Monday, September 14, 2009

కథ-కల-కల్పన


చీకటిగర్భాన నేను

వెలుతురు తీరాన నేను
ఎటూతేల్చుకోలేని కలల లోకాన నేను

నేనే కథగా మారిపోయానో...
లేక
నీ కథనంలో మునిగిపోయానో...
తెలీదు
నువ్వు చెప్పిన కథలో చిక్కుకుపోయాను
చీకటి వెలుగుల జీవితంలో
ఎటూతేల్చుకోలేని కల్పనల లోకాన మిగిలిపోయాను

****

7 comments:

Bolloju Baba said...

ఏదో మిస్టిక్ నెస్ ఉంది కవితలో.
అదే కవితను ప్రకాశింపచేస్తూంది.

ఇస్మాయిల్ గారన్నటువంటి తెరచుకొన్న పద్యానికి ఈ కవిత ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

ఎందుకంటే
ఇది ఖచ్చితంగా మూసుకొన్న కవిత మాత్రం కాదు.
ఈ కామెంటు పోస్టు చేసేసిన తరువాత కూడా నన్ను చాలా సేపు ఆలోచింపచేస్తూంది ఖచ్చితంగా

భావన said...

అయ్యో పాపం... :-)

గీతాచార్య said...

Lying in the abbys
Or in the Shores of light...

Wow. Beautiful feelings.

నేనే కథగా మారిపోయానో...
లేక
నీ కథనంలో మునిగిపోయానో...

There is a sense of haunting in these lines.

But could have trimmed the last line.

$h@nK@R ! said...

vaah... nenaithe mee kavita lo munigaapoyaanu ;)

రమణ said...

అద్భుతంగా ఉంది.
విపరీతమైన ఆలోచనల వలన ఇటువంటి వేదనే మిగులుతుందేమో!! :)
అయినా భావాలను అక్షర రూపంలో పెట్టగలగటం గొప్పే.
మీరు పెట్టిన ఫొటో కవితకు బాగా సరిపోయింది.

అడ్డ గాడిద (The Ass) said...

chaalaa baagundi. BTW Am new to blogs. Hw to announce my blog to others/ Any help plz?

Srujana Ramanujan said...

very nice. hope this is some what different in mood and expression...

http://aatanemaatakardham.blogspot.com/2009/09/blog-post.html