Sunday, March 29, 2009

బీజేపీ అంటే, భయ్ హో!


ప్రతిపక్షంలో ఉండే పార్టీలకు ఎన్నికల్లో, అధికారపక్షం విధానాల మీద చేసే వ్యతిరేక ప్రచారం ప్రధాన అస్త్రం. తిరిగి అధికారంలోకి రావాలంటే ఇప్పటివరకూ పాలించిన లీడర్ల చేతగానితనం, పార్టీల విధానం, ప్రజల్లో వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడం ఒక తప్పనిసరి అవసరం. అదే ప్రతిపక్షం బాధ్యతకూడా. మన రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశంతో పాటూ మహాకూటమి అస్త్రాలు, వైఎస్ పాలనలోని లోపాలు, అవినీతి,ప్రజావ్యతిరేక విధానాలైతే, అదికార పక్షమైన కాంగ్రెస్ తాము చేసిన అభివృద్ధి పనుల ఆధారంగా ఓట్లడగడానికి సిద్దమవుతోంది. అక్కడక్కడా వ్యక్తిగత విమర్శలూ, తొడగొట్టడాలూ, ఛాలెంజులు చేసుకోవడాలూ, మహిళా నాయకురాళ్ళు మైకుల ముందు జుట్టూజుట్టూ పట్టుకోవడాలు కొంత ఎన్నికల ‘వేడి’ని కలిగిస్తున్నా, ప్రజల్ని భయభ్రాంతుల్ని మాత్రం చెయ్యండం లేదు. అంతవరకూ సంతోషమే!

కానీ, జాతీయరాజకీయాల్లో ఈ పద్ధతి కొంచెం తగ్గినట్లు అనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తన ఇన్నిసంవత్సరాల ఎన్నికల జీవితంలో బహుశా ఒకేఒక్కసారి ‘ఇండియా షైనింగ్’ అంటూ సకారాత్మక ఎన్నికల ప్రచారం చేసిందనుకుంటాను. ఆ ప్రచారంకూడా బోల్తాకొట్టడంతో అభివృద్ధి, సుపరిపాలన లాంటి సాఫ్ట్ భావాలతో బీజేపీకి ఓట్లు పడవనే నశ్చయానికొచ్చిన బీజేపీ "హిందుత్వ" తో మళ్ళీ ‘back to basics' అంటోంది. ఒకవైపు వరుణ్ గాంధీ ముస్లిం వ్యతిరేక స్పీచ్ కొచ్చిన ‘విపరీమైన’ స్పందనతో "ఇదే దారి" అనుకుంటున్నట్లుగా ఉంది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ విధానవైఫల్యాల సంగతేమోగానీ, జాతీయభద్రతలో వైఫల్యం పేరుతో భయపెట్టే ప్రచారానికి ఎప్పుడో శ్రీకారం చుట్టింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదుగానీ, తీవ్రవాదానికీ-ఇస్లాంకూ- హిందుత్వానికీ ఎంచక్కా ముడిపెట్టేసి పబ్బంగడుపుకోవడం ఒక అలవాటుగా చేసేసుకున్నారు. ఈ ఎన్నికల్లోకూడా క్రితం పాఠాల్ని ఎంచక్కా అపార్థం చేసుకుని, అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన అజెండాను ప్రచారాల్లో పక్కనబెట్టి కాషాయం జెండాను ఎక్కుపెట్టారు.

ఆస్కారు పంటపండించిన ఏ.ఆర్.రెహమాన్ "జయహో" పాటని కాంగ్రెస్ తమ ప్రచార సంగీతంగా ఎంచుకుంటే, దానికి వ్యతిరేకంగా ఏ "అపజయహో" లేక "పరాజయ్ హో" అనకుండా, తమ brand of fear politics ప్రతిబింబించే విధంగా "భయ్ హో" అనే నినాదంతో ముందుకొచ్చింది. భయపెట్టి, లేని ప్రమాదాన్ని చూపెట్టి, తమ రాజకీయం గడుపుకునే ట్రెండ్ ను ముందుకు తీసుకెళ్తోంది. ఈ భయాందోళనల, విద్వేషాల రాజకీయ ప్రచారాల్ని EC చూస్తూ ఉండదని ఆశిస్తాను. వరుణ్ కు జరిగిన శాస్తి, ఇలాంటి ప్రచారాలకు కూడా కలగాలని ఆశిస్తాను. నెగిటివ్ ప్రచారాలతో ప్రజల్ని భయపెడుతున్న బీజేపీ రాజకీయ ప్రచార విధానం డౌన్ డౌన్!!

బీజేపీ రూపొందించిన వీడియో మాత్రం బాగుందండోయ్! అదే భయంకూడా!!


Saturday, March 28, 2009

బారా ఆణా - చిన్న(పెద్ద) సినిమా

సాయంత్రం 5:30 ఆట. అసలే అలవికాని సమయం, అందునా చాలా మందికి పేరైనా తెలీని “చిన్న సినిమా”. అక్కడక్కడా వినడంవల్ల, నసీరుద్దిన్ షా ఉన్నాడన్న ధైర్యంతో PVR లో వెళ్ళి కూర్చున్నాను. సినిమా మొదలయ్యే సరికీ ధియేటర్లో పట్టుమంటే పది మందికూడా లేరు. సినిమా మొదలయ్యింది, ఇంటర్వెల్ వచ్చించి, సినిమా ముగిసింది. ఇంటికొచ్చేశాను. రెడ్రోజులయ్యింది. కానీ…ఆ సినిమా చూసిన అనుభవం ఇంకా నాదగ్గరే ఉంది. ఆ సినిమా పేరు “బారా ఆణా”.

మరణించి మళ్ళీ బ్రతుకుతున్న ఒక టాక్సీడ్రైవర్ (”ఎందుకు? ఏమిటి? ఎలా?” అని అడక్కండి. సినిమా చూస్తేగానీ అసలు విషయం తెలీదు). ఊర్లో పెళ్ళాంబిడ్డల్ని వదిలేసి బొంబాయి నగరంలో వాచ్ మన్ పనిచేసుకునే మరో యువకుడు. హోటల్ లో సర్వర్ గా పనిచేసుకుంటూ, ఒక విదేశీవనిత ఆకర్షణలో మునిగితేలే మరో యువకుడు. ఈ ముగ్గురూ ఉండే ఒక మురికివాడ. వారి జీవితం. ఆశలు. అడియాసలు. ఉక్రోషాలు. కోపాలు. అవి ప్రేరేపించే నేరాలు. సాధారణ జీవితాల్లోవున్న ఊహించని మలుపు ఈ చిత్రం. చూసి ఆనందించడంతోపాటూ, ఒక అనుభూతిని మనతో తెచ్చుకునే సజీవచిత్రం ఈ చిత్రం.

అంతమాత్రానా ఇదేదో బోర్ కొట్టే స్లోమోషన్ సినిమా కాదు. హాస్యమైన సంభాషణలున్నాయి. నవ్వుకునే దృశ్యాలున్నాయి. సహజమైన రొమాన్స్ ఉంది. పరస్పర ఆకర్షణలున్నాయి. నమ్మకద్రోహాలూ- మోసాలూ ఉన్నాయి.

డ్రైవర్ పాత్రలో సినిమా మొత్తం కనిపించినాకూడా, కనీసం ఒక పేజీ డైలాగులు కూడా లేని అత్యద్భుతమైన పాత్రలో నసీరుద్దీన్ షా నటన…ఎలా చెప్పాలో తెలీటం లేదు. అబ్బో! అంతే!! సినిమా 90% అయ్యేవరకూ ఒక్క మాటకూడా మాట్లాడడు. కానీ, యాక్టింగ్ చూశారూ! ఎవరండీ ఈ మహానటుడికి ధీటు? Frustrated వాచ్ మన్ పాత్రలో విజయ్ రాజ్ (మాన్ సూన్ వెడ్డింగ్ ఫేం) కూడా జీవించాడు. ద్వితీయార్థంలో తన పాత్ర కొంత నేలవిడిచి సాముచేసినట్లనిపిస్తుందిగానీ, సహజంగా అలాంటి పరిస్థితుల్లో ఇలా కొందరు మారతారేమో. ఒక తెల్లపిల్ల మోజులోపడే vulnerable వెయిటర్ గా అర్జున్ మాథుర్ (లక్ బై ఛాన్స్ ఫేం) ఈ దిగ్గజాలకు సాటైన నటనాపటిమని పరిచయం చేసాడు. ఈ ప్రధాన పాత్రలతోపాటూ విదేశీ వనితగా వయలాంటో ప్లాసిడో, మురికివాడలో చిల్లర దుకాణం/ఫోన్ బూత్ నడిపే యువతిగా తనిషా చటర్జీ పాత్రోచితంగా నటించారు. ముఖ్యంగా తనీషా చటర్జీకి నటిగా మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది.

2003 లో బస్ యూహీ అనే అసఫల ప్రయత్నం చేసిన దర్శకుడు రాజా మీనన్ కు ఇది ద్వితీయ ప్రయత్నం. తనకు కథ మీదున్న పట్టు, కథనంలో నిలకడ వలన సినిమాని ఆద్యంతం వినోదభరితం చేసాడు. అదే స్థాయిలో అర్థవంతంగానూ నిలిపాడు.ప్రియా సేత్ సినెమాటోగ్రఫీ మరియూ శ్రీ అందించిన నేపద్యసంగీతం ఈ సినిమాకు మరో హైలైట్.

చిన్న సినిమా. మనసున్న సినిమా. సహజమైన సినిమా. నిజమైన సినిమా. చుడాల్సిన సినిమా.


*ఈ వ్యాసం మొదటిగా నవతరంగం లో ప్రచురింపబడింది.

Thursday, March 26, 2009

చలం ‘మైదానం’ లో...

ఈ మధ్య నేను రాసిన ‘చలం గురించి నేను’ అనే టపా చదివి మిత్రుడొకరు ‘చలాన్ని అనుభవిస్తాను. చర్చించను. అనే వాడివి, హఠాత్తుగా ఈ మూర్ఖత్వం ఎందుకు చేసావ్?’ అని ప్రశ్నించాడు. నిజానికి నేను నా బ్లాగులో రాసింది ప్రత్యేకమైన టపా కాదు. ఒక బ్లాగులో చలం గురించి జరిగిన చర్చల్లో నేను చేసిన వ్యాఖ్యల్ని, ఒకటిగా కూర్చిపెట్టుకునే ప్రయత్నం మాత్రమే. కానీ ఆ మిత్రుడు, ఆ తరువాత అన్న మాటలు నన్ను మరింత ప్రభావితం చేసాయి. ‘కనీసం ఒంటరిగానైనా, కనీసం చీకటి గదిలోనైనా, తమ నగ్న దేహాన్నీ, మనసునీ ఆసాంతం పరికించి,పరీక్షించి, ప్రశ్నించికోని ఈ జనాలకి చలాన్ని చెప్పాలనుకోవడం మూర్ఖత్వం.చెప్పినా అర్థం చేసుకుంటారనుకోవడం దురాశ. అర్థం చేసుకున్నా, ముసుగుల్లో బ్రతికెయ్యడానికి అలవాటుపడ్డవారు అంగీకరిస్తారనుకోవడం వెర్రితనం.’ ఈ మాటలు విన్న తరువాత నా మూర్ఖత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలనే కోరిక కలిగింది.

నేను అనుభవించిన చలంని, తార్కికంగా అక్షరాల్లోకి కుదించాలనుకోవడం నా సామర్ధ్యాన్ని మించిన పని. ఇలాంటప్పుడే భాషలోని మితి,పరిమితులు తేటతెల్లమవుతాయనుకుంటాను. అనుభవాల్ని అక్షరీకరించడం, ఆలోచనల్ని తెలియజెప్పడమంత తేలిక కాదు. మనసునీ మెదడునీ ఏకకాలంలో ఆక్రమించి, హత్తుకుని, కుదిపివేసి, జీవితానికి కొత్త అర్థాల్ని అందించే అనుభవాల్ని పదాల్లో చెప్పాలంటే...చలం కావాలి. అది తనకే సాధ్యం. మరి చలం పదాల్ని అనుభవించి ఆ ఆనుభవాన్ని ఆలోచనల్లో జీవించి, ఆ జీవితసారాన్ని మళ్ళీ చెప్పాలంటే?!?

అందుకే, చలంను అనుభవించగలను గానీ చర్చించలేనని ఎప్పుడూ భీష్మించుకు కూర్చున్నాను. కానీ, అనుభవాల్ని కాకుండా, ఆ అనుభవానికి నేను వేసుకున్న ప్రాతిపదికని పరిచయం చెయ్యడంలో తప్పులేదనిపిస్తోంది. ఏదైనా సాహిత్యాన్ని చదివేటప్పుడు మన పూర్వజ్ఞానం, అప్పటి మన:స్థితి, సామాజిక స్థాయిని బట్టి కొన్ని ప్రాతిపదికలు ఏర్పరుచుకుని ఒక తార్కికనమూనా (logical framework) ఆధారంగా అస్వాదిస్తాం,అర్థం చేసుకుంటాం, అనుభవిస్తాం. అర్ధాన్నీ,ఆస్వాదననీ మళ్ళీ ఆలోచనలుగానో, అభిప్రాయాలుగానో విడమర్చి విశ్లేషించొచ్చుగానీ, అనుభవాల్ని articulate చెయ్యాలంటే కష్టం. ఈ హేతువు ఆధారంగా చలం ‘మైదానం’ ని అర్థం చేసుకోవడానికీ,ఆస్వాదించడానికీ నేను ఏర్పరుచుకున్న తార్కికనమూనాని పరిచయం చేస్తాను.

మైదానం - ఒక సర్రియల్ (surreal ) నవల:
Surrealism was a means of reuniting conscious and unconscious realms of experience so completely, that the world of dream and fantasy would be joined to the everyday rational world in "an absolute reality, a surreality."
- The Surrealist Manifesto, André Breton,1924

మైదానం నవల్లో ఏది నిజం, ఏది కల్పన, ఏది కల, ఏది ఆలోచన,ఏది అపోహ అనేవి ప్రశ్నార్థకాలు. కానీ, అన్నీ మనకు తెలిసిన లోకంలో జరుగుతున్నట్లుగానే భ్రమింపజేస్తాయి. ఈ కారణంగా కథలో జరుగుతున్న "కాల్పనిక వాస్తవాన్ని" భౌతికనిజంగా పరిగణించి, చలం పంధా బరితెగించిన పంధా అని అప్పటికే నిర్ణయించేసిన చాలా మంది పాఠకులు, ప్రతిస్పందించండం మొదలుపెడతాం. ఒకసారి ప్రతికూల ప్రతిస్పందన మొదలైతే, రసస్పందనకు మిగిలింది అభాసుపాలే.అందుకే,ఈ సాహితీప్రక్రియ మూలాల్ని లేక ఉద్దేశాల్ని గ్రహించకుండా ఈ నవలను సాధించడం అపోహల్ని కలిగిస్తుందేతప్ప ఆర్ధ్రతను కాదు.

ఈ నవల, నాయిక రాజేశ్వరి మానసిక చేతన(conscious),ఉపచేతన(subconscious),అచేతన (unconscious)ల అభివ్యక్తి. రాజేశ్వరి అమీర్ తో నివసించే మైదానం అణచివేయబడ్డ శారీరక,మానసిక వాంఛల ఫలసిద్ధికి సాక్షాత్కరించిన మాయాలోకం . అదొక ప్రతీక.అదొక బలీయమైన కోరిక. అదొక కాల్పనికవాస్తవం.అమీర్, మీరాలు రాజేశ్వరి మనోజనిత కాంక్షలు.

ఒక స్త్రీగా రాజేశ్వరి లోని శారీరక చైతన్యానికి సరిదూగే పురుషశక్తికి అమీర్ ప్రతీకైతే, మీరా స్త్రీలోని మాతృహృదయ పరిపూర్తికి చిహ్నం. స్త్రీలోని మూలభావనలైన (basic instincts) ప్రేమవాంఛ, మాతృకాంక్షల కథ మైదానం.

రాజేశ్వరి-అమీర్ ల కలయిక, సంసారం-దాంపత్యం- నాగరికత మాటున అణవేయబడుతున్న శారీరక చైతన్యాన్ని అందుకోవడానికి, హిపోక్రటిక్ సామాజిక విలువల కూర్పుని కాలదన్ని, కేవలం ప్రాధమిక (rudimentary) కాంక్షల్ని ఆకాంక్షించే విప్లవానికి సంకేతం. మీరా తో రాజేశ్వరి ప్రేమ, తన వంచిత మాతృకాంక్షను ఆవిష్కరించే ప్రయత్నం. మీరా రాజేశ్వరికి కొడుకు,తమ్ముడు, ప్రేమికుడు, ఆరాధకుడు,రక్షకుడు. అమీర్ - మీరా- రాజేశ్వరిల మధ్యజరిగే ప్రేమ-ద్వేషం-మళ్ళీ ప్రేమలను అర్థం చేసుకోవాలంటే ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ ( psychoanalysis ) సహాయం తీసుకోకతప్పదు.

చలం ఇందులో స్త్రీస్వేఛ్ఛని ప్రబోధించలేదు. ఎవర్నీ ఇలా సంసారాలు వదిలి కాల్పనిక మైదానాల కోసం పరిగెత్తమని చెప్పలేదు. అణగదొక్కబడిన స్త్రీత్వం సాక్షిగా, ఒకధీటైన సమాంతర ప్రపంచాన్ని సృష్టించి అందులో ఆ స్త్రీని సంతుష్టురాల్ని చేసే ప్రయత్నం చేసాడు. సంసారాలూ,దాంపత్యాలూ ఇలా ఏడిస్తే, స్త్రీలో జరిగే మానసిక విచ్ఛిన్నతి (fragmented consciousness)ని ఆవిష్కరించి, సమాజానికి ఒక హెచ్చరిక జారీచేసాడు.

ఈ సిద్ధాంతాలనూ, సాహితీప్రక్రియలనూ,ఆలోచనా విధానాలనూ నేపధ్యంగా తీసుకోకుండా మైదానాన్ని చదివి అర్థం చేసుకోవడం కష్టమయితే, అస్వాదించి, అనుభవించడం అసంభవం. చలం రచనల మీదున్న అపోహని ప్రాతిపదికగా తీసుకుని లేక "సామాజిక సృహ" అనే మరొక హిపోక్రటిక్ టూల్ ని ప్రమాణంగా తీసుకుని మైదానాన్ని బేరీజు చెయ్యాలని చూసినా మిగిలేది అనుభవం కాదు అపభ్రంశమైన మానసిక సంతులన.

****

Wednesday, March 25, 2009

చలం గురించి నేను


చలం వ్యక్తికాదు. ఒక సాహితీ విప్లవం. ఒక సామాజిక ఉద్యమం.నిర్ధిష్టమైన prescribed విలువల్లో కుంచించుకుపోయిన మానవతలోని ఒక పార్శ్వాన్ని తన రచనలతో ఉద్దీపనం చేసిన ఋషి.

మనుషులూ,మనసులూ,విలువలూ,నమ్మకాలూ,ఆకర్షణలూ,ఆవేశాలూ అన్నీ మారతాయని చెప్పిన చలం, తన విధానాన్ని మార్చుకుంటే నిరసించాల్సిన అవసరం లేదు.

ఇలాంటి వ్యక్తులు వ్యక్తిగత,వైవాహిక,సాంఘిక జీవితంలో పెద్ద విఫలురిగా కనిపిస్తారు. అది మన సాధారణ కోణంలోంచీ చూస్తే అలాగే అనిపిస్తుందికూడా. కానీ Their contribution will be measured by a collective consciousness of a society.

చలం సాహిత్యం over rated అనుకునేవాళ్ళకు ప్రపంచసాహిత్యంతో పరిచయం లేదనుకోవాలి. James joeys తన stream of consciousness శైలిలో కుస్తీలు పడుతున్న సమయానికి చలం "మ్యూజింగ్స్" రాసేశాడు. ప్రపంచ సాహిత్యం Absurd,abstract, magic realism అనే మాటలు వంటబట్టించుకున్న సమయంలో చలం "మైదానం" సృష్టించాడు.

చలం ఇంగ్లీషులో రాయలేదుగాబట్టి ఈ ఖర్మగానీ, లేకపోతే ఎప్పుడో నోబెల్ బహుమతి వచ్చేది. ఇక మరో ఖర్మ తను తెలుగు పాఠకులకోసం రాయడం. చాలా మంది చదవకుండానే విమర్శిస్తారు, మరికొందరు చదివి అర్థం చేసుకునే ధైర్యం లేక తిట్టిపోస్తారు. మనమింతే!

చలాన్ని ఆస్వాదించి అనుభవించడమేతప్ప అర్థం చేసుకు దాన్ని విడమర్చి చెప్పే సాహసాన్ని చెయ్యలేను. అంత పరిణితి నాకు లేదు. కాకపోతే, ఒక్క విషయం మాత్రం చెప్పగలను.Chalam works appeal to my primordial instincts that are still raw and formative.

మనమే ఒప్పుకోలేని మనలోని నిజాల్ని మనకు పరిచయం చేసిన చలాన్ని, వ్యక్తిగతంగా అనుభవించి మన meaninglessness ని,futility ని, insignificance ని,guilt ని celebrate చేసుకోవాలేగానీ, సాహితీవిమర్శనమో లేక సామాజిక దర్శనమో కొలమానాలుగా కొలవకూడదని నా నమ్మకం.

Chalam is personal to anyone and everyone who reads him.అనుభవించండి. Intellectual and emotional limitations మధ్య అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకండి.

చలం ‘మైదానం’ ఒక ఆలోచన. సమాజంలోని hypocrisy కి వ్యతిరేకంగా రచయిత సృష్టించే parallel ప్రపంచానికి ప్రతీక.Its an imagery of resistance. దాన్ని ప్రాపంచిక నిజం అనుకుని చదివితే లేదా అలా జరుగుతుందా లేదా అని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన సమాధానాలు దొరకవు.బహుశా మీ ప్రయత్నం అలాంటిదే అయ్యుండచ్చు.

చలం alternate values స్థాపనకోసం పుస్తకాలు రాయలేదు. తన నిజాన్ని సామాజిక నిజానికి ఎదురుగా నిలిపి ప్రశ్నించాడు. చలం చెప్పినవాటినీ,చేసినవాటినీ అమలు చెయ్యాలనే రూలేం లేదే! నావరకూ,నాలోని బలహీనతల్ని,వాంఛల్నీ,అర్థరహితత్వాన్నీ అర్థం చేసుకోవడానికి, వాటిని celebrate చేసుకోవడానికీ నేను చలం సాహిత్యం చదువుతాను.

I believe it was one of the most personal literature ever written.

కవి,రచయిత ఒక కాల్పనిక ప్రపంచాన్ని నిజమైన ప్రపంచానికి ధీటుగా సృష్టించడం ద్వారా, సామాజిక నిజాన్ని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించడం యొక్క ఉద్దేశం, సామాజిక విలువల్లో ఉన్న లొసుగుల్ని ఎత్తిచూపడమే తప్ప escapist గా మారి ఆ కల్పనల్లో బ్రతకమని కాదు.

మైదానం ఒక surrealistic నవల.కథా ప్రదేశం ఒక mind scape.అందుకే, అక్కడ జరిగేదాన్ని నిజమనుకోవడం, లేదా నిజ జీవితంలో అలా జరగాలనుకోవడం అర్థతహితం. రచయిత ఉద్దేశం,ఇలా జరిగే అవకాశం ఉన్నప్పుడు నిజమైన ప్రపంచంలో ఆ "హద్దుల్ని" ఎలా చెరపాలో ఆలోచించాలనే బీజాన్ని నాటడం.

ఇక్కడ సమస్యేమిటంటే, చలాన్ని మన భౌతిక విలువల నేపధ్యంలో బేరీజు చేసి అర్థం చేసుకోవాలనుకోవడం. లేదా వాటికి అనుగుణంగా లేడని నిరసించడం. అదీ కాకపోతే, తను చెప్పేది అక్షర సత్యమని (alternate truth గా) ప్రచారం చేసి మూర్ఖత్వాన్ని మూటగట్టుకోవడం. అన్నీ తప్పే! అందుకే చలం సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం అని నాకు అనిపిస్తుంది.

ప్రపంచ సాహిత్యంలో రెండో ప్రపంచయుద్ధం నాటికిగానీ రాని disillusionment with life and questioning the very existence of the "meaning" of life ఆలోచనలు చలం సాహిత్యంలో మొదటి ప్రపంచయుద్ధ కాలం నాటికి ముందే కనిపిస్తాయి.Fragmented consciousness ని అత్యంత లాఘవంగా అక్షరబద్ధం చేసిన అతికొద్దిమంది ప్రపంచసాహితీకారుల్లో చలం ఒకరు.

నావరకూ చలం సాహిత్యం, ప్రత్యామ్నాయ విలువల్ని సృష్టించే సాహిత్యం కాదు. కాబట్టి ఆ విలువలు పాటించాలా? తను చెప్పేవాటిల్లో విలువెంత? వంటి ప్రశ్నలు నిరర్థకం.

చలం సాహిత్యం సంధించిన ప్రశ్నల సాహిత్యం. కాబట్టి ఎంతవరకూ existing విలువల్ని ప్రశ్నించి ఆకళింపు చేసుకున్నావు? ఎంతస్థాయిలో జీవితాన్ని గౌరవించి ఆ prescribed విలువల్ని త్యజించావు? అన్నవే సరైన ప్రశ్నలు.

చలం దేవుడు కాదు. మామూలు మనిషి. అందుకే అతని సాహిత్యం బలహీనతల సాహిత్యం. శైశవదశలో ఉన్న వాంఛల సాహిత్యం. అర్థం కాని శారీరక ఉన్మాదాల సాహిత్యం.Some one should give voice to such complexities in human life. He did it. అందుకే అతను ఒక ముఖ్యమైన సాహితీవేత్త.

నచ్చడం నచ్చకపోవడం అనేవి వ్యక్తిగత అభిరుచినిబట్టి ఏర్పడే అభిప్రాయాలు. వాటిల్లో విభేధించడానికి ఏమీ ఉండదు. కానీ,dismissing Chalam as whole based on it, may not be a wise thing.

చలం ఆడజాతిని "ఉద్దరించాలని" అనుకున్నట్లు నాకైతే ఎక్కడా అనిపించలేదు. ఆడవాళ్ళకూ అంతర్గత భావేవేశాలుంటాయని తన అనుభవంతో నేర్చుకున్నాడు.ఆ భావావేశాలకు తగిన గౌరవం ఇవ్వాలని కాంక్షించాడు,ఇచ్చాడు.

అయినా ఆడవారు తేరగా కూర్చును ఉద్దరింపబడటానికి తయారుగా ఉన్నట్లు భావించడంలో అసలు అర్థమే లేదు. ఆడది ఒక మౌనవిప్లవం. ప్రతిరోజూ,ప్రతిచోటా (సమూలమైన)మార్పు తెస్తూనే ఉంటుంది.

ఆడదాన్ని ఆడదానిగా గౌరవించడం,అభిమానించడం,ప్రేమించడం కాముకత్వం అని మీరు నిర్ణయిస్తే చలం నిస్సందేహంగా కాముకుడే.

Wednesday, March 18, 2009

‘నో స్మోకింగ్’ సినిమా గురించి అనురాగ్ కశ్యప్





Decoding - గులాల్

సినిమా వినోదంతోపాటూ ప్రయోజనాన్ని కలిగుండాలని నమ్మే వ్యక్తిగా, సినిమా అనే కళకు ఆరాధకుడిగా,ఒక సినీప్రేమికుడిగా “గులాల్” నాకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమా చూసి, నేను రాసిన సమీక్షని ఇక్కడ చదవచ్చు. కానీ, చూసిన క్షణం నుంచీ నా మనసులో ఒక సందేహం పట్టిపీడిస్తూ ఉండిపోయింది. “ఈ సినిమాకు తగిన ఆదరణ, గౌరవం మన దేశంలో లభిస్తుందా?” అనే ప్రశ్న నిత్యం ఉదయిస్తూనే ఉంది.

గులాల్ ఒక సామాజిక-రాజకీయ చిత్రం. అదీ ముఖ్యంగా, పార్టీల సమర్ధింపులూ, వ్యతిరేకతలూ, సైద్ధాంతిక ప్రాతిపదికలూ లేకుండా కేవలం నర్మగర్భంగా, (విప్లవాత్మక)రంగులకలలాగా చిత్రించిన ఒక abstract పెయింటింగ్ లాగా, ఒక absurd నాటకంలాగా తెరకెక్కించిన ఇతివృత్తం. ప్రతి సీన్లోనూ, ప్రతి కదలికలోనూ, ప్రతి ఫ్రేములోనూ ఉల్లిపొరల్లాంటి అర్థాల్ని నింపుకుంటూ నిర్మించిన చిత్తరువు.

సాధారణ ప్రేక్షకుడికి కథావస్తువు అర్థమయినా, ఈ సినిమాలోని raw-energy ని అనుభవించగలిగినా, తరచి చూస్తే, మరిన్ని స్థాయిల్లో ఆనందాన్నివ్వగలిగిన కొన్ని విషయాలు ఎక్కడ మిస్ అయిపోతారో అనే ఒక శంక నన్ను వీడిపోలేదు. దీనికి తోడుగా, నాతో పాటూ సినిమా చూసిన కొందరు మిత్రులు అడిగిన ప్రశ్నల్ని దృష్టిలో ఉంచుకుని కొంత డీకోడింగ్ చెయ్యక తప్పదనిపించి, అప్పుడే PASSION FOR CINEMA లో ఒక వ్యాసం నా కంటబడింది. ఆ వ్యాసంలో చాలా వరకూ నాకు అనిపించిన sub-text యొక్క వ్యాక్య కనపడగానే దాన్ని పంచుకుందామని ఇక్కడ పెడుతున్నాను.

సినిమా చూసినవాళ్ళు మరొక్కసారి సినిమా చూసి, ఇంకొంత ఆనందం పొందడానికి ఈ insights ఉపయోగ పడతాయి. ఇంకా సినిమా చూడకపోతే, మరింత అర్థవంతమైన viewing కోసం ఈ సమాచారం ఉపయోగ పడుతుంది. చదవండి. సినిమా చూసి ఆనందించండి.

1. The ardha-niri : not many people have been able to decipher it, I am still trying. I think its represents the duality in all of us, concomittant presence of good and bad, ignorant and awakened, innocence and deceitful; its only how we view it. That could be the reason Dukey was always kicking it out because it irked him no end while Prithvi groomed it because he is in peace with it. As I said, I am still trying to decipher.

2. John lennon’s locket : not many people recognized this as well. Quite a few people in the theatre thought that it was a photo of his purwaj hanging by a thread on Prithvi’s neck. They did not know that it was Lennon speaking down Prithvi’s throat about borderless countries, world peace, jiski thokar pe hai zamana, making a call to the US President etc

3. Nihilism : what was such a complicated word doing on the blackboard. If we type this word in wikipedia, this is what we get - is the philosophical position that values do not exist but rather are falsely invented.Most commonly, nihilism is presented in the form of existential nihilism which argues that life is without meaning, purpose or intrinsic value. Moral nihilists assert that morality does not exist, and subsequently there are no moral values with which to uphold a rule or to logically prefer one action over another. No doubt, this provides a window into Anuja’s life after the nerve-wrecking experience she had.

4. Ranaji song : people just enjoyed this mujra without even understanding what it meant. It was black humor, disguised as an anti-American song. As I have written in my previous post, its an anti-authoritarian song against someone who takes autonomous decisions and its consequences; in this case it happened to be US.

5. Najibullah : where people hardly understand what’s happening in our own country, how the hell did an Afghan president’s mention make it to Indian screen. Yes, very soon we were shown the relevance, but people still did not get it. They did not understand that the movie was talking about how an autocratic body passed a judgement and Ransa turned out to be the victim of such apathy.

6. Karan/kiran : this was again something I mentioned in my review but let me take it further. We had an inverse proportion of numbers here, when compared to the Karan of Mahabharat. While Pandavs were 5 and Karan was all alone in his battle of existence, here we had one Ransa against two opponents - Karan and Kiran. Not only were the numbers reversed, but also the fate. While the Karan of our mythology was daan-veer-shoor, righteous and just; the modern-day Karan was extremely the opposite-cunning, opportunistic and wicked; while the former Karan was wronged and killed by deceit, the latter Karan wronged others in his quest for legitimacy; while the former Karan was ready to lead a life where his origin/birth would be a kept secret forever, the latter Karan was trying so hard to announce to the world that he has royal blood too. So extremely opposite were the two Karans and the credit for bringing this out so well must go to Aunrag Kashyap and the co-writer Raj Singh Chaudhary, who played Dilip.

7. Ram-leela : first Delhi-6 and now Gulaal uses this age old theme to speak about good versus evil and showed Hanuman running around to burn Lanka.

8. Lighting on Dukey’s face : there was always a neon light on Dukey’s face, but of differing colors; most of the time it was red. The lighting played a great part in building his character.

9. Hail Feuhrer: in a mocking way, Prithivi does a hail Feuhrer to Dukey.

10. Gulaal : of course, the grand meeting where everyone’s face was smeared with gulaal. And Dukey in his speech says that if you have the guts, then come forward and show your true face. In the entire meeting, the only person whose face was not gulaal-ified was the Senapati, Dukey. And that’s what Karan aspired to achieve. In fact, the last sequence showed him wash off his face and come forward, the nemesis.

Let me just finish by stating that the movie, although good in patches, fails to reach the viewers at large. The story was complex, but the dialogues and the poetry made it even more difficult for the people to follow. Although I enjoyed the movie, but was left high and dry at the end because there was neither a message nor an unsaid unrest within me, neither entertainment nor despair, neither was I persuaded nor was I dissuaded, I was just about neutral humming this line … Jeet ki hawas nahi, Kisi pe koi vash nahi; Kya zindagi hai thokaro pe maar do. I think this is what the movie is about.

Monday, March 16, 2009

రాజకీయ ‘రంగు’లరాట్నం - గులాల్

మొదటి సినిమా "పాంచ్" ఇప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ వాళ్ళు ఆపేసారు. రెండో సినిమా "బ్లాక్ ఫ్రైడే" విడదలచెయ్యకుండా దాదాపు మూడు సంవత్సరాలు కోర్టు ఆపేసింది. ఆ తరువాత "నో స్మోకింగ్" అని తనకు తప్ప చాలా మందికి అర్థం కాని ప్రయోగాన్ని చేసి ‘బాగుంది కానీ అర్థం కాలేదు’ అనిపించుకున్నాడు. ఈ మధ్యనే దేవదాసుకు "దేవ్ డి" అని కొత్త భాష్యం చెప్పిన అనురాగ్ కశ్యప్ మరొక్కసారి ప్రేక్షకుల్ని తన సినెమాటిక్ ఫైర్ తో అబ్బురచిరిచిన చిత్రం "గులాల్".

సమకాలీన భారతీయ సినీదర్శకుల్లో ఇంత అలజడిని, భవిష్యత్తుపై ఆశనూ కలిగించిన మరో దర్శకుడు లేడేమో! ఇప్పటి వరకూ తను తీసిన చిత్రాలు తన వ్యక్తిగత expression కూ, cinematic excellence కూ, విషయవస్తువులోని integrity కీ మధ్య పొంతన కుదరని ప్రయత్నాలుగా మిగిలిపోయాయి. కానీ వాటిని అధిగమించి ఒక పూర్ణచిత్రంగా ఆవిర్భవించిన సినిమా, గులాల్ అని చెప్పుకోవచ్చు.

కథా పరంగా రాజస్థాన్ ప్రాంతాన్ని కథా ప్రదేశంగా ఎంచుకున్నా, సమస్త భారతదేశానికీ అన్వయించుకోదగిన ఒక శక్తివంతమైన సామాజిక,రాజకీయ, వ్యక్తిగత కోణాల్ని గులాల్ అనే రంగులరాట్నంలో కలగలిపి, ప్రేక్షకుడికి ఒకవైపు నేలపైనున్న నిజాల్ని చూపిస్తూనే తన స్క్రీన్ ప్లే తో, సాంకేతిక నైపుణ్యంతో ఆకాశాన్ని మించిన ఆలోచనల్ని అందించడంలో అనురాగ్ కశ్యప్ సఫలమయ్యాడు. ఇదొక అరుదైన ప్రయోగం. అర్థవంతమైన ప్రయత్నం. అధ్బుతమైన సినిమా లోకం.

పూర్తి సమీక్ష కోసం నవతరంగం చదవండి.

Friday, March 6, 2009

అత్త తిట్టినందుక్కాదుగానీ...తోడికోడలు నవ్వినందుకు ఈ మంట

ఈ మధ్యకాలంలో భారతీయ గుర్తింపుకు గొడ్డలిపెట్టంటూ చర్చించిన రెండు విషయాలు, అర్వింద్ అడిగ రాసిన ఆంగ్ల నవల "వైట్ టైగర్", అలాగే డానీ బోయెల్ తీసిన "స్లండాగ్ మిలియనీర్" సినిమాల గురించి. ఒకటి బీహార్ చీకటి నుంచీ వచ్చి, ఢిల్లీలోని ఆధునిక ప్రపంచం లోని ధగధగల నడుమ హంతకుడుగా మారి, IT విప్లవానికి ఆదిబిందువైన బెంగుళూరు వెలుగులో గౌరవనీయమైన వ్యాపారస్థుడిగా మారే ఒక యువకుడు జీవితాన్ని చిత్రించే నవల. మరొకటి, ముంబై మురికి కూపంలో పుట్టిపెరిగి, మాఫియా సామ్రాజ్యపు అంచుల్ని తడిమి చూసి, ఆగ్రా వీధుల్లో తాజ్ మహల్ సాక్షిగా విజయవంతమైన వీధి జీవితాన్ని అనుభవించి, భారతీయ ఔట్సోర్స్డ్ అభివృద్ది చిహ్నమైన కాల్ సెంటర్లో కాఫీ-టీలు అందిస్తూ, చిన్ననాటి ప్రేమకోసం కోటీశ్వరుడయ్యే టీవీ షో హాట్ సీటెక్కి, అనుమానంతో పోలీసుల ‘షాక్ టీట్మెంట్’ తీసుకుని చివరకు డబ్బుతోపాటూ అమ్మాయినీ దక్కించుకునే ఒక "అండర్ డాగ్" కథతో తీసిన సినిమా.


ఈ రెండూ ఇంగ్లీషులో, ఇంగ్లీషువాళ్ళకోసం రాసిన,తీసినవి. కాకపోతే అవి భారతదేశం మీద కాబట్టి మనోళ్ళకి మహకోపమొచ్చేసింది. "హాఠ్! ఆర్థిక అసమానతల అభినవ భారతదేశంలో ఎంత aspirational క్రైముంటే మాత్రం ఇలాంటి చీకటి కోణాన్ని ప్రపంచానికి చెప్పేస్తావా, అదీ ఇంగ్లీషులో రాసి" అని ఒకడి మీద నిప్పులు చెరిగితే, మరొకడ్ని "మాదగ్గర మురికివాడలుంటే నీకేంటి? 70 MM స్టీరియో సౌండ్లో ప్రపంచానికి చాటడానికి నువ్వెవడివి?(అదీ ఇంత బాగా)" అని తీవ్రంగా గర్హించేసారు. మనోళ్ళు జపించే మరో మంత్రం ఏమిటంటే, ‘ఈ రెండూ అభివృద్ధి పధంలో విలసిల్లుతున్న భారతదేశ పరిస్థితిని కించపరిచేవిధంగా పనిచేసాయి’ అని. ఇక్కడే నాకు ‘అత్త తిట్టినందుక్కాదుగానీ...తోడికోడలు నవ్వినందుకు ఈ మంట’ అనే సామెత గుర్తొచ్చింది.


మనదేశంలో ఆర్థిక అసమానతలుంటే ఫరవాలేదు. కానీ దానిగురించి మనం సరదాగా (ఈ నవల ఒక black comedy) కూడా మాట్లాడుకోకూడదు. కళ్ళెదురుగా మురికివాడలు. దుర్భరమైన జీవితాలూ అనుభవించే ప్రజలుండొచ్చు. కానీ వాటిగురించి ఎవరైనా గుర్తుచేస్తే మాత్రం మనకు సహించదు. సమస్యలు మనకు పట్టవు. వాటి గురించి ఎవరైనా ఆరాతీస్తేమాత్రం కోపమొస్తుంది. పైగా అది బయటోడు చెబితే ఇంకా మహచెడ్డ కోపమొస్తుంది. ఈ నవలా, సినిమా గొప్ప కళాఖండాలు కాకపోవచ్చు, కానీ మన మేకప్ వేసుకున్న మురికిముఖాల్ని మళ్ళీ చర్చల్లో బయటపడేలా చేసాయి. అసలు సమస్యనొదిలేసి falls prestige కోసం ప్రాకులాడే మన కుత్సిత మధ్యతరగతి మనోభావాల్ని బయల్పరిచేలా చేసాయి.


అభివృద్ధి ఫలాలు కనీసం వాసనచూడని లోకం మనదేశంలో ఉందని గ్రహించకపోతే, చీకటిలోనే మగ్గిపోతున్న బ్రతుకులు నడిబజార్లో కారు అద్దంపై టకటకా కొట్టి బిక్షమడుగుతున్నాయన్న స్పృహ లేకపోతే... మిగిలేది the great Indian Development story అనే ఎండమావి. ‘కుక్క'లకోసం, ‘పులుల’ కోసం మాత్రమే కొట్టుకుంటూ మనుషుల్ని మరిచిపోయే మన మరుభూమి సంస్కృతి. బహుశా మనకు అదేకావాలి. మనుషులకన్నా, సమస్యల్ని తీర్చే సమాధానాలకన్నా, కొట్టుకోవడానికి కారణాలే కావాలి. రండి కొట్టుకుందాం!


****

Monday, March 2, 2009

ఆంధ్రజ్యోతిలో ‘కలగూరగంప’ పరిచయం


బ్లాగుల్లో నేను క్రమం తప్పకుండా చదివే వాటిల్లో ఒకటి కలగూరగంప. నేను రాసిన ఆ బ్లాగు పరిచయం ఆంధ్రజ్యోతిలో ఈ ఆదివారం ప్రచురితమయ్యింది. అక్కడ చదవని వారికోసం ఇక్కడ....http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/mar/1navya3

పత్రికలో ప్రచురించిన దానితోపాటూ, నేను రాసుకున్న మరికొంత ఈ క్రింద చూడండి.

"నిజాయితీ లేని జాతికి ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే కంపెనీలున్నా ఉపయోగమేముంది ? ఈ దేశంలో నిజాయితీ, ముక్కుసూటిదనం, ప్రొఫెషనలిజం అనేవి ఇంత అరుదైన బ్రహ్మపదార్థాలుగా మారిపోవడానికి కారణమేంటి ? ఉన్నవాడూ నీచంగానే ప్రవర్తిస్తూ, లేనివాడూ నీచంగానే ప్రవర్తిస్తూ - ఇలా ఎంతకాలం ?" అంటూ 'సత్యం' ఘటనపై తన సూటైన ప్రశ్నల్ని వినిపిస్తాయి. "ఫెమినిస్టుల కథలో ఎల్లప్పుడూ ఆడదే ఏకకాలంలో కథానాయకుడు, కథానాయిక కూడా ! అలాగే ఆమె పాలిట మగవాడే ఎల్లప్పుడూ ఏకకాలంలో ప్రతినాయకుడు, హాస్యగాడు అవుతాడు. ఒక చెడ్డమగవాడు యావన్ మగజాతికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే ఒక మగవాణ్ణి చూసి అసలు మగజాతంటే ఏంటో ఇట్టే గ్రహించిపారెయ్యొచ్చు. కాని చెడ్డదని బయటపడ్డ ఒక ఆడది అందరు ఆడవాళ్ళకీ ప్రతినిధి కాజాలదు. ఆమె స్త్రీజాతికే కళంకం. ఎందుకంటే మిగతా ఆడవాళ్ళంతా చాలా మంచివాళ్ళు. వాళ్ళందరిలో ఒక తల్లినీ, చెల్లినీ మనం చూసుకోవాలి. వాళ్ళలో చెడ్డవాళ్ళు అరుదుగా ఉంటారు. ఒకవేళ ఏ స్త్రీ అయినా చెడ్డదైతే అందుకు మగవాడిదే బాధ్యత." అంటూ, ఫెమినిజంలోని నిజాల్ని నిగ్గదీస్తూ వ్యాసమొకటి పలకరిస్తుంది.

"
ఇది(సినిమా) వ్యాపారమైతే, అన్ని వ్యాపారాల్లో లాగే దీంట్లో కూడా ఒక ఉత్పత్తి, దాని అమ్మకందారు, కొనుగోలుదారు, ధరకు తగ్గ నాణ్యత, మన్నిక వగైరా అన్నీ చూసుకోవాలి కదా ! ఉత్పత్తిలో కొత్తదనమేదైనా ఉండాలి కదా ! మఱి ఏముంది ? అంటూ సినీపరిశ్రమ మూలసిద్ధాంతాల్ని అధారిటీగా ఆక్షేపించే పోకడలు కనిపిస్తాయి. "కెరియర్ కి పనికిరాని చదువులు వద్దని పెద్దపెద్దవాళ్ళే అంటూంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదొక రకం మానసిక నీచత్వాన్ని పనిగట్టుకుని ప్రమోట్ చెయ్యడంలా ఉంది. ఒకవేళ ఇంజనీరు కంటే రాళ్ళు కొట్టేవాడికి ఎక్కువ జీతం వచ్చే మాటైతే అందఱూ పొలోమని పోయి రాళ్ళు కొట్టే డిగ్రీకి లాంగ్‌టెర్మ్ కోచింగ్ తీసుకోవడానికి సిద్ధపడే వాతావరణం ఈ దేశంలో ఉంది." అంటూ మన వేలంవెర్రి విద్యావిధానాన్ని తూర్పారబడతాయి. "వ్యక్తిత్వంలో హేతుబద్ధత ఎంత పాత్ర పోషిస్తుందో అహేతుకత్వం కూడా అంతే పాత్ర పోషిస్తుందని నా అభిప్రాయం. ఎల్లవేళలా తనని తాను పక్కాగా హేతుబద్ధంగా నడుపుకునేవాడు తుదకు మరమనిషి కంటే పెద్ద భిన్నంగా పరిణమించడు. అతని అనుభూతుల క్కూడా మీటలూ, మీటర్లూ, గంటలూ, గడియారాలూ ఉంటాయి. మనుషులిలా మరమనుషులుగా మారిపోతారేమోననే భయంతోనే కాబోలు భగవంతుడు వారి వ్యక్తిత్వాల్లో బొత్తిగా హేతువుకు అందని వాంఛల పార్శ్వాన్ని ఉద్దేశ ఫుర్వకంగా జంతువుల కంటే చాలా హెచ్చు మోతాదులో మిశ్రితం చేశాడని తోస్తుంది. లేకపోతే జీవితం పట్ల విసిగి వేసారి మానవజాతి అంతా ఎప్పుడో ఆత్మహత్య చేసుకున్నా చేసుకుని ఉండేది." అంటూ ఒక వేదాంత చర్చకు ఆహ్వానం పలుకుతుంది. ఇలా ఎన్నోఎన్నెన్నో వైవిధ్యాలు అక్షరరూపం దిద్దుకునే బ్లాగు "కలగూరగంప"(http://www.tadepally.com/). పేరుకుతగ్గ బ్లాగు...బ్లాగుకు తగ్గ పేరు.

"ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక దేశభక్తియుత బ్లాగు" అని బ్లాగ్ముఖంగా ప్రకటించుకున్న ఈ బ్లాగులో ప్రకటనకు తగినట్లు సనాతన హిందూసాంప్రదాయాన్ని అత్యంత ప్రేమగా, సాధికారంగా, నమ్మకంగా, అప్పుడప్పుడూ తీవ్రంగా బ్లాగుబద్ధం చేస్తుండే బ్లాగు ఇది. ఉదాహరణకు "మన భాష, సంస్కృతి, మతమూ, దేశభక్తి ఈ గడ్డపై స్వతంత్రంగా జీవించేవారి మూలంగానే ఇప్పటి దాకా నిలబడుతూ వచ్చాయి. స్వతంత్రమైన వనరులున్నవారి మూలంగాను, వాటిని నిలబెట్టుకున్నవారి మూలంగాను అవి నిలబడుతూ వచ్చాయి. అంతేగాని ఉద్యోగాల పేరుతో ఇతరులకు ఉపయోగపడ్డంలోనే అహర్నిశలూ తలమునకలైనవారి వల్ల కాదు. దేశం బహుళ జాతీయ సంస్థల చేతుల్లోకి పోతోందని గగ్గోలు పెట్టేవారున్నారు. మనం ఉద్యోగాల పేరుతో బానిసలమైనప్పుడు, అందుకోసం మన పిల్లలకు పసితనం నుంచి తర్ఫీదు కూడా ఇస్తున్నప్పుడు ఇలా గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు. మనలో ప్రతి ఒక్కడూ వ్యక్తిగతంగా కట్టుబానిసైనప్పుడు మనందఱి యొక్క సమష్టి స్వరూపమైన దేశం మాత్రం స్వతంత్రంగా కొనసాగడం జరగదు" అంటూ ఈ బ్లాగరి నూరిపోసే స్వదేశీ ఉద్యమ భావన తన ప్రకటనను సార్థకతను చేకూర్చేదే!

ఇంత విస్తృత విషయపరిజ్ఞానం, ధృఢవిశ్వాసం తొణికిసలాడే బ్లాగు రాసేది తా.ల.బా.సు. గా బ్లాగుప్రపంచంలో పరిచయమున్న తాడేపల్లి లలితాబాలసుబ్రమణ్యం గారు. హైదరాబాదు నగర వాస్తవ్యులు. ఫోకస్ అడ్వర్టయిజింగ్ అనే సొంత సంస్దను నడుపుతుంటారు. వృత్తితోపాటూ అంతర్జాలంలో తెలుగీకరణను ఒక ప్రవృత్తిగా స్వీకరించి కృషి చేస్తున్నారు. వారి బ్లాగులో కూడా ఒక పక్క కంప్యూటర్ కు సంబంధించిన అమరికలు - settings,అంతర్జాలం - internet,అంతర్జాల అనుసంధానం, (జాలసంధానం) - internet connection వంటి ఆంగ్లపదాలకు తెలుగు అర్థాలు పెట్టడం వీరి అభిరుచికీ,తెలుగు భాషమీద ప్రేమకీ ఒక ఉదాహరణ అనుకోవచ్చు. అందుకే తెలుగు బ్లాగుల్లో ఇదొక ప్రత్యేకమైన బ్లాగు. చదివి ఆనందం,ఆవేశం తోపాటూ విజ్ఞానాన్నీ సమపార్జించుకోదగిన బ్లాగు.


****