Wednesday, September 16, 2009

స్వర్గం అంచుల్లో...


రావడం పోవడం అంతా ఒకటేనా?

వెనక్కెళ్ళడం అంత సులువుగా జరిగేనా?
రేపటి గురించి రేపు మాట్లాడుకుందాం.
ఈ రోజు గురించి చెప్పండి.
ఒక్క నిమిషం నిశ్శబ్ధంగా వినండి.
ఆ ప్రవాహపు శబ్దాన్ని వినండి.
ఆ వాగుపేరు "వైతరణి".
దాన్ని దాటొచ్చినవాళ్ళు తిరిగెళ్ళడం సాధ్యమేనా!
వైతరణి ఆవలి ఒడ్డున ఉన్నా, సాధారణ జీవిగా మనగలగటం సాధ్యమేనా!!

****

5 comments:

$h@nK@R ! said...

వాగును దాటి స్వర్గపు అంచుకు చేరడం కష్టసాధ్యమే.. వైతరణి ఆవలి ఒడ్డున ఉన్నా, సాధారణ జీవిగా మనగలగటం కూడా కష్టమండి.. ;) ;)

అడ్డ గాడిద (The Ass) said...

$h@nK@R !

బాగా చెప్పారు.

Thanks Mahesh kumar garu for your comment in my blog. This one poem is nice

భావన said...

దాట గలిగే ధైర్యం దాటగలిగేంత శక్తి వుండి దాటేక ఇంకా సాధరణ జీవి లా అంటే కుదరదు ఏమో.. దాటేక ఇంక సాధారణ జీవిలా వుండాలనే కోరిక వుంటుందా? అంతర్లీనం గా సాగేఆ ప్రవాహపు శబ్ధం వినటం ఒక అధ్బుతమైన అనుభవం కాదు... చాలా బాగుంది మహేష్...

సుజాత వేల్పూరి said...

ఒకసారి దాటొచ్చిన వాళ్ళకు తిరిగెళ్ళడం సమస్యా? అయినా మనిషి మనిషికీ మధ్య ఇన్ని అడ్డుగోడలు, వైషమ్యాల మధ్య ఇప్పుడు మనం ఈ క్షణంలో ఈదుతున్నది వైతరణి కాక మరేమిటి?

. said...

chaala baagaa chepparu
naraka vaitharuni lopadda veakki ravochemo kaani jeevana vaitharunil nunchi bayataku raalem kadaa...

annattu idi naa blog andi
mee amulyamaina abprayam theliyajestharani eduur choosthunnanu

www.tholiadugu.blogspot.com