Friday, August 5, 2011

ఈ మధ్యకాలంలో బ్లాగులు రాయాలనిపించలేదు.

ఈ మధ్యకాలంలో బ్లాగులు రాయాలనిపించలేదు.
రాయడం మర్చిపోకూడదని, ఆలోచనలకు అక్షరాల్ని ప్రోదిచేసుకునే అనుభవాన్ని సంపాదించాలని,  రాయడంలోని ఆనందం అనుభవించాలని ఇలా ఏవేవో ఉద్దేశాలతో బ్లాగడం  ప్రారంభించానో అవన్నీ తీరాయన్న నమ్మకంకన్నా, పబ్లిక్ ఫోరంలో అభిప్రాయాల్ని పంచుకుంటే వ్యతిరేకతతోపాటూ విరోధం పెంచుకునే మానసిక స్థితిలోనే మన తెలుగు ఫ్యూడల్ మనస్తత్వాలు ఇప్పటికీ ఉన్నాయనే జ్ఞానం, బ్లాగులు రాయకపోవడానికి ఎక్కువ కారణమేమో అనిపిస్తోంది. It is sad but, true. భయంకాదు, చిరాకు ఈ గోలంటే.
ఇంకోకారణం, ఈ గోలంతా లేని alternate medium దొరకడం.  I am happy on FACEBOOK.

13 comments:

Apparao Sastri said...

కత్తి మహేష్ గారు
బ్లాగ్ అనేది మన ఆలోచనలను పంచుకునేది
మన ఆలోచనలు పక్కనోళ్ళకి నచ్చాలి అని లేదు కదా
అందరూ ఏకాభి ప్రాయానికి రావాలంటే కష్టం కదా ( మన సీదంబరం చెప్పినట్లు )
ఎవరి అభిప్రాయాలు వారివి
బ్లాగ్ అనేది మనకి స్వేచ్చనిస్తోంది
కాకపొతే " మీ తాతగారు మా తాతగారిని తిట్టారు కాబట్టి నేను నిన్ను తిడతాను/ నేను బాధ పడ్డాను " అని అనుకుంటే బాధ గానే ఉంటుంది
మీ నుంచి మంచి పోస్ట్ కోసం ఎదురు చూస్తాం

Anonymous said...

thank you for answering me. i may agree you or not but i love to read your blog. i wish you to write regularly.

Anonymous said...

That seems like boorish and childish prattle. Ideological differences is what makes for an interesting conversation. If you take it as a personal affront, debating then is not your forte.
You have autonomy over what you say and do vis a vis your own blog. Face book on the other hand can play voyeur whenever it so wishes. I don't think you are the type who'd trade for make-believe free speech.

గీతాచార్య said...

Hmm! శాడ్ బట్ట్రూ. నిజమే. ఎదుటి మనుషుల్లోని తప్పునే పట్టుకుని వేళాడే విషయమ్మీద ఎన్ని ప్రాం౨కింగులు జరిగినా మార్పన్నది రావటం కల్ల. Anyway, one of the 5 best blogs I prefer to read. పర్సన్స్ కన్నా పర్సనాలిటీస్ తో డీల్ చెయ్యటమనే మీ పద్ధతి ఈ రోజుల్లో అరుదు. నా లిస్టులోంచీ ఒకటి తగ్గించుకోవాలన్నమాట ఇక పైన. సరే! బెస్టాఫ్ లక్. ఫేస్‍బుక్ సంగస్సరే, మీ సినిమాల గురించి క్యూరియస్ గా ఉన్నాను నేను

Anonymous said...

thank you sir

Kuthala Dayalan said...

కత్తి మహేష్ గారు,

అసలు నేను బ్లాగులు లోని అన్ని విషయాలను పూర్తిగా చదవడం మొదలెట్టింది మీ బ్లోగుతోనే, ఎప్పుడూ నేను అంతర్జాలం లో దళిత్ అని వెతుకె వాడిని అలా ఒకసారి మీ బ్లాగ్ దొరికింది అప్పటినుంచి రెగ్యులర్ గా మీ బ్లాగ్ చదువు తున్నాను. మీ లాంటి కొద్ది మంది దళిత విషయాలపై వ్రాసే వారు ఇప్పుడు అదికూడా రాదు అనితెలిసి భాదపడుతున్నాను. నా దొక చిన్న విన్నపం లేదా కోరిక మీరు కొంత విరామం తరువాత మళ్ళీ బ్లాగు వ్రాయగలరు. ఎక్కువమంది మీ బ్లాగు చదివే వారు మనసులో మెచ్చుకోవచ్చు, మన తరువాత లేదా ఇప్పుడున్న తరానికి మన దళితుల యొక్క జీవన పోరాటం గురించి చెప్పొచ్చు. అసలే మీడియాపై ఎవరు అజమాయిసి చేస్తున్నారో మనందరికి తెలుసు. అందుకే మరొక్క సారి ఆలోచించండి.

నేను కూడా మీ స్పూర్తితో ఒక బ్లాగ్ “అరవం” పేరుతొ ఈ ఆగస్టు లోనే వ్రాయడం మొదలు పెట్టాను. మీరు చిత్తూరు అన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, నా స్వగ్రామం పుత్తూరు, నాగలాపురం మద్యలో ఒక చిన్న గ్రామం, పేరు కావనూరు (నిండ్ర మండలం).

నీహారిక said...

మహేష్ గారు,
ఇంతకు ముందు మనం భేధాభిప్రాయాల్తో మాట్లాడుకున్నాం. అందరి అభిప్రాయాలు కలవాలని లేదు. కలవవు కూడా.
నేను మిమ్మల్ని ఒక ఆటాడేస్తాను అని అన్నాను. మీరు ఆడతాను అన్నారు, దానికి నేను ఏ ఆట ఆడతారు అని అడిగాను మీరు సమాధానం చెప్పలేదు. ఇపుడు ఈ పోస్టు చూసిన తరువాత అడుగుతున్నాను, నాతో కలిసి రాజకీయ చదరంగం ఆడతారా?

మీకు తెలుసుగా నేను Foul games ఆడను Fair & Intelligent Games మాత్రమే ఆడతాను.
మీరు నాతో కలిసి రాజకీయ చదరంగం ఆడదలచుకుంటే మీరు రమ్యంగాకుటిరాన లో ఉన్న మిషన్ కశ్మీర్ మీకు నచ్చితే మీతో పాటు ఇక్కడ ఉన్న బ్లాగు మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నాను.

మీరంతా ఏవెవో రాతలు రాస్తూ అలసి పోతున్నారు నేను ఇప్పటికే కార్యరంగంలో ఉన్నాను ఓడిపోతూ,నేర్చుకుంటూ ముందుకే వెళుతున్నాను. వెనక్కి వెళ్ళే ప్రశక్తి లేదు. ఇప్పటికే కె బ్లా స కి చెక్ పెట్టాను. వారు నన్ను చచ్చినట్లు అనుసరించవలసిందే. ఇక మిగిలింది మీరు, ప్రవీణ్, ఇతర బ్లాగ్ మిత్రులు ఏ ఒక్కరినీ వదలను జరిగిన దానిలో అందరూ బాధ్యులే , కళ్ళ ముందు జరిగే వాటిని ఆపలేరు కానీ మీరు దేశానికి ఏం ఉపయోగపడగలరు? మీరేం చేయనవసరం లేదు నేను చేసే వాటిని ఎప్పటిలాగే చూడండి. మీరందరూ ఛూడడం మాత్రమే చేయగలరు.
ఛూడడం కాకుండా ఈ దేశానికి సేవ చేయగల వారికి ఇదే నా ఆహ్వానం.

Praveen Sarma said...

నా దగ్గర తప్పు లేనప్పుడు నన్ను ఎవరు విమర్శించినా నేను భయపడను. అందుకే ప్రపీససలో కెలుకుడుగాళ్ళు నన్ను ఎంత అడ్డమైన తిట్లు తిట్టినా నేను భయపడలేదు. కెబ్లాసకి చెక్ పెట్టినది నీహారిక గారు కాదు. ఆ పని చేసినది ప్రమోదవనం శివాజీ గారు & కుల గజ్జి వ్యతిరేకి గారు. కేవలం నన్ను ఓడించడానికి భరద్వాజ ఒంగోలు శ్రీను లాంటి చిల్లరగాళ్ళతో స్నేహం చేశాడంటే నాకే నవ్వొస్తున్నాది. ఈ చిల్లరగాళ్ళు లేకపోతే కెబ్లాసకి అస్తిత్వమే ఉండదు.

Praveen Sarma said...

పూరిపాక బ్లాగ్‌లో మహేశ్ గారి గురించి పేరడీ కథలు వ్రాస్తున్నప్పుడు నేను మహేశ్ గారికి ఆ బ్లాగ్ గురించి మెయిల్ పంపాను. మహేశ్ గారు "I never care about them" అని సమాధానం చెప్పారు. ఇప్పుడు మాత్రం పట్టించుకోవలసిన పనేముంది? బ్లాగ్‌లోనే యథాతథంగా వ్రాసుకోవచ్చు కదా.

నీహారిక said...

ప్రవీణ్ ,
ముందు మీరు ఇటువంటి మాటలకు చెక్ పెడతారా?

సరే మీరే గొప్ప అయితే ఏంటి? ఏం సాధించారు? ఒకరిని ఒకరు తిట్టుకుని ఏం సాధించారు?

అందరూ వారి వారి రంగాల్లో గొప్పవారే, ఒకరిని ఒకరు దెప్పి పొడవనవసరం లేదు. చేతనయితే మీకిష్టమైన రంగంలో మీ సత్తా చూపండి. ఇక్కడ ఎవరికి వారికి కొన్ని ఆశయాలున్నాయి. వాటిని నెరవేర్చుకోవడానికి మీరు కృషి చేయాలి.

దళితుడు అనే కారణంగా అంబేద్కర్ ని ఎవరైనా ఆపారా? మాయావతి ని ఎవరైనా ఆపారా? అంబేద్కర్ ఈ దేశానికి ఏం చేసారో అందరికీ తెలుసు, మాయావతి ఏం చేసిందో తెలుసు.

మన లక్ష్యం లో పొరపాటు లేకుండా ఉంటే చాలు. ఎవరు గొప్ప అన్నది మన లక్ష్య నిర్దేశ్యం, లక్ష్య సాధన లో తెలుస్తుంది.

Praveen Sarma said...

మంద కృష్ణలాగ నేను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులం కార్డ్ వాడుకునే రకం కాదు. ఆరుద్ర గారు వ్రాసిన రామునికి సీత ఏమవుతుంది పుస్తకంలోని కొన్ని వచనాలని ఉదహరించినందుకే కొంత మంది మతం పేరుతో కత్తి గారిపై దాడి చేసినప్పుడు నేను కత్తి గారి వైపే ఉన్నాను. క్రీమీ లేయర్ విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చిన తరువాతే నేను కత్తి గారికి దూరంగా వెళ్ళాను. రిజర్వేషన్ల విషయంలోనూ కెలుకుడు మూకవాళ్ళు కత్తి గారిపై వ్యక్తిగత దాడులు చేశారు. రిజర్వేషన్ల వల్ల తమకి అవకాశాలు ఉంటాయనుకునేవాళ్ళు వాటిని సమర్థిస్తారు, తమ అవకాశాలు పోతాయనిపించినవాళ్ళు వాటిని వ్యతిరేకిస్తారు. వాటిని సమర్థించేవాళ్ళకి లేదా వ్యతిరేకించేవాళ్ళకి కులం మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇక్కడ సెకండరీ విషయం. అందుకే రిజర్వేషన్ల విషయంలో కత్తి గారిపై ఆ మూక చేస్తున్న దాడులని నేను వ్యతిరేకించాను. మన దేశంలో 2500 సంవత్సరాల నుంచి కుల వ్యవస్థ ఉంది కానీ రిజర్వేషన్లు వచ్చి 65 సంవత్సరాలు కూడా అవ్వలేదు. కేవలం రిజర్వేషన్ల వల్ల కుల గజ్జి పెరిగిపోతోందని విమర్శించేవాళ్ళు కావాలని ఆ విషయం మర్చిపోతారు. ఈ నిజాయితీ లేని విమర్శలు చేసేవాళ్ళ కంటే కత్తి గారే చాలా నయం. అందుకే నేను చాలా సందర్భాలలో కత్తి గారి వైపే ఉన్నాను. అంతే కానీ నేను కత్తి గారిని గొప్ప వ్యక్తి అనుకోలేదు.

Praveen Sarma said...

అయినా కెలుకుడుగాళ్ళు కులం పేరుతో కత్తి గారిపై దాడి చెయ్యడం చాలా హాస్యాస్పదంగా కనిపించింది. పల్లెటూరిలో కులం పేరు అడిగి తెలుసుకుంటారు కానీ సిటీలో కులం పేరు చెపితే కానీ తెలియదు. అటువంటప్పుడు ఎక్కడో USAలో ఉంటున్న కెలుకుడుగాళ్ళు కులం గురించి అంతలా ఆలోచిస్తున్నారంటే నాకు నవ్వొస్తున్నాది. వీళ్ళ గురించి పట్టించుకుని బ్లాగులు వ్రాయడం మానేస్తే అది జోక్ అవుతుంది.

..nagarjuna.. said...

nonsense. ఎవడో ఎదో అంటాడని బ్లాగు రాయకపోవడం ఏంటి. మీపై శత్రుత్వం పెంచుకునెవాళ్లు మాత్రమే మీ బ్లాగు చదవరుగా ! మీరు రాసింది నచ్చితే/నచ్చకుంటే మిగతావారు కూడా వ్యాఖ్యానిస్తారు, చదువుతారు. ఐనా ఫేస్‌బుక్ లో మీ 'ఫ్రెండ్స్' అనేవాళ్లతోనే చర్చలుగాని, కబుర్లుగాని చెప్పుకోగలరు. అదే ఇక్కడైతే ఎవరో తెలియకున్నా ఒకోసారి నిష్ణాతులతో మాట్లాడవచ్చుకదా...