Sunday, February 28, 2010

తెలుగుజాతి మనది - మూడుగ వెలుగుజాతి మనది


జై తెలంగాణా! జై ఆంధ్రా !! జై రాయలసీమ!!!

Tuesday, February 16, 2010

రహస్యపు రాతలు


రాయడం అలవాటైన తరువాత ఆపడం కష్టం.
రాసింది పంచుకోవడం మొదలైన తరువాత, రహస్యంగా రాతల్ని ఉంచుకోవడం మహా కష్టం.
ప్రస్తుతం ఆ రహస్యపు రాతల్లో పడ్డాను.
సినిమాకు రాయడం, సినిమాకోసం రాయడం, సినిమా తియ్యాలనుకుని రాసుకోవడం ఇవన్నీ రహస్యపు రాతలే.
రహస్యంగా ఉంచకపోతే కొన్నాళ్ళతరువాత "నా కథ కాపీ కొట్టారు" అంటూ నేనూ కోర్టులో కేసో లేకపోతే ఏ టెలివిజన్ ఛానల్లో పోట్లాడుతూ కనిపించాలి మరి!

కాకపోతే ఒక్క నిజం.
"కథలు లేవు కథలు లేవు" అని సినిమావాళ్ళు అనడం శుద్ధ అబద్ధం.
ఉన్నకథల్ని సినిమాకు పనికిరావని వీళ్ళనమ్మకం.
అది తియ్యడం చేతగాని వీళ్ళ అసమర్ధత అని మాత్రం అస్సలు నమ్మరు.
కొత్తగా కథేదైనా చెబితే, "మన హీరోకి పనికి రాదే" అనేది మరో సందేహం.
నిజమే...మంచి కథలకు నటులు కావాలిగానీ అవి మన హీరోలకు పనికొస్తాయా?
ఒకవేళ కథ నచ్చినా..."ఇది కమర్షియల్గా సక్సెస్ అవుతుందంటారా!" అనేది మరో ధర్మసంకటం.
ఒక విధంగా చూస్తే ఇదొక చచ్చు సంకటం.
ఏ సినిమాని గ్యారంటీ సక్సెస్ అని ఎవడు మాత్రం చెప్పగలడు ఈ పరిశ్రమలో?
అనుకున్న కథను నమ్మాలి. దాన్ని జనరంజకంగా కాకపోయినా మనోరంజకంగానైనా తియ్యగలలిగే సత్తా ఉండాలి.
ఇవి రెండూ లేకపోతే...మనం ఎన్ని కథలు చెప్పినా ఏంలాభం!?!


****

Tuesday, February 9, 2010

ఎత్తు - The Highest Place

అక్కడికెళ్ళాక
నాకు భయమనిపించింది

పురజనులారా! ఎంత దారుణం!!
ఈ నగరంలోని మెట్లన్నీ
ఏ ఎత్తుకు చేరాలనుకుంటాయో
అక్కడ... ఎవ్వరూ లేరు






When I got there
I was afraid.

People of my city
it is terrifying to discover
   that all the steps
      of the city
         lead up to
            this place
               where no one lives. 
- కేదార్నాథ్ సింగ్

మంచి కవిని పరిచయం చేసిన బొల్లోజుబాబా గారికి కృతజ్ఞతలు
 ****

Friday, February 5, 2010

తాడేపల్లిగారి తాగుడు లెక్కలు

తెలుగు బ్లాగుల్లో చరించే జనులకు తాడేపల్లిగారు చాలా సుపరిచితులు. అడపాదడపా లావుపాటి టపాలు రాసి బ్రాహ్మణ్యాన్నీ, హిందుత్వాన్నీ,తెలుగు భాషనీ రక్షించేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వీరు మోస్తున్న నినాదం...సమైక్యాంధ్ర అనడంకన్నా, తెలంగాణాపై దయ అనుకోవడం బెటరనుకుంటాను. ఎందుకంటే బలవంతంగానైనా తెలుగోళ్ళందరినీ ఒకటిగా ఉంచి తెలుగు సంస్కృతిని ఉద్దరించాలనే ఉద్దేశం లిప్ సర్విస్ గా వీరు చెప్పినా, వారి టపాల్లో జాలువారేది మాత్రం (వారి ఉద్దేశంలో) అనాగరికులైన తెలంగాణా వాళ్ళను ఆయనగారి కోస్తా నాగరికతతో ఉద్దరించడం. వేరుపడినా తెలంగాణా వారు వారికున్న అనాగరికమైన,సంస్కృతి విహీనమైన సాంప్రదాయాలతో ప్రగతి సాధించలేరు అనే అపోహల్ని విద్వేషాపూరితమైన వ్యాఖ్యానాలతో నాగరికమైన భాషతో చెప్పడం. ఈ పరంపరలో భాగం ఈ మధ్య కొన్ని తాగుడు లెక్కలు చెబుతూ తెలంగాణా ప్రజల్ని కలిసికట్టుగా తాగుబోతుల్ని చేసిపారేశారు.

"లెక్కల్లో చాలా బొక్కలున్నాయి స్వామీ" అంటే అవసరమైతే నీలెక్కలు నువ్వుతెచ్చుకో నాకు తెలిసింది మాత్రం పరమసత్యమే అని భీష్మించారు. నేనూ వెతుకుదాము అనుకుంటుండగానే "కల్నల్ ఏకలింగం" ఆ లెక్కల్ని పట్టుకొచ్చారు. వాటిని ఇక్కడ మీకోసం ఇస్తున్నాను. దానితోపాటూ తాడేపల్లిగారి స్టేట్మెంట్ కూడా.

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ నుండి తాగుడు ద్వారా వస్తున్న ఆదాయాన్ని (రాష్ట్రం యొక్క మొత్తం ఎక్సైజ్ ఆదాయంలో 60 శాతానికి పైనే) గమనిస్తే తెలంగాణ నిండా మద్యపానవ్యసనం (ఆడవాళ్ళు కూడా మినహాయింపు కాదు). ఇహ తెలంగాణ ఎలా బాగుపడుతుంది, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా ?"
                                                                                 - తాడేపల్లి


మన రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా 2005-06 వ సంవత్సరంలో వచ్చిన ఆదాయం 2,684.57 కోట్లు. అందులో, కోస్తాంధ్ర నుండి వచ్చిన ఆదాయం 496.8 కోట్లు (ఒక్కో జిల్లాకు సగటున 55.2 కోట్లు), రాయలసీమ నుండి వచ్చిన ఆదాయం 208.16 కోట్లు (ఒక్కో జిల్లా సగటు 52.04 కోట్లు), తెలంగాణ నుండి వచ్చిన ఆదాయం 1978.61 కోట్లు. అయితే ఈ తెలంగాణ ఆదాయంలో కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి 1778.13 కోట్లు వచ్చింది. మిగతా ఎనిమిది జిల్లాల నుండి వచ్చిన ఆదాయం 200.48 కోట్లు (ఒక్కో జిల్లా సగటు 25.06 కోట్లు).

క్రితం సారి జరిగిన మద్యం దుకాణాల వేలం పాటలో అత్యధిక ధర పలికిన ప్రాంతాలు అమీర్ పేట్, కూకట్ పల్లి. అక్కడ వైన్ షాప్ లకు అంత గిరాకీ ఎందుకో, అక్కడ ఎవరుంటారో అందరికీ తెలుసు. కారణం నేను చెప్పక్కర్లేదు.

ఇక తెలంగాణాలోని, మహబూబ్ నగర్ (12.84 కోట్లు), నిజామాబాద్ (12.59 కోట్లు), ఆదిలాబాద్ (17.54 కోట్లు), కరీంనగర్ (30.75 కోట్లు), వరంగల్ (27.63 కోట్లు), ఖమ్మం (16.78 కోట్లు), నల్గొండ (22.41 కోట్లు) జిల్లాలా ప్రజలందరూ కలిసి త్రాగేది (140.54 కోట్లు) ఒక్క కృష్ణా జిల్లా (139.16) ప్రజలు త్రాగేదానితో సమానం. ఇదీ మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు.

ఇప్పుడు చెప్పండి. రాష్టంలో త్రాగుబోతులెక్కడ ఎక్కువగ ఉన్నరు. ఒక ప్రాంత ప్రజల మీద నిస్సిగ్గుగా నిరాధారమైన ఆక్షేపన చేయాలని మీకెలా అనిపించింది? మీరిక్కడ హరికథ చెప్పడం లేదు మధ్యమధ్యలో మీకిష్టం వచ్చిన పిట్టకథ చెప్పడానికి. ఒక ప్రాంత ప్రజలను అవమానిస్తూ రాస్తున్నప్పుడు కొంచెం ముందూ వెనకా చూసుకోకక్కరలేదా?
                                                                                                                                - కల్నల్ ఏకలింగం

తాడేపల్లిగారు తమ టపాలో చెప్పుకొచ్చిన రహస్యపత్రం క్రిందుంది. చదువుకొని ఆయనమీద కాస్త సానుభూతి తెచ్చుకోవలసిందిగా ప్రార్థన.


Andhra Valasa Palanalo Telangana

Wednesday, February 3, 2010

నువ్వు - నేను

నువ్వు నువ్వుగా ఉన్నందుకు
నిన్ను నేను కోల్పోయాననుకున్నాను
ఇప్పుడే తెలిసింది...
నేను నేనుగా మిగిలినందుకు
నిన్ను నేను కోల్పోయానని

Loss

I thought I lost you
because you were you
but now I know
I lost you
because I was I

                   - Shekhar kapur


****