Friday, August 14, 2009

మగధీర’లో రంధ్రాణ్వేషణ


‘మగధీర’ seem to be the flavor of the season. ఎక్కడ చూసినా అదే చర్చలు.

హాలీవుడ్ స్థాయికి తెలుగు సినిమా చేరిందని కొందరు. అసలు హాలీవుడ్డే రాజమౌళి దగ్గర నేర్చుకోవాలని మరికొందరూ పందేలు వేసేసుకుంటున్నారు.

పెట్టిన ఖర్చుకి గ్రాఫిక్స్ కి అయ్యే ఖర్చుకి సరిపోలిస్తే సాంకేతికంగా మగధీర సినిమా తెలుగు సినిమా తెరమీద ఒక అద్భుతం అనేది పరిశ్రమ పెద్దలుకూడా నిర్ణయించేశారని వినికిడి.

ఏ గ్రాఫిక్ ఏ హాలీవుడ్/జపనీస్/కొరియన్/చైనీస్ సినిమా నుంచీ స్ఫూర్తి పొందింది అనేది పక్కనబెడితే, ఈ సాంకేతిక విలువల (ముఖ్యంగా గ్రాఫిక్స్) ఒరవడిలో సినిమాకి అత్యవసరమైన కథ,కథనం (స్క్రిప్ట్)లోని లోపాల్ని అందరూ విస్మరింపబూనటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

ఆస్కారొచ్చిన చిత్రాల్లోకూడా కొన్ని ‘గూఫులు’ (goof-ups) ఉండటం కొత్తకాదు. ప్రొడక్షన్ వాళ్ళ మహిమో, అసిస్టెంట్ డైరెక్టర్లు కంటిన్యుటీ చూసుకోకపోవడమో,రచయిత దగ్గర సరైన సమాచారం లేకపోవడమో లేక హడావుడి షూటింగ్ మహత్యమో ఇవి “గొప్పగొప్ప”(?) సినిమాలకే తప్పలేదు. కానీ స్క్రిప్టులోని లోపాల్ని ‘సినెమాటిక్ లిబర్టీ’ అనేసుకోవడం ఎంతవరకూ సమంజసం అనేది ఇక్కడ ప్రశ్న. ఇలాంటి కొన్ని లోపాలు మగధీరలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. రెండు సంవత్సరాలు కష్టపడి సాంకేతిక విషయాలపై పెట్టిన శ్రద్ధ స్క్రిప్టు మీద ఎందుకు పెట్టలేదా అనే సందేహాన్ని కలిగిస్తాయి.

పూర్తి వ్యాసాన్ని నవతరంగంలో చదవండి.

****

3 comments:

Vinay Chakravarthi.Gogineni said...

naaku oka doubt katti gaaru..........

meeru movie choosetappudu enjoy chestaara leka loop holes emunnaya ani choostara...em ledu manam aa mindset to vunte chala silly vi kanipistay naaku vachhina doubt......

alane evaraina oppose chestu comment raaste mee respone baagaledu .......koncham marchukuntaarani req......

inka enti boss sangatulu

Kathi Mahesh Kumar said...

@గోగినేని వినయ్ చక్రవర్తి: నేను సినిమాని critical గా చూస్తూ enjoy చేస్తాను.

ఎవరైనా నన్ను అప్పోజ్ చేసి కామెంట్ చేస్తే నేను సమాధానం వారు అడిగిన విధంగానే ఇస్తాను. నా సమాధానంలో మర్యాద తగ్గదు. కానీ చాలా సూటిగా సమాధానం ఇస్తాను. అంతే. అది బాగుండటం బాగాలేకపోవడం వాళ్ళ ధృక్కోణాన్ని బట్టి ఉంటుంది.

Advaitha said...

idoka abhaavanto koodina prasna la anipisthondi. evvaroo raalla kosam vetukutoo bhojanam cheyyaru. panti kinda kalukkumanna raayini tiyyaka gamaninchi tiyyaka maanaru.
loopholes in a story, artificial cinemaic liberty are just that. pantlo raayi, kantlo nalusu, chevilo joreega laage saapheega, indulge and involve cheyyalsina movie lo artham leni, artham kaani vishayalu choppisthey chaala visugga vuntundi. Katti gaari badha ade anukunta.