మొన్న జరిగిన World Classical Tamil Conference కోసం ఎ.ఆర్. రెహమాన్ కూర్చిన తమిళ జాతీయ గీతం వీడియో ఇది. ఇది చూసి మనం నేర్చుకోవలసింది ఏమీ లేకపోయినా, కాసేపు సిగ్గుపడదామని పెడుతున్నాను. చూడండి.
****
I am a fish separate from CROWD. Still trapped in my own. But,Its just BIGGER and BETTER. That's all.
మొన్న జరిగిన World Classical Tamil Conference కోసం ఎ.ఆర్. రెహమాన్ కూర్చిన తమిళ జాతీయ గీతం వీడియో ఇది. ఇది చూసి మనం నేర్చుకోవలసింది ఏమీ లేకపోయినా, కాసేపు సిగ్గుపడదామని పెడుతున్నాను. చూడండి.
15 comments:
Dear Mahesh,
సిగ్గుపడలెదు. అంత అర్హత తెలుగువాడిగా లేదు. కానీ, తమిళులు వాళ్ళ అమ్మని ప్రేమించే తీరుకి మాత్రం పులకించిపోయాను...
I owe u a lot for ur posting...
naresh nunna
మన తెలుగు వాళ్ళకు కూడా భాషాభిమానం ఉంది కాని మనకు కరుణానిధి లాంటి నాయుకుడు లేడు.......
ఇది నా యొక్క అభిప్రాయం....
అలా అని బాషాభిమానం మరి ఎక్కువ(మితి మిరిన) ఉండకూడదు..
baavumdi. caalaa baagaa teesaaru.
Thanks for keeping the video. I really enjoyed it.
Thanks for keeping a nice video.
I thoroughly enjoyed the very well taken / composed song.
-Brahmanandam
ఎవరి తల్లి వారికిష్టం.ఎవరి మాతృభాష వారికి గొప్ప.సంస్కృతాన్ని కాదని LONG LIVE CLASSICAL DIVINE TAMIL అని తమిళులు వారి భాషాభివృధ్ధి కోసం శ్రమిస్తున్నారు.తమిళుల భాషాభిమానానికి వాళ్ళను మెచ్చుకోవాలి.తమిళనాట ముస్లిములు కూడా మసీదుల్లో ఉర్దూ అరబీ భాషలకు బదులు తమిళంలోనే మతవ్యవహారాలు నడుపుకొంటున్నారు.మనం కూడా తెలుగును మన తల్లి భాషగా దేవభాషగా LONG LIVE CLASSICAL DIVINE TELUGU అంటూ గౌరవిద్దాం.మత వ్యవహారాల్లో క్రైస్తవులు ఎలా తెలుగును వాడుతున్నారో అలా మిగతా మతాలు కూడా తెలుగును విస్తారంగా వాడాలి.భాషకు వాడుకే ప్రాణం.వాడని భాష పాడుపడుతుంది.తెలుగుతల్లికి 74 మిలియన్ల బిడ్డలున్నారు.ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళపాటు శ్రమపడ్డ హీబ్రూ ను మించిన పుష్టి తెలుగుతల్లికి ఉంది.సకల విజ్ఞానశాస్త్రాలనూ మనభాషలోకి అనువదించుకొని మన భాషలోనే చదువుకొనే అవకాశాలు కలగాలి.తెలుగులో చదివినా ఉపాధి దొరకాలి.
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ ప్రాచీన తమిళ మహానాడు ఆమోదించిన తీర్మానాలపై ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్ననిర్ణయాలు ఇవి :
*తమిళానికి కేంద్రంలో అధికార భాషా హోదా కల్పించాలి.ఈ అంశంపై పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించి దానిపై చర్చించాలి.
*మద్రాసు హైకోర్టులో తమిళంలో వాదనలకు అనుమతించాలి.దీనిపై ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్ర ప్రభుత్వానికి 2006లోనే లేఖ రాశారు.
*తమిళ భాషాభివృద్ధికి పరిశోధనలకు అవసరమైన రాయితీ నిధులను కేంద్రం ఇవ్వాలి.రాష్ట్రం లో శాసన అధ్యయనా కేంద్రం నెలకొల్పాలి.
*తమిళంలో చదువుకున్న అభ్యర్ధులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, ప్రాధాన్యత ఇవ్వాలి.
*పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో తమిళ ప్రాచీన భాషా శీర్షికను చేర్చాలి.
*తమిళ భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి.
*తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.
మన రాష్ట్రం కూడా తెలుగు భాష గురించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను.తమిళులు ఎలా చేస్తే మనమూ అలా చేద్దాం
ఆ గీతం ప్రారంభమే అద్భుతంగా ఉంది. ఎంతో శ్రావ్యంగా, నిజంగా కరిగించేలా ఉంది.అద్భుతంగా చిత్రీకరించారు. కళ పట్ల, సంస్కృతి పట్ల అంతటి ప్రేమ మనకెప్పుడొస్తుందో!
జయంత్ గారు అన్నట్లు మనకి భాషాభిమానం ఉంది, కానీ ఆ విషయంలో కరుణానిధి లాంటి నాయకుడే లేడు.
అధ్బుతంగా ఉంది వీడియో...వీడియో చూస్తున్నంతసేపూ మనం ఇలా చేసుకోలేకపోతున్నామే అన్న భాద, వాళ్ళు చేసేసుకుంటున్నారే అన్న కుళ్ళు చాలా కలిగింది నాకు..కానీ వాళ్ళకి భాషంటే అభిమానం దాటి పైత్యం వచ్చే స్థాయికి ఎదిగిందని నా అభిప్రాయం..లేకపోతే కరుణానిధి ప్రపంచ భాషలన్నింటికీ తమిళే మూలం అన్న బుర్రలేని స్టేట్ మెంట్ ఎందుకిస్తాడు....
మీకు తమిళ జాతీయవాదం పెద్దగ తెలిసినట్టు లేదు. ఈ దళితవాదం, బ్రహ్మణవ్యతిరేక వాదం అన్నీ దాన్లోనే దొరుకుతాయి.
తమిళ నాడు,శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, ... అన్ని తమిళ ప్రదేశాలని కలిపి ప్రత్యేక దేశం చేయ్యాలని ఆశయాల్లో ఒకటి, కానీ కరుణ దానికన్నా తన కుటుంబమేప్పుడూ అధికారంలో వుండాలి అని అవి అన్నీ వదిలేశాడు, అందుకే కొన్నాళ్ళు వారిని మోశాడు
శేఖర్ గారు ప్రపంచ బాషలన్నిటికీ తమిళమే మూలం అన్నది కొట్టేయ్యలేని వాదన, అది తప్పు అని ఇప్పటి వరకు ఎవరూ గట్టి సాక్ష్యాలు చూపించలేకపొయారు, అసలు మనిషి ఆవిర్భావం కడప - కోయంబత్తూర్ మధ్య జరిగింది అనే వాదన ఈ మధ్యే కొత్తగా ఊపందుకుంటున్నది, మనకి తెలిసిన మద్రాసు, దాదాపు 40 వేల సంవత్సరాల క్రితమే ఒక గ్రామం అని కొత్తగా తెలిసినది
న్ని తమిళ ప్రదేశాలని కలిపి ప్రత్యేక దేశం చేయ్యాలని LTTE ఆశయాల్లో ఒకటి, కానీ కరుణ దానికన్నా తన కుటుంబమేప్పుడూ అధికారంలో వుండాలి అని అవి అన్నీ వదిలేశాడు, అందుకే కొన్నాళ్ళు LTTE ,వారిని మోశాడు
excellent ,India with out "tamil nadu" is like man without eyes!!!
గీతం బాగుందండీ. భాషాభిమానం మనకు లేకకాదు సమస్యల్లా మొదటి అడుగువేయడమే. నడిపించే నాయకుడు కావాలి కాని ఆరంభశురత్వం కాకూడదు. ఆ మంచి రోజు రావాలి.
పక్కింటి కూర బాగానే వుంది కాని, అందులో మన దినుసు(సుశీల) కూడా వుంది.... గుడ్డిలో మెల్ల
@ తార: ప్రపంచ భాషలన్నింటికి తమిళం మూలం అనేది అర్ధం లేని వాదన అని, సింధు నాగరికతలో వాడిన భాషే ఉప ఖండపు భాషలన్నింటికి మూలం అని అనుకుంటున్నాను...
నాకున్న మిడి మిడి జ్ఞానంతో తప్పు మాట్లాడితే, సహేతుకంగా వివరించమని ప్రార్ధన...
@సావిరహే: మీరు వెటకారంగా అంటున్నారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను...
“Tamil is much older than Sanskrit.Tamil is as old as 2600-1700 BCE Even the Rig Veda found in the Indus Valley about 1,000 BCE had some Dravidian words”.--- Asko Parpola, Professor Emeritus of Indology, Institute of World Cultures, Helsinki, Finland.
“The language of Indus Valley was Tamil” --- Dr. Ambedkar
ఇక నుంచి తమిళనాడులోని అన్ని డిగ్రీ కళాశాలల్లో కూడా ద్వితీయభాషగా తమిళమే వుండబోతోందని ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి పేర్కొన్నారు.వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచే తమిళ సాహిత్యం, పద్య,గద్య, వ్యాకరణం తదితరాలన్నీ వుంటాయన్నారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో తమిళ వ్యాకరణ చరిత్ర, ప్రాచీన తమిళంలు సబ్జెక్టులుగా వుంటాయన్నారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్, ఎయిడెడ్ కళాశాలలు, స్వయంప్రతిపత్తి కళాశాలలకు కూడా ఈ విధానాలే వర్తిస్తాయని పొన్ముడి ప్రకటించారు.మనం కూడా ఇలాంటి ప్రకటన ఆశించవచ్చా?
Post a Comment