Saturday, March 24, 2012

తెలుగు బ్లాగుల బాగోగులు


"బ్రాహ్మణ వాద పునరుజ్జీవం : తెలుగు బ్లాగులు" (http://seperateandhra.blogspot.in/2012/03/blog-post_23.html) అని ఇందాకా కట్టా సుఖేంద్ర రెడ్డి గరు రాసిన ఒక పోస్టు చదివాను. అందులో ఆర్గ్యుమెంటుని దాదాపు బ్రాహ్మణకులానికి ఆపాదించడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తానుగానీ, మూల భావనని అంగీకరిస్తాను. అటు సామాజికంగా, ఇటు సాహితీపరంగా బ్రాహ్మణవాదానికి (బ్రాహ్మణ కులం కాదు) స్థానం క్రమేణా పబ్లిక్ స్పేస్ లో తగ్గిన క్రమంలో ఆభావజాలాలకు తెలుగు బ్లాగులు పట్టుకొమ్మలయ్యాయి.

సంస్కృతి సాంప్రదాయం, మతనిబద్ధత, భాషాభిమానం, దేశ భక్తి పేర్లతో ఒక మారువేషపు బ్రాహ్మణవాదం బ్లాగుల్లో ప్రచులితమై ఉంది. ఏ ఇతర ఆల్టర్నేట్ ఐడియాలజీని తెలుగు బ్లాగులోకం భరించదు. దాని ఉనికిని నాశనం చెయ్యడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. సమాజంలో ఆర్థకంగా-సామాజికంగా-రాజకీయంగా ఆధిపత్యాన్ని ఉపయోగించినట్లు ఇక్కడ సాంకేతికంగా వారికున్న ఆధిపత్యాన్ని ఉపయోగించి "దాడి" చేస్తారు. ప్రత్యామ్న్యాయానికి ఉనికి లేకుండా చేసి తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోంటారు.

తెలుగు బ్లాగులోకం ఈ పద్దతుల వల్లనే అల్లకల్లోలమయ్యింది. ఇప్పుడు ఈ పరిస్థితి కంటిన్యూ అవుతోంది కాబట్టే వైవిధ్యం నశిస్తోంది. బ్లాగులోకం కేవలం భద్రలోకానికే అనే రకంగా తయారయ్యాయి.  

****

19 comments:

Sri Kanth said...

మహేష్ గారూ,

చాలా రోజుల తరువాత చూస్తున్నాను మీ బ్లాగు పోస్టుని. ఇది మీ మరో ఇన్నింగ్సుకు మొదలైతే .. ఇదే నా స్వాగతం. Hope you blog regularly.

Anonymous said...

*ఏ ఇతర ఆల్టర్నేట్ ఐడియాలజీని తెలుగు బ్లాగులోకం భరించదు.*

మహేష్,

అది మీ అభిప్రాయం. బ్లాగులోకం లో ఆలా వాదించటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఆల్టర్నేట్ ఐడియాలజీని రాసిన పుస్తకలు చదివినపుడు, అందులో లోపాలను, మనకు తెలిసిన సమాచారం తో విశ్లేషించాలను కొంటాము. దానిని తెలుగు బ్లాగులోకం భరించదు అని అనుకొంటే ఎట్లా? గత కొన్ని సం|| గా దార్ల గారు బ్లాగులు రాస్తున్నారు. బ్లాగులోకం లో వారు ఎవ్వరు ఆయన ఐడియాలజి ని తప్పు పట్టినట్లుగా, కనీసం ఎక్కడా ఒక చిన్న విమర్శంచినట్లు చూడలేదు. అదే కంచా అయ్యలయ్య గారి లాంటివారి తలతోకాలేని ఐడియాలజి ని చదివితే,దానిని బ్లాగులలో వినిపించితే చికాకు వేస్తుంది. ఇక ప్రస్తుత విషయానికి కొస్తే మనం కన్స్యుమరిజం కాలంలో ఉన్నాము. దానివలన సమాజం మీద పడే ప్రభావాన్ని టి వి,మీడీయా, సినేమాలు,యాడ్స్ హైజాక్ చేసాయి. వాటిప్రభావాన్ని రోజు అనుభవిస్తున్న ప్రజలకు చర్చించటానికి కొత్తగా ఎముంది? ఆచర్చలు టివి లలో జరిగిపోతున్నాయి. మిగతా వాదాలన్ని వాదించి వాదించి పాతపడి పోయాయి.

SriRam

Anonymous said...

*ఏ ఇతర ఆల్టర్నేట్ ఐడియాలజీని తెలుగు బ్లాగులోకం భరించదు.*

మహేష్,

అది మీ అభిప్రాయం. బ్లాగులోకం లో ఆలా వాదించటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఆల్టర్నేట్ ఐడియాలజీని రాసిన పుస్తకలు చదివినపుడు, అందులో లోపాలను, మనకు తెలిసిన సమాచారం తో విశ్లేషించాలను కొంటాము. దానిని తెలుగు బ్లాగులోకం భరించదు అని అనుకొంటే ఎట్లా? గత కొన్ని సం|| గా దార్ల గారు బ్లాగులు రాస్తున్నారు. బ్లాగులోకం లో వారు ఎవ్వరు ఆయన ఐడియాలజి ని తప్పు పట్టినట్లుగా, కనీసం ఎక్కడా ఒక చిన్న విమర్శంచినట్లు చూడలేదు. అదే కంచా అయ్యలయ్య గారి లాంటివారి తలతోకాలేని ఐడియాలజి ని చదివితే,దానిని బ్లాగులలో వినిపించితే చికాకు వేస్తుంది. ఇక ప్రస్తుత విషయానికి కొస్తే మనం కన్స్యుమరిజం కాలంలో ఉన్నాము. దానివలన సమాజం మీద పడే ప్రభావాన్ని టి వి,మీడీయా, సినేమాలు,యాడ్స్ హైజాక్ చేసాయి. వాటిప్రభావాన్ని రోజు అనుభవిస్తున్న ప్రజలకు చర్చించటానికి కొత్తగా ఎముంది? ఆచర్చలు టివి లలో జరిగిపోతున్నాయి. మిగతా వాదాలన్ని వాదించి వాదించి పాతపడి పోయాయి.

SriRam

Anonymous said...

మీతో ఏకీభవిస్తాను. హిందూ మత సమ్రక్షణ పేరుతో బ్లాగుల్లో బ్రాహ్మణవాదం పెరుగుతోంది. వీళ్ళని ఆదిలోనే తుంచకపోతే సర్వనాశనం అయిపోతుంది.
ఇప్పటికే బ్లాగుల్లో వీళ్ళూ చాపకింద నీరులా పెరిగిపోతున్నారు.

Indian Minerva said...

Wow!! మీరింకా బతికేఉన్నారా? (అపార్ధం చేసుకోకండి మాష్టారూ. ఈ మధ్య కనపడ్డంలేదుకదా అని అలా నా వ్యవహారికంలో అలా అన్నాను). ముందుగా మీ ఎడారివర్షానికి శుభాకాంక్షలు. And welcome back sir.

ఆ పోస్టును చదివాను. స్థూలంగా ఏకీభవించినా కొన్నింటితో అంగీకరించటంలేదు.

Anonymous said...

మహేష్ గారు,
మీరు ఎవరో ఒక వ్యక్తి బ్రాహ్మణ ద్వేషం తో ,బ్రాహ్మణులని తిట్టడానికి రెడ్డి పేరు పెట్టుకొని కులాల కుంపట్లు రాజేయడానికి ప్రయత్నిస్తే మీరు ఆ పోస్ట్ పట్టుకొని ఈ విధంగా రాయడం ఏమి బాగోలేదు.
బొందలపాటి సీతారాం గారు కట్ట సుఖేందర్ రెడ్డి అనే పేరుతో రెడ్లకి,బ్రాహ్మణులకి తగాదా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను వాస్తవంగా కమ్మ కులానికి చెందిన వ్యక్తి .
కింద రెండు పోస్టులు చూడండి.మీకే తెలుస్తుంది.

http://seperateandhra.blogspot.com/2010/04/blog-post_1069.html
http://bondalapati.wordpress.com/2010/01/31/%E0%B0%86-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%82%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%87/

ఈ పెద్ద మనిషి కమ్మ్యునిస్ట్ అని చెపుకుంటూ చంద్రబాబు, రామ రావు ని అభిమానిస్తాను అంటాడు. చివరకి ఇతను కమ్మ కుల అభిమాని. దానికోసం ఫేక్ నేము తో కులాల కుంపట్లు రాజేస్తున్నాడు. ఇప్పుడు ఈ పోస్ట్ రెడ్లు,దళితులు,బ్రాహ్మణులూ కొట్టుకోవడానికి పనికొస్తుంది. మీరే ఆలోచించండి. ఆ వ్యక్తి ది విషపు ప్రచారం. ఇక అతను రాసేదాంట్లో విశ్వసనీయత శూన్యం.

Anonymous said...

"...ఇప్పటికే బ్లాగుల్లో వీళ్ళూ చాపకింద నీరులా పెరిగిపోతున్నారు..."

I have been a very పాతకాపు to Telugu blogs. To my knowledge, Telugu Web has always been a Brahmin adda. Probably it will remain the same for the foreseeable future, One reason could be, others are not so much knowledgeable and informed as this particular social class. More than that, the urge to express themselves is lacking in others. Even if it is there, thay lack the requisite style and language which the Brahmins have in abundance.

As such, I feel the Telugu blogosphere is conspicuous by an absence of variety. It presents only the Brahministic view-point and sensors or shouts down all other stuff mercilessly. This situation should chage. To this end, non-Brahmins should spare some time and energy to develop some attractive style and fine language skills on the lines the Brahmins.

By the way, what does the Anon above mean when he says, "వీళ్ళని ఆదిలోనే తుంచకపోతే సర్వనాశనం అయిపోతుంది." How can you eliminate anybody from an free-for-all medium like the Web ? Actually, what do you mean by త్రుంచడం ? Grow up yaar. This is democracy. Here, no one can curb another's right to the freedom of speech.

Anonymous said...

you are good with your opinions! wish you good luck!
unfortunately, I had to tell you that, I did not like your film! but that doesn't matter! keep trying!!!! these blogs idiots will be there for you..anytime!

above anon is 100% right!

@you, write something man!!! we want to see you here! OK!!?? share the stuff with us, that doesn't cost you!! is it?

Praveen Mandangi said...

తాడేపల్లి గారికి ముసుగు లేదు, బొందలపాటి గారికి ముసుగు ఉంది. అదే తేడా. కోస్తా ఆంధ్రలో దళితులపై దాడులు చేసినవాళ్ళలో ఎక్కువ మంది కమ్మ, రెడ్డి, కాపు కులస్తులైతే బొందలపాటి గారు ఈ మూడు కులాలని వదిలేసి బ్రాహ్మణులని ద్వేషించమంటారు. టోరాంటోలో ఉండే నా స్నేహితురాలు నాకు బొందలపాటి గారి గురించి గొప్పగా చెప్పింది. అతను గొప్ప అభ్యుదయవాది అనే భ్రమలో ఉన్నారు. తెలంగాణాలో చాకలి ఐలమ్మ విగ్రహం పెడితే చాకలి కులస్తులలో కుల గజ్జి పెరిగిపోతుందని వాదించిన బొందలపాటి అభ్యుదయవాది ఎలా అవుతాడు అనే సందేహం నాకు వచ్చింది. ఆవిడ భర్తకి బొందలపాటి గారు స్నేహితుడు. వాళ్ళిద్దరూ బెంగళూరు వెళ్ళినప్పుడు బొందలపాటి గారి ఇంటిలోనే ఉన్నారు. అక్కడ బొందలపాటి గారు ఆవిడ దగ్గర గొప్ప అభ్యుదయవాదిలా మాట్లాడాడు. అక్కడ అలా మాట్లాడిన ఆయన బ్లాగుల్లో వ్రాసినవి మాత్రం పచ్చి అభివృద్ధి నిరోధక వ్రాతలు. దళితులు కమ్మ, రెడ్డి, కాపు కులస్తులని వదిలేసి బ్రాహ్మణుల మీద పడి ఏడిస్తే కోతి-రొట్టె ముక్క కథలాగ కమ్మవాళ్ళు అధికారాన్ని కొట్టేసి దాన్ని ఎటర్నల్ చేసుకోవచ్చు అని బొందలపాటి గారి ప్లాన్.

Anonymous said...

Now it is high time the non-Brahmins too ventured into the field of writing. No use lamenting over the fact that someone else is writing more than others,

The issue runs deeper than what many non-Brahmins perceive. Blogs are only a tip of the iceberg and they came very late. Visit any library or book stall in the coutry, you will find that some 50% to 90% of the books were authored by the Brahmins only. They don't have money but blessed with many other advantages over the rest - civilizational, familial, genetic etc.

Non-Brahmins who don't have any of these advantages, need to learn by imitation. I must tell you what I closely observed. The Brahmin children have a lot of freedom in their families. They talk very freely with their parents and express almost everything directly and candidly. Similarly the Brahmin parents and elders correct them at every step, helping them build good vocabulary and expression skills. It is as true of their English as of their Telugu. They constantly teach them what constitutes a right or wrong in public. They discuss various puranas and stories and even newspaper items at the dining table. All this will add up to their writing skills in their later life. In the case of non-Brahmin households, in the name of discipline and elderliness, you will find it is always silence and silence and silence and it is of no use for the mental growth of children.

Kathi Mahesh Kumar said...

@ Anonymous : I am not referring brahminism as brahmin caste. Brahminism is an ideology, even many Dalits follow brahminism.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

*non-Brahmins too ventured into the field of writing*

నీ ఆవేదన అర్థమైంది. ఇంతమంచి అబ్సెర్వేషన్స్ రాసిన వాడివి పేరు తో రాసి ఉంటే బాగుండేది. సాహిత్య రంగం లో వారి ఆధిపత్యం ఉందనుకో , మరి ఎంతో పవర్ ఫుల్ అయిన పేపర్, టి వి మీడీయా రంగాలను చేతిలో ఉంచుకొన్న మిగతావర్గాల వారు, మీడీయా ద్వారా బ్రాహ్మణ వాదానికి ఎదైనా ప్రత్యామ్న్యాయ వాదం తీసుకు రావచ్చు కదా? అటువంటి అవకాశాన్ని వారు ఎందుకు ఉపయోగించుకోవటంలేదు? అవకాశాన్ని ఉపయోగించుకోవటం సంగతి సరే, అసలికి మీడీయాకి ఒక్కప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎందుకు కోల్పోయింది ? ఇటువంటి పరిస్థితులలో వారు ప్రత్యామ్న్యయ వాదన ముందుకు తీసుకువచ్చినా, ప్రజలలో ఆమోదం పొందుతుందా? మీరే ఆలోచించండి.

Anonymous said...

మహేష్ గారు ప్రస్తావిస్తున్నది బ్రాహ్మణవాద (Read Hindutva) విజృంభణ గురించే తప్ప బ్రాహ్మణ రచనా విజృంభణ గురించి కాదని అర్థమైంది. కానీ సహజంగా ఎక్కువమంది ఈ రెండో అర్థాన్నే తీసుకుంటారు.

పైని anon లు లేవనెత్తిన issues కి వస్తే, వెయ్యడుగుల ప్రయాణమైనా ఒక్కడుగుతోనే మొదలవుతది. అబ్రాహ్మణులకి సాహిత్యంలో ఉన్న స్థానం ఓ మూలకెక్కడో ఉంటది. అలాగని నిరుత్సాహపడకూడదు. నెమ్మదిగా వ్యవసాయం మొదలుపెట్టాలి. రాస్తా, రాస్తా పోతే కొన్నిసంవత్సరాలకి అబ్రాహ్మణులే బ్రాహ్మలకంటే బాగా రాసే రోజులొస్తయి.

The Brahmin literary pursuit/ output is admittedly a heavy-duty thing both in scale, size and quality. It is spread over various fields also. I don't think it is possible for the Non-brahmins to surpass it in the very near future. But nothing wrong in making a serious beginning.

మంచి ఉద్దేశంతో ఏం చేసినా మంచే జరుగుతది. రియాక్షనరీగా ఏం చెయ్యొద్దు. యాక్షనరీగా చెయ్యాలి. మన స్వభావానికి సహజంగా ఉండేటట్లు చెయ్యాలి. ఎవరినీ ఏమనకుండా చెయ్యాలి.

Anonymous said...

బ్లాగుల్లో వైవిధ్యత లేకపోవడానికి కొంతవరకూ కారణాలు సరైనప్పటికీ అవే కారణాలనడం సరి కాదు.

పైవేవీ కాకుండా -

ట్రావెలాగులు, పేరడీలు, సినిమా, జీవన వైవిధ్యాలు, (ఉద్యోగం, రోజువారి జీవితాలు, కొత్త చోటికి వెళితే వచ్చే ఇబ్బందులు వగైరా)...ఇలా ఎన్నో రాయవచ్చు. రాసేటోనికి మంచి స్టఫ్ ఉండాలే కానీ, ఇక్కడ కులము, మతము చూసి బ్లాగులు చదివే వాడెవడు?

Anonymous said...

బ్రాహ్మలకీ, నాన్-బ్రాహ్మిన్స్ కీ జీవనవేదాంతంలో ఒక ప్రధానమైన తేడా ఉంది. లాభం ఉన్నా లేకపోయినా బ్రాహ్మలు సాహిత్యమూ, కళలూ, పరిశోధనా (them just for the sake of them) అభ్యసిస్తూనే ఉంటారు. తతిమ్మాజనం తక్షణం ఏదో ఒక (ధన) లాభం కనిపిస్తే తప్ప ఏ పనీ చేయరు. నేను చూసినంతలో ప్రతి బ్రాహ్మడికీ ఏదో ఒక రంగం (లేదా సబ్జెక్టు) మీద వెఱ్ఱివ్యామోహం ఉంటుంది. చూస్తే అప్పుడప్పుడు, "వీళ్ళకేమైనా తిక్కా ?" అనిపిస్తుంది. అలాంటి సెంటిమెంటూ, ప్యాషనూ ఇతరుల్లో మరీ ఎక్కువ కనిపించవు. కనుక లాభప్రసక్తి లేని రంగాల్లో (including scientific research) యథావిధిగా బ్రాహ్మణాధిక్యమే కొనసాగుతోంది. దీన్ని ఆధిపత్యం అనకూడదేమో ! ఎందుకంటే Historical గా మన దేశంలో చాలా fields కి బ్రాహ్మలే పయొనీర్లు. కానీ ఇప్పటికీ వారే కొనసాగుతూండడం.... దీని గురించి వారూ, ఇతరులూ కాస్త ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది.

Anonymous said...

*తతిమ్మాజనం తక్షణం ఏదో ఒక (ధన) లాభం కనిపిస్తే తప్ప ఏ పనీ చేయరు.*

అంతేకాదు. మహాభారతం లాంటి గ్రంధాల లోని భాగాలను, పాత్రలను ప్రస్తుత కాలంలో కొత్త కోణం లో ఎంతో మంది రచయితలు రాస్తూంటారు. బ్రాహ్మణులకు రామాయణ,భారత,భాగవతాలు పవిత్ర గ్రంథాలు గా అంతరాళలో ఒక విధమైన గౌరవం ఉన్నా వాటిని మరొకకోణం లో రాయటానికి వెనుకడుగేయ్యరు. మహాభారతాన్ని పర్వ పేరు తో, కొత్త కోణంలో యస్.యల్. భైరప్ప గారు ఎంతో విభిన్నగా, కన్విన్స్ గా రాశారు. అదే ద్రౌపది పేరుతో రాసిన నవల వివాదాలను తెరతీయటం తప్పించి, చదువరులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

http://pustakam.net/?p=3398
http://pustakam.net/?p=10560

Unknown said...

"బ్రాహ్మలకీ, నాన్-బ్రాహ్మిన్స్ కీ జీవనవేదాంతంలో ఒక ప్రధానమైన తేడా ఉంది. లాభం ఉన్నా లేకపోయినా బ్రాహ్మలు సాహిత్యమూ, కళలూ, పరిశోధనా (them just for the sake of them) అభ్యసిస్తూనే ఉంటారు. తతిమ్మాజనం తక్షణం ఏదో ఒక (ధన) లాభం కనిపిస్తే తప్ప ఏ పనీ చేయరు. నేను చూసినంతలో ప్రతి బ్రాహ్మడికీ ఏదో ఒక రంగం (లేదా సబ్జెక్టు) మీద వెఱ్ఱివ్యామోహం ఉంటుంది. చూస్తే అప్పుడప్పుడు, "వీళ్ళకేమైనా తిక్కా ?" అనిపిస్తుంది. "
అది తిక్క కాదు . బాధ్యత. మన సంస్కృతి ని కాపాడే బాధ్యత, వారి జీన్స్ లో ఇరికించ బడిందో ఏమో !
దేశాన్ని రక్షించే బాధ్యత క్షత్రియులది. క్షత్రియులంటే స్కామ్లు చేసే రాజులు కాదు, స్వప్రయోజనాలకోసం రాజకీయం చేసే కొన్ని కులాల వాళ్ళో కాదు.

బ్రహ్మనులని, వారి బాధ్యతనుండి దూరం చేస్తే, మిగతా కులాలు కూడా ఉండలేవు. క్రైస్తవత్వం, ఇస్లాం విజ్రుమ్భిస్తాయి .అప్పుడు కమ్మ ఉండదు, రెడ్డి ఉండదు .
సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేని వైద్యం ఆయుర్వేదం . మన గ్రంధాలలో ఇంకా ఎన్నో పనికి వచ్చే సంగతులు ఉన్నాయి. అమెరికన్లు , జేర్మన్లు మన తాళపత్ర గ్రంధాలను తీసుకెళ్ళి పరిసొధిస్తుంటే, వాటి గురించి తెలిసిన వాళ్లకు అండగా ఉండటం మాని, వాళ్ళనే నాశనం చేద్దమనుకొంటే , మనం కూడా రెడ్ ఇండియన్లు , లాగా అదృశ్యమై పోతం.

మాకు కొన్ని విద్యలు నేర్పలేదు, అనే ఒకే ఒక కోపం తో బ్రాహ్మణులను ద్వేషిస్తే నష్టపోయేది మొత్తంగా భారతీయులమంతా.
అన్ని కులాలను కలిపే విషయాలు ఏమైనా ఉంటె వాటిని చర్చిస్తే దేశాన్ని నిలబెట్టుకోవచ్చు .
ఏదో ఒకటి వ్రాయాలి గదా అని, మన గ్రంధాలను, పురాణాలను. మన తాతలను, అమ్మమ్మలను , కించపరిచే విధంగా వ్రాసుకొని , ఇతరమతాల వారికి , మాట మార్పిడులకు ప్రోత్సహమిచ్చిన వాళ్ళం కాకూడదు.
అన్ని వెళ్ళు కలిస్తేనే పంజా అవుతుంది
-kumaraswamy v

Unknown said...

http://arisebharat.com/2012/06/13/how-to-destroy-a-nation-without-firing-a-bullet/

Please read the above link..R the Secularists and మేధావి వర్గం part of such a plant to destroy the nation from within, creating hate among the components of the society ?