Friday, February 11, 2011

వినాయక్ సేన్ ను ఉరితియ్యండి

తనతో పాటు వైద్య విద్య నభ్యసించిన వారు విదేశాలు ఎగిరివెళ్లి కోట్లు గడించాలని అలోచించే సమయంలో చత్తీస్ గఢ్ లోని ఒక మారుమూల ప్రాంతంలో అభాగ్యులకు సేవచేయాలనుకోవడమే ఆ డాక్టర్ సాబ్ చేసిన పెద్ద తప్పు.  మావోయిస్టుల ఏరివేతకొరకు చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంతక ముఠా “సాల్వాజుడుం” సాగిస్తున్న అరాచకాలపై వినాయక్ సేన్ గళమెత్తడంతో ఆయన చేసిన నేరం. కాబట్టి శ్క్షించాల్సిందే...యావజ్జీవ శిక్షెందుకు ఏకంగా ఉరి తియ్యాల్సిందే. అప్పుడుగానీ ఈ ప్రజాస్వామ్యమనే బూటకం వెనకనున్న కార్పొరేట్ల కుట్రల ముసుగు తొలగదు.

వినాయక్ సేన్ గురించి మరింత సమాచారం కొరకు చూడండి: http://www.binayaksen.net/

***

5 comments:

Praveen Mandangi said...

ఉరి కంభానికి జంధ్యం ఉంది. అది సంధ్యావందనం చేసి వేదాన్ని వల్లించే ఘనాపాటి. అణగారిన కులాల పక్షాన నిలిచినవాడు తమ కులంవాడైనా అతని గొంతుని బిగపట్టి వేలాడదీస్తుంది.

కెక్యూబ్ వర్మ said...

ఈ డిమాండ్ తో మీకు నోబెల్ శాంతి బహుమతిచ్చేయగలరు సార్..

బాగుంది మీ స్పందన..

gaddeswarup said...

Mohammad Younus seems to be facing problems too. My guess: when people do work that the governments should be doing and are not in cohorts with the respective governments, the governments see them as threats either then or in the future. Even organizations like Ramakrishna Mission which scrupulously keep away from politics had problems with West Bengal government. This seems to be a big problem for NGOs.

yahoo said...

anduke e desam ela adchindi

sunnitham said...

వినాయక్‌ సేన్‌ వంటి ప్రజాస్వామిక వాదిని బెయిలుపై విడుదల చేయడం ఆహ్వానించదగిన పరిణామం.ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామిక సూత్రాలను సుప్రీం తీర్పు మరోసారి బహిర్గతపరిచింది. మావోయిస్టుల అర్థ రహిత హత్యా రాజకీయాలపై కూడా ప్రజాస్వామిక చర్చలు జరగాలి. దేశవ్యాప్తంగా బూటకపు ఎన్‌కౌంటర్ల వార్తలు తరచుగా చూస్తున్నాం. ఇందుకు విరుద్దంగా బెంగాల్లో ఒక్క బూటకపు ఎన్కౌంటర్ర్ లేకపోవడం గమనార్హం. కొన్ని సంవత్సరాలుగా ప. బెంగాల్లో మావోయిస్టుల హత్యా రాజకీయాలు మితిమీరినాఈ. అనేక మందిని హత్య చేసారు. ఉపాధాఇయ్లను కూడా కాల్చి చంపారు. ప్రజాస్వామిక హక్కులను గౌరవించాల్సిన బాధ్యతను మరచి భయోత్పాతం సృష్టించి లబ్ది పొందాలని ఆశిస్తున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని మమతా మావోయిస్టులకు సంపూర్ణ సహకారం అందిస్తోంది.