ఈ పైరసీ గురించి చర్చ వచ్చినప్పుడల్లా నేను ఏవైపుండాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే, నాకు హాలీవుడ్ మరియూ ప్రపంచ సినిమాలు చూడాలంటే పైరసీనే గతి. భారతదేశంలో కూడా ధియేటర్లో ఆడని “గొప్ప సినిమాలు” చూడాలంటే పైరసీనే ఇప్పటికీ గతి. ఒరిజినల్ కొనాలంటే జేబు పర్మిట్ అస్సలు చెయ్యదు. సాధారణంగా తెలుగు సినిమాల్ను థియేటర్లో చూసే నేను చాలా సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ బయట ఉండటం వలన మళ్ళీ పైరసీ వలనే చూసే అవకాశం లభించింది. ఇప్పుడు కొన్ని సెలెక్టివ్ సినిమాలు థియేటర్లో చూడటమే తప్ప, తెలుగు సినిమాలు చూసే ఖర్మను తప్పించుకు తిరుగుతుంటాను. నాకు బెంగాలీ, తమిళ్, మళయాళం, మరాఠీ, కన్నడ వంటి ఇతర ప్రాంతీయభాషాచిత్రాలు చూసే అలవాటు, అవి ఎలాగూ మనకు థియేటర్లో దొరకవు కాబట్టి పైరసీ తప్పలేదు.
పైరసీ చట్టవ్యతిరేకమే. శిక్షార్హమే. కానీ వేరే దారీ!? నాకైతే ఏమీ కనిపించలేదు. అందుకే కొంత గిల్టీగా ఫీలైనా ఐ లవ్ పైరసీ...
"కొంత గిల్టీ" అని ఎందుకంటున్నానంటే, భారతదేశంలోని పైరసీ చట్టం Copyright Act,1994 కి అనుబంధంగా వచ్చింది. ఇందులో క్లియర్గా;
Infringement of cinematograph films – section 51 read with section 14(d) of the Act
Copyright protection in films extends to
- making a copy of the film;
-taking a photograph of any image forming a apart of the film;
-selling, giving in hire or offering for sale or hire any copy of the film, irrespective of its
earlier sale or hire; and
-communicating the film to the public.
అని ఉందే తప్ప పైరేటడ్ కాపీలు కొనడం (buying) లేదా, కలిగి ఉండటాన్ని (processing) నేరంగా పరిగణించలేదు. పైగా ఇదే చట్టంలో "free use" అనే మరో తిరకాసు ఉంది. Certain uses of copyrighted works are not considered to infringe upon the rights of the copyright owner and so one does not require permission from the copyright owner. These uses are known as 'Fair Use'. Such uses are exceptions to copyright that allow limited use of
copyright works without the permission of the copyright owner. For example, limited use of works may be possible for research and private study, criticism or review, reporting current events, judicial proceedings, teaching in schools and other educational establishments etc. However ‘Fair Use’ is not a defence incase of infringement of film copyright. అంటూ కొంత వెసులుబాటు కలిపిస్తుంది. నేను చేసేది చాలావరకూ fair use అని నా నమ్మకం :)
ఇక తెలుగు సినిమాల విషయంలో నాకెందుకో ఆ గిల్టీఫీలింగ్ కొంత తక్కువ. ప్రేరణ పేరుతో గ్లోరిఫైడ్ కాపీలు కొడితేగానీ తయారుకాని కథలు,సీన్లు, సంభాషణలు, ఫైట్ల మధ్య పైన చెప్పిన కాపీరైట్ చట్టాల్ని దర్జాగా ఉల్లంఘిస్తున్న సినీపరిశ్రమ పైరసీ గురించి మాట్లాడితే కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఒకసారి సినీ పరిశ్రమ పెద్దల ఇళ్ళలో తొంగిచూస్తే. ప్రతి ఇంట్లోంచీ కనీసం వెయ్యి హాలీవుడ్ పైరస్ DVD లు బయటికి తియ్యచ్చు. ఇలా "ఎదుటి మనిషికీ చెప్పేటందుకె నీతులు ఉన్నాయి" అనుకునే ముందు పరిశ్రమ తమ గురివింద ఛందాన్ని కొంత తెలుసుకుని సంస్కరించుకున్న తరువాత ప్రేక్షకుల్ని అంటే బాగుంటుంది. అనిపిస్తుంది.
పైరసీ అనేది ఒక parallel industry. పరిశ్రమ తమ జాగ్రతల్లో ఉండనంతవరకూ ఇది కొనసాగుతుంది. ఇక్కడ ప్రేక్షకులమీద పడి ఏడిస్తే లాభం ఉండకపోవచ్చు. ఒక వార్త ప్రకారం దావూద్ ఇబ్రహీం వ్యాపారాల్లో ఈ మధ్యకాలంలో పెద్దస్థాయిలో డబ్బులు సంపాదించిపెడుతున్న వ్యాపారం “పైరసీ”. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల పైరసీ చేసే తను సంవత్సరానికి దాదాపు 400 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడట. మొత్తానికి ఇది బిలియన్ డాలర్ల వ్యాపారమనైతే తేలింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఈ డబ్బుతను టెర్రరిస్టు కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడని ఒక సంస్థ రిపోర్టు. ఇక్కడ గిల్టీ విషయం ఏమిటంటే, పైరసీ సీడీ కొన్న ప్రతి ప్రేక్షకుడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించినట్టన్నమాట….ఇప్పుడేం చెయ్యాల్రో దేవుడా! ఐ లవ్ పైరసీ !!
****
12 comments:
భలే,ఏముంది పైరసీ సీడీ లు ఎలాగూ కొంటున్నాము కాబట్టి కొంటున్న వారందర్నీ టెర్రరిస్ట్ చట్టం కింద బొక్కలో తోసేస్తే సరిపోద్దేమో కదా.అప్పుడు దేశమే టెర్రరిస్ట్ దేశం అయిపొతుందేమో?
Agree with you.
Mahesh,
Your free use concept is like, "I will not rob the bank, but I will use the money that robber brought".
But otherwise, I agree with you 100% on Tollywood people talking about Piracy, I guess Puri comes first.
@శరత్ సాహితి: "fair use" అనేది నా concept కాదు. అది చట్టంలో ఉన్న మినహాయింపు.కాబట్టి మీ ఉదాహరణ అంత అర్థవంతంగా లేదు.
ప్రాంతీయ బాషా చిత్రాలకి దావూద్ గొడవ లేదు.
ఇక హిందీకి అంటారా, అతడి సామ్రాజ్యం ఎక్కువగా పాక్, అఫ్ఘన్ కాబట్టి పర్లేదు అనుకోవచ్చు, లేదు అంటే, నెట్ వున్నదిగా, దాని నుంచి కానివ్వండి.
ఐ టూ లవ్ పైరసీ. ఆంధ్ర ప్రదేఆ కి బయట ఉన్నప్పుడు పైరసీ లేకపోతే తెలుగు సినిమాలెలా వస్తాయి చూడడానికి. గొప్ప గొప్ప హాలీవుడ్ సినిమాలెలా చూస్తాం. ఏదొ పైరసీ ధర్మమా అని మాకు కాస్త entertainment, మరి కాస్త విజ్ఞానం దక్కుతొంది. అదీ వద్దంటే ఎలా?
కాకపొతే ఇప్పుడు ఈ టెర్రరిజం, దావూద్ గురించి వింటూ ఉంటే కాస్త అశాంతిగానే ఉంది కానీ ఏం చెయ్యగలం, నాకు మరో మార్గమేమీ తోచట్లేదు :(
ఐ టూ లవ్ పైరసీ. ఆంధ్ర ప్రదేఆ కి బయట ఉన్నప్పుడు పైరసీ లేకపోతే తెలుగు సినిమాలెలా వస్తాయి చూడడానికి. గొప్ప గొప్ప హాలీవుడ్ సినిమాలెలా చూస్తాం. ఏదొ పైరసీ ధర్మమా అని మాకు కాస్త entitrenment, మరి కాస్త విజ్ఞానం దక్కుతొంది. అదీ వద్దంటే ఎలా?
కాకపొతే ఇప్పుడు ఈ టెర్రరిజం, దావూద్ గురించి వింటూ ఉంటే కాస్త అశాంతిగానే ఉంది కానీ ఏం చెయ్యగలం, నాకు మరో మార్గమేమీ తోచట్లేదు :(
నేను పైరసీ సీడీలు చూడను. అంటే...సినిమా వాళ్ళ బతుకులు బాగు చేద్దామని కాదు. ఆ క్వాలిటీ నాకు నచ్చదు. చూడాలనుకున్న సినిమాలే సెలక్టివ్ కాబట్టి ఎంచక్కా మల్టీ ప్లెక్స్ కెళ్ళి మరీ చూస్తా! అప్పుడప్పుడూ తెలీక చెత్త సినిమాల బారిన పడి "అయయో చేతిలో డబ్బులు పోయెనే"పాడుకుంటూ బయటికొస్తాను కూడా!
భారత దేశంలో ఆడని గొప్ప సినిమాలు జేబు పర్మిట్ చేసినపుడే చూస్తాను.
కానీ, పైరసీ విషయంలో సినిమా వాళ్ళ నీతులు.."సీడీలు రాకుండా మేము ఆపలేం! మీరు మాత్రం చూస్తే మీ అమ్మ చచ్చినంత ఒట్టు" లాంటివి మాత్రం ఒప్పుకోను.
AVSగారి బ్లాగులో చాలా మంది భలే వాదనలు చేశారు ప్రేక్షకుల వైపునుంచి!
సౌమ్య,దావూద్ సగంతి ప్రమేయానికి కూడా ప్రేక్షకుల బాధ్యత ఏముంది? సీడీలు రాకుండా అడ్డుకోవలసింది నిర్మాతలే! అరుంధతి సినిమా విడుదలైన ఏడాది దాకా ఎక్కడా ఒక్క పైరసీ సీడి కూడా రాలేదు తెలుసా!అంటే దానికి నిర్మాత ఏ స్థాయిలో ఖర్చుపెట్టాడో తెలీదనుకోండి.:-))
పైరసీ గురించి చాలా బాగా చెప్పారండి. నేను మీతో ఏకీభవిస్తున్నాను. నేను కలలో కూడా వూహించని చాలా గొప్ప english సనిమాలు ఈ పైరసీ ద్వారానే చూసాను. వాటి అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కాని మనలో కూడా మార్పు రావాలనేది నా ఉద్దేశ్యం. దొరకని సినిమాలు చూడచ్చు కానీ మెన్నీమద్య మెగధీర సినిమా తెగ నచ్చేసి, నెట్‌లో downlaod చేయడం కొంత తప్పుగా అనిపించి, నేరుగా సినిమా కొందామని, shopలోకి వెలితే వాడు నాకు పైరసీ dvd ఇచ్చాడు. పైగా మా వూర్లో అదే పెద్ద షాపు. వాడు చేసేది illegal కాని చట్టం ఏం చేస్తుందో నాకు అర్ధం కావడం లేదు. కాని మగధీర original ధర తట్టుకోలేక పైరసీయే తెచ్చుకున్నాను. మా ఊరే కాదు, చాలా వూళ్ళల్లో ఓరిజినల్ అనే పదమే కనపడటంలేదు.అడగకుండానే పైరసీ ఇచ్చటంత స్ధాయిలో ఈ సమాజం వుంటే, అధికారులు లంచాలకి, అలవాటుపడితే, i love piracy అనే స్గాయిలో మీలాంటి వారు అంటుంటే, ఆర్దికవ్యవస్ధ కుంటుపడిపోతుంది. నిర్మాతలు సనిమాలు తీయడానికి భయపడతారు. దీనివల్ల ఉపాధి పొందిన ఎంతోమంది వీధినపడతారు. పైరసీ వుండాలి కాని లిమిట్‌లో వుండాలని నా ఉద్దేశ్యం.
హ్మ్.... కంఫ్యూజ్‌డ్ :(
నా వరకు నేను చూసె సినిమాలు తక్కువ! మంచి హాలివుడ్ సినిమాలు చూడాలంటే పైరేటెడ్ సీడిలే గతి, అవి కూడా క్వాలిటీ బాగుంటేనే కొంటాను. ఇప్పుడు మీరు నాకు అపరాధ భావం కలిగించడం ఏమి బాగా లేదు సుమా! ఇప్పుడు ఏమి చెయ్యాలి చెప్మా?
Chaala baaga rasaru mahesh garu. Konni sarlu manaki ee karma tappadu....
mahesh garu personal ga nenaithE mana recent release movies daadaapuga pirated choostunna(anTe mana so called big ,successful, commercial directors).
Meeru cheppindi akshara satyam mana vaLLu piracy ni addukOndi antunte naakaithE deyyalu neethulu cheppinattu untundi.
Post a Comment