Wednesday, July 28, 2010

మీడియాలో కనిపించని దళిత ప్రపంచం








Monday, July 26, 2010

స్నేహాల గిలిగింతల సాక్షిగా

‘ఉడాన్’ చిత్రంలోని కవితకు తెలుగు స్వేఛ్ఛానువాదం;



క్షణాల లాను పై
చెదిరి పడిన జ్ఞాపకాలు
ఆ జ్ఞాపకాల మీదుగా
నా నగ్నపాదాల నడక.
చాలా దూరం వచ్చేశాను.
ఇప్పుడు కనీసం గుర్తులేదు
చెప్పులెక్కడొదిలానో...

వచ్చిప్పుడు పాదాలు సుకుమారంగా ఉన్నాయి
ఇప్పుడూ ఆ సౌకుమార్యం వీడిపోలేదు
చక్కిలిగిలిపెట్టే మనస్నేహాల గిలిగింతల సాక్షిగా
బహుశా ఎప్పటికీ వీడదుకూడా

నిజంగా...
చెప్పులెక్కడొదిలానో ఇంకా గుర్తులేదు
కానీ, అనిపిస్తుంది
వాటి అవసరం ఇప్పట్లో లేదని


****

Tuesday, July 20, 2010

నిజంలోంచీ కలలోకి, కలలోంచీ కలల్లోకి : INCEPTION

“ Dreams feel real while we’re in them. It’s only when we wake up that we realize something was actually strange”
- Cobb in INCEPTION
నీ కలల్లోకి నేను జొరబడగలిగితే…!
నీకే తెలియని నీ ఆలోచనల్ని నేను దొంగిలించగలను.
నేనే నీ మనసులో ఒక కొత్త ఆలోచనను నింపాలంటే?!
నీ కలల్లోంచీ నిన్ను మరో కల కనేలా ఉసిగొల్పాలి.
అది సాధ్యమా?
‘సాధ్యమే…నిజంలోంచీ కలవరకూ, కలనుంచీ ఒక సామూహిక స్వప్నం వరకూ….
సామూహిక స్వప్నం నుంచీ మరో కలలోకి అలాఅలా జారడం సాధ్యమే. మనసులోని ఆలోచనల్ని దొంగిలించడమే కాదు కొత్త ఆలోచనల్ని సృష్టించడమూ సాధ్యమే’ అంటాడు దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ‘ఇన్సెప్షన్’ చిత్రంలో.
కానీ సమస్యల్లా, నిజంలా అనిపించే కలలో “జీవించిన”తరువాత నిజానికీ కలకూ బేధం మిగిలుంటుందా అనేదే. దానికి సమాధానం అంత సులభంగా దొరకదు.

మరి సమాధానం లేని సమస్యని అవసరంకోసం ఆహ్వానిస్తే…పరిణామాలు ఎలా ఉంటాయి? అనేదే ఈ సినిమా.
మ్యాట్రిక్స్ సినిమా తరువాత cinematic imagination ని మరోస్థాయికి తీసుకెళ్ళిన చిత్రమిది. ఈ సినిమాను ఒకసారి చూసి సమీక్షించడం, రెండుసార్లు చూసి విశ్లేషించడం లాంటి సాహసాలు చెయ్యడానికి నేను పూనుకోకూడదని తెలిసొచ్చి, కేవలం “చూడండి” అని చెప్పడానికి ఇది రాస్తున్నాను.

చూడబోయే ముందు ఒక్క మాట, ఈ సినిమా ఒకసారి చూస్తే అద్భుతమైన కలలా ఉంటుంది. థియేటర్ బయటొచ్చిన తరువాత అనుభవం లీలగా తెలిసొస్తుందిగానీ, వివరాలు గుర్తుకు రావు. ఎంత అర్థమయ్యిందో అస్సలు అంచనాకు రాదు. అందుకే, ఈ సినిమాని నిజంలా ఫీలవ్వాలంటే కనీసం మరో మూడుసార్లు చూడాలి. అందుకు మీరు రెడీగా ఉంటే GO AHEAD…SEE IT…DREAM IT.





****

Monday, July 19, 2010

విశాలధృక్పధం Vs మూర్ఖత్వం

Sunday, July 18, 2010

గాయపడిన పక్షి ప్రయాణం – ఉడాన్ (సమీక్ష)

గత పదిహేనేళ్ళుగా  ప్రి-టీన్స్, టీన్స్ ని విస్తృతమైన మార్కెట్ సెగ్మెంటుగా హాలీవుడ్ గుర్తించి వారికోసం సినిమాలు తియ్యడం మనకు తెలిసిందే. చాలా వరకూ వాటిల్లో చాలా వరకూ టీన్ సెక్స్ కామెడీలు ఉన్నా, టీనేజి సమస్యలు వారి మానసిక స్థితులు మొదలైన ప్రశ్నల గురించి చర్చించిన చిత్రాలు కూడా చాలా ఉన్నాయనేది కాదనలేం.  అత్యధిక కలెక్షన్లు చేసిన సినిమాలలో నిలబడున్న ‘హ్యారీపోట్టర్’ ఈ కోవలోకే రావడం గమనార్హం. కానీ, భారతీయ సినిమాల్లో ఈ సెగ్మెంట్ ప్రేక్షకులకు ఇప్పటివరకూ సరైన ప్రాముఖ్యత దక్కలేదు. అడపాదడపా ‘చిత్రం’, ‘కొత్తబంగారు లోకం’ వంటి చిత్రాలు వచ్చినా అవి ప్రేమ ప్రధానమైన చిత్రాలుగా మాత్రమే మిగిలిపోయాయిగానీ టీనేజి ఆశల్ని, ఆలోచనల్ని, సమస్యల్నీ, ఆశయాల్నీ, ఐడెంటిటీని చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాయి.

నాగేష్ కుక్కునూర్ తీసిన ‘రాక్ ఫోర్డ్’  ఆ దిశగా ఒక మంచి ప్రయత్నమనుకుంటే, విక్రమాదిత్య మోత్వానీ చిత్రం ‘ఉడాన్’ ఒక అర్థవంతమైన హృద్యమైన గుర్తుండిపోయే  కొనసాగింపు అనుకోవాలి.

పూర్తి సమీక్ష కోసం నవతరంగం చూడండి. 

****

కులాన్ని కనుక్కుందాం !

Thursday, July 15, 2010

ఐ లవ్ ‘పైరసీ’

AVS గారి బ్లాగు పుణ్యమా అని పైరసీ చర్చలు మళ్ళీ మొలయ్యాయి.

ఈ పైరసీ గురించి చర్చ వచ్చినప్పుడల్లా నేను ఏవైపుండాలో నాకు అర్థం కాదు.
ఎందుకంటే, నాకు హాలీవుడ్ మరియూ ప్రపంచ సినిమాలు చూడాలంటే పైరసీనే గతి. భారతదేశంలో కూడా ధియేటర్లో ఆడని “గొప్ప సినిమాలు” చూడాలంటే పైరసీనే ఇప్పటికీ గతి. ఒరిజినల్ కొనాలంటే జేబు పర్మిట్ అస్సలు చెయ్యదు. సాధారణంగా తెలుగు సినిమాల్ను థియేటర్లో చూసే నేను చాలా సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ బయట ఉండటం వలన మళ్ళీ పైరసీ వలనే చూసే అవకాశం లభించింది. ఇప్పుడు కొన్ని సెలెక్టివ్ సినిమాలు థియేటర్లో చూడటమే తప్ప, తెలుగు సినిమాలు చూసే ఖర్మను తప్పించుకు తిరుగుతుంటాను.  నాకు బెంగాలీ, తమిళ్, మళయాళం, మరాఠీ, కన్నడ వంటి ఇతర ప్రాంతీయభాషాచిత్రాలు చూసే అలవాటు, అవి ఎలాగూ మనకు థియేటర్లో దొరకవు కాబట్టి పైరసీ తప్పలేదు.

పైరసీ చట్టవ్యతిరేకమే. శిక్షార్హమే. కానీ వేరే దారీ!? నాకైతే ఏమీ కనిపించలేదు. అందుకే కొంత గిల్టీగా ఫీలైనా ఐ లవ్ పైరసీ...

"కొంత గిల్టీ" అని ఎందుకంటున్నానంటే, భారతదేశంలోని పైరసీ చట్టం Copyright Act,1994 కి అనుబంధంగా వచ్చింది. ఇందులో క్లియర్గా;
Infringement of cinematograph films – section 51 read with section 14(d) of the Act
Copyright protection in films extends to
- making a copy of the film;
-taking a photograph of any image forming a apart of the film;
-selling, giving in hire or offering for sale or hire any copy of the film, irrespective of its
earlier sale or hire; and
-communicating the film to the public.

అని ఉందే తప్ప పైరేటడ్ కాపీలు కొనడం (buying) లేదా, కలిగి ఉండటాన్ని (processing) నేరంగా పరిగణించలేదు. పైగా ఇదే చట్టంలో "free use" అనే మరో తిరకాసు ఉంది. Certain uses of copyrighted works are not considered to infringe upon the rights of the copyright owner and so one does not require permission from the copyright owner. These uses are known as 'Fair Use'. Such uses are exceptions to copyright that allow limited use of
copyright works without the permission of the copyright owner. For example, limited use of works may be possible for research and private study, criticism or review, reporting current events, judicial proceedings, teaching in schools and other educational establishments etc. However ‘Fair Use’ is not a defence incase of infringement of film copyright. అంటూ కొంత వెసులుబాటు కలిపిస్తుంది. నేను చేసేది చాలావరకూ fair use అని నా నమ్మకం :)


ఇక తెలుగు సినిమాల విషయంలో నాకెందుకో  ఆ గిల్టీఫీలింగ్ కొంత తక్కువ. ప్రేరణ పేరుతో గ్లోరిఫైడ్ కాపీలు కొడితేగానీ తయారుకాని కథలు,సీన్లు, సంభాషణలు, ఫైట్ల మధ్య పైన చెప్పిన కాపీరైట్ చట్టాల్ని దర్జాగా ఉల్లంఘిస్తున్న సినీపరిశ్రమ పైరసీ గురించి మాట్లాడితే కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఒకసారి సినీ పరిశ్రమ పెద్దల ఇళ్ళలో తొంగిచూస్తే. ప్రతి ఇంట్లోంచీ కనీసం వెయ్యి హాలీవుడ్ పైరస్ DVD లు బయటికి తియ్యచ్చు. ఇలా "ఎదుటి మనిషికీ చెప్పేటందుకె నీతులు ఉన్నాయి" అనుకునే ముందు పరిశ్రమ తమ గురివింద ఛందాన్ని కొంత తెలుసుకుని సంస్కరించుకున్న తరువాత ప్రేక్షకుల్ని అంటే బాగుంటుంది. అనిపిస్తుంది.

పైరసీ అనేది ఒక parallel industry. పరిశ్రమ తమ జాగ్రతల్లో ఉండనంతవరకూ ఇది కొనసాగుతుంది. ఇక్కడ ప్రేక్షకులమీద పడి ఏడిస్తే లాభం ఉండకపోవచ్చు. ఒక వార్త ప్రకారం  దావూద్ ఇబ్రహీం వ్యాపారాల్లో ఈ మధ్యకాలంలో పెద్దస్థాయిలో డబ్బులు సంపాదించిపెడుతున్న వ్యాపారం “పైరసీ”. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల పైరసీ చేసే తను సంవత్సరానికి దాదాపు 400 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడట. మొత్తానికి ఇది బిలియన్ డాలర్ల వ్యాపారమనైతే తేలింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఈ డబ్బుతను టెర్రరిస్టు కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడని ఒక సంస్థ రిపోర్టు. ఇక్కడ గిల్టీ విషయం ఏమిటంటే, పైరసీ సీడీ కొన్న ప్రతి ప్రేక్షకుడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించినట్టన్నమాట….ఇప్పుడేం చెయ్యాల్రో దేవుడా! ఐ లవ్ పైరసీ !!

****

Wednesday, July 14, 2010

అభివృద్ధి టెర్రరిస్టు



"శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగటంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.మరో 60 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది పోలీసులు"    - ఈనాడు 


ఎవరికోసం ఈ అభివృద్ధి?  
ఎందుకోసం చేస్తున్నారు?
వరు చేస్తున్నారు ఈ టెర్రరిజం?

అర్థరహిత అభివృద్ధి నమూనాను “భలే భలే” అని మోస్తున్న మధ్యతరగతి కళ్ళన్నీ పల్లకి ఎక్కే క్షణం కోసం మాత్రమే చూస్తున్నన్నినాళ్ళూ ప్రభుత్వాలు ఈ మారణహోమాల్ని చేస్తూనే ఉంటాయి. బలయ్యే సామాన్యుల కష్టాలు “అనాగరికంగా” వాళ్ళ పోరాటాలు “నక్సలిజంగా” చాలా కన్వీనియంట్గా పేర్లు పెట్టి ఈ దారుణాల్ని మహదర్జాగా కానిస్తూనే ఉంటారు. 

అందుకే alternate media అవసరం. ప్రత్యామ్న్యాయ ధృక్కోణాలు అవసరం. ఒక అభివృద్ధి డిబేట్ పెద్దస్థాయిలో అవసరం.



****

Tuesday, July 13, 2010

తమిళ జాతీయ గీతం

మొన్న జరిగిన World Classical Tamil Conference కోసం ఎ.ఆర్. రెహమాన్ కూర్చిన తమిళ జాతీయ గీతం వీడియో ఇది. ఇది చూసి మనం నేర్చుకోవలసింది ఏమీ లేకపోయినా, కాసేపు సిగ్గుపడదామని పెడుతున్నాను. చూడండి.




****

Monday, July 12, 2010

చలం చెప్పని కథ - కథాజగత్

కథాజగత్ లో నాకు బాగా నచ్చిన కథ "చలం చెప్పని కథ" .


చలం లాంటి భావ తీవ్రత మరొకరి కుంటే అతని పేరు ‘చైతన్య’ అవుతుంది.
అలాంటి చైతన్య చలం లాంటి చలం, మన చలమే అని అనుకునేలా ఉన్న ఒక చలం గురించి ‘తన కథ’ చెబితే "చలం చెప్పని కథ" అవుతుంది. చైతన్య చలం టెలిగ్రాం పిలుపు అందుకుని ప్రయాణమవడంతో సాగే చైతన్యస్రవంతి ఈ కథ. 
కథాజగత్ లో ప్రచురింపబడిన ఈ కథ ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు రాశారు.

ఈ కథనచ్చడానికి నా అభిమాన రచయిత చలం ఒక కారణమైతే. ‘ఆ చలం’ కాడంటూనే కథకుడు ‘మన చలం’ వ్యక్తిత్వాన్నీ, భావజాలాన్నీ, సిద్ధాంతాలనీ అలవోకగా చిన్నచిన్న వాక్యాలో కుదించి రసజ్ఞతను సిద్ధింపజెయ్యడం మరో కారణం.


చలం లాంటి చలం గురించి కథే అయినా, మహారచయిత చలం జీవితాన్ని, రచనల్నీ, ఆలోచనల్నీ, అనుభవాల్నీ, భావాల్నీ అర్థం చేసుకుని జీర్ణించుకున్న తీరు ఈ కథలో మనకు కనిపిస్తుంది. అలాగే కొంత బౌద్ధమత ఆలోచనా సరళి గోచరిస్తుంది.


చలాన్ని మేధతో మధించే కన్నా, మన రక్తంలో... మనలోని ప్రైమోడియల్ సహజత్వపు శక్తుల్లోకి రంగరించుకుంటేనే అనుభవించడానికి సాధ్యమౌతుంది. ఈ ‘చలం చెప్పని కథ’లో కూడా అదే స్ఫూర్తి, ఆరాధన, భావతీవ్రతా నింపడంలో కథకుడు సఫలీకృతుడయ్యారు.




 "కోర్కెలు ఒక వ్యక్తి మనసులో జనించి అవి తీరకపోగా - అతనిలో  అలజడి జీవితం ప్రారంభమవుతుంది. ఎంత నొక్కిపెట్టినా అవి మనః పొరలలో చిక్కుకుని - ఎండల్లో ఎండి మాడిన గడ్డి వర్షంలో తలెత్తినట్లు - కొన్ని పరిస్థితులలో మళ్ళీ మొలకెత్తక మానవు. ఆశల్ని చంపుకోవడం మంచిదే. ఆశల్ని మనసులో పుట్టకుండా చేయడమే ఇంకా మంచిది.  

    నిజానికి వ్యక్తిలో కోరికలు సహజంగా నెరవేరేవే ఎక్కువగా జనిస్తుంటాయి. కాని వాటిలో ఎక్కువభాగం ఈ సంఘం, ఆచారాలు, కట్టుబాట్లు - వీటికే బలి అవుతుంటాయి. అతి సులభంగా నేరేరే ఆశలు ఏ విలువాలేని సంఘం కాలరాస్తే అతడిలో అరాజకత్వం తలెత్తుతుంది. అతణ్ణి లోకం శత్రువుగా భావిస్తుంది. జీవితంలో ఓడిపోయినవాడు ఒంటరిగా సంఘాన్ని ఎదిరించలేనివాడు ఓటమిని అంగీకరించి రాజీ కుదుర్చుకుంటాడు. అతడిని మాత్రం నీతిమంతుడంటుంది సంఘం. ఇలాంటి నీతిమంతుల సంఘంలో చలాని కన్నీ చూక్కెదురే. అలాటి ఈ సంఘంలో జీవించడం చేతకానివాడు చలం."
అంటూ చలం నేపధ్యాన్ని అర్థం చేసుకుంటూనే...


"అతని వాదనను 'వ్యతిరేకత' అని చాలామంది అనుకున్నప్పటికి అది వ్యతిరేకత కాదు. తరతరాలుగా నాటుకున్న పాతకాలపు ఆచారాల్ని కాలరాయటమే!" అని సమర్ధిస్తాడు రచయిత.
    
"జీవితానికి ముందు అంధకారమే. వర్తమానం అంధకారమే. భవిష్యత్తు ఇంకా అంధకారమే. అలాంటి జీవితంలో కాంతిరేఖల్లా అక్కడక్కడ సౌందర్యం ప్రసాదిస్తున్న కాంతికిరణాలు ప్రేమ చల్లదనాన్ని నింపుకుని చలం జీవితంలో వెలుగు నింపాయి. అదే అతని సర్వస్వం జ్ఞాపకంగా దాచుకోగలిగిన నిధులు." అంటూ చలం ప్రేమతత్వాన్ని మూడు వాక్యాల్లో ఆవిష్కరించి మనల్ని బద్ధుల్ని చేశాడు రచయిత.

చివరిలో... చైతన్య మరో చలం అయ్యాడనిపించే చెళుకు, ఒక అద్భుతమైన "ట్విస్ట్" అని చెప్పొచ్చు.

ఇలా రాస్తూ పోతే మొత్తం కథని ఇక్కడే కాపీ చేసెయ్యాలి. కాబట్టి...


ఆ కథ ఈ లంకెలో చదవండి. అనుభవించండి.


*****

Wednesday, July 7, 2010

ఫలించనిదానికి పోరాటమెందుకు?

మొన్న సోమవారం పెట్రోల్ ధర పెంపుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తే నా స్నేహితుడొకరన్న మాట ;
"ప్రభుత్వం ఎలాగూ తగ్గించదు. ఈ బంద్ చేసి వీళ్ళు బావుకునేదేముంది" అని.
అప్రయత్నంగా తల ఊపి అంగీకారాన్ని తెలిపినా, ఎందుకో నామీద నాకే అనుమానం వచ్చింది.
"అంతేనా!?" అనిపించింది.

మిత్రుడు కొణతం దిలీప్ తన ‘కొమరం భీమ్’ సమీక్షలో...
"ధరలు పెరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు హర్తాళ్ కు పిలుపు ఇస్తే దాని వల్ల దేశంలో వాణిజ్య రంగానికి 10,000 కోట్ల నష్టం జరిగిందని లెఖ్ఖలు వేసే రోజులివి…

ఆన్లైన్ పిటీషన్లో ఓ సంతకం పారేస్తే చాలు సమస్యలు తీరిపోతాయని నమ్మే తరమిది. ఎర్రని ఎండలో చేసే ధర్నాలు ఎందుకోసమో చెప్పేదెవరు? జీన్స్, టీషర్టులు వేసుకుని రోడ్డుపై కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహిస్తే మీడియా హడావిడి చేసే కాలమిది. అడవి బిడ్డల కాగడాల పోరును అర్థం చేసుకునేదెవరు? గెలుపుకు మెట్లు అయిదున్నాయో అయిదొందలున్నాయో పుస్తకాలు రాసి మరీ చెప్పేవారున్నారు, కానీ ఓడిపోతామని తెలిసీ ప్రాణాలకు తెగించి పోరాడే వారి గురించి ఎవరు చెప్తారిప్పుడు?


అని ప్రశ్నించగానే, ఒక కడివెడు చన్నీళ్ళు నెత్తిన కుమ్మరించినట్లయ్యింది.

ఏదైనా సాధించాలని పోరాడతాం, ఏంతో కొంతైనా సాధించేందుకు పోరాడతాం. ఏమీ కాకున్నా, కనీసం నిరసన తెలుపడానికి, మా హక్కుల్ని కాలరాస్తున్నారనో, మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనో, మా జీవితాల్ని కష్టాలపాలు చేస్తున్నారనో, అన్యాయమైపోతున్నామనో అరవడానికి పోరాడతాం. మరి అన్ని పోరాటాలూ గెలిస్తేనే అర్థవంతం అనుకుంటే ఈ పోరాటాలకు అర్థమేముంది?

నిజంగా గెలుపే పోరాటానికి గమ్యమా?

బంద్ పిలుపు రాగానే పెట్రోల్ ధరల్ని ఎలా నియంత్రించచ్చో ప్రజల మీద ఎలా భారంపడకుండా ఉంచచ్చో చర్చించకుండా మీడియా అంతా ‘జన జీవనం అతలాకుతలం అయిపోతోంది’ అని కథనాలు బోలెడు వినిపించేశాయి. మెట్రోపాలిటన్ నగరాల జనాల్ని ముఖ్యంగా టీవీకి పనికొచ్చే బైట్స్ ఇచ్చే జనాల అభిప్రాయాలతో మీడియా ఊదరగొట్టేసింది. ఇందులో కుట్రలేదంటే ఎట్లా నమ్మేది? అసలు విషయాన్నీ, పనికొచ్చే చర్చల్నీ వదిలేసి బంద్ కు గల అసలు కారణాల్ని గాలికొదిలి "బంద్ అన్యాయం" అంటున్న మీడియా అసలు కీలకం ఏమిటి?

మొన్న ‘మిస్టర్ స్మిత్ గోస్ టు వాషింగ్టన్’ అనే ఒక సినిమా చూశా...అందులో హీరో అంటాడు...
"I guess this is just another lost cause, .... they were the only causes worth fighting for. And he fought for them once, for the only reason that any man ever fights for them. Because of just one plain simple rule: 'Love thy neighbor.' And in this world today, full of hatred, a man who knows that one rule has a great trust...  fight for the lost causes harder than for any others. Yes, you even die for them..."


అందుకే అడుగుతున్నా, ఫలించని దానికి పోరాటమెందుకనే ప్రశ్న ఎంతవరకూ సబబు?

****

Thursday, July 1, 2010

మా డిపార్ట్మెంట్ ఇండియాలో బెస్టోచ్ !

సెంట్రల్ యూనివర్సిటీలోని మా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, భారతదేశంలోని అత్యుత్తమ కమ్యూనికేషన్ స్కూల్స్ లో ఒకటిగా ఔట్ లుక్ పత్రిక సర్వేలో నిర్ధారించింది.
I am proud of it. Happy to be part of a great Legacy. 

****