Thursday, June 10, 2010

దళిత ఉద్యమానికి ‘కమ్మ మోడల్’ కావాలా !

ఈ మధ్య ఒక మిత్రుడితో దళిత ఉద్యమాలలో నిండుకున్న నిబద్ధత గురించి. విజన్ లేమిని గురించి. వ్యూహరచనలోని వైఫల్యం గురించి చర్చిస్తుంటే ఒక విలువైన చారిత్రక సమాచారం చెప్పారు.

స్వాతంత్ర్య పూర్వం జరిగిన ద్రవిడ ఉద్యమానికి తెలుగు జాతి  వెన్నుపోటు పొడిచినా, ఆ ఉద్యమం పుణ్యమా అని బ్రాహ్మణేతర మధ్యకులాల్లో రాజకీయ ఆశయాల స్పృహమాత్రం చాలా మెండుగా వచ్చింది. స్వాతంత్ర్యానంతరం  కూడా చాలావరకూ బ్రాహ్మణ కుల ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై పట్టుసాధించడానికి కమ్మ కులం ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

అది 1952 (58 ఏళ్ళనాటి మాట)
వేదిక: ఆంధ్రరత్నభవన్, బెజవాడ
సందర్భం: ఆంధ్ర పిసిసి అధ్యక్షుని ఎన్నిక
పోటీదారులు: ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు బలపరిచిన నీలం సంజీవరెడ్డి, కులబలమే దన్నుగా నిలబడిన ఆచార్య రంగా (గోగినేని రంగ నాయకులు).

అదొక సం’కుల’ సమరం. నువ్వు – నేనా అన్నట్టు ప్రతిష్టాత్మకంగా సాగిన పోటి. ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ ప్రాబల్యాన్ని నిరూపించే, నిర్దేశించే అతి కీలకమైన పోటి. ప్రకాశం పంతులు చాణక్యంతో సంజీవరెడ్డి గెలిచారు.

రంగా వర్గం (వర్ణం) ఈ ఘోర ‘అవమా’నాన్ని సహించలేకపోయింది. ధనబలం, స్థానబలం, బలగం ఉండి, ఒక విధంగా తమ రాజ్యంగా చెప్పబడే బెజవాడలో తమ అభ్యర్థి ఓటమి వారికి మింగుడు పడలేదు. పిసిసి డెలిగేట్లు ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నప్పుడు, రంగా వర్గాలలో ప్రముఖులైన పిన్నిమనేని సోదరులు (కోటేశ్వరరావు, శ్రీనివాసరావు). తమ కుల సమావేశానికి తక్షణ పిలుపునిచ్చారు. జమిందార్లయిన చర్లపల్లి రాజా వారి తర్వాత, ప్రాంతంలో అత్యంత పెద్ద భూస్వాములు పిన్నమనేని వారే (1600 ఎకరాలు). పార్టీలతో సంబంధం లేకుండా కమ్మ ప్రముఖలందరూ బెజవాడ గోపాలరెడ్డి చౌల్ట్రిలో సమావేశమయ్యారు. ఇంత అంగబలం, ధనబలం ఉండి కూడా ప్రకాశం పంతులు అనే బ్రాహ్మణుడి వ్యూహానికి చిత్తవడం మీదే చర్చ ప్రధానంగా సాగింది. బ్రాహ్మణాధిక్యత మీద వారు అప్పటికి అర్థ శతాబ్ది పైగా చేస్తున్న సాంస్కృతిక యుద్ధాన్ని భూమార్గం పట్టించి, పోరు ప్రత్యక్షం చేయవలసిన అవసరాన్ని ఆ సభ నొక్కి చెప్పింది. తత్ఫలితంగా సభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలలో కొన్ని.

1. ఆడపిల్లైనా, మగపిల్లాడైనా తమ సంతానాన్ని చదివించడానికి విద్యావకాశాలున్న పట్టణాలకి తల్లి లేదా, తండ్రి వలసరావాలి.
2. ప్రొఫేసర్లు, డాక్తర్లు, ఇంజనీర్లు, సివిల్ సర్వెంట్లు, బ్యాంకు మేనేజర్లు….. ఇలా దాదాపు అన్ని ఉన్నతోద్యోగాలను ఆక్రమించిన బ్రాహ్మణుల స్థానాన్ని తమ వారసులు సాధించాలి. అందుకుగాను అవసరమైన ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి. ఎటువంటి శ్రమనైనా తీసుకోవాలి.
3. బ్రాహ్మణుల ఆస్తుల్ని (మాన్యాల్ని) ఎలాగైనా కొనుగోలు చేయడం ద్వారా వారికి గ్రామాలతో ఉన్న లింకుల్ని తెంచేయాలి.

ఇవన్ని ధీర్ఘకాలపు ప్రణాళికలు కాబట్టి, ఇక తక్షణం అమలు చేయడానికి వ్యాపార రంగాన్ని ఆశ్రయించాలని, ఆ వ్యాపారులు కచ్చితంగా ‘క్యాష్ ఓరియంటెడ్’ గా మాత్రమే ఉండాలని సభ తీర్మానించింది. అంటే, కస్టమర్లు ముందే డబ్బు చెల్లించే వ్యాపారులు: హోటళ్లు, లాడ్జీలు, బస్సు సర్వీసులు, సినిమా హాళ్లు…. వంటి ‘అప్పు’పెట్టే రిస్కులేని వ్యాపారులు మాత్రమే చేయాలన్నిది తీర్మాన సారాంశం.


సభ ఆమొదించిన తీర్మానాలు కులానికి శిరోధార్యాలయ్యాయి. తు.చ తప్పకుండా అమలవడంతో గురి తప్పలేదు; అక్ష్యం నెరవేరింది, నెరవేరుతూనే ఉంది. ఇదే ‘కమ్మ మోడల్’.


ఈ విధంగా శతాబ్దాల బ్రాహ్మణాధిక్యతన ప్రశ్నించి, ఆత్మగౌరవ ప్రకటన చేసిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక సారధులు గుంటూరు, కృష్ణ (అప్పటి కృష్ణ మాత్రమే) కమ్మవారు.  జీవితాన్నే ప్రతిఘటనోద్యమంగా మార్చుకున్న పునరుజ్జీవనోద్యమకారుడు త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి వారి త్యాగాల ఫలితమే వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదాని కట్టబెట్టింది. ఎన్.టి. రామారావు రాకతో అది పతాస్థాయిని చేరింది.


ఈ పరిణామక్రమంలో కమ్మవారు మరో ఆధిపత్య వర్గంగా మారడం దురదృష్టకరమైన పరిణామం. ఈ ఉత్థాన చరిత్రలో వారూ ఒక దాష్టిక వర్గమైనారు. ఈ పరిణామం దురదృష్టకరమే అయినా పంథామాత్రం అనుసరణీయంగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న మధ్యకుల ఆధిపత్యాల్ని సమగ్రంగా ఎదుర్కోవాలంటే దళితులకు ఇలాంటి మార్గం ఒకటి ఖచ్చితంగా అవసరమే కావొచ్చు. కాకపోతే ఇలాంటి వ్యూహత్మక పరిణామాన్ని లీడ్ చెయ్యగల నాయకులు, వ్యూహం యొక్క అమలుకి కావలసిన సరంజామా సమకూర్చుకోగలరా అన్నదే పెద్ద ప్రశ్న.

****

59 comments:

gaddeswarup said...

I am not aware of this meeting; I thought that kammas were already on the move when one of the followers of Tripuraneni, Pamulapati Krishnaiah Chowdary (?), became the District Board president of Guntur district and started around hundred schools. I think there are some scholarly articles on this topic by Carol Upadhyaya and others. Anyway, I was vaguely suggesting some thing similar to an acquintance invoved in educational scholarships for dalits. I think that one of the strengths of kammas was a land base and agricultural skills. Now many of them are leaving villages and in any case lot of the land is worked by dalit and other labourers. I found dalits in Guntur district eager to lease land and cultivate it. But it is an expensive and risky business and needs about 12,00 rupees an acre for various expenses. I persuded some friends to start a micro loan scheme but they limited the loans to about 8,000 rupees for persion and did not give agricultural loans. Another wanted to buy second hand machinery to produce paper plates and that needed 15,000 rupees which was also refused. I think with not so huge amounts, one can start such things in the places where one has reliable connections. Another possibility is governmental schools. In the area I am familiar with many students who can afford are going to private schools and lot of the students in govt. schools are from poorer groups. I think that there is a possibility also for teachers from poorer classes in such schools (one school I know were looking for a dalit head master). I think some initiatives in land, education, manufacture may be possible on small scale for groups of individuals if they have the intention and some resources. There are places run by Ramanaidu which trains students for free (and paying a stipend) to learn new agricultural skills but they are not utilized due to lack of knowledge among the dalits.

Samaikya said...

మీరు చెప్పినవన్నీ ఫాక్చ్యువల్ గా నిజమని ఆశిస్తాను. మొత్తానికి ఆంధ్ర రత్న (కమ్మ) భవనం లో ఓడిపోయిన కమ్మ వారు, రెడ్డి (గోపాల రెడ్డి) భవనం లో ప్రణాలిక వేశారన్నమాట :-)
దళితులు ఆ పంథాను ఎంచుకొంటే దాని వలన కూటికి గతిలేని దళితులకి మంచి జరిగితే నేను దానిని స్వాగతిస్తున్నాను.
ఇప్పటికీ కృష్ణా, గుంటూరు జిల్లాల లో పేడ పిసుకుతూ, పెరిగిన కూలి రేట్ల వలన (కూలి రేట్లు పెరగటం ముఖ్యం గా తన అధికారం కోసం ణ్ ట్ ఋ ప్రారంభించిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తో మొదలయ్యింది) వ్యవసాయం లాభదాయకం కాక ఇబ్బంది పడుతున్న చిన్న కారు రైతులు కమ్మ వారి లో అనేకులు ఉన్నారు. వారికి ఈ 1600 ఎకరాల వారి వలనా, నట సార్వ భౌములవలనా ఎందుకు న్యాయం జరుగలేదు అనే విషయాన్ని దళిత ఉద్యమ కారులు దృష్టి లో పెట్టుకొన వలసిన ఒక విషయం.
దళిత ఉద్యమాలు కూడా రేపు ఒక దాష్టీక వర్గానికి దారి వేయవచ్చు. అలా అవ్వకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఆలోచించుకోవాలి.

Unknown said...

మీకు తెలీదేమో ఈ 'కమ్మ మోడల్ ' కోస్తా జిల్లాలలోని దళిత వర్గాలు ( మాల కులస్తులు ) ఇప్పటికే అంతర్లీనంగా అనుసరిస్తున్నారు. ఇది 90 వ దశకంలో మొదలైంది. ముఖ్యంగా ఇది మాల కుల ఉద్యోగ వర్గంలో అధికంగా ఉంది . దీనికి కారణం ఎక్కడ తాము అణగదొక్క బడుతున్నామో అక్కడే గౌరవింపబడాలి అనే ఏకైక ఉద్దేస్యంతో ఇది చాప కింది నీరులా సాగిపోతుంది . దీనికి సాంస్కృతిక నేపద్యం కూడా తోడయ్యింది. కులం వలన అవమానాలను పొందిన మాల కులస్తులు ఆ కులాన్ని వదిలివేయడానికి సిద్దపడ్డారు. ప్రభుత్వపరంగా వీళ్ళు రిజర్వేషన్లు పొదుతున్నప్పటికీ వ్యక్తిగతంగా తమను తాము కమ్మ కులస్తులుగా చెప్పుకుంటున్నారు . వీరు తమ పేరు చివర 'చౌదరీ అని తగిలించుకుంటున్నారు . దీనివలన వారు ఆత్మన్యూనతను దూరం చేసుకున్నారు . సాంస్కృతీకరణ(sancritisation) లో భాగంగా ఇది జరుగుతుంది. నగరల్లో నున్న అత్యధిక మాల కులస్తులు ఇలాగే రూపాంతరం చెందారు . రెండు మూడు తరాల తర్వాత వీళ్ళు( వీరి సంతానం) పూర్తి స్తాయి కమ్మకులస్తులుగా రూపాంతరం చెందుతారు . నాకు తెలిసి ఎంతోమంది ఉన్నతోద్యోగులు ఇలానే మారిపోయారు . తమిళనాడు లోని ' నాడాఋ కులస్తులు కూడా ఇలానే సాంస్కృతీకరణ చెంది అగ్రకులం గా రూపాంతరం చెందారు . రూపంతరం చేందడానికి ముందు నాడార్ కులస్తులు 'కల్లు గీతా కార్మికులుగా జీవించేవారు . కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడ Dominent Cast గా అవతరించారు . అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ నాడార్ కులస్తులవే . మాల కులస్తులు కూడా 30, 40 సంవత్సరాలలో ఇక్కడ Dominent cast గా రూపంతరం చెందినా ఆశ్చర్యపోనక్కరలేదు. అందుకే కదా చంద్రబాబు హయాంలో ఇదంతా పసిగట్టి మాలలను అణగదొక్కడానికి SC వర్గీకరణను తెరపైకి తెచ్చాడు

Praveen Mandangi said...

ఒరిస్సాలోని కమ్మవారు ఒకప్పుడు చిన్న రైతులు. రాయగడ పట్టణంలో మా పెద్దమ్మ గారి ఇల్లు కమ్మవారు ఉండే వీధిలోనే ఉంది. వ్యవసాయం మానేసి వ్యాపారాలు చెయ్యడం ద్వారా ఆ కమ్మవారు మధ్యతరగతిగా ఎదిగారు. ఒరిస్సాలో పట్టణ ప్రాంత జనాభా 14% మాత్రమే ఉంది. పట్టణాలకి దూరంగా గ్రామాలలో ఉంటున్నవారి సంగతి ఏమిటి? రాజకీయ నాయకులు పట్టణాలకి వెళ్ళి ఆస్తులు సంపాదించుకుంటారు కానీ పల్లెలని అభివృద్ధి చేస్తే కొత్త పట్టణాలు ఏర్పడతాయనే స్పృహ ఉండదు. అందుకే అగ్రకులాలలో కూడా అనేక మంది మట్టి, పేడ పిసుకుతూ బతుకుతున్నారు.

Unknown said...

ఈ టపాలో ఉన్న సమాచారంలో వాస్తవం లేదు. మన రాష్ట్రంలో బ్రాహ్మణులు రాజకీయరంగం నుంచి విరమించుకోవడం స్వచ్ఛందంగానే జరిగింది. ఎవరూ వారిని ఆ రంగం నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటలేదు. అదీ గాక బ్రాహ్మణుల రాజకీయ కార్యకలాపాలు ఇప్పటిలా పదవీ రాజకీయాలకు గానీ, ఎన్నికల రాజకీయాలకు గానీ సంబంధించినవి కావు. అవి ఆనాటి దేశ స్వాతంత్ర్యోద్యమంతో ముడిపడినటువంటివి. స్వాతంత్ర్యోద్యమానికి ముందు బ్రాహ్మణులు ఒక ప్రీస్ట్‌లీ క్లాస్ గా మాత్రమే సమాజానికి తెలుసు. అంతకు ముందెప్పుడూ వారు రాజకీయాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ఒకటీ, అరా రాజుల దగ్గర దివాన్‌లుగా పనిచేయడం మినహా ! స్వాతంత్ర్యోద్యమంలో నాశనమైన బ్రాహ్మణ కుటుంబాలే తరచుగా కనపడతారు.

స్వాతంత్ర్యోద్యమంలో జైలుకెళ్ళిన బ్రాహ్మల పొలాల్ని బ్రిటీషు ప్రభుత్వమే బలవంతంగా లాక్కుంది. కనుక 1952 నాటికే మెజారిటీ బ్రాహ్మణులు భూమిలేని పేదలుగా ఉన్నారు. అటువంటపుడు వారి పొలాల్ని కమ్మవారు "ఏదో ఒకటి చేసి" కచ్చగా కొన్నారనడం బహుశా అర్థం లేని వాదన. ఈ దేశంలో ఏదీ ఎవరినుంచీ బలవంతంగా కొనలేం. ఎక్కువమంది బ్రాహ్మణులు అంతకుముందున్న, గ్లామర్ లేని ప్రీస్టి‌లీ వృత్తుల్ని వాటితో పాటు గ్రామాల్ని వదిలేసి అంతకంటే ఎక్కువ గ్లామరున్న నగర/పట్టణ ఉద్యోగాల మోజులో వలసపోవడం అసలు కారణం. అందుకే ఈనాడు పది గ్రామాలకొక బ్రాహ్మణుడు కూడా కనిపించని పరిస్థితి వచ్చింది. అందరూ వలసపోయినట్లు కనిపిస్తోంది. హైదరాబాదు మెట్రోపాలిటన్ జనాభాలో పదిశాతం కంటే ఎక్కువమంది బ్రాహ్మణులేనని మీడియావాళ్ళ అంచనా. కానీ పట్టణ ప్రాంతాల్లో బ్రాహ్మణులు ఎదటపడ్డా గుర్తుపట్టలేం.

అయితే ఆనాటి నష్టాల నుంచి ఈనాటి బ్రాహ్మణకులం చాలామటుకు కోలుకున్నట్లే కనిపిస్తున్నది. ఈనాడు బ్రాహ్మల్లో ఎవరిని చూసినా లక్షాధికారులూ, కోటీశ్వరులూ తప్ప చిన్నాచితకోళ్ళెవరూ నాకు కనిపించడం లేదు. ఆ కులానికి రాజకీయాలు మొదట్నుంచి ముఖ్యమైన విషయం కాదు కనుక అదో లోపం కాకపోవచ్చు.

ఇహపోతే కమ్మోళ్ళ మోడల్ ని ఎస్సీలు అనుసరించడం గురించి ! ఇలాంటి కథలు ఎస్సీలకి కర్ణామృతంగా అనిపించి కితకితలు పెడతాయేమో గానీ అసలీ టపాలోని కథని నేను నమ్మను. నిజం చెప్పాలంటే కమ్మోళ్ళు 1952 నాటికే జమీందారీ కులంగా ఉన్నారు. అయినా కులమంతా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎప్పుడూ జరగదు. ఈరోజు కమ్మోళ్ళంటే నలభై-యాభై లక్షల జనాభా గల పెద్దకులం. అంచాత కులంతో సంబంధం లేకుండా ఎవురి పరిస్థితులని బట్టి వారు నిర్ణయాలు వ్యక్తిగతంగా తీసుకుంటారు, కమ్మోళ్ళలో విద్యావ్యాప్తికి మొదట్లో ఉన్న కారణం కట్నాల డిమాండు. అథవా కమ్మోళ్ళు బ్రాహ్మణులతో పోటీపడ్దారని మాటవరుసకి అంగీకరించినా - ఇప్పుడు అన్ని ప్రైవేట్ కంపెనీల్లోను - ఆఖరికి కమ్మోళ్ళ కంపెనీలలో కూడా బ్రాహ్మలదే హవా. Even MNCs are heavily dominated by Brahmins. So, this theory is deeply suspect and therefore entitled to its deserved status of a theory.

sunita said...
This comment has been removed by the author.
Unknown said...

మన రాష్ట్రం లోనే కాదు భారతదేశంలోని బ్రామణులు ఒకప్పుడు భూస్వాములు. రాచరికం రాజ్యమేలేటప్పుడు బహుమతులుగా పొందిన భూముతో వాల్లే భూస్వాములుగా ఉండేవాల్లు. ఉత్తరాదిలో ఇప్పటికీ బ్రాహ్మణులే అత్యధికంగా వ్యవసాయం చేస్తారు. అంతే కాదు అప్పట్లో రాజకీయాలలో వారిదే పైచేయి . రాజు తరువతి స్థానం వాల్లదే కదా. ఆ రకంగా రాజకీయల్లో బ్రాహ్మణుల ఆధిపత్యం కొనసాగింది . 1980 కి ముందు కూడా మన రాష్ట్ర రాజకీయాల్లో బ్రాహ్మణులదే ఆధిపత్యం . ఉత్తరప్రదేష్ లో అత్యధికంగా పని చెసిన ముఖ్యమంత్రులలో బ్రాహ్మనులదే హవ . అంతెందుకు మన దేశ ప్రధానులలో అత్యధికులు వారే . 1996 కి ముంది కేంద్రంలో ఒక సెంటిమెంట్ ఉండేది . Non- Bramin కేంద్ర ప్రభుత్వాలు కేంద్రంలో నిలబడవు అని. అదీ చాలా వరకూ కరక్టే . వి.పి.సింగ్, మొరార్జీ దేశయ్, చరణ్ సింగ్, దేవే గౌడ , I.K. గుజ్రాల్ , చంద్ర శెఖర్ ,ప్రభుత్వాలు ఇలాగే కూలిపోయాయి . అలాంటిది బ్రాహ్మణులు క్రమంగా వ్యవసాయంలోను, రాజకీయాలలోనూ అణగదొక్క బడ్డారు. వారు కళలకూ, ఉద్యోగాలకూ అంకితమవ్వడంతో మిగతా రంగాలకూ దూరమయ్యారు . మన రాష్ట్రంలో అయితే వీల్ల పరిస్తితి మరీ దారుణం . NTR వచ్చిన తరువాత వీరి పరిస్తితి మరింత దిగజారింది . , NTR బ్రాహ్మణ వ్యతిరేకి అంటుంటారు . అది ఎంతవర్కూ నిజమో తెలీదు. ఒక్కపుడు రాష్ట్రంలోనూ దేశంలోనూ చక్రం తిప్పిన బ్రాహ్మనులు ఇప్పిడు పూర్వ వైభవం కోసం ఎదురు చుస్తున్నారు. ఆ కాలంలో వీల్లు వదిలేసిన భూమి మద్యతరగతి వారికి ఆశ్రయమయ్యింది ( అప్పట్లో కమ్మలూ మద్య తరగతిగాబ్నే ఉండె వారు) ఇప్పటికీ సినీ రంగంలో ఆధిపత్యం గల కమ్మలూ తమ సినిమాల ద్వార బ్రాహ్మణులను మానసికంగా దెబ్బతీస్తూనే ఉన్నారు( వారిని కించ పరుస్తూ డైలాగులు, కధాంశాలూ ద్వారా ) . అంతెందుకూ ఉత్తర ప్రదేశ్ లో పోగొట్టుకున్న తమ పూర్వ వైభవాన్నీ సాధించడానికి , జాట్ లనుండి తమ ఉనికిని కాపాడుకోవడానికీ బ్రాహ్మనులు జగన్నాధ మిష్రా నాయకత్వంలో మాయావతికి మద్దతిచ్చి దేశంలో కొత్త కుల రాజకీయాలకు తెర లేపారు. ఇది ' మాయా- బ్రాహ్మిన్ మోడల్ ' గా అందరికీ తెలుసు .

Anonymous said...

ఈ కులాలూ, కులాభిమానాలూ, వాటి ప్రాతిపదికన రచించే అభివృద్ధి ప్రణాళికలూ, ఆధిపత్య ప్రణాళికలూ - ఇవన్నీ ఎప్పుడు మన సమాజంలోంచి పోతాయో తెలవదు. రిజర్వేషన్లు ఎత్తేసి, కులం పేరుని రికార్డుల్లోంచి తొలగిస్తె కొంతలోకొంత పరిస్థితి అదుపులోకి వస్తదనుకుంటా. విపరీతమైన కులాభిమానం హిందూధర్మానికి చేటు.

చారిత్రికంగా చూస్తే, వేలాది సంవత్సరాల పాటు అగ్రకులంగా కొనసాగగలిగిన. గలుగుతున్న ఏకైక కులం బ్రాహ్మణులు. దీన్కి కచ్చితమైన కారణమేందో తెలవదు. మిగతావాళ్ళ అగ్రకుల హోదా రెండు మూడొందలేళ్ళకి పరిమితం. ఎంత డబ్బున్నా, ఎన్ని రాజ్యాలు పరిపాలించినా నాన్-బ్రాహ్మిన్స్ కి గ్యారంటీ లేదు. కాబట్టి, ఇప్పుడు అగ్రకులస్తులైన నాన్-బ్రాహ్మిన్స్ రెండు మూడొందలేళ్ల తరవాత కూడా అట్లనే ఉంటారని నమ్మకంగా చెప్పలేం, మన వ్యూహాల మాటెలా ఉన్నా !

దళితుల్లో ఉన్నంత కాకపోయినా, మాలో కూడా అక్కడక్కడ అరుదుగా బ్రాహ్మణద్వేషులున్నారు. చానాసార్లు నాకు ఏమనిపిస్తదంటే - నశించిపోకుండా సర్వైవ్ అవ్వడమే బ్రాహ్మలు ఇలా ద్వేషించబడడానికి కారణం అని, అదే వాళ్ళు చేసిన తప్పు అని ! ఎందుకంటే మిగతా దేశాల్లో సంస్కృతికీ, నాగరికతకీ మూలపురుషులైన వర్గాలు నశించిపోయినై. వాళ్ళ వారసులుగా మిగిలిన దేసాలవాళ్ళు ఆ extinct races ని తమ పూర్వీకులని చెప్పి ఘనంగా కీర్తిస్తూ, పూజించుకుంటున్నారు. మన దగ్గర పూర్వం అదే పాత్ర పోశించిన బ్రాహ్మణులు మాత్రం నసించిపోకుండా విజయవంతంగా పెద్దసంఖ్యలో (సుమారు 5 కోట్లమంది అంటున్నారు) సర్వైవ్ అవ్వడమే కాకుండా మిగతావాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు.

తారక said...

nice joke,
this is from Jew lit. some one might converted this to Indian caste, you can read more such about North Indian Castes

జయహొ said...

అభిషేక్,
*అందుకే ఈనాడు పది గ్రామాలకొక బ్రాహ్మణుడు కూడా కనిపించని పరిస్థితి వచ్చింది. అందరూ వలసపోయినట్లు కనిపిస్తోంది.*
దీనికి ఇంకొక కారణం రామరావు ప్రవేశపెట్టిన మండల వ్యవస్థ వలన కరణాలు గా పని చేసే వారందరు దిక్కులేని వారయ్యారు. వారికి పల్లేలలో ఏ వృత్తి లేక పట్టణాలాకు వలస పోవలసివచ్చింది. అంతే కాని పట్టణాల మీద మోజు వలన ఎవ్వరు గ్రామాలను వదిలి పెట్ట లేదు. మీరూ బాగా గమనిస్తె ఈ వ్యవస్థ రద్దుకు మునుపు రద్దు తరువాత ఆంధ్రా గ్రామీణ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. నాకు తెలిసి రామారావు గారు ఎంతో గొప్పగా పెట్టిన మండల వ్యవస్థ అంత గొప్ప ఫలితాలు ఇవ్వలేదు సరి కదా ఈ రోజులలో అసలికి గ్రామీణ ప్రాంతలకు మునుపటిలా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇంకా ఎవరైనా అక్కడ (గ్రామాల) ఉంటే అది దేవాలయాలలో పని చేసే పూజారులు మాత్రమే. వారు చాలి చాలని జీతాలతో దేవుడి మీద భారమేసి బతుకుతున్నారు.
------------------------------------------------------------------------------------------------------------

*ఈనాడు బ్రాహ్మల్లో ఎవరిని చూసినా లక్షాధికారులూ, కోటీశ్వరులూ తప్ప చిన్నాచితకోళ్ళెవరూ నాకు కనిపించడం లేదు. *
మీరు స్విపింగ్ జెనరలిసెషన్ చేస్తున్నారు. Please read below article from rediff

http://www.rediff.com/news/2006/may/23franc.htm
Are Brahmins the Dalits of today?

The middle class deserves what it is getting

You also find Brahmin rickshaw pullers in Delhi. 50 per cent of Patel Nagar's rickshaw pullers are Brahmins who like their brethren have moved to the city looking for jobs for lack of employment opportunities and poor education in their villages.

Even after toiling the whole day, Vijay Pratap and Sidharth Tiwari, two Brahmin rickshaw pullers, say they are hardly able to make ends meet. These men make about Rs 100 to Rs 150 on an average every day from which they pay a daily rent of Rs 25 for their rickshaws and Rs 500 to Rs 600 towards the rent of their rooms which is shared by 3 to 4 people or their families.
Did you also know that most rickshaw pullers in Banaras are Brahmins?

***************************************************

75 per cent of domestic help and cooks in Andhra Pradesh are Brahmins. A study of the Brahmin community in a district in Andhra Pradesh (Brahmins of India [ Images ] by J Radhakrishna, published by Chugh Publications) reveals that today all purohits live below the poverty line.

Caste shouldn't overwrite merit :
According to the Andhra Pradesh study, the largest percentage of Brahmins today are employed as domestic servants. The unemployment rate among them is as high as 75 per cent. Seventy percent of Brahmins are still relying on their hereditary vocation. There are hundreds of families that are surviving on just Rs 500 per month as priests in various temples (Department of Endowments statistics).

*ఆఖరికి కమ్మోళ్ళ కంపెనీలలో కూడా బ్రాహ్మలదే హవా. *
కొన్ని ఉదాహరణలు ఇవ్వ గలవా?

Unknown said...

జయహొ గారూ !

నేను రాసినది దక్షిణాది బ్రాహ్మణుల గురించి. మీరు చెబుతున్నది ఉత్తరాది బ్రాహ్మణుల గురించి. కానీ ఎంతమంది బ్రాహ్మణ రిక్షాపుల్లర్లున్నా అక్కడ ఇప్పటికీ బ్రాహ్మణులదే ప్రభంజనం. ఈరోజు లోక్‌సభలో పదిశాతం మంది ఎంపీలు ఉత్తరాది బ్రాహ్మణులేనంటే, మరి ఆలోచించండి. అలా అని నేనేమీ దాని గురించి కంప్లెయింట్ చేయడం లేదు. అనవసరంగా పొరపడకండి. బ్రాహ్మణుల అభ్యున్నతికి నా ఆమోదాన్ని తెలుపుతున్నాను. అయితే నా స్టేట్‍మెంట్ ని సమర్థించుకోవడం కోసం ఈ గణాంకాలు ఇచ్చానంతే !

కమ్మవారి కంపెనీలలో కూడా బ్రాహ్మణులే ఎక్కువగా ఉన్నారు. ఈ సంగతి నాకు స్పష్టంగా తెలుసు. మా బంధువుల వ్యాపారాలే ఇందుకు ఉదాహరణ. అయితే మావాళ్ళ ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత నామీద ఉంటుంది కాబట్టి స్పష్టంగా పేర్కోలేకపోతున్నాను. మన్నించండి. ఎక్కువగా అంటే - బ్రాహ్మణుల యథార్థ జనాభాశాతానికి మించి !

హైదరాబాదువంటి మెట్రోపాలిటన్ ఏరియాలలో మీరు ప్రత్యక్షంగా చూసిన పేదబ్రాహ్మణుల సంఖ్యనీ, ధనికబ్రాహ్మణుల సంఖ్యనీ ఒకసారి పక్కపక్కనే పెట్టి పోల్చి చూసుకోండి. నేనయితే ధనికబ్రాహ్మణులనే ఎక్కువగా చూశానని జ్ఞాపకం.

-అభిషేక్ చౌదరి

cbrao said...

"ఈ పరిణామక్రమంలో కమ్మవారు మరో ఆధిపత్య వర్గంగా మారడం దురదృష్టకరమైన పరిణామం." ఎలా దురదృష్టకరం? కమ్మ వారు అనుసరించిన పద్ధతులు నైతికమైనవి, చట్టబద్ధమైనవీ అయినప్పుడు. ఒక వర్గం వారే ఎప్పుడూ పెత్తనం చెలాయించాలా? ఇతరులు ఈ పద్ధతులు అవలంబించరాదని వారు నిబంధనలు పెట్టలేదు కదా?
cbrao
Fort Collins(Colorado)

Indrasena Gangasani said...

మహేష్ గారు,

అగ్రవర్ణము అని చెప్పుకుంటూ మీపై దాడికి దిగిన ఈ దురహంకారులపై మీ పొరాటం అత్యద్బుతం.
ఈ భారత దేశంలొ దళిత శ్రమ చిందకుండా పండించిన ఒక్క తిండి గింజ కాని,దేవాలయము కాని,రోడ్డు కాని, ఏ ఇతర కట్టడము కాని లేదు. దళిత శ్రమను ఇంతగా దోచుకుంటూ,వారిని విద్యకు దూరముగా పెట్టి,వారిని పేదరికం లొ మగ్గి పోయెటట్లు చేసిన ఈ వ్యవస్థ విష వ్రుక్షాలు దళితులని తన మాటలతొ వేధిస్తున్నయి.సాటి భారతీయుల అభివ్రుద్ది కాంక్షించని ఈ వ్యక్తుల మాటలకి పూచిక పుల్ల విలువకూడ లేదు.నేను ఒకసారి హైదరాబాదు లొ మిమ్మల్ని తప్పకుండా, మీ అనుమతితో కలిసి మాట్లాడాలని అనుకుంటున్నాను .

ఉత్తమమయిన అభినందనలతొ,
ఇంద్రసేన

Anil Dasari said...

>> "3. బ్రాహ్మణుల ఆస్తుల్ని (మాన్యాల్ని) ఎలాగైనా కొనుగోలు చేయడం ద్వారా వారికి గ్రామాలతో ఉన్న లింకుల్ని తెంచేయాలి"

ఈ మధ్యనే మా బంధువొకడు గుంటూరులో 'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ఇంటిని కొనుగోలు చేశాడు. అదేదో కాకతాళీయంగా జరిగిన సంఘటన అనుకున్నా కానీ దాని వెనక దశాబ్దాలనాటి చారిత్రక కుట్ర ఉందనుకోలేదు ;-)

భావన said...

మీరు ఇచ్చిన లింక్ లోనే కాదు ఇంకా ఎక్కడో కూడా చూసేను ఈ కధ ఆ పైన జరిగిన విస్తరణా పధకాలు గట్రా. ఎంత వరకు నిజమో తెలియదు కాని.. రంగా గారి గురించి, ఆ పైన మా చదువుల గురించి మాత్రం సునీత చెప్పిన దానితో 100% ఏకీభవిస్తున్నా. రామారావు గారు వచ్చి మాకు చేసిన వుపయోగం ఏం లేదు. నిజానికి ఆయన మూలం గా ఒక విధంగా మాకు నష్టమే జరిగింది రంగా గొడవలలో మా కులానికి సంభందించి వూళ్ళు వూళ్ళూ (దివి తాలూకా వైపు జయపురం వంటి వూళ్ళు కొన్ని) తగలబడి పోయాయి మా ఆడ వాళ్ళు చాలా అత్యాచారాలకు అవమానాలకు గురి అయ్యారు. కేవలం కులం అనే భయం తో కోడెల శివప్రసాద్ గారి చేతులు రామారావు గారు కట్టెయ్యక పోతే మాకు ఆన్ని రకాలు గా ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదు. ఇది నా వూహ కాదు, మా నాన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణా జిల్లా కు ఆ టైం లో. రంగా గారు, రామస్వామి చౌదరి గారి గురించి ఇంక నేను ప్రత్యేకం చెప్పేది ఏమి లేదు సునీత మాటే. రామస్వామ చౌదరి గారు కృష్ణా జిల్లా లో ముఖ్యం గా గుడివాడ పరిసర ప్రాంతాలకు ఒక్క కమ్మ అనే కాదు అందరికి మంచి చేసేరు.
ఇక కృష్ణ గారన్నట్లు మిగతా ఏ కులాలు చౌదరి అని పెట్టుకోవటం నే చూడలేదు. నేను కృష్ణా జిల్లాలోనే పుట్టి పెరిగేను. వాళ్ళు పొలాలను కౌలు కు తీసుకోవటమే తెలుసు, పేర్లు మార్చుకోవటం మరి తెలియదు. అదేమి సాంస్కృతీకరణ అండి బాబు. శర్మ, రెడ్డి, చౌదరీ, మాదిగ అని పేర్ల చివర తోకలు తగిలించుకోవటమా?
అభిషేక్... సంఖ్యా పరం గా ఎక్కువ గా వున్నారు కాబట్టి ఏ కంపెనీ లలో ఐనా వారి శాతం ఎక్కువ కనపడిందేమో కాని అలా ఏమి వుండదు..
చిన్ని అన్నట్లు ఆ 1600 ఎకరాల వాళ్ళ కేమో కాని మధ్యతరగతి సన్నకారు రైతులలో వుండి చితికి పోయి రైతులకు ఏ ప్రభుత్వం సరైన వుపాధి కల్పించక అన్నపూర్ణ ఐన మన రాష్ట్రం లో పొలాలు వదిలి పిల్లల ను తీసుకుని పట్టణాలకు వలస వచ్చిన కమ్మ వాళ్ళు చాలా మందే వున్నారు (ముఖ్యం గా కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి).

Kathi Mahesh Kumar said...

@సునిత: మీరు సూచించిన సవరణ నాకు అర్థం కాలేదు. మాల కులస్తులు ‘మాలోళ్ళు’ అయినప్పుడు మాదిగ కులస్తులు ‘మాదిగోళ్ళు’ అయినప్పుడు కమ్మకులస్తుల్ని ‘కమ్మోళ్ళు’ అనికాకుండా ‘కమ్మవారు’ అని గౌరవవచనాలతో చెప్పాలనేది ఏ సమాసమో నాకు తెలీదు.

@CB Rao: ఏ ఆధిపత్యాన్ని భరించలేక పోరాడుతున్నామో అదే ఆధిపత్యధోరణిని అధికారంలోకి వచ్చాక మనమూ అవలంభిస్తే పోరాటానికి అర్థం లేదు. Egalitarian society కోసం పోరాడుతూ మళ్ళీ మనమే ఒక ఆధిపత్యవర్గంగా మారడం దురదృష్టకరమైన పరిణామమే.

@ఇంద్రసేన: mahesh.kathi@gmail.com నా మెయిల్ ఐడి. దయచేసి ఒక మెయిల్ చెయ్యగలరు. ఖచ్చితంగా కలుద్దాం.

@భావన: నిజానిజాలు నాకూ తెలీవు. ఈ ఆలోచన నచ్చింది. ఇలా జరుగుంటుందనో సంభావన ఆసక్తికరంగా అనిపించింది. దళితులు ఇలా చేస్తే ఎలా ఉంటుందనే ఊహ వచ్చింది. అందుకే ఈ ప్రస్తావన.

జయహొ said...

*హైదరాబాదువంటి మెట్రోపాలిటన్ ఏరియాలలో .... నేనయితే ధనికబ్రాహ్మణులనే ఎక్కువగా చూశానని జ్ఞాపకం.*
అభిషేక్,
మీరు ఒకటి గమనిచారో లేదొ డబ్బులు లేని వారు ఎప్పుడు సిటిలో ఉండరు వారు ఊరి బయట ఎక్కడో ఉంటారు అది పేద బ్రహ్మణుడైన, మిగతా పేద వర్గాల వారైన ఒకటె.అదే పనిగా బందువులు కూడా వారిని చూడటానికి ఎవ్వరు ఊరి బయటకు పోరు. అటువంటి వారిని అందరూ మెల్లగా మరచి పోతారు. ఇది మానవ స్వభావం.అందువలన మీకు వారు కనిపించక పోవచ్చు కాని నేను చూపిన గణాంకాలు వాస్తవాం చెప్తున్నాయి. నేను మీతో వాదించటం లేదని అర్థం చేసుకోండి.
---------------------------------------
*కమ్మవారి కంపెనీలలో కూడా బ్రాహ్మణులే ఎక్కువగా ఉన్నారు. ఈ సంగతి నాకు స్పష్టంగా తెలుసు. మా బంధువుల వ్యాపారాలే ఇందుకు ఉదాహరణ.*
మీరు చెప్పినదే నిజమైతె ఆనందించదగ్గ విషయం. ఈ సిద్దాంత రాద్దంతల కన్నా ప్రజలు వాస్తవం లో జీవిస్తూ కలసి మెలసి ఉంట్టున్నారు. రెండు వర్గాల వారు కాలం గడిచే కొద్ది పరిణితి చేందుతున్నరన టానికి మీరిచ్చిన ఉదాహరణ సూచిస్తుంది.

తార said...

బాబు మీరు హేతువాదులు, నిజానిజ నిర్ధారణ లేకుండ ఏదీ నమ్మరు, మరి ఏ సాక్ష్యాలు వున్నాయి అని కమ్మ- బ్రాహ్మణ కుల చిచ్చు రగిల్చే టపా పెట్టారు?
ఇలాంటి పనుల వలన నష్టాన్ని ఎప్పుడైనా ఊహించారా?
ఇలాంటి వాటిని మీరు ప్రొత్సహించి తరువాత కుల ఘర్షణ అని మీరే ఖండిస్తారు, ఇప్పుడీ అభ్యంతర వ్యఖ్యలేల తరువాతా వెక్కిరింపులేలా?
మీకు ఎటువంటి అధారాలు దొరికాయని కమ్మ వారు - బ్రహ్మణుల ఆస్థులన్నీ కొనేస్తున్నారు అని రాసారు? ఎటువంటి స్టాస్టికల్ పరిశోధన చేసారు?
మీరు మనసా వచా కర్మణ నిజాన్ని నమ్మేవారు ఐతె ఎటువంటి అధారాలు లేకుండా ఇలాంతి టపాలు పెట్టి కుల మత ఘర్షణలు పెంచవద్దని మనవి.
కులమే పెట్టుబడిగా రంగా,... నేను ఇదే గాంధీ గార్ని కులం వలన వచ్చిన ధనం వలన ఆయన మహాత్ముడు అయ్యారు అంటే ఎంత ఛండాలంగా వుంటుందో అలానే ఇదీ ఏడిచింది.

మాదిగ కులస్తులు, మాల వారు, కమ్మ వారు .. ఇది సరైన వాడుక, మాలోళ్ళు అంటే అది ఆ కులంపై ద్వేషమో చిన్నచూపో సూచిస్తుంది

Srinivas said...

ఇదో పెద్ద జోకు. చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడం, ఆస్తులు కొనుక్కోవడం , రిస్కు తక్కువ వ్యాపారాలు చేసుకోవడం - దీనికి ఓ మోడల్ కావాలా? కులంతో సంబంధం లేకుండా ఎవరైనా చేస్తున్నది ఇదే కదా!
రాజకీయంగా బ్రాహ్మణుల ఆధిపత్యం ఆ రెండు జిల్లాల్లో ఎప్పుడూ లేదు. మీ ఆధారమంటున్నట్టుగా ఆ రెండు కులాల మధ్య ద్వేషమూ లేదు. భూములమ్ముకుని గ్రామాల నుంచి పిల్లల చదువుల కోసం సమీప పట్టణాలకు చేరడం, డబ్బుంది కనక వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం వెనక ఒక పథకం ఉన్నదనుకోవటం వెర్రితనం. ఏదయినా ఉంటే గింటే అది చూచి నేర్చుకోవడం, అనుకరించడమే ఇప్పుడు అందరూ సాఫ్ట్ వేర్ నేర్చుకుని అమెర్కా కి క్యూ కట్టినట్టు. ఆ సభలాంటిది నిజంగా జరిగి ఉంటే అది ఆ నలుగురు రాజకీయులకే పరిమితమయ్యుండాలి. లేక మా చుట్టుపక్కల ఊళ్ళల్లో చెప్పడం మర్చిపోయి అయినా ఉండాలి.

Kathi Mahesh Kumar said...

@తార:ఈ విషయం నాకొక మిత్రుడు చెప్పారు. ఆసక్తికరంగా అనిపించింది. రాసుకున్నాను.

నిజనిర్థారణలు, సాక్ష్యాలూ, పరిశోధనలూ చేసి మాత్రమే నేను బ్లాగురాయను. నా అభిప్రాయాల్ని పంచుకోవడానికి కూడా రాస్తాను.నా టపా ముఖ్య ఉద్దేశం ఒక ఉద్థాన నమూనా గురించి. అది దలితులకు ఉపయోగపడుతుందా లేదా అనే ఆలోచన గురించి. కమ్మ-బ్రాహ్మణుల గురించి కాదు. అది చిచ్చు రగిలిస్తుందని మీరు అనుకోవడమే తప్ప నా బ్లాగుకి అంత శక్తి ఉందని నేను అనుకోను. బ్రాహ్మణ- కమ్మ కులస్తులకి అంత చిన్నమెదళ్ళుంటాయనే మీ ప్రతిపాదనతో అంగీకరించలేను.

@శ్రీనివాస్: Great knowledge of past becomes common sense of present అంటారు. భ్యూమ్యాకర్షణ సిద్దాంతంతో సహా అన్నీ సింపుల్గానే కనిపిస్తాయి. కానీ ద్రవిడ ఉద్యమం, బ్రాహ్మణేతర కులాల ఉద్థానం నేపధ్యంలో ఈ విషయాలు చాలా విలువైనవని నేను అనుకుంటాను. If you want to dismiss it as a joke. That's your choice.

తార said...

మీ అభిప్రాయల్ని రాయొద్దు అని నేను అనను, కానీ అది వివాదరహితంగా వుండాలి అని మాత్రమే చెప్పగలను, ఇదే టపా బ్రహ్మణ, రంగా ప్రస్తావన లేకుండా రాయొచ్చు, ఇది చదివి 1,2 నమ్మినా చాలు తగినంత నష్టం జరగటానికి, అదేదో పెద్దగా వుండక్కర్లేదు, ఒకరికి జరిగినా కారణం మిరే, అందరికీ లేకపొయినా అంతకన్నా చిన్న మెదడు వున్నవారు వుంటారు.

అంత చిన్న మెదడు వున్నవాళ్ళు ఇక్కడ కాకపొతే ఇంక ఎక్కడైనా ఎక్కించుకుంటారు అని మీరు అనొచ్చు.
అలానుకుంటే మీ ఇష్టం, (కానీ ఇంకా ఎక్కించుకోవటాని దోహదమవుతాయెమో) రచనలు ఉన్నతంగా వుండాలి, మన భావాలు అంతే ఉన్నతంగా విశాలంగా వుంటేనే మనం అనుకున్నది సాధించగలం, అలా కాకుండా ఇలానే రాస్తాను అంటే వివాదాలు ఎక్కువ పని తక్కువ అవుతాయి.
అదే రంగాగారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా, లెక్కలు ఉన్నా రాయండి నేను కాదనటం లేదు, ముందూ వెనుకా సరి చూసుకోలేని వాదనలకి వ్యక్తి విమర్శలు/ అభాండాలు లేకుండ చూసుకోండి.

Kathi Mahesh Kumar said...

@తార:నేను బ్లాగురాసేది నా కోసం. నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి. ఇక్కడ "ఉన్నతం" అనేది నా భావనపై ఆధారపడుతుందేతప్ప మీ నిర్వచనం మీద కాదు.

లెక్కలూ సాక్ష్యాలూ నాదగ్గరలేవు. మిత్రుడు చెప్పింది/రాసింది ఉన్నది ఉన్నట్టుగా పెట్టాను. ఇందులో నేను తీసుకున్న perspective, నాకున్న ఉద్దేశాల్ని చాలా స్పష్టంగా చెప్పాను. అయినా ఇదేదో వ్యక్తిగత విమర్శ లేక వర్గపరమైన కక్షసాధించడానికి ఇలా చేశాను అనుకునేవారికి ఇక చెప్పగలిగింది ఏమీ లేదు.

తార said...

కావొచ్చు, కానీ, ఎంత వివాద రహితంగా వుంటే అంత ఎక్కువ రిజల్ట్ చూపిస్తుంది అని మాత్రమే చెప్పగలను, అలా కాదు నేను నా పద్దతి ఇంతే అంటే నేను ఎమీ చెప్పలేను, నేను సలహాలు మత్రమే ఇవ్వగలను, బలవంతంగా మీ చేత ఆచరింపజాలను కద.
ఉన్నతంగా అంతే నా ఉద్దేశం వివాద రహితంగా, నిందారోపణకి దూరంగా, నిస్పక్షపాతంగా (ఇప్పుడు మీరేదో లేరని కాదు), నిజా నిజాలు పరిశీలించలేని వాటికి దూరంగా ఉండమని మాత్రమే.
ఇతర కులాల ప్రసక్తి (ఒక్క కమ్మ తప్ప) లేకుండా మీ perspective చెప్తే, టపా ఇంకా ఎంత బాగుండేది, ఇంకా హత్తుకుపోయేదో అలోచించండి అని నేను అంటున్నాను.

Kathi Mahesh Kumar said...

@తార: నేను వివాదాలు చెయ్యాలని, వివాదాస్పదంగా రాయాలనీ రాయను. నాకు exciting గా అనిపించినవీ, రాసుకుంటే బాగుంటుందనుకున్నవీ రాస్తాను. ఇవి ఎవరికో ఇబ్బందిని కలిగిస్తున్నాయనో, వారు వీటిని వివాదాస్పదం అనుకుంటారనో ఆలోచించే తీరికా ఓపికా నాకు లేవు. I write because, I want to. అంతే.

పై టపా అసలు ఉద్దేశమే కులాల ఉధ్థానం గురించి మరి అందులో కులా ప్రసక్తి లేకపోతే అర్థరహితంగా ఉంటుంది.ఇక్కడ హత్తుకోవడం కన్నా ఆలోచనని ప్రేరేపింఛడం నాకు ముఖ్యం. ఈ టపా చదివిన దళితులు ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు నాకు. అది ఇప్పటికే జరిగింది కూడా. కానీ వివాదాస్పదం చేసిందీ, అనుకుంటున్నదీ మాత్రం దళితులు కాదు. ఆభిజాత్యం ఉన్న కొన్ని వర్గాలు. ఈ టపా వారికోసం రాసింది కాదు.

తార said...

చివరగా, నన్ను ఆభిజాత్యం ఉన్న వాడిగా లెక్కేసారు, మంచిది, మీరు రాసింది మారుమాట్లడకుండా, బాగున్నది అంటేనే ఆభిజాత్యం లేనట్టా?
బాగా చెప్పారు, ఇంక నేనేమి రాయనులేండి మీ బ్లాగ్‌లో.

Kathi Mahesh Kumar said...

@తార:ఆభిజాత్యం అన్నది వివాదాలు అనుకుంటూ/చేస్తున్నవారిని గురించి. నేను చెప్పేవాటితో విబేధిస్తే నాకు సమస్య లేదు. కానీ మీరు చెప్పిందంతా ఒప్పుకోవాలని ఆశించితే నేను అంగీకరించలేను.

I welcome your opinion, but don't expect me to agree to it.

తార said...

నేను చెప్పింది చేయండి అని అజ్ఞ ఏమైనా జారీ చేసానా?
అలా రాసి చూడండి, బాగుంటుందేమో, ఇంక ఎక్కువమందికి నచ్చుతుంది అని మాత్రమే చెప్పాను, అలాగా! చుస్తానో అలోచిస్తానో కాకుండా, నేను చేయను అలా, ఇలానే రాస్తాను అని మీరు జవాబు ఇస్తున్నారు.
పుట్టుకతోనే మనం ఉన్నతులుగా అవ్వము, నిత్యం మన తప్పుల్ని సరిదిద్దుకొంటూ, మనల్ని మనం సరిదిద్దుకోవాలి,
నేను మీ మిత్రుడ్ని కాదు, శతృవునీ కాదు, మీ రచనలు ఇలా వుంటే, ఇంకా బాగుంటాయేమో అని నాకు అనిపించింది, అదే చెప్పాను.
కమ్మ వారు వ్యాపారాల్లో పైకి వచ్చారు, ధనవంతులు అని మీ అభిప్రాయం ( నిజా నిజాలు ఎలా వున్నా), అదే రాయొచ్చు, అంటే కానీ కమ్మ వారు, బ్రాహ్మణుల మీద కోపంతో, వారిని అణిచివేయలని పైకి వచ్చారు అని కాకుండా, వారు పైకి ఎలా వచ్చారో వరకే పరిమితం చేస్తే బాగుందేది అని మాత్రమే చెప్పాను, దీనిలో నేను మిమ్మల్ని ఎక్కడా బలవంత పెట్టలేదే?
అలా కాకుండా జెర్మనిలో జూస్ ఎలా ఉన్నతివర్గంగా ఎదిగారో అదే మోడల్ దళితులు ఆచరించాలి అని వ్రాస్తే ఇంకా అర్ధవంతంగా వుండదా?
అలా కాకుండా బ్రాహ్మణుల ఆస్తులు దళితులు కొనాలి అనేది మీ perspective ఐతె, నేనేమి చెప్పలేను, అందరూ అన్ని విధాలా ముందుకి పోవాలి కానీ ఒకరి మీద పోటీ అనారోగ్యకరమే, హిట్లర్ - జూస్ లాగా.
నేను మీరు చెప్పేవాటితో విభేదించటం లేదు, చెప్పే విధానం కొంచం మార్చుకుంటే అనవసరపు గొడవలు తగ్గి, మీ అభిప్రాయం ఇంకా ఎక్కువ మందికి నచ్చుతుంది అని మత్రమే చెప్తున్నాను, మీతో విభేదించేవాళ్ళు ఎక్కువగా మీ రచనా శైలితో విభేదిస్తున్నారేమో అని ఇప్పుడు అనిపిస్తున్నది.
ఏది, ఒక సారి కమ్మ/jews మోడలో దళితులు ఎలా పైకి రావాలో రాసి చూడండి, అది బాగుంటుందో, ఇది బాగుంటుందో పాఠకులని అడిగి చూడండి.

Kathi Mahesh Kumar said...

@తార: నాకు తెలిసింది నేను రాశాను. నేను చెప్పాలనుకున్న విధంగానే చెప్పాను. ఆ శైలి "అందరికీ" ఆమోదయోగ్యం అవ్వాలని నేను ఆశించను. ఎందుకంటే ఇది నేను పాప్యులర్ రచన అని అనుకోవడం లేదు. This is just a personal blog in a public domain. నా reflection ఈ బ్లాగులో ఉంటుందే తప్ప ఇతరుల expectations ప్రకారం లేదా ఇతరుల approval కోసం రాయడమంటూ జరగదు.

I need neither need acknowledgment nor an approval.I write because I want to. Even if nobody visits my blog, I write.

మీరు చెబుతున్న jews మోడల్ నాకు తెలీదు. ఈ మోడల్ కూడా ఒక మిత్రుడు చెబితే తెలిసింది. ఇలాంటి social empowerment model ఒక అసహనంలోంచీ వచ్చిందనే అభిప్రాయంతో నా మిత్రుడు చెప్పాడు. ఆ possibilities నాకూ కనిపించాయి. అందుకే I thought a prologue is important to this model to contextualize it. టపా రాసేప్పుడు, రాస్తున్నప్పుడు నేను ఆలోచిస్తాను. ఆ ఆలోచన ప్రకారమే నా టపా structure అవుతుంది. ఇక్కడ నా ఆలోచన వదిలేసి ఎవరో ఎలా ఆలోచిస్తారు అని నేను ఆలోచంచలేను. క్షమించాలి.

తార said...

బహుశా నేనే ఎక్కువ ఆశించానేమో,
మీ అభిప్రాయ ప్రకటనకి ఈ బ్లాగ్ నడుపుతున్నారు అని నేననుకోలేదు, ఒక ఆశయం కోసమేమో అనుకున్నాను.
మీరు ఇలాంటి అభిప్రాయం కలిగి వుండటం తప్పు అని నేను చెప్పలేను, కానీ భావ ప్రకటన మీద కొంచం దృష్టి సారించండి. మీ రచనలు అందరికీ సమ్మతిగావించకపోవచ్చు, కాని "మిగిలిన" వారికి ఇబ్బంది కలగకుండానో, ఇబ్బంది తగ్గించవచ్చేమో చూడండి. (అలాని నిజం చెప్పొద్దు అనటం లేదు).
నాకు కొంచం ఆవేశంతో జవాబు ఇచ్చారేమొ అనిపించింది, బహుశా నేను మీకు వ్యతిరేకమేమో అని భావించారా? మీ ఆవేశం మీ ఆలోచనని మింగేసిందేమో అనిపించింది.

నేను ఈ టపా దళితులు పైకి ఎలా రావాలో అనే వుద్దేశంతో రాసారేమో అనుకున్నాను, ఇదొక ఆశయంతో రాసారేమో అని అర్ధం చేసుకొని ఈ గొడవంతా..

rayraj said...

:))మొన్ననే ఓ విషయం చెప్దాం అనుకున్నాను. దళిత వాద బ్లాగుల్లో మొదటి లింకుని కొడితేనే, అది కులాన్ని తిట్టింది. అలా కులాన్ని కాల్చాద్దేం మతాన్ని మాడ్చేద్దాం అనుకుంటే, ఇలా మాట్టాడ కూడదు కదా!.

లేదూ కులాన్ని ఉండనిచ్చి, ఏ కులానికాకులం ఒక మోడల్ తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఆలోచనలు చక్కగా, ప్రణాలికా బద్ధంగా ఉంటాయి.ఓ రకమైన హెల్తీ కాంపిటీషన్ వస్తుంది. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ఇలా కులాలు మంచివే అని ప్రతిపాదిస్తే, దాని అర్ధం చెప్పడానికి బోళ్డు తంటాల పడాలేమో అని నా భయం. మరి మీ ఉద్దేశ్యమేంటి?

Someone is stating Brahmins continue to have their domination. Is it not better to find out what is the Brahmin Model!? :)

Any way, I see few few false notions and flaws in the Kamma model. Try reshaping it.

Hima bindu said...

@మహేష్
@బావన
పైన "చిన్ని"పేరుతో వచ్చిన కామెంట్ నాది కాదండి.

Viswanath said...

Ee prapancham lo meekokkallake swatamtryam ivvaledu ... andariki icharu .... mee bhavalu vidweshalu repavu ani meeru ela anukuntaru ... in the same way jyothishyam gurinchi kuda rayataniki askaram vundanna samskaram meeku lenanduku chintisthunna ... "Manako rule pakkavadiko rule" ide meeru sodhinchi sadhinchina nijam ... Great :(

Kathi Mahesh Kumar said...

@విశ్వనాథ్: I have no objections to anybody's freedom. జ్యోతిష్యం గురించి రాయడాన్ని నేను అభ్యంతర పెట్టడం లేదు. నేను ప్రెడిక్ట్ చేసినవి నిజాలయ్యాయని mislead చెయ్యొద్దని చెప్పాను.

He has every right to write what he writes. I have every right to object to what he writes, as you have a right to object to what I write.I have no issues.

rākeśvara said...

very funny!!! LOL!!! ROTFL!!!

ప్రత్యేకించి
/ఈ పరిణామం దురదృష్టకరమే అయినా పంథామాత్రం అనుసరణీయంగానే అనిపిస్తుంది./

---

/...దళితులకు ఇలాంటి మార్గం ఒకటి ఖచ్చితంగా అవసరమే కావొచ్చు. కాకపోతే ఇలాంటి వ్యూహత్మక పరిణామాన్ని లీడ్ చెయ్యగల నాయకులు, వ్యూహం యొక్క అమలుకి కావలసిన సరంజామా సమకూర్చుకోగలరా అన్నదే పెద్ద ప్రశ్న./
బ్రాహ్మణుల్లా(sic.) ఎవడో అవతారపురుషుఁడు వస్తాడు అని వేచియుండేకన్నా, మీఱే ఆ పని చేసేస్తే ఆ పేరు ప్రతిష్ట పుణ్యం(sic.) మీకే వచ్చేస్తాయి కదా, అవకాశాన్ని అవతారపురుషులకు వదలవద్దన్నది నా సూచన।

Anonymous said...

మహేష్,

ఇంతకీ దళిత ఉద్య్మానికి ఈ కమ్మ మాడల్ దళితుల రాజ్యాధికారాం కోసమా లేక దళిత వర్గ ప్రజల బాగు కోసమా ? ఎందుకు అనుసరించాలో మీ అభిప్రయం చెప్పి ఉంటె బాగుండెది.

Ramesh said...

అన్న నువ్ రాస్తూనే ఉండు. వాస్తవాలేంతో మనకు తెలుసు. బయాస్డ్ ఒపీనియన్స్ గూర్చి ఆలోచించాల్సిన అవసరం లేదు

Ray Lightning said...

కులం ప్రకారం జతకట్టడం అనేది 21వ శతాబ్దంలో చెయ్యవలసిన పనులు కావు.

ఈ విధంగా ఆలోచించుకోవడమే మానుకోవాలి. మనిషికి విలువనిచ్చేది అతని పద్ధతీ, ప్రవర్తన, వ్యక్తిత్వం.. ఏ కులంలో పుట్టాడు, ఎంతటి భూములు గలవాడు ఇవన్నీ ఫ్యూడల్ సమాజంలో ఆలోచించే విషయాలు.. ప్రస్తుత సమాజం లో ఇవి పట్టింపు లేని విషయాలు.

ఎవరన్నా కులం/మతం పేరుపై దూషిస్తుంటే ఎదురుతిరగాలి,

కానీ ఆ కులమతాల్నే మనిషి వ్యక్తిత్వం తో జమకట్టడం తప్పు ! ఈ విధంగా ఆలోచించినవాడెవ్వడూ పైకిరాలేడు.. బ్రాహ్మణుడైనా, కమ్మవాడైనా, మాలవాడైనా !

cbrao said...

మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే వ్యక్తులను వారి కులమేమిటి అని అడగము. అలా అడగటం ఈ రోజుల్లో సంస్కారం కాదు. ఎదుట వ్యక్తి వ్యక్తిత్వం, వేషధారణ బట్టి గౌరవిస్తాము. ప్రస్తుతం అన్ని ఉద్యోగాల్లో అన్ని కులాలు వారు ఉన్నారు. ఉదాహరణకు నేను పనిచేసిన స్టేట్ బాంక్ లో అన్ని కులాల వారు ఉన్నారు. కులాన్ని బట్టి గాకుండా వారి వారి మేధ, సంస్కారం బట్టి వారిని గౌరవిస్తున్నాము. ఇప్పుడు అభిలషణీయమైనదిదే. ఇంకా దళితులు ఉద్యోగాలలో లేరని ఆలోచించ అవసరం లేదేమో!

Y S C said...

Interesting Topic is raised by Mahesh.

I would like to share my experince which happened in similar line. As of now I am staying U.S from past 10 Years. Recently I have been to one of my old school to meet my teachers who taught me in my 10 th standard.

WE had conversation for good amount of time on various things starting from life to U.S Politics situtaion in Andhra etc.


In middle of conversation, this Kamma topic came up.

HE analyzed why they are doing well in following way

1.Majority of lands in coastal area is fertile.
2. After Nagarjuna Sagar is built, due to canals they were able to do agriculture well and worked very hard. Many of them even migrated to differen areas like Telanga, Ballary , Srikakulam etc and did well in farming.
Also in coastal areas, lot of Education Institutions are established right from British Time.

People at that time it self realized that Education will be key and later in future Agriculture wont be profitable.

They encouraged children to do well in education and will go to any extent to help them finanially at any cost

Primarily for jobs, education families moved to cities and they got their hands in to businesses and succeded.

Then America dream came in to picture. Right from begining of 1970's many Doctors wen to US in search of better career.

Slowly ths got in to minds of people. Later in 1980's Residentials colleges started. That is the time when every one in that community started pushing childeen hard to do well in studies and go to America.

In Film Industry, major heroes, producers from that community did well right from 1960's. Which in turn influenced many from same community to do well there too.

As of now, most people are not allowing childern to continue in agriculture. Everyone wants them to excel in studies or go to abroad.

Anonymous said...

మహేష్,
నేను అడిగిన ప్రశ్నకి మీరు బదులు ఇవ్వగలరా?

Kathi Mahesh Kumar said...

@డమ్మీ: కమ్మ మోడల్ సైద్ధాంతిక పరంగా బ్రాహ్నణుల ఆర్థిక-సామాజిక ఆథిపత్యాన్ని దెబ్బతియ్యడానికి ఏర్పడినట్లుగా అనిపించినా, దానికి మూలాలు మాత్రం రాజకీయ అధికారంలో ఉన్నాయనేది మనం విస్మరించకూడదు.

సమాజంలో ఆర్థిక-రాజకీయ-సామాజిక అంశాల చాలా బలంగా పెనవేసుకుపోయాయి.అలాంటప్పుడు దళిత మోడల్ ప్రజల ఉన్నతి కోసమా రాజకీయ అధికారం కోసమా అని కరాఖండీగా విడదీయడానికి కుదరదు.

సామాజిక సమానత్వంతో అన్నీ సమాధానమైపోతాయనే దళితుల నమ్మకం ఇంకా నిజం కాలేదు. నిజం అవుతున్నట్లు కనిపించడం కూడా లేదు. దళితులు ఎప్పుడూ శ్రామికులుగానే ఉంటూవచ్చారు. కాబట్టి ఆర్థిక బలిమిని పెట్టుబడిగా పెట్టి రాజకీయ-సామాజిక అధికారం చేజిక్కుంచుకునే ఆశలు లేవు. అందుకే ఉద్యమాల బాట పట్టడం జరిగింది.రాజకీయాల్ని ప్రభావితం చేసేదిశగా ఉద్యమాలు మొదలయ్యాయి.

కాబట్టి రాజకీయ ఉద్దేశాల్ని సాకారం చేసుకోవడం కూడా దళితవర్గ ప్రజల బాగుకోసమే అనేది సైద్ధాంతిక ప్రాతిపదిక. అది ప్రాక్టికల్ గా ఎంతవరకూ నెరవేరుతుంది అనేది చరిత్ర చెప్పాల్సిన పాఠం.

Politics are social reality. Without addressing that , social equality is not possible.

Kathi Mahesh Kumar said...

@రే లైట్ హౌజ్: కులం ప్రకారం జతకట్టడం 21 శతాబ్ధపు పనికాదా! ఎక్కడున్నావన్నా నువ్వూ?

నీ చుట్టుపక్కలున్న "జంటల్ని" చూడు. ఎన్ని కులానికి అతీతంగా జీవిస్తున్నాయో లెక్కగట్టు. కులంతోనే విలువకట్టే మనుషులున్నంతవరకూ కులానికి విలువ చెరగదు. పుట్టుకనిబట్టి భవిశ్జ్యత్తు నిర్థారించే బ్రాహ్మణత్వపు నమూనా మనదగ్గర ఉన్నంతవరకూ పోరాటమూ తప్పదు. మన సమాజమే ఫ్యూడల్ సమాజం మరి పట్టింపులు లేవంటే ఎట్లా నమ్మేది?

Just look around in society and blogs. Isn't there caste discrimination everywhere?

@CB rao: I think you are getting too comfortable in ignoring caste reality. May be it doesn't bother you. But people who are humiliated and discriminated cannot be siting that comfortably.

Anonymous said...

Dear C.B. Rao gaaru,
It seems you are not aware of current social scenario. See below comment how agressive these boys.

http://mynampatim.blogspot.com/2010/06/blog-post.html

krishna said...
కులాలు వున్నవే కుమ్ములాడుకోవడానికి . మ కులం గొప్పతనం చాటుకుంటే తప్పేంటి?
see : http://royal-chowdarys.blogspot.com

cbrao said...

@Dummy. http://mynampatim.blogspot.com/2010/06/blog-post.html లో ఉదహరించిన "మరొకరు మరో అడుగు ముందుకేసి అసలు కమ్మోళ్ళను బ్లాగు క్రియేట్ చేసుకోనివ్వకూడదంటూ రాసారు" - అది కేవలం సరదాకు రాసినది. మైనంపాటి బ్లాగులో వ్యాఖ్యలు చూడవచ్చు. ఇహ http://royal-chowdarys.blogspot.com కేవలం కమ్మ వారి చరిత్ర, ప్రముఖుల గురించి వ్రాయాటనికి ఉద్దేశింపబడింది. దానికి కంగారు పడవలసిన అవసరం కనిపించటం లేదు.

Kathi Mahesh Kumar said...

@సి.బి.రావు: మొత్తానికి కులం పేరుతో జట్టుకట్టడంలో తప్పులేదంటరా లేక కడుపు నిండినోళ్ళు జట్టుకట్టి జల్సాలు చేసుకోవడం ఫరవాలేదుగానీ, కడుపు మండినోడు తిరగబడదామని జట్టుకడితే కంగారు పడాలని సూచిస్తున్నారా?

కులం- కులగర్వం- కులతత్వం మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఒకరిది కులగర్వంగానూ మరొకరిది అస్తిత్వపోరాటంగానూ మారడానికి గల కారణాలు అందులోనే దాగున్నాయి. వాటిని అర్థంచేసుకోకుండా కేవలం ignore చెయ్యడం వల్ల కొందరు సుఖముండొచ్చుగాక, కానీ అది లేదని ప్రచారం చెయ్యడం మాత్రం అంగీకరించలేం కదా!

cbrao said...

ఇంజనీరింగ్ కాలేజీలలో కులం పేరిట నిర్వహించే పిక్నిక్ లు, శ్రీశైలం, మంత్రాలయా ల లో కులం పేరిట ఏర్పాటు చేసిన సత్రాలు అభిలషణీయం కాదు.

Ray Lightning said...

మహేశ్ గారు,

కులం ప్రకారం ఆలోచించడమనేది ఫ్యూడల్ సమాజానికి చెందినది. వ్యవసాయంపై 60% మించి ప్రజలు ఆధారపడుతున్నప్పుడు ఫ్యూడల్ పద్ధతి మీదుగానే సమాజం నడుస్తుంది.. అంతా తిరగ్గొట్టి సమసమాజం ఏర్పరచాలని చూసి కమ్యూనిస్టు పద్ధతి పెట్టినా అది చివరకి ఫ్యూడల్ విధానంలోకే దిగుతుంది.. ఫ్యూడల్ సమాజానికి చిహ్నం అధికారం అతికొద్ది మంది చేతిలో కేంద్రీకృతమవడం, విద్యాసమాచారాలు అందరికీ అందుబాటులో ఉండకపోవడం..

మనదేశం ఇంకా ఫ్యూడల్ దశలోనే ఉంది. అందుకని కులవిద్వేషాలు సహజంగానే కొనసాగుతాయి. నా మాట ఏమిటంటే ఇది 21వ శతాబ్దానికి చెందిన పద్ధతి కాదు అని !

ఫ్యూడల్ దశ దాటి పెట్టుబడిదారీ వ్యవస్థ (ఈ రోజుల్లోనే భారతీయ నగరాల్లో ఈ దశని గమనించవచ్చు), ఆ పై సమాచారసంయోగ వ్యవస్థలోకి (information society) మనం అడుగుపెట్టాలి.. ఈ దశల్లో కులం/జాతి పై కాకుండా వేరే ఐడెంటిటీలను ప్రజలు ఏర్పరుచుకుంటారు.. దీనిపై వివరంగా నా బ్లాగులో వ్రాశాను.

ఈ పై దశలను చేరుకోవాలంటే మునుపటి ఆలోచనలకు, ఐడెంటిటీలకు చరమగీతం పాడాలి, లేదంటే ఆలోచనలు ముందుకు కదలలేవు.. కులాల కుమ్ములాట ఎంతచేసుకున్నా సమాజం ఫ్యూడల్ దశను దాటి ముందుకెళ్ళలేదు.

తార said...

దానికి కంగారు పడవలసిన అవసరం కనిపించటం లేదు -- కులం పేరిట ఏర్పాటు చేసిన సత్రాలు అభిలషణీయం కాదు.
ఇలా ఏది అభిలాషణీయమో కాదో మరి అది ఏ లెఖ్ఖ ప్రకారమో చెప్పగలరా?
మతం వద్దు అనే వారు కులం అంత పెద్ద గొడవ కాదు అనటం ఏ లెఖ్ఖో?
దళితులు అంటే, అణగదొక్కబడ్డారు కాబట్టి, వారి బాగు వారి కులానికి సంభందం వున్నది కావున, మరియూ దళితులు అనగా, ఎదో ఒక కులం కాదు కాబట్టి, వారు తమ తమ బాగు కోసం తపత్రేయ పడటంలో అర్ధం వున్నది, మరి మిగతా కుల గొప్పలు మీకు తప్పుగా ఏల అనిపించలేదు?

తార said...

--ఇంకా దళితులు ఉద్యోగాలలో లేరని ఆలోచించ అవసరం లేదేమో!

@ CB Raoji బాగున్నది,

హేతువాదులు అంటే, ఏ లెఖ్ఖా లేకుండా మాట్లాడేవారా??
దళితులలో ఎంత మంది చదువుకున్నారో, ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారో తెలియకుండా మీరు అవసరం లేదు అని ఎలా తేల్చి పడేస్తారు?
ఎదుటి వారి కులం, మతం, మేధా, ... కాకుండా, మనిషిని, మనిషిలాగా గౌరవిస్తే చాలు.
అలా గౌరవించటం మరి కుల గొప్పలు, ఉన్నంత కాలం సాధ్యమా?

Kathi Mahesh Kumar said...

@రే లైట్నింగ్: కులం ప్రకారం ఆలోచించడం అనేది ఫ్యూడల్ పద్దతి కాదు. అది బ్రాహ్మనిజం పద్దతి.
ఫ్యూడలిజంలో జమీందారూ, కూలీలు మాత్రమే ఉంటారు.రెండువర్గాలే. ఒకరు అధికారం చెలాయిస్తే మరొకరు శ్రమను ధారపోస్తారు.

కానీ కుల నమూనాలో ఒకడు కూర్చుని మాటలు చెప్పి తింటే, మరొకరు అధికారంతో రాజ్యమేలుతాడు, ఇంకొకడు వ్యాపారం చేసి డబ్బుగడిస్తే దళితులు మాత్రం అందరికీ ఊడిగం చేసి కడుపు మాడ్చుకుంటాడు. కనీసం మనిషిగా కూడా గుర్తింపబడడు.రాజ్యమేలే వాళ్ళస్థానంలో పొలాలున్నవాళ్ళు రావడం ఫూడలిజానికి చిహ్నంగా కనిపించినా, మూలబిందువులైన "వివక్ష" బ్రాహ్మనిజంలోంచీ వచ్చిందే. ఫ్యూడలిజంలో దోపిడి ఉంటుంది అమానవీయవివక్ష కాదు. ఫ్యూడలిజంలో ప్రాణాలు తియ్యడం ఉంటుంది. మనుషుల్ని జంతువులకంటే అవమానంగా చూడటం కాదు. ఫ్యూడలిజంలో రక్తపాతం ఉంటుంది, మనిషిని జీవిస్తుండగానే చంపడం కాదు.

మన సమాజంలో మార్పులు జరుగుతున్నా అవి మీరు చెప్పినంత straight lines లో జరగవు, జరగడం లేదు. ఇక్కడ అన్ని మార్పుల్లోనూ కులంప్రాతిపదిక బలంగా వేన్నూళ్ళుకుని పోయింది. విద్య, వ్యాపారం, ప్రొఫెషనలిజం అన్నిటిలోనూ కులం తన నమూనాను విస్తరించింది. So called corporates are also not very many exceptions to this.

కొత్త ఐడెంటిటీలు రావాలంటే...పాత ఐడెంటిటీలను విడవాలి. కానీ మన అస్తిత్వమే పాత ఐడెంటిటీ అయితే???? దాన్నెలా వదులుకుంటారూ? అదే ఇక్కడున్న సమస్య.

@సి.బి.రావు: మీరు మూల సమస్యని వదిలేసి పైపై లక్షణాలని అభిలషనీయం కాదని గర్హిస్తున్నరేమో. కొంచెం లోతులోకి దిగండి సార్!

తార said...

naa rendo comment accept cheyaleeda??

danlo meeku tappuga anipinchinadi delete chesi post cheyandi

Kathi Mahesh Kumar said...

@తార: నేను ఏ కామెంటూ డిలీట్ చెయ్యలేదే!

Anonymous said...

*ఇంజనీరింగ్ కాలేజీలలో కులం పేరిట నిర్వహించే పిక్ని....*

ఇటువంటివి విజయవాడ, గుంటూరు లలో ఉండే కాలేజిలలో జరుగుతాయని నా మిత్రుడు చేపితె నేను నమ్మలేక పోయాను. నేను నిజం గా అంత బాహాటం గా అలా చేస్తార అంటె, అతను ఇంకా ఎన్నో వివరాలు చేప్పాడు అది ఇక్కడ రాయటం సబబు కాదు.ఇన్ని అభ్యుదయ వాదలు పుట్టిన జిల్లాలలో ఇంత వర్గ వ్యామోహం ఎందుకొచ్చిందో మరి.

Ray Lightning said...

మనిషి వ్యక్తిత్వం ఎప్పుడూ ఇతర్లు నిర్వచించలేరు, అది ఎల్లప్పుడూ స్వనిర్మితం. ఇతర్లు ప్రతీఒక్కరూ నాగురించి వివిధ విధాలుగా అనుకుంటారు. కానీ, నా గురించి నేను ఏమి అనుకుంటాను అనేది ముఖ్యం.. ఎవ్వరికైనా. ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నవారికైనా.

ఈ ఐడెంటిటీ అనేది ప్రతిఒక్కడు ఓపిగ్గా నిర్మించుకోవాలి. కానీ సాధారణ ప్రజలు అందరూ తత్వవేత్తలు కారు కాబట్టి, వారి ఐడెంటిటి సహజంగానే సమాజపరిణమదశని బట్టి పోలిఉంటుంది. దీనిని ప్రభావితం చేసేది సమాజంలో సమాచారం ఎలా కూడపెట్టబడి ఉందో నిర్ణయించే టెక్నాలజీలు (soft technologies). దీని ప్రకారం మానవచరిత్ర సాంతం నాలుగు దశలుగా విశ్లేషించవచ్చు : వాచ్య దశ oral era (అక్షర జ్ఞానం లేని సమాజాలు), లిఖిత దశ written era (పుస్తకాలు అందుబాట్లో లేని ప్రజలు), ముద్రణా దశ printing era (పుస్తకాలను ప్రచురించగల ప్రజలు), సందేశాత్మక దశ internet era (ఇంటర్నెట్టు ద్వారా చర్చించగల ప్రజలు). వాచ్య దశలో జాతి, లిఖిత దశలో మతం, ముద్రణా దశలో భాష, సందేశాత్మక దశలో భావం మనిషి ఐడెంటిటీలను నిర్వచిస్తాయి. కేవలం ఒకమనిషికి అక్షర జ్ఞానం, పుస్తకాలు, ఇంటర్నెట్టు అందుబాత్లో ఉంటే సరిపోదు. అతని కుటుంబం, మిత్రులు మొదలైనవారందరికీ ఇవి అందుబాట్లో ఉన్నాయా అనేది అతని ప్రవర్తనని నిర్వచిస్తుంది.

ప్రస్తుతం మనదేశంలో మెజారటీ ప్రజలు జాతి / మతం / భాష వగైరా ఐడెంటిటిలను పట్టుకు తిరుగుతున్నారు. (కులం అనేది జాతి ఐడెంటిటి మినహాయించి మరేమి కాదు). వారి బంధుమిత్ర పరివారం ఎంతమంది ఎంత చదువుకున్నారు అన్నదాన్నిబట్టి వారి ఐడెంటిటి ఎక్కడ ఉందో చెప్పవచ్చు. కులపోర్లు గ్రామాల్లో ఎక్కువగా ఉండడం ఆశ్చర్యం ఏమీకాదు. ఈ కులభావన వ్యవసాయదారుల్లో ఎక్కువగా ఉంటుంది. పట్టణాల్లో మతభావనలు, లేదా భాషాపరమైన ఐడెంటీలు ఎక్కువ.

ఇవేమీ కూడా మంచివి కాదు. కానీ, వీట్లో కొన్ని మిగతావాటికంటే చేటైనవి. జాతి (కులం) కంటే మతం మంచిది. మతం కంటే భాష మంచిది. భాష కంటే భావం మంచిది. ఏ మనిషైనా క్రిందటివాటిని విడిచిపెట్టి పైవాటికి రావడానికి ప్రయత్నించాలి. ఈ ఐడెంటిటీలన్ని మెట్లవంటివి. ఒక మెట్టు తరువాత ఇంకొకటి పట్టుకొని కష్టంగా పైకి రావాలి. ఉఫ్ మని ఊదేస్తే ఎగిరిపోవు ఈ ద్వేషాలూ, విద్వేషాలు.

అన్నింటికన్నా గొప్ప మనిషి ఎవడంటే ఏ ఐడెంటిటి లేనివాడు. వాదే ఋషి, సన్యాసి, మోక్షగామి. ఏ మనిషికైనా ఎక్కడ పుట్టినవాడికైనా అదే గమ్యం.

cbrao said...

1952 బెజవాడ సమావేశానికి మేరిలాండ్ (ఉత్తర అమెరికా) లో నివసించే నా మిత్రులు కృష్ణకుమార్ హాజరయ్యారు. ఈ టపాలో దొర్లిన కొన్ని చారిత్రక పొరబాట్లను వివరిస్తూ వారు ఇలా అంటున్నారు. "I was there at the meeting in Vijayawada. Ranga was suppoerted by Prakasm. Sanjeeva reddy was supported by Kala venkat Rao ( a surrogate for Pattabh Sitaramayya opposed to Prakasam) and Chandra mouli. So it was not purely caste or sub caste based. It was personal animosities and jeolusies. I happened to see Ranga as he came out of the meeting defeated. He was out of his senses and angry. I hope some historian will corect the blog."

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు బలపరిచినది రంగా గారిని కాని సంజీవ రెడ్డిని కాదు. చూడండి "Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India -K. C. Suri. ఈ పుస్తకాన్ని ఈ దిగువ చిరునామా నుంచి ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చును.
http://www.odi.org.uk/resources/details.asp?id=1997title=democratic-process-electoral-politics-andhra-pradesh-india
రంగా గారి ఓటమి తర్వాత, రంగా, ప్రకాశం పంతులు గార్లు కాంగ్రెస్ ను వీడి, ప్రజా పార్టీ అనే కొత్త పార్టీను స్థాపించారు. మరిన్ని వివరాలకు "Political History of Andhra Pradesh" ను ఈ దిగువ గొలుసులో చూడండి.
http://deeptidhaara.blogspot.com/2009/10/political-history-of-andhra-pradesh.html

cbrao said...

This is what happened in 1951-52.

Here are the historical incidents accurately.Before first national elections 1952, the Andhra congress elected the president of Pradesh congress. The contest was between Sanjeeva Reddy and Ranga.

Prakasam at that time was with Ranga and not opposed him as depicted. V.V.Giri, Vennelakanti Raghavaiah, Nadimpalli Narasimharao, A.Nageswara rao, Tenneti Viswanadham (all brahmins) supported Ranga during election.Sanjivreddi was supported by Kala Venkatarao who played major role. He was supported by congress kamma leaders like kalluri Chandramouli. In the last minute Kakani Venkataratnam supported Sanjiv reddi.

The congress party also stopped voting power of congress delegates from Guntur district where Ranga had majority. Thus defeat of Ranga was tactically managed.Prominent Reddis like Kandula Obul Reddi and Chegireddi Balireddi were with Ranga.

After the defeat both Ranga and Prakasam followers met in Ayyadevara Kaleswararao`s residence in Bezwada and decided to form seperate party. Thus they left congress and formed Praja party. Ranga was strongly supported by Goutu Latchanna during the fight with Sanjiv Reddi. Anne Anjaiah also opposed Ranga.Hence it is not just Kamma -Reddi fight but two factions in congress.

At that time all India Kisan Majdoor Prajaparty was formed at Patna and Ranga, Prakasam joined in it. A little later Ranga came out and formed Krishikar Lok Party.

In the first general elections 1952, Prakasam and Ranga opposed congress and defeated several congress leaders including Sanjiv Reddi ( who lost to his brother in law Tarimela nagireddi from Anantapur and never contested again from Anantapur!)

Hence it is simplistic to say Kamma-Reddi fight thought was wrong since prominent people are in both sides.The Dalit movement was not strong at that time. Not even the backward classes movement. They came much later.

It is interesting to note that later in 1955 Ranga and Sanjivareddi joined hands to fight against communists.

Anonymous said...

సి.బి.రావు, మీరు ఇన్ని వివరాలు కష్టపడి సేకరించి మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం.

gaddeswarup said...

The following link seems to work for K.C. Suri's article:
http://www.odi.org.uk/work/projects/00-03-livelihood-options/papers/wp180web.pdf
At one poiny (page 13), it says "The struggle between Ranga and Prakasam was seen as the turning point in the Kamma-Reddi rivalry that was emerging in Andhra Pradesh during the post-independence period"

gaddeswarup said...

Oops; that should be "struggle between Ranga and Sanjeea Reddy". Too early in the morning and I copied it wrong.