Tuesday, February 16, 2010

రహస్యపు రాతలు


రాయడం అలవాటైన తరువాత ఆపడం కష్టం.
రాసింది పంచుకోవడం మొదలైన తరువాత, రహస్యంగా రాతల్ని ఉంచుకోవడం మహా కష్టం.
ప్రస్తుతం ఆ రహస్యపు రాతల్లో పడ్డాను.
సినిమాకు రాయడం, సినిమాకోసం రాయడం, సినిమా తియ్యాలనుకుని రాసుకోవడం ఇవన్నీ రహస్యపు రాతలే.
రహస్యంగా ఉంచకపోతే కొన్నాళ్ళతరువాత "నా కథ కాపీ కొట్టారు" అంటూ నేనూ కోర్టులో కేసో లేకపోతే ఏ టెలివిజన్ ఛానల్లో పోట్లాడుతూ కనిపించాలి మరి!

కాకపోతే ఒక్క నిజం.
"కథలు లేవు కథలు లేవు" అని సినిమావాళ్ళు అనడం శుద్ధ అబద్ధం.
ఉన్నకథల్ని సినిమాకు పనికిరావని వీళ్ళనమ్మకం.
అది తియ్యడం చేతగాని వీళ్ళ అసమర్ధత అని మాత్రం అస్సలు నమ్మరు.
కొత్తగా కథేదైనా చెబితే, "మన హీరోకి పనికి రాదే" అనేది మరో సందేహం.
నిజమే...మంచి కథలకు నటులు కావాలిగానీ అవి మన హీరోలకు పనికొస్తాయా?
ఒకవేళ కథ నచ్చినా..."ఇది కమర్షియల్గా సక్సెస్ అవుతుందంటారా!" అనేది మరో ధర్మసంకటం.
ఒక విధంగా చూస్తే ఇదొక చచ్చు సంకటం.
ఏ సినిమాని గ్యారంటీ సక్సెస్ అని ఎవడు మాత్రం చెప్పగలడు ఈ పరిశ్రమలో?
అనుకున్న కథను నమ్మాలి. దాన్ని జనరంజకంగా కాకపోయినా మనోరంజకంగానైనా తియ్యగలలిగే సత్తా ఉండాలి.
ఇవి రెండూ లేకపోతే...మనం ఎన్ని కథలు చెప్పినా ఏంలాభం!?!


****

4 comments:

శ్రీనివాస్ పప్పు said...

"రహస్యమనేది దాచుకుంటున్న కొద్ది రాజుకుంటూనే ఉంటుంది.దాని బరువు మొయ్యలేము, ఆ మంటని ఆర్పలేము.రహస్యాలు లేని పారదర్శక జీవితమే ఎంతో హాయినిస్తుంది.రహస్యమనే గుండె మోతతో గుండె కూడా బండగా మారిపోతుంది".

ఏ సినిమాని గ్యారంటీ సక్సెస్ అని ఎవడు మాత్రం చెప్పగలడు ఈ పరిశ్రమలో?
అనుకున్న కథను నమ్మాలి. దాన్ని జనరంజకంగా కాకపోయినా మనోరంజకంగానైనా తియ్యగలలిగే సత్తా ఉండాలి.
నూటికి నూరుపాళ్ళు నిజం.అంత సీనుంటే మన సినిమా పరిశ్రమ పరిస్థితి ఇలా ఉండేది కాదేమో.

చైతన్య said...

మీ కథని ఎవరైనా వద్దన్నారా?

కన్నగాడు said...

నాకూ చైతన్య గారికొచ్చిన డౌటే వచ్చింది, ఎవరైనా మీ కథని విమర్శించారా!

madan said...

I too have the same doubt. I remember comedy scene of Srilakshmi, where she used to write peculiar stories, poems in Chantabbai cinema. I think you are taking revenge on society.