Sunday, August 16, 2009

అమెరికన్ మూర్ఖత్వమా లేక తెలియనితనమా!


మొన్న అబ్దుల్ కలాం నిన్న షారుఖ్ ఖాన్.


VIP ప్రోటోకాల్ ఉన్నా, సెక్యూరిటీ చెక్ పేరిట కాలికున్న సాక్సులతో సహా ఒలిపించి ఒక అమెరికన్ విమానయాన సంస్థ భారత మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ అబ్దుల్ కలాం గారిని అవమానపరిచింది. కలామ్ గారు పెద్దగా పట్టింపులు లేని నిరాడంబరుడు కాబట్టి ఈ ఘటనకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ దీనికి ఘాటుగా స్పందించలేని భారత ప్రభుత్వం కేవలం క్షమాపణలు చెప్పమని ఆ సంస్థకు చెప్పి ఊరుకుంది. అదే మనకున్న పెద్ద సమస్య.

ఒక మాజీ దేశాధ్యక్షుడ్ని కూడా ఒక potential తీవ్రవాదిగా చూసే మానసికదౌర్బల్యం అమెరికా సంస్థకుంటే ఉండొచ్చుగాక, కానీ ఒక గౌరవనీయుడైన మనదేశ పౌరుడిని యదేచ్చగా మనదేశంలోనే అవమానపరిచే హక్కు ఏ విదేశీసంస్థకూ ఉండకూడదు. క్షమాపణలతోపాటూ ఆ విదేశీయాన సంస్థ భారతప్రభుత్వానికిచ్చిన సలహా మరింత హేయమైనది. మనదేశంలో VVIP ల లిస్టు చాలా పెద్దదట. ఆ పెద్ద లిస్టుని కుదించి వారి సేవలు మెరుగుపరిచేలా చూడాలట. ఏమిటీ వీళ్ళ దాష్టీకం? నూటపదికోట్ల మందున్న భారతదేశంలో ఎంత మంది VIP లు VVIPలు ఉండాలనేది వీళ్ళ సౌలభ్యాన్ని బట్టి నిర్ణయించుకోవాలా! Outrageous !!!

అమెరికాలో కొన్ని భారతీయ సంస్థలు స్వాంతంత్ర్య దినోత్సవ వేడులకు జరుపుకుంటూ హిందీ నటుడు షారుఖ్ ఖాన్ ను అమెరికా ఆహ్వానించాయి. న్యూజర్సీ లోని Newark Airport లో దిగంగానే షారుఖ్ ఖాన్ ను అమెరికన్ అధికారులు రెండు గంటలు నిర్భంధించి ప్రశ్నించారు. ఈ ఘటనకు మూల కారణం "ముస్లిం" అని చెప్పకనే చెప్పే "ఖాన్" అనే తన పేరు అనేదాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇస్లాం పేరువింటేనే నీడని చూసి కూడా భయపడే అమెరికా, ముస్లిం విజిటర్లపై నిఘా ఉంచడం అర్థం చేసుకోదగ్గ అంశం. కానీ...షారుఖ్ ఖాన్ కేవలం ఒక సాధారణ ముస్లిం కాదు. ఒక ప్రముఖ భారతీయ నటుడు. భారతదేశానికున్న గ్లోబల్ ఐకాన్స్ లో ఒకడు. ఇలాంటి వ్యక్తి పైన సరైన ఇంటలిజెన్స్ సమాచారం లేకుండా ఇలాంటి చర్యను చేపట్టడం మూర్ఖత్వమైనా అయ్యుండాలి. తెలియనితనమైనా అయ్యుడాలి. లేకపోతే ఏంచేసినా చెల్లుతుందనే గర్వమైనా అయ్యుండాలి.

పైరెండు ఘటనల్లోనూ భారతప్రభుత్వం స్పందన చాలా పేలవంగా ఉంది. మొదటి ఘటనలో ఆ విదేశీయాన సంస్థను నిషేధించి ఉండాల్సింది. మనదేశంలో operate చేస్తూ మన నియమాలు పాటించని ఇలాంటి సంస్థల అవసరం మన దేశానికి లేదు. రెండో ఘటనలో అమెరికన్ అధికారుల చర్యను తీవ్రంగా ఖండించి, ఆ అధికారులపైన సరైన చర్య చేపట్టేలా అమెరికన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి.

అమెరికా ఎంత అగ్రరాజ్యమైనా ఇలాంటి తలతిక్కపనులు భారతీయులపైన చేస్తామంటే చూస్తూ ఊరుకోని సార్వభౌమాధికారం, ఆత్మగౌరవం కలిగిన దేశంగా భారతదేశం ఒక సందేశాన్ని ప్రపంచానికి తెలపాలి.

****

17 comments:

Rajendra Devarapalli said...

సమస్యను చర్చించారు బాగానే ఉంది,పరిష్కారాలను చూపే ప్రయత్నమూ మొదలుపెట్టండి.షారుఖ్ ఖాన్ వల్ల ఈ విషయానికి మరొక నాలుగురోజులు ప్రాధాన్యత మరలా మామూలే.

MURALI said...

Government should express the ability of their intelligence

Unknown said...

మహేష్ గారూ, అది న్యూయార్క్ కాదు. న్యూజెర్సీ లో జరిగింది.

జయహొ said...

మహేష్,
తమాషా ఎమిటంటె కలాము కి అవమానం మన దేశంలొనే జరిగినప్పుడు పెద్దగా ప్రతిస్పందించని మన ప్రభుత్వం షారుఖ్ విషయం లో అంబికా సోని గారు టిట్ ఫర్ టాట్ గురించి మాట్లాడటం. అంటె షారుఖ్, అబ్దుల్ కలాము కంటే ఎక్కువ విలువ కలవాడా?

*పైరెండు ఘటనల్లోనూ భారతప్రభుత్వం స్పందన చాలా పేలవంగా ఉంది. మొదటి ఘటనలో ఆ విదేశీయాన సంస్థను నిషేధించి ఉండాల్సింది. మనదేశంలో ఒపెరతె చేస్తూ మన నియమాలు పాటించని ఇలాంటి సంస్థల అవసరం మన దేశానికి లేదు. రెండో ఘటనలో అమెరికన్ అధికారుల చర్యను తీవ్రంగా ఖండించి, ఆ అధికారులపైన సరైన చర్య చేపట్టేలా అమెరికన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి.*

మీరు చెప్పిన పైవి జరగాలంటె ముందర మనకి మన జాతీ మీద అభిమానం, ఆత్మ విశ్వాసం ఉండాలి. మన లో చాలమంది కి మన జాతియత మీదె స్పష్టమైన అవగాహన లేదు.ఈ దేశం లో మీరు ఎప్పుడు విమర్శించే ఆర్.యస్.యస్.వాళ్లు తప్ప ఇంకేవరైనా భారత జాతియత ను గురించి మాట్లాడినా వారున్నారా ? ఈ లుక లుకలు అన్ని సదరు అమేరికా వాడికి తెలుసు కనుకనే వాడు మన దేశాన్ని ఒక ఆట ఆడిస్తున్నాడు. దీనికంతటికి కారణం మన ప్రధాని గారి అజ్ఞానం, వారికి లెక్కల( గ్రోత్ రేట్,మొదటి 100 రోజులు) మీద ఉన్న అవగాహన పాలన మీద లేక పోవటం. అందరు ఆయన చేప్పె అభివృద్ది మాటలు విని,ఆయన కున్న విద్యా అర్హతలు చూసి మాట్లాడేవారే కాని ఆయన నీజమైన సామర్థ్యం ఎవ్వరు మాట్లాడటం లేదు. మొన్నటికి మోన్న చైనా వాడు ఈ దేశాన్ని 20 భగాలు చేయాలంటె మన జవాబు ఎమీటి? ఎమీ లేదు అది ఎవరో వాళ్ల దేశం లో అలా రాసుకున్న వ్యక్తి గత అభిప్రాయమంటాని సరి పుచ్చారు.కాంగ్రెస్ స్పొక్స్ పర్సన్ ఎమీ లేదు అది ఎవరో వాళ్ల దేశం లో అలా రాసుకున్న వ్యక్తి గత అభిప్రాయమంటాని సరి పుచ్చారు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయమేమిటంటె చైనా లో భారత్ దేశం లో లాగ అభిప్రాయలు వెల్లి బుచ్చటానికి వీలులేదు అని.

Asmita said...

Mahesh kumar garu! i did not expect this from you!, security issues are personal to any country, why don't we accept that this their personal matter and when we are enteringinto their land let us accept and respect their laws!

list of VIPs etc., why should we have many VIPs and VVIPs? like earlier in hospitals we had only one ICU, now there are many different ICUs like general wards:)

when their own officials and others are going through same procedures then whatz so great about our stars?

if we feel bad about these things, then why should one go to their country? we love to work there, and stay there,(with our own reasons) can't we acceptand respect their laws and culture?

finally, SRK is not singled out in this treatement, many unknown people are subjected to this, noone is speaking about them, just because he is a star, we all are ready to offer our support and condemn US?

Kathi Mahesh Kumar said...

@జయహో: ప్రభుత్వ విదేశీ విధానంలోని వైఫల్యాన్ని మీరు చాలా చక్కగా రాజకీయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా ప్రధానిపై అసమర్థత అభియోగం మోపుతున్నారు.Let's separate policy from politics.Government's inaction from rhetoric.

ఆర్.ఎస్.ఎస్. ప్రబోధించే జాతీయతలోని జాతీయత ఎంతో నాకు తెలుసు. కాబట్టి దాన్ని పక్కనుంచుదాం. దేశ సార్వభౌమత్వం,ఆత్మగౌరవం అందరికీ సంబంధించిన విషయం. ఈ స్వతంత్ర్యదేశంలో దానికోసం గొంతెత్తే అధికారం అందరికీ ఉంది.

కలాం విషయంలో ఏవియేషన్ మినిస్ట్రీ యాక్షన్ తీసుకుంది. కానీ అది సంస్తృప్తికరమైనది మాత్రం కాదు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ మధ్యనే మానవహక్కుల విషయంలో, మైనారిటీలపై హింస విషయంలో భారతప్రభుత్వం అమెరికన్ రిపోర్టుకు ధీటైన సమాధానం ఇచ్చింది. అదే విధంగా మనవాళ్ళు assert చేస్తారేమో చూద్దాం.

@అస్మిత: అబ్దుల్ కలాం, షారుఖ్ ఖాన్ లు అమెరికాను తీవ్రవాదంలో ముంచెత్తాలనుకునేవాళ్ళా! వారి గురించి కనీసమాత్రపు సమాచారం, మరికొంత ఇంటలిజెన్స్ సమాచారం చాలదూ ఈ ఘటనల్ని నివారించడానికి?

Its nothing but sheer arrogance. Nothing else.

జయహొ said...

*ప్రభుత్వ విదేశీ విధానంలోని వైఫల్యాన్ని మీరు చాలా చక్కగా రాజకీయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్.ఎస్.ఎస్. ప్రబోధించే జాతీయతలోని జాతీయత ఎంతో నాకు తెలుసు.*

రాజకీయం చేయడానికి నాకేమి అవ్సరం. నేను నా అభిప్రాయం చేప్పాను అంతె.దాని వలన నాకొచ్చేలాభం ఎమీ లేదు. నేను చెప్పిన దాంట్లొ ఎమైనా అబద్దం ఉంటె అది ఎక్కువ కాలం నిలవదు. ఇక్కడ పాలసిలు చేసిన వారే పాలిటిక్స్ చెస్తున్నారని గుర్తించాలి. గత 6సం|| నుంచి మన ప్రధాని ఒకే వ్యక్తి అతని టీమే పాలసి లు చేయటం దానిని వేరు గా ఎందుకు చేసి చూడాలి?
పొని ఆర్.ఎస్.ఎస్. కాకునండా ఇంకేవరు మన దేశం లో జాతియత గురించి మాట్లాదేవారౌ ఉన్నారా. కనీసం ప్రభుత్వం అయినా మాట్లాడుతున్నాదా?

జయహొ said...

*ఈ మధ్యనే మానవహక్కుల విషయంలో, మైనారిటీలపై హింస విషయంలో భారతప్రభుత్వం అమెరికన్ రిపోర్టుకు ధీటైన సమాధానం ఇచ్చింది.*
మహేష్ మీరు చిన్న చిన్న చర్యల కే సంతృప్తి పడేవారని అర్థమౌతున్నాది. అసలికి ఎంకొక దేశం ఐతె అమెరిక రాయబారిని పిలిచి నాలుగు పెట్టి బహిష్కరించి ఉండేవారు. ఈ రోజు ఈనాడు లో నటుదు రాజ మురాద్ గారి వ్యాఖ్యలు చదివేది. మీకు తెగ నచ్చే కాంగ్రెస్ పార్టి లో ఉన్న నాయకులనే ఉపయొగించుకోనే పరిస్థిలో లేదు. లేక పోతె లెక్క లు చూడటంలో నిపుణుడైన (చిదంబరానికి) హోం శాఖ ఇచ్చినప్పుడె వారి పాలన సమర్ధవంతం గా జరగటానికి ఏమి చర్యలు తీసూకోవటం లేదని తెలుస్తున్నాది. ఇలా రాసుకుంటూ పోతె మన ప్రధాని గారి ఇక్ నెస్లు ఒకటా రెండా ... ఒక పుస్తకం రాయవచ్చు. ప్రస్తుత కేబినేట్ మీడియా వాలని తౄప్తి పరచటానికి ఎర్పాటు చేసినట్టు గా ఉంది.
http://www.andhrabhoomi.net/comment.html

Asmita said...

Mahesh garu!

why should they relax their own security check?

whether it is kalam or SRK?
(this is nothing to do with Kalam's intelligence or SRK's entertaning capability in tight Tee shirts:) )

we make a big noise when amnesty talks about child labour in our country or any other organisation talks about our corruption levels then why should they relax their own security measures?

i don't think this is arrogance, even if it is arrogance it is worth:) don'tyou think, we are entering into their land :)

instead of condemning this action, we should learn from their work culture,don't you think so? :)

once you are out from your mother land, in any other place you are second grade citizen, when we travel we accept this condition subconsciously and proceed further :)

జీడిపప్పు said...

మహేష్ గారు, మీలాంటి మిడి మిడి జ్ఞానం ఉన్నవాళ్ళే మన దేశానికి ఉన్న అసలు సమస్య. ఏదయినా రాసే ముందు కాస్త ఆలోచించండి. తెలియకపోతే ఇంకొకరిని అడిగి తెలుసుకోండి. అమెరికాలో సెక్యూరిటీవాళ్ళతో మీకు ఎదురయిన కొన్ని అనుభవాలు చెప్పగలరా? నేను చెప్పగలను. ఒక రోజు నా ముందు ఉన్న పది మందిని ఏమీ అనకుండా నన్ను పక్కకు రమ్మని పిలిచి సూట్కేస్ ఓపన్ చేసి అన్నీ చెక్ చేసారు. అది తప్పు అనో, జాత్యాహంకారము అనో అనుకుంటే నన్ను మించిన మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. కానీ నేను అలా అనుకోను. ఎందుకుంటారా? అమెరికాలో సెక్యూరిటీ వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి.

btw, షారూఖ్ ఖాన్‌కు అంత అవమానం జరిగితే మళ్ళీ అమెరికాలోకి అడుగుపెట్టి మరుసటి రోజు dance showలో డ్యాన్స్ చేసాడెందుకు, వెంటనే ఇండియాకు తిరిగి వచ్చేయక?

రవి said...

అమెరికా చేసిన వెధవపనికన్నా, మన వాళ్ళ చేతకానితనం బాగా గుచ్చుతోంది. అంతెందుకు, పందిఫ్లూ అమెరికా నుండీ, కెనడాల నుంచీ దిగుమతి అవుతున్నది అన్నప్పుడు, ఆయా సంస్థలను నిషేధించటమో, ప్రయాణీకులను పరీక్షలు గట్రా చేసి పంపక పోతే జరిగే పరిణామాలను గురించి తీవ్రంగా హెచ్చరించటమో అన్నా చేసి ఉండవచ్చు.

Srujana Ramanujan said...

"Its nothing but sheer arrogance. Nothing else."

Right

Kathi Mahesh Kumar said...

@జీడిపప్పు: నా మిడిమిడి జ్ఞానాన్ని మీ సుజ్ఞానంతో ఉద్ధరించండి. నాకు తెలిసింది చెబుతాను. మీ అనుభవాన్ని విన్నవించండి.

భారతదేశం నుంచీ అమెరికా వెళ్ళే ప్రతి పౌరుడూ విమానాశ్రమంలో ఇమ్మిగ్రేషన్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అందులో ID verification, Visa checking,finger printing (ఇప్పుడు రెటీనా చెక్ కూడా ఉందట)తరువాత విమానంలో కూర్చోబెడతారు. అదే data అమెరికన్ విమానాశ్రయాల్లో ఉన్న సిబ్బందికి చేరుతాయి. వాటి ఆధారంగానే ఒక వేళ అనుమానం వస్తే లేదా FBI,CIA cross verification లో name pop-up అయితే మళ్ళీ చెక్ చేస్తారు.

ఈ నేపధ్యంలో, కలామ్ గారికున్న diplomatic immunity దృష్ట్యా frisking కాదుకదా కనీసం ముట్టుకోవడానికి అమెరికన్ సెక్యూరిటీ అధికారులకు అధికారాలు లేవు.

షారుఖ్ ఖాన్ కు ఒకసారి ఇక్కడ ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేసిన తరువాత అక్కడ రెండుగంటలు నిర్భంధించి ప్రశ్నించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏ FBI,CIA red flag raise చేస్తేతప్ప. అలా చేశారా? లేదు. మరి కేవలం పేరులో ఖాన్ ఉంటే ఆపేస్తారా? అదీ అతనొక భారతీయ నటుడు అని తెలిసికూడా! He has an Iconic status in India and abroad.ఈ మాట నేనన్నది కాదు, అమెరికన్ కౌన్సిలేట్ అన్నమాట.

cbrao said...

అమెరికా వాళ్లు షారుఖ్ ను భారత దేశ ప్రఖ్యాత నటుడని గుర్తించలేకపోయారు. వారి తెలివితేటలు (Database) ఏ స్థాయిలో వున్నాయో తెలియటం లేదా?

భావన said...

ఎందుకు చేస్తారో ఈ అమెరికా లో నాకు అర్ధం కాదు.. ఒక్కోసారి ఏదో ప్రపంచాన్ని మొత్తం అర్ధం చేసేసుకుంటున్నట్లు పోజ్ పెడతారు మళ్ళీ అంతలోనే ఇలాంటి అజ్ఞానపు చేష్టలు చేస్తారు...వీళ్ళ తెలివితేటల గురించి, లేదా వీళ్ళ డేటాబేసెస్ మీద అంత నమ్మకం పెట్టుకోకండి, వీళ్ళు మనలానే అలసత్వం, లెక్కలేనితనం సర్వత్రా...(వీళ్ళు మాత్రం మనుష్యులు కాదూ.....) సామాన్య మానవుడి జన జీవితం లోకి ఆ సర్పెంటీనెస్స్ ఆట్టే చొచ్చుకు రాదు కాబట్టి సర్వం సౌఖ్యం అన్నట్లు వుంటుంది.. మహేష్ గంటే ఆపేరట రెండు గంటలు కాదు అట. ఒక గంట ఆయన లగేజ్ రాక కూర్చున్నాడట..(news from yahoo)
@ అస్మిత: మీరు ఎక్కడ వుంటారో నాకు తెలియదు కాని "i don't think this is arrogance, even if it is arrogance it is worth:) don'tyou think, we are entering into their land :) " ఈ వ్యాఖ్య మాత్రం నేను ఒప్పుకోను అండి.. I dont think its an arrogance either, it's a overlook and their stupidity (not using their technology is what I mean by stupidity) but I condemn the sentence " it is worth" why it's worth? WHy do u think this country belongs to them and not to us? U know the meaning of USA It starts with United states By the name itself it shows it doesn't belong to one particular race or one particular color. Its all ours. we like to earn more money or fasinated about technolgy( I am not sure how it works though), or luxuries some or the other reason make us to move to this country, so does others (white people). It's only few generations difference thats it.... It's not their country, all the tax payers or who are working hard on this land this country belongs to every one. Any where else the rule u said may imply "we will be second class citizens once we leave our mother country" but not in america. "

Bhaskar said...

మహేష్ గారు, పైన చాల మంది రక్తం లో డాలర్లు కలిసిని అమెరికా భక్తులు ఉన్నారు. వాళ్లకు నచ్చ చెప్పటం అనవసరము.

నిరంతరమూ వసంతములే.... said...

have a look of the article posted in the following link
http://www.andhrabhoomi.net/weakpoint.html