Thursday, September 24, 2009

సంస్కృతి అంటే?


ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిరబిందువు

నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు.

- దేవరకొండ బాలగంగాధర తిలక్ (1965)

‘సంస్కృతి’ అనే పదానికి గల వ్యుత్పత్యర్థం నాకు తెలీదు. సంస్కరింపబడిందా! సంస్కృతం నేర్చినవారి జీవనశైలా! అనే ఎటిమాలజీలోకి పోకుండా, "సంస్కృతి అంటే కల్చర్. కల్చర్ అంటే ఒక జీవనవిధానం" అనే వ్యావహారిక అర్థంలో సంస్కృతిని వాడేద్దామని నిర్ణయించాను. బహుశా నా ‘సంస్కృతి’ సమస్య ఇక్కడే మొదలౌతుందనుకుంటా.

నా మిడిమిడి జ్ఞానానికి ఆ పదం యొక్క మూలమే తెలీకపోతే దాని విస్తృతి, వివరణ, ఉద్దేశం ఎక్కడ తెలిసిఏడుస్తాయి? అందుకే, నాకు తెలిసిన ‘కల్చర్’ అనే ఇంగ్లీషుపదం లోంచీ అర్థాలు ఏరుకుని నా తాత్పర్యాల్ని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తాను.

"Culture, defined as shared knowledge or symbols that create meaning within a social group" అనేది ఇప్పటి వ్యవహారం అయితే, ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ transition లో dynamic గా ఉంటుంది.

ఈ నిర్వచనంతో "మన" సంస్కృతితో బేరీజు చేసుకుంటే, తీరే సమస్యలకన్నా వచ్చే సమస్యలే ఎక్కువ. "భారతీయ సంస్కృతి" అనేది ఒకటుందా? "తెలుగు సంస్కృతి" అనేదాన్ని నిర్వచింపగలమా? ఎప్పుడూ మారే సంస్కృతిని ఏమూసలో పోస్తే స్థిరమౌతుంది? అలా స్థిరమైతే అది అసలు సంస్కృతేనా?

****

8 comments:

రమణ said...

ఈ ఆలోచనలు నాకు కూడా వస్తూ ఉంటాయండి.
సంస్కృతి అంటే సంస్కరించబడినది అని చదువుకున్నట్లు గుర్తు. అలా సంస్కరించబడే ఒక స్థిరత్వాన్ని పొందుతుందనుకుంటా!.

//"భారతీయ సంస్కృతి" అనేది ఒకటుందా? "తెలుగు సంస్కృతి" అనేదాన్ని నిర్వచింపగలమా? ఎప్పుడూ మారే సంస్కృతిని ఏమూసలో పోస్తే స్థిరమౌతుంది? అలా స్థిరమైతే అది అసలు సంస్కృతేనా?


భారతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతి ఉంటాయనే నేను అనుకుంటాను. విపులీకరించలేకపోయినా స్థూలంగా మనసులో ఒక భావం ఉంది. ఆచార వ్యవవాహారాల్లోనే కాలంతో మారని ఏదో స్థిరత్వం ఉందనిపిస్తుంది. ఏంటో పారడాక్సికల్ గా ఉంది.
ఎవరైనా ఈ విషయాన్ని గురించి తెలిపితే బాగుండును.

rayraj said...

"సంస్కృతి అంటే ఒక జీవనవిధానం" అంత కంటే ఏముంది? కంఫ్యూజన్ ఎందుకు?

భారతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతి అనేవి ఉన్నాయి. ఒక వేళ లేవు అనిపిస్తే, ఇప్పుడు అలాంటివి చేసుకోవడంలోనూ తప్పులేదు.

నా జీవన విధానంలో నేను ఇడ్లీ తింటాను. అలా ఇడ్లీ నా సంస్కృతిలో భాగం. ఇవ్వాళ్ళ డొమినోస్ వాడు ప్రకటనల ద్వారా పాస్టా తినమని ప్రోత్సహిస్తున్నాడు. ఇది పాశ్చ్యాత్య సంస్కృతి. ఇప్పుడు నా జీవన విధానంలోంచి ఇడ్లీ పోయి, పాస్టా వచ్చేస్తుంది. అలాగా, ఎప్పటికీ సంస్కృతి స్థిర బిందువు కాదు.

కాని ఈ విషయం తెలిసినంత మాత్రాన సరిపోదు. ఇడ్లీ చచ్చిపోయింది అనే నిజం కొందరిని బాధ పెడుతుంది. మరొకరికి, "ఛస్, ఇడ్లీ గలీజ్! పాస్టా మ్ మ్ మ్.. " అనిపిస్తుంది. వీడు అదృష్టవంతుడు. ఎందుకంటే పాస్టా అనేదాన్ని ఎక్కువ మంది 'ఆధునికంగా' భావిస్తున్నారు కాబట్టి! ఇడ్లీని ప్రేమించే వాడు అనాగరికుడు. అపాశ్చాత్యుడూను (అప్రాచ్యుడులా!).

అప్పుడు ఎవడికో కాలుతుంది. "లంజ కొడుకులు ఇంతమంది ఎగేసుకుంటూ అమెరికాకి ద్...స్తున్నారు. ప్రతి నా కోడుకు నా ఇడ్లీని తిట్టేవాడే! ఏ! "మమత దర్శిని" అని ప్రపంచమంతా నా ఇడ్లీ, నా దోసా, నా మిర్చి ఎందుకు తిని చావారు? నేను లేని వాడిని కాబట్టే! వీళ్ళు నన్ను అణగదొక్కుతున్నారు " అనిపిస్తుంది. అంతే అప్రాచ్యులందరూ వాడిని "ఫండమెంటలిస్ట్" అంటారు. క్లాష్ ఆఫ్ సంస్కృతి మొదలౌతుంది.

కానీ మన వాళ్ళు ఇడ్లీని ప్రపంచ సంస్కృతిగా ఎందుకు మార్చలేదు? ఇది ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మీకే ఎప్పుడూ వాడి పాస్ట నచ్చుతోంది గాని, వాడికి మీ ఇడ్లీ ఎందుకు నచ్చడం లేదు? అని ఆలోచించారా మీరు!?

దీన్ని వేరే స్థాయిలో ఆలొచించారు. గొడ్డు మాంసం అనాగరికంగానూ, మన సంస్కృతి కాదు అన్నప్పుడు ఆలోచించారు. గుర్తుందా!? అప్పుడు మీకు అగ్రవర్ణాలు కారణంగా కనిపించాయి. పైన ఉదాహరణలో అగ్రదేశాలు కారణంగా కనిపిస్తాయి.

సమస్య ఎక్కడ ఉందో చెప్పగలరా? మీకు ఒక క్లూ : సమస్య నిజానికి గొడ్డు మాంసంలోనో, ఇడ్లీలోనో, పాస్టాలోనో, అగ్రవర్ణాల్లొనో,అగ్రదేశాల్లోనో లేదు.

rayraj said...

బై ది వే, వర్ద్ ప్రెస్ బ్లాగర్ల మీద ఏమిటీ ఈ వివక్ష? లేదూ, నాన్- గూగుల్ బ్లాగర్ల మీద ఏమీ ఈ వివక్ష? అలాగే, నా పోస్టు లో మీకు ఏమి అర్ధంగాలేదు. రండి కాస్త. చర్చిద్దాం :)

Anil Dasari said...

@రేరాజ్:

ఏమా వివక్ష, ఏమా కథ? నాకలాంటిదేమీ కనపడలేదే. ఒకవేళ ఉన్నా, బాధపడకండి. మేకు నే తోడున్నా :-)

Venugopal Turlapaty said...

క్రీ.పూ.7 వ శతాబ్దానికి భారతదేశము చాలా వరకు పట్టణీకరింపబడినది. ఆ కాలం నాటి సారస్వతంలో 16 మహా జనపదాల ప్రస్తావన ఉన్నది.


ఆంధ్ర అన్న పదం మొట్టమొదటగా క్రీ.పూ 8వ శతాబ్దములో ఐతరేయ బ్రాహ్మణం లో పేర్కొనబడినది. పురాణాలలో మరియు వారి నాణేలపై ఈ వంశము ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు, శాతకర్ణులు మరియు శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయబారి, యాత్రికుడు మెగస్తనీస్ వ్రాసిన ఇండికాలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. ఈయన ఆంధ్రులు లక్ష పదాతిదళం, వెయ్యి యేనుగులు మరియు 30 దుర్భేధ్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు.
"Next come the Andarae, a still more powerful race, which possesses numerous villages, and thirty towns defended by walls and towers, and which supplies its king with an army of 100,000 infantry, 2,000 cavalry, and 1,000 elephants." Plin. Hist. Nat. VI. 21. 8-23. 11., quoting Megasthenes[1]


శాతవాహనులు లేదా ఆంధ్రులు దక్షిణ మరియూ మధ్య భారత దేశాన్ని పరిపాలించిన ఓ గొప్ప సామ్రాజ్యము. వీరి పరిపాలన క్రీస్తు పూర్వం 230 నందు మొదలయినది. సుమారుగా 450 సంవత్సరాల అనంతరము ఈ సామ్రాజ్యము పరిపాలన కొనసాగినది

rayraj said...

@అబ్రకదబ్ర : నేనూ అదే ధైర్యంతో కొన్ని రోజులుగా మీరన్నా విషయం ఎత్తుతారేమో అని చూస్తున్నాను :)

:) అబ్బే! పెద్ద విషయేమేమి కాదు. మహేష్ ఈ మధ్య మోడరేషన్‌లో మార్పులేవో చేశారు. దాంతో ఓపెన్‌ఐడి సౌకర్యం పోయింది. దీని వల్ల, గతిలేక గూగుల్ ఎకౌంట్ డిటైల్స్ వెతికి తెచ్చి మరీ వ్యాఖ్యానించాల్సి వచ్చింది.

కాస్త శ్రమ పడాల్సి వచ్చినా..ఏదో అభిమానం కొద్దీ అలా...

Anil Dasari said...

@రేరాజ్:

ఈ మధ్య బ్లాగర్ నుండి వర్డ్‌ప్రెస్‌కి వలసలు మొదలయ్యాయి .. గమనించారో లేదో.

అడ్డ గాడిద (The Ass) said...

Hmm

abrakadabra garu,

wordpress baane untundi kaanee blogger antha veejee kaadu. anduke akkada vadili ikkadiki vachhaanu. Is there any help for those who r juniors in WP from the senior word press people?