skip to main |
skip to sidebar
ఈటివి లో శోభన్ బాబు- లక్ష్మి నటించిన ‘కోడెనాగు’ సినిమా చూశా . చాలా శక్తివంతమైన సినిమా. యువతరం ఆరాటం. సమాజం పట్ల ఉండే నిరసన, కోపం. వ్యక్తిగత ద్వేషాలూ, పగ. అలవికాని ప్రేమ. అర్థంకాని ఆవేశాలు. ఎంత సహజంగా రచించారా అనిపించింది. ఈ భావతీవ్రత అంతా ఈ చిత్రానికి కన్నడ మాతృక అయిన ‘నాగరహావు’ రాసిన ‘తరాసు’ కు చెల్లుతాయనుకుంటా. పుట్టణ్ణ కణగల్ దర్శకత్వం వహించిన ఒరిజినల్ కూడా చూశాను. అందులో విష్ణువర్థన్ నటనే నాకు శోభన్ బాబుకన్నా బాగా నచ్చింది. బహుశా అదే విష్ణువర్థన్ మొదటి సినిమా కావడం, శోభన్ బాబు ఈ సినిమా చేసేసరికే ఒక ఇమేజ్ ఉండటం ఒక కారణం కావొచ్చు. కొడెనాగు సినిమాలో ఆచార్య ఆత్రేయ నటించడం ఒక హైలైట్.
ఈ ‘గ్యాంబ్లర్’ తో పెట్టుకుంటే పాపరే!
అజిత్ అభిమానుల వీరాభిమానం మీద, అతగాడి స్క్రీన్ ప్రెజెన్స్ మీద తప్ప స్క్రిప్టు మీద ఏమాత్రం శ్రద్ధలేకుండా తీసిన చిత్రం ఇది. ఒక థిల్లర్ కథకు అనవసరపు కామెడీ మిక్స్ చేసి అసందర్భమైన, అర్థరహితమైన స్క్రీన్ ప్లేతో సినిమా అంతా నడుస్తుంది. ఉపసంహారం (ఎపిలాగ్)లో మలుపు తిప్పి, కథ మొత్తాన్నీ మార్చేసే పద్దతి హాలీవుడ్ లో కొన్ని సినిమాలలో వర్కవుటైనా అప్పటికే సహనం చచ్చిన ప్రేక్షకుడికి ఈ చిత్రంలోని ఎండ్ ట్విస్ట్ ఏమాత్రం కిక్ ఇవ్వదు. అజిత్ నటన చాలా కొత్తగా, బాగుంది. అర్జున్ మామూలే. అంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు.
****
1 comments:
ఈ రెండు సినిమాలూ నేను చూళ్ళేదు. కోడెనాగులో మంచి పాటలున్నాయి. ‘సంగమం.. సంగమం’, ‘కథ విందువా నా కథ విందువా’, ‘ఇదే చంద్రగిరి...’ వాటిలో కొన్ని.
ఈ సినిమా లోగోకు ప్రత్యేకత ఉంది కదా? అందుకే దీన్ని సేకరించటానికి ప్రయత్నించాను, ఆ మధ్య. ఇక్కడ చూడగానే సంతోషం వేసింది!
Post a Comment