‘దేవుడున్నాడా? లేడా?’ అనే ప్రశ్నలు చర్చిస్తే తెలేవీకాదు. ఒకరు నిర్ణయిస్తే ఆమోదించేవీ కావు. ప్రతిపాదిస్తే అంగీకరించేవీ కావు. అందుకని, అలాంటి చర్చలకన్నా ‘దేవుడు కావాలా? వద్దా?’అనడం సరైన పద్దతనుకుంటాను. వ్యవస్థీకృత మతానికీనాకూ చుక్కెదురైనా, దేవుడుంటే బాగుంటుందనిపిస్తుంది. నేనేదో ఆధ్యాత్మిక ధోరణిలోపడ్డానని అనుకోకండి. ఇక్కడా నాది తార్కికమైన స్వార్థమే!
మానవపరిణామ సిద్ధాంతం ప్రకటించినట్లు ఈజీవరాసులన్నీ "అలాఅలా" వృద్ధిచెందెయ్యకుండా, దేవుడు ఈ జగాన్ని సృష్టించివుంటే ఖచ్చితంగా ఒక ఉదాత్తమైన గమ్య ఒకటి జీవితాలకు ఏర్పడేది. అలాకాకుండా, డార్విన్ ను నమ్ముకున్నామనుకోండి. మనకు మిగిలేదల్లా అర్థరహితమైన, గమ్యహీనమైన కొండొకొచో అతలాకుతలమైన జీవితాలు. ఎందుకంటే, ఆ సిద్ధాంతం ప్రకారం జీవరాశులు వివిధ దశల్లో natural selection, survival of the fittest అంటూ ఏర్పడిపోయాయేతప్ప వాటికి higher purpose అనేవి లేవు. అలాంటప్పుడు మనుషులతోసహా ఈ జీవరాశులకు అలౌకికమైన గమ్యాలూ, ఉదాత్తమైన ఆలోచనలు అనవసరం. ఏదో పుట్టామా,బ్రతికామా, చచ్చామా అనేతప్ప మిగతావిషయాలు అనవసరం. కానీ, అలా వుంటే ఏమైనా బాగుంటుందా???
అందుకే, ఒక ఉదాత్తమైన ప్రయోజనం గమ్యం ఈ మానవజన్మకు కావాలి. జీవించడానికి ఒక అర్థవంతమైన కారణం కావాలి. కేవలం అవసరాలూ కోరికలూ తీర్చుకుంటూ బ్రతికేకన్నా,కొంత స్వార్థరహితంగా మరికొంత త్యాగమయంగా వుంటేనే జీవితం ఆసక్తికరంగా వుంటుంది. ‘ఇవన్నీ ఒక అలౌకికప్రయోజనం లేకుండా సాధ్యమా !’ అంటే, "కష్టమే" అని చెప్పుకోవచ్చు. నిస్వార్థంగా ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఒకరినొకరు కాంక్షించుకోవడం. ఒకరికొకరు సాంత్వన చేకూర్చుకోవడం. ఇటువంటి భావాలకు జగత్ సంబంధిత (cosmic) ప్రయోజనం లేకుంటే, కేవలం లాభనష్టాలు బేరీజు చేసుకుని స్వార్థంకోసం అమలు జరిపేస్తాం. అందులో ఏమైనా తృప్తి వుంటుందా???
అందుకే మానవచైతన్యానికి ఒక అద్వితీయమైన అలౌకికప్రయోజనం కావాలి. అర్థరాహిత్యానికీ, అర్థంకాని ప్రయోజనానికీ మధ్య నన్ను ఎంచుకోమంటే ఖచ్చితంగా అర్థంకాని(అలౌకిక) ప్రయోజనాన్నే ఎంచుకుంటాను. అందుకే నాకు దేవుడు కావాలి. కాకపోతే ఆధునిక పోకడలైన సైన్సూ, లౌకికకవాదం,వ్యక్తివాదం ఎవ్వరూ ప్రశ్నించలేని ఆ ఉదాత్త జగత్ ప్రయోజనాన్ని పక్కనబెట్టి మతాలూ,పూజారులూ, నిబంధనలూ, సాంప్రదాయాలూ దేవుడ్ని ప్రశ్నార్థకం చేసేసాయి.
ఈ సందర్భంలో మా ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఆయన ప్రకారం "God is nothing but a center out side your own center. You need Him/Her some times."
Wednesday, November 26, 2008
నాకు దేవుడు కావాలి
****
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
నాకూ కావాలి దేవుడు! పూజలూ పునస్కారాలూ చెయ్యడానికి కాదు(అంటే చెయ్యనని కాదు) చాలా సందర్భాల్లో నన్ను నేను judge చేసుకోవడానికి, నాకు తప్పుగా ప్రవర్తించాననో, ఆలోచించాననో అనిపించినపుడు confess కావడానికీ, మంచి పని చేస్తున్నాననో, చేసాననో అనిపించినపుడు good, go ahead అని బెస్టాఫ్ లక్ చెప్పించుకోడానికీ! ఎప్పటికప్పుడు నేనేమిటో ఆలోచించుకుని వీలైనత clean గా నన్ను, నా ఆలోచనల్నీ ఉంచుకోడానికి నాకు సపోర్ట్ దేవుడి నుంచే లభిస్తుంది.
నిస్వార్థంగా మనుషుల్ని ప్రేమించడానికీ, ముఖ్యంగా ఎదుటి వాళ్ళ తప్పుల్ని క్షమించడానికి (లేదా 'వీళ్ళింతే అని అంగీకరించడానికి )కావలసిన శక్తిని కూడా దేవుడి నుంచే తీసుకుంటాను నేను.
అన్నట్టు...స్వాంతన కాదు, సాంత్వన!
నాకూ దేవుడు కావాలి. దుష్ట శిక్షణా, శిష్ట రక్షణ చెయ్యటానికి దేవుడు కావాలి. పాపాత్ముల చేతుల్లో బుగ్గైపోతున్న ఎన్నో జీవితాలని రక్షించటానికి దేవుడు కావాలి. తప్పు చేస్తే దేవుడు వెంటనే శిక్షిస్తాడు అనుకుని ప్రతి వాళ్ళు తప్పు చేయ్యాలీ అంటేనే భయపడే విధంగా ఉండటం కోసం దేవుడు కావాలి. చివరిగా నీకు నేనున్నాను అని నాకు ఓదార్పుని ఇచ్చేందుకు నిజంగానే నాకు దేవుడు కావాలి
మంచి టపా.
"నేనేదో ఆధ్యాత్మిక ధోరణిలోపడ్డానని అనుకోకండి. "
పడండి. పడీతే మంచిదే. :)
మీరప్పటికి బ్లాగ్రంగ ప్రవేశం చేశారో లేదో నాకు గుర్తు లేదు. ఇదోసారి చూడండి.
నాకూ కావాలంటే దేముడు ఎక్కడినించో హఠాత్తుగా ఊడిపడదు.అదొక నమ్మకం,విశ్వాసం అంతే.అవసరంలో ఉన్నవాడికి సాయం చెయ్యగలిగిన ప్రతీ మనిషి దేవుడి ప్రతిరూపాలే లెఖ్ఖ.దానికోసం ఓ మతానికో,కులానికో చెందిన వారయ్యుండక్కర్లేదు అన్నది నా భావన.అప్పుడు ఓ మంచి పని చెయ్యాలన్న అలోచన మనకి వచ్చిందంటే దానికి దైవ ప్రోద్బలం ఉన్నట్టే కదా మరి.దేనికయినా విశ్వాసమే ప్రాతిపదిక.
రిట్యూలిస్టిక్ పూజలు మా ఆవిడకోసం చేస్తాను, ప్రార్ధన మాకోసం చేసుకొంటాను.
మానవుడే మాధవుడు! మనందరిలో దేవుడిని చూడండి.
పరమార్థమనేది ఎక్కడో లేదు, తాను చేసే చేతల్లోనే వుందనే సత్యాన్ని మానవుడు గుర్తించాలి. చేయగలిగినంత మేలు మానవ సమాజానికి చెయ్యాలి. పరార్థజీవనుడైన మానవుడే పరమాత్మతో సమానుడు.
దేవుడు వేరే లేడు. నీలోనే వున్నాడు. ప్రతిక్షణం నీవు చేసే ఆలోచనలను, చేసేపనులను గమనిస్తూనే వున్నాడు. కాని పనులకు కాదని హెచ్చరిస్తున్నాడు. అదిగుర్తించలేక ఆత్మసంయమనం చేసుకోలేక మానవుడే తప్పు దోవలో పడి అతఃపతితుడగుచున్నాడు. కనుక మానవుడే దేవుడు. ఆ దైవత్వాన్ని నీలో నీవు
దర్శించు. ఆ పరమాత్మ దృష్టితో ప్రపంచాన్ని చూడు. జీవన జ్యోతి వెలిగించు. లోకానికి వెలుగు చూపించు.
ఆ ఆనందాన్ని అందరికీ పంచి పెట్టు. హరిఃఓం
పైవన్నీ నామాటలు కాదు. నాకు నచ్చిన మాటలు.
ఓ కమల్ హసన్ సినిమాలో - శివం సుందరం అనుకుంటా- హీరో ఫిలాసఫీ మనుషుల్లోనే దేవుడిని చూడాలని.
@Mahesh: Very well written post. It was logical and shows your intelligence in understanding the subject.
I would like to highlight couple of points here.
1) The fundamental difference between Abrahamic Cults and Indic/Asiatic Religions is, the former are based on "Historical Event" and where as the later are natural, evolutionary, and living cultures. These living cultures/societies were categorized as Religions after they come in contact with Western people. It was because the Western people don't understand the concept of living cultures. They always compare other systems with their own "intolerent" Cults. This intolerence in them breed "Terror" all over the world as we see in our day to day lives. Slavery, Crusades, Inquisitions, Fatwas, Jihad, Colonizations, killing of Natives, land grabs, destryoing Native peoples cultures/religions, smearing Native peoples Gods and Goddesses are some of the tools that they deploy to soul harvest Native People. Any Native son(s) of Mccauley fell easily into this trap. They never realize what they are doing. They behave like a Zombie (no brains).
2) In America there is a great war is going on between Dominant (in America)Cultists and followers of Darwin (Scientists, Progressives, Liberals and Educated). The Cult want to teach kids that their god created the universe and so it is the "Intelligent Design" that must be taught in American School system. Where as Scientists, Progressives and Liberals want to teach kid about Darwin's "Evolution theory" and Mathematics.
Again I will congratulate you for writing so intelligently.
will continue ....
నాకు యమధర్మరాజు కావాలి. గరుడ పురాణం రాజ్యాంగం కావాలి. :)
Well Write-up Mahesh!! But Expecting some more detailed one..
Hope you probably you come with Version II
In continuation ...
As I wrote the following sentence in my previous comment, one my friend send me a e-mail about Bombay blasts (Dated 27/Nov/2008).
"This intolerence in them breed "Terror" all over the world as we see in our day to day lives."
Read the news at ....
http://news.bbc.co.uk/2/hi/south_asia/7751160.stm
http://www.cnn.com/2008/WORLD/asiapcf/11/26/india.attacks/index.html
http://www.ndtv.com/convergence/ndtv/default.aspx
http://www.rediff.com/news/2008/nov/26-firing-in-cst-station.htm
Who did this? Why? How? are the questions that must be answered by Indian Police and Indian Government.
As it is the practice of Indian English Media (to twist facts, their lies and run special propaganda): let them publish the sex and religion of each of the victims!? That may threw light on and answer for Who, Why and How questions.
I hope that the readers will understand the "intolerence" that we are talking about?
The government must crush such "Terrorists" without any second thoughts.
will continue ...
You want God right!. Which God?
1) Abrahamic god?
a) Jewish god?
b) Christian god?
c) Islamic god?
2) Indic/Asiatic God?
It looks like you are more familiar with Darwinism and Abrahamic god!. Pease clarify for the readers, which god you want. (I can guess that you may say, you want a humanitarian God, and you don't care whose God he is/was).
The book thumpers from West want to destroy the Indic/Asicatic way of life, and causing immense human suffering in the name of Abrahamic god(s). With their intolerent ideology, they want to kill the un-believers where ever they find. It looks like they(Muslims and Christians) are about to assicnate Humanity (all the people on this planet) to prove that their god is the only god and other Gods are flase. BTW. Did you know about Indonasian Fatwa about Yoga?
For example they are fighting for supremacy of their god over other Gods for the last 2000 and 1400 years respectively. The current and past clashes such as West-Iraq, West-Afghanisthan, Sudan, J&K, North-Esatern states of India, Balkans, America-North Korea, America-North Vietnam, Africa is burning (AIDS, and Warfare between Islamic Tribes and Christian Tribes: note:- The Blacks or Native Tribes were converted to Islam and Christianity over time), West-Islam in Islarel and other flash points all over the world.
Educate the illiteate and poor people with the real facts. I know very well that you are a honest and good man.
Observation: Deception and propaganda are the tools of Missionaries and Communists.
See my old post on the similar topic
http://pradeepblog.miriyala.in/2008/04/blog-post.html
Lets think for a second here...
Whose god (which god) brought destruction to poor and illiterate people of India? (Bombay blasts). Why? For the God's sake stop this god's business (Soul Harvesting). Westener's spending tens of Billions of Dollaras every year on Soul Harvesting Business worldwide.
Let live peacefully and allow others live peacefully. Your "god" is not great than my God!. At the best they are equal.
Budhist Nam-Rupa & Islamic Allah are similar
Buddhism is the world’s first and very ancient atheistic religion.Islam,on the contrary, is a monotheistic religion.According to the Buddhist philosophy Naam-Rupa or cosmic energy governs the universe.the cosmic energy is formless and invisible.the visibility of this formless cosmic energy is experienced by human beings through the forms of living and non-living things.The forms appear and disappear but the cosmic energy is eternally present in the cosmos constantly governing ,destroying, creating and organizing. It neither shrinks nor expands but it constantly changes which brings dynamism,rhythm and order in nature.Man has no control on nature.
Allah in Islam,apart from all-pervading is omnipotent,omni-present and omniscient which means all powerful,present everywhere and knowing everything.Allah is the creator of the universe. Nothing happens without his will. He is the cause, he is the effect of every thing.supreme force is formless, not having an image.Such a supreme power Allah is formless and still gives birth to different forms — living and non-living.(Dalit Voice 16.1.2010)
Post a Comment