Sunday, March 29, 2009

బీజేపీ అంటే, భయ్ హో!


ప్రతిపక్షంలో ఉండే పార్టీలకు ఎన్నికల్లో, అధికారపక్షం విధానాల మీద చేసే వ్యతిరేక ప్రచారం ప్రధాన అస్త్రం. తిరిగి అధికారంలోకి రావాలంటే ఇప్పటివరకూ పాలించిన లీడర్ల చేతగానితనం, పార్టీల విధానం, ప్రజల్లో వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడం ఒక తప్పనిసరి అవసరం. అదే ప్రతిపక్షం బాధ్యతకూడా. మన రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశంతో పాటూ మహాకూటమి అస్త్రాలు, వైఎస్ పాలనలోని లోపాలు, అవినీతి,ప్రజావ్యతిరేక విధానాలైతే, అదికార పక్షమైన కాంగ్రెస్ తాము చేసిన అభివృద్ధి పనుల ఆధారంగా ఓట్లడగడానికి సిద్దమవుతోంది. అక్కడక్కడా వ్యక్తిగత విమర్శలూ, తొడగొట్టడాలూ, ఛాలెంజులు చేసుకోవడాలూ, మహిళా నాయకురాళ్ళు మైకుల ముందు జుట్టూజుట్టూ పట్టుకోవడాలు కొంత ఎన్నికల ‘వేడి’ని కలిగిస్తున్నా, ప్రజల్ని భయభ్రాంతుల్ని మాత్రం చెయ్యండం లేదు. అంతవరకూ సంతోషమే!

కానీ, జాతీయరాజకీయాల్లో ఈ పద్ధతి కొంచెం తగ్గినట్లు అనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తన ఇన్నిసంవత్సరాల ఎన్నికల జీవితంలో బహుశా ఒకేఒక్కసారి ‘ఇండియా షైనింగ్’ అంటూ సకారాత్మక ఎన్నికల ప్రచారం చేసిందనుకుంటాను. ఆ ప్రచారంకూడా బోల్తాకొట్టడంతో అభివృద్ధి, సుపరిపాలన లాంటి సాఫ్ట్ భావాలతో బీజేపీకి ఓట్లు పడవనే నశ్చయానికొచ్చిన బీజేపీ "హిందుత్వ" తో మళ్ళీ ‘back to basics' అంటోంది. ఒకవైపు వరుణ్ గాంధీ ముస్లిం వ్యతిరేక స్పీచ్ కొచ్చిన ‘విపరీమైన’ స్పందనతో "ఇదే దారి" అనుకుంటున్నట్లుగా ఉంది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ విధానవైఫల్యాల సంగతేమోగానీ, జాతీయభద్రతలో వైఫల్యం పేరుతో భయపెట్టే ప్రచారానికి ఎప్పుడో శ్రీకారం చుట్టింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదుగానీ, తీవ్రవాదానికీ-ఇస్లాంకూ- హిందుత్వానికీ ఎంచక్కా ముడిపెట్టేసి పబ్బంగడుపుకోవడం ఒక అలవాటుగా చేసేసుకున్నారు. ఈ ఎన్నికల్లోకూడా క్రితం పాఠాల్ని ఎంచక్కా అపార్థం చేసుకుని, అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన అజెండాను ప్రచారాల్లో పక్కనబెట్టి కాషాయం జెండాను ఎక్కుపెట్టారు.

ఆస్కారు పంటపండించిన ఏ.ఆర్.రెహమాన్ "జయహో" పాటని కాంగ్రెస్ తమ ప్రచార సంగీతంగా ఎంచుకుంటే, దానికి వ్యతిరేకంగా ఏ "అపజయహో" లేక "పరాజయ్ హో" అనకుండా, తమ brand of fear politics ప్రతిబింబించే విధంగా "భయ్ హో" అనే నినాదంతో ముందుకొచ్చింది. భయపెట్టి, లేని ప్రమాదాన్ని చూపెట్టి, తమ రాజకీయం గడుపుకునే ట్రెండ్ ను ముందుకు తీసుకెళ్తోంది. ఈ భయాందోళనల, విద్వేషాల రాజకీయ ప్రచారాల్ని EC చూస్తూ ఉండదని ఆశిస్తాను. వరుణ్ కు జరిగిన శాస్తి, ఇలాంటి ప్రచారాలకు కూడా కలగాలని ఆశిస్తాను. నెగిటివ్ ప్రచారాలతో ప్రజల్ని భయపెడుతున్న బీజేపీ రాజకీయ ప్రచార విధానం డౌన్ డౌన్!!

బీజేపీ రూపొందించిన వీడియో మాత్రం బాగుందండోయ్! అదే భయంకూడా!!


28 comments:

Anil Dasari said...

Welcome back.

సుజాత వేల్పూరి said...

వచ్చేశారా? పునఃస్వాగతం!

Unknown said...

Good to see you back..! Welcome

satya said...

అయ్యా మహేష్ గారు, మీరు వ్యక్తిగత విద్వేషం తో అభ్యుదయవాది లా ఎంతకాలం భ్రమపడతారు?
ఈ రొజు 29 సంవత్సరాల యువకుడు అన్న మాటలని బీజేపీ కి అన్వయించారే? ఆ పార్టీ వరుణ్ అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే ఖండిస్తున్నాం అని ఈ సరికే చెప్పివుంది.. అయితే అతని వైపు వాదన వినిపించటానికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవటానికి ప్రయత్నిస్తుంది..

అది సరే..మరి ఒక ప్రధాని పదవి లో ఉండి దేశ వనరులపై తొలి హక్కు మైనారిటీలకే ఉండాలి అని శ్రీమాన్ మన్మోహన్ గారు అన్నప్పుడు నివ్వెరపడలేదా? అప్పుడు అనిపించలేదా మతవిద్వేషాలు రెచ్చకొడుతున్నారని?

బీజేపీ పాలన లో ఎన్ని తీవ్రవాద దాడులు జరిగాయి? మరి ఇప్పుడో? కాంగ్రెస్ వారు చాల చండాలంగా అప్పుడు పార్లమెంట్ పై దాడిని, కాందహార్ హైజాక్ ని పదే పదే ప్రస్తావిస్తారు.. అందులో మొదటి దాన్ని వాళ్ళు నిలువరించి దోషుల్ని కూడా పట్టుకుంటే ఉరి తీయటానికి ఓట్ల కోసం తటపటాయించినప్పుడు మత రాజకీయాలు అనిపించలేదా మీకు? ఎక్కడో నేపాల్ లో జరిగిన హైజాక్ కి ఇక్కడ పాలకులని బాధ్యులు చేస్తూ విమర్శించినప్పుడు ఏమనిపించింది మీకు?

జాతీయ భధ్రతా వైఫల్యం తో భయపెట్టా? అంటే వైఫల్యం లేదంటారా? అన్నిటికి కాంగ్రెస్ ని తలకెత్తుకునే ఆంగ్ల మీడియా కూడా శివరాజ్ పాటిల్ ని మార్చాలందే.. మీకు మాత్రం వైఫల్యం గా కనపడలేదు... పోటా ని ముస్లిం లకి వ్యతిరేకం అన్నప్పుడు మతరాజకీయం అనిపించలేదా? ఫెడరల్ ఏజెన్సీ పెట్టమంటే అది మైనారిటి కి వ్యతిరేకం అని నీచ ఆలోచనలు చేసింది ఎవరు? బీఎస్పీ లాంటి పార్టీలు అణుఒప్పందం ముస్లిం లకి వ్యతిరేకం అన్నప్పుడు మతరాజకీయం అనిపించలేదా? ముంబై దాడులతో దేశవ్యాప్తం గా
ఆందోళనతో ఉంటే హేమంత్ కర్కరే మృతి వెనుక కుట్ర అన్నప్పుడు మత రాజకీయం కనపడలేదా? ఆ దాడులు జరిగిన నాలుగు రోజులకే మాలెగావ్ దాడులపై కేంద్రం ప్రత్యేక శ్రద్ద అన్న వార్త చదివినప్పుడు మత రాజకీయాలు కనపడలేదా?

కొంచెం ఒకసారి బీజేపీ మ్యానిఫెస్టో చదివే వ్రాసారా ఈ టపా? అందులో వారు మతరాజకీయాలకి సంభందించి ఏ విషయం చెప్పారు?
భద్రత పరంగా వారు ఏమేం చేయదలచింది సవివరంగా వివరించారు..
1. ప్రతి పౌరిడి కి ఒక గుర్తింపు కార్డు.. (ఇది మత రాజకీయమా?)
2. పౌరసరఫరా లాంటి వాటికోసం మరొక కార్డు. అంటే డ్రైవింగ్ లైసెన్స్ వాటికి, మరియు ఇతర రేషన్ అవసరాలకి ..ఇది మత రాజకీయమా?
3. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు..తద్వార ప్రభుత్వ పరిహారం, రుణాలు నేరుగా లబ్ది దారులకి చెందే ఏర్పాటు.. ఇది మత రాజకీయమా?
4. బంగ్లాదెశ్ నించి అక్రమ చొరబాట్లు నిలువరించటం.. ఇది మత రాజకీయమా?
5. ప్రతి గ్రామానికి బ్రాడ్‌బ్యాండ్ సేవలు... ఇది కూడా మత రాజకీయమేనా?

అదే కాంగ్రెస్ వారి మ్యానిఫెస్టో లో ప్రధాన అంశం..3 రూపాయలికి కేజీ గోదుమలు...

జయహో అనగానే జయం కలగదు.. పాపం గుజరాత్ ఎలక్షన్లలో చెక్‌దే అని పెట్టి చతికిల పడింది కాంగ్రెస్. కాంగ్రెస్ జయహో అనగానే సరిపోదు.. ప్రజలు అపజయహో, పరాజయహో, పారిపో అనటానికి రెడీ గా ఉన్నారు.

చేతగాని మన్మోహన్, సోనియా,..అద్వాని తో టెలివిజన్ డిబేట్ కి నిరాకరించినప్పుడే తెలుస్తుంది ఎవరు వైఫల్యం చెందారో... ఇలాంటి వ్యాసాలు కేవలం మనకి ఊరడింపు మాత్రమే...

satya said...

"...ఒకవైపు వరుణ్ గాంధీ ముస్లిం వ్యతిరేక స్పీచ్ కొచ్చిన ‘విపరీమైన’ స్పందనతో "

విపరీతం గా స్పందిస్తుంది కాంగ్రెస్, కమ్యూనిస్టులే... గొంతు చించుకుంటుంది ఆంగ్ల మీడియా.. ఎన్ని సార్లు ఈ విషయం లో భంగపడ్డా వీటి తీరు back to Baics.

Kathi Mahesh Kumar said...

@సత్య: నాకు వ్యక్తిగతంగా బీజేపీ brand of hate politics అస్సలు నచ్చదు. ఇందులో రహస్యమూలేదు. అది అభ్యుదయమా కాదా అనేది నాకు తెలీదు.

వరుణ్ గాంధీ చెప్పిన మాటలు ఒక భావజాలప్రేరేపితమైనవి. ఆ భావజాలం బీజేపీ పెంచిపోషిస్తున్న హిందుత్వదని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ మీడియా ముందు ఆ వ్యాఖ్యల్ని ఖండించినా, పెద్ద సంఖ్యలో వరుణ్ స్వచ్చంద అరెస్టు నాటకానికి హాజరైన బీజేపీ కార్యకర్తలు, పార్టీ మౌన ఆమోదానికి చిహ్నం.

కాంగ్రెస్/UPA తీవ్రవాదాన్ని అణచడంలో విఫలమయ్యాయనేదానితో నాకు విభేధం లేదు. ఇక బీజేపీ/NDA చరిత్ర మీరు ఎలాగూ చెప్పారు.కాబట్టి అర్థం చేసుకోవల్సింది we are living in danger of terror irrespective of party in power అని. కానీ బీజేపీ దానికొక మతంరంగుపులిమి రాజకీయ లబ్ధిపొందుతూ విద్వేషాల్ని రగిలిస్తున్న పంధాతో నాకు అంగీకారాత్మకం కాదు.

నేను బీజేపీ మ్యానిఫెస్టో చదివాను. వాళ్ళ భావజాలానికీ మ్యానిఫెస్టోకీ సంబంధం లేదని మీరు అనుకుంటుంటే మీరు సంతోషంగా ఉండండి. కాస్త మీరు చెప్పిన పాయింట్లను తరచిచూస్తే వారి మూల ఉద్దేశాలు కనిపిస్తాయి.

satya said...

మరి ప్రధాని వ్యాఖ్యలు ఏ భావజాలానికి ప్రతీక?

నెలకొకసారి దాడులు జరిగి దేశం భయం నీడన బతుకుతుంటే తీవ్రవాదానికి మతం లేదు..ఖఠిన చట్టాలు అవసరం లేదు అంటూ పుండు మీద కారం చల్లే వ్యాఖ్యలు, చేతలు hate politics కి నిదర్శనం కావా? కోట్లాది భారతీయుల పరిస్థితి ఈ రకం గా ఉంటే మరో పక్క ప్రధాని ఆస్ట్రలియా లో అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కుంటున్న హనీఫ్ గురించి నిద్ర లేని రాత్రులు గడిపా అని వ్యాఖ్యానించటం ఏ తరహా రాజకీయం?

>>> we are living in danger of terror irrespective of party in power

మీరు relativity ని చూసి మాట్లాడండి. బీజేపీ హయం లో సామాన్య ప్రజానికం పై ఈ దాడులు తక్కువే జరిగాయి.. అసలు లేవని అనట్లేదు. 60 సంవత్సరాలు జరిగిన లోపాల్ని 5 సంవత్సరాలలో సరిదిద్దటం సాధ్యం కాదు. కానీ కాంగ్రెస్ దీని నిర్మూలనకి చేసిన constructive ప్రయత్నం, ఆలోచన చెప్పండి? దేశభద్రత ని గాలికి వదిలేసింది. తీవ్రవాదుల దయాదాక్షిణ్యానికి విడిచిపెట్టింది.

"... బీజేపీ దానికొక మతంరంగుపులిమి రాజకీయ లబ్ధిపొందుతూ విద్వేషాల్ని రగిలిస్తున్న పంధాతో నాకు అంగీకారాత్మకం కాదు."

మరి మాలెగావ్ పేలుళ్ళకి మీరు మీ టపా లో పులిమింది ఏ రంగు? ఒరిస్సా దాడులకి ఏ రంగు వేసారు కాంగ్రెస్ & పార్టీ? మతం లేదంటూ బుజ్జగించే ప్రయత్నమే మతం రంగు పులమటం. అసలు బీజేపీ ని పెంచి పోషించింది కాంగ్రెస్, కమ్యునిస్టుల నిర్లక్ష్యం, మరియు తీవ్రవాదులే.. లేకపోతే ప్రజలు ఆ పార్టీ ని పట్టించుకునే వాళ్ళే కాదు. ప్రజలు నమ్ముతున్న దాన్ని ఈ పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసం లౌకికవాదం పేరు తో విస్మరించటం వల్లే బీజేపీ కి నానాటికి ఆదరణ పెరుగుతూ వచ్చింది.

"...కాస్త మీరు చెప్పిన పాయింట్లను తరచిచూస్తే వారి మూల ఉద్దేశాలు కనిపిస్తాయి."

మీరు విద్వేషం చూడాలనుకున్నప్పుడు ఏం చూసినా అదే కనిపిస్తుంది.. భద్రత కోసం తీసుకునే పటిష్ఠ చర్యలు వద్దంటున్నారా? పైన చెప్పినవి చెయ్యకూడదంటారా?

Anonymous said...

@ సత్య
చాలా చక్కగా చెప్పారు.

@ మహేష్
వారి ఉద్దేశం ఏదయినా అది దేశానికి ఉపయోగపడేది అయినప్పుడు తప్పేంటి.

satya said...

మీరు తరచి చూడండి అని లేని మూల ఉద్దేశ్యాలు వెతికి ముస్లిం లలో భయాన్ని సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారు.. ఇప్పుడు చెప్పండి 'భయహో' ఎవరి నినాదం?

Kathi Mahesh Kumar said...

@ఆకాశరామన్న: మతవిద్వేషాపూరితమైన విడతీత రాజకీయాలు భారతదేశ సమగ్రతకు గొడ్డలి పెట్టు. బీజేపీ చేసేది ఏవిధంగానూ ఉపయోగకరమని నేను అనుకోవడం లేదు.

Kathi Mahesh Kumar said...

@సత్య: గిరీష్ కార్నాడ్ రాసిన "తుగ్లక్" అనే నాటకంలో ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చిన ముస్లిం, తుగ్లక్ సంస్థానంలో తుగ్లక్ మీదే (తన పొలం అన్యాయంగా లాక్కున్నారని) తప్పుడు కేసును బనాయించి బంగారు నాణాల్ని compensation గా పొందుతాడు.

ఈ కేసు ఎలా గెలిచావని మరో మిత్రుడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్న ముస్లింని అడిగితే, దానికి తను "సుల్తానూ, ఫిర్యాదీ ఒకేమతానికి చెందితే ‘నిస్పక్షపాత మైన తీర్పు’ ఎలా వస్తుంది? అందుకే ముస్లిం అయిన సుల్తాన్ ముందుకు హిందువుగా వస్తే చూశావా ‘న్యాయం’ జరిగింది." అంటాడు.

కాంగ్రెస్ brand of appeasement ఇలాంటి "నిస్పక్షపాతానికి" చెందిన రాజకీయం.ఇది సరైనది అని నేను చెప్పను. కానీ దీనివలన సమాజానికి జరిగే immediate ప్రమాదం లేదు.కానీ బీజేపీ చేసే విద్వేషాల రాజకీయాలవలన జరిగిన damage ఇంతా అంతాకాదు. అందుకే ఈ prefer congress over BJP. అంతేతప్ప, కాంగ్రెస్ కు గుడ్డి పూజారినికూడా కాను.I have my own issues with Congress.

Anonymous said...

satya gaaru baaga chepparu........congress ki support gaa raastu inka nenu supporter ni kaadu antaventi baabu....nenu mee chaala post choosanu..koncham meeke anni telusu ani anukuntaru annatluga anipinchindi..blog ni debate cheyadaniki vaadandi..ante gaani vaadinchadaniki kaadu.....already u had some opinion and ur not ready to check whether its correct r not.......ee blog world lo adi baaga ekkuvaga vunnadi....

Indian Minerva said...

ముందుగా మీకు పున:స్వాగతం.
దొందూ దొందే....
కాంగ్రెస్ వారి ముస్లింలపై ప్రేమ చాందసవాదాన్ని ప్రొత్సహించేదేకాని ప్రగతిశీల వాదుల్నికాదు. ఈ విషయం షాబానో కేసు దగ్గరనుంచి ప్రతిసారీ ఋజువవుతూనే వస్తుంది. అంతగా ముస్లింలపై ప్రేమ వున్నవారు మరి ముస్లిం మహిళల దీన పరిస్తితుల గురించి ఎందుకు ఆలోచించరు, భావి ముస్లిం తరాల (ఇస్లామేతర) విద్య గురించి ఎందుకు దృష్టిపెట్టరు. మీరన్నది నిజమే ఇవన్నీ దీర్ఘకాలంలో తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి కానీ ఈ పనిని చాలా కాలం కిందటే మొదలు పెట్టివుంటే ఇప్పటికి ఆ ముస్లింలే చాలా అభివృద్ది చెందివుండేవారు. కాదంటారా? ప్రగతిశీలవాదుల్ని నిరుత్సాహ పరచడం ద్వారా చాందసవాదులకి వీరు పరోక్షంగా సహాయం చేస్తుంటారు.

ఇక భా.జ.పా.
అభివృధి లాంటి విషయాల్లో వీళ్ళ ఆలోచనలు నాకు నచ్చుతాయి. కానీ హిందూ తీవ్రవాదానికి (అలాంటిదేమీ లేదనకండి please...) వీళ్ళు ప్రత్యక్ష సహాయకులు. అటు ముస్లింలలో కొంచెం ఆలోచించుకొనే సమయాన్ని కానీ, అవకాశాన్ని కాని ఇవ్వటంలో వీళ్ళు విఫలమైనారు. వీళ్ళవల్ల అప్పటికే వున్న అభద్రతాభావం ముస్లింలలో తారాస్థాయికి చేరుకుంది. వీళ్ళకి క్రైస్తవులతో పడదు, ముస్లిములతో పడదు ఒక వేళ మన ఖర్మ గాలి వీళ్ళ అధికారమే వస్తె, వీళ్ళు so called రామరాజ్యాన్ని స్థాపించగలిగితే అప్పుడు వీళ్ళలో వీళ్ళకే పడదు. రాష్ట్రాల వారిగా, కులాల వారీగా కుమ్ములాటలు షురూ... కాకపోతే వీళ్ళకి ఈ రాముడి విషయంలో చిత్తశుధ్ధిలేదు వోటుబుధ్ధితప్ప కాబాఅట్టి ప్రమాదం లేదు, ప్రయోజనమూ లేదు.

వీళ్ళిద్దరిని తన్నితగలేసో లేక పోతే వీళ్ళిద్దరి మంచి గుణాల మేలుకలయికతోనో సామరస్యాన్ని సాధించగలమేమోకానీ వీళ్ళీద్దరిలో ఏ ఒక్కరి పంధాతోనీ కాదు. వీళ్ళు మారరు. వీళ్ళని మనమే "మారా"ల్సి వుంది (హమే ఇంకో మార్నా పడేగా).

satya said...

మహేష్ గారు, ఉన్నట్లుండి స్వభావసిద్దంగా ఏదో అర్ధం కాని పోలిక పెట్టారు.. కానీ కాంగ్రెస్ అంతకన్నా appeasement కి పాల్పడుతుంది..లేకపొతే సైనిక దళాలలో ముస్లిం సంఖ్య పై కమిటీ వెయ్యటమేంటి? ముస్లిం లీగ్ ని మంత్రి వర్గం లో స్థానం కల్పించిన పార్టీ సెక్యులర్ అని ఎలా చెప్తారు?

నిజానికి ఇదొక slow poison లా వ్యాపిస్తుంది. ఎంతగా దిగజారింది అంటే అక్రమ చొరబాట్లదారులని అరికట్టకుండా వారిని ఓటు బ్యాంక్ గా వాడుకోవటం కోసం వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు.. ఒక దేశ సమగ్రత, చారిత్రక, సాంస్కృతిక సంపద ఒక పధకం ప్రకారం కాంగ్రెస్ రాజకీయ స్వార్ధానికి నాశనం చెయ్యబడుతుంది. బీజేపీ చర్య ల వల్ల కొంత immediate ఇబ్బందులు తలెత్తిన ధీర్గకాలిక ప్రయోజనాలు కలుగుతాయి.. ఎందుకంటే రాజకీయ నాయకుల ఆలోచనలు మారతాయి.. కేవలం మైనారిటిల ఓట్ల కోసం మెజారిటీ లను దోషులగా చేసే ప్రయత్నాలు తగ్గుతాయి.. తద్వారా మైనారిటీలను కేవలం భావోద్వేగ మత రాజకీయాలకు కాకుండా main stream society లో భాగంగా చూసే దృష్టి ఏర్పడుతుంది

Anil Dasari said...

మత రాజకీయాల విషయంలో కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే. మైనారిటీలు, మెజారిటీలు .. ఒక్కొక్కరికీ ఒక్కో ఓటుబ్యాంకు. ఇద్దరూ దొంగలే. కాంగ్రెసుది కనపడకుండా దోచుకునే తత్వం, బిజెపిది బహిరంగ దోపిడీ.

బాధాకరమైన విషయమేంటంటే, జనాలక్కూడా ఇవేవీ పట్టవు. ఈ పార్టీల మాయలో ఈజీగా పడిపోతారు.

Anonymous said...

Satya, your analysis is super..

Mahesh,

what is secular? is it means equal priority every one? ORgiving priority to less number people and ignoring majority of people?

if congress had honesty , what they did for muslim well being? congress cheated every one including minorites..

Think this way, if terrorisum not stopped, more and more people start feeling insecure and will look at the minorities wrongly..( as we all know some of the muslims directly or indirectly supporting ISI)

if spoiled apple kept long time in the box (muslims supports terrorists) will spoil the entire box of apples.

Having said that I oppose the bloody politics by BJP by using the race,but that does not mean cogress is good.. congress 100 times worst ..

I strongly belive we need some third alternative..

Kathi Mahesh Kumar said...

@Indian Minerva: మీతో ఏకీభవిస్తాను. కాకపోతే I am choosing a lesser evil of the two.మనం మారడం అంటారా, వేచిచూడాల్సిందే!

@సత్య: నేను పెట్టింది అర్థంకాని పోలిక కాదు. నిస్పక్షపాతానికి- లౌకికవాదానికీ కాంగ్రెస్ ఏర్పరుచుకున్న definition మీద వేసిన satire అది. మీకు అర్థం కాలేదంటే ఒక సారి "తుగ్లక్" చదవండి.

బీజేపీ వలన దీర్ఘకాలిక ప్రయోజనాలు జరుగుతాయనేది, చంపేసి తరువాత పెళ్ళి చెయ్యడం వంటిది. చచ్చాక ఇక పెళ్ళెందుకు? అందమైన పెళ్ళామెందుకు?

@అబ్రకదబ్ర: దొందుదొందే! కానీ ఉన్నవాటిల్లో choice ఇస్తే ఎవర్ని సమర్ధిస్తాను అన్నదే సమస్య.

@అనామకుడు:నేను చెప్పిన తుగ్లక్ ఉదాహరణ ఒకసారి చదువుకోండి. సెక్యులర్ కు కాంగ్రెస్ పార్టీ చెప్పే definition అర్థమవుతుంది.

అయినా, కొందరు ముస్లింలలాగానే "కొందరు" హిందువుల్లో కూడా చెడిపోయిన ఆపిల్ పళ్ళు లేరంటారా? వాళ్ళే బీజేపీ...అందుకే వాళ్ళు నాకొద్దు.

Bhaskar said...

Neither congress nor BJP took concrete steps against terrorism.

Both Congress and BJP exploit "Minority" key word.

One big achievement I can remember of BJP is golden quadrilateral roads. It has many positive results in enhancing economy & reducing fuel burden.

satya said...

"...కాంగ్రెస్ వారి ముస్లింలపై ప్రేమ చాందసవాదాన్ని ప్రొత్సహించేదేకాని ప్రగతిశీల వాదుల్నికాదు." Perfectly said..

అంతేకాదు..ఒకళ్ళ జుట్టు ఒకళ్ళకి పట్టించి ఎలాగొల అధికారం లోకి రావటం కాంగ్రెస్ కి మొదటినించి ఉన్న అలవాటే..

కాంగ్రెస్ చేసేది ఒకళ్ళని చంపి ఇంకోడి పెళ్ళి చేస్తామనటం.. అది మీకు ఆమోదయోగ్యమా? బీజేపీ హిందుత్వ రాజకీయాలకు ఆస్కారం ఇచ్చింది కాంగ్రెస్ కుహానా లౌకికవాద చర్యలే..

అధికారం లో ఉండగా బీజేపీ/ఎన్‌డీఏ ముస్లిం లకి వ్యతిరేకం గా తీసుకున్న నిర్ణయం ఏదైన ఉదహరించండి..

Anonymous said...

Satya wrote: "అయ్యా మహేష్ గారు, మీరు వ్యక్తిగత విద్వేషం తో అభ్యుదయవాది లా ఎంతకాలం భ్రమపడతారు?"

Excellent analysis by Satya. He exposed Mahesh. దలిత వాద ముసుగులొ mahesh attacking Indians and Indian value system.

Mahesh's tactical support for Pakistan is derived from his intense hatred for India beacuse of his Dalit politcs.

Mahesh you have to remember one thing that it is the Indians who are going to uplift and save Dalits, but not your half-brothers in Pakistan.

It is Dalit Mayawati imposed NASA on Varun, but freed up Pakistani terrorists, to get Muslim votes.

Kathi Mahesh Kumar said...

@అనామకుడు: నాకంటూ ఒక వాదముందని నాకు తెలీదు. నాకు ఎప్పుడు ఎలాతోస్తే అది బ్లాగులో రాసెయ్యడం ఇప్పటివరకూ నేను చేసిన "వాదం".

నాది దళితవాదం అని మీకు ఇంత చక్కగా ఎలాతెలిసిందో కాస్త చెబితే, నేను నా వ్యాసాలను ఆధారంగా చూపుతూ కొన్ని ఫండింగ్ ఏజన్సీలకు అర్జంటుగా నా CV పంపుకుంటాను.దయచేసి చెప్పి పుణ్యం కట్టుకోగలరు.

నేను చేసిన పాకిస్తాన్ సపోర్ట్ ఏమిటోకూడా శెలవిస్తే కృతజ్ఞుడ్ని. అలాగే దళితవాదానికీ-పాకిస్తాన్ మద్ధత్తుకీ గల లంకె చెబితే ఇంకా ఆనందిస్తాను.

దళితులకి half brothers పాకీస్తానీయులని మీరు చెప్పేవరకూ నాకు తెలీదు. ఇలాంటి భావనలు కలిగిన మీలాంటి భారతీయుల వలన దళిదోద్ధరణ జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్మను. అయినా, మరొకళ్ళు దయదలిస్తే జరిగేదికాదు దళితుల ఉద్ధరణ.దళితుల్లో వచ్చిన జాతిచైతన్యం రాజకీయం మెడలువంచి, వివక్షాపూరితమైన సమాజం చర్మం వలిచి తమను తాము ఉద్ధరించుకుంటొంది. I have no expectations from feudal lords like you in this regard.

ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా గెలిచి, అతిపెద్ద రాష్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న మహిళను "దళిత మాయావతి" అన్న నీ కుత్సిత్వం ముందు, నాదా వ్యక్తిగత విద్వేషం...కులభావజాలం???

satya said...

>>> ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా గెలిచి, అతిపెద్ద రాష్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న మహిళను "దళిత మాయావతి" అన్న నీ కుత్సిత్వం ముందు, నాదా వ్యక్తిగత విద్వేషం...కులభావజాలం???

బాగుంది కానీ నాక్కొంచెం ద్వందవైఖరి కనిపిస్తుంది. ప్రజల మద్దతు తో "ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా గెలిచి" 3 సార్లు ముఖ్యమంత్రి అయిన నరేంద్రమోడీ పై మాత్రం మతతత్వ ముద్ర ఎందుకు వేస్తున్నట్లు? అది కుత్సితం అనిపించుకోవట్లేదా? 16 రాష్ట్రాలలో " రాజ్యాంగబద్ధంగా" అధికారం లోకి వచ్చిన పార్టీ ని మతతత్వం అనటం ఏ రకంగా సమంజసం?

Kathi Mahesh Kumar said...

@సత్య: ఇందులో ద్వంద్వ వైఖరేమిటో నాకు అర్థం కావడం లేదు. నేను ఈ(ఏ) టపాలో నరేంద్ర మోడీ గురించి చెప్పలేదు. మాయావతి గురించి అస్సలు ఉటంకించలేదు. దళితవాదాన్ని కనీసం చూచాయగాకూడా సూచించలేదు.

ఇప్పటివరకూ బీజేపీ ఎప్పుడూ కేంద్రంలో అధికారంలో లేదు.ఉన్నదల్లా మిగతాపార్టీల దయతో బీజేపీ led NDA. కాబట్టి వీరి "మన్ మానీ" చెయ్యటానికి కుదరలేదు.

అయినా, బీజేపీ మతతత్వభావజాలాన్ని తూర్పారబెట్టడం ఏవిధంగానూ రాజ్యాంగ విరుద్ధం కాదు.ఎందుకంటే అదొక రాజకీయ విధానం.దాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికైనా ఉంది. ఒక ఓటరుగా నాకు ఖచ్చితంగా ఉంది.

Anonymous said...

ఇండియా షైనింగ్ అని బీజేపీ అన్నప్పుడు కాంగ్రెసు ఇండియా వైనింగ్ అని అన్నది. పత్రికలూ అన్నాయి. (వైనింగ్ అంటే శోకిస్తోంది/రోదిస్తోంది అని కదూ అర్థం?) అయినా మనకది వినబడదు! ఎన్నికల ప్రచార సమయానికి, షైనింగు ప్రచారాన్ని ఎన్నికల సంఘం ఒప్పుకోలేదుగానీ, లేకపోతే షైనింగుకు ప్రతిగా "ఇండియా వైనింగ్" గట్టిగా వినబడేది, "భయ్ హో" కంటే బిగ్గరగా వినబడేది.

మహేష్ గారూ, ఇది పక్షపాతం కాకపోతే మరేంటి?

కాంగ్రెసును గెలిపించారో.. కాస్తో కూస్తో మిగిలిన భూమిని గూడా అమ్మేసుకుపోతారు, మీ చేతికి చిప్పను ఇస్తారు, ఇక మీ ఇష్టం అని బాబు, చిరంజీవి, జేపీలు ప్రజలకు చెబుతూంటే అది తప్పుకాదు. బీజేపీ అన్నది మాత్రం తప్పు. ఎందుకంటే అది బీజేపీ కాబట్టి, అది మైనారిటీ వాదాన్ని తప్పు పడుతుంది కాబట్టి, అది మాట్టాడేది ఉగ్రవాదం గురించి కాబట్టి. అవినీతి గురించి మాట్టాడితే అది భయపెట్టినట్టు కాదు, ఉగ్రవాదం గురించి మాట్టాడితే మాత్రం అది భయపెట్టినట్టు. భలే!

ఇది పక్షపాతం కాకపోతే మరేంటి?

మీరు బీజేపీని విమర్శించండి. కానీ అది భయపెడుతోంది అనడం, అందుకుగాను దానిపై ఎన్నికల సంఘం చర్య తీసుకోవాలని కోరుకోవడం మాత్రం అనుచితం. ఎ.సం చర్య తీసికోవడందేముందండి.. హిందువులు, మతం గురించి నోరెత్తితేనే మీదబడి కరిచేసే రోజులు. మీరు కోరుకున్నట్టు, బీజేపీ మీద చర్య తీసుకున్నా నేను ఆశ్చర్యపోను. అసలు, అదేగదా లౌకికవాదమంటే!

Kathi Mahesh Kumar said...

@చదువరి: ఏంటి బీజేపీ నోరువిప్పే హిందూమతం? "హిందూమతం గొప్పది కాబట్టి మాకు ఓట్లెయ్యండి" అనా! కాదే!!

వారు చెసే ప్రచారం ఇతర మతాలవలన హిందూమతానికి ప్రమాదమొచ్చేస్తోందని వాళ్ళు చేసే ప్రచారం. ఇది "హేట్ ప్రాపగాండా"కాక మరేమిటి? fear politics కాక మరేమిటి?

బీజేపీ కాంగ్రెస్ మైనారిటీవాదాన్ని తప్పుబడితే నాకు సమస్యలేదు. కాని మైనారిటీ జనాల్ని ఉగ్రవాదానికి ముడిపెట్టి persecution చేస్తున్నవిధానానికి నేను వ్యతిరేకిని. కాంగ్రెస్ appeasement politics కన్నా ఈ విద్వేషాల రాజకీయాలంటే నాకు భయం.

satya said...

మహేష్ గారు, మీరు పైన అనామకుడికి ఇచ్చిన సమాధానం లోని మాటలని ఉటంకిస్తూ నేను వ్యాఖ్య వ్రాసాను. నరేంద్రమోడీ కి సంభందించి నా వ్యాఖ్య అతనికి మతతత్వ ముద్ర వేసే వారిని అడిగిన ప్రశ్న గా భావించండి.. బహుశా అందులో మీరు ఉన్నారేమో కదా.. ఎందుకంటే he is just a subset of BJP..

కేంద్రం లో పరిపూర్ణ మెజారిటీ తో వస్తేనే రాజ్యంగబద్దం గా వచ్చినట్లా? మరి మాయవతి కూడా రాలేదుగా.. నేను 16 రాష్ట్రాల ప్రజల ఆమోదం ఎలా పొందింది అన్నదానికి సమాధానం వ్రాయకుండా ఎదో చెప్పారు..పైగా ద్వందవైఖరి లేదంటూనే మీ సమాధానం లోనే బీజేపీ కి మతతత్వ భావజాలం అని అంటకట్టి దానిని విమర్శించటం రాజ్యాంగ విరుద్దం కాదని తీర్మానించేసుకున్నారు..పైగా అది చేసేది 'హేట్ ప్రాపగాండా' గా అభివర్ణించారు.

మరి తిలక్, తరాజు, తల్వార్, జూటే మార్ చోర్ (బ్రాహ్మణ, వైశ్య, రాజపుత్రులని చెప్పులతో కొట్టండి) అని బహిరంగంగా నినాదాలు ఇచ్చి అధికారం సంపాదించిన బీస్పీ చేసింది 'హేట్ ప్రాపగాండా' కాదా? దానికెలా మద్దతు ఇచ్చారు? ఇది ద్వందవైఖరి కాదా? అగ్రవర్ణాలని నోటికొచ్చినట్లు అంటే రాజ్యంగబద్దమైన హక్కా? ఎవరిచ్చారు?

బీజేపీ ఎప్పుడూ ఇతర మతాల వల్ల హిందువులకి ప్రమాదమొస్తుందని చెప్పలేదు.. కాంగ్రెస్ రాజకీయ విధానాల వల్ల, మైనారిటీ బుజ్జగింపు చర్యలతో దేశభధ్రత లో రాజీ పడటం వల్ల ప్రమాదముందని చెప్తుంది.

మీకు బీజేపీ ని వ్యతిరేకించే హక్కు లేదని ఎవరూ చెప్పట్లేదు..కాని అదే రకమైన భావజాలం తో మైనారిటీల పక్షాన ఉంటే సెక్యులర్ అని సంతృప్తి చెందే ధొరణినే విమర్శిస్తుంది..

bTW.. బీజేపీ పూర్వరూపం అయిన జనసంఘ్ స్వతంత్రంగానే అధికారం లోకి వచ్చింది.

satya said...

>>>> భయపెట్టి, లేని ప్రమాదాన్ని చూపెట్టి, తమ రాజకీయం గడుపుకునే ట్రెండ్ ను ముందుకు తీసుకెళ్తోంది. .

...నెగిటివ్ ప్రచారాలతో ప్రజల్ని భయపెడుతున్న బీజేపీ రాజకీయ ప్రచార విధానం డౌన్ డౌన్!!"

అంటే బీజేపీ అధికారం లోకి వస్తే మతకలహాలు చెలరేగుతాయని, మైనార్టీలను అణగద్రొక్కుతారని కాంగ్రెస్ చేసే ప్రచారం భయాందోళనల, విద్వేష రాజకీయం కాదా.. మీకు అలా అనిపించకపోతే ఇక్కడ కూడా ద్వందవైఖరే అని భావించాలి..

2 నెలలకి ఒకసారి జరిగిన వరుస తీవ్రవాద దాడులతో ప్రజలు భయపడ్డ విషయం వాస్తవం కాదా? కాంగ్రెస్ వైఫల్యం ఉందని మీరూ ఒప్పుకున్నారు రు ఒప్పుకున్న దాన్నే కదా బీజేపీ కూడా హెచ్చరిస్తూ చెప్తుంది..

Anonymous said...

Satya and Chaduvari brought up excellent points for discussion. I support them one 100 percent.

People hiding behind sinister ideology can not destroy India and Hindus. They can hide behind Dalitism/Communism/Marxism/Islam for some time. As more and more Dalits (Hindus) get education, they see the true colors of such people.

As the saying goes, the king has no cloths.

For any rational reader it is apparent that ideologists of various hues have no cloths.

Mahesh you may be right from your point of view, but one can not condemn one Billion Hindus to Holocaust. In this age and times it is simply impossible to push one Billion Hindus over the cliff like sheep.