Showing posts with label సినిమాలు. Show all posts
Showing posts with label సినిమాలు. Show all posts

Friday, January 27, 2012

షూటింగ్ ముచ్చట్లు : ఆదిలోనే హంసపాదు

డిసెంబర్ 9,2011

ఎనిమిదికి షాట్ పెట్టాలనుకుంటే, అందరూ వచ్చేసరికీ తొమ్మిదయ్యింది. బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా, అప్పటికే మేకప్ పూర్తయిన హీరోయిన్ కి కాస్ట్యూమ్స్ ఇచ్చాం. ఉన్న రెండు ఛేంజెస్ లో అతిముఖ్యమైన బెడ్రూం సీన్స్ కి సంబంధించిన చీర అది. 

కాస్సేపటికి నాకు పిలుపొచ్చింది. 
"మీ స్కిప్టులోని అవసరాలకి, మీరు స్కెచ్ లో చూపించిన లుక్ కి ఈ చీర సరిపోతుందా?" అంటూ నాచేతికి చీర యిచ్చింది స్వప్న(రమ). 
చీర మెటీరియల్ బాగుంది. కట్టుకుంటే స్వప్నకూ బాగుంటుంది. కానీ రమ పాత్రకు, ఆ పాత్ర తీరుకు, నేను చూపించాలనుకున్న విధానానికీ, కెమెరాకూ నప్పని కలర్, మెటీరియల్ లో ఉంది. ఒక్కసారిగా ఏంచెయ్యాలో తోచలేదు. 

కమలాకర్ లైటింగ్ సెట్ చేసుకుంటున్నారు. అజయ్, శ్రీనాథ్, శ్రీకాంత్, అరవింద్ సెట్ అరేంజ్ చేస్తున్నారు. హరి స్టిల్స్ తీస్తున్నాడు. కాస్ట్యూమ్స్ లో తేడా వచ్చేసిందింది. ఎలా షూటింగ్ మొదలుపెట్టాలో తెలీదు. 

పవిత్రం కి ఏదో ఆలోచన వచ్చి 
"నీ దగ్గర ఏమైనా చీరలున్నాయా" అని స్వప్ననే అడిగాడు. 
"మీకు అభ్యంతరం లేకపోతే తెస్తాను. కొన్ని ఆప్షన్స్ ఉండొచ్చు." అంది స్వప్న నన్ను చూసి. 
అప్పటికే నాలో ఏదో టెన్షన్. ఆదిలోనే హంసపాదా అనే ఫీలింగ్. అప్పటివరకూ ఉన్న మొండితనం ఎక్కడో సడలిన భావన. 

"సరే" అన్నాను నెమ్మదిగా. 

మోహన్ కార్ అరేంజ్ చేసాడు. స్వప్న పవిత్రం చీరలు తేవడానికి కృష్ణానగర్ బహల్దేరారు. మోహన్ కూడా నేనూ మా ఇంట్లో ఏమైనా చీరలున్నాయేమో తీసుకువస్తానని వెళ్లాడు. అప్పుడు సమయం దాదాపు 10 గంటలు.

ఏదో టెన్షన్. వచ్చే చీర ఎలా ఉంటుందో తెలీదు. నేను అనుకున్న విజన్ ఏమిటో మర్చిపోయాను. హీరోయిన్ ఎలా ఉంటే బాగుంటుందని నేను ఆలోచించిన ఊహకు మసకేసింది. 
హరి, శ్యాం తమ కెమెరాలకు పని చెప్పారు. ఏవేవో స్టిల్స్ తీస్తూ వచ్చారు. 
కొంత ఆటవిడుపు. హరి నా ఫోటోలూ కొన్ని తీశాడు.

గంటలో మోహన్ వచ్చాడు. వెంటవెంటనే ఒక పెద్ద బ్యాగ్ తో స్వప్న-పవిత్రం. బ్యాగ్ లోంచీ చీరలు తీసి చూపించింది. వాటిల్లో రెండు ఈ చేంజ్ ఓవర్ కోసం చెప్పాను. అంతలో ఆ చీరల మధ్య మరో చీర కనిపించింది. 
"ఇది రెండో చేంజ్ ఓవర్ కి" అని చెప్పాను.
స్వప్న విచిత్రంగా చూసి. "ఇంకో చీర బానే ఉందిగా" అంది.
"లేదు. ఇది ఇంకా బాగుంటుంది. రెడీ అయ్యిరండి" అని చెప్పేసి కమలాకర్ గారి దగ్గరికి వెళ్ళాను.
అప్పటికి లైటింగ్ అయిపోయింది. చక్రధర్ తో చర్చించి, ఫ్రేమ్ చూసుకున్నా.
స్వప్న వచ్చింది. నేను అనుకున్నదానికన్నా ఇప్పుడే ‘రమ’ నా కళ్ళముందు క్లియర్గా కనిపించింది. 


ఫస్ట్ షాట్ తీశాం....


****

Tuesday, December 27, 2011

ఎడారివర్షం - లఘుచిత్రం

తెలుగు ఇండిపెండెంట్ సినిమా పేరుతో మొదలుపెట్టిన ఒక ఫేస్ బుక్ గ్రూప్ ద్వారా కో-ఆపరేటివ్/కొలాబరేటివ్ సినిమా ప్రయత్నం హైదరాబాద్ లో మొదలయ్యింది. మొదటి యత్నంగా గ్రూప్ మెంబర్స్ నిర్మాణతలో నా దర్శకత్వంలో "ఎడారివర్షం" అనే ముఫై నిమిషాల లఘుచిత్రం నిర్మించడం జరిగింది. ఆ లఘుచిత్రం ప్రోమో మీ కోసం...




****

Tuesday, September 13, 2011

తెలుగు సినిమాలు - డబ్బింగ్ సినిమాలు

కన్నడ పరిశ్రమ తరహాలో ఇక్కడా డబ్బింగ్ సినిమాల్ని నిషేధిస్తారట: హహహ...
కర్ణాటకలో తెలుగు తమిళ సినిమాలు డైరెక్టుగానే రిలీజై వందరోజులు ఆడేస్తాయి. డబ్బింగ్ సినిమాలు వాళ్లకి అసలు అవసరమే లేదు. అయినా నిషేధాలవల్ల సినిమా పరిశ్రమ అభివృద్దిచెందదు. సెన్సిబుల్ సినిమాల వల్ల అభివృద్ధి చెందుతుంది. ఆ జ్ఞానం మనోళ్ళకి కావాలి. అయినా, డబ్బింగ్ సినిమాలు లేకపోతే ఉన్న థియేటర్లలో ఈగలు తోలుకోవలసిందే. డబ్బింగ్ సినిమాలు లేకపోతే పూటగడవని పరిస్థితికి తెలుగు పరిశ్రమ చేరింది. కాబట్టి డబ్బింగ్ మీద నిషేధం పరిశ్రమని మరింతగా దిగజారుస్తుందేతప్ప మెరుగుపరచదు. మౌళికాంశాలని వదిలేని ఈ పనికిమాలిన పనులేమిటో మన పరిశ్రమ పెద్దలకు!

మన తెలుగు పరిశ్రమ సమస్యల విస్తృతత్వానికి అంతే విశాలమైన సమాధానాలు కావాలి. “సెన్సిబుల్ సినిమా” అనే పదం చిన్నదే అయినా దానిలో ఆ విశాలత్వం దాగుందని తమిళ,మళయాళ,బంగ్లా, మరాఠీ, హిందీ సినిమాలు నిరూపిస్తూ వస్తున్నాయి. సినిమాని కేవలం కళగా భావించినా చెల్లదు, వ్యాపారంగా మాత్రమే భావించినా పొసగదు. కళాత్మకవ్యాపారం అని అంగీకరిస్తూనే, రెంటిలోని నిబద్ధతని ఒకటిచెయ్యగలిగితేనే సెన్సిబుల్ సినిమా పుడుతుంది. విషయపరమైన సెన్సిటివిటీ దర్శకుడి బాధ్యత అయితే, వ్యాపారపరమైన సిన్సియారిటీకి నిర్మాత బాధ్యుడు. ఈ విధంగా ఇద్దరూ సెన్సిబుల్ సినిమాకి రథసారధులే.

వ్యాపారనిబద్ధత కలిగిన నిర్మాత ఆద్యుడైతే, కళపట్ల సమగ్రమైన అవగాహన కలిగిన దర్శకుడు మధ్యాంతాలుగా కొనసాగితేనే మంచి సినిమా పుడుతుంది. అటు వ్యాపారాత్మకంగానూ ఇటు కళాత్మకంగానూ వృద్ధిచెందుతుంది.

సమస్య నిర్మాతల వైపునుంచే అని ఒప్పుకోవాలనిపించినా, తమిళంలో మొదలైన దర్శకనిర్మాతల ట్రెండ్ నన్ను ఆపుతోంది. ఒక సెన్సిబుల్ సినిమా ఇచ్చి పరిశ్రమని ఒక కుదుపుకుదిపిన దర్శకులు తమిళంలో వెనువెంఠనే కార్పొరేట్ ఫండింగో, ఫైనాన్సర్ల ఫండింగో సంపాదించి దర్శకనిర్మాతలుగానూ, సెన్సిబుల్ నిర్మాతలుగానూ ఎదిగి వైవిధ్యాన్ని నిలబెడుతున్నారు. “ట్రెండ్” సృష్టిస్తున్నారు. కానీ తెలుగులో ఆ పరిణామం కనిపించదు. శేఖర్ కమ్ముల కొంత ప్రయత్నించినా, చంద్రశేఖర్ ఏలేటి, చంద్రసిద్దార్థ, క్రిష్, దేవకట్టా లాంటివాళ్ళుకూడా తమ సర్వైవల్ కోసం వెతుక్కునే పరిస్థితిదాటి ఎదగలేని బలహీనతలోనే ఉన్నారు. ఈపాటికి వీళ్ళ స్వీయదర్శకత్వంలోనో లేక నిర్మాణంలోనే కనీసం నాలుగేసి సినిమాలు సంవత్సరానికి వచ్చుంటే ఈపాటికి పరిశ్రమ రూపురేఖలు మారేవి.

కథల విషయానికి వస్తే, తెలుగు సినిమా కథలు చెప్పడం మానేసి సీన్ల అల్లికలోపడు పాతికసంవత్సరాలు దాటుతోంది. కాబట్టి మార్పు అక్కడినుంచే రావాలి. అది నిర్మాతగా కూడా మారగలిగే సత్తాఉన్న దర్శకుల దగ్గరనుంచే రావాలి. కథలు చాలానే ఉన్నాయి.

***

Saturday, September 10, 2011

రెండు సినిమాలు: ఒకటి కొత్తది మరొకటి పాతది.

ఈటివి లో శోభన్ బాబు- లక్ష్మి నటించిన ‘కోడెనాగు’ సినిమా చూశా  . చాలా శక్తివంతమైన సినిమా. యువతరం ఆరాటం. సమాజం పట్ల ఉండే నిరసన, కోపం. వ్యక్తిగత ద్వేషాలూ, పగ. అలవికాని ప్రేమ. అర్థంకాని ఆవేశాలు. ఎంత సహజంగా రచించారా అనిపించింది. ఈ భావతీవ్రత అంతా ఈ చిత్రానికి కన్నడ మాతృక అయిన ‘నాగరహావు’ రాసిన ‘తరాసు’ కు చెల్లుతాయనుకుంటా. పుట్టణ్ణ కణగల్ దర్శకత్వం వహించిన ఒరిజినల్ కూడా చూశాను. అందులో విష్ణువర్థన్ నటనే నాకు శోభన్ బాబుకన్నా బాగా నచ్చింది. బహుశా అదే విష్ణువర్థన్ మొదటి సినిమా కావడం, శోభన్ బాబు ఈ సినిమా చేసేసరికే ఒక ఇమేజ్ ఉండటం ఒక కారణం కావొచ్చు. కొడెనాగు సినిమాలో ఆచార్య ఆత్రేయ నటించడం ఒక హైలైట్.
 
ఈ ‘గ్యాంబ్లర్’ తో పెట్టుకుంటే పాపరే!
అజిత్ అభిమానుల వీరాభిమానం మీద, అతగాడి స్క్రీన్ ప్రెజెన్స్ మీద తప్ప స్క్రిప్టు మీద ఏమాత్రం శ్రద్ధలేకుండా తీసిన చిత్రం ఇది. ఒక థిల్లర్ కథకు అనవసరపు కామెడీ మిక్స్ చేసి అసందర్భమైన, అర్థరహితమైన స్క్రీన్ ప్లేతో సినిమా అంతా నడుస్తుంది. ఉపసంహారం (ఎపిలాగ్)లో మలుపు తిప్పి, కథ మొత్తాన్నీ మార్చేసే పద్దతి హాలీవుడ్ లో కొన్ని సినిమాలలో వర్కవుటైనా అప్పటికే సహనం చచ్చిన ప్రేక్షకుడికి ఈ చిత్రంలోని ఎండ్ ట్విస్ట్ ఏమాత్రం కిక్ ఇవ్వదు. అజిత్ నటన చాలా కొత్తగా, బాగుంది. అర్జున్ మామూలే. అంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు.
****
 

Thursday, August 25, 2011

వచ్చాడు. కెలికాడు.

నిన్న సినీమ్యాక్స్ లో సినిమా చూడ్డానికి వెళుతుండగా ఒక మీడియా మిత్రుడు ఎదురుపడ్డాడు. ఒక ప్రముఖ దినపత్రికలో సినిమా జర్నలిస్టు. “ఏంటిబాసూ ఇక్కడ” అంటే “వర్మ సినిమాకిలే” అని జవాబిచ్చాను. పెద్ద టాక్ లేదుకదా మళ్ళీ ఎందుకు వెళ్ళడం అంటూ నా వైపు ఒకసారి చూసి నవ్వేసాడు. నేనూ ఇబ్బందిగా ఎంతైనా వర్మ సినిమాకదా అని కవరింగ్ ఇచ్చాను.

అప్పుడే చుట్టుపక్కల గమనించాను. ఏదో సినిమా స్టాండీలు, వాటిపైన తమిళనటుడు జీవా ఫోటోలు “ఏంటీ రంగం సినిమా విజయోత్సవాలా?!” అనిఅడిగితే దానికి మిత్రుడు నవ్వేసి, “కాదు. రాబోయే సినిమా ప్రమోషన్లు” ఓహో...అంటూ పరికించి చూస్తే ఆ సినిమా టైటిల్ “వచ్చాడు. గెలిచాడు”...
సర్కాస్టిగ్గా నా మిత్రుడివైపు తిరిగి “‘రంగం’తో వచ్చాడు హిట్ కొట్టి గెలిచాడా!”  అన్నాను.

తను నావైపు తమాషాగా చూస్తూ “ఇండస్ట్రీ అంతేకదా బ్రదర్. హిట్ ఉన్నవాడిదే రాజ్యం. వాడు ఏంచేసినా చెల్లుతుంది. ఏం చెప్పినా ఊకొడుతుంది” అని పత్రిక ప్రాస భాషలో అనేశాడు.

 “రంగం సినిమా హిట్ అవడానికి కారణం కథ కదా, మరి అలాంటి కథల్ని వెతుక్కోకుండా ఆ హీరోని పట్టుకుని వేలాడితే మరో హిట్ వస్తుందని ఎందుకనుకుంటారు మనోళ్ళు” అని నేను సాలోచనగా నాలోనేను అనుకుంటే, నా మిత్రుడు సానుభూతిగా నా భుజంతట్టి, “ఇలా అలోచించి బుర్ర పాడుచేసుకోకు. నాకైతే ఈ సినిమా హిట్ అవడానికి జీవాకన్నా ఇంకో నటుడు అజ్మల్ పాత్ర కారణం అనిపిస్తుంది” అని చల్లగా చెప్పాడు.

నిజమే జీవాకు రంగం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నమాట నిజమేకానీ, కథాపరంగా అజ్మల్ చేసిన యువరాజకీయనేత పాత్ర నటనపరంగానూ, సబ్జెక్టుపరంగానూ చాలా ప్రముఖమైన పాత్ర. చివరికొచ్చేసరికీ మొత్తంగా కథను నడిపిన పాత్రగా నిలబడుతుంది.

కాకపోతే సమస్యల్ని తీర్చేవాడే హీరోకాబట్టి చివరాఖరికి జీవానే ఆ సినిమా హీరో. నా ఆలోచన సంగతి ఎలా ఉన్నా అసలే కాన్స్పిరసీ థియరీలు రాసే పత్రికలో గాసిప్స్ రాసే పాత్రికేయుడిగా నా మిత్రుడి ఆలోచన ఎలా ఉందో తెలుసుకుందామనే క్యూరియాసిటీ కలిగి “అలా ఎందుకనుకుంటున్నావ్?” అని ఒక శరంసంధించాను. కానీ నేను రియలైజ్ కానిది ఎంట్రా అంటే, ఈ మిత్రుడు నా మైండ్ బ్లాంకయ్యే కాన్స్పిరసీ చెబుతాడని.

నా మిత్రుడు చెప్పెనదాని ప్రకారం రంగం సినిమా తెలుగులో హిట్ అవ్వడానికి ముఖ్యకారణం అజ్మల్ పాత్ర్ర. “ఒకసారి జాగ్రత్తగా గమనించు, ఆ పాత్ర తీరు, డ్రస్సింగ్, డయలాగ్స్ అన్నీ మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ ని తలిపించడంలేదూ!” అన్నాడు.

ఒక్క క్షణం నాకు పోలిక అర్థం కాలేదు. కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి సినిమా రీలు మైండ్ లో తిరగేస్తే ఒక క్రూషియల్ సీన్ లో “నేనూ స్వార్థపరుడినే, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. కాకపోతే నా కుటుంబం పెద్దది. విశాలమైనది. మీరు, ఈ సమాజం, దేశం అన్నీ దానిలో భాగమే” అంటూ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ గా ఏదో సభలో (లోక్ సత్తా పార్టీ ఆవిర్భావసభ అనుకుంటా) అన్నాడు. “హమ్మో! నిజమేనేమో” అనుకున్నా.

“అయితే మాత్రం” అంటూ ఏదో బింకం నటించడానికి ప్రయత్నించాను. నా మిత్రుడు సాలోచనగా నన్ను పక్కకు తీసుకెళ్ళి “బాసూ, రంగం సినిమా A సెంటర్లకన్నా B-C సెంటర్లలో బాగా ఆడింది. సినిమా బాగుండటంతో పాటూ ఆంధప్రదేశ్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. జయప్రకాష్ నారాయణ్ లాంటి న్యూట్రల్ సిన్సియర్ ఫేస్ ను అడ్డుపెట్టుకును ఈనాడు పేపర్ అటు కాంగ్రెస్ ను తెలుగుదేశం ను ఎలా ఆడుకుందో వాడుకుందో అనేదే అసలు కథ. ప్రజలకు అర్థమయిన కథ. జె.పి.ఎలాగూ అగ్రకులాల రాజకీయాలకు మరో ఫేసు తనబండారమూ ఇలా ఎదో ఒక రోజు బయటపడుతుందని అందరికీ తెలుసు. ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే అలా కనెక్ట్ అయిపోయారు” అని తన కాన్స్పిరసీ థియరీతో నాకు జ్ఞానోదయం కలిగించాడు.

“ఛా! నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్. సినిమా బాగుంది హిట్ అయ్యింది” అని నేను కొంచెం బెదురుగా అంటే, “బ్రదరూ జె,పి. కుల కోఠరీ గురించి, ఈనాడు అతన్ని ఎలా లీడర్ ను చేసింది అనేదాని గురించీ నీకూ తెలుసుకదా?” అని అడిగాడు.

“అదిసరే! కానీ మరీ సినిమా కథకూ దానికీ లింకు కట్టడం నాకైతే పెద్దగా లాజికల్ గా అనిపించడం లేదు” అని తేల్చేశాను. నా మిత్రుడు కొంచెం కోపంగా “ఇదేనయ్యా మీలాంటి సీరియస్ ఫిల్మ్ క్రిటిక్స్ తో వచ్చే తంటా, ‘తెలుగుతనం లేదు కాబట్టే శక్తి, తీన్ మార్, బద్రీనాథ్ ఫెయిలయ్యాయి’ అంటారు. ఇదిగో ఈ తెలుగు రాజకీయాల్ని చూపించింది కాబట్టే రంగం సినిమా హిట్ అయ్యింది అంటే మాత్రం ఒప్పుకోవడానికి కష్టం అంటారు. ఎలాగయ్యా మీతో చేసేది” అనేశాడు.

“మరీ బోడి గుండుకీ మోకాలికీ ముడిపెట్టడం...” అంటూనేను నసుగుతుండగానే ఎవరో ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అవుతోందనే సరికీ ఫ్రీబీస్, స్వీట్ ప్యాకెట్స్, గిఫ్ట్ కవర్ల కోసం మావోడులగెత్తాడు కవరేజ్ అనుకుంటూ. నేను మాత్రం చేతిలో రాంగోపాల్ వర్మ ‘నాట్ ఎలవ్ స్టోరీ’ సినిమా టికెట్లు పట్టుకుని పిచ్చిచూపులు చూస్తూ “వచ్చాడు గెలిచాడు” పోస్టర్ చూస్తుంటే పోస్టర్ మసకబారి “వచ్చాడు. కెలికాడు” లా కనిపించింది.  

****

Tuesday, March 1, 2011

శ్యామ్ బెనెగల్ తో నేను





Tuesday, February 22, 2011

యువతజీవిత అనుభవశకలాల సినిమాటిక్ అనుభవం - LBW

జీవితాలు ఎక్కడ విడిపోయి ఎక్కడ కలుసుకుంటాయో. బంధాలు ఏవిధంగా అనుబంధాల్ని కలుపుకుంటాయో. స్నేహాలూ, ఆకర్షణలూ ప్రేమలూ జీవితాల్ని నిర్దేశించేవే కాకుండా అప్పుడప్పుడూ అనుభవాలుగా, అనుభూతులుగా ఎలా మిగిలిపోతాయో… కొందరు యువతజీవిత అనుభవశకలాల్ని ఏర్చికూర్చిన సినిమాటిక్ అనుభవం LBW – లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ : పెళ్ళికి ముందు జీవితం.

కథ: ఈ సినిమాకథలో రెండు కథలున్నాయి. నిజానికి మూడున్నాయి. మూడోకథ గురించి అప్రస్తుతంగానీ, ముందుగా రెండుకథల గురించి చూద్దాం.
కథ1: హైదరాబాద్ లో జై (అభిజిత్) – రిషి (సిద్దు)చిన్ననాటి స్నేహితులు. రిషి అను(నిషాంతి) ని ప్రేమిస్తాడు. పరిస్థితుల ప్రభావంతో జై- అను ప్రేమికులుగా మారతారు.
కథ2: డల్లాస్ లో ఉద్యోగం చేసుకునే రాజేష్ (రోహన్) – రాధిక (చిన్మయి) స్నేహితులు. రాధిక రాజేష్ ని ప్రేమిస్తుంది. రాజేష్ రాధికని ఒక స్నేహితురాలిగా మాత్రమే చూస్తాడు. రాజేష్ స్నేహితుడు వరుణ్(అసిఫ్), రాజేష్  వద్దనుకున్న రాధికలు ప్రేమలో పడతారు.

ఈ రెండు కథలూ ఒక సినిమాలో ఎందుకున్నాయి అనేది  సినిమాలో చూడాల్సిందే.
ఇక మూడోకథేమిటా అని ఆలోచిస్తున్నారా…! ఈ రెండుకథల్నీ లంకె కలపడానికి ఒక ఉపకథ ఉందిలెండి. అది నాకైతే అనవసరం అనిపించింది. కానీ బహుశా దర్శకరచయిత తనకు తెలిసిన (మరి)కొంత జ్ఞానాన్ని పంచుకోవడానికి tempt ఆయ్యి, దాన్ని నెరేటివ్ గా ఎంచుకున్నాడేమో . ఎంతైనా మొదటి సినిమాకదా. అది లేకపోయినా సినిమాకొచ్చే నష్టమైతే ఏమీలేదు.

...మిగతా సమీక్ష నవతరంగంలో...

****

Thursday, December 2, 2010

తెలుగు సినిమా తమిళ పైత్యం

ప్రతిభ ఎక్కడున్నా దాన్ని అభినందిచాల్సిందే, స్వాగతించాల్సిందే, ప్రోత్సహించాల్సిందే. కాకపోతే పక్కోడి ప్రతిభ గుర్తించడంలోని శ్రద్ధ మనదగ్గరున్న ప్రతిభని సానబెట్టడంలో చూపించకపతే పొగడ్డానిక తప్ప మనమంటూ ఎదగడానికి ఏమీ మిగలదు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితీ అలాగానే ఉంది. చెప్పుకోవడానికి  సినీపరిశ్రమ మద్రాసునుంచీ హైదరాబాద్ కొచ్చి పాతికేళ్ళు అవుతున్నా, హీరోలను వదిలేస్తే (హీరోయిన్లు ఎలాగూ బొంబాయి నుంచి దిగుమతి అవుతారు) మిగతా విభాగాల్లోని సాంకేతిక నిపుణుల్ని అక్కడ్నించే దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా దర్శకత్వం, సంగీతం, సహనటుల విభాగాల్లో తమిళ్ హవానే నడుస్తోంది.

దర్శకత్వ శాఖలో కోకొల్లలుగా తెలుగు జనాలున్నారు. ప్రతి సినిమాకూ ఆరు మందికి తగ్గకుండా సహాయదర్శకులుగా పనిచేస్తుంటారు. అయినా అవకాశాలు, ముఖ్యంగా పెద్ద అవకాశాల దగ్గరికొచ్చేసరికీ తమిళంవాళ్ళే కావలసొస్తుంది. తమిళులకు దర్శకత్వ అవకాశం ఇవ్వడం వరకూ బాగానే ఉంది, కానీ వాళ్ళ కంఫర్ట్ కోసం ముఖ్యపాత్రల్నో లేదా సహాయపాత్రల్నో తమిళ నటులతో, సాంకేతిక వర్గాన్నంతా తమిళ సాంకేతిక నిపుణులతో నింపడం ఎందుకో ఒక అర్థంకాని పరిణామంగానే మిగిలిపోతోంది. ‘డార్లింగ్‌’లో ప్రభాస్‌ ఫాదర్‌గా ప్రభు చేసిన క్యారెక్టర్‌ మన తెలుగులో ఎవరూ చేయలేరా? అలాగే, ఈనెల 26న విడుదల కానున్న ‘ఆరెంజ్‌’లోనూ ప్రభు ఓ ముఖ్యపాత్ర పోషించాడు. కారణం ఆ నటుడి అవసరమా లేక దర్శకుడి విజన్ లో ప్రభు తప్ప మరే ఇతర తెలుగు నటుడూ కనిపించకపోవడమా?

ఎమ్.ఎస్.విశ్వనాధన్ నుంచీ ఇళయరాజా వరకూ అటు తమిళం ఇటు తెలుగులో మహత్తరమైన సంగీతం ఇచ్చినా, భాషకు అనుగుణంగానే బాణీలు కూర్చారు. ఆ తరువాత తరంలో తమిళ బాణీల్ని డబ్బింగ్ రూపంలో తప్ప స్ట్రైట్ ఫిల్మ్ గా సంగీతం కూర్చి, తెలుగు సంగీతాన్ని ఇవ్వడంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కూడా ఎదురుదెబ్బే తిన్నారు. అయినా మనోళ్ళు ఈ మధ్య హ్యారిస్ జైరాజ్(ఆరంజ్), జి.వి.ప్రకాష్ (డార్లింగ్) అంటూ మళ్ళీమళ్ళీ బొక్కబోర్లా పడటానికి తయారైపోతున్నారు. ఇది మోజుకాక మరేమిటి? నిజంగా హైదరబాద్ లో మ్యూజిక్ డైరెక్టర్లు లేరా? చక్రిలాంటి వాళ్ళు వచ్చిన పదేళ్ళలో దాదాపు వంద సినిమాలకు సంగీతం అందించలేదూ!  మన దగ్గర ప్రతిభకు కొదవలేదు, కానీ గుర్తించేవాళ్ళే కరువు.

మనోళ్ళ తమిళ పైత్యానికి పరాకాష్ట ఏమిటంటే,  తమిళ్ సినిమాలపైన ఈ మధ్య సెటైర్ గా వచ్చిన, “తమిళ్ పడం” అనే సినిమాని మనోళ్ళు రీమేక్ రైట్స్ తీసుకోవడం. తమిళ సినిమాల మీద తీసిన వ్యంగ్యాస్త్రాన్ని తెలుగులో హక్కులు తీసుకోవడం ఒక హాస్యాస్పదమైన ప్రక్రియ అయితే,  దాన్ని రీమేక్ ఎలా, ఎందుకు చేస్తారనేది పెద్ద జోకు. ఏం… తెలుగు సినిమాల మీద సెటైర్ మనం సొంతంగా రాసుకోలేమా? దాన్నీ తమిళం నుంచీ దించుకోవాలా?   హతవిధీ!

***

Saturday, November 20, 2010

డిజిటల్ సినిమా - తెలుగు సినిమా

కోట్లు పెట్టి సినిమా తీసేవాడికి డిజిటల్ ఎందుకు? డిజిటల్ లో తీసి ఎక్కడా రిలీజ్ చేసుకోలేనోడికి సినిమా ఎందుకు? ఇది ప్రస్తుత తెలుగు పరిశ్రమ పరిస్థితి. అది మరో పది సంవత్సరాల్లో అస్సలు మారదు. మాహాఅయితే ఫిల్మ్ లో తీసిన సినిమాల్ని అన్ని థియేటర్లలో డిజిటల్లో ప్రదర్శిస్తారు. అంతే!

స్టార్ (నటుడు/నిర్మాత/దర్శకుడు) సినిమా లేనిదే తెలుగు ప్రేక్షకుడు థియేటర్ కి రాడు. పెద్ద సినిమాల్నే సగం మంది పైరేటెడ్ డివిడి దొరుకుతుందిలే అని రావటం లేదు, ఇక చిన్న సినిమా రేపోమాపో టివిలో వచ్చేస్తుందో లేక “దాన్ని కూడా చూడాలంటావా!” అనే ఆటిట్యూడ్ తో చూడ్డం మానేశారు. ఇక డిజిటల్ సినిమా ఎందుకు చూశారు?

అయినా డిజిటల్ అనేది టెక్నాలజీ దానితో కంటెంట్ మారదు. విధానం మారదు. పరిస్థితి అస్సలు మారదు. ఐతే ఒకటి మాత్రం జరుగుతుంది, సినిమా తియ్యాలనుకునే ప్రతొక్కడూ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక సినిమా తీసేస్తాడు. ఆ తరువాత వాళ్ళలో 99% మంది వాళ్ళకు సినిమా తియ్యడం రాదని తెలుసుకుంటారు ;)

Wednesday, October 20, 2010

కులగౌరవ హత్యల పరిశోధన ‘ఆక్రోష్’

“ఇంకా కులమేంటండీ?” అనేవాళ్ళు ఎవరూ వారివారి కులాల్ని దాటి పెళ్ళిచేసుకోరు.
ఎంత అభ్యుదయవాదైనా తల్లిదండ్రుల ఇష్టమనో, పెద్దల మాట వినాలనో కుటుంబ గౌరవాన్ని కాపాడేస్తూ కులాన్ని భద్రంగా కొనసాగించేస్తారు. ఇది కేవలం వ్యక్తిగత విషయం.
కానీ… కుటుంబగౌరవం కులగౌరవంగా మారితే… అది కాపాడుకోవడానికి మానవహననం జరిగితే…
అదప్పుడు భయంకరమైన సామాజిక సమస్య. సాంప్రదాయ ఆధిపత్యానికీ ప్రజాస్వామిక చట్టానికీ మధ్య సమస్య.
ఈ సమస్యని అత్యంత సునిశితంగా, అంతే వ్యాపారాత్మకంగా సృజించిన చిత్రం ‘ఆక్రోష్’.

పూర్తి సమీక్ష కోసం....నవతరంగం చూడండి. 

****

Thursday, September 2, 2010

సినీపరిశ్రమలో కథలెలా తయారవుతాయి?

ప్రస్తుతానికి పరిశ్రమలో పూర్తి స్క్రిప్టు రాసుకునేవాళ్ళు వేళ్ళమీద లెక్కించొచ్చు. ఒకవేళ పూర్తిస్థాయి స్క్రిప్టు మనం రాసుకున్నా, చదివే ఓపిక, తీరిక చాలా మంది నిర్మాతలకు/దర్శకులకూ ఉండదు. చదివినా దాన్ని visualize చేసుకునే తీరులో మనోళ్ళింకా ఆరితేరలేదు. దానికి కారణం ఒక standardized script format మనకు లేకపోవడం. హాలీవుడ్ ఫార్మేట్ ను తెలుగు సినిమా అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో adopt చేసుకోకపోవడం. కొంతమంది హాలీవుడ్ ఫార్మేట్లో రాస్తున్నా, అది ఇంకా పరిశ్రమకు అలవాటు కాకపోవడం. ఇలా కర్ణుడి చావుకి వందకారణాలున్నాయి చెప్పుకుంటూ పోతే.
పూర్తిస్థాయి స్క్రిప్ట్ మన కోసం రాసుకోవడం వరకూ బాగానే ఉంటాయిగానీ, mainstream industry అవసరం కోసం రాయడానికి కొంత process ఉంటుంది. మొదటగా ఒక సింగిల్/డబల్ పేజ్ “ఐడియా” వినిపించడం. ఇందులో థీం,స్థూల కథ, కథన విధానం/వైవిధ్యం గురించి పరిచయం, ఒకవేళ వీలైతే దాని వ్యాపారాత్మక ప్రాముఖ్యం ఉంటాయి. అది నిర్మాతా/దర్శకుడికి నచ్చితే పరిశ్రమ భాషలో “ట్రీట్మెంట్” రాయమంటారు.హాలీవుడ్ పరిభాషలో చెప్పాలంటే ఇది step-outline అన్నమాట.ఇది 20-40 పేజీలు ఉంటుంది.
ఈ స్టెప్ అవుట్ లైన్లోనే ‘సీన్ ఆర్డర్’మిళితమై ఉంటుంది. ఇది నచ్చితే రచయితకు అడ్వన్స్ ఇచ్చి సినిమా మొత్తం రాయమంటారు. ఒకవేళ నిర్మాత/దర్శకుల ఆస్థాన రచయితలుంటే ఆ ట్రీట్మెంట్ వాళ్ళ చేతుల్లో పెట్టి రాయమంటారు. ప్రస్తుతానికి “స్క్రీన్ ప్లే” తెలుగు పరిశ్రమలో ఏ రచయితా రాయరు. వాళ్ళు రాసేదల్లా కథావిస్తరణ మాత్రమే. అందులో description ఎడమవైపు, కుడివైపున డైలాగులూ రాసి పనికానిచ్చేస్తారు.
ఇంకా ప్రమాదం ఎక్కడొస్తుందంటే ఐడియా ఒకడి దగ్గర తీసుకుని, ట్రీట్మెంట్ ఇంకోడి చేత రాయించి, మళ్ళీ ఆట్రీట్మెంటుని నలుగురికిచ్చి నాలుగు వర్షన్లు రాయమంటారు. ఆ తరువాత వాళ్ళ ఆస్థాన విద్వాంసుల్ని పిలిచి అ నాలు వర్షన్స్ లో వచ్చిన మంచి సీన్లను ఏరి ఒక చోట పోగేసి సినిమాగా రాయమంటారు. మరో ఇద్దరి చేత ఆ అతుకుల బొంతను అల్లించి వాళ్ళకు స్క్రీన్ ప్లే క్రెడిట్ ఇస్తారు. ఇక మాటల రచయితలు ఉండనే ఉన్నారు. వీళ్ళేం రాస్తారో వాళ్ళకే తెలియాలి :)
ఇలా తెలుగు సినిమాలో “కథ” అనే మాట ఎక్కడా వినపడకుండా సినిమాలు తయారైపోతాయి. అందుకే ఈ బాధంతా. కథ ఉంటే పాత్రలుంటాయి. పాత్రలుంటే వాటికి వ్యక్తిత్వాలుంటాయి, వ్యక్తిత్వాలుంటే వాటికి గమ్యాలుంటాయి, గమ్యాలంటే ఘర్షణ ఉంటుంది. అప్పుడే కథ రక్తి కడుతుంది. ఇవేమీ లేకుండా తెలుగు సినిమా కథ నడిచి పోతొంది. సినిమా నుంచీ సినిమా పుడుతోందేతప్ప కథ నుంచీ సినిమా తయారు కావడం లేదు.

****

Tuesday, July 20, 2010

నిజంలోంచీ కలలోకి, కలలోంచీ కలల్లోకి : INCEPTION

“ Dreams feel real while we’re in them. It’s only when we wake up that we realize something was actually strange”
- Cobb in INCEPTION
నీ కలల్లోకి నేను జొరబడగలిగితే…!
నీకే తెలియని నీ ఆలోచనల్ని నేను దొంగిలించగలను.
నేనే నీ మనసులో ఒక కొత్త ఆలోచనను నింపాలంటే?!
నీ కలల్లోంచీ నిన్ను మరో కల కనేలా ఉసిగొల్పాలి.
అది సాధ్యమా?
‘సాధ్యమే…నిజంలోంచీ కలవరకూ, కలనుంచీ ఒక సామూహిక స్వప్నం వరకూ….
సామూహిక స్వప్నం నుంచీ మరో కలలోకి అలాఅలా జారడం సాధ్యమే. మనసులోని ఆలోచనల్ని దొంగిలించడమే కాదు కొత్త ఆలోచనల్ని సృష్టించడమూ సాధ్యమే’ అంటాడు దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ‘ఇన్సెప్షన్’ చిత్రంలో.
కానీ సమస్యల్లా, నిజంలా అనిపించే కలలో “జీవించిన”తరువాత నిజానికీ కలకూ బేధం మిగిలుంటుందా అనేదే. దానికి సమాధానం అంత సులభంగా దొరకదు.

మరి సమాధానం లేని సమస్యని అవసరంకోసం ఆహ్వానిస్తే…పరిణామాలు ఎలా ఉంటాయి? అనేదే ఈ సినిమా.
మ్యాట్రిక్స్ సినిమా తరువాత cinematic imagination ని మరోస్థాయికి తీసుకెళ్ళిన చిత్రమిది. ఈ సినిమాను ఒకసారి చూసి సమీక్షించడం, రెండుసార్లు చూసి విశ్లేషించడం లాంటి సాహసాలు చెయ్యడానికి నేను పూనుకోకూడదని తెలిసొచ్చి, కేవలం “చూడండి” అని చెప్పడానికి ఇది రాస్తున్నాను.

చూడబోయే ముందు ఒక్క మాట, ఈ సినిమా ఒకసారి చూస్తే అద్భుతమైన కలలా ఉంటుంది. థియేటర్ బయటొచ్చిన తరువాత అనుభవం లీలగా తెలిసొస్తుందిగానీ, వివరాలు గుర్తుకు రావు. ఎంత అర్థమయ్యిందో అస్సలు అంచనాకు రాదు. అందుకే, ఈ సినిమాని నిజంలా ఫీలవ్వాలంటే కనీసం మరో మూడుసార్లు చూడాలి. అందుకు మీరు రెడీగా ఉంటే GO AHEAD…SEE IT…DREAM IT.





****

Sunday, July 18, 2010

గాయపడిన పక్షి ప్రయాణం – ఉడాన్ (సమీక్ష)

గత పదిహేనేళ్ళుగా  ప్రి-టీన్స్, టీన్స్ ని విస్తృతమైన మార్కెట్ సెగ్మెంటుగా హాలీవుడ్ గుర్తించి వారికోసం సినిమాలు తియ్యడం మనకు తెలిసిందే. చాలా వరకూ వాటిల్లో చాలా వరకూ టీన్ సెక్స్ కామెడీలు ఉన్నా, టీనేజి సమస్యలు వారి మానసిక స్థితులు మొదలైన ప్రశ్నల గురించి చర్చించిన చిత్రాలు కూడా చాలా ఉన్నాయనేది కాదనలేం.  అత్యధిక కలెక్షన్లు చేసిన సినిమాలలో నిలబడున్న ‘హ్యారీపోట్టర్’ ఈ కోవలోకే రావడం గమనార్హం. కానీ, భారతీయ సినిమాల్లో ఈ సెగ్మెంట్ ప్రేక్షకులకు ఇప్పటివరకూ సరైన ప్రాముఖ్యత దక్కలేదు. అడపాదడపా ‘చిత్రం’, ‘కొత్తబంగారు లోకం’ వంటి చిత్రాలు వచ్చినా అవి ప్రేమ ప్రధానమైన చిత్రాలుగా మాత్రమే మిగిలిపోయాయిగానీ టీనేజి ఆశల్ని, ఆలోచనల్ని, సమస్యల్నీ, ఆశయాల్నీ, ఐడెంటిటీని చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాయి.

నాగేష్ కుక్కునూర్ తీసిన ‘రాక్ ఫోర్డ్’  ఆ దిశగా ఒక మంచి ప్రయత్నమనుకుంటే, విక్రమాదిత్య మోత్వానీ చిత్రం ‘ఉడాన్’ ఒక అర్థవంతమైన హృద్యమైన గుర్తుండిపోయే  కొనసాగింపు అనుకోవాలి.

పూర్తి సమీక్ష కోసం నవతరంగం చూడండి. 

****

Thursday, July 15, 2010

ఐ లవ్ ‘పైరసీ’

AVS గారి బ్లాగు పుణ్యమా అని పైరసీ చర్చలు మళ్ళీ మొలయ్యాయి.

ఈ పైరసీ గురించి చర్చ వచ్చినప్పుడల్లా నేను ఏవైపుండాలో నాకు అర్థం కాదు.
ఎందుకంటే, నాకు హాలీవుడ్ మరియూ ప్రపంచ సినిమాలు చూడాలంటే పైరసీనే గతి. భారతదేశంలో కూడా ధియేటర్లో ఆడని “గొప్ప సినిమాలు” చూడాలంటే పైరసీనే ఇప్పటికీ గతి. ఒరిజినల్ కొనాలంటే జేబు పర్మిట్ అస్సలు చెయ్యదు. సాధారణంగా తెలుగు సినిమాల్ను థియేటర్లో చూసే నేను చాలా సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ బయట ఉండటం వలన మళ్ళీ పైరసీ వలనే చూసే అవకాశం లభించింది. ఇప్పుడు కొన్ని సెలెక్టివ్ సినిమాలు థియేటర్లో చూడటమే తప్ప, తెలుగు సినిమాలు చూసే ఖర్మను తప్పించుకు తిరుగుతుంటాను.  నాకు బెంగాలీ, తమిళ్, మళయాళం, మరాఠీ, కన్నడ వంటి ఇతర ప్రాంతీయభాషాచిత్రాలు చూసే అలవాటు, అవి ఎలాగూ మనకు థియేటర్లో దొరకవు కాబట్టి పైరసీ తప్పలేదు.

పైరసీ చట్టవ్యతిరేకమే. శిక్షార్హమే. కానీ వేరే దారీ!? నాకైతే ఏమీ కనిపించలేదు. అందుకే కొంత గిల్టీగా ఫీలైనా ఐ లవ్ పైరసీ...

"కొంత గిల్టీ" అని ఎందుకంటున్నానంటే, భారతదేశంలోని పైరసీ చట్టం Copyright Act,1994 కి అనుబంధంగా వచ్చింది. ఇందులో క్లియర్గా;
Infringement of cinematograph films – section 51 read with section 14(d) of the Act
Copyright protection in films extends to
- making a copy of the film;
-taking a photograph of any image forming a apart of the film;
-selling, giving in hire or offering for sale or hire any copy of the film, irrespective of its
earlier sale or hire; and
-communicating the film to the public.

అని ఉందే తప్ప పైరేటడ్ కాపీలు కొనడం (buying) లేదా, కలిగి ఉండటాన్ని (processing) నేరంగా పరిగణించలేదు. పైగా ఇదే చట్టంలో "free use" అనే మరో తిరకాసు ఉంది. Certain uses of copyrighted works are not considered to infringe upon the rights of the copyright owner and so one does not require permission from the copyright owner. These uses are known as 'Fair Use'. Such uses are exceptions to copyright that allow limited use of
copyright works without the permission of the copyright owner. For example, limited use of works may be possible for research and private study, criticism or review, reporting current events, judicial proceedings, teaching in schools and other educational establishments etc. However ‘Fair Use’ is not a defence incase of infringement of film copyright. అంటూ కొంత వెసులుబాటు కలిపిస్తుంది. నేను చేసేది చాలావరకూ fair use అని నా నమ్మకం :)


ఇక తెలుగు సినిమాల విషయంలో నాకెందుకో  ఆ గిల్టీఫీలింగ్ కొంత తక్కువ. ప్రేరణ పేరుతో గ్లోరిఫైడ్ కాపీలు కొడితేగానీ తయారుకాని కథలు,సీన్లు, సంభాషణలు, ఫైట్ల మధ్య పైన చెప్పిన కాపీరైట్ చట్టాల్ని దర్జాగా ఉల్లంఘిస్తున్న సినీపరిశ్రమ పైరసీ గురించి మాట్లాడితే కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఒకసారి సినీ పరిశ్రమ పెద్దల ఇళ్ళలో తొంగిచూస్తే. ప్రతి ఇంట్లోంచీ కనీసం వెయ్యి హాలీవుడ్ పైరస్ DVD లు బయటికి తియ్యచ్చు. ఇలా "ఎదుటి మనిషికీ చెప్పేటందుకె నీతులు ఉన్నాయి" అనుకునే ముందు పరిశ్రమ తమ గురివింద ఛందాన్ని కొంత తెలుసుకుని సంస్కరించుకున్న తరువాత ప్రేక్షకుల్ని అంటే బాగుంటుంది. అనిపిస్తుంది.

పైరసీ అనేది ఒక parallel industry. పరిశ్రమ తమ జాగ్రతల్లో ఉండనంతవరకూ ఇది కొనసాగుతుంది. ఇక్కడ ప్రేక్షకులమీద పడి ఏడిస్తే లాభం ఉండకపోవచ్చు. ఒక వార్త ప్రకారం  దావూద్ ఇబ్రహీం వ్యాపారాల్లో ఈ మధ్యకాలంలో పెద్దస్థాయిలో డబ్బులు సంపాదించిపెడుతున్న వ్యాపారం “పైరసీ”. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల పైరసీ చేసే తను సంవత్సరానికి దాదాపు 400 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడట. మొత్తానికి ఇది బిలియన్ డాలర్ల వ్యాపారమనైతే తేలింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఈ డబ్బుతను టెర్రరిస్టు కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడని ఒక సంస్థ రిపోర్టు. ఇక్కడ గిల్టీ విషయం ఏమిటంటే, పైరసీ సీడీ కొన్న ప్రతి ప్రేక్షకుడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించినట్టన్నమాట….ఇప్పుడేం చెయ్యాల్రో దేవుడా! ఐ లవ్ పైరసీ !!

****

Wednesday, June 23, 2010

‘రావణా’యణం – సమీక్ష

సామాజిక-రాజకీయ అంశాల్ని వ్యక్తిగత నేపధ్యాల్లో మలిచి ఎపిక్ (epic) స్థాయి సినిమాల్ని తీసే దర్శకుడు మణిరత్నం. ‘రోజా’ మొదలు ‘దిల్ సే’ వరకూ అలా జరిగిన ప్రయాణంలో మనందరం మణిరత్నం సినీతిహాసాల్లో భాగమయ్యాము. వ్యక్తిగత సమస్యల్ని ఒక సామాజిక కోణంలోంచీ చూపడమూ మణిరత్నంకున్న మరో పార్శ్వం. ‘మౌనరాగం’ నుంచీ ‘సఖి(అలైపాయుదే)’ వరకూ అదీ మనం చూసి మురిసిపోయాము. అలాంటిది ఏకంగా రామయణం లాంటి ఒక ఎపిక్ ని తీసుకుని ముగ్గురు మనుషుల మధ్యనున్న సంబంధాలు, అనుబంధాలూ, ఘర్షణ నేపధ్యంలో ఒక కొత్త కోణాన్ని ‘రావణ్’ ద్వారా ఆవిష్కరిస్తాడని అందరూ ఆశించడం సహజం.
ఈ ఆసక్తిని, అనురక్తిని రావణ్ ద్వారా మణిరత్నం నిలుపుకున్నాడా, లేదా అనేది పెద్ద ప్రశ్న.

‘వీరా’ అనే దళిత నాయకుడు ప్రతీకారం కోసం ‘దేవ్’ అనే పోలీస్ ఆఫీసర్ భార్య ‘రాగిణి శర్మ’ని కిడ్నాప్ చెయ్యడంతో సినిమా ప్రారంభమౌతుంది. ఆ తరువాత వీరా రాగిణితో ఏలా ప్రవర్తించాడు? దేవ్ రాగిణిని రక్షించుకోగలిగాడా? చివరికి వాళ్ళ ముగ్గురి కథ ఏమయ్యింది అనేది రావణ్ చిత్ర కథాంశం.

రామాయణాన్ని వ్యక్తుల కథగా చూస్తే అందులోనూ చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ముఖ్యంగా భార్యనెత్తుకెళ్ళిపోయిన రాక్షసుడ్ని చంపే రాజు కథగా చూస్తే అందులో మహత్తరంగా అనిపించే విషయమూ ఉండదు. అందుకే మంచీ – చెడుల మధ్య పోరాటంగా దాన్ని కీర్తించి, సమాజంలో విలువల స్థాపనకు ఉపయోగించుకుని ఇతిహాసంగా మార్చేశాం. అయితే, మంచీ చెడుల మధ్య గీతలు మసకబారుతున్న ఈ కాలంలో రాముడిలో దైవత్వం ఎంత మిగిలుంటుంది? రావణుడిలో రాక్షసత్వానికి సహేతుకమైన కారణం ఉండదా? వంటి ప్రశ్నలు ఉదయించడం చాలా సాధారణం. అసలే రావణుడిని హీరోగా ఎప్పుడో నిర్ణయించేసిన ద్రవిడ సంస్కృతి, సాహిత్యాల నేపధ్యమున్న మణిరత్నం ఈ ఆధునిక రామాయణాన్ని, రావణాయణంగా ఎలా మలిచాడో చూడాలనే ఆసక్తితో రావణ్ సినిమా చూస్తే నిరాశ తప్పదు.

సాంకేతికపరంగా ఉన్నతంగా ఉన్నా, హృదయం లేని అందమైన గాజుబొమ్మ తరహాగా మాత్రమే రావణ్ మిగిలిపోయింది. చెప్పాలనుకున్న కథలోని లోపం, కథావిస్తరణలోని బహీనతలూ, స్క్రిప్టులోని బలహీనతల్ని భారంగా మోస్తూ, కేవలం నటనతో సినిమాను నిలబెట్టలేని నటీనటుల నటన వెరసి రావణ్ ఒక ఎపిక్ సైజ్ డిసాస్టర్ అని చెప్పొచ్చు.

కాల్పనిక లోకంలో జరుగుతున్నకథా లేక భౌతిక లోకంలోనా అనే విషయంకూడా అర్థంకాకుండా కథావిస్తరణ క్రమం కనిపిస్తుంది. అది వ్యక్తుల కథా లేక వ్యక్తిత్వాలు-సిద్దాంతాల ఘర్షణా అనే విషయంలో క్లారిటీ లేక సినిమా తడబడుతుంది. వీరా౦- దేవ్ – రాగిణిల కథకు ఒక బలమైన సామాజిక-రాజకీయ-సైద్ధాంతిక నేపధ్యం ఇవ్వగలిగుంటే వాళ్ళ అస్తిత్వాలతో పాటూ సినిమాకూ ఒక ఆర్థం ఉండేది. ఆఖరి 20 నిమిషాల్లో కథ కొంచెం పుంజుకున్నట్లు అనిపించినా, ప్రస్తుతం  over indulgent idea గా మాత్రం మిగిలిపోయింది.


బలహీనమైన స్క్రిప్టుని, బలం లేని డైలాగుల్ని అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, విక్రం లు తమ శాయశక్తులా ఒక వీశమెత్తు పైకి లేవదీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కొన్ని సీన్లు చూస్తుంటే వీరా పాత్ర ప్రవర్తనకూ, తన histrionics కూ, ఫిలాసఫీకీ సినిమాలో అసలు స్థానమే లేనప్పుడు అభిషేక్ ఎంత గింజుకుంటే మాత్రం ఏమిటి అనిపిస్తుంది. ఐశ్వర్యా రాయ్ చాలా సినిమాలకన్నా ఈ సినిమాలోని కొన్ని సీన్లలో అందంగా ఉంది. ఆ అందమూ నోరుమూసుకున్నంతరకే. వాచకం లేని తన నటన నోరు తెరిచి డైలాగ్ చెప్పినపుడు పంటికిందరాయే. ఉన్నంతలో విక్రం సహజంగా నటించాడు. ఉపపాత్రల్లో రవికిశన్, గోవిందా బాగాచేస్తే,  ప్రియమణి ఫరవాలేదనిపించింది.

సంతోష్ శివన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, రెహమాన్ సంగీతాలు బాగున్నా, సినిమాకు పెద్దగా ఉపయోగకరం కాలేదు. దర్శకత్వపరంగా చాలా ఛాలెంజింగ్  ఫిల్మ్ అనిపించినా, మణిరత్నం నుంచీ ఏ conceptual integrity, subtext ఆశిస్తామో అది ఏమాత్రం ఈ సినిమాలో కనిపించకపోవడం ఆశ్చర్యంతో పాటూ ఆవేదనను కలిగిస్తుంది.

****

Wednesday, June 9, 2010

తెలుగు ప్రేక్షకుల స్థాయి ఎదగాలి

‘మీ గత రెండు సినిమాలూ ఎందుకు ఆడలేదూ?’ అని జగడం, ఆర్య-2 చిత్రాల దర్శకుడు సుకుమార్ ని అడిగితే,
"బాగా ఆడతాయనే ఆ సినిమాలు తీశా. వాటిని చూసి ఆదరించే స్థాయికి ప్రేక్షకులు ఎదగలేదు. వారి ప్రమాణాలు మారాలి" అన్నారట.
నిజమే...ప్రేక్షకుల స్థాయి ఎదగాలి.
మరి సినిమాల ప్రమాణాలూ, దర్శకుల స్థాయి మాటో !?!

****

Tuesday, June 8, 2010

అగోరా - చరిత్ర మర్చిపోలేని సత్యం

‘వ్యవస్థీకృతం మతం మానవజ్ఞానానికి ఎప్పుడూ ప్రమాదకరం’ అనే నానుడిని నిజమనిపించే ఘట్టాలేన్నో ఉన్నాయి చరిత్ర తిరగేస్తే. ముఖ్యంగా మధ్యయుగంలో పాశ్చాత్య, మధ్యప్రాచ్యంలో ఉదయించిన మతాలచరిత్ర అనునిత్యం రక్తసిక్తంగా, రాజకీయ అధికార పిపాసులుగా ఉండటం మనకు తెలిసిందే. కానీ కొన్ని వేల సంవత్సరాల జ్ఞానభాండారం ఈ మతాల పోరాటాలవల్ల నష్టపోయామనే నిజం ఎంతో బాధాకరం. ఆ చారిత్రాత్మక నిజాన్ని ఉన్నతమైన నటనా సాంకేతిక విలువతో తెరకెక్కించిన చిత్రం ‘అగోరా’ – AGORA.

క్రీస్తుశకం నాలుగో శతాబ్ధంలో రోమన్ పాలనలో ఉన్న అలెగ్జాండ్రియా విద్యకు, కళలకు, జ్ఞానానికీ కేంద్రంగా అవతరించింది. అప్పటివరకూ ప్రముఖ తత్వవేత్తలూ, సిద్దాంతకర్తలూ, శాస్త్రవేత్తలూ చెప్పిన అన్ని విషయాలూ ఒక లైబ్రరీ రూపంలో ఇక్కడే భద్రపరచబడి ఉన్నాయి. ఆ కాలానికి ముందు చెప్పబడిన,రాయబడిన మానవమేధకు అది కేంద్రం. సినిమా కథ ఆ grandeur తో ప్రారంభమై, పేగన్లు- క్రైస్తవులు- యూదుల మతాల చిచ్చులు, రాజీయపుటెత్తుల మధ్య ఆ గ్రంథాలయం- జ్ఞానం యొక్క నాశనంతో పూర్తవుతుంది.

ఈ కథంతా హైపేషియా (Hypatia) అనే మహిళాతత్వవేత్త, బోధకురాలు, అస్ట్రానమర్ చుట్టూఅల్లుకుని ఉంటుంది. ప్రముఖపాత్రలో అస్కార్ అవార్డునందుకున్న నటి రేచల్ వైజ్ నటించిన ఈ చిత్రానికి స్పానిష్ దర్శకుడు అల్జాన్డ్రో అమీనెబా దర్శకత్వం వహించాడు.




The film centers around the astronomer-philosopher Hypatia of Alexandria (Weisz) and several men whom she knows such as her slave, Davus (Minghella), and her pupils, Orestes (Oscar Isaac) and Synesius (Rupert Evans), all of whom become major players in the changing political social landscape.[6] The film begins with Alexandria under Roman pagan rule. Hypatia, daughter of a scholar, teaches at the Platonic school, where many future leaders are educated. She is wooed by her student Orestes, while her slave Davus keeps his love for her secret. Meanwhile, social unrest begins challenging the Roman rule of the city as pagans and Christians come into conflict. The pagans, including Orestes and Hypatia’s father, ambush the Christians to quash their rising influence, but find themselves unexpectedly outnumbered. Hypatia’s father is gravely injured and Hypatia and the pagans take refuge in the Library of Alexandria. The Christian siege of the library ends when an envoy of the Roman Emperor declares that the Christians shall be allowed to enter the library. Hypatia and the pagans flee, grabbing what scrolls and documents they can, before the Christians overtake the library and destroy its contents. Davus, torn by his love for his mistress and the possibility of gaining his freedom by joining the rising tide of Christianity, chooses to join the Christian forces.
The film continues several years later: Orestes (now converted to Christianity) is prefect of Alexandria. Hypatia continues to investigate the motions of the heavenly bodies, though she is forbidden from teaching at the school. The Christians and the Jews come into conflict, committing violent acts against each other, with the Christians ultimately wresting power from the only other religious group remaining. The leader of the Christians, Cyril (Sami Samir), views Hypatia as having too much influence over Orestes and stages a public ceremony intended to force Orestes to subjugate her. Hypatia’s former pupil, Synesius, now the Bishop of Cyrene, comes to her rescue as a religious authority counterweight, but says he cannot help her unless she accepts Christianity. She refuses. Cyril convinces a mob of Christians that Hypatia foments civil disobedience and they vow to kill her. Davus tries to run ahead to warn Hypatia, but she is captured by the mob. Davus secretly suffocates her while the mob gathers stone to stone her with.

చారిత్రాత్మక చిత్రాలు ఇష్టపడేవాళ్ళకు విపరీతంగా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక బాధాకరమైన చారిత్రాత్మక సత్యంతో అవగతమయ్యే అవకాశమూ ఉంది.

2009, అక్టోబర్ లో రిలీజైన ఈ చిత్రం గ్లాడియేటర్ వంటి చిత్రాల స్థాయి సాంకేతిక విలువలున్నా అంత పాప్యులర్ కాకపోవడానికి కారణం anti- christian కథావస్తువే అని కొంతమంది విమర్శకులు భావించారు. భారతదేశంలో ఇంకా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాలేదు. కానీ అన్ని ప్రముఖ DVD షాపుల్లోనూ సినిమా దొరుకుతుంది.

*****

Sunday, May 2, 2010

1947 సినిమాలు

భారతదేశ చరిత్రలో 1947 ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. మనదేశానికి స్వతంత్ర్యం వచ్చించి. బిటిష్ దాస్యశృంఖలాల నుంచీ భరతమాత/ భరతజాతి స్వేఛ్ఛను పొందింది. ఈ ప్రజ్వలమైన విజయానికున్న చీకటి కోణం దేశవిభజన (Partition).

దేశం విభజింపబడింది. కొన్ని లక్షలమంది నిర్వాసితులైనారు. అంతేమంది వలసవెళ్ళారు-వచ్చారు. మరికొన్ని లక్షలమంది చంపబడ్డారు. కొన్నివేలమంది మహిళలు చెరచబడ్డారు. కొన్ని కోట్లరూపాయలు విలువచేసే ఆస్తినష్టం జరిగింది. హిందూ-ముస్లిం ఐక్యతలో ఒక శాశ్వతమైన చీలిక ఏర్పడింది. అదొక ఉన్మాదం. మానవ చరిత్రలో ఒక మాయనిమచ్చ. భారతీయ హృదయాలలో (ముఖ్యంగా నిర్వాసితులూ వలస వచ్చినవారూ-వెళ్ళినవారిలో) ఇప్పటికీ ఆ ఘటన ప్రభావాన్ని చూపిస్తుంది. భారతీయ మానసికతలో విభజన ఒక అవిభాజ్య అంశం.

సినిమా సామాజిక జీవనచిత్రానికి అద్ధం పట్టే కళారూపం. కానీ దేశవిభజన అప్పటి (1950s) సినిమాల్లో ప్రతిఫలించలేదు. ప్రముఖ నిర్మాతాదర్శకులు కొందరు విభజన కారణంగానే హిందీచిత్రపరిశ్రమకు వచ్చినప్పటికీ ఆ "ఇబ్బందికరమైన" విషయాని విస్మరించారు. కారణాలు ఏవైనా 60-70 దశకాలవరకూ విభజన గురించి సాహిత్యం వచ్చినంతగా సినిమాలు రాలేదు. ఇప్పటికీ చూస్తే విభజన గురించి వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. 

అలాంటి సినిమాలు మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి....

****

Tuesday, April 27, 2010

‘ప్రస్థానం’ దర్శకుడితో వీడియో ఇంటర్వ్యూ

సినిమా మీద ప్రేమ. ఎంచుకున్న పనిమీద నమ్మకం. స్వశక్తి మీద విశ్వాసం. ప్రతిభ మీద అపారమైన గౌరవం. అన్నింటినీ మించి, స్నేహశీల స్వభావం. దేవకట్టా గురించి తెలుసుకోవాలంటే ఇంతకుమించి ఏమీ చెప్పనక్కరలేదు. ఈ మధ్యనే నవతరంగం టీం దేవకట్టాను కలిసి తన గురించి, తన సినీప్రస్థానం గురించీ, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించింది. ఆ వీడియో ఇంటర్వ్యూ మీ కోసం…నవతరంగంలో

****

సూపర్ హిట్ తమిళ చిత్రాలపై ఒక దళితధృక్కోణం

గత కొన్ని సంవత్సరాలుగా సహజత్వం పేరుతో వచ్చిన కాదల్, పడుత్తివీరన్, సుబ్రమణ్యపురం, వెయిల్ వంటి చిత్రాలలో దళిత పాత్రల చిత్రీకరణ ఎంత సహజంగా ఉంది అని ప్రశ్నిస్తూ వచ్చిన విశ్లేషణాత్మక వ్యాసం మీకోసం...

The current psychological war against dalits in Indian cultural realm is fought by the brahmanical hegemony and ideology with inventions of newer psychological tools especially in cinema. It is evident in the texts of acclaimed tamil films which are celebrated as the depiction of village and real life outlets. These so called new generation tamil industrial cinema also revolves round the dichotomy of life/killing, elites/dalits, happiness/tears etc., and avoids the different complex political aspects of these two sided presentations. Killing of dalit identities and dalit bodies  in the films like Veyil, Kadhal, Pruthiveeran, Subramaniapuram, Vennila KabadiKuzhu etc., are cunningly avoided in the intellectual discourses and are celebrated as refreshements in tamil film culture in the realm of presentation and text. These films are read as the depiction of reality of village and dalit life which were neglected by the Indian cinema seems to be paradoxical...


****