Wednesday, July 7, 2010

ఫలించనిదానికి పోరాటమెందుకు?

మొన్న సోమవారం పెట్రోల్ ధర పెంపుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తే నా స్నేహితుడొకరన్న మాట ;
"ప్రభుత్వం ఎలాగూ తగ్గించదు. ఈ బంద్ చేసి వీళ్ళు బావుకునేదేముంది" అని.
అప్రయత్నంగా తల ఊపి అంగీకారాన్ని తెలిపినా, ఎందుకో నామీద నాకే అనుమానం వచ్చింది.
"అంతేనా!?" అనిపించింది.

మిత్రుడు కొణతం దిలీప్ తన ‘కొమరం భీమ్’ సమీక్షలో...
"ధరలు పెరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు హర్తాళ్ కు పిలుపు ఇస్తే దాని వల్ల దేశంలో వాణిజ్య రంగానికి 10,000 కోట్ల నష్టం జరిగిందని లెఖ్ఖలు వేసే రోజులివి…

ఆన్లైన్ పిటీషన్లో ఓ సంతకం పారేస్తే చాలు సమస్యలు తీరిపోతాయని నమ్మే తరమిది. ఎర్రని ఎండలో చేసే ధర్నాలు ఎందుకోసమో చెప్పేదెవరు? జీన్స్, టీషర్టులు వేసుకుని రోడ్డుపై కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహిస్తే మీడియా హడావిడి చేసే కాలమిది. అడవి బిడ్డల కాగడాల పోరును అర్థం చేసుకునేదెవరు? గెలుపుకు మెట్లు అయిదున్నాయో అయిదొందలున్నాయో పుస్తకాలు రాసి మరీ చెప్పేవారున్నారు, కానీ ఓడిపోతామని తెలిసీ ప్రాణాలకు తెగించి పోరాడే వారి గురించి ఎవరు చెప్తారిప్పుడు?


అని ప్రశ్నించగానే, ఒక కడివెడు చన్నీళ్ళు నెత్తిన కుమ్మరించినట్లయ్యింది.

ఏదైనా సాధించాలని పోరాడతాం, ఏంతో కొంతైనా సాధించేందుకు పోరాడతాం. ఏమీ కాకున్నా, కనీసం నిరసన తెలుపడానికి, మా హక్కుల్ని కాలరాస్తున్నారనో, మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనో, మా జీవితాల్ని కష్టాలపాలు చేస్తున్నారనో, అన్యాయమైపోతున్నామనో అరవడానికి పోరాడతాం. మరి అన్ని పోరాటాలూ గెలిస్తేనే అర్థవంతం అనుకుంటే ఈ పోరాటాలకు అర్థమేముంది?

నిజంగా గెలుపే పోరాటానికి గమ్యమా?

బంద్ పిలుపు రాగానే పెట్రోల్ ధరల్ని ఎలా నియంత్రించచ్చో ప్రజల మీద ఎలా భారంపడకుండా ఉంచచ్చో చర్చించకుండా మీడియా అంతా ‘జన జీవనం అతలాకుతలం అయిపోతోంది’ అని కథనాలు బోలెడు వినిపించేశాయి. మెట్రోపాలిటన్ నగరాల జనాల్ని ముఖ్యంగా టీవీకి పనికొచ్చే బైట్స్ ఇచ్చే జనాల అభిప్రాయాలతో మీడియా ఊదరగొట్టేసింది. ఇందులో కుట్రలేదంటే ఎట్లా నమ్మేది? అసలు విషయాన్నీ, పనికొచ్చే చర్చల్నీ వదిలేసి బంద్ కు గల అసలు కారణాల్ని గాలికొదిలి "బంద్ అన్యాయం" అంటున్న మీడియా అసలు కీలకం ఏమిటి?

మొన్న ‘మిస్టర్ స్మిత్ గోస్ టు వాషింగ్టన్’ అనే ఒక సినిమా చూశా...అందులో హీరో అంటాడు...
"I guess this is just another lost cause, .... they were the only causes worth fighting for. And he fought for them once, for the only reason that any man ever fights for them. Because of just one plain simple rule: 'Love thy neighbor.' And in this world today, full of hatred, a man who knows that one rule has a great trust...  fight for the lost causes harder than for any others. Yes, you even die for them..."


అందుకే అడుగుతున్నా, ఫలించని దానికి పోరాటమెందుకనే ప్రశ్న ఎంతవరకూ సబబు?

****

13 comments:

హరి said...

పోరాటంలో గెలుపు ఓటములు ముందే తెలియవు. ఏ పోరాటమైనా చిన్న నిప్పులానే రాజుకుంటుంది. అదే పెరిగి పెరిగి దావానలంగా మారుతుంది. అయితే అందులో స్పష్టత, నిజాయితీ ముఖ్యం.

ఇక ధరల పెరుగుదల విషయానికి వస్తే, ఇప్పుడు హడావిడి చేస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు చేసింది కూడా అదే. దీంట్లో నిజాయితీ లేదు.

Harish G said...

జీవితమే ఒక పోరాటం! అలా ఉన్నప్పుడు పోరాటమే లేకపోతె మనిషి బ్రతుకుకు అర్ధం లేనట్టె కదా!? "ఫలించనిదానికి పోరాటమెందుకు" అని నిర్వీర్యంగా ఒప్పుకోవడానికైనా, ఎదతట్టి తిరస్కరించడానికైనా చిన్న పోరాటమైతే చేయాల్సిందేగా..? నా లోని మనసుతోనైనా, నా లోని మనుషితోనైనా, నా చుట్టున్న మట్టిమనుషులతోనైనా ఒక పోరాటం నిరంతరంగా కొనసాగుతుండాలి - ఫలించినా, ఫలించకపోయినా. The struggle has begun. It must go on.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Good question Mahesh. My preference would be to fight even when there is not a chance of success. it reminds me a nice line from Harry Potter series:

"The difference between being dragged into the arena to face a battle to the death and walking into the arena with your head held high. Some people, perhaps, would say that there was little to choose between the two ways, but there was all the difference in the world."

anybody who really understand the concept of "Nishkama Karma" will agree with this view.

krishna said...

బందు విషయంలో నా అభిప్రాయం వేరు అయినా.. ( బహుశా నా అనుభవం తక్కువ కనుక ఇలా అనిపించవచ్చు.) పోరాటాల విషయంలో చాలా బాగా చెప్పారు. ఎక్స్‌లెంట్ పోస్టు.

హను said...

anni telisinaa adi amte

DesiApps said...

మంచి హెడింగ్ పెట్టిన మీరు ప్రస్తావించిన విషయం మాత్రం సరిగ్గా లేదు. పోరాటం అంటే online petition ఏ కాదు, బంద్ , హర్తాల్లె కాదు, ఇంకా చాల శాంతి యుత, జన సమ్మతమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. భారత్ బంద్ తో వీళ్ళు ఏమి సాదించాలని అనుకున్నారు అది ముందు తెలియాలి, ఏ కారణం అయిన కానీ బంద్ లకి నేను పూర్తి వ్యతిరేకం. అంత మాత్రాన పోరాటానికి కాదు. విపక్షాలు బంద్ లకి పిలుపు ఇచ్చే బదులు వాళ్ళు ఎందుకు ఈ ధరల పెంపును వ్యతిరేకిస్తున్నారు, వారు ఇప్పుడు అధికారం లో వుంది ఉంటె ఏమి చేసేవారు, రేపు అధికారం లోకి వస్తే ఏమి చేసేవారో సరిగ్గా జనాలకి అర్ధం అయ్యేటట్టు చెబితే, డాకుమెంట్ చేస్తే ఇంకా చాల ఉపయుక్తం గా ఉండేది.

భారత దేశం ఎలా లేక్కవేసిన కనీసం పది కోట్ల మందికి ఏ రోజు కి ఆ రోజే సంపాదన వాళ్ళు ఎలా బతుకుతారు సర్..

పోరాటం తప్పు కాదు.. బంద్ లు తప్పు .. ప్రపంచంలో ఉన్న దరిద్రమైన రోడ్స్ అన్ని మనవే, వాటిని కూడా రాస్తోరోకో లు అని బ్లాక్ చెయ్యడం తప్పు..

నిరసన కి చాల మార్గాలు ఉన్నాయి.. శాంతియుత మార్గాలు, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి కాని తప్పనిసరిగా పలితం ఇస్తాయి..

సారీ ఈఫ్ ఐ హార్ట్ యు

Anonymous said...

*ఇక ధరల పెరుగుదల విషయానికి వస్తే, ఇప్పుడు హడావిడి చేస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు చేసింది కూడా అదే. దీంట్లో నిజాయితీ లేదు*
ఇక్కడ ఒక పెద్ద ఇంజానిర్ చాలా కామేడిగా మాట్లాడుతున్నాడు.ఈ దేశాన్ని పాలించింది అదిక సమయం కాంగ్రెస్ దానితో పోలిస్తె ప్రతిపక్షాల వారు పాలించింది ఎంత కాలమో అందరికి తెలుసు. బాబయ్య నేను నాలాంటి సామన్య మానవులు రోడ్ మీదకు వెళితె ఒక్క పోలిసోడు చాలు మాలాటివారిని జైల్ లో వేసి కుళ్ల పొడవటానికి. ఒకడి గా నీ నిరసన చెప్పటానికి పోతె మీ మొహం చూడరు. నలుగురేసు కొని పోతె నువ్వేమో గలభా చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఉండేది ఇక ఎందుకు? వారు లేకుండా కడుపు కాలిన వారు విడి విడి గా, ఒక్కొక్కరు గా నిరసన తెలిపితె ఎవరైనా స్పందిస్తారా?
వీరెంత నిజాయితి గలవారు అని మాట్లాడుతున్నావు. మీకైతె సిటి లో తల్లిదండృలనుంచి ఒక ఇల్లు ఆల్రేడి ఉంట్టుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఒక ఇల్లు కొనుకొని ఉంటూ, మీలాటి 35+ వయసు వారు రేండొ ఇంటికి ఇ.యం.ఐ. కట్టు కుంట్టుంటారు. తెలంగాణ ప్రత్యెక రాష్త్రమొస్తె, ఇంటి ఖరీదు తగ్గితె, మూడొ ఇల్లు తీసుకోవాలనే ఆలోచనలో ఉండే మీలాంటి గొప్ప దూరదృష్టి గల మేధవుల తో రోజు ఆఫీసులో వేగ లెక/తెలియ జెప్పలేక పోతున్నాము మళ్ళి బ్లాగులొ కూడా ఇంటువంటి వారె!!!. మే మేదో పల్లెలో,పట్టణాలలో పోట్టగడ వని కోసం నోరు తెరిచిన వారి గురించి అధిక శాతం ప్రజల గురించి మాట్లాడుతున్నాము. మాకు మీ అంత డబ్బులు ఉంటె ఈ బ్లగులోకం లో బోరు మని ఎందుకేడుస్తాం.
------------------------
చూడబోతె లాభం లేదు కనుక మనుషులు బాధలు, కస్టాలోచ్చినా ఎడవటానికి కూడదు అనేరోజులు తొందర్లో వచ్చెటాట్టు ఉన్నయి. ఎదుటొడు ఏడిస్తె నాకేటి లాభం అని ఆలోచించే వారు ఈ మధ్య కాలం లో బాగా ఎక్కువైనారు. ఎడవటం లో కూడా విరీకి తార్కికత కావాలి. పెరిగిన ధరల వలన మా కొంప గడవటం లేదు అని ఎవ్వరు బందువుల దగ్గర్ గోడు వేళ్ళా పోసుకోరు తక్కువ అవుతామని. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ లో మనుషులు తమ నిరశన ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి వచ్చె విధంగ ఎలా తెలపాలో, వారికి ముందర ఉన్న మార్గాలేమిటొ అని కొంచెం మన్నా ఆలోచించిస్తె ఎవరు కూడా బందులు తప్పు అని చెప్పలేరు.
బ్లాగులు చదివేవారికి ప్రతిపక్షాల నిజాయితి తెలియదనుకోవటం చాలా హాస్యస్పదం.

హరి said...

@డమ్మీ

పోరాటం గురించిన నా అభిప్రాయాన్ని మొదటి వాక్యంలోనే చెప్పాను.

అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ధరలను పెంచిన పార్టీ, అసలు సబ్సిడీలే దండగని చెప్పిన పార్టీ నేడు ప్రతిపక్షంలో కూర్చోగానే మాట మార్చి, రేపు మళ్ళీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఇవే పనులు నిస్సందేహంగా చేసే పార్టీలకు నిజాయితీ లేదంటే మీకెందుకు కోపం వచ్చిందో అర్థం కావటం లేదు.

సుజాత వేల్పూరి said...

ఈ పోరాటం ప్రజలు చేసిందైతే మీరు ఈ ప్రశ్న వేసినా అందం! ప్రజా జీవనానికి విఘాతం కల్గించే బంద్ లను ప్రజలు ఎప్పుడూ సమర్థించరు. అసలు ఇలాంటి వాటికోసం పోరాటాలు చేసే టైము ఎవరికీ లేదు. ఆకాశాన్నింటిన ధరల్ని తట్టుకోడానికి చేయాల్సిన జీవన పోరాటం వెంటబడి తరుముతుంటే ఇక బందులూ పోరాటాలు కూడానా! విచిత్రమేమిటంటే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్న పోరాటాలు ధరల మీదే!

ప్రభుత్వమేదైనా సరే, ధరలు పెరగ్గానే ప్రతి పక్షాలు రివాజుగా చేసే పనేగా ఇది? అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నది తామైనా సరే....మళ్ళీ ఇదంతా మామూలే!

ఈ పోరాటాల్లో పాల్గొనేది ప్రజలు కాదు,పార్టీ కార్యకర్తలు మాత్రమే!

బలవంతంగా షాపులు మూయించి,ప్రయాణానికొచ్చిన వాళ్ళను తరిమేసి,బస్సులు పగలగొట్టి చేసే బంద్ ప్రజల మద్దతుతో చేసేది ఎలా అవుతుంది?

yab said...

అందుకే అడుగుతున్నా, ఫలించని దానికి పోరాటమెందుకనే ప్రశ్న ఎంతవరకూ సబబు?
This question is very valid. If the person is emotionally prepared for fact that his struggle is not going to yield any immediate results and he his just playing his role in a bigger scheme of things it is OK. But if he is not prepared for that, not getting any result can compel him to take radical steps.

In almost any mass struggle we see, leaders are well prepared in this aspect, they clearly know what is the immediate goal and what is the long term goal. Common people don't understand this, they think the long term goal is the immediate goal and if it is not achieved they resort to radical measures.

We can very clearly see this in the recent incidents that happened in the struggle for a separate state. Who were the people most affected in this struggle ?

yab said...

We can fight for a better life for us, for our families and for our societies, but not at the cost of our lives.

The world is never ever a level playing field.

"He who fights and runs away will live to fight another day."
- Demosthenes

gaddeswarup said...

Pratap Ghanu Mehta has ab interesting article on the topic, the flavour of the article indicated by the last couple of sentences:
Protest, but softly
http://www.khaleejtimes.com/DisplayArticleNew.asp?xfile=/data/opinion/2010/July/opinion_July64.xml&section=opinion
"The forms of democracy require that someone make noise from time to time, so protest has taken place. But that democracy also now requires that real problems best remain invisible, for once that Pandora’s Box is opened who knows who will be held to account."

rākeśvara said...

కొమరం భీమ్ సమీక్షలోని ఆ గద్యం చదివిన నాడు నాకు నవ్వువచ్చింది। కొమరం భీమ్ పోరాటానికి నేటి బీజేపీ బందు పిలుపునకు పోలికంటే, భీమ్ ని అవమానించినట్టు అనిపించింది।

పెట్టుబడిదారు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోకుండా, ప్రపంచవనరులూ జనాభాతో వాటి సంబంధాలను తెలుసుకోకుండా, ప్రజాస్వామ్యకీలకాలు తెలుసుకోకుండా, "ధరలు పెరిగిపోతున్నాయి అయినా రాజుగారు (భారతావనిలో నేటికీ భగవంతుని స్వరూపం) ఏమీ చేయట్లే"దని వాపోతే ప్రయోజనం ఏమిటి?

మీరు వచ్చేసారి బండిలో తైలం పోయించుకునేముందు ఒకా సారి ఒక చమరుబావికి వెళ్ళి అక్కడినుండి ఆ చమరుబొట్టు మీ బండి వఱకూ రావడానికి త్రొక్కే పుంతలు ఏమిటో తెలుసుకోండి। ఆ చెమరు బొట్టుకై మీరు ఇచ్చే కాసులు ఎందుకూ సరిపోవు అని మీకు అనిపించవచ్చుఁ। దానిని భూగర్భంలోనుండి లాగేహక్కు మనకు వుందా అనే ప్రశ్నాపుట్టువచ్చుఁ।

లేదా గ్రుడ్డిగా రాజుగారు సర్వశక్తిమంతదైవస్వరూపం అనుకోండి।

well wtf. ఇలాంటి వ్యాఖ్యలు వ్రాయకూడదనుకున్నాను కానీ। ఏదో గుల॥