Friday, January 15, 2010

యార్లగడ్డ ‘ద్రౌపది’ పై విమర్శలు


మొన్న ఒక చర్చలో ‘తెలుగు సాహిత్యానికి తగిన గుర్తింపు భారతదేశంలో రాలేదేమిటి చెప్మా?’ అని నిట్టూర్పువిడిస్తే, ‘నూతిలోంచీ ఎగబాకే కప్పను లాగి మళ్ళీ క్రిందపడదోసే జాతి సాహిత్యానికి ఎట్లా గుర్తింపు వస్తుంది?’ అని ప్రశ్నించి నా నిట్టూర్పుని కాస్తా నిస్పృహగా మార్చేశారు. అప్పుడే విన్నాను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ "ద్రౌపది"కి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అని. విన్న క్షణం నుంచే అప్పటినుంచీ ఆ పుస్తకాన్ని గురించి ఎక్కడా చర్చించని సాహితీప్రియులందరూ పరమచెత్త పుస్తకం అంటూ సాంప్రదాయాన్ని భుజాన వేసుకుని బయల్దేరారు. అప్పటివరకూ నిద్రపోయిన పండితులు హఠాత్తుగా విమర్శలు గుప్పించడం మొదలెట్టారు. ఏకంగా మానవహక్కుల కమిషన్ కు "మా మనోభావాలు దెబ్బతీస్తోందహో" అని ఏకరువుపెట్టి అవార్డుని ప్రస్తుతానికి ఆపించడంమే కాకుండా ఆ పుస్తకం ఇతరభాషల్లో అనువదించకూడదనే డిక్రీ పట్టుకొచ్చి సంస్కృతిని రక్షించేశారు.

నేను యార్లగడ్డ రాసిన పుస్తకం చదవలేదు. ఇప్పుడు ఖచ్చితంగా చదువుతాను. ఈ గొప్పోళ్ళ విమర్శలకు సమాధానం చెప్పడానికి ఏమీ చదవక్కరలేదు. కూసింత ఇంగితజ్ఞానం ఉంటే సరిపోతుంది.

సంస్కృతీ రక్షకుల విమర్శలు:

"1. ఇది ఒక బూతు పుస్తకం. వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో తెలుగు సరస్వతికి ఇటువంటి అవమానం, పరాభవం, కీడు, అపరాధం, అపచారం ఎన్నడూ జరగలేదు.న్యాయనిర్ణేతలే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సాహిత్య అకాడమీ ఈ విషయాలు గ్రహించి పునరాలోచించి ‘ద్రౌపది’ గ్రంథ పురస్కారానికి అనర్హమైనదిగా ప్రకటించాలి."

ఐదు భర్తలున్న ద్రౌపది మడిగట్టుకుని కూర్చోకుండా, ఆ ఐదుగురితోనూ సుఖించింది అని పుస్తకంలో వర్ణనలున్నాయి కాబట్టి ఇది బూతు పుస్తకం అనేది వీరి వాదన. ద్రౌపది వాళ్ళతో సంబోగించకుండానే అందరికీ పిల్లల్ని కన్నదా? ఇందులో అసహ్యించుకోవలసింది "పవిత్రతకు" భంగం కలిగించే విషయం ఏముంది? బూతు పుస్తకమట! ఎక్కడ లేదు బూతు? ఈ వర్ణనలే బూతైతే, రతిభంగిమలు నలుదిక్కులా ఉండే దేవాలయాలు బూతుకాదా! సమాగమనానికి ప్రతీకైన శివలింగం బూతుకాదా!!

సాంప్రదాయాన్ని వ్యతిరేకించి మనుషుల్ని మనుషులుగా ముఖ్యంగా స్త్రీలను స్త్రీగా చూడాలన్న ప్రతి వ్యక్తి సాహిత్యాన్నీ "బూతు" అన్న ఈ ఛాంధసవాద తిరోగమనవాద ఛండాలురకు గౌరవమిచ్చి సాహిత్య అకాడమీ పునరాలోచించాలా? ఈ పుస్తకం అనర్హమైనదిగా ప్రకటించాలా? ఎవరండీ ఈ సంస్క్కతిని కాపాడేందుకు కంకణం కట్టుకున్న గొప్పోళ్ళు...నిజమైన సమస్యలొచ్చినప్పుడు వీళ్ళెక్కడా కనిపించరే!!!


"2. ద్రౌపదిని శ్రీకృష్ణుని ఇష్టసఖిగా రచయిత అభివర్ణించాడు. ఇష్టస అంటే ప్రియురాలు, వలపుకత్తే, ప్రేయసి అనే అర్థాలు ఉన్నాయి. కాని చెల్లెలు అనే అర్థం ఉందా?"

సఖి-సఖుడు అనేది భక్తి సాంప్రదాయంలో ఒక విధానం. దేవుడ్ని కొలవడంలో అదొక ప్రత్యేకతరహా. ఇప్పుడు మనం platonic relationship అంటామే ఆతరహా. ఆ అర్థం,చరిత్ర మనోళ్ళకు తెలీదుగానీ ప్రస్తుతానికి "సఖి" అంటే ప్రియురాలు అనే అర్థం ఉందికాబట్టి ద్రౌపదికీ కృష్ణుడికీ రచయిత రంకు అంటగట్టాడనే అపోహతో వీళ్ళు తమ మనసుల్లోని కుతిని తీర్చుకుంటున్నారేతప్ప మరొకటి కాదు.


"3. ఐదుగురు కొడుకులను పోగొట్టుకొని (సుషుప్తి పరవశులైన బాలకులను అశ్వత్థామ గొం తులు కోసి చంపాడు) గోలుగోలున ఏడుస్తున్న ద్రౌపది, పూర్వం తనకు జరిగిన అన్యాయాలను తలచుకుంటూ వెంటాడే స్మృతులలో దుర్యోధనుడు కామంతో తన ఎత్తైన వక్షస్థలాన్ని చూస్తున్న సంగతి గుర్తుచేసుకోగలదా?"

ఎందుకు గుర్తుచేసుకోకూడదూ...ఎవరైనా స్త్రీని బస్టాండుల్లో,ఆఫీసుల్లో, రోడ్డు మీద కళ్ళతో గుచ్చిగుచ్చి చూసి రేప్ చేసే మీలాంటి దౌర్భాగ్యులపై ఎంత అసహ్యం ఉంటుందో ఒకసారి అడిగి కనుక్కోండి. ఈ నీచత్వం వాళ్ళ మనసుల్ని ఎంతగా గాయపరుస్తుందో తెలుసుకోండి.


"4. ద్రౌపది ఒకరోజు తరువాత ఒకరోజు పాండవులు ఒక్కొక్కరితో కామకేళీ విలాసాలతో సుఖించినట్లు, పరవశత్వం చెందినట్లు వక్రీకరణలు గొప్ప పరాభవము, మానభంగము కావా?"

హన్నా... మొగుళ్ళతో సుఖించడం కూడా పరాభవమా! ఆ సుఖంలో పరవశత్వం చెందడం మానభంగమా! ఎవరండీ ఈ కేతిగాళ్ళు? ఈ సాంప్రదాయవాదులు ఇప్పటికే స్త్రీలని ఎన్నో మానసిక సంకెళ్ళలో బంధించారు. వీలైతే ఇలాంటి వాదనలతో యోనులకు తాళాలు వేస్తామన్నా అంటారు. ఛత్!!


"5. శ్రీకృష్ణ పరమాత్మను అతి నీచంగా ప్రస్తావించటం కృష్ణభక్తులైన ఆనందవర్ధనుడు, ఆచార్య శంకరభగవత్పాదులు, సూరదాసు, మీరాబాయి, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణపరమహంస, లీలాశకుడు, జయ దేవుడు, విద్యావతి, చండీదాసు, నారాయణతీర్థుల వంటి మహానుభావులను అవమానించడం కాదా?"

పైన చెప్పినవాళ్ళందర్నీ అప్పటి సాంప్రదాయవాదులు వ్యతిరేకించారు(కొందర్ని పిచ్చోళ్ళని కూడా ముద్రవేసారు). ఆ తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు. కాబట్టి వాళ్ళకు కొత్తగా జరిగిన అవమానం ఏదీ లేదు. కృష్టుడు అల్ట్రా మాడ్రన్ పాత్ర.  ఆపాత్ర చేసినవన్నీ established నైతికతకు అందని గిమ్మిక్కులే. ఉచ్చనీచాల ప్రస్తావన ఆపాత్రకే అవమానం.

****

39 comments:

ఆ.సౌమ్య said...

మీ వ్యాఖ్యలు చదివాక ఈ పుస్తకం తప్పనిసరిగా చదవవలసినదయి ఉంటుంది అని అనిపిస్తున్నాది

హవ్వ హవ్వ సంసారం చేసి సుఖించడం బూతా...ఈ విమర్శలు చేసినవాళ్ళమదరూ మరి ఆ so called బూతు పనులు చెయ్యట్లేదా రోజూ?

సెక్సు, కండోం అనే పదాలను ఉచ్ఛరించడం, పబ్లిక్ గా వాటి గురించి మాట్లాడడం తప్పు కాదు అని govt. of India, TV లో ads ఇస్తూ ఉంటే, వాటిని తప్పంటారు ఎవరండీ వీళ్ళు?

క్రుష్ణుడు 16 వేలమంది గోపికలతో కులికాడు అంటే పరవశంతో, భక్తితో కళ్ళు మూసుకుని మురిసిపోయే సదరు సాంప్రదాయ సోదరులకు, దౌపది 5 భర్తలతో కులికింది అంటే బూతులాగ తోస్తున్నదా, ఎంత విడ్డూరం !

ఐదుగురిని చేసుకోవడం గొప్పకానీ వాళ్ళతో సంసారం చెయ్యడం తప్పా.... ఈ లాజిక్కు నాకు అస్సలు అర్థం కావట్లేదు

మరి పెళ్ళి కాకుండానే తల్లి అయిన కుంతి, పెళ్ళయ్యక కూడా పరాయి పురుషులద్వారా పిల్లల్ని కన్న కుంతి, మాద్రిలు పతివ్రతలా?

మన సమాజం ముందుకు నడుస్తోందా, వెనక్కి మళ్ళుతోందా?

మహేష్ గారు, ఇరావతి కర్వే రాసిన యుగాంతం అనే పుస్తకం మీరు చదివారా?
అది original గా మరాటీ, తెలుగులో అనువదించారు. రాసిన ఆయన పేరు గుర్తు లేదు. ఆవిడ మహాభారతం అనేది దేవునికి సంభందించిన కథ కాదు అని వాదిస్తారు. ఒక్కొక్క పాత్ర ను మన సాధారణ సమాజానికి అన్వయిస్తూ రాసారు. చాలా బాగుంటుంది, వీలైతే చదవండి


"ఎవరైనా స్త్రీని బస్టాండుల్లో,ఆఫీసుల్లో, రోడ్డు మీద కళ్ళతో గుచ్చిగుచ్చి చూసి రేప్ చేసే మీలాంటి దౌర్భాగ్యులపై ఎంత అసహ్యం ఉంటుందో ఒకసారి అడిగి కనుక్కోండి. ఈ నీచత్వం వాళ్ళ మనసుల్ని ఎంతగా గాయపరుస్తుందో తెలుసుకోండి."......బాగా చెప్పారు, అసలు ఈ విషయం అర్థమయితే ఇన్ని మాటలు, విమర్శలు రానే రావు.

స్త్రీలు బడికెళ్ళి చదువుకోకూడదు అని బహిర్గతంగా చెప్పే వేయిపడగలు లాంటి పుస్తకాలకి పెద్దపీట వేసే చాందసవాదులకి ఈ పుస్తకం మాత్రం ఎలా రుచిస్తుంది చెప్పండి

సుజాత వేల్పూరి said...

అమ్మో, అయితే నేనూ చదవాల్సిందే!

"ఐదుగురు భర్తలు" అనే కాన్సెప్ట్ ఉన్నపుడు ఐదుగురితోనూ సంసారం చేయడం అనే విషయాన్ని అంగీకరించకపోవడం ఏమి న్యాయం?

ద్రౌపది అర్జునుడితో మాత్రమే భార్యగా వ్యవహరించిందనీ, మిగిలిన నలుగురితోనూ ఆమెకు శారీక సంబంధం లేదనీ, వివిధ సేవలు(కార్యేషు దాసి..వగైరా)మాత్రమే చేసిందని ఒక వాదన ఉంది. వారి విమర్శలకు అదే మూలమనుకుంటా!

Kalpana Rentala said...

నేను కూడా పుస్తకం చదవలేదు. మీ సూటి ప్రశ్నలు బావున్నాయి. తెలుగు జాతి సాహిత్యానికి ఎందుకు గుర్తింపు రాలేదో మీకే అర్ధమైపోయింది చూశారా?

Indian Minerva said...

Agreed. 3 వ పాయింటు కీ మీ వివరణ నాకర్ధం కాలేదు. మీరు ఏదోచెప్పాలనుకొని ఇంకేదో చెప్పారని నాకనిపించింది. భీష్మద్రోణ పాత్రలు కూడా ద్రౌపదిని కోరుకుంటున్నట్లు చూపించారన్నారు మరి దీని గురించి మీ అభిప్రాయమేమిటి? ఇది అసలు గ్రంధాన్ని వక్రీకరించడం కాదా? ఆయా పాత్రలపై అపనిందలు వేసే, వారి గౌరవానికి ఈ విధంగా భంగంతెచ్చే హక్కు రచయితకెక్కడిది? ప్రస్తుతానికి నాకునచ్చనిది ఇదొక్కటే... అశ్లీలత(?), బూతు(?) కాక.

శ్రీకృష్ణుడి గురించిన మీ అభిప్రాయం చాలా బాగుంది.

ఏది ఏమైనా చదవాల్సిందే. చదివి ఏం తప్పు/రైటు చెప్పాడో చెప్పాల్సిందే.

కాజ సురేష్ said...

మహేష్ గారూ, ఈ పుస్తకము నేను చదవలేదు. దాని మీద వచ్చిన విమర్శలు, దానికి రచయిత ఇచ్చిన వివరణలు విన్నాను. దాని బట్టి పుస్తకము యొక్క టోన్ అర్ధము అయ్యింది. ఏమి రాయాలి , ఎలా రాయాలి అనేది రచయిత ఇష్టము. చదవాలా వద్దా అనేది పాథకుల Discretion. రచయిత స్థాయి పెరిగే కొద్దీ రాసే విషయము మీద మరింత జాగ్రత్త తీసుకోవటము అవసరము.

ఇక్కడ ముఖ్యమైన (నా వరకు) ప్రశ్న సాహిత్య అకాడమీ అవార్డ్ ఇవ్వ వచ్చా లేదా అని. సాహిత్య పరముగా అంత మంచి పుస్తకమా ఇది? అకాడమీ వారు ఈ విషయము మీద వివరణ ఇస్తే బాగుండు.

భావన said...

నేను ఈ పుస్తకం చదవలేదు కాని విమర్శలు వింటే చదవ వలసిన పుస్తకమే అనిపిస్తోంది.
సౌమ్య.. కృష్ణుడు 16 వేల మంది తో కులక లేదు...అలానే ద్రౌపది కులకలేదు..
మూడవ పాయంట్ గురించి చాలా బాగా చెప్పేరు.
సుజాత:
"
ద్రౌపది అర్జునుడితో మాత్రమే భార్యగా వ్యవహరించిందనీ, మిగిలిన నలుగురితోనూ ఆమెకు శారీక సంబంధం లేదనీ, వివిధ సేవలు(కార్యేషు దాసి..వగైరా)మాత్రమే చేసిందని ఒక వాదన ఉంది."
సంప్రదాయ వాదులకు భయం వేసి కల్పించిన కధ ఏమో అది. ;-)

అవును ఇంతకు అవార్డ్ ఎందుకు ఇచ్చారో సాహిత్య పరం గానా? అసలు అవార్డ్ లు ఇవ్వటానికి కేటగిరీ లు వుంటాయా?

Anil Dasari said...

ద్రౌపది, పాండవుల గొడవ ఎవడిగ్గావాలి. నా కారణాలు నాకున్నై అభ్యంతర పెట్టటానికి.

>> "ద్రౌపది, పూర్వం తనకు జరిగిన అన్యాయాలను తలచుకుంటూ వెంటాడే స్మృతులలో దుర్యోధనుడు కామంతో తన ఎత్తైన వక్షస్థలాన్ని చూస్తున్న సంగతి గుర్తుచేసుకోగలదా?"

మా సుయోధనుడు అలాంటి పనులు చెయ్యడు. ఇలాంటి నిందలు రారాజు మీద వేసినందుకు ముందా పుస్తకాన్ని నిషేధించాలి.

అసలీ వివాదం యార్లగడ్డవారి ప్రాయోజితమేనేమో. లేకపోతే అవార్డొచ్చినా ఆ పుస్తకం సంగతి ఎందరికి తెలిసుండేది? ఇక్కడే ఇంతమంది పుస్తకం చదవటానికి రెడీ ఐపోయారు చూడండి .. వివాదం పుణ్యాన :-)

శరత్ కాలమ్ said...

ఈ పుస్తకం మీది 'చవుకబారు(?)' విమర్శల మీద మీలాగా విమర్శిద్దామని అనిపించినా ఆ పుస్తకం చదవక మింగలేకా కక్కలేక ఆగిపోయాను. మీరయితే చదవకుండానే ఆంశాలవారీగా సమర్ధిస్తున్నారు - సంతోషం. శ్రీకృష్ణుడి మరియు ద్రౌపదిల బంధం మీరు సమర్ధించిన తీరు కన్విన్సింగుగా అనిపించలేదు కానీ ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే పుస్తకం చదవాల్సిందే.

యు ఎస్ లో ఈ పుస్తకం ఎలా తెప్పించుకోవచ్చో ఎవరికయినా తెలుసా? ఎవరయినా యు ఎస్ కి వస్తుంటే ఈ పుస్తకం పంపించగలిగితే పుస్తకం డబ్బులు ఏదో ఒక విధంగా మీకు అందే ఏర్పాటు చేస్తాను.

శరత్ కాలమ్ said...

Yarlagadda Response:

http://telugu.andhraheadlines.com/view.aspx?c=news&tab=1&nid=13132

Kathi Mahesh Kumar said...

@సౌమ్య: ఇరావతి యుగాంతంతోపాటూ ఎస్.ఎల్.భైరప్ప రాసిన ‘పర్వ’కూడా చదివాను. అందుకే మహాభారతంపై ఒక socio-political and human understanding కలిగింది. మహాభారతాన్ని మరింత అర్థవంతంగా తెలుసుకునే అదృష్టం దక్కింది.

@ఇండియన్ మినర్వా:మూడవ పాయింట్లో ద్రౌపది తనకు జరిగిన అత్యంత అవమానకరమైన ఘటనల్ని తలుచుకోవడం గురించి ఉంది. ఈ ఛాందసుల అభ్యంతరం/సందేహం ఏమిటయ్యా అంటే, ‘అట్లాంటి సమయంలో ధుర్యోధనుడు కామంతో తన ఎత్తైన వక్షాన్ని చూడటం గుర్తుంచుకుంటుందా?’ అని. నా ప్రశ్న ఎందుకు గుర్తురాకూడదు అని. ఆడదాన్ని గుచ్చిగుచ్చి చూసిచేసే "కళ్ళరేప్" అత్యంత అసహ్యాన్ని కలిగిస్తుంది. అది తనకు జరిగిన జుగుప్సాకరమైన అన్యాయంగా ద్రౌపది తలుచుకోవడంలో కాముత్వం ఏముంది? అన్యాయపు స్పృహతప్ప!

భీష్మద్రోణుల గురించి ఆ పుస్తకంలో ఏంచెప్పరో నాకు తెలీదు. నేనింతవరకూ ఆ పుస్తకాన్ని చదవలేదు. కానీ నా అనుభవంలోకొచ్చిన విషయాన్ని చెబుతాను వినండి.

ద్రౌపది పాండవులందరికీ భార్య అవ్వాలనే కుంతి ఆర్డరులో ద్రౌపది పూర్వజన్మ కోరికకన్నా, కుంతి కుటుంబ రాజకీయం ముఖ్యపాత్ర వహించిందని నా అనుమానం. ద్రౌపది వంటి అసమాన సౌందర్యరాశి అప్పటికే కష్టాల్లో (లక్క ఇంటిదహనం తరువాత దాయాదులు మళ్ళీ ఎక్కడ చంపేస్తారో అని మారువేషాల్లో దాక్కొన్న సమయం అది) ఉన్న కొడుకులమధ్య ఒకడికి అందమైన భార్యవస్తే ఎక్కడ అన్నదమ్ములమధ్య గొడవలొస్తాయో అని అందరికీ ఇచ్చి పెళ్ళిచేసింది ఆ మహాతల్లి.

మహాభారతం మొత్తంలో అన్ని క్షీణదశల్లోనూ పాండవులు ద్రౌపది సహాయంతోనే గట్టెక్కగలిగారు. మాయాజూదంలో కోల్పోయినదికూడా మొదటిసారి ద్రౌపది సహాయంతోనే దక్కించుకుంటారు. మళ్ళీ ఫాల్స్ ప్రిస్టేజికి పోయి పోగొట్టుకుంటారు.ఇంత తంతులోనూ ద్రౌపది "అందం" పాత్రలేదంటే ఎట్లానమ్మేది?

భీష్మద్రోణులకు ద్రౌపది మీద "ప్రత్యేకమైన అభిమానం" ఉంటేమాత్రం తప్పేమి? దాన్ని కేవలం సెక్స్ అనుకోవడం ఎందుకు? సెక్స్ ప్రమేయం లేకుండా కేవలం ఆకర్షణీయమైన ఆడదాని అభిమానం పొందడానికి ప్రయత్నిస్తూ ఎంతమంది నిష్టగల మగవాళ్ళు మనచుట్టూ కనిపింఛరు? భీష్మద్రోణులు అట్లాంటివాళ్ళైతే మనకెందుకు అంత అభ్యంతరం? Why the hell does every thing boils down to SEX????

@కాజ సురేష్: సాహిత్య అకాడమీ ఇవ్వడానికి కొన్ని నిర్ధిష్టమైన రూల్స్,ప్రొసీజర్ ఉన్నాయి. వాటిని అనుసరించే ఇచ్చుంటారు. అలాంటప్పుడు ఎవడో కోన్కిస్కా గొట్టంగాళ్ళు అభ్యంతరం చెబితే అకాడమీ వివరణ ఇవ్వాలా?

ఉత్తమ నవల కేటగిరీలో 2009 సంవత్సరానికిగానూ ‘ద్రౌపది’ అవార్డునందుకుంది.It essentially means FICTION. సాహితీవేత్తలకు అంత అభ్యంతరం ముందెందుకు రాలేదు? ఆ పుస్తకం ఈ పాటికి సర్క్యులేషన్లో ఉందికదా!

@సుజాత: మరీ అర్థరహితమైన కథనం కదూ! ఐదుగురిని పెళ్ళిచేసుకుని సంవత్సరానికి ఒకరిచొప్పున నిష్టగా కాపురం చేసిన పాత్ర ద్రౌపది.ఒకసారి ధర్మరాజుతో ద్రౌపది ఉండగా ఆ ఇంట్లో విల్లంబులు తీసుకోవడానికి వచ్చిన అర్జునుడు సంవత్సరంపాటూ అడవులుపట్టిపోవలసి వస్తుంది. They had strict rules how to go about this 5 husband business with integrity.

@భావన: ద్రౌపదికి ఉత్తమ నవల కేటగరీలో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మిగతా వివరాలకు ఈ క్రింది లింకుని చూడండి.
http://www.sahitya-akademi.gov.in/old_version/Sahitya%20Akademi%20Award2009.pdf

@అబ్రకదబ్ర: మీ అభ్యంతరాలుకూడా కాస్త చెప్పండిసార్ మాట్లాడుకుందాం!

కథా మంజరి said...

ఈ రచన నవ్య వార పత్రికలో సీరియల్ గా వచ్చినట్టు గుర్తు. అప్పుడెవరికీ ఈ రచన మీద యింత ఉక్రోషం వచ్చినట్టుగా లేదు.అవార్డులు వస్తేనే అభ్యంతరాలు చెబుతారా?

Hima bindu said...

@పంతులు జోగారావు
నిజం చెప్పారు .

చంద్ర మోహన్ said...

కనీసం మీరైనా ఆ పుస్తకం చదివి ఉంటే మరింత స్పష్టత ఉండేదేమో మీ వాదనకు. ఐనా కూడా మీ వాదన ఆద్యంతమూ సమర్థనీయంగానే ఉంది! ఒక పుస్తకం చదవకుండానే దాన్ని సమర్థిస్తూ, విమర్శిస్తూ ఇంత వాదించుకోవచ్చన్న మాట, భలే:)

సఖ, సఖీ సాంప్రదాయం ఇస్కాన్ పుణ్యమాని బాగానే ప్రాచుర్యంలో ఉంది.పురుషులు కూడా తమను స్త్రీగా భావించుకొని కృష్ణుని ప్రేమించడం కృష్ణ భక్తిలో భాగమే. కొంత కాలం క్రితం ఒక సీనియర్ పోలీస్ అధికారి అలా చేసి వార్తల్లోకెక్కాడు కూడా.

ఇక మీ 3వ పాయింటు, అలాంటి వర్ణనలు ప్రాచీన సాహిత్యంలో చాలా సహజం, అందులో తప్పు పట్టడానికేమీ లేదు. పోతన "కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేలనేడ్చెదో..." అని వ్రాస్తే, ’సరస్వతీ మాత కంటనీరు కారుతుంటే కళ్ళను చూడాలిగానీ ఆ నీళ్ళు ఎక్కడ పడుతున్నాయో వర్ణిస్తాడా’ అని ఎవరూ అనలేదు.

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హిందీలోనూ, తెలుగులోనూ మంచి రచనలు చేసినవారు, సీనియర్ పార్లమెంటేరియన్. చౌకబారు రచనలు చేసి అమ్ముకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఈ విషయం నమ్మడానికి నాకు ఆయన ’ద్రౌపది’ చదవాల్సిన అవసరం కూడా లేదు.

Indian Minerva said...

అ) ఇంత తంతులోనూ ద్రౌపది "అందం" పాత్రలేదంటే ఎట్లానమ్మేది?
ఆ) Why the hell does every thing boils down to SEX????
ఇ) సెక్స్ ప్రమేయం లేకుండా కేవలం ఆకర్షణీయమైన ఆడదాని అభిమానం పొందడానికి ప్రయత్నిస్తూ ఎంతమంది నిష్టగల మగవాళ్ళు మనచుట్టూ కనిపింఛరు?
-----------------------------------------------------------------------------------------------------
ఆ: నా ప్రశ్న కూడా అదేనండి. ఇక పాత్రలన్నీ ద్రౌపదిని కాముక దృష్టితోనే చూడటం గురించే నా అభ్యంతరం. ఇటువంటి రాతలవల్ల ద్రౌపది వ్యక్తిత్వం ఏవిధంగా elevate అవుతుంది? హా.. అందం మాత్రం elevate అవ్వచ్చు.
అ: ఇది రెండొ దాంతో contradict అవుతున్నట్లనిపించట్లేదూ.
ఇ: అభిమానం పొందడానికి ప్రయత్నించడం చాలా సహజం. అందులో ఆడవారుకూడా వుంటే వుండవచ్చు కానీ అందులో మళ్ళీ అందం పాత్ర (మాత్రమే) వుంటుందంటే అది అభిమానం కోసం ప్రయత్నించడమెలా అవుతుంది? అది మీరన్నట్లు platonic ఎలా అవుతుంది? నిష్ట ఎలా అవుతుంది?

ఇక ఆ మూడో పాయింటు, అసలా వాక్యమే అసంబధ్ధమని నా అభిప్రాయం. పుత్రశోక ఘట్టంలో ఇదొక పుడకలా అనిపిస్తోంది నాకు (నేను కుడా చాందసవాదినా? :) )

Sharada said...

పిడకల వేట-
ఇదే టాపిక్ మీద చిత్రా దివాకరుని రాసిన "The palace of illusions'కూడా కొంచెం బాగానే వుంది. అంత powerful శైలి కాకపోయినా, ద్రౌపది perspective వీలైనంత నిజాయితీగానే రాసేరావిడ.
ఐతే ఇందులో ఎక్కువగా ద్రౌపది మహా భారత యుధ్ధం జరిగింది తనవల్లే అన్న ఒక రకమైన అపరాధ భావనతో బాధ పడుతుంది. అదెందుకో నాకంతగా మింగుడు పడలేదు.
శారద

Kalpana Rentala said...

శరత్ గారు,
ద్రౌపదీ పుస్తకం మీరు ఇక్కడ నుండి తెప్పించుకోవచ్చు.
http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=3637&PHPSESSID=f5ba2814dab7397190a2e8faab1ff0fb

Anil Dasari said...

I told already :-)

"మా సుయోధనుడు అలాంటి పనులు చెయ్యడు. ఇలాంటి నిందలు రారాజు మీద వేసినందుకు ముందా పుస్తకాన్ని నిషేధించాలి"

Kathi Mahesh Kumar said...

@చంద్రమోహన్: నేను చదవని పుస్తకాన్ని సమర్ధించడం లేదు. విమర్శకుల అభ్యంతరాలలో పసలేదని మాత్రమే చెబుతున్నాను. కాస్త ఇంగితజ్ఞానం,తర్కం ఉపయోగిస్తే ఆ విమర్శలన్నీ గాల్లోతేలిపోతాయని చెబుతున్నాను. అంతే!

పుస్తకం చదివిన తరువాత ఆ పుస్తకంలోని అన్ని విషయాలతో నేను ఏకీభవించలేకపోవచ్చు. అంతమాత్రానా సాహిత్య అకాడమీ ఇవ్వొద్దు. ‘ఇదొక బూతుపుస్తకం’ లాంటి చవకబారు వ్యాఖ్యలు చెయ్యను. నచ్చకపోతే ఆ పుస్తకం చదవొద్దని పదిమందికి చెబుతాొక కూలంకష విశ్లేషణ దాని గురించి రాసి నా అనంగీకారాన్ని తెలుపడానికి ప్రయత్నిస్తాను.

At the end of the days, its a NOVEL. A piece of fiction based on a mythical character.

@ఇండియన్ మినర్వా: మీరు పీటర్ బ్రూక్స్ తీసిన మహాభారతం చూశారా? చూడకపోతే ఒకసారి చూడండి. అందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించచ్చు.

ఆ నాటకచిత్రంలో ద్రౌపదిగా మల్లికా సారాబాయ్ నటించింది. అసమాన సౌందర్యవతి.మిగతాపాత్రలన్నీ అంతర్జాతీయ నటులు పోషించారు. మల్లికా సారాబాయ్ తెరమీద పాత్రలతో interact అవుతున్న ప్రతిసారీ చుట్టుపక్కలున్న అందరి నటులకళ్ళలో "ఏమి అందం" అనే భావన అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది. Thats just a human situation. ఆ స్థాయి దాటి "ఏమి వ్యక్తిత్వం" అనే భావనకూడా కనిపించొచ్చు. అంతకు మించి "ఎంత ఆకర్షనీయమైన స్వభావం" అనే స్థాయికూడా రావచ్చు.

ద్రౌపది అద్వితీయ సౌందర్యరాశే కాదు. అసమాన ధీరోధాత్తపాత్ర. తెలివిమంతురాలు,జాణ ఇవన్నీ ఆ పాత్రపై ఒక విభ్రమను-mystic attraction కల్పించేవే.అందుకే దాన్ని platonic అన్నాను.

@అబ్రకదబ్ర: నిజమే! మానధనుడైన సుయోధనుడికి ఎంత అవమానం!

కథా మంజరి said...

మనం పచ్చి బూతు అని బుగ్గలు నొక్కు కునే వర్ణనలు ప్రబంధాలలో సహజంగానే చేసారు.
అర్జునిడికి సుభద్ర మీద మనసుంది. గదుడనే వాడు ఆ సంగతి తెలిసీ, సుభద్రని గురించి చెబుతూ ఆమె అంగాంగ వర్ణన విజయ విలాసంలో చేయ లేదూ ?
‘‘ చను కట్టు మచ్చికల్ సేయు సదా రధాంగ యుగళిన్ ...’’
‘‘అతివ కుచంబులున్, మెఱుగుటారును ...’’
‘‘ పొలతుక గబ్బి చన్నుగవ పువ్వుల చెండ్లను లేదుబంతనున్...’’
‘‘ కడు హెచ్చు కొప్పు, దానిం గడువన్ చనుదోయి హెచ్చు ...’’
ఈ పద్య పాదాలు గుర్తుకు తెచ్చు కోండి.
అర్జునిడికి కాబోయే ప్రియ సతి అని ఎరిగి కూడా దాదాపు పది పద్యాలలో ఆమె అంగాంగ వర్ణన చేసాడు గదుడు.
ఇంత పచ్చిగా చెప్పి కూడా యింకా తనివి తీరక, ‘‘ ఎక్కడ చెప్పినాడ తరళేక్షణ చక్కదనంబు ...’’ అంటూ అందులో శతాంశం చెప్పలేదని కించ పడతాడు ...
ప్రపబంధ, పురాణ సాహిత్యాలలో ఇలాంటి వర్ణనలను ఆమోదించే రసపిపాసులు ఇప్పుడింత యాగీ చెయ్యడంలో అర్ధం ఉన్నదా ?

S said...

మహేశ్ గారికి: వ్యాసం బాగుంది. పుస్తకం చదవాలి అన్న కుతూహలం రేకెత్తిస్తోంది. మీరు అన్న వాదనలు: అదే, కల్పన గారు అన్నట్లు - ఎందుకు గుర్తింపు రాదో తెలుస్తూనే ఉంది గా! :)

Kathi Mahesh Kumar said...

@పంతుల జోగారావు: నిజమేకదా! ఒకరు చేస్తే శృంగారం మరొకరు చేస్తే వ్యభిచారం/బలాత్కారం/బూతు.ఇలా ఎందుకంటారూ?

@ఎస్: వచ్చిన గుర్తింపుని కోర్టుకెళ్ళి అయినా రద్దుచేస్తామనే సాహితీ ప్రియులున్న నేలకు ఎక్కడి సాహిత్య అకాడమీలు, జ్ఞానపీఠలు!

Anonymous said...

ఒహ్!!!
అంటే జ్ఞానపీఠం కోసమన్నమాట ఈ నెగెటివ్ ప్రొపగాండా.? ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నా.

చాల ఆసక్తికరంగాఉంది. !!!!
కొన్నాళ్ళక్రితం కన్నడ పరిశ్రమ లో ఒక నిర్మాత/ దర్శకుడు/హీరో తానే అయ్యి కూతురినిహీరొయిన్/ ముఖ్య పాత్ర గా పెట్టి సినిమా తీశాడు. మన మీడియా లపుణ్యమా అని అది చాల వివాదాలకు తెరతీసింది.అ సినిమా కథేంటన్నది, ఒక కాలేజ్ లెక్చరర్, స్టూడెంట్ ని మూగ గా అరాధించే వైనం. అతను చెప్పిన కారణం మాత్రం చాల ఆసక్తికరంగాఉంది.

"మీరెందుకు ఇలాంటి వివాదాలకి తావిచ్చారు, హీరొయిన్ గా వేరే అమ్మాయిని పెట్టి తీయొచ్చు కదా" అంటే
" ఇప్పుడు వస్తున్న తెలుగు/తమిళ/హింది చిత్రాల ధాటికి, మాలాంటి చిన్న కన్నడ చిత్రాల నిర్మాతలు నిలదొక్కుకోవాలంటే, నాకిలాంటి నెగిటివ్ ప్రొపగాండ చెయ్యక తప్పడం లేదు. ఇక హీరోయిన్లు అంటారా? తెలుగు/తమిళ/హింది చిత్రాల తో పోటీ పడగల సత్తా మనకి లేదు అందుకే ఇలాంటి గిమ్మిక్ కోసం ప్రయత్నించాను."

పై మాటలు టి.వి లో అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగం .

జ్ఞానపీఠానికి, బ్రాహ్మలని తెగనాడటం , లేదా దళితులని అణగదొక్కడం కథావస్తువు గా చేసుకొన్న రచనలకి అవార్డులిచ్చి ఇచ్చీ బోరు కొట్టినట్టున్నాయి. కొత్త పంథాని ఎన్నుకున్నారు . భేష్!!!

అన్నట్టు సినిమా . " ముస్సంజె గెళతి" అంటే "సాయంకాలపు స్నేహితురాలు". కావాలంటే గూగ్ల్ చేసి చూడొచ్చు.

Bolloju Baba said...

చర్చ బాగుంది.

మూడవ పాయింటు పై చిన్న వివరణ
"3. ఐదుగురు కొడుకులను పోగొట్టుకొని (సుషుప్తి పరవశులైన బాలకులను అశ్వత్థామ గొం తులు కోసి చంపాడు) గోలుగోలున ఏడుస్తున్న ద్రౌపది, పూర్వం తనకు జరిగిన అన్యాయాలను తలచుకుంటూ వెంటాడే స్మృతులలో దుర్యోధనుడు కామంతో తన ఎత్తైన వక్షస్థలాన్ని చూస్తున్న సంగతి గుర్తుచేసుకోగలదా?"

ఇక్కడ కొడుకులు చనిపోయిన విషయం ద్రౌపతికి తెలియకపూర్వం ఆ విధంగా కలలు కంటుందని, తెలిసినతరువాత కొడుకుల కోసం శోకిస్తుందనీ యార్లగడ్డ వివరణ ఇచ్చారు. కొడుకులు చనిపోయినప్పుడు ఆ విధంగా ద్రౌపతి ఆలోచనలు చేసిందని విమర్శించటం పుస్తకాన్ని సరిగ్గా చదవకుండా చేసిన విమర్శ అని అన్నారు.

తెలుగు సాహితీ మేరువు శ్రీ సోమసుందర్ గారు (http://sahitheeyanam.blogspot.com/2009/01/blog-post_25.html) ఈ వివాదం పై చేసిన వాఖ్యలు ఇవి

హిందూ ఫాసిస్టుల దాడి
ద్రౌపతి నవలపై జరుగుతున్న దాడి హిందూ ఫాసిస్టు శక్తులకు పండుగలా ఉంది. పురాణ కధలను ఆధునిక వాఖ్యానంతో పున:చిత్రించటం చాలాకాలంగా సాగుతోంది. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన శూతపురాణం, భగవద్గీత ఖూనీ వంటి గ్రంధాలలో హేతుబద్ద ఆలోచనలతో పురాణాలను వాఖ్యానించారు. అదేకోవలో ముద్దుకిష్ణ (అశోకం), చలం (రావణ దర్శనం) రచించారు. లక్ష్మీ ప్రసాద్ రాసిన ద్రౌపతి గురించి పత్రికల్లో వ్యాసాలు, కోర్టులలో కేసులు చూస్తుంటే ఆధునిక భారతాన్ని ఆర్యకాలానికి మళ్లిస్తున్నట్లుంది. దీనికోసం ఇంత అల్లరి ఛేయటం తగదు. మేధావులు, ప్రగతి వాదులు అభ్యుదయ సాహిత్యంపై జరుగుతున్న దాడిని ఖండించాలి. -- ఆవంత్స సోమసుందర్

మహేష్ గారూ
అంత పెద్దాయన అభిప్రాయాలు, బొడ్డూడని {మీరన్న మాటే :-)} మనబోటి వారి అభిప్రాయాలు ఒకటే కావటం ఆనందంగా ఉంది.
విమర్శలు గుప్పిస్తున్న కొంతమంది పునరాలోచించుకోవాల్సిన సందర్భమిది.

బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar said...

@ప్రవీణ్ గార్లపాటి: విమర్శలకు సమాధానం చెప్పడానికి ద్రౌపది నవల చదవాల్సిన అవసరం అస్సలు లేదు. అంతనిర్హేతుకమైన ఆపసోపాలకు కొంత తార్కికమైన ఝాడింపుచాలు. నేను చేసింది అదే.

నా సమాధానాలు ఊహాజనితాలుకాదు. కామన్సెన్స్ తో వచ్చే నిత్యసత్యాలు. పెళ్ళైన జంటలు సంబోగించుకుంటరనే విషయం తెలుసుకోవడానికి నేను ద్రౌపది పుస్తకం చదవక్కరలేదు.నాటపా ఆద్యంతం చదవకుండానే మీరు ఇలాంటి అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం చిత్రంగా ఉంది.

@చదువరి: ఈ మధ్యకాలంలో మీరు నన్ను ఆశ్చర్యపరచడం మానేసారు. You are completely sold out to the Hindu fascist ideology.

ఇక నారాతలు వక్రీకరణలు,పక్కదోవపట్టించేవీ, అనౌచిత్యాలుగాకాక మరేవిధంగానూ మీకు కనిపింఛే అవకాశమే లేదు.

తెలుగు వెబ్ మీడియా said...

ఒక పుస్తకం చదవకుండా దాని గురించి రివ్యూ వ్రాస్తే హాస్యాస్పదంగా ఉంటుంది మహేష్. కొందరు దళిత నాయకులు "మైదానం" నవలలో ఒక్క పేజి కూడా చదవకుండా ఆ నవల గురించి తెలిసి తెలియని వ్యాఖ్యలు ఎలా చేశారో నేను వ్రాసాను http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/blog-post_20.html ద్రౌపది నవల గురించి తెలిసి తెలియకుండా మాట్లాడినా ఇంతే హాస్యాస్పదంగా ఉంటుంది.

Kathi Mahesh Kumar said...

@అయ్యా ప్రవీణ్ గారూ, మీరు ఇంత అసందర్భంగా ఎలా మాట్లాడగలరో నాకు ఎప్పటికీ అర్థమయ్యే విషయం కాదు. ఇది పుస్తక సమీక్ష అని మీకు ఎలా అనిపించింది? పుస్తకం చదవకుండా "నేను పుస్తక సమీక్ష రాస్తున్నానహో!" అని ఎవడైనా చెప్పి రాస్తారా?

ఆ పుస్తకంపై వచ్చిన విమర్శలకు నాకు తోచిన సమాధానం చెప్పాను. అవి సరే అంటే సరే లేదూ కాదనుకుంటే కాదు అంతే. నేను చెప్పినవి సత్యాలు నన్ను అంగీకరించండి అని నేను యాగీ చెయ్యడం లేదే! మరి సమస్య ఎక్కడుంది?

మైదానం గురించి దళితనాయకులు చెప్పిందాన్ని మీరు అర్థం చేసుకున్న తీరు షరామామూలే. మళ్ళీ నేను చెప్పినా మీకు అర్థమవుతుందనే ఆశలేదు. కాబట్టి చర్చ ఇంతటితో సమాప్తం.

చదువరి said...

కత్తి మహేష్ కుమార్: "You are completely sold out to the Hindu fascist ideology." - బ్వహహాహ్హా..!

హిందూద్వేషులు మా మతానికి ద్రోహం చేసేకొద్దీ, కుట్రలు చేసేకొద్దీ, చిన్నబుచ్చేకొద్దీ.. నాలో ఈ ద్రోహుల పట్ల వ్యతిరేకత పెరిగిపోతూ వస్తోందండి. కానీ సంతోషకరమైన సంగతేంటంటే.. నా వ్యతిరేకత కేవలం హిందూద్వేషుల వరకే పరిమితమైంది. సాధారణ వ్యక్తులపట్ల - వారు ఏ మతస్తులైనా - నాకు ఏ వ్యతిరేకతా లేదు.

హిందూద్వేషుల గురించి కుసింత చెబుదామనుకున్నానుగానీ, జగమెరిగిన సదరు వస్తువు లక్షణాల గురించి తెలిసి గూడా, మళ్ళీ నోరు చేసుకోవాల్సిన ఖర్మ మనకేంటిలే అని ఊరుకుంటున్నాను. మరేదైనా సందర్భంలో రాస్తానులెండి.

అయితే మీ శ్రేయోభిలాషిగా మీకోమాట చెబుదామనుకుంటున్నాను. లౌకికవాది అనే ముసుగు వేసుకున్నాను గదా నేనేంటో అసలెవరికీ తెలియదులే అని మీరు ఇంకా అనుకుంటూనే ఉన్నారు గదా! కాని అది తప్పు సార్.. ఆ ముసుగు చాలా పల్చగా ఉంది. ముసుగులోంచి మీ వంటిమీది చారలు స్పష్టంగా కనబడిపోతున్నాయి. క్రూరమైన కోరలు (కరాళ దంష్ట్రలవి :) ) నోట్లోంచి కారుతున్న చొంగా కనిపిస్తూనే ఉన్నాయి. అసహనం కారణంగా మీ గొంతులోంచి వచ్చే గురక వినిపిస్తూనే ఉంది. ఇక దాచలేరు సార్, ఆ ముసుగు తీసెయ్యండి. అసలు రూపును బయటపెట్టండి.

Kathi Mahesh Kumar said...

@చదువరి:మొత్తానికి చాలా జోకులు పేల్చారు.

నేను నమ్మే లౌకికవాదం ఒక ముసుగుకాదు. అది భారతరాజ్యాంగం ఒకపౌరుడిగా నాకిచ్చిన నిబద్ధత. My commitment is more to this nation than to any religion.

నా ఒంటిమీద చారలూ,క్రూరమైన కోరలూ, అసహనం అంతా మతం పేరుతో రాజకీయమాయ చేసుకుంటూ పబ్బంగడుపుతున్న మీలాంటి మానవతాద్వేషులకు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే,you need those mythical fangs to unite people of your kind by scaring them that there is a threat.

మతమేదో పెద్ద ప్రమాదంలో ఉందనే అపోహకల్పిస్తేగానీ మీ ఉద్దేశాలు తీరవు. కాబట్టి మీకు హిందూమతద్వేషులు అనే mythical entity చాలా అవసరం. వారులేకపోతే మీరు లేరు. You breed hate and you survive on that hate. లౌకికవాదులం అలాకాదు. We believe in the letter of law and democracy and fight it out in open with legitimate reasons and causes.

నా అసలు రూపం, కొసరురూపం,ముసుగూ అన్నీ నేనే. అదే నేనే. మీ ఊహ,కల్పన,అపోహ,భయం కాదు.

Unknown said...

@మహేష్ గారు:

నేను ఎక్కడో చేసిన వాఖ్యకి ఇక్కడ సమాధానం ఇవ్వడమేమిటో, అదీ నాకు మెసెంజరులో పంపిన వ్యాఖ్యకు నేనిచ్చిన ప్రతి వ్యాఖ్యని ప్రచురించకపోవడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు.

ఇక మీకు నేను ఇచ్చిన ప్రతివ్యాఖ్యని ఇక్కడ ప్రచురిస్తున్నాను.

మొదటిగా మీ టపా నేను ఆద్యంతం చదివాను. తర్వాతే వ్యాఖ్యానించాను.

ఇక నా అభిప్రాయం:

మీరు పుస్తకం చదవలేదు.
విమర్శకులు గానీ, దానిని ఖండించేవారు గానీ ఏ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేసారో మీకు తెలీదు.
అసలు రచయిత కథనం ఎలా సాగించాడో, ఏం చెప్పదలచుకున్నాడో మీరు గ్రహించే అవకాశం లేదు.

మరి మీ టపాని అలాంటి బేస్‍లెస్ ఫాక్ట్స్ మీద వ్రాయడం విస్మయం కలిగించింది.
అసలు వ్యాఖ్యానించడానికి పుస్తకం చదవనక్కర్లేదు అనే మీ డిక్లరేషను ఇంకా వింతగా అనిపించింది.

ఇంతకు ముందు ఒకసారి గొల్లపూడి మారుతీరావు గారు కూడా slumdog millionaire గురించి ఇలానే వ్యాఖ్యానించారు సినిమా చూడకూండా.
అదీ నేను ఖండించాను.

మీకున్న అభిప్రాయాలు మీవి. నేను వాటిని బలపరచను, ఖండించను.
కానీ ఆ అభిప్రాయాలు నిజాల మీద ఆధారపడి ఉంటే నేను appreciate చేసేవాడిని.

మీరు proclaim చేసుకున్న శోధన, సాధన మీ చేతల్లో కనిపించకపోతే అది hyprocratic గా నాకు అనిపించింది.

Thats my view point.


నేను క్లియర్‌గా చెప్పాను మీ అభిప్రాయాలు మీవి, నాకు దానితో సమస్య లేదు. నేను అన్నది

పెళ్ళైన జంటలు సంబోగించుకుంటరనే విషయం తెలుసుకోవడానికి నేను ద్రౌపది పుస్తకం చదవక్కరలేదు

నా సమస్య ఈ రకమైన స్టేట్‌మెంటుల మీద. మీరు పుస్తకం చదవకుండా అసలు అలా పుస్తకంలో వ్రాసారో లేదో తెలియకుండానే అభిప్రాయాలు వ్రాసేస్తుంటే ఇక చెప్పేదేముంది.

ఈ విషయంపై ఇదే నా ఆఖరి వ్యాఖ్య. అసలు ఇక్కడ నేనూ వ్యాఖ్య వ్రాసి మీలాగే ప్రవర్తించకూడదు. కానీ అప్రయత్నంగా ఒక వైపు నుంచే వాదనలు నా మీద వినిపించేస్తుంటే భావ్యంగా అనిపించలేదు.

కత పవన్ said...

మాహేష్ గారు,
మీరు మాహా బారతం చదివారా..చదివింది అర్దం చెసుకున్నారా..పోని మీరు చేపుతున్న ఆ ఏర్రగడ్డ గాడు చదివాడా..

కత పవన్ said...

"కృష్టుడు అల్ట్రా మాడ్రన్ పాత్ర"

దిని అర్దం ఏమిటి

Kathi Mahesh Kumar said...

@ప్రవీణ్ గార్లపాటి: మనం చర్చించిన తరువాత నుంచీ నేను ప్రయాణంలో ఉన్నాను. అందుకే ప్రచురించలేదు. ఆలోపలే ఈ వ్యాఖ్య వచ్చింది.

నేను వ్యాసంలో ఎక్కడా పుస్తకాన్ని సమర్ధించలేదు. చదవని పుస్తకాన్ని సమర్ధించేంత వెర్రినాకు ఇంకా రాలేదు. విమర్శకుల అభ్యంతరాలు చాలా జెనెరల్ గా ఉన్నాయి. వాటికి నా అభిప్రాయాలతో సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. Surely my words are not the last words anyway.

@పవన్: ద్రౌపది రాసింది ఎర్లగడ్దకాదు. యార్లగడ్డ. కనీసం రచయిత పేరైనా సరిగ్గా తెలుసుకోకుండా "వాడు వీడు" అనే మీలాంటి సంస్కారవంతులు చదివిన మహాభారతంకన్నా నేను ఎక్కువే చదివాను.

కృష్టుడు అల్ట్రామోడ్రన్ లేదా పోస్టుమాడ్రన్ అనే విషయాన్ని చెప్పడానికి నేను పోస్టుమాడ్రనిజం మీద రాసిన టపా చదవండి. అప్పుడు కొంత అర్థంకావచ్చు.

తెలుగు వెబ్ మీడియా said...

ద్రౌపది నవల ఈ రోజే కొన్నాను. బాగానే ఉంది.
@కత్తన్నా. ద్రౌపది నవల స్టాక్ విశాలాంధ్రకి వచ్చింది. కొని చదువు.
@పవన్. యార్లగడ్డ గారిని ఏర్రగడ్డ గాడు అనడం నీకు స్కూల్ లో ఏ గురువు గారు నేర్పించారు బాబు? యార్లగడ్డని విమర్శించిన వానిది చిన్న వాల్తేర్ అంటే ఎలా ఉంటుంది?

చైతన్య said...

ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది?

శరత్ కాలమ్ said...

కల్పన గారూ,
ధన్యవాదాలండీ. పుస్తకం ఆర్డర్ చేసాను. ఇవాళో, రేపో రావచ్చు.

ఆ.సౌమ్య said...

ఓహ్ పర్వ నేను చదవలేదు. వెంటనే చదువుతాను.
యుగాంతం చదివాకే నాకు మహాభారతంలో కొత్త కోణం స్పురించింది. i enjoyed reading it thoroughly.
Thanks for telling me about 'parva'

విశ్వక్శేనుడు said...

>>>>"సమాగమనానికి ప్రతీకైన శివలింగం బూతుకాదా!!"

అన్నాయ్... నువ్వు పై కామెంట్ తెలిసి చేసారా తెలియక చేసారా.......
తెలియక పొతే అడిగి తెలుసుకొండి అంతే కాని ఇట్టాంటి వెధవ కామెంట్స్ చెయ్యొద్దు.....

chakri said...

ద్రౌపతి పాండవులే కాక ..మాయ పాండవులు మరో ఇదుగురితో కులికింది అన్నా.... శ్రీ కృష్ణుడు పదహారు వేల మంది తో కులికిన విధానాన్ని మరో నవలగా రాసిన.. కలిగే బాధ నష్టం ఏమి లేదు..
ఎందుకంటె
" యతో దృష్టి తతో మనః "
భారతం ఒక మహా కావ్యం, పరమ పవితమైన గ్రంధం కాదు.

Unknown said...

chala bagundi