Sunday, October 31, 2010

I am no way ashamed of my hatred

Thursday, October 28, 2010

హైదరాబాద్ - 2012

Tuesday, October 26, 2010

దళితులపై దౌర్జన్యాల మీద లండన్ లో ఫోటోఎగ్జిబిషన్


The little girl is Kamlesh. She was just seven when she was pushed on to a pile of burning rubbish as she was walking with her mother. Kamlesh is a Dalit, and her scars are a constant reminder of the "punishment" she received for using a road reserved for "high-caste" people.

 అక్టోబర్ 18 -23 వరకూ లండన్ లోని HOST గ్యాలరీలో భారతదేశంలోని దళితులపై జరుగుతున్న హింస, దౌర్జన్యాల సజీవ చిత్రాలు ప్రదర్శితమౌతున్నాయి. దళితుల పరిస్థితి గురించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి సరైన సమాచారాన్ని అందించడానికీ ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది.

Marcus Perkins అనే ఫోటోగ్రఫర్ తీసిన ఫోటోలు ఈ ప్రదర్శనలో ఉంటాయి.

"దళితులపై దౌర్జన్యాలు ఎక్కడ జరుగుతున్నాయి ?" అని ప్రశ్నించే అర్బన్ భ్రమలను పటాపంచలు చేసే ప్రదర్శన ఇది. కులం/మతం ప్రాతిపదికన అమానవీయంగా వ్యవహరించే భారతీయ సంస్కృతి అసలు నిజాన్ని అంతర్జాతీయ స్థాయిలో నగ్నంగా నిలబెట్టే ప్రయత్నం ఇది.

ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి అతిధిగా, చెన్నై కి చెందిన ప్రముఖ దళిత కవి మీనా కందస్వామి మాట్లాడుతూ ..."You realize this is something you should work on, something that has to be changed, It challenges your idea of hope and justice. It challenges your idea of any good future for the country,"అనడం గమనార్హం.

****

Monday, October 25, 2010

కాశ్మీరానికి స్వతంత్ర్యం


"India needs azadi from Kashmir as much as Kashmir needs azadi from India."
- Arundhti Roy, TOI



 

Seeking better governance has nothing to do with aspiration for being separate. Both need not necessarily cancel each other out. Kashmirs participated in electoral politics to make their civic life better. That is no approval for a military rule by Indian state. Their aspiration for separate-independent state are always alive. Forceful nationalism is surely wrong. Forcing others for nationalism is a crime. That's what Indian state has done in Kashmir.

****

Sunday, October 24, 2010

క్రైస్తవ మతోన్మాదం

మతపిచ్చి మనిషిని పతనం చేసే మౌఢ్యం.మనదేశంలో ఈ పిచ్చి హద్దూపద్దూ లేకుండా పెరిగిపోతున్న మాట నిజం.రాజకీయనాయకుల. ధనవంతుల అండ దీనివెనుకాల ఉంది.రగులుతున్న సమస్యల్లో ఈ చాదస్తం కూడా
ఒకటి.దేశభవిష్యత్తుకు,సమాజప్రగతికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్న తక్షణ సమస్య మతం.


ఏమతమైనా...మౌడ్యం మాత్రం అదే...





Thursday, October 21, 2010

టాయ్ లెట్ కెళ్దాం రా!

గ్రామీణ ప్రాంతాలలో లెట్రిన్ అనే విధానమే కొత్త. అంగీకారం, నిర్మాణం, ఉపయోగం, జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవడం వంటి చాలా క్లిష్టమైన మార్పుల దిశగా ఈ విధానాన్ని పరిచయం చెయ్యాలి. అంతేకాక ప్రజారోగ్యానికీ, శానిటేషన్ కీ గల సంబంధం వలన అత్యంత ఘోరంగా నష్టపోతున్న వీరికి ఆ సంబంధాన్ని తెలియజెప్పి ఈ personal behaviour ని మార్చడం ఒక పెద్ద ఛాలెంజ్.

అంతేకాక నీటికటకటతో తమతమవుతున్న పల్లెల్లో ఫ్లష్ పెడితే అది సమస్యాత్మకం అవుతుంది. అందుకే పోర్ ఫ్లష్ ద్వారా కేవలం నాలుగు లీటర్ల నీటితో పనయ్యే విధానం పరిచయం చెయ్యబడింది. 45 డిగ్రీ టాయ్ లెట్ ప్యాన్ ద్వారా ప్రవాహవేగం పెరిగి త్వరగా శుద్ది అయ్యే మార్గం లభించింది.

పట్టణాలలో ఈ సమస్య యొక్క రూపం వేరు. ఇక్కడ అది మానసికత సమస్యగా కాక ఒక పరిపాలనా సమస్యగా పరిచయమౌతుంది. ఇల్లీగల్ నివాసం, భూమి, నీటి సరఫరా వంటి విషయాల నేపధ్యంలో(మురికి వాడల్లో) స్లమ్ శానిటేషన్ ఎప్పుడూ ఒక రాజకీయ సమస్యే.

సాంకేతిక పరంగా పెద్ద పట్టణాల్లో ఫ్లష్ టాయిలెట్లు ఉపయోగించక తప్పదు. ఎందుకంటే ఆ మాత్రం నీళ్ళు వాడకుంటే మొత్తం సూయరేజ్ లైన్లు చోక్ అయ్యి మలం ట్రీట్మెంట్ ప్లాంట్ వరకూ చేరక అదొక ప్రజారోగ్య సమస్యగా పరిణమిస్తుంది. చిన్నపట్టణాల్లో సెప్టిక్ ట్యాంక్ టెక్నాలజీ ఉపయోగించబడుతున్నా అది కాలాంతరంలో ప్రమాదకారిగానే అవుతుంది. అది నిండిపోయిన తరువాత ఎలా క్లీన్ చేస్తారు నుంచీ దాని rehabilitation వరకూ ఈ టెక్నాలజీవలన అన్నీ సమస్యలే. అందుకే సంపూర్ణ పారిశుధ్య ఉద్యమం మొకటి భారతదేశంలో మొదలయ్యింది.

ఈ విషయంలో ప్రాంతాలవారీగా డైవర్సిటీ ఆఫ్ అప్రోచ్ ఉంది. భారతదేశంలో ఈ కార్యక్రమం పశ్చిమ బెంగాల్ లో ఒక రకంగా జరుగుతుంటే బీహార్ లో మరో రకంగా అమలు చెయ్యబడుతోంది. తమిళనాడు మా విధానం వేరంటోంటే మహరాష్ట్ర కమ్యూనిటీ లెడ్ శానిటేషన్ అని కొత్త పంధాలో నడుపుతున్నారు. గుజరాత్ రాజస్థాన్ లు నీటి అవసరం లేని డ్రై టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంటే కేరళ మా అవసరాలకు ఎకోశానిటేషన్ బెస్ట్ అంటున్నాయి. అంధ్రప్రదేశ్ మా ఇంజనీర్లు కట్టించిందే టాయ్ లెట్ అంటుంటే మీ ఇష్టమొచ్చిన మోడల్ ఎంచుకోండని కర్ణాటక చెబుతోంది.

సంపూర్ణ పారిశుధ్య ఉద్యమంలోని అందమే భిన్నత్వం,వైవిధ్యం. ప్రభుత్వ విధానాలు కాకుండా ప్రజల మనోభావాలే కేంద్రంగా అమలయ్యే కార్యక్రమం. అందుకే ఈ కార్యక్రమంలో గైడ్ లైన్స్ ఉన్నాయేగానీ ఖచ్చితమైన రూల్స్ లేవు. ఇదొక పారిశుద్ధ ఉద్యమం. నిర్మల్ గ్రామ్ పురస్కార్ లాంటి సామూహిక బహుమతుల్ని రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రామ సర్పంచులు అందుకునే విన్నూత్నమైన కార్యక్రమం. ఇది టాయ్ లెట్ నిర్మాణానికి పరిమితం కాకుండా పరిసరాల పరిశుభ్రతకు, సమగ్ర గ్రామీణ శుభ్రతకూ ఆలవాలమౌతున్న కార్యక్రమం.

దీని గురించి పట్టణాల్లో ఉండేవాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ ఇదొక ఉద్యమం. సామాజిక విప్లవం. 2012 కాకపోయ్యినా 2015 లోపు మన దేశం బాహ్యమలరహిత, శుభ్రమైన దేశంగా మారుతుంది. అది ఒక గౌరవప్రదమైన ముందడుగు. కోట్లాది ప్రజలు ముఖ్యంగా మహిళలు సిగ్గుపడకుండా కాలకృత్యాలు తీర్చుకునే అందమైన శుభోదయాలకు తొలిపిలుపు.
****

Wednesday, October 20, 2010

కులగౌరవ హత్యల పరిశోధన ‘ఆక్రోష్’

“ఇంకా కులమేంటండీ?” అనేవాళ్ళు ఎవరూ వారివారి కులాల్ని దాటి పెళ్ళిచేసుకోరు.
ఎంత అభ్యుదయవాదైనా తల్లిదండ్రుల ఇష్టమనో, పెద్దల మాట వినాలనో కుటుంబ గౌరవాన్ని కాపాడేస్తూ కులాన్ని భద్రంగా కొనసాగించేస్తారు. ఇది కేవలం వ్యక్తిగత విషయం.
కానీ… కుటుంబగౌరవం కులగౌరవంగా మారితే… అది కాపాడుకోవడానికి మానవహననం జరిగితే…
అదప్పుడు భయంకరమైన సామాజిక సమస్య. సాంప్రదాయ ఆధిపత్యానికీ ప్రజాస్వామిక చట్టానికీ మధ్య సమస్య.
ఈ సమస్యని అత్యంత సునిశితంగా, అంతే వ్యాపారాత్మకంగా సృజించిన చిత్రం ‘ఆక్రోష్’.

పూర్తి సమీక్ష కోసం....నవతరంగం చూడండి. 

****

Sunday, October 3, 2010

హిందువులు Vs రాజ్యాంగం

(అగ్రకుల) హిందువులు తమ సామాజిక శక్తిని, రాజకీయ అధికారాన్నీ,ఆర్థిక బలిమిని by design మతం నుంచే పొందారు. This holds good for any majority across the world.

దళితులూ, మైనారిటీలూ అదే dominant మతం కారణంగా exploitation, inhuman treatment ఎదుర్కోవడమే కాకుండా సామాజిక-రాజకీయ-ఆర్థికావకాశాలు కోల్పోయారు.

ఈ పరిస్థితుల్లో the only level playing field possible came through constitution. రాజ్యాంగం కేవలం సమాన అధికారాలు కల్పించలేదు. అప్పటివరకూ వంచితులుగా నిలబడినవాళ్ళకు nominal incremental advantage ఇవ్వజూసింది.

ఇది సహజంగానే కులహిందువులకు అంగీకారం కాని విషయం. సచేతనంగా కాకపోయినా, ఉపచేతనంగా (subconscious గా)హిందువులకు రాజ్యాంగంపైనుండే అక్కసుకు ఇదొక కారణం. You can observe this in the blog world discourses of caste and religion when they are pitted against constitutional guarantees granted to Dalits and minorities.

On the other hand, దళితులకూ మైనారిటీల మనుగడకున్న ఏకైన ఆధారం రాజ్యాంగం. This is the only place that will guarantee them their rightful position in this society. అందుకే we swear by law and constitution. And get more worried if it doesn't deliver justice. అందుకే ఈ కేసులో మెజారిటీ మతవిశ్వాసాల ప్రాతిపదిక తీసుకుని కోర్టు తీర్పు నివ్వడం ఇంత disappointment కు కారణం.

****

Saturday, October 2, 2010

గాంధీ పై అంబేద్కర్ ఆలోచనలు...