Saturday, October 15, 2011

మాయావతి జిందాబాద్ !


బృహత్తర నిర్మాణాలే వారసత్వాలుగా గుర్తించే భారతదేశంలో, ప్రభుత్వం డబ్బుతో పార్కుల నిర్మాణం. దళితబాంధవుల విగ్రహాల నిర్మాణం చేసినందుకు మాయావతిని ఖండించాలట. ఎందుకు ఖండించాలో నాకు అర్థం కావడం లేదు. విగ్రహాల నిర్మాణం చెయ్యని పార్టీ ఏది? నాయకుల్ని చిరస్మరణీయులు చెయ్యడానికి ఎయిర్పోర్టులకి, రోడ్లకీ, పార్కులకీ, భవనాలకూ పేర్లుపెట్టని రాష్ట్రం ఏది? అవన్నీ పబ్లిక్ డబ్బులతో జరగలేదా?! ట్యాంక్ బండ్ మీద విగ్రహాలెందుకు? హుస్సేన్ సాగర్ లో బుద్దుడెందుకు? అది మాత్రం ట్యాక్స్ పేయర్ డబ్బుకాదా?!

మాయావతి చాలా మందికి నచ్చదు. తను బాహాటంగా చేసే వెల్త్ డిస్ప్లే అస్సలు నచ్చదు. నిజమే... బాత్రూముల్లో మాత్రమే బంగారు కమోడ్లు పెట్టుకునే నాగరికులుండే లోకంలో బాహాటంగా వెయ్యిరూపాయిల దండేసుకోవడం అసహ్యంగానే ఉంటుంది. చచ్చినోడి రాజకీయ ఉత్తరాధికారిగా నిరూపించుకోవడానికి వాడవాడలా విగ్రహాలు పెట్టిస్తే అది రాజకీయం. కానీ తన విగ్రహాన్ని తనే ఉద్ఘాటిస్తే మాత్రం అసహ్యం. ఇది ఏరూల్ బుక్ ప్రకారమో కాస్త చెబుతారా? ఆ రూల్ బుక్ తగులబెట్టడానికే పుట్టిన ‘మాయ’ ఇది. అగ్రకుల రాజకీయాల్ని, హిందూమతాహంకారాన్ని కాలరాయడానికి పుట్టిన ‘అతి’ ఇది.      

****

63 comments:

Anonymous said...

మిమ్మల్ని పూర్తిగా సమర్థిస్తున్నా. ఆ మాత్రం స్వకులాభిమానం ఉండాల్సిందే. కానీ అదే అభిమానాన్ని ఇతరులు చూపించినప్పుడు మనం వారికి కులగర్వమనీ, అదనీ ఇదనీ పేర్లు పెట్టకూడదు. కదా ?

Indian Minerva said...

ఈ "బాత్రూముల్లో మాత్రమే బంగారు కమోడ్లు"నీ, "చచ్చినోడి రాజకీయ ఉత్తరాధికారిగా నిరూపించుకోవడానికి వాడవాడలా విగ్రహాలు"నీ కూడా విమర్సించిన sane people వున్నారు బ్లాగులోకంలో. మాయావతినీ ఆవిడ ideologyనీ సమర్ధించడానికీ, ఆవిడచేసే ప్రతి పిచ్చిపనినీ సమర్ధించడానికీ తేడావుంది. అభిమానం అంటే పిచ్చిపనిచేస్తే సర్దిచెప్పడంకూడా. ఒక మనిషి తనవిగ్రహాలు తనేపెట్టుకోవడం ఎబ్బెట్టుగా, తనగురించి తనే డప్పేసుకున్నట్లుగా లేదూ? It at least deserves mockery. doesn't it?

Anonymous said...

అది అతి
నీది కుతి

MEWA said...

కత్తి మహేష్ గారు,
కొన్ని రోజులుగా మీ పాత పోస్టులు చదువుతున్నాను.మీ ఆలోచన కొత్త గా ఉంది.
మాయావతి గారు విగ్రహాలు పెట్టుకుంటే ప్రాబ్లం ఏమిలేదు .అదే అప్పర్ క్యాస్ట్ అయిఉంటే ఎవరికీ సమస్య కాదేమో.
మీ ఆలోచనలు విమర్శించే వారు చరిత్ర తెలియని వారు లేదా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లులు .
ఇంకా వివక్ష ఎక్కడుందని చాలామంది అడుగుతున్నారు .సంతోషం లేదనే అనుకున్నాను కాని ఒక్కసారి కొంతమంది స్నేహితులు కలసి చర్చిస్తే దాదాపు maa చుట్టూ ఉన్న పల్లెలలో ఎక్కడైతే 10 ఇల్లకన్నా ఎక్కువ ఉంటె అక్కడ ఇంకా ప్రత్యెక కాలనీలు ఉన్నాయని తెలిసింది .ఇంకా వివక్ష లేదని సంతోష పడదామా .

Kathi Mahesh Kumar said...

@Anonymous: స్వకులాభిమానమా??? దళితులు అనేది ఒక కులం కాదు. ఒక వర్గం.

మీరు అవునన్నా కాదన్నా,అగ్రవర్ణాలు కులం అంటే కులగర్వం. దళితులు కులం అంటే అది ఆత్మగౌరవం. అదే పొలిటికలీ కరెక్ట్. ...

Kathi Mahesh Kumar said...

@Indian Minerva: "ఎబ్బెట్టు" అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఆల్రెడీ నాగరికులు నిర్ణయించిన దారిలోనే మాయావతి ఎందుకు నడవాలి? నిజానికి ఈ విగ్రహాల విషయంలో నాది చాలా న్యూట్రల్ పంధా. కానీ నిన్నటి నుంచీ తనేదే పెద్ద మహాపాపం చేసింది అర్జంటుగా దళితమేధావులు ఖండించాలి అని కొందరు నిర్ణయిస్తుంటేనే "ఎందుకు?" అనే ప్రశ్న వచ్చింది నాకు. ఆలోచిస్తే ‘నిజమే, ఏంటి తప్పు’ అనే ఇప్పుడు అనిపిస్తోంది.

మాయావతి చేసిన పని అంత అప్రజాస్వామికం అయితే, అరాచకమే అయితే అన్ని తాజ్ మహల్ ని ధ్వంసం చేద్దాం, కొలోనియల్ మాన్యుమెంట్స్ నీ పడగొట్టేద్దాం, ప్రభుత్వం నాయకులకు, రాజకీయనాయకులకూ నిర్మించిన బాపూఘాట్లనీ, నెహ్రూ ప్లేస్ లనీ కూలగొట్టేద్దాం, బుద్దవిగ్రహాలనీ ట్యాంక్ బండ్ స్టాచ్యూలనీ నేలకురాద్ధాం. అప్పుడు చూద్దాం నిజంగా ప్రజల డబ్బుతో కట్టని కట్టడాలు ఎన్నున్నాయో! ఎందుకండీ ఈ డబుల్ టాక్...మాయావతి కేవలం అప్పర్ క్యాస్ట్ పొలిటికల్ మోడల్ కానందువల్ల కాకపోతే మరెందుకూ?! ఒకటి మాత్రం నిజం. ఇక్కడిదాకా తను ఎదిగింది ఆ అన్ కన్వెన్షనల్ ఆటిట్యూడ్ వల్లే, రాబోయే కాలంలో కాబోయే ప్రధానమంత్రి అవబోయేదీ ఈ పద్ధతిలోనే బీ రెడీ ఫర్ ఇట్, ఆర్ బీ రెడీ టు కండెమిట్.

y.v.ramana said...

మాయావతి అంటే అగ్రకుల మేధావులకి, అగ్రకుల మీడియాకి రోత. తెలుగు బ్లాగర్ల సంగతి నాకు తెలీదు. ఇందులో చాలా రాజకీయాలున్నాయ్. మాయావతి చేసింది కాబట్టే అది తప్పు. తాజ్ మహాల్, చార్మినార్లని సొంత డబ్బుతో కట్టారా? ఈ దేశానికి కాబోయే మొదటి దళిత ప్రధాన మంత్రి మాయావతి అనిపిస్తుంది. మీరు రాసిన దానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మంచి పోస్ట్. థాంక్యూ!

Anonymous said...

మిమ్మల్ని ఎంతమంది విమర్శిస్తున్నా, మిమ్మల్ని వెక్కిరిస్తూ ఎన్ని బ్లాగులు పుట్టుకొచ్చినా, వెరవకుండా మీరు మీ అభిప్రాయాలు వెల్లడించడం నాకు నచ్చుతుంది.

కానీ ఒక విషయం, మీ టపా చదివాక ఆ విగ్రహాల ప్రతిష్ఠపై మీరు చెప్పిన కారణాలపై నా అభిప్రాయాలు వివరంగా వ్రాద్దామనుకున్నాను. కానీ మీ ఈ వ్యాఖ్య చదివాక

>>>మీరు అవునన్నా కాదన్నా,అగ్రవర్ణాలు కులం అంటే కులగర్వం. దళితులు కులం అంటే అది ఆత్మగౌరవం.<<<

ఇక నేనేమీ చెప్పక్కర్లేదనిపించింది. మీరలా డిసైడ్ అయిపోయారు కదా. ఇక ఎవరు ఎలా చర్చించినా మీరు అదే నిశ్చితాభిప్రాయంతో ఉన్నప్పుడు, మీరు వినడానికి రెడీగా లేనపుడు మీతో విభేదించడం అనవసరం.

మీ పై కామెంట్ చూశాక మాత్రం ఒకటనిపించింది. మీరు ఆత్మగౌరవంతో కన్నా ఆత్మన్యూనతతో (ఆ కులంలో పుట్టినందుకు) బాధ పడుతున్నారనిపిస్తూంది. బహుశా మీరు అగ్రవర్ణంలో పుట్టలేదన్న వెలితి మిమ్మల్ని పీడిస్తున్నట్టుంది.
దళితులు, దళితులు అంటూ పదేపదే గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీరే సమాజం నుండి దూరం పెట్టుకుంటారెందుకు? అగ్రవర్ణాలవారూ మనుషులే. వారికీ మంచి, చెడు తెలుసు. అగ్రవరాలూ, దళితులూ ఒకర్నొకరు వివాహం చేసుకోవడం చాలా సహజమైపోయింది ఇప్పుడు. మీరు బాధ పడిపోతున్నంత ఏం జరుగుతూంది ఈ కాలంలో? ఒకప్పుడు వారి ప్రవర్తన దారుణంగా ఉండేదని నేనూ ఒప్పుకుంటాను. కానీ మనం ప్రస్తుతంలో బ్రతుకుతున్నాం. మనకేం జరుగుతూందో ఆలోచించండి. మన తాతలకేం జరిగిందనేది కాదు. కాస్త ఆత్మన్యూనతని తగ్గించుకోండి. మీరు దళితులు, తక్కువవారు అన్న భావన మనసులోకి రానీయకండి.

నా వరకు నేను కత్తి మహేష్ కుమార్ ని పర్ణశాల బ్లాగరుగా, ఒక తెలివైన మనిషిగా, ఎన్ని కష్ట నష్టాలు, వేదింపులూ ఎదురైనా తన అభిప్రాయాలని నిర్భయంగా వెల్లడించే మనిషిగా గుర్తిస్తానే తప్ప, కత్తి మహేష్ కుమార్ ఒక దళితుడు అన్న గుర్తింపు ఎప్పుడూ అనిపించదు. మీరే మాటిమాటికీ కుల ప్రస్తావన తీసుకొస్తుంటారు.

Anonymous said...

మరో విషయం. ఆ దళిత అన్న బ్రాండ్ దయలేసి వదిలేయండి. అది వాడి వాడి అగ్రవర్ణాల వారికి మీరే లోకువిస్తున్నారు. ఉదాహరణకి మొన్న హరీష్ రావు ఎవరినో కొట్టి, వారు తిరిగి కొడితే ఒక దళిత ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకుని ఈయన్ని కొట్టారు, దళితుణ్ణి కొట్టారు అంటూ నానా యాగీ చేసి తను తప్పించుకున్నాడు.
అక్కడ జరిగింది ఎమ్మెల్యేని కొట్టడం. దళితుడైతే ఏమిటి? మరొకడైతే ఏమిటి? లాభపడింది ఎవరు? మీరసహ్యించుకునే ఒక అగ్రవర్ణం వాడు.
"దళిత మహిళపై అత్యాచారం!"
ఏమిటిది? "మహిళపై అత్యాచారం" అంటే చాలదా. దళిత మహిళ కాకపోతే అది తప్పు కాదా? జరిగింది ఏ మహిళకైనా ఒకటే కదా.

Indian Minerva said...

మహేష్ గారు: ఆవిడ కులమతాలతో నాకే విరోధమూ లేదండీ. ఆవిడ ప్రధానై మంచిపాలనందిస్తే అంతకన్నా ఇంకేకావాలి చెప్పండి. ఇక్కడ మీవాదనే అసెంబ్లీ, పార్లమెంటుల్లో తరచుగా వినబడే "ఏం మీరుమాత్రం చెయ్యలేదా అవినీతి?" తరహాలో వుంది. ఇలావాదించినప్పుడు ఏదీతఊఉకాదని మీకు తెలిసేవుంటుంది. మనం చెయ్యాల్సింది జరిగిన తప్పులను సరిదిద్దడమేగానీ అదేకోవలో ఇంకొకటి చేసి మొదటిదాన్ని non-singular చెయ్యడం కాదుకదా. అసలామాటకొస్తే నేను మాట్లాడింది ప్రజాధన దుర్వినియోగం గురించికూడా కాదు. ఆవిడంతగా దళితుల అభివృధ్ధికి పాటుపడినవాళ్ళ విగ్రహాలు పెట్టాలనుకుంటే ఎందరులేరు? బహుశా వాళ్ళవిగ్రహాలు పెట్టుంటే ఇన్నివిమర్శలు వెల్లువెత్తుండేవికాదేమో. తన విగ్రహాలు తానే పెట్టుకోవడం అనేది చరిత్రలో ఎవరెవరు చేశారు అనేది మీకు తెలీదనుకోను.

MEWA said...

మహేష్ గారు ,
ఇండియా లో కేవలం చెట్టు పేరు చెప్పి కాయలమ్ము కొనే వారికి మాత్రమె విగ్రహాలు పెట్టుకొనే హక్కు ఉంది .
అది ఎన్ టి ఆర్ ది కావచ్చు ,వై ఎస్ ఆర్ ది కాని , రాజీవ్ ది కాని,వారి అభిమానులు లేదా బందువులు మాత్రమె
పెట్టుకోవాలి .జయలలిత గారు ఎం చేసినా సంచలనం ,షీలా దీక్షిత్ గారు ఎం చేసిన సూపర్ , మాయావతి గారికి ఎంత
దైర్యం ఉంటె ఇండియా లో తన విగ్రహం పెట్టుకుంటుంది.మన సంస్కృతీ దెబ్బతినదా?

Kathi Mahesh Kumar said...

@అజ్ఞాత:ఆత్మన్యూనతా...హ్మ్. అలా అనిపిస్తోందా మీకూ :)

Anonymous said...

మిగతావాళ్ళు చేస్తే తప్పు కానప్పుడు మాయావతి చేస్తే తప్పేమిటి?
మీ వాదన కరక్టే.
కానీ, ఆమె అంబేద్కర్, కాన్షీరాం ల విగ్రహాలని మాత్రమే పెట్టిస్తే ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు.
సొంత విగ్రహాన్ని కూడా పెట్టించుకోవడం అధికార అహంకారమే.
ఈ విషయంలో కులానికి ప్రాముఖ్యత లేదు.

ఉత్తర ప్రదేశ్ లోని నాలుగు పార్టీల పోటీలో శాంతి భద్రతల నిర్వహణలో అమే బెటర్ కాబట్టి ప్రజలు ఆమెకి పట్టం కడుతున్నారు.
అంతే కాని మాయావతి గొప్ప ముఖ్యమంత్రి అని కాదు.
సంకీర్ణ రాజకీయాలలో ఎవరికీ మెజారిటీ రాకపోతే దేవెగౌడలా మాయావతి కూడా ప్రధానమంత్రి కావచ్చు.
ఆమె ఆ పదవిని ఎన్నాళ్ళు కాపాడుకుంటుంది, ఎలా నిర్వహిస్తుంది అన్నది కాలమే నిర్ణయించాలి.

Anonymous said...

Unlike you, I fail to see much of an anti-establishment thing or iconoclastism in all this self-love of the Dalit spinster Mayavati.

అధికారం - అది దళితులదైనా, అగ్రవర్ణాలదైనా - అదే అన్నిటికీ ఆమోదముద్ర వేయించిపారేస్తున్న సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు దళిత, అగ్రవర్ణ గుర్తింపులకి ప్రాముఖ్యం పోయినట్లే కదా ? అధికారం, డబ్బు, మందబలం, మజిల్ పవర్ - ఇవి ఎవరివైనా గానీ వీటికి మనం జైకొట్టే స్టేజిలో ఉన్నప్పుడు ఇక ఎకడమిక్ సిద్ధాంత రాద్ధాంతాలూ, ఇంటలెక్చువల్ చర్చలూ అనవసరం కదా. We the modern people are rooted in our money and muscles but not in our minds. As such, there is nothing to gloat over. Right ?

నీహారిక said...

సంవత్సరం క్రితం "మంచు" ఇలాగే ముస్లింలు గుళ్ళు పగలగొట్టగాలేనిది... మేము మసీదు పడగొడితే తప్పేమిటి అని వాదించారు గుర్తుందా ?

మీ వాదన కూడా అలాగే ఉంది, మేధావులందరూ ఇలాగే ఆలోచిస్తారేమో ??

మనిషిగా పుట్టినందుకు కాస్త మనిషిగా బ్రతకటం నేర్చుకోండి !!

..nagarjuna.. said...

>>,అగ్రవర్ణాలు కులం అంటే కులగర్వం. దళితులు కులం అంటే అది ఆత్మగౌరవం. అదే పొలిటికలీ కరెక్ట్<<

ఈ ముక్క మాయావతి విగ్రహాల కాంటెక్స్‌స్ట్ లో చెప్పారా!!! హ్మ్ నాకు మీ మీద జాలేస్తుంది మహేశ్ గారు. మీరు ఇలాంటి కామెంట్లను పెద్దగా పట్టించుకోరని తెలుసు but i wanted to tell you despite that.

ఇక్కడ కొందరు రాసిన కామెంట్లను కూడా మెచ్చుకోవాలనుంది.....కాని హెల్ప్‌లెస్

మంచు said...

నీహారిక : If you have something to say about article or comment on author's opinion, please do so.

Don't bring my name unnecessarily and i will not respond to ur references whether it is true or not.

మనిషిగా పుట్టినందుకు కాస్త మనిషిగా బ్రతకటం నేర్చుకోండి !!: I don't think either Katti Mahesh Kumar or Manchu need to learn this from YOU.

Mind your language.

Katti Garu: Sorry to use your space. However you approved a comment which has reference to my name so I had to respond here.

Kathi Mahesh Kumar said...

@నీహారిక : "మనిషి"కున్న మీ డెఫినిషన్ లో మాలాంటి వాళ్ళు ఫిట్ అవరులెండి. అందుకే మేము కొత్తక్యాటగరీని సృష్టించుకున్నాం.

Anonymous said...

For me statues on Tank bund are no different from mayawati building her own statue.

But is it a great job, defnetly no...both are equally bad

they have no right to use public money......

Kathi Mahesh Kumar said...

@ Anonymous: My blog post started with "బృహత్తర నిర్మాణాలే వారసత్వాలుగా గుర్తించే భారతదేశంలో". That's how it has been in India from ancient times to now.Be it kings than or politicians now would use public money to make their legacy count by erecting monuments. If you have a problem with it surely you can raise your voice. If you can force them to amend the law banishing them from using public money for such projects, it is all the more great. Till such time,let's live with it.

Praveen Mandangi said...

అగ్రకుల నాయకుడు వ్యక్తి పూజ చెయ్యిస్తే దళితులం, మనం విమర్శిస్తాం కానీ అదే పని మనం చెయ్యొచ్చా? గడ్డి ఎవరు తిన్నా అది గడ్డే. మనం తింటే అది పరమాన్నం అయిపోదు, అవతలివాళ్ళు తింటేనే అది గడ్డి అయిపోదు. రాజుకి తన పై వ్యతిరేకత ఉండకుండా ఉండేందుకు వ్యక్తి పూజ అవసరమే, రాజకీయ నాయకునికి వోట్ల కోసం వ్యక్తి పూజ అవసరమే.

ఆ.సౌమ్య said...

I am not commenting anything on your opinion....but one thing caught my eyes...."బృహత్తర నిర్మాణాలే వారసత్వాలుగా గుర్తించే భారతదేశంలో"

If not so how do we realise our own history? whether good or bad...we need to know it.

పుస్తకాలో రాసినదాని కంటే ఇలా కట్టించిన నిర్మాణాలే చరిత్రని ఎక్కువ చెబుతాయేమో కదా. ఉదాహరణకి జైపూర్ లో ఉన్న old fort లో రాజు, రాణిల గదులు. రాణి గదులకి ఆనుకుని ఉన్న సేవకుల గదుల నిర్మాణం చూస్తే ఆరోజుల్లో ఉండే పద్ధతులు, వారి జీవన విధానం, వారి నమ్మకాలు, వారి సంబంధభాందవ్యాలు అన్నీ తెలుస్తాయి. ఆనాటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.

అలాగే తంజావూరులో కట్టిన కోవెల....దాని నిర్మాణం. మనకున్న art ని తెలియజేస్తుంది. దేవుడు, భక్తి పక్కనపెడితే మనకున్న కళాకరుల విలువ, ఆరోజుల్లో ఉండే నైపుణ్యం తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం అంతకన్నా మెరుగైయ్యామో, దిగజారామో తెలుసుకోవడానికి అది ఒక కొలప్రమాణం కాదా?

ఇలా ఇవన్నీ తెలుసుకోవడం - చరిత్ర తెలుసుకోవడం - మనకి ఎంతో అవసరం కాదా? అది మంచో, చెడో...మంచైతే నేర్చుకుంటాం. చెడు అయితే అలా చెయ్యకుండా ఉండేదుకు ప్రయత్నిస్తాం. అదే కదా చరిత్ర మనకు చెప్పే పాఠం!

ఆ.సౌమ్య said...

అలాగే ట్యాక్ బండ్ విగ్రహాలు - అది పబ్లిక్ మనీతోనే కట్టించినవి అయ్యుండొచ్చు. కానీ కొన్నిపుస్తకాలు చదివితేగానీ తెలియని విషయాలు - కవుల గురించీ, సంస్కరణ కర్తల గురంచీ - ఒక్క నడకలో తెలుస్తాయి కదా!

Kathi Mahesh Kumar said...

@ఆ.సౌమ్య: I agree with you on all counts. And say that that's precisely why Mayavathi is trying to mark her legacy.

Anonymous said...

మహేష్,
అక్కడ అన్ని దళిత నాయకుల విగ్రహాలేనా? ఒకటి రెండు ఎవరైనా బ్రహ్మణ,బనియా,క్షత్రియ విగ్రహాలు కూడా ఉన్నాయా! మాయావతి ఇన్ని రోజులు ఆస్థానం లో కుచొని పాలలించటానికి, ఎంతో కొంత వారి సహకారం ఉంది కదా! వారు ఎవరు అదను చూసుకొని, ఎదురు తిరిగి, పదునైన కత్తి తో వెన్ను పోటు పొడవలేదు కదా! అదే మనం రాష్ట్రం లో రామారావు గారికి నాదేండ్ల గారు, బాబు గారు చేసిన సన్మానం తెలిసిందే. ఆమే అధికారంలో కొనసాగటానికి వీరి సహకారాన్ని మాయవతి ఎమైనా గుర్తించిందా?

Anonymous said...

"అలాగే ట్యాక్ బండ్ విగ్రహాలు - అది పబ్లిక్ మనీతోనే కట్టించినవి అయ్యుండొచ్చు. కానీ కొన్నిపుస్తకాలు చదివితేగానీ తెలియని విషయాలు - కవుల గురించీ, సంస్కరణ కర్తల గురంచీ - ఒక్క నడకలో తెలుస్తాయి కదా!"

people who are interested in knowing about those poets and reformers can contribute for those statues why should they use my money when I am least interested isnt it robbing.

MEWA said...

చాలా మందికి ముందు మనమెలా ఉన్నామో తెలియకుండానే గుడ్డిగా కులాల గూర్చి వాదిస్తున్నారు .

మొదటగా మా ఆఫీసు లో జరిగిన ఒక విషయాన్నీ చెప్పి తరువాత మనుధర్మ విశేషాలు పోస్ట్ చేస్తాను.
వెనుక బడిని కులానికి చెందిన ఒక ఉద్యోగి ఇంకొక బ్రామ్హణ వర్గానికి చెందిన వ్యక్తిని తన బందువు అవుతారని
తమాషాకు అన్నారు . అందుకు ఆయన గారు విపరీతంగా ఏడ్చి సదరు ఉద్యోగి తో సారీ చెప్పించుకొని
మీరు మాకెల బందువులు అవుతారని ,మేము జంధ్యం ధరిస్తామని ,మీరు మా బందువులనే మాట నేను
భరించలేక అన్నం తినలేకపోయాయని అన్నారు.
ఇది మన సమాజం .ఎవరి అబిప్రాయం వారు తెలపండి.

Krishnaveni said...

ఈ కులాలేమిటి? ఈ మతాలేమిటీ? ఈ వర్గాలేమిటీ? దళితులేమిటి? ఈ మధ్య చూస్తూంటే అందరూ ఇవే రాస్తున్నట్టున్నారు. ఈ రోజుల్లో ఇలాంటివి పట్టించుకునే చాదస్థులు కూడా ఉన్నట్టున్నారు. దీని గురించిన చర్చలు అవసరమా? ఇవి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు కనుక? మనిషి మనిషే.
క్రిష్ణవేణి

Indian Minerva said...

@yajit గారు: ఇలాంటి వెధవాయిలింకా వున్నారంటే చాలా ఆశ్చర్యంగా వుంది.

Kathi Mahesh Kumar said...

@క్రిష్ణవేణి:మీరు ఏ అధ్బుత ప్రపంచంలో ఉన్నారోగానీ, మేము బ్రతుకుతున్న లోకంలో కులం ఒక సామాజిక నిజం. జీవితాల్ని శాసిస్తున్న ఒక సత్యం.

Anonymous said...

గాంధీల కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు లేనిది, మాయావతి చేస్టే తప్పు కాదు.

రాహుల్ గాంధి, మాయావతిలలో నేను మాయావతినే సమర్ధిస్తాను. మాయావతి వలన దళితులు కొద్దో గొప్పో బాగుపడతారు. బాగుపడక పోయినా కొంచెం మానసిక ఆనందం పొందుతారు . రాహుల్ మరియు ఇతర గాంధీల వలన ఎవ్వడు.. దేశం మొత్తంలో ఎవ్వడు బాగు పడదు.

Maitri said...

I live in the same world/country as you do Mahesh Kumar. Unless one sticks the stamp of their caste/creed/religion on their foreheads and display it proudly, I do not think that anyone really bothers. At least not to my knowledge. People generally tend to struggle for their existence and to make the ends meet. These isues are not intrisinic part of anyone's life. So where do these issue figure into?
Krishnaveni

Kathi Mahesh Kumar said...

@క్రిష్ణవేణి: What makes you think struggle for existence and making the ends meet are happening irrespective of caste in India? If you are in a position of "not bother" for caste, it only proves that such luxury is given to you by caste you belong to. Just look at the family history you belong to to realize the same.

Caste is the DNA on which entire Indian nation is standing and its disparities are grounded on it. It need not be branded on forehead to realize that,simply because it is p[art of the very system. If you are not aware of it within your surrounding, it only means you are basking in the comfort of an advantaged caste.

Just examine your birth,your marriage, your comfort, your festivity and celebration. Now tell me that there is no caste in your life?

నీహారిక said...

<>

సీతాదేవి చూసిన చాకలి వాడి దగ్గరినుండి ఈనాటి కత్తి మహేష్ కుమార్ వరకూ దళితుల ఆలోచనల్లో మార్పు రాలేదు. ఎంతసేపూ ప్రక్కవాడి మీదపడి ఏడవడమే కానీ ప్రతి మనిషి స్వశక్తితో ఎదగవచ్చునని, మనిషి ఎదగడానికి కులాలతో సంబంధమే లేదని కావలిసినది గుండె ధైర్యమేననీ, ఆ ధైర్యమే ఉంటే లక్ష్మి కాళ్ళదగ్గరే పడిఉంటుందని ఏ యుగంలో తెలుసుకుంటారు???

Maitri said...

Mahesh Kumar, by the way you said something to the effect of "Just look at the family history you belong to to realize the same."
What about my family history and do you know it? I wonder how !

Kathi Mahesh Kumar said...

@నీహారిక: అబ్బ! కళ్ళు తెరిపించారుగా. మాటల్లో మీరు దాయలేని వివక్ష చాలు ఎంతగా కులదాష్టీకం, కులగర్వం దాగున్నాయే చెప్పడానికి.

ఏంటీ ఒకరి మీద పడి ఏడవటమా!!? దళితుల శ్రమను దోచుకుని దళితుల రక్తమాంసాలు తిని బ్రతికిన అగ్రకులాల సాక్షిగా ఎవరు ఎవరి మీద పడి ఏడుస్తున్నారో అర్థమవుతూనే ఉంది. స్వశక్తి?!? నిజంగా అగ్రకులాలు స్వశక్తితో ఎదిగాయా? ఎక్కడుంది వాళ్లకి శక్తి? దళితుల భుజబలంలోనా! దేవుడిపేరుతో భయపెట్టి పబ్బం గడుపుకున్న కులానిది స్వశక్తి. రాజ్యం చేస్తూ ప్రజల సొమ్మును దోచుకోవడం స్వశక్తి. నిజమే...కూలోళ్ళ శ్రమతో కులకడం స్వశక్తి భేష్....ఇలా అన్ని కులాలూ స్వశక్తితో ఎదిగితే వాళ్లమీదపడి దళితులు ఏడుస్తున్నారు.

చాకలోడు అన్నమాటలలో మీకు పడి ఏడవటం కనిపిస్తే, అగ్ని పరీక్ష చేసి తీసుకొచ్చిన పెళ్ళాం మీద రాముడిలేని నమ్మకం అగ్రకులాల అహంభావానికి, మూర్ఖత్వానికీ సాక్ష్యంగా నాకు కనిపిస్తుంది. చాకలోడు కోపంలో అన్నా నిజమే అన్నాడు. దాపరికంలేని దళితబహుజనుడు చాకలోడు.

మనిషి ఎదగడానికి ప్రాతిపదిక కులం కాదు. కానీ ఆ ప్రాతిపదికనే అవకాశాలు తృణీకరించిన వేల సంవత్సరాల వివక్షకు సమాధానం కావాలి. దానికి కాంపెన్సేషన్ కావాలి. ఆ తరువాత ఒకేలైన్లో నిల్చుని పరుగెడదాం. అయినా, ఇన్ని కష్టాలున్నా దళితులు ఎదుగుతూనే ఉన్నారు. గుండెధైర్యం లేకుంటే ఇన్నేళ్ళ దౌర్జన్యాన్ని భరించి బ్రతికేవాళ్ళేకాదు.

Kathi Mahesh Kumar said...

@క్రిష్ణవేణి: If you are untouched by caste, I am sure you don't belong to the so called "untouchable caste". This doesn't need proof of knowing. Simply because that's how it is.

ఆ.సౌమ్య said...

@Yajit
I am not surprised...i have seen many cases like this!

Maitri said...

Mahesh Kumar,
It is quite rare that I comment in blogs since I do not read them much. I myself have none. I just happened to have read some random comment which happened to be in your blog. That was the reason I had read your blog post and commented here. It neither reflects on your blog nor does it commend or criticize your blog. Just that a particular comment of someone whose name I had recognized had spurred me onto reading this blog post. So resulted my comments.
If you are not aware of it within your surrounding, it only means you are basking in the comfort of an advantaged caste.
No. I am not. I am the only person who has married within the caste in our families. In my parent’s family, mine and my in-laws family apart from me, everyone have married outside of the caste/language and we are a family together. Unless the others are great actors, I had never seen the other caste members-as you might want to put it- expressing any discomfort/unease/a feeling of being an outsider ever for a moment. Nor did the thoughts ever crossed the mind of anyone else in the family. I had never witnesses any feeling of being inferior.
I am not aware if the feelings and the prejudices differ according to the geographical locations. I have only expressed my opinion as per what I had observed and it has nothing to do with anyone/anything else. If you thought that I have encroached upon your space with so many comments, I apologize but I was only replying to your ponderings about me.

Anonymous said...

Mayavati is admittedly a self-lover. But in the same breath, let me add that every instance of casteism is too just an extended version of the same self-love, no matter whether it is FC casteism or Dalit casteism.

@Mahesh, don't settle for politically correect things if you are a real truth seeker as you claim in your profile, Political correctness is there just for the exclusive tribes of politicians who wish to contest elections, as also to that of journalists to which you and me can hardly hope to belong. Let's search for the things which are just correct all the way. BTW, I know, I am no match to the task of educating anyone incl. you.

Kathi Mahesh Kumar said...

@క్రిష్ణవేణి: I understand and appreciate your POV. What you have said might be true. Only thing is it's a personal truth. You cannot justify social fact based on your persona truth.

If caste is untouched in your life. That is good. But the reality could be, your family by virtue of being in advantage of caste would have reached this socio-economic and political comfort where caste has become irrelevant.

Society at large hasn't reached this comfort zone yet. Hence, I am saying just because it is irrelevant in your life, don't assume that it doesn't exist.

I welcome your opinion, I might differ with it and disagree with it completely.

Anonymous said...

వచ్చే సం|| ఇంకొకసారి మాయవతి గెలిస్తే యు పి లో ములాయం పరిస్థితి డోలాయం లో పడుతుంది. బీహార్ లో లాలు, తమిళనాడులో కరుణ, ఆంధ్రా లో బాబు పార్టి మొద|| ప్రాంతీయ పార్టిలు చివరి ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాయి. వీరికి ప్రస్తుతం ఏ ఐడియాలజి లేదు. అధికారంలో కి వచ్చాక అవినితికి పాలపడ్డారు. ఇక వీరేన్ని మాయమాటలు చెప్పినా వినేవారు ఎవరు లేరు. భవిషత్లో ఒక కొత్త తరహా రాజకీయాలు వస్తాయి. ఇప్పటికే నేట్ వాడకం ఎక్కువైనందువలన, దానితో ప్రభావితులయ్యే ఒక కొత్త యువతరం వీరిని శాశ్వతం గా ఎన్నికల ద్వారా ఇంటికి పంపుతారు. ఆతరానికి ఈ పాత భుస్వామ్య వ్యవస్త గురించి కనీసం అవగాహన ఉండదు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే సిటిలు చేరటం ఎక్కువైయింది. వారికి మూలాలతో సంభందాలు తెగి పోతయి. ఆవు అంటే, ఎలా వుంట్టుందో తెలియని/చూడని పిల్లలు చాలా మంది ఉన్నారు.

MEWA said...

నిహారిక గారు,
ఆనాటి చాకలి వాడి నుండి ఈనాటి మహేష్ గారి వరకు వీరంతా స్వశక్తి తో బ్రతుకు తున్నారు.
కాని ఆరోజు నుండి ఈరోజు వరకు కూలి చేసిన ఒక బ్రామ్హిన్ ను చూపగలవా?
కస్టపడి బ్రతికింది బ్రతికేది వీరే,దోచుకోవడం ఇతరుల కష్టం మీద బ్రతికిన చరిత్ర వీరికి లేదు .
మీ మీద పడి ఎవరు ఏడవటం లేదు. నిజాలను ఒప్పుకునే సంస్కారం మీకు లేనట్టుంది.
చరిత్ర తెలుసుకోండి .దయచేసి మీరు ఎడవద్దు

Indian Minerva said...

yajit గారు: ఏపనీ చేయడానికిష్టపడని priest class ఇలా religious servicesకి తమను మాత్రమే అర్హులుగా పేర్కొంటూ మొత్తం శ్రమజీవులందరిపైనా పెత్తనానికి తెగబడటం కేవలం అన్ని సమాజాల్లోనూ కనిపించే common aspect అయినప్పటికీ. అసలు కష్టపడే(కూలిపనేచేసే) బ్రామ్హణుడే లేడనడం ఒకపెద్ద generalization అండీ. ఈ సోకాల్ద్ కులవివక్ష తిన్నదరగని అగ్రకులాలవారినో, బుధ్ధిపెరగని అగ్రకులాలవారినో మినహాయిస్తే మిగతా చాలామందికి కులవివక్ష అమానుషమన్న ఎరుకవుందనుకుంటున్నాను.

నీహారిక said...

@Yajit,

బ్రాహ్మిన్స్ కూలిపని ఎందుకు చేయాలి ? మీరు చెప్పేది ఎలా ఉందంటే "నువ్వే నువ్వే" సినిమాలో ప్రకాష్ రాజ్, తరుణ్ తో సూట్కేస్ తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయి సున్నా నుండి జీవితం మొదలుపెట్టమని అన్నట్లుంది.

ధైర్యానికి కులానికి సంబంధం ఏమిటో ??

నేను కూడా కష్టపడుతున్నాను ఇంట్లో... ఒక గృహిణి కష్టానికి, ఒక ఉద్యోగిని పడే కష్టానికి తేడా తెలుసు, కానీ మమ్మల్ని తీసిపారేస్తే ఊరుకోం .

నాదే కష్టం ఇతరులది కష్టం కాదు అని నేనెప్పుడూ అనలేదు అనను.

ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలున్నాయి మనమే సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం అని అంటున్నాను.

MEWA said...

ఇండియన్ మినర్వా గారు ,
ఒకరిని ద్వేషించటం నా అభిమతం కాదు .కాని నిహారిక గారు చేసిన కామెంట్ చండాలంగా ఉంది .
అందరిని కలిపి అనడం సరి కాదు . ఇది నిజమే కాని మీరు చూసిన బ్రామ్హిన్స్ లో ఎంతమంది
శారీరక శ్రమ చేసేవారు ఉన్నారు ?ఒకవేళ ఉన్న అది వారి స్వంత పని అయి ఉంటుంది .
ఇంకొకరి పనులకు కూలికి వెళ్ళిన ఎంతమంది బ్రమ్హిన్స్ ను మీరు చూసారు? మీ ఆత్మ సాక్షిగా చెప్పండి.

Kathi Mahesh Kumar said...

నిహారిక: "మేము మీ భుజాల మీద ఎక్కి ఎగిగేశాం. అయినా మీరు బలిసి కిందున్నారు" అన్నట్టుంది మీ ఆర్గ్యుమెంట్. మీ ఉద్దేశం, ఆలోచనే అవే. అందుకేదాన్ని అగ్రకుల ఆభిజాత్యం అంటున్నాం. సమాన అవకాశాలా???? ఎక్కడున్నాయో కాస్త చెప్పండి!

malli said...

మహేష్ గారూ...
విగ్రహాలు పెట్టించుకోవడమో,అవార్డులు పొందడమో...అధికారాన్ని ప్రదర్శించడమో అగ్ర వర్ణాల వారు చేసినపుడు,దళితులు చేసినపుడు సమాజ స్పందన వొకేలా ఉండడం,ఇంకా చెప్పాల్సి వస్తే దళితులు చేసినపుడు మరింత గగ్గోలు పుట్టడం, దాన్లోని వివక్ష, అది మీకు కలిగించిన నెప్పి లోంచే మీరీ పోస్ట్ రాసారన్నది స్పష్టం...
కులాన్ని గురించి ఎవరైనా ప్రస్తావించినపుడు 'ఈ కాలంలో కూడా ఇంకా కులాల గురించి మాట్లాడడమేంటీ!'అన్న ఆశ్చర్యం సహజంగా ముందు అగ్ర వర్ణాల వారికే వస్తుంది...ఎందుకంటే కులాలని మరిచిపోయి హాయిగా కుల రహిత అద్భుత సమాజాన్ని కల కనే వెసులుబాటు వారికి ఉంటుంది.కానీ దళితులకి అలా కాదు కుల వివక్ష వారిని ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఎదిగినా ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంటుంది...హీనమైనవి గా చెప్పబడ్డ తమ కులాలలోంచీ సంస్కృతి లోంచీ నిలబడి ముందు తమ ఉనికిని తాము గుర్తించుకోవడం కోసం పెనగులాడుతున్న దళితులు యిపుడు లేవనెత్తుతున్న ప్రశ్నలూ చేస్తున్న వాదనలూ మానవ సమాజానికంతటికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు.కానీ వారు తమ నిల్చున్న చోటు గురించిన స్పృహతో మాట్లాడుతున్నారు...
మల్లీశ్వరి.

Anonymous said...

సమానావకాశాలా ?అవేక్కడున్నాయ్ ?మీకు వున్నన్ని రిజర్వేషన్ లు ఇంకేవరికున్నై ?చదువులలో ,వుద్యోగావకాసాల్లో మీకు లేనివేంటి ? అగ్రకులాలు అని ఏదో మీరు వేలేతి చూపడం తప్ప ,వాళ్ళ మెరిట్ కి ఇప్పుడు విలువ ఉందా చెప్పండి మహేష్ గారు.

నీహారిక said...
This comment has been removed by the author.
Mauli said...

దళిత నాయకురాలని మీరు, మహిళా నాయకురాలని మహిళలు అ౦తా మాయావతి ని గొప్ప చెప్పుకోవచ్చు కాని, ఎవరి విగ్రహాలు వారే పెట్టుకొనే స్థాయి కి మన దేశ పరిస్థితులు దిగాజారాయా (తప్పదేమో, పీ వి కి రాజధాని లోను , రాష్ట్రం లోను దక్కిన మర్యాద తో పోల్చిచూస్తే ఎవరి విగ్రహాలు వాళ్ళే బతికు౦డగానే పెట్టుకోవాలి :) ).

luckysonu said...

నిహారికా గారు ,
నీను ఎవరిని కూలికి వెళ్లి అక్కడ నుండి మొదలు పెట్టమనట్లేదు .కాని ప్రస్తుతం కొతమంది ఇంకా వెనుక పది ఉండటానికి ప్రధాన కారణం ఆ కాలపు బ్రామ్హనుల స్వార్థం .ఇంకా రిజర్వేషన్లు బహుసా ఇరవై సంవ త్సరాలుగా
పూర్తిగా వాడుకుంటున్నారు .కాని ఇంకా అగ్ర కుల ఆదిపత్యం కొనసాగుతోందని అందరికి తెలుసు. గ్రూప్స్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వెనుక బడిన వారికి ఇంటర్వ్యు లో చాల తక్కువ వేసి ఉద్యోగాలు రాకుండా చేయలేదా. ఇంకా ఇలాంటి examples మీరు మనసు పెడితే ఈ దేశం లో చాల కనపడతాయి. ఒడ్డున ఉంటె సమస్యలు తెలియవు madam . నేను ఊరికే ఆరోపణలు చేసే రకం కాదు .త్వరలో మనుస్మృతి లోని విషాలు (విషయాలు) శ్లోకాలు అర్థాలతో మీ ముందు పెడతాను .మీకు ఈనాటి సమస్యల మూలాలు తెలియాలంటే www .luckysonu 99 .blogspot .com చూసి మీరు ఇప్పుడు చేసే వాదన కరెక్టా కాదా చెప్పండి.

Kathi Mahesh Kumar said...

మహేష్ గారూ...
విగ్రహాలు పెట్టించుకోవడమో,అవార్డులు పొందడమో...అధికారాన్ని ప్రదర్శించడమో అగ్ర వర్ణాల వారు చేసినపుడు,దళితులు చేసినపుడు సమాజ స్పందన వొకేలా ఉండడం,ఇంకా చెప్పాల్సి వస్తే దళితులు చేసినపుడు మరింత గగ్గోలు పుట్టడం, దాన్లోని వివక్ష, అది మీకు కలిగించిన నెప్పి లోంచే మీరీ పోస్ట్ రాసారన్నది స్పష్టం...
కులాన్ని గురించి ఎవరైనా ప్రస్తావించినపుడు 'ఈ కాలంలో కూడా ఇంకా కులాల గురించి మాట్లాడడమేంటీ!'అన్న ఆశ్చర్యం సహజంగా ముందు అగ్ర వర్ణాల వారికే వస్తుంది...ఎందుకంటే కులాలని మరిచిపోయి హాయిగా కుల రహిత అద్భుత సమాజాన్ని కల కనే వెసులుబాటు వారికి ఉంటుంది.కానీ దళితులకి అలా కాదు కుల వివక్ష వారిని ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఎదిగినా ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంటుంది...హీనమైనవి గా చెప్పబడ్డ తమ కులాలలోంచీ సంస్కృతి లోంచీ నిలబడి ముందు తమ ఉనికిని తాము గుర్తించుకోవడం కోసం పెనగులాడుతున్న దళితులు యిపుడు లేవనెత్తుతున్న ప్రశ్నలూ చేస్తున్న వాదనలూ మానవ సమాజానికంతటికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు.కానీ వారు తమ నిల్చున్న చోటు గురించిన స్పృహతో మాట్లాడుతున్నారు...
మల్లీశ్వరి.

నీహారిక said...

మల్లేశ్వరి గారు,
మీరు చెప్పింది వాస్తవమే అయినా రోజులు నిజంగా మారుతున్నాయి. మీరు చూడడం లేదా? రిజర్వేషన్లు తీసుకుంటున్నారని.. ప్రతిభ తో కాకుండా తేరగా సీట్లు తెచ్చుకుంటున్నారని అనే వాళ్ళని మీరెప్పుడూ చూడలేదా? అలా అన్నపుడు దళితులకి ఎలా ఉంటుంది? చెప్పండి నాకు.

నీహారిక said...

మహేష్,
మీకు ఒక అబ్బాయో , అమ్మాయో ఉన్నారనుకోండి వాళ్ళు అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి/ అబ్బాయి ని ప్రేమించారనుకోండి మీరెలా స్పందిస్తారు? అగ్రవర్ణానికి చెందిన వారని నిరాకరిస్తారా? అపుడు కూడా మీరిలాగే మాట్లాడతారా?

నీహారిక said...

మహేష్,
నాకు తెలిసి మీరు బాగా గాయపడిన మనస్సుతో వ్రాస్తున్నారనుకుంటాను. మీ కోపం అగ్రవర్ణాల మీద కాకుండా ఇంకేదో ఉందనిపిస్తుంది, మీకోపాన్ని ఇతరుల మీద చూపిస్తున్నారు. మీలోని ఆవేదనకి కారణం సోధించండి. మీరేం కావాలనుకుంటున్నారు? ప్రభుత్వోద్యోగం రాకపోతే జీవితాంతం ద్వేషిస్తూ ఉంటారా? ప్రభుత్వ ఉద్యోగం తప్ప చేయడానికి వేరే పనులేమీ లేవా? అన్నింటికీ ప్రభుత్వం మీదే ఎందుకు ఆధారపడాలి? రిజర్వేషన్లు రేపటి తరానికి ఎందుకు అవసరం ? రిజర్వేషన్లు లేకపోతే మనుష్యులు చనిపోవాలా ? అవకాశాలు సమానంగా ఉన్నాయన్నది భూమి , ఆకాశం, గాలి, నీరు ,నిప్పు అని నా ఉద్దేశ్యం. ఇవి అందరికీ సమానంగా లభిస్తాయి. వాడుకోవడం తెలియాలి. అగ్రవర్ణాలు కూలిపని చేయడం లేదన్నారు. అది వారిని కించపరిచినట్లే కదా ? వారు చేయలేని పనిని మీరు ఎత్తిచూపడం లేదా? అవసరం వస్తే మేము కూడా ఏ పని చేయడానికైనా సిద్ధమే !!

ప్రొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడితే చేతికి వచ్చేది మహా అయితే 500 రూ ఉంటుందేమో !! అదే కష్టమని ఫీలయిపోయి బ్రతికిపోతూ ఉంటాం . కానీ పెట్టుబడి దారీ వర్గం అలా ఆలోచించరు. ఏమీ చేయకుండా డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తారు. దీనికి కులానికి సంబందం లేదు. ఎవరి మానసిక స్థితిని బట్టి వారు సంపాదించాలనుకుంటారు. ఒకరికి కూలి పని చేస్తే చాలు అమ్మయ్య అని తాగేసి పడుకుంటారు. రిలయన్స్ అధిపతి అలా చేయలేదు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూపోయారు. వారు చాలా చిన్న స్థితి నుంది పెద్దగా ఎదిగారు. ఒక స్థాయికి వచ్చాక డబ్బు డబ్బుని సంపాదించిపెడుతుంది. కష్టపడనక్కరలేదు.

Kathi Mahesh Kumar said...

@నీహారిక:మీ వ్యాఖ్య చదివి నాకైతే నవ్వాగడం లేదు. నేను రాసేవన్నీ నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవనే అలోచన మీకెందుకొచ్చింది? ప్రభుత్వోద్యోగం రాలేదనే ఫ్రస్ట్రేషన్ లో నేనున్నాననే మీ ముక్తాయింపు హైలైట్. వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలి కన్సల్టెన్సీ చేస్తున్నవాడిని నేను. కాబట్టి నాకు అలాంటి బాధేదో ఉందనే మీ అపోహ తొలగించుకోండి.

రిజర్వేషన్ విధానాల అమలుపై దళితుల్లో అసంతృప్తి ఉంది. రిజర్వేషన్ల అమలు సరిగ్గా జరగలేదని కేంద్రప్రభుత్వం రిపోర్టులు ఉన్నాయి. రిజర్వెషన్ల మీద అపోహలేతప్ప అవగాహన చాలామంది అగ్రవర్ణాలలో అస్సలు లేదు. అసహనం మాత్రం బోలెడు ఉంది. కాబట్టి రిజర్వేషన్ విధానాన్ని పున:సమీక్షించడం అయితే అవసం. ఆ సమీక్ష జరిగే వరకూ రిజర్వేషన్లు అవసరా కాదా అనేది మీరూ నేనూ అనుకునే విషయం కాదు. అదొక విధానపరమైన నిర్ణయం.

మీరు చెప్పిన వేదాంతాల్లో నాకు ఏమత్రం అర్థం కనిపించడం లేదు. కాబట్టి వాటి గురించి చర్చించను.

malli said...

నీహారిక గారూ,
మారుతున్న రోజుల్ని నేను చూస్తున్నానా లేదా అని కాదు.... నేనెలా చూస్తున్నాను మీరెలా చూస్తున్నారు అన్నదే కదా యిపుడు సమస్య.
మీ ప్రశ్న స్పష్టం గా అన్పించలేదు...నాకు అర్ధమైన పరిధి లోంచి మాట్లాడతాను.రిజర్వేషన్ల మీద వొక స్టాండ్ తీసేసుకుని దళితులు తేరగా సీట్లు తెచ్చుకుంటున్నారంటే వాళ్లకి అవమానంగా ఉండదా అని మీరు సూడో జాలిని ప్రదర్శిస్తున్నారు.దళితుల ఆత్మాభిమానం పట్ల మీకు అంత అభిమానం ఉండడం మంచిదే....అందుకే మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సింది...రిజర్వేషన్ల ని యిపుడు దళితులు హక్కుగా పొందుతున్నారు....కాబట్టి మన జాలి అనవసరం.
పోనీ మీ ఆత్మాభిమాన సిద్ధాంతంలోంచి మాట్లాడినా సరే ఆత్మాభిమానం కన్నా ఆకలి పెద్దది...
మల్లీశ్వరి

నవజీవన్ said...

ఈ కాలం లో కూడా కులాల మీద ఇంత పెద్ద చర్చ?/ఆశ్చర్యమేసింది..ఇప్పుడున్న పరిస్థితులలో కులం అనేది ఒక వాస్తవంగా మారింది.అయితే దానిని పేదరికం ప్రాతిపదికగా మార్చేవరకు కుల సమస్య పోతుందని అనుకోజాలం.“కులం అనేది మన జీవితాల్ని ఇంకా శాసిస్తూనే ఉంది. కులం అనేది భారతీయుల మైండ్లలో పాతుకు పోయింది” కానీ భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే! కుల వివక్ష భరించలేకే మతం మార్చుకున్నారని ఒకప్పటి భారతదేశ మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు కృష్ణన్ నివేదిక ఇచ్చారు.మరి దీనికేమంటారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని అయన చెప్పారు.మతం మత్తు మందు అని చెప్పి, కులాన్ని కూడా మతంలో అంతర్భాగంగా పరిగణించి, ప్రత్యేక కుల అస్తిత్వాన్ని గుర్తించనవసరం లేదని చాలామంది వాదించడానికి కులపుట్టుక ఒక బలమైన కారణమే. కులం అనేది ప్రధానంగా హిందూ మతభావన నుండే పుట్టినా, గుణ, కర్మ విభాగాలు ఆచరణలో చెప్పిందానికి విరుద్ధంగా మానవత్వాన్ని విధ్వంసం చేసి, మరిన్ని కులాల ఆవిర్భావానికి కారణమైంది. హిందూ మతం, ప్రపంచవ్యాప్తంగా కుల భావన లేని మతాల్లోనూ కుల విభజనలకు మార్గం వేసింది. అలా ప్రవేశించిందే క్రైస్తవం, ముస్లిం మతాల్లోను కులం. నేడు భారత దేశం నుండి అనేక దేశాల్లో విస్తరించి, కులం ఒక ప్రపంచ సమస్య అయ్యింది. అందుకే కేవలం కులాన్ని మతంలో అంతర్భాగంగా మాత్తమ్రే చూస్తే సరిపోదు. దాన్నొక ప్రత్యేక సామాజిక సమస్యగానే పరిగణించాలి. కులాల కోసం కొట్టుకోవడం మానుకోవాలి .

నీహారిక said...

I did not remember today or tomorrow is your birthday ?

Anyway advance birthday wishes for you.

wish you a very happy birthday, and wish to tell you the secret to success on your special day. People achieve only what they deserve, and deserve only what they achieve. Always remember, your success depends on you and you alone.

Enjoy your day !!!

Anonymous said...

charithra thelusukondi....
anavasaramga comments cheyakandi.
ipudu dalits ki reservations avasaram ledu, adhi ipudu political issue ayyindhi,
reservations valla ipudu dalits limited avuthunnaru,

exam paper lo s.c/s.t ani kanipisthe chalu 30% marks cut,


oka madhiga student ga chepthunnanu , maku ipudu reservations avasaram ledhu, memu limited avuthunnam

Trader said...

baabu kaththi.. ur madness has reached its peaks.. better come down by yourself before falling from there.

i cant expect some one being idiotic to this extent.. omg.. u need rehabilitation.

sudhakar said...

ఇక్కడ లాజిక్ లో చిన్న మెలిక ఉంది సర్, మిగతావి వాళ్లకు వాళ్లు కట్టుకోలేదు, ఇక్కడ ఈవిడ తన విగ్రహాల్ని తానే కటించుకొంటుంది
దీన్ని స్వీయ ఆరాధన అంటారు కోంత కాలానికి నేనె దేవతని నన్నే పూజించండి అనే దాకా వెళుతుంది వ్యవహారం.