinuate

Insinuate = To introduce or otherwise convey (a thought, for example) gradually and insidiously

Insinuating is not ఉద్దేశ్యపూరిత వ్యంగ్యం.

If this is how you process information.... oh well! such is life!

prosecution rests!

Bolloju Baba said...

మీకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

మీ ఆత్మ పరిశీలన నిజాయితీగా సాగింది.

ఏది ఏమైనా మాంచి టాపిక్కు మీద వేడి వేడి వాడైన వాదనలు చదువుతూ ఆనందిస్తూ, విషయాలు తెలుసుకొంటూ ఉండే నాబోటి వారు కూడా ఉన్నారండోయ్. :-)

అబ్రకదబ్ర గారి కొన్ని కామెంట్లు U టర్న్ ఇస్తుంటాయి చాలా సందర్భాలలో. :-)

Kathi Mahesh Kumar said...

@యోగి: ఇంగ్లీషు పదాలకి తెలుగులో సమానార్థాలుండవు.విస్తృతార్థాలే వుంటాయి. మీరు చెప్పిన అర్థం ప్రకారం తీసుకుంటే తెలుగులో దాన్ని "తప్పుడు అబిప్రాయంతో సూచించు" అనుకోవాలి.ఈ విస్తృతార్థంకన్నా నేను వాడిన ‘ఉద్దేశపూరిత వ్యంగ్యం’అనే పదం ద్వారా మీరు సూచించదలచిన మార్మిక అర్థానికి ఎలా విఘాతం కలిగిందో చెప్పగలరా?

My capabilities of processing information especially in translations are seldom challenged. Please don't waste your sympathies for me.It is much required for you than me.

యోగి said...

"ఎలా విఘాతం కలిగిందో చెప్పగలరా?"

గలను! సమస్య నేను చెప్ప-గలనా లేదా అన్నది కాదు! మీరు అర్థం చేసుకో-గలరా?

ఉదాహరణ కి: మీరు బాగా అలోచించిన పిమ్మట రాసిన అర్థాన్ని పరిశీలిద్దాం!

Insinuate: To introduce or otherwise convey (a thought, for example) gradually and insidiously

దీనికి మీ లేటెస్ట్ అనువాదం - "తప్పుడు అబిప్రాయంతో సూచించు"

I will let those two lines speak for themselves. somethings are best left unsaid.

Now - This is my last comment here. Off the top of my head, I can think of better things to do than engaging in a dialogue of such lower quality such as this. So I drift.

Your response will go unheeded.

As I said earlier - prosecution rests!

నాగప్రసాద్ said...

>>"నావరకూ ‘పర్ణశాల’ ప్రశాంతంగానే ఉంటుంది".

ఈ మాటలని సువర్ణాక్షరాలతో శిలలపై చెక్కేస్తున్నా. ఇంకా రాగి రేకుల మీద వ్రాసి "కాళనాలికలో" పెడుతున్నా. :))) (పిల్లాట)

మీ రివ్యూ నిజాయితీగా వుంది.

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

cbrao said...

టపా చల్లగా - వ్యాఖ్యలు వేడిగా, మునుపటివలెనే, మజా మజాగా. అబ్రకదబ్రా now rejoice.

శ్రీ said...

తెలుగు బ్లాగర్లలో ఒక విలక్షణమయిన బ్లాగరుగా మా అందరి బ్లా'గుండెలో ఒక చోటు సంపాదించుకున్నారు.

"టపాలు కానీ,తాళింపు కానీ ఘాటుగా ఉంటేనే బాగుంటాయ్!"

మీకు కుడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Anil Dasari said...

బాబాజీ,

నా కామెంట్లు బ్యాక్‌ఫైరా :-( ఎందుకు?

సమావేశాలకు నేన్రానంది సరదాగానే. ఒట్టు.

వేణూశ్రీకాంత్ said...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ఫోటో చూసినప్పటికీ, మీ బ్లాగు, వ్యాఖ్యలూ చదివి మీ వ్యవహారశైలి కాస్త పదును గా ఉంటుందని అనుకునేవాడ్ని, అందుకనే మీ గురించి చదివి నేనూ ఆశ్చర్యపోయాను.

లక్ష్మి said...

కష్టపడి మీ ముకుందుడికి కాండీ తినటానికి ఒప్పించిన నన్ను మర్చిపోయారండోయ్ :). బాగుంది మీ సెల్ఫ్ రివ్యూ. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

మేధ said...

>>నావరకూ పర్ణశాల’ ప్రశాంతంగానే ఉంటుంది
ఏంటో మహేష్ గారూ... వింటుంటే కొంచెం తేడాగా అనిపిస్తుంది!!! just kidding :))

మీ గురించి కొమ్ములు -కోరలు ఊహించుకోలేదు కానీ, కస్తూరి మురళీ కృష్ణ గారు మీ గురించి వ్రాసినది చూసి మాత్రం ఆశ్చర్యపోయాను!!!

మీకు నూతన వత్సర శుభాకాంక్షలు..

మరిన్ని కత్తి (కాదు కాదు)- కోమలమైన (:) ) టపాలు రావాలని కోరుకుంటూ..

Bolloju Baba said...

అబ్రకదబ్ర గారికి
U టర్న్ అంటే నా ఉద్దేశ్యం, అప్పటి దాకా ఒకదారిలో/గాటన పోతున్న వాదనలను మీ కామెంటులు ఒక్కోసారి కొత్తమలుపులు తిప్పుతూంటాయని నాఉద్దేశ్యం అండీ. బాక్ ఫైర్ అన్న అర్ధమ్లో కాదు.

అలా చెయ్యటం ద్వారా చర్చలోని కొత్త కోణాలు ఆవిష్కరింపబడి చర్చ మరింత వేడెక్కి, మాబోటి వాండ్లకు(చదువరులకు) మాంచి మేత దొరుకుతూంటుంది.

మీ కామెంట్లను బయట నుంచి పరిశీలించిన వ్యక్తిగా చెపుతున్న మాటలివి. పెద్ద సీరియస్ విషయంఏమీ కాదు.

మీరు అలానే కామెంటాలి. ఆ వట్లూ గిట్లూ తీసేసి గట్టు మీద పెట్టేయండి. :-)

Kathi Mahesh Kumar said...

@యోగి:
insinuate = *వ్యంగంగా సూచించు,తప్పు అభిప్రాయంతో సూచించు.(*ఆధారం:ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ వారి "పత్రికా పదకోశం"-2004,సంపాదకులు:చేకూరి రామారావు. పరిష్కర్త:బూదరాజు రాధాకృష్ణ)

Your efforts to prove me ignorant are increasingly establishing your arrogance. ఏకపక్షంగా నన్ను తక్కువచేసి చూపెట్టాలనుకునే నీ ప్రయత్నాన్ని స్వాగతిస్తాను.But,don't expect me to respond to you all the time. Simply because I have better business to attend to.

శ్రీనివాస్ పప్పు said...

మీరు రాసిన పదాలు కరక్ట్ గా ఉన్నాయి మీగురించి జనాభిప్రాయం చక్కగా రాశారు.
కత్తి అంటే కత్తి పట్టుకుని తిరుగుతాడన్నట్టు గా ఫీలింగ్ సూపర్,నిజం చెప్పాలంటే మీరు రాసే రాతలు చూస్తే అలాంటి భావనే కలుగుతుంది మరి.
ఇంక ఆలోచించడం సంగతి అలా ఉంచండి ఏదో పైపైన చదివే వాళ్ళకి మాత్రం మీరు రావుగోపాల్రావు,నాగభూషణమే ఖచ్చితంగా...

Anonymous said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సుజాత said...

25 తారీగ్గురించి ఇంత సింపుల్గా రాస్తే మిమ్మల్ని మహిళా బ్లాగర్లెవరూ క్షమించరు.

ప్రపుల్ల చంద్ర said...

నేను మాత్రం మీరు మాములుగానే ఉంటారనుకున్నాను ( అంటే మీరు వ్రాసుకున్నాట్టే !!!), అది అలాగే నిజం అయ్యింది....
నూతన సంవత్స్రర శుభాకాంక్షలు...

mamatha said...

"నావరకూ ‘పర్ణశాల’ ప్రశాంతంగానే ఉంటుంది"..... idhi chadivaka naa abhiprayam chepthunna mee blog meedha, mee blog lo post tho paatu nenu comments kuda chaduvutha avanni naku ela vuntayante naa chinnapudu nenu maa vurilo road pakkana vunna marrichettu meedha (evening time lo) pittala gola la vuntundi :)

Bala said...

హె... మహెష్ చెడ్డా పిల్లాడెంటి,....అయన్ని కలెస్తె ఒ పుస్తకం చదివినట్టు ఉంటుంది