Friday, February 5, 2010

తాడేపల్లిగారి తాగుడు లెక్కలు

తెలుగు బ్లాగుల్లో చరించే జనులకు తాడేపల్లిగారు చాలా సుపరిచితులు. అడపాదడపా లావుపాటి టపాలు రాసి బ్రాహ్మణ్యాన్నీ, హిందుత్వాన్నీ,తెలుగు భాషనీ రక్షించేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వీరు మోస్తున్న నినాదం...సమైక్యాంధ్ర అనడంకన్నా, తెలంగాణాపై దయ అనుకోవడం బెటరనుకుంటాను. ఎందుకంటే బలవంతంగానైనా తెలుగోళ్ళందరినీ ఒకటిగా ఉంచి తెలుగు సంస్కృతిని ఉద్దరించాలనే ఉద్దేశం లిప్ సర్విస్ గా వీరు చెప్పినా, వారి టపాల్లో జాలువారేది మాత్రం (వారి ఉద్దేశంలో) అనాగరికులైన తెలంగాణా వాళ్ళను ఆయనగారి కోస్తా నాగరికతతో ఉద్దరించడం. వేరుపడినా తెలంగాణా వారు వారికున్న అనాగరికమైన,సంస్కృతి విహీనమైన సాంప్రదాయాలతో ప్రగతి సాధించలేరు అనే అపోహల్ని విద్వేషాపూరితమైన వ్యాఖ్యానాలతో నాగరికమైన భాషతో చెప్పడం. ఈ పరంపరలో భాగం ఈ మధ్య కొన్ని తాగుడు లెక్కలు చెబుతూ తెలంగాణా ప్రజల్ని కలిసికట్టుగా తాగుబోతుల్ని చేసిపారేశారు.

"లెక్కల్లో చాలా బొక్కలున్నాయి స్వామీ" అంటే అవసరమైతే నీలెక్కలు నువ్వుతెచ్చుకో నాకు తెలిసింది మాత్రం పరమసత్యమే అని భీష్మించారు. నేనూ వెతుకుదాము అనుకుంటుండగానే "కల్నల్ ఏకలింగం" ఆ లెక్కల్ని పట్టుకొచ్చారు. వాటిని ఇక్కడ మీకోసం ఇస్తున్నాను. దానితోపాటూ తాడేపల్లిగారి స్టేట్మెంట్ కూడా.

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ నుండి తాగుడు ద్వారా వస్తున్న ఆదాయాన్ని (రాష్ట్రం యొక్క మొత్తం ఎక్సైజ్ ఆదాయంలో 60 శాతానికి పైనే) గమనిస్తే తెలంగాణ నిండా మద్యపానవ్యసనం (ఆడవాళ్ళు కూడా మినహాయింపు కాదు). ఇహ తెలంగాణ ఎలా బాగుపడుతుంది, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా ?"
                                                                                 - తాడేపల్లి


మన రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా 2005-06 వ సంవత్సరంలో వచ్చిన ఆదాయం 2,684.57 కోట్లు. అందులో, కోస్తాంధ్ర నుండి వచ్చిన ఆదాయం 496.8 కోట్లు (ఒక్కో జిల్లాకు సగటున 55.2 కోట్లు), రాయలసీమ నుండి వచ్చిన ఆదాయం 208.16 కోట్లు (ఒక్కో జిల్లా సగటు 52.04 కోట్లు), తెలంగాణ నుండి వచ్చిన ఆదాయం 1978.61 కోట్లు. అయితే ఈ తెలంగాణ ఆదాయంలో కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి 1778.13 కోట్లు వచ్చింది. మిగతా ఎనిమిది జిల్లాల నుండి వచ్చిన ఆదాయం 200.48 కోట్లు (ఒక్కో జిల్లా సగటు 25.06 కోట్లు).

క్రితం సారి జరిగిన మద్యం దుకాణాల వేలం పాటలో అత్యధిక ధర పలికిన ప్రాంతాలు అమీర్ పేట్, కూకట్ పల్లి. అక్కడ వైన్ షాప్ లకు అంత గిరాకీ ఎందుకో, అక్కడ ఎవరుంటారో అందరికీ తెలుసు. కారణం నేను చెప్పక్కర్లేదు.

ఇక తెలంగాణాలోని, మహబూబ్ నగర్ (12.84 కోట్లు), నిజామాబాద్ (12.59 కోట్లు), ఆదిలాబాద్ (17.54 కోట్లు), కరీంనగర్ (30.75 కోట్లు), వరంగల్ (27.63 కోట్లు), ఖమ్మం (16.78 కోట్లు), నల్గొండ (22.41 కోట్లు) జిల్లాలా ప్రజలందరూ కలిసి త్రాగేది (140.54 కోట్లు) ఒక్క కృష్ణా జిల్లా (139.16) ప్రజలు త్రాగేదానితో సమానం. ఇదీ మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు.

ఇప్పుడు చెప్పండి. రాష్టంలో త్రాగుబోతులెక్కడ ఎక్కువగ ఉన్నరు. ఒక ప్రాంత ప్రజల మీద నిస్సిగ్గుగా నిరాధారమైన ఆక్షేపన చేయాలని మీకెలా అనిపించింది? మీరిక్కడ హరికథ చెప్పడం లేదు మధ్యమధ్యలో మీకిష్టం వచ్చిన పిట్టకథ చెప్పడానికి. ఒక ప్రాంత ప్రజలను అవమానిస్తూ రాస్తున్నప్పుడు కొంచెం ముందూ వెనకా చూసుకోకక్కరలేదా?
                                                                                                                                - కల్నల్ ఏకలింగం

తాడేపల్లిగారు తమ టపాలో చెప్పుకొచ్చిన రహస్యపత్రం క్రిందుంది. చదువుకొని ఆయనమీద కాస్త సానుభూతి తెచ్చుకోవలసిందిగా ప్రార్థన.


Andhra Valasa Palanalo Telangana

20 comments:

ఏక లింగం said...

Thanks Mahesh,

ఎంతో స్పష్టంగా, ఆధారాలతో సహా ఇవి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు అని చెప్పినా, ఇపుడు ఆయన చేస్తున్న కొత్త వాదన ఏంటంటే, ఇవి తెలంగాణా వాళ్ళు చెప్పే కాకి లెక్కలట. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. సరే... మరి ఆయన చెప్పిన లెక్కలకు ఆధారాలు ఏమి చూపిస్తాడో చూద్దాం.

శ్రీనివాస్ said...

చివరికి తాగుబోతుల్లో ఎక్కువ తాగే ప్రాంతం వాడు తక్కువ తాగే ప్రాంతంవాడు అనే వాదనలు మొదలయ్యాయన్న మాట

Kathi Mahesh Kumar said...

@శ్రీనివాస్: సమస్య ఎవరు ఎక్కువ తాగుతారు అనేది కాదు. ఈ పాయింట్ ద్వారా తాడేపల్లిగారు తమ ఆధిపత్యభావజాలాన్ని వెలువరించి తెలంగాణాను న్యూనపరిచిన విధానం సమస్య.Its comments like this that are root cause of all these problems. మాభాష గొప్పది, మా సంస్కృతి గొప్పది, మేము చాటుగాతాగి మర్యాదస్తులుగా ఉంటాము తెలంగాణాలో నాగరికత లేదు అనే arrogance సమస్య.

Chari Dingari said...

Tadepally kooda ila maatlaaddam baagaledu mahesh, bhale coloring ichaaru inni rojulu

మంచు said...

ఆయనమీద ఏ అవకాసం దొరికినా మీరు వదలరన్నమాట..పండగ చేసుకొండి :-)

జింతాకు said...

మహేష్ గారు, తాడేపల్లిగారు చెప్పిన అసలు విశేషాలు వదిలేసి, ఇలాంటి సత్తు విషయాలను పట్టుకొంటుంన్నారన్న మాట. ఏదో గవర్నమెంటు వెబ్‌సైటులో ఉన్న ఒక ఇమేజీ పట్టుకొని, జనాల ఇమేజీని డ్యామేజీ చెయ్యాలనుకొంటున్నారన్నమాట. ఇంతకూ తాటికల్లు, ముంతకల్లు అన్ని లెక్కలూ ఉన్నాయా అందులో?

అదంతా ఎందుకు కానీ...
ఇదే ఊపులో ఆయన వ్రాసిన ఇతర నిజాల గురించి వ్యాఖ్యానించండి చదివి సంతోషిస్తాం...

Kathi Mahesh Kumar said...

బాబూ జింతాకు తాడేపల్లిగారు చెప్పినవి నిజాలా కావా అనేది ఇప్పుడే నేనిక్కడ పెట్టిన డాక్యుమెంటు చూసి తెలుసుకోండి. ఆయన అపోహల్ని నిజాలనుకునే మీకు నా ప్రగాఢ సానుభూతి.

Unknown said...

*తాడేపల్లిగారి తాగుడు లెక్కలు *

మహేష్,
మీరు పెట్టిన టైటిల్ చదివితె ఏ విధమైన భావం స్పురిస్తుందో పాటకులందరికి తెలుసు.
ఇటువంటి తాగుడు లేక్కలు చేప్పె వాడి గురించి పేపర్(ఆంధ్రజ్యోతి) లో ఆయన బ్లాగును, ఆయన గురించి ఎందుకు పరిచయం చేశావు? నువ్విప్పుడె కాదు ఒకసారి భారత దేశ చరిత్ర మీద చర్చ వస్తే కొంతమంది బ్లగ్రలు నీతో విభెదించటం జరిగింది. అప్పుడు నువ్వు గొప్పగా వారికి చరిత్ర మీద అవగాహన లేనట్లు నువ్వు ఒక పెద్ద సెక్యులర్ వాదిలా భావించుకొని వారిని బిపిన్ చంద్ర రాసిన చరిత్ర పుస్తకాలు చదవమన్నావు. అక్కడికి బిపించంద్ర గారు రాసిన చరిత్ర 200% ప్రామాణికమైనట్లు. చర్చలలో మీరు ఎవరైనా భారత దేశ చరిత్ర గురించి ఉటంకిస్తే అది బిపి చంద్ర, రోమిలా థాపర్ మొ|| వారూ రాసిన పుస్తకాలలో లేదు కనుక ఆ వ్యాఖ్యలను హిందుత్వ భావజాలం, సనాతన భావజాలం, సాంప్రదాయ వాదులు అని మీరు ఎగతాళి చేసే వారు. మరి తమరి దృష్టికి ఈ సెక్యులర్ వాదుల వాదన వచ్చిందో లేదో. ఈ క్రింది లింక్ చదివి బిపిన్ చంద్ర అసలు రంగు దళితుల రిసర్వేషన్ అమలు కి వచ్చెసరికి ఎలా ఉందో చదవండి. ఇటువంటి అభ్యుదయ వాదుల, సెక్యూలర్ వాదుల రంగులను అరుణ్ శౌరీ ఎప్పుడో బయట పెట్టాడు.
http://www.outlookindia.com/article.aspx?263782
http://www.indiastar.com/wallia19.html
మహేష్ మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లొ అవగాహన శక్తి పెరగ లేదు. నిజం గా మీకు అంతటి అవగాహనే ఉంటె ఆనాడు బిపించంద్రని అలా పొగుడుతూ రాసే వారు కాదు కదా!. మీరు తొందర పడి అందరి మీద ఒక అభిప్రాయా నికి వచ్చే కన్న కొంత అవగాహన పెంచు కోవటానికి కొంత కాలం ప్రయత్నిస్తే బావుంట్టుంది.

Kathi Mahesh Kumar said...

@నేనుదొంగ: నీతలాతోకా లేని వ్యాఖ్యచదివితే ఎవరైనా "ఇది ప్రవీణ్" అని చెప్పెయ్యగలరు.

మనుషుల ఆలోచనలు,అభిప్రాయాలు,ఆదర్శాలు, నమ్మకాల్నిబట్టి విభేదిస్తాను, అంగీకరిస్తాను,అభిమానిస్తాను,తాటతీస్తాను. నాకు వ్యక్తిపూజ తెలీదు. ఎవరికీ నా unconditional support ఉండదు. కేవలం issue based support ఉంటుంది.

ఆంధ్రజ్యోతిలో తాడేపల్లిగారి బ్లాగుని పరిచయం చేసినా చరిత్ర విషయంలో బిపిన్ చంద్ర అథారిటీని సమర్ధించినా అవన్నీ అలాగే జరుగుతాయి. ఎంతగా కొన్ని విషయాల్లో అభిమానిస్తానో అంతగానే మరికొన్ని విషయాల్లొ విబేధిస్తాను. I am a thinking man, not a moron to stick to blind faith. కేవలం ఒక అభిప్రాయం కారణంగా వ్యక్తిని dismiss లేదా praise చేసే అలవాటు నాకు లేదు. I am sure you don't understand this.

Unknown said...

*కేవలం issue based support ఉంటుంది*

రచైతలకి కొన్ని విలువలు ఉండాలి దానిని ప్రతిబింబిస్తూ వారు రచనలు కొనసాగించాలి. అలా కాకుండా ఇస్యూ బెస్డ్ మద్దతు ఇవ్వటానికి మీరు సమజ్ వాది, బహుజన సమజ్ పార్టిలు కాదుగదా!

*ఎంతగా కొన్ని విషయాల్లో అభిమానిస్తానో అంతగానే మరికొన్ని విషయాల్లొ విబేధిస్తాను.*
మీరు నిజంగా విబేదించే వారైతె వెటకారం గా టపా టైటిల్ పేట్టవలసిన అవసరం లేదు. ఆయన గురించి మరి ఒకసారి బ్లాగు వారికి ఈ క్రింది పదాలను ఉపయొగిస్తూ మీరు చేసిన పరిచయం చేయవలసిన అవసరం లేదు. కాని మీ ఉద్దెశం వేరుకనుకనే ఇలాంటి పదాలు ఆశారు.
*అడపాదడపా లావుపాటి టపాలు రాసి బ్రాహ్మణ్యాన్నీ, హిందుత్వాన్నీ,తెలుగు భాషనీ రక్షించేస్తూ ఉంటారు. *
తేలంగాణా సమస్య కి పైన మీరు రాసిన దానికి తలాతోకా సంబంధమేమి లేదు.
మీరు చెప్పిన "ఇది ప్రవీణ్" అని మీకె వర్తిస్తుంది. ఎందుకంటె ప్రవీణ్ లాంటి ప్రతిభావంతులను అటువంటి వారే గురించగలుగు తారు.

ఏక లింగం said...

అయ్యయ్యో... ఆ పుస్తకాన్ని అలా బయట పెట్టేస్తే ఎలా? దాన్ని తెలంగాణా వాళ్ళందరూ ఇన్ని రోజుల నుండి దాచుకొని చదువుతున్నారు. ఇది కేవలం కొందరు "బ్లాగర్లకు" మాత్రమే అందుబాటులో ఉన్న పుస్తకం. ఇప్పుడు వాళ్ళ ప్రాముఖ్యత ఏమైపోతుందో ఆలోచించారా?

---
నాలుగు సంవత్సరాల నుండి ఈ పుస్తకం TDF సైట్లో అందరూ డౌన్ లోడ్ చేసుకోవడానికి అందు బాటులో ఉంది. పాపం ఈయన గారు దాన్ని ఇప్పుడు చూసి ఏదో పెద్ద కనిపెట్టి నట్లు ఫీలవుతుండు.

శరత్ కాలమ్ said...

"issue based support"

చక్కగా చెప్పారు. నా పాలసీ కూడా అదే. బ్లాగుల్లొ భావాలు పంచుకోవడం, వెలిబుచ్చుకోవడం ప్రధానం. స్నేహాలు, వ్యక్తి పూజ కాదు. స్నేహాలే కావాలంటే, ప్రధానమయితే సోషన్ నెట్వర్కింగ్ సైట్లు బోలెడన్ని వున్నాయి.

Harish G said...

ऐसा कर, उस ताडेपल्लि को तेलंगाणा भेज। उसको जितना मन चाहे उतना पी के जाने को बोल। ज्यादा खाना, ज्यादा पीना, ज्यादा ..... ठुकाई करना उस से कोई देश आगे या पीछे नहीं बनता। French history, culture थोडा पढने को बोल उसे..।

एक बात बोल....ताडेपल्लि बुड्डा है क्या ?

Unknown said...

*issue based support. చక్కగా చెప్పారు. నా పాలసీ కూడా అదే. బ్లాగుల్లొ భావాలు పంచుకోవడం, వెలిబుచ్చుకోవడం ప్రధానం*
శరత్,
నువ్వు భలే కామేడి గా రాస్తావు శరత్. నిన్ను నువ్వు పెద్ద గొప్ప మేధావిలా, పెద్ద రాజకీయ విశ్లేషకుడిలా భవించి లగడపాటి రాజగోపాల్ రాజీనామ చేసినపుడు ఈ అందివచిన అవకాశాన్న్ ఆయన సద్విని యొగం చేసుకొని భవిష్యత్ లో ఆంధ్రా కి సి.యం. కావలని కోరుకున్నావు.పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అని ఒక సామేత ఉంది. తేలంగాణా వాదూల డూ ఆర్ డై లా పోరడుతూంటె ఆరోజు నువ్వు రాజగోపాల్ మీద ఊహాగానాలు చేశావు చివరకు ఆయన విదుషకుడి లా ఉద్యమం నుంచి నిష్క్రమించాడు. ఒకడు ఇల్లు కాలి చస్తుంటె ఇంకొకడు వల్ల కాక చచాడంటా. అంతమంది తెలంగాణా ప్రజలు చని పోతూ ఉంటే మీరు రాజగోపాల్ రాజకీయ భవిష్యత్ మీద ఊహాగానాం చేశారు.ఇది నువ్వు తెలంగాణా ప్రజల భవోద్వేగాలకు ఇచ్చిన విలువ. మళ్ళి నాకు నీతులు చేప్పటానికి బయలు దేరావు. నువ్వు ఆంధ్రా వాడివి కదా తేలంగాణా మీద ఈ చర్చ లో నీదగ్గర ఎమైనా సమాచారం ఉంటే రాసేది అది వదలి ఇస్యూ బెస్డ్ సపోర్ట్ అని పెద్ద పెద్ద వీశ్లేషణలు చేయకు. లేక పోతె సమైఖ్యాంధ్రా కామేడి కింగ్స్ రాజగోపాల్, మోహన్ బాబు ల అభిమాన సంఘం పెట్టి ఫొటొలు తీసి పేపర్లకి పంపించుకోండి.

Unknown said...

Thanks Mahesh for publishing my comments.

శరత్ కాలమ్ said...

@ నేనుదొంగ
నేనూ తెలంగాణాలో పుట్టి ముప్పయ్యేళ్ళు పెరిగినవాడినే బాబూ. సూర్యాపేట మాది.

చెప్పాను కదా. నాది ఆంశాలవారి మద్దతు అనీ. మీ ప్రశ్నలకి సమాధానం కూడా అదే.

. said...

Please read

http://raamusoamu.blogspot.com/2010/02/blog-post.html

Kiran said...

Kathi garu,

I lost a lot of respect for your blog after seeing this post. Especiall your link to TDF (a t doralu organization) hate pamphlet. Fighting against brahmanism is every educated person's duty but co-opting a fascist movement like t agitation in this is like shooting in one's foot. Brahmanism is now a prejudice in the society no-longer an open discrimination. It spread in a creepy way it no longer demands political boundaries or terrotaries.

But T separatism seeks the legitimacy of political boundaries for a fascist movement. I expected much more from you.

Hari Kasula said...

Dear Eka lingam gaaru,

Below is my response to Tadepally Subrahmanyam Blog. Looks like he closed that post. So i am posting here.

మహాశయా సుబ్రహ్మణ్యం,

తెలంగాణ ప్రత్యేక వాదం మీద మీరు వ్యక్త పరిచిన అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. కాని, మీరు సమస్య పరిధి దాటి చేసిన కొన్ని "కుంచిత" విమర్శలకు ఇది నా సమాధానం.

1. "తెలంగాణ లో ఆడా మగా తెడా లెకుండా తాగు బోతులు" అన్న మీ హ్రస్వ దృష్టికి చింతిస్తున్నాను. తెలంగాణలో కొందరు ఆడవాళ్ళు మద్యం సేవిస్తారు. అది కూడ కల్లు. మగ వారితో సమానంగ కష్టం చేసే ఇక్కడి మహిళలు తమ కష్టాన్ని మరిచిపోవడానికి సినిమాలు కాదని కల్లు ని ఆశ్రయిస్తారు. కాని తాగు బోతులు కాదు. మీ లాంటి మెధావులు గుర్రాన్ని గాడిదని ఒకే గాటన కట్టేయడం గర్హనీయం. ఆ కొందరు కుడా ఇంటిపట్టున సేదతీరుతున్నారే తప్ప "భోగ మేళం" పెట్టి అసభ్య నృత్యాలు చెయ్యడం లేదు.

2. శివరాత్రి రోజు పరమ శివునికి పచ్చి మాంసం నైవేద్యం పెట్టిన భక్త కన్నప్పను పూజిస్తారు తెలంగాణ జనం. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఇంటిబయట మాంస భోజనం ఏర్పాటు చెయ్యడం అతిథి మర్యాద మాత్రమే. అమ్మ వారి జాతర్లో నగ్న నృత్యాల కన్న ఇదెంతటి పాపమో మీరే చెప్పాలి. గుళ్ళొనే అసభ్య నృత్యాలు ఎగబడి చూసే వారిని విస్మరించి దేవుని పుజ తరవాత మాంసాహారం తినడమె మహా పాపంగా అభివర్ణిచడం మీకే చెల్లు.

మందు, మాంసం తోనే సరిపెట్టుకుంతున్న మా వాల్లని చూసి కాస్త ఊపిరి పీల్చు కుంటున్నాను. లెకపోతె మగువల మోహంలో ఎన్ని పెద్దాపురాలు, చిలకలూరి పేటలు ఇక్కడ వెలిసెవొ!! ఇలాంటి కామెంట్స్ చెయ్యడం నాకే నీచం అనిపిస్తున్నా.. మీకు సరైన సమాధనం ఇవ్వడానికె మీ స్థాయికి దిగజారవలసివొచ్చింది. మనసు నొచ్చుకొనివుంటె మన్నించండి.

చివరగా.. తెలంగాణ వాదులందరు చేస్తున్నవి అసత్యాలన్న మీ విశయ పరిగ్ణ్యానం క్రింది బ్లాగు లొ విషదీకరిచబడింది. www.nenusyetam.blogspot.com దయ చెసి మీ విమర్శ పక్క దారులు పట్ట కుండా సరైన కొణంలొ వక్తపరుస్తారని ఆశిస్తూ.

మీ తెలంగాణ తమ్ముడు.

gaddeswarup said...

Mahesh Kumar and others,
I am somewhat of an outsider to this issue but try to follow it because of my Telugu roots. I find the numbers confusing. Some times hyderabad and surrounding areas are included in the data and sometimes not. Sometimes the earler Hyderabad data include districts that went to Maharashtra and Karnataka. Also in the earlier days there was prohibition in the rest of India but not Hyderabad. So the data included excise on liquor sales in Hyderabad which contributed to the genera earnings of the Hyderabad gvt. But whatever the data, I have no doubts that the more mobile coastal Andhras and later Rayalaseema people exploited the opportunities and thrived (the migration of coastal people started in the 20's at the behest of the Nizam) compared to the local people ( this happened in several areas of assam and other places too). But it seems that there is some development in Telangana too if one compares with the districts that transferred to Maharashtra and Karnataka. This is not to justify any thing but to point out the processes which occured in various areas in India. The main question is whether separation will be good for Telangana and then the rest of A.P.
I do not any views on separation; some say that small states are good for development but the evidence is mixed. The problem seems to be decentralization. One general principle some have been advocating is the principle of 'subsidiarity'. From
http://lawandotherthings.blogspot.com/2009/12/in-news-love-jihad-telengana.html
"ndeed, what ought to be the basis of devolving power? Nick Barber's excellent paper 'The Limited Modesty of Subsidiarity' compares subsidiarity and nationalism as two distinct reasons for doing so. Simply put, subsidiarity requires that power should be exercised at the smallest unit that can exercise it efficiently. There is a presumption in favour of smaller units, with the rider of efficiency. An important implication of subsidiarity is that one size need not fit all, that different regions can have different ways of sharing power (even our federal constitution admits and accommodates idiosyncratic circumstances of certain states under the provisions in Part XXI). Barber's article is a must read for anyone interested in any form of vertical organisation of power---federalism, devolution or decentralisation of power to panchayats. "
In the Indian context, the smaller units themselves are not often democratic driven by power and caste differences which have in somw ways become worse with prosperity as the atrocities in Karamchedu and other places suggest. This is explored in K. Srinivasulu's article "Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories".
That seems to something to think about with smaller units. Another problem that I see is that Telangana is landlocked. Despite the rainfall, without improvement of tank irrigation, it may need electricity from outside for lift irrigation. Not everything will come from IT, it will need coastal areas either on the east or west for tranportation of goods. The most underdeveloped states in India seem to be landlocked states.
I feel that the issue has become too emotional, and for an outsider like me without really knowing many of the details, this sort of general questions present themselves. Anant Mariganti seems to raise similar issues in his recent EPW article:
http://www.epw.org.in/epw/uploads/articles/14380.pdf
(Telangana: Righting the Historical wrongs or Getting the Future Right)