Wednesday, February 23, 2011

"ఓయు"ద్యమం

"ఈ పెద్ద ఉద్యమం ముందు మా చదువులు చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి." - ఒక విద్యార్థిని, ఉస్మానియా యూనివర్సిటీ.
కొన్ని ఆశయాల ముందు జీవితాలు చిన్నవి అనిపించని జీవితాలూ జీవితాలేనా !?
ఉద్యోగాలకోసం యువతా! ఉజ్వల భవిష్యత్ నిర్మాణానికి ఉద్యమించడానికి యువతా! ఏది సరైంది?
 

39 comments:

Anonymous said...

రాజశేఖర రెడ్డి బతికి ఉంటె ఈ "అతి" గొప్ప తెలంగాణా ఉద్యమం పరిస్థతి ఏమిటి సారూ?
అన్ని మూసుకొని ఎవరి పని వారు చేసుకుంటూ ఉండేవారు.

సుజాత వేల్పూరి said...

అవును, చదువులూ వద్దూ, ఉద్యోగాలూ వద్దు! ప్రత్యేక రాష్ట్రం రాగానే కుప్పలు తెప్పలుగా ఉద్యోగాలు వచ్చి పడతాయనే భ్రమలో ఉండబట్టే ఈ ఉన్మాద స్థాయి కి చేరింది ఉద్యమం! భ్రమలు పటాపంచలై వాస్తవ జీవితం నగ్నంగా కళ్ళ ముందు నిల్చున్న రోజు గుర్తొచ్చేది జానెడు పొట్టే! ఇప్పుడు ఉజ్వల భవితకోసమే యువత అని కీర్తించిన నోళ్ళు, ఆ రోజు కనుచూపు మేరలో ఉండవు.

నిజంగా చదువుకునే విద్యార్థులు, చదువుకుంటే గానీ భవితలేని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో ఎవరికీ అక్కర్లేదు.

ఎవరితో ఎందుకు పోరాడుతున్నారో కూడా తెలీని ఈ పోరాటానికి దశ, దిశ రెండూ లేవు.

ఎప్పుడైనా ఉద్యామాలను ముందుకు తీసుకుపోయేది, చివరికి బలిపశువులై మిగిలేది విద్యార్థులే! కానివ్వండి

Anonymous said...

దీన్నే అతి అంటారు

Anonymous said...

ఖబర్దార్ ఆజాకర్లారా......... ఖబర్దార్.
.........ఆజాకర్..........
ఆంధ్రా రజాకర్లకు అత్కినట్లున్న పదమ్.

అప్పటి తెలంగాణ పోరాట వీరులు రజాకర్లను తరమి తరిమి కొట్టిండ్రు. ఇప్పుడు మనొంతు. ఈ అబద్దాలా ఆజాకర్లను చార్మినార్ దగ్గర గెదిమిగెదిమి కొట్టనీకి మనకిదే మంచి మొకా. ఒరేయ్ సిగ్గుశరమ్ లేని అజాకర్లారా, దమ్ముంటే ఒక్కసారి ఉస్మానియాకొచ్చి అనుండ్రా మీరంటున్న శరమ్ లేని మాటలు. అప్పుడు చూపిస్తమ్ తెలంగాణ దెబ్బ ఎట్లుంటదో.

అజాకర్లకు ఆరిపోయే దినమ్ దగ్గరవడ్డది కొడకల్లారా. దినాల్లెక్కవెట్టుకోండ్రి.

Anonymous said...

సుజాత గారు కరెక్ట్ గా చెప్పారు...ప్రత్యేక రాష్ట్రం రాగానే స్వర్గ సుఖాలన్నీ వాకిట్లో వాలిపోతాయి కాబోలు...కష్ట పడి ఫీజు కట్టే తల్లిదండ్రులకు తెలుస్తుంది బాధ

ఆ.సౌమ్య said...

సుజాతగారు బాగ చెప్పారు. ఈ గొడవల్లో విద్యార్థులని చూసినప్పుడల్లా నాకు ఒక డౌటు వస్తూ ఉంటుంది. ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? వాళ్లూ వీళ్ళని ప్రోత్సహిస్తున్నారా లేక వారి మాట పెడచెవిన పెట్టి ఈ పిల్లలు ఇలా పోరాటం అంటూ బలి అవుతున్నారా అని.

Kathi Mahesh Kumar said...

@ఆ.సౌమ్య: పట్టాపట్టుకుని పొట్టపోసుకోమని చెప్పడంకాదు, కొడుకు నుదిటిన తిలకందిద్ది పోరాటానికి పంపే తల్లిదండ్రులు తెలంగాణాలో ఇంకా ఉన్నారు. వాళ్ళ ఆశల్ని ఆవేదననీ, ఆవేశాన్నీ ఎగువమధ్యతరగతి దృష్టికోణంలోంచీ చూస్తే మూర్ఖత్వమే.

నిజానికి భగత్ సింగూ, సుఖ్ దేవ్, ఆజాద్, బిస్మిల్ కూడా మూర్ఖులే. బ్రిటిష్ వాళ్ళ గౌరవపరిపాలనలో చదువుకుని పట్టాలు పుచ్చుకుని ఉద్యోగాలు చేసుకుని హాయిగా ఉండక పోరాడి ప్రాణాలు విడిచారు. అనవసరంగా గొడవల్లో దూరి దొంగతనలూ, లూటీలూ, హత్యలూ చేసి హతమయ్యారు.Why the hell are we so proud of them?

ఆ.సౌమ్య said...

వారి ఆవేశాలను, emotions ను కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. ఇందులో ఉన్న రాజకీయ లాభాలకు, మోసాలకు విద్యార్థులు బలి అయిపోతున్నరనే నా బాధ. అలా వీర తికలం దిద్దించుకుని అశువులు బాసిన ఎంతమంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౄర రాజకీయం అర్థమవుతున్నాది. ఒకవేళ నిజంగా తెలంగాణా వస్తే వీరంతా ఊహించుకుంటున్నా స్వర్గధామం కనిపిస్తుందా? లేక ముదురు రాజకీయనాయకుల హస్తగతమవుతుందా....ఇదే సుజాతగారి వ్యాఖ్యల్లో కూడా అర్థం. పైన ఎవరో అడిగినట్టు YSR ఉంటే ఇంత తంతు జరిగేదా? అప్పుడు ఏమయిపోయేది వీళ్ల పౌరుషం?

సుజాత వేల్పూరి said...

భగత్ సింగూ,సుఖ దేవ్,ఆజాద్, బిస్మిల్.....దయచేసి వాళ్ళ పేర్లు ఈ సందర్భంలో ఎత్తకండి సార్! సిగ్గేస్తోంది

Srikrishna Chintalapati said...
This comment has been removed by the author.
Kathi Mahesh Kumar said...

@సుజాత: వీళ్ళని వాళ్ళతో పోల్చడంలేదు. మన ధృక్కోణం చెబుతున్నాను. I am sure many including Mr.M.K.Gandhi ఆరోజుల్లో భగత్ సింగూ,సుఖ దేవ్,ఆజాద్, బిస్మిల్ గురించి మీరు ఉస్మానియా విద్యార్థుల్ని అనుకున్నట్లే అనుకున్నారు. The situation is not very different.

@ఆ.సౌమ్య: ఆశయాలకోసం పోరాడేటప్పులు ఫలాల్ని ఆశించరు. ఫలితం సిద్ధిస్తుందనే నమ్మకంతో పోరాడతారు.రాజకీయాలతో నిమిత్తం లేకుండా విద్యార్థి ఉద్యమం తనదారి తను ఎంచుకుంది. ఆ ఉద్యమస్ఫూర్తిని నేను అభినందిస్తాను. YSR ఇప్పుడు ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేది అనేది ఒక speculations. Let's not get in to that. It leads us nowhere.

Srikrishna Chintalapati said...
This comment has been removed by the author.
yab said...

ఉద్యోగాలకోసం యువతా! ఉజ్వల భవిష్యత్ నిర్మాణానికి ఉద్యమించడానికి యువతా! ఏది సరైంది?

- a thought provoking question.

nice one Mahesh.

Anonymous said...

@Srikrishna Chintalapati

కొన్ని ప్రశ్నలకి సమాదానాలుండవు.. అంతే.

Anonymous said...

@మహేష్ గారు

నిజంగా ఉజ్వల భవిష్యత్ అంటూ ఉంటే ఆ భవిష్యత్తుపునాది నిర్మాణానికి యువత తప్పకుండా ఉద్యమించాలి. తర్వాతి తరాలకి మంచి భవిష్యత్తు అందుతుంది అనుకున్నప్పుడు ఒకతరం నష్టపోయినా పర్లేదు అని నా అభిప్రాయం.

ఇక ఉద్యమమంటూ మొదలుపెట్టి నతర్వాత కొన్ని ఆటుపోట్లు సహజమే. అందులోకి కొన్ని స్వార్థపుశక్తులూ ప్రవేశిస్తాయి, యువత భవితతో ఆడుకుంటాయి కూడా. అయితే "యువత భవిష్యత్తు" అంటూ కుంటి సాకు చూపించడమ౦టే యువతని తద్వారా ఉప్పొంగుతున్న ఉద్యమాన్ని నిరుత్సాహపరచడమే. నిజానికి ఇలా౦టి కుంటి భావాలంటూ మొదలైతే ఏ ఉద్యమమూ గట్టిగా నిలబడదు, పైగా మొదలవదు కూడా. దీనికి పరిష్కారం ఉద్యమ మేథావులు స్వార్థపుశక్తులుని ఎప్పటికప్పుడు కనిపెడుతూ వాటిని ఏరిపారేస్తూ పోవడమే. ఇది అంత సులభం కాదు అని తెలుసు కనుక కొన్ని బలిదానాలు తప్పవు అది ఏ ఉద్యమమైనా సరే.

మీరు విద్యార్డులని భగత్ సింగ్ తదితరులతో పోల్చారు. అందులో నాకు తప్పేం కనిపించలేదు. పోరాటంలో భాగస్వాములుగా విద్యార్దులుగా అప్పుడు, ఇప్పుడు భగత్సింగులే. తేడా అప్పటి, ఇప్పటి రాజకీయనాయకులు లేదా ఉద్యమనేతలు.


విద్యార్దుల భవిష్యత్తు అని వాపోయేవారు దానికి తగిన పరిష్కారం, ఉద్యమానికి దెబ్బ తగలకుండా, మీద కూడా వ్యాఖ్యానిస్తే బాగుంటుంది.

Rajeev Reddy

Anonymous said...

comparison cheyanappudu bhagatsing etc vaallla perlu ikkada cherchaalsina avasaram emochindi, bhagat singh suicide chesukoledu, aayana adrushtam baagundi aayani aatma hathya ku prerepinche kshura raajakeeya ganaalu appatlo levu, ippudu mee telangana vaalla kharma gaali, naayaka manyullo, gharana dongalu cheri, yuvathanu recha gotti sommu chesukuntunnaaru, udyamam musuglo jarige ee balavantapu veera tilakam diddadaalu, aatma hathyaa ghattaalanu entha twaraga aapithe antha manchidi, ika veetini samarthinche vaaru, mundu samarthinchadam maani, meeeru oka veera tilakam diddukoni aatma hathya chesukondi peeda viragada avuthundi, udyamam ante room lokelli fan ki thaadu biginchi chaavadam kaadu, kirosine meeda posukoni nippu antinchukovadam kaadu, thootaalaku edurugaa nilichi nilabetti adagandi kaavalasindi ento, appudu pooluddaam veellandarni bhagat signhu latho, azad latho, rajaakaarlanu tarimi kottinaa nijaamu paalana lo magguthunte sardar patel, center nundi milatary ni teeskochi nijaam ni tarimesaadu, appudu nijamaina swaathantram vachindi telangana ku

Kathi Mahesh Kumar said...

@Srikrishna Chintalapati : సమస్యలపై ఉద్యమించే ప్రతి విద్యార్థికీ నా మద్దత్తు ఉంటుంది. అది ప్రాంతాలకు అతీతంగా ఉంటుంది. I believe in active participation of students in socio- political process.

Anonymous said...

There used to be a thing called idealism. Now it's lost. And it's lost, in a different way to politics and propaganda. No one is pure - Naxals or Leaders or Students.
Any act of rebellion while the stomachs are half full gets corrupted.

రక్తచరిత్ర said...

I suggest all Market yards in Telangana should be burned for want of Telangana... all Cinema halls, All busses running in Telangana ... all Universities Osmania and Kakathiya should be destroyed for want of Telangana...Govt ki buddhi raavali antey... veedi illu vaadu thagalapettali ... vaadi illu veedu thagala pettukovaali.. Kodanda ram gaadini Jaya shankar gaadu man handle cheyaali... KTR gaadu Kavitha ni thanni thagilyeali , KCR gaadu Nayani Narasimha Reddi gaadini Suicide note tho champeyaali...
Nijamgane atla chesthe ... AP can become Heaven again.

Anonymous said...

Mahesh , you make total sense to me . Don't let anybody tell you anything otherwise... !! Most revolutions see the light of the day because of this all consuming energy from an ideologically consummated youth . The people on the other side of the aisle , might condescendingly view this as an escapism from reality or more brazenly as idylling time away rather than as a segue into better world . What do I call such nincompoops ... bigots or hypocrites or simply scaredee cats ... !!!

Jai said...

Mahesh, I am impressed both by your ability to think through the events and your courageous conviction. Keep up the great work!

Surya Mahavrata said...

ఉద్యమకారులవే కాదు సార్ ఉద్యోగస్తులవి కూడా బ్రతుకులే. అందరూ కాల్చుకుంటూ కూల్చుకుంటూ పోతే వాటిని కొనడానికీ కట్టుకోడానికీ అవసరమయే పన్నులు నోరుమూసుకు కట్టడాన్ని మించిన సామాజిక సేవ ఏముంటుంది. ఒక ఉద్యోగిగా ఇందుకు నేను గర్విస్తున్నాను. ఒకర్ని సంతృప్తి పరచడం కోసం ఇంకొకరిని అనవసరంగా నిందించడం భావ్యం కాదు.

AbdulKaleem said...

ఇక్కడ తెలంగాణా ఉద్యమాన్ని గురించి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల గురించి మాట్లాడటం అబ్సర్డ్ గా ఉంది. ముందుగా రాష్ట్రం కావాలా లేదా స్వతంత్రం కావాలా అనేది ఆలోచించుకొని మాట్లాడటం మంచిది. మరొక విషయం ఏమిటంటే మా తెలంగాణా గొప్పది కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని పిల్లలకు నూరిపోయడం వల్లే ఉద్యమం పక్కదారులు పడుతుంది. సీమాంధ్ర వాళ్ళు రాక్షసులు అని ద్వేషం పుట్టించే కెసియార్ గారి మాటలవల్లే ఉద్యమం అడ్డ దారులు తొక్కుతుంది అని కూడా గమనించాలి. నిజం చెప్పాలంటే ఏ దేశం,ఏ రాష్ట్రం, ఏప్రాంతం మరొకరి కంటే గొప్పది కాదు. ఈ విధమైన విపరీతపు ప్రాంతీయ భావనలవల్ల, విద్వేషాన్ని నింపుకున్న ఉద్యమాలవల్ల మనం తిరిగి మన పాత భారత దేశం గా మారడం (500+ స్వతంత్ర రాజ్యాలుగా)ఖాయం
. ప్రత్యేక రాష్త్రం కావాలంటే ఉద్యమాలు చేయవచ్చు. కాని శాస్త్రీయ భావన లేని, ద్వేషాన్ని బేస్ గా చేసుకున్న ఉద్యమాల వల్ల రాష్ట్రం వచ్చినా అది తెలంగాణ లోని పెట్టుబడిదారులకు తప్ప మరెవరికీ ఉపయోగం ఉండదు.
ఆ విధం గా తెచ్చుకున్న రాష్ట్రం అభివృద్ధి చెందం మాట ఏమో గాని ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారడం ఖాయం. అందువల్ల ఉద్యమాన్ని ఆయుధంగా మలుచుకున్న విద్యార్ధులు శాస్త్రీయపధ్ధతిలో నడిచి విజయం సాధించాలని నా వినతి. లేకుంటే ఏ ఆయుధం పట్టిన వాడు ఆ ఆయుధం తోనే హతమవుతాడన్న నిజం వారే గ్రహిస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో అవినీతి రాజకీయుల చేతిలో, దోపిడీ దారులైన పెట్టుబడిదారుల చేతిలో మోసపోయిన రోజున.

Anonymous said...

@Mahesh :
I have been restraining myself from publishing a post in response to this.But, i could not stop from putting it into the following lines as a comment.

1.Firstly,Is it a 'thoughtful' question?; No, Its a 'loaded' question.

2.Mr.Gandhi ensured that there was massive 'active participation of students' in socio- political process.Bhagat singh was one such individual.But Gandhi disapproved all acts of violence in general. So,invoking Gandhi to represent our mindset is a distortion.

3.Invoking Bhagat Singh,may perhaps be allowed .In fact, the selfless emotional state of Bhagat singh and Nathuram Godse may not be much different.Neverthless, i assume both of us would appreciate the selfless act of Bhagat Singh vis-a-vis that of Godse. Thus,let me say this about his act. Bhagat's action was not a 'mindless' sacrifice. There was immense 'thinking' in it - the kind of thinking that goes in "ఉరితియ్యండి"

Now, one question. Do YOU want a seperate state for Telangana?

Kathi Mahesh Kumar said...

@రేరాజు: I want Telangana because Telangana people want it. And I see their point of view and empathize with it.

Vivke said...

@కత్తి మహేష్ గారు,
మీ సర్టిఫికేతీస్ (సెర్తిఫికాతెస్) అన్ని చించి మీరు కూడా ఉద్యమంలో పాల్గొనండి. అంతేగానీ మీరు హాయీగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇలా చెత్త రాతలు రాస్తూ మా తెలంగాణా అమయక విద్యార్ధుల బ్రతుకులు తో ఆడుకోకండి.
నేను మిమ్ములన్ను కించ పరచటం లేదు మీ తెలంగాణా ఆశయాని శంకిస్తున్నాను .
మీ కన్నా (కుహన తెలంగాణా వాదులు కన్నా ఆ ఆంద్ర లం.. చాల బెస్ట్ ). వాలు డైరెక్ట్ గా దోచుకుంటే మీరు మా జీవితాలతో ఆడుకుంటున్నారు. (మీరు మాత్రం ఉద్యోగాలు చేసుకుంటూ జై తెలంగాణా అంటారు )
సమాదానం తప్పక చెపుతారు అని ఆశిస్తూ.
మీ వివేక్,

Kathi Mahesh Kumar said...

@వివేక్: ఏమిటి నేను రాసిన చెత్త రాత? ఒక ఉద్యమిస్తున్న విద్యార్థిని మాట్లాడిన మాటను యధాతంగా చెప్పి నా ఆలోచనల్ని పంచుకోవడమా!

అవును నేను హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. అయితే ఏంటి.. విద్యార్థి ఉద్యమానికి సపోర్టు చెయ్యకూడదా? నేను నా టపాలో కొన్ని ఆలోచనలూ కొన్ని ప్రశ్నలూ మాత్రమే అడిగాను. వాటికి సమధానం నా దగ్గరలేదు. I am thinking loud, అంతే నా బ్లాగులో నేను చేసేది అదే. I don't see any reason for you to get so agitated about it.

Viswanath said...

>>> ఉద్యోగాలకోసం యువతా! ఉజ్వల భవిష్యత్ నిర్మాణానికి ఉద్యమించడానికి యువతా! ఏది సరైంది?

Meeru edithe aacharinchi choopistunaro ade sarindi ....

gaddeswarup said...

Why not have a plebiscite and be done with it?

Kathi Mahesh Kumar said...

@గద్దేస్వరూప్: ప్లెబిసైట్ ఎక్కడ ఎవరికి అనేదేకదా సమస్య. తెలంగాణా ప్రాంతంలో తెలంగాణా కావాలా వద్దా అంటే కావలనే అంటారు. అందులో ఏ సమస్యా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అడిగితే తేడా వస్తుంది. అడగాలా వద్దా అనేది కదా అతిపెద్ద సమస్య.

Vivek said...

@Katti Mahesh
Mari Meeru Acharinchi chupu tar Mahesh garu

Leka avado jeevitannni nasanam chesukoni telangana teste inko manchi position enjoy cheddam anukuntaraa

Vivek

Jai said...

@Mahesh re referendum/plebiscite:

"ప్లెబిసైట్ ఎక్కడ ఎవరికి అనేదేకదా సమస్య"

No, you have yourselves answered when you said: 'I want Telangana because Telangana people want it"

There is no justification or precedent in asking the whole state. Because the demand is made on behalf of the people of Telangana, their opinion alone counts.

SRC report said: "The wishes of the people, to the extent they are objectively ascertainable and
do not come into conflict with larger national interests, should be an important
consideration in readjusting territories of the States".

The phrase "larger national interests" can not be (mis)interpreted to mean the "wishes of the residual state"

Jai said...

@Mahesh re referendum/plebiscite:

"ప్లెబిసైట్ ఎక్కడ ఎవరికి అనేదేకదా సమస్య"

No, you have yourselves answered when you said: 'I want Telangana because Telangana people want it"

There is no justification or precedent in asking the whole state. Because the demand is made on behalf of the people of Telangana, their opinion alone counts.

SRC report said: "The wishes of the people, to the extent they are objectively ascertainable and
do not come into conflict with larger national interests, should be an important
consideration in readjusting territories of the States".

The phrase "larger national interests" can not be (mis)interpreted to mean the "wishes of the residual state"

chakri said...

ఏదో జీవితాలు బాగుపడతాయి..ఉదోగాలోచ్చి ఉళ్లు ఏలుతాము అని కాదు.. ఉనికి కోల్పోతున్నాం అనే భావన, నేట్టివేయబడుతున్నాం అనే భయం. అణగదొక్క బడుతున్నాం అనే బాధ.
ఇది మీ ఇంటి పక్కవాడు రోజు రోజుకీ మీ ఇంటివైపు జరుగుతుంటే .. మీకెలా ఉంటుంది ? మనవాడే, పక్కవాడే..కాని ఉన్నదగ్గర ఉండకుండా మీ వైపు జరుగుతుంటే ఎలా ఉంటుందో అలాంటిది. " రోజు పొద్దున్నే లేచి సందడి సందడి చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది ?
ఉన్నవాడు ఉండకుండా..రండి రండి అని మొత్తం తన వర్గాన్ని తీసుకోచ్చేసి నానా రచ్చ చేస్తుంటే ఎలా ఉంటుంది ??
ఇసంత రా అంటే ఇల్లంతా నాదే"అనే రకాలతో వేగలేక..ఇదంతా..

Money Purse said...

Dear Chakri, if the people of Bangalore (Kannadigas)feels in the similar way (my home, my place and my jobs), 80% of the IT employees in Bangalore will have to vacate Bangalore to return to their home state/city. But they never closed Bangalore/Karnataka for others, because its part of India and you have the right to live anywhere in India. ILLU MEEDAYINAPPUDU EVARU MEE INTIVYPU JARAGARU, KANI MEERU ILLU AMMITE VERE VALLU KONTARU. If you don't want then to enter your house, don't sell it to them for Rupees.

Indian Minerva said...

యువకులు ఉద్యమాల్లో పాల్గుంటున్నారంటే భేషో!! ఆహ్వానించాల్సింద్వే. మరి అదే ఉద్యమాలమీద వాళ్ళ అవగాహన స్థాయి ఎంత అనికూడా ఆలోచించాలికందండీ. వాళ్ళలో ఎంతమంది తమతమ వాదనలతో (చావగొట్టిచెవులుమూయడం ద్వారాకాదు) ఇతరులని ఒప్పించగలరు? అవగాహన కొరవడిన ఆవేశం సమర్ధనీయమా? ఏదీ ఇప్పుడు మళ్ళీ ఈ contextలో భగత్ సింగ్ గురించి మాట్లాడండి. తమకంటూ ఒక దృక్పధం లేకుండా రాజకీయనాయకులు చెప్పునపనల్లాచేసిపెట్టే వీళ్ళకి ఉద్యమకారులన్న పదం అతకదేమో మాష్టారూ.

David said...

తెలంగాణా గడ్డపై పుట్టిన బిడ్డగా....ఉస్మానియా విద్యార్థిగా...మీ మద్యతరగతి మనస్థత్వ అభిప్రాయాలను చుసి సిగ్గుపడుతున్న...

John said...

/దమ్ముంటే ఒక్కసారి ఉస్మానియాకొచ్చి అనుండ్రా మీరంటున్న శరమ్ లేని మాటలు. /

ఉగ్రవాదులకు వ్యతిరేఖం గా మాట్లాడాలి అంటే..పాకిస్తాన్ వెళ్ళాలా ? ఇక్కడి నుండి కూడా మాట్లాడచ్చు...

krishna said...

మహేష్ గారు, మీ నైతిక మద్దతుకు ధన్యవాదాలు.
ఇక్కడ కామెంట్స్ రాస్తున్న వాళ్ళకు ఉన్న అవగాహన కంటే విద్యార్థుల్లో ఉన్న అవగాహన పాలు ఎక్కువే. కానీ ఆవేశం పాలు కూడా ఎక్కువే,అదే ఈ ఆత్మహత్యలకు కారణం. ఆత్మహత్యలను ఎవరు సమర్థించారు? కానీ స్వచ్చందంగా ఉద్యామిస్తున్న విద్యార్థులను, ప్రజలను టెంప్‌లేట్ లో జీవితాలను వేళ్లాధిస్తూ, సాఫ్ట్‌వేర్ విండొస్ నుండి చూసే వాళ్ళు వెటకారంగా కామెంట్ చెయ్యడం ఎంతవరకు సమంజసం...? మీకు చేతనైతే కలిసి ఉద్యమించండి. లేదా నైతిక మద్దతు ఇవ్వండి. బ్లాగ్ లు కేవలం బావాజాల వ్యాప్తి కి తప్ప, అసలు ఉద్యమం లో బాగస్వామ్యం కాదని గుర్తించండి. జై తెలంగాణా.