Tuesday, November 25, 2008

సాపేక్షసిద్ధాంతం - మానవసంబంధాలు


మానవసంబంధాల చర్చవచ్చినప్పుడలా 'ఆల్బర్ట్ అయిన్ స్టీన్' సాపేక్షసిద్ధాంతం (theory of relativity) గురించి ప్రస్తావిస్తుంటే కొందరు, "అదొక భౌతికశాస్త్ర సిద్ధాంతంకదా! దాన్ని మానవసంబంధాలలోకి ఎలా అన్వయిస్తున్నారు?" అని పదేపదే అడిగారు. ఇది చాలా సాధారణ విషయంకదా, దాదాపు అందరికీ తెలిసేవుంటుందనే నమ్మకంతో ఆ ప్రశ్నని పక్కనపెట్టాను. కానీ, ఈ రోజు మా ఆఫీసులో subjectivity - objectivity చర్చలోకొచ్చే సరికీ మళ్ళీ ఈ సాపేక్షసిద్ధాంతం నా మెదడ్లో మ్రోగింది. ఎలాగూ ఆలోచించేసానుగనక, ఒక టపా రాసే బాగుంటుందనిపించి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను.


1905 లో స్పేషియల్ (special) ధియరీ ఆఫ్ రిలేటివిటీ ఆతర్వాత 1915లో జనరల్ ధియరీ ఆఫ్ రిలేటివిటీని అయిన్ స్టీన్ ప్రతిపాదించాడు. అప్పటివరకూ సమయం (Time), స్థలం (space) స్థిరం అనే నమ్మకంతోవున్న ప్రపంచం, ఈ ప్రతిపాదనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాస్త over simplification చేసి చెబితే, "ఒక వస్తువుకు కాంతివేగంతోవున్న సంబంధాన్నిబట్టి 'స్థలం' మరియూ 'సమయాల్లో' మార్పువస్తుంది" (time and space are capable of being altered according to the nature of one's trajectory in relationship to the speed of light) అన్నమాట. ఈవిధంగా చెబితే సగంమందికి అర్థంకాదుగనక, అయనే ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు. "ప్రేమికురాలితో కూర్చునిగడిపిన ఒక గంట నిమిషంగానూ, బస్సుకోసం ఎదురుచూస్తూ గడిపిన ఒక నిమిషం ఒక గంటగానూ అనిపిస్తాయి. అదే సాపేక్షసిద్ధాంతం" అని.


ఈ విధంగా మానవసంబంధాలకు సాపేక్ష సిద్ధాంతాన్ని ఈ మహానుభావుడే లింకెట్టేసాడు. కాకపోతే, ఈ ఆలోచనాధోరణిని ఆధారం చేసుకుని 'ఫాన్స్ బావోజ్' అనే ఒక సామాజికశాస్త్రవేత్త 'సాంస్కృతిక సాపేక్షసిద్ధాంతానికి' (cultural relativism) తెరతీసాడు. దీని ఆధారంగా అప్పటివరకూ డార్విన్ ప్రతిపాదించిన ఏకమూససామాజిక ఎదుగుదల (savagery- barbarism-civilization) సిద్ధాంతాలని అద్యంతం అన్వయించుకుంటున్న సమాజనిర్మాణశాస్త్రవేత్తలు (anthropologists), ప్రతి సమాజాన్నీ ప్రత్యేకమూసగా పరిగణించి దాని మూలాలఅధారంగా అర్థం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అంటే, ఒక absolute విలువ అధారంగా సమాజాన్ని అర్థం చేసుకునే పోకడలుపోయి ఒక పదార్థాన్ని, సమాజాన్ని,వ్యక్తినీ, పరిస్థితినీ దాని ఉనికి,స్థితి ఆధారంగామాత్రమే అర్థం చేసుకునే సాపేక్షత (relativity) అలవడిందన్నమాట. ఈ సైద్ధాంతిక మూలాల ఆధారంగానే వ్యక్తివాదం, అస్థిత్వవాదం వంటి భావజాలాలు మానవసంబంధాలను ముఖ్యంగా స్త్రీపురుషుల సంబంధాలని నిర్వచించడం మొదలయ్యింది.


అక్కడే మానవసంబంధాలలో సాపేక్షసిద్ధాంతం యొక్క ఉనికి బలపడింది. ఇక్కడే సాంప్రదాయాలూ,మతం,సామాజిక కట్టుబాట్లు వంటి absolutism,fundamentalism పోకడలకు చుక్కెదురయ్యింది.


****

11 comments:

Anonymous said...

@Mahesh: Nice analysis. As you mention, it takes keen observation and understanding for average person to understand the concept.

Advancements in Sciences relegated religion to bottom of the heap in the Western World. The agents of the religion (in Europe) ruled the continent for 1700 years (325 AD to 1900 AD) with their bigotry and ignorance. The ruling elites always thump that book and try to prove that what ever is written in it is correct. That brought Dark Ages in Europe. But advancements in Sciences and Human rational thinking shattered those myths. They stifled growth for 1700 years. They killed Scientists (Galilio and many others) who questined their bigoted and outdated belief systems. And they killed tens of thousands of Pagan intelelctuals by branding them as witches.

Now more than 50% of Europeans and Americans lost their faith in that book and are eagerly looking (Eastward) for alternative solutuons (Yoga, Buddhism, Thai-Chi, holistic medicin, etc.) to worldy and spiritual problems.

The irony is that the poor and illiterate in Asia are consumed by those intolerent cultists from West. Don't forget one thing, as long as there is a poverty, illiteracy in the world, those intolerent bandits hover around the world like vultures for native souls.

Bolloju Baba said...

expected more/ need more

Anonymous said...

Of all the posts that you wrote so far, this makes sense!! Its not because I agree with it, because it makes sense!

If you keep writing this way, people wouldnt have problems with you.

Anonymous said...

చిన్నదయినా ఈ టపా బాగుంది. నా అభిప్రాయం ఏమంటే, absolutism కొన్ని సరిహద్దులకి లోబడి ఉంటుంది, అదే relativity అధారిత ఆలోచనలకి ఏ హద్దులూ ఉండవు. ఎలాంటి విషయాన్నైనా నూటొక్క సాపేక్షత్వాలతో చూడొచ్చు. అలాంటప్పుడు ఈ రెండూ ఎడమొహం, పెడమొహం అవటంలో ఆశ్చర్యమేముంది?

Anonymous said...

Average intellect people can easily mis-understand Mr. Mahesh, because of the topics that he choose to write. On the surface, one may percieve that he is anti-Hindu and anti-that&this.

One must read his topics with open mind and understand the relevance (changing times) of those topics to present Indian Social, Cultural, and Religious traditons.

In one sense he may be a radical, who want to bring change to this world through his writings. If my analysis is true, I request every one read and understand his messages.

If some one prove that he is writing to bash others (Hindus, upper Castes) with special agenda, then readers have all the right to criticise him.

Anil Dasari said...

టపా బాగుంది.

చిన్న అప్పుతచ్చు. మొదటిది special theory of relativity, spacial కాదు.

Kathi Mahesh Kumar said...

@బొల్లోజు బాబా: నేను రాసిన చాలాటపాలకు ప్రాతిపదిక ఈ సిద్ధాంతమే. అందుకే ఆవుకథలాగా మళ్ళీ ఎందుకని వాటిని రాయకుండా పక్కనపెట్టాను.

ఇక్కడ సమస్య ఏమిటంటే,సిద్ధాంతం వ్యక్తిగతపరిధిని దాటి (కేవలం)ఒక ఆలోచనగా సాక్షాత్కరించడంతో దానితో చాలావరకూ ఎవరూ విభేధించరు.కానీ ఆ సిద్ధాంతాలను జీవితసత్యాలకు అన్వయించేసరికీ అప్పటివరకూ వ్యక్తులు నమ్ముతూ వస్తున్న విలువలకు అపఘాతంలా అనిపించి అర్జంటుగా వ్యతిరేకించేస్తారు. బహుశా అది defense mechanism అనుకుంటాను.

నేను కాంక్షించేది acceptance of the possibility of multiple truths (బహుశా దీనిగురించి ఇంకోటపా రాయాలేమో!).కానీ,నా సాధికారత ధిక్కారస్వరంలాగా వినిపిస్తుందేమో అందుకే ఇన్ని చర్చలు.

@అబ్రకదబ్ర: ధన్యవాదాలు. మార్చాను.

@వికటకవి: నిజమే..!!

Anonymous said...

మహేష్ గారూ మీ బ్లాగు 20,వేలు క్లిక్కులు దాటిన సందర్భంగా నా సుభాకాంక్షలు

gaddeswarup said...

I may be wrong but what you said sounded a bit like situationist ideas propounded by Stanley Milgram , Philip zimbardo and others. There is a blog too expounding some of their ideas:
http://thesituationist.wordpress.com/
and a book by Zimbardo "The Lucifer Effecyt"

KumarN said...

Mr Anonymous,

I don't think it has anything to do with intellectual levels of people. What Mahesh says is more appropriate I think.

"ఇక్కడ సమస్య ఏమిటంటే,సిద్ధాంతం వ్యక్తిగతపరిధిని దాటి (కేవలం)ఒక ఆలోచనగా సాక్షాత్కరించడంతో దానితో చాలావరకూ ఎవరూ విభేధించరు.కానీ ఆ సిద్ధాంతాలను జీవితసత్యాలకు అన్వయించేసరికీ అప్పటివరకూ వ్యక్తులు నమ్ముతూ వస్తున్న విలువలకు అపఘాతంలా అనిపించి అర్జంటుగా వ్యతిరేకించేస్తారు. బహుశా అది defense mechanism అనుకుంటాను.
"

స్వేచ్చ said...

నా చిన్ని బుర్రకి అర్దం కాలేదు...ఆర్దికమాంద్యం దెబ్బకి నా మైండ్ తిరిగింది...ఎందుకంటే ఇవ్వాలొ రేపో అందులో బలికాబోతున్నాను...చివరగా ఇక్కడ చెప్పుకుంటున్నాను.... I like this kind of topics...thanks mahesh....inthaki neenu indialoney vunnanu....i think you get it.....