Thursday, March 25, 2010

పెళ్ళికి ముందు సెక్స్ చట్టవ్యతిరేకం కాదు

మొన్న సుప్రీం కోర్టు  "పెళ్ళికి ముందు సెక్స్ చట్టవ్యతిరేకం కాదు" అని వ్యాఖ్యానించింది.
తమిళనటి ఖుష్బూ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని రద్దుచేస్తూ కోర్టు ఈ మాట అన్నది.

నైతికత - చట్టం అనేవి రెండు భిన్నమైన విషయలు. అనైతికత అనేది నేరం కావచ్చు కాకపోవచ్చు. అది ఆ దేశ చట్టాన్ని బట్టి ఉంటుంది. సుప్రీం కోర్టుకూడా పెళ్ళికి ముందు సెక్స్ చట్టానికి వ్యతిరేకం అన్నదిగానీ దాన్ని మేము ప్రోత్సహిస్తాము అనలేదు. కాబట్టి ఈ నేపధ్యంలో జరుగుతున్న హిందూసాంప్రదాయాలూ, పెళ్ళివ్యవస్థ, పురాణాలూ లాంటి చర్చలూ ఆవేశకావేశాలు చాలా వరకూ అర్థహితాలు.

ఈ చర్చల్లో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు;

ఖుష్బూ వ్యాఖ్యలమీద 2004 లో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం ఇప్పటికి విచారణకి వచ్చింది. ఆ విచారణలో జడ్జిచేసిన observations ఇవి. ఇది తీర్పు కాదు.

1. వయోజనులు పరస్పర అంగీకారంతో గంటలు, నిమిషాలు సంభోగంలో పాలొనచ్చు. అది చట్టవ్యతిరేకం కాదు.దాన్ని సహజీవనం అనరు. Living in is different from having sex.


2. వ్యభిచారానికి చట్టపరమైన నిర్వచనం ఉంది. అలాగే సహజీవనానికీ ఉంది. కాబట్టి రెంటినీ "చట్టపరంగా" confuse అవ్వాల్సిన పనిలేదు. మీకు నైతికంగా ఏమైనా సమస్య ఉంటే అది మీ సమస్య.
Section 125 of Criminal Procedure Code (CrPC)లో జరిగిన మార్పుల దృష్ట్యా భార్యకీ సహజీవనంలో ఉన్న భాగస్వామికీ సమానమైన హక్కులు కల్పించబడ్డాయి.So, it is legal to be in live- in relationships.

The Immoral Traffic (Prevention) Act or PITA వ్యభిచారాన్ని చాలా విశదంగా define చేస్తుంది.వేశ్యలకు ప్రైవేటుగా వ్యభిచారం చేసే హక్కు ఉంది. It is only offense if they solicit customers in public. వ్యవస్థీకృత వ్యభిచారం (బ్రోతల్)మాత్రం చట్టవ్యతిరేకం. ప్రస్తుతం ఆ చట్టాన్నికూడా మార్చి వ్యభిచారాన్ని decriminalize చెయ్యాలని మానవహక్కుల సంఘాలు ఉద్యమాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే చాలా మార్పులొచ్చిన ఈ చట్టం మరింత విప్లవాత్మక మార్పులు సంతరించుకోవచ్చు.

3.పెళ్ళి చేసుకున్నవాళ్ళు ఆ వ్యవస్థని అంగీకరించి దాని ప్రకారం జీవిస్తున్నారు. సహజీవనం పెళ్ళికి ప్రత్యామ్న్యాయం మాత్రమే. పెళ్ళి అనేది ఎలాగైతే ఒక choice అవుతుందో సహజీవనమూ అదేవిధమైన choice. కాబట్టి ఇక్కడ ఒక వ్యవస్థని అంగీకారాత్మకంగా స్వీకరించినవాళ్ళు మరో వ్యవస్థ "రుచి చూసి" ఆనందించడానికి రావడం భావవైశాల్యం అవదు...దాన్ని భావదారిద్ర్యం అంటారు.

Life style is a choice. పెళ్ళి అనే వ్యవస్థని పూర్తిస్పృహతో అంగీకరించినవాళ్ళు సహజీవనాన్ని సరదా కోసం చెయ్యడం వాళ్ళ వ్యక్తిత్వంలోని బలహీనతను సూచిస్తుంది లేదా వారి అవగాహనారాహిత్యాన్ని సూచిస్తుంది. అలాంటి వాళ్ళు పెళ్ళి వ్యవస్థలోంచీ బయటకొచ్చి సహజీవనాన్ని ఎంచుకోవడం మంచిది.

విడాకులు సులువుగా లభ్యమయ్యే ఈ కాలంలో they can surely chose one over other.They also have a right to switch between both institutions by choice. కానీ అవ్వాకావాలి బువ్వా ఒకేసారి కావాలి అంటే దాన్ని భావదారిద్ర్యంకాక ఏమనాలి?

3. అక్రమసంబంధం నేరం కాదు. అక్రమసంబంధం" అనేది politically correct పదం కాదు. ‘వివాహేతర సంబంధం’ అనేది సరైన పదం.

కోర్టువారు రాధాకృష్ణుల ఉదాహరణ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలగురించి perceived morality ధోరణిలో (పురాణాలను సాంప్రదాయాలనూ ఉటంకిస్తూ) కొనసాగుతున్న లాయర్ వాదనను త్రోసిపుచ్చడానికి చెప్పినది మాత్రమే. That is part of the argument/observation NOT "judgment". భార్య భర్త మీద అక్రమసంబంధం నెరుపుతున్నాడనే నెపంతో విడాకులు మాత్రం కోరొచ్చు.

సహజీవనానికి చట్టబద్ధత వచ్చినా, వయోజనులు శృంగారసంబంధాలు పెట్టుకోవడం చట్టవ్యతిరేకం కాదన్నా అవి "పెళ్ళి" అనే వ్యవస్థకు వ్యతిరేకం కాదు. కేవలం పెళ్ళి కాకుండా ఇప్పటికే అమలులోవున్న మరికొన్ని alternate వ్యవస్థలకు ఆమోదం మాత్రమే. దీనివల్ల భారతీయ సంస్కృతికొచ్చిన ప్రమాదమూ లేదు. పెళ్ళి వ్యవస్థకొచ్చిన ముప్పూలేదు.

****

Tuesday, March 23, 2010

నా నాస్తికత్వానికి కారణాలు

భగత్ సింగ్



Why I am an Atheist? - Shaheed Bhagat Singh

LSD – హిందీ సినిమా పెద్దమనిషి అయ్యింది !

మొన్న రాత్రి సెకండ్షో చూసొచ్చాను.
సినిమా పేరు ‘లవ్ సెక్స్ అన్డ్ ధోకా’.
సినిమా ప్రారంభమగానే పేర్లుపడుతన్నప్పుడు కాసేపు నవ్వుకున్నాను.
తరువాత అబ్బురపడ్దాను…
ఫిల్మ్ మేకర్ ఆలోచనను అభినందించాను.
సినిమాను ఆనందించాను.
సినిమా అయిపోయిందేమో అనిపించినప్పుడు ‘పక్కవాళ్ళు ఏమనుకుంటారో’ అని చూడకుండా చప్పట్లు కొట్టాను.
కానీ నాతోపాటూ థియేటర్లో చాలా మంది చప్పట్లు కొట్టడంతో ఈ సినిమా పవరేమిటో అర్థమయ్యింది.
రాత్రి నిద్రపట్టింది.
నిద్ర లేచి ఇదొక మాస్టర్ పీస్ అని డిసైడ్ అయ్యాను. ఇంకా ఆ సినిమా "షాక్" లోనే ఉన్నాను.

మాస్టర్ పీస్ అనగానే సత్యజిత్ రే లా ఉంటుందా లేక గురుదత్ లా ఉంటుందా? కనీసం ఆదిత్య చోప్రా లా ఉంటుందా? అని అడక్కడి. ఎందుకంటే మాస్టర్స్ ఎవరూ మరొకర్ని ఇమిటేట్ చెయ్యరు. దిబాకర్ బెనర్జీ అలాంటోడే. ఇప్పటి వరకూ తను తీసి చిత్రాలు “కల్ట్” చిత్రాలుగా నిలబడితే LSD ఖచ్చితంగా ఒక మాస్టర్ పీస్ అనే విషయంలో నాకు మాత్రం ఎటువంటి సందేహం లేదు.
కాబట్టి ఇక్కడ సమీక్ష రాయడం లేదు. సినిమా చూడమని మాత్రమే చెబుతున్నాను. Just go watch it.




****

Monday, March 22, 2010

పశువధ - గొడ్డుమాంసం

కర్ణాటక ప్రజలకు శుభవార్త...త్వరలో చికెన్, మటన్ ధరలు ఆకాశానికంటి ఆదివారమైనా ముక్కముట్టలేని పరిస్థితి రానుంది.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పశువధలపై బ్యాన్ విధించింది.
ఒక అడుగు ముందేసి పశుమాసం ఉన్నా,తిన్నా, అమ్మినా దాన్ని నేరంగా పరిగణిస్తూ ఏడుసంవత్సరాల వరకూ శిక్షను ప్రతిపాదించింది.
ఈ బ్యాన్ అప్రజాస్వామికం అన్న ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం "రాష్ట్రంలోని పశుసంపదను కాపాడాలంటే ఈ చట్టం తప్పదు"ఆని.
నిజమే...ఎకలాజికల్ సమతౌల్యాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న చాలా విపరీతమైన పరిణామాల్ని అడ్డుకోలవసిందే.
దానికి నీరు, మట్టి, గాలి,చెట్టుతో పాటూ  పశుసంపదను కాపాడాల్సిందే.
కానీ ఈ నిర్వచనంలో వచ్చే ‘పశువు’లో గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులూకూడా వస్తాయి.
కానీ చిత్రంగా ఈ హిందుత్వ బీజేపీ ప్రభుత్వానికి ఇవేమీ కనిపించలేదు.
కేవలం "ఆవు" మాత్రమే కనిపించింది.
నిజానికి ఇప్పటికే అమలులో ఉన్న Prevention of Cow Slaughter and Cattle Preservation Act, 1964 మరింతగా ఉపయోగరమనే వాదన ఉంది.
ఎందుకంటే, అందులో ఆవులతోపాటూ పాలిచ్చే గేదెల్ని చంపడాన్ని చట్టవ్యతిరేకంగా పరిగణించింది.
సమస్య పాల ఉత్పత్తి అనేవాదన కొందరు వినిపించినప్పటికీ ఒట్టిపోనంతవరకూ ఆవుల్ని ఎవరూ చంపరనే ఇంగితజ్ఞానం చాలు ఈ వాదనకు చుక్కలు చూపించడానికి.
మొత్తానికి బీజేపీ ప్రభుత్వం తన హిందుత్వ అజెండాని ముందుపెట్టి మఠాల్ని, అగ్రకుల మైనారిటీలను సంతృప్తిరిచే బాటపట్టింది.
మాంసం తినే అగ్రకుల హిందువుల్ని బుజ్జగిస్తూనే గొడ్డుమాంసం తినే దళితులు, ముస్లింమైనారిటీలు, విదేశీయుల హక్కుల్ని విజయవంతంగా ఈ బ్యాన్ కాలరాసింది.
మరీ ముఖ్యంగా చికెన్, మటన్ తినలేని పేదకు అందుబాటులో ఉండే పౌష్టికాహారమైన గొడ్డుమాంసాన్ని చట్టవ్యతిరేకం చెయ్యడం ద్వారా ఈ ప్రభుత్వం సాధించిందేమిటో ప్రశ్నార్థకమే.
ఇలాంటి కేసుల్లో ఏడుసంవత్సరాల జైలు శిక్ష ప్రతిపాదించడం మరో హాస్యాస్పదమైతే తలాతోకా లేని ఈ చట్టం హిందుత్వ అజెండాని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి భవిష్యత్తులో రాజకీయంగా పనికొస్తుందనుకునే బీజేపీ తెలివితక్కువతనం మరో జోకు.

****

Thursday, March 18, 2010

ఆమె వెళ్ళిపోయిన రోజు

ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను
కౄరమైన పిచ్చిగాలి చెంప పగులగొట్టాను
ముక్కలైన జీవితాన్ని చేతికెత్తుకున్నాను
పగిలిన అద్దం ముందు నగ్నంగా నిలిచాను
నా మీద నాకే ఆవేశం
హుందాగా సూర్యుడ్ని "మూర్ఖుడా" అని తిట్టాను
రంగుల లోకపు వైతాళికులకు వెతికివెతికి "థూ" అన్నాను
తూర్పునుండీ పడమరకు చెప్పులులేకుండా నడిచాను
దారిలో పడి ఉన్న కంకరరాళ్ళను మీద చల్లుకున్నాను
విభ్రమ స్ఫూర్తితో కొండకోనల్ని చీల్చిపారే నీటికి
ఏ సముద్రం చేరే కోరికో?
లేదా,మందగతిన ఇసుక ఒడిలో కూరుకుపోయే నిర్వేదమో
నాలోనేను లేనన్నది ప్రశ్న
ఇక ఆమెకళేబరాన్ని అక్కునచేర్చుకుని రోదించేదెట్లా?
ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను

మరాఠీ మూలం: నామ్ దేవ్ ఢపాళ్
ఆంగ్లానువాదం: దిలీప్ చిత్రే
తెలుగుసేత: హరీష్. జి.



(హృద్యమైన కవితను అనువదించిన  మితృడు హరీష్ కు అభినందనలు. )
****

Thursday, March 11, 2010

ఆ వ్యాఖ్యలు నావి కావు

పానశాల, పైత్యం బ్లాగుల్లో నా పేరుతో వస్తున్న వ్యాఖ్యలు నావి కావు. ఆ బ్లాగుల్లో నేను వ్యాఖ్యలు రాయను. Because they mean nothing to me.

నా పేరు, మెయిల్ ఐడి, బ్లాగు URL వివరాలు ఉపయోగించుకుని కొందరు impostures are trying play mischief. ఇప్పుడు వీళ్ళపైత్యం ముదిరి మహిళా బ్లాగర్ల ఐడిలు కూడా ఉపయోగించి వ్యాఖ్యలు రాస్తున్నారు. I condemn it.

కూడలిలోకి ఈ ప్యారడీబ్లాగులు (మళ్ళీ)రావడాన్ని నేను స్వాగతిస్తున్నాను. నామీద వ్యక్తిగతంగా జరుగుతున్న దాడిపై నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న హంగామాతో నాకొచ్చేనష్టం ఏమీ లేదు. నిజానికి వీళ్ళ వెధవతనం మరింతగా జనానికి తెలిసేఅవకాశం ఎక్కువ. కాబట్టి I Actually wish they can sustain for longer period than they did earlier.

భారతీయ సంస్కృతిని, హిందూమతాన్నీ కాపాడటానికి నా భావజాలంతో పోరాడ్డానికి వచ్చామని చెప్పుకుంటున్న ఈ పైత్యవాదుల తాగుబోతుల వీరంగం ఎప్పుడూ సభ్యమైన హద్దులో ఉండదు. ఎందుకంటే వీళ్ళకు తెలిసిన సంస్కృతి, మతం యొక్క స్థాయి అదే. So, I welcome them to make my points much more valid and just.


**** 

Tuesday, March 9, 2010

నగ్న దేవతలు

దేవతల్ని నగ్నంగా చిత్రించడం హిందూసాంప్రదాయమే కాదని కొందరు వాదించారు. కళ్ళముందు ఆధారాలున్నా కాదనే మూఢులకు చెప్పడానికి కాదుగానీ తెలీనివాళ్ళకు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలని కొన్ని ఇక్కడ పెడుతున్నాను. ఇప్పటికే వీటిని కలెక్ట్ చేసిపెట్టిన మిత్రుడికి అభినందనలతో....

A super-hero Hanuman holding Sita, by the Ravi Varma Press, 1910's



Goddess Saraswati Seminude  


Warangal, Bhadrakali Temple
  

Shiva Uma


Nude Goddess from 10th Century AD 


Erect Shiva Linga 


Goddess Lajja Gowri 


Chandela Temple 


Contemporary Artist’s Hindu Goddess 


Shiva’s Female Form 


Kali 


Krishna being playful 


Nude Ravana 

 
Rati Manmatha

నువ్వెళ్ళిపో ప్రియా !


నువ్వెళ్ళిపో ప్రియా
నన్ను నాకలల్ని మూటకట్టుకోనీ
నీతోగడిపిన గతసంవత్సరాల్ని ఎక్కడపెట్టానో వెతకనీ
ఆ తెగినదారాల అల్లికను కనిపెట్టనీ
ఆ పగిలిన ముక్కల్ని ఎక్కడ తోసేశానో చూడనీ

హమ్మయ్య ! దొరికాయి. అవింకా కొత్తగానే ఉన్నాయి
బయట ట్యాక్సీ ఎదురుచూస్తోంది
అందులో నీకు మాత్రమే స్థలముంది 

నువ్వెళ్ళిపో ప్రియా!

(మూలం స్పైక్ మిలిగన్ )



ఈ రోజైనా...

ఈ రోజైనా మహిళా బిల్లు పాసయ్యేనా !

***

Monday, March 8, 2010

మనోభావాలు గాయపర్చుకుందాం రా!

ఎమ్.ఎఫ్ హుస్సేన్ కతార్ పౌరసత్వం తీసుకోవడంతో మళ్ళీ చర్చలు మొదలు.
కొందరు అన్యాయం అంటే, మరొ కొందరు అక్రమం అన్నారు. కొందరు తగినశాస్తి అనుకుంటే ఇంకొందరు ముసలోడు చస్తే పీడాపోతుందనుకున్నారు.

విషయమంతా ఈ కళాకారుడు హిందూదేవతల్ని "నగ్నంగా" చిత్రించాడన్న వంకతో మొదలయ్యింది.
ఆర్టుగ్యాలరీల ముఖమైనా చూడని కొందరు ఎవరో చెప్పిన హిందుత్వ అజెండా ప్రాపగాండాతో అర్జంటుగా మనోభావాలు గాయపర్చేసుకున్నారు.
నిజంగా సమస్య నగ్నత్వం అనుకునేవాళ్ళు ఉన్న దేవాలయాలన్నింటినీ పడగొట్టెయ్యాలి. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో ఉన్నవన్నీ మొదటిగా నేలమట్టం చేసెయ్యాలి.
దేవాలయాల చుట్టుపక్కలనుంచీ పూజలందుకునే ఉత్సవ విగ్రహం వరకూ పాతికో ముప్పాతికోవంతు నగ్నంగానే ఉంటాయి మరి!
నిజానికి పూర్తిగా బట్టలేసుకున్న హిందూ దేవతలు 19 వ శతాబ్ధంలో రాజారవివర్మ క్రియేషన్.
ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగంలోకి రావడం వలన, దానిద్వారా కమర్షియల్ ఆర్ట్ ను పెంపొందించే భాగంగా రూపిందించబడిన శైలి అది.
అంటే ఈ గొడవంతా నిజమైన హిందూ ఐకనోగ్రఫీని పక్కనబెట్టి రాజారవివర్మ కళాసృష్టిని మాత్రమే ప్రామాణికంగా ఎంచుకుంటున్న కొందరి తెలియనితనమే తప్ప మరొకటి కాదు.

 ఎట్టకేలకు కాటికి కాళ్ళుజాపుకున్న హుస్సేన్ (95 ఏళ్ళ వయసువాడు మరి) దేశం వదిలి పోవాల్సి వచ్చింది. ఇందులో మూర్ఖత్వంతో మనోభావాలు దెబ్బతీసుకున్నాళ్ళకన్నా ఇలాంటి పిచ్చిచేష్టలు జరుగుతున్నా ఏమీ చెయ్యక చేతులుకట్టి కూర్చున్న ప్రభుత్వాలది పెద్దతప్పుంది. ఇప్పటివరకూ క్రైస్తవ, ఇస్లాం మతాల్లో మాత్రమే కనిపిస్తూవస్తున్న ఈ ఉన్మాదం ఈ మధ్యకాలంలోనే హిందూమతానికీ పాకింది. నియో-హిందుత్వ భావజాలంలో మునిగిపోతున్న కొందరి పైత్యం కారణంగా సృజనాత్మక స్వాతంత్ర్యం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. అభిలషణీయం కాని ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి చేటు మాత్రం ఖచ్చితంగా చేస్తాయి.

****

సిల్లీ కవిత

Said Hamlet to Ophelia,
I'll draw a sketch of thee,
What kind of pencil shall I use?
2B or not 2B?
             -
Spike Milligan

నీ బొమ్మ గీస్తానన్నాడు
ఒఫీలియాతో
హేమ్లెట్
ఏ పెన్సిల్ ఉపయోగించను?
2B
or not 2B...?






 

షేక్స్పియర్ ‘హేమ్లెట్’ పాత్రలోని అసంబద్ధ సంధిగ్ధతను ఇంత సిల్లీగా (అంతే లోతుగా) ఎత్తిచూపిన కవి మరెవరూ లేరేమో! That's Spike Milligan
***

Friday, March 5, 2010

బ్లాగుస్వాములతో జాగ్రత్త!

కల్కి భగానుడు, నిత్యానందుడి కథలు నైతికతపేరుతో ఖండింస్తూ దాంతో మాకు సంభంధం లేదు అని భుజాలు తడుముకునే బ్లాగుస్వాములతో జాగ్రత్త!

పూజచేస్తే పరీక్ష్జల్లో పాసవుతారు. తాయెత్తు పంపిస్తా అడ్రసివ్వండి. మీపేరు మీద పూజచేయిస్తా గోత్రంచెప్పండి. దేవీ కుంకుమ పంపిస్తా పిల్లలకు పెట్టండి. అంటూ ఇలాంటోళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూనే స్వామీజీలుగా ఎదుగుతారు. చుట్టూ వీళ్ళకి భజనమండలి ఖచ్చితంగా ఉంటుంది. "ఏం చెప్పారు సార్", "సరిగ్గా చెప్పారు గురువు గారూ" అంటూ యమభజన వీళ్ళ తరహా, నమ్మామో నట్టేట మునిగినట్లే.

మతాన్ని నమ్మే చదువుకున్న మూర్ఖులు వీళ్ళ టార్గెట్. ఎలాగూ రెడీగా శఠగోపం పెట్టించుకోవడానికి ఉంటారు కాబట్టి వాళ్ళు మోసపోయే అంతవరకూ నమ్ముతూనే ఉంటారు. కానీ అటూఇటూ తేల్చుకోలేకుండా ఉండే చాలా మందిలోని బలహీన క్షణాల కోసం వీళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటోళ్ళు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. మొదట్లో బాగున్నా, మత్తులో పడింతర్వాత ఇంతేసంగతులు చిత్తగించవలెను.

వీళ్ళ తరహా ఎలా ఉంటుందంటే...మత మారిన హిందువుని చంపెయ్యమంటారు. కానీ వేరే మతస్తుడు "మీ దయతో అమ్మను నమ్ముకున్నాను సార్" అంటే "చూడు హిందూమతం గొప్పతనం" అని చంకలు గుద్దుకుంటారు. ఇలాంటి మోసగాళ్ళాతో మతవ్యాపారస్తులతో, జాగ్రత్త. వీళ్ళదగ్గర భూడిదతప్ప జీవితం ఉండదు. మోసం తప్ప నమ్మకం ఉండదు. అందుకే వీళ్ళు నమ్మకద్రోహాలు చెయ్యడానికే ఉంటారు. కాస్త తర్కం ఉపయోగిస్తే వీళ్ళకు అదురు బెదురు. వీళ్ళతో జాగ్రత్త.

తస్మాత్ జాగ్రత్త. ఇంటర్నెట్లో స్వాములు అవతరించారు. బ్లాగులద్వారా ప్రచారాలు చేస్తుంటారు. తస్మాత్ జాగ్రత్త.

****

Thursday, March 4, 2010

అద్దమాడిన అబద్ధం

చిక్కుబడిన జుట్టుని
అద్దం ముందు విడదీస్తోంది అమ్మాయి
‘నువ్వొట్టి అనాకారివి’ అంది అద్దం

అమ్మాయి చిన్నగా
నవ్వుకుంది
ఆ రోజ ఉదయమే
రోడ్డుదాటించాక
‘నువ్వెంత అందమైనదానవో’
అన్న గుడ్డిపిల్లాడి మాటల గుర్తొచ్చి

(మూలం: స్పైక్ మిలిగన్)

****

ఎవరొస్తారో !


నా నేరం తెలీకుండానే
నన్ను శిక్షించారు

యావజ్జీవ ఖైదు
తనులేకుండా...

చాలా చిత్రమైన విచారణ.
జడ్జిలేడు
జ్యూరీలేదు

ఇక్కడికి విజిటర్లుగా ఎవరొస్తారో!
చూడాలి.

(మూలం : స్పైక్ మిలిగన్ )
****

Wednesday, March 3, 2010

వరుసగా పడిన వికెట్లు - హిందూమతం పై కుట్ర

కుహానా లౌకికవాదులూ హిందూ వ్యతిరేక శక్తుల కుట్రల ఫలితంగా పవిత్రమైన స్వాములందరి మీదా "నీలి"నీడలు కమ్ముకుంటున్నాయి. హిందువులందరూ ఒక్కతాటిపై నిలబడి ఈ అన్యాయాన్ని అడ్డుకోండి. ఈ కుట్రని ఛేధించి హిందూమతాన్ని కాపాడుకోండి.రండి....హ హ హ!
***