Thursday, October 21, 2010

టాయ్ లెట్ కెళ్దాం రా!

గ్రామీణ ప్రాంతాలలో లెట్రిన్ అనే విధానమే కొత్త. అంగీకారం, నిర్మాణం, ఉపయోగం, జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవడం వంటి చాలా క్లిష్టమైన మార్పుల దిశగా ఈ విధానాన్ని పరిచయం చెయ్యాలి. అంతేకాక ప్రజారోగ్యానికీ, శానిటేషన్ కీ గల సంబంధం వలన అత్యంత ఘోరంగా నష్టపోతున్న వీరికి ఆ సంబంధాన్ని తెలియజెప్పి ఈ personal behaviour ని మార్చడం ఒక పెద్ద ఛాలెంజ్.

అంతేకాక నీటికటకటతో తమతమవుతున్న పల్లెల్లో ఫ్లష్ పెడితే అది సమస్యాత్మకం అవుతుంది. అందుకే పోర్ ఫ్లష్ ద్వారా కేవలం నాలుగు లీటర్ల నీటితో పనయ్యే విధానం పరిచయం చెయ్యబడింది. 45 డిగ్రీ టాయ్ లెట్ ప్యాన్ ద్వారా ప్రవాహవేగం పెరిగి త్వరగా శుద్ది అయ్యే మార్గం లభించింది.

పట్టణాలలో ఈ సమస్య యొక్క రూపం వేరు. ఇక్కడ అది మానసికత సమస్యగా కాక ఒక పరిపాలనా సమస్యగా పరిచయమౌతుంది. ఇల్లీగల్ నివాసం, భూమి, నీటి సరఫరా వంటి విషయాల నేపధ్యంలో(మురికి వాడల్లో) స్లమ్ శానిటేషన్ ఎప్పుడూ ఒక రాజకీయ సమస్యే.

సాంకేతిక పరంగా పెద్ద పట్టణాల్లో ఫ్లష్ టాయిలెట్లు ఉపయోగించక తప్పదు. ఎందుకంటే ఆ మాత్రం నీళ్ళు వాడకుంటే మొత్తం సూయరేజ్ లైన్లు చోక్ అయ్యి మలం ట్రీట్మెంట్ ప్లాంట్ వరకూ చేరక అదొక ప్రజారోగ్య సమస్యగా పరిణమిస్తుంది. చిన్నపట్టణాల్లో సెప్టిక్ ట్యాంక్ టెక్నాలజీ ఉపయోగించబడుతున్నా అది కాలాంతరంలో ప్రమాదకారిగానే అవుతుంది. అది నిండిపోయిన తరువాత ఎలా క్లీన్ చేస్తారు నుంచీ దాని rehabilitation వరకూ ఈ టెక్నాలజీవలన అన్నీ సమస్యలే. అందుకే సంపూర్ణ పారిశుధ్య ఉద్యమం మొకటి భారతదేశంలో మొదలయ్యింది.

ఈ విషయంలో ప్రాంతాలవారీగా డైవర్సిటీ ఆఫ్ అప్రోచ్ ఉంది. భారతదేశంలో ఈ కార్యక్రమం పశ్చిమ బెంగాల్ లో ఒక రకంగా జరుగుతుంటే బీహార్ లో మరో రకంగా అమలు చెయ్యబడుతోంది. తమిళనాడు మా విధానం వేరంటోంటే మహరాష్ట్ర కమ్యూనిటీ లెడ్ శానిటేషన్ అని కొత్త పంధాలో నడుపుతున్నారు. గుజరాత్ రాజస్థాన్ లు నీటి అవసరం లేని డ్రై టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంటే కేరళ మా అవసరాలకు ఎకోశానిటేషన్ బెస్ట్ అంటున్నాయి. అంధ్రప్రదేశ్ మా ఇంజనీర్లు కట్టించిందే టాయ్ లెట్ అంటుంటే మీ ఇష్టమొచ్చిన మోడల్ ఎంచుకోండని కర్ణాటక చెబుతోంది.

సంపూర్ణ పారిశుధ్య ఉద్యమంలోని అందమే భిన్నత్వం,వైవిధ్యం. ప్రభుత్వ విధానాలు కాకుండా ప్రజల మనోభావాలే కేంద్రంగా అమలయ్యే కార్యక్రమం. అందుకే ఈ కార్యక్రమంలో గైడ్ లైన్స్ ఉన్నాయేగానీ ఖచ్చితమైన రూల్స్ లేవు. ఇదొక పారిశుద్ధ ఉద్యమం. నిర్మల్ గ్రామ్ పురస్కార్ లాంటి సామూహిక బహుమతుల్ని రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రామ సర్పంచులు అందుకునే విన్నూత్నమైన కార్యక్రమం. ఇది టాయ్ లెట్ నిర్మాణానికి పరిమితం కాకుండా పరిసరాల పరిశుభ్రతకు, సమగ్ర గ్రామీణ శుభ్రతకూ ఆలవాలమౌతున్న కార్యక్రమం.

దీని గురించి పట్టణాల్లో ఉండేవాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ ఇదొక ఉద్యమం. సామాజిక విప్లవం. 2012 కాకపోయ్యినా 2015 లోపు మన దేశం బాహ్యమలరహిత, శుభ్రమైన దేశంగా మారుతుంది. అది ఒక గౌరవప్రదమైన ముందడుగు. కోట్లాది ప్రజలు ముఖ్యంగా మహిళలు సిగ్గుపడకుండా కాలకృత్యాలు తీర్చుకునే అందమైన శుభోదయాలకు తొలిపిలుపు.
****

8 comments:

Alapati Ramesh Babu said...

టాయ్ లెట్ అనె మాట చిన్నది కాని ఆది కలిపించె ఇబ్బందులు గ్రామీణవాతావరణం లొ పెరిగిన వారికి మాత్రమె ఆవగాహన వుంటున్నది.15 రొజుల క్రితం బెంగళూర్ వెళ్ళుతూ నంద్యాల దాటిన తరువాత ఒక గ్రామం లొ కొందరు మహిళలు ఒక కొండ చాలు లొ ఇబ్బంది పడుతు తమ దైహిక కార్యక్రమం ముగించు కునెందు కు పడ్డ ఆవస్థ భగవాన్ చెప్పరానిది .ఆలాగె గత శుక్రవారం తుని రైలు స్టేషన్ నుంచి నరసిపట్నం వెళ్ళుటకు 2వ మార్గం ద్వార వస్తుంటె ఒక గ్రామిణ మహిళ టాయ్ లెట్ లెక అనెక మంది ఆ దారి లొ వస్తున్నా నొప్పి భరించలెక నుంచొని మూత్రం పొస్తున్న ద్రుస్యాలు చాల కలవరం కలిగిస్తాయి . ఇలా టివన్ని లెని రొజులు ఇంకా త్వరగా కొరుకుంట్టున్నాను.

Surya Mahavrata said...

అతి ముఖ్యమైన సామాజిక సమస్యని స్పృశించారు. ఆఖరి పేరాలో పేర్కొన్న విధంగా భారత్ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను.

Anonymous said...

హ్మ్మ్.. విషయం ఉన్న టపా కానీ టైటిలే మరీ పేరడీ టైటిలు లా ఉంది. :(

ఇది వరకు TV9 లాంటి ఛానల్లలో బహిర్భూమికి వెల్లడం మీద యాడ్స్ కూడా వచ్చేవి. అందరూ మరుగుదొడ్లు మాత్రమే ఉపయోగించండంటూ. కనీసము 2012 కో 2015 కో రైల్లలో ప్రయానం చేసేవారు, పొద్దున్నే కిటికీలు తెరవాలంటే భయపడే పరిస్థితులు లేకపోతే చాలు..

ఆ.సౌమ్య said...

very nice....ఈ ఉద్యమానికి మనందరి సహకారం ఉండాలి. మొన్ననే మాగోదావరి బ్లాగులో మలాన్ని చేతులతో ఎత్తేవాళ్ల గురించి ఒక పోస్ట్ వేసారు.

http://maagodavari.blogspot.com/2010/10/blog-post_17.html

ఈ ఉద్యమం గనక విజయవంతమైతే ఆ ప్రజల బాధలు తీర్చినవాళ్లమవుతాం. వాళ్లని తోటిమానవులుగా గుర్తించినవాళ్ళమవుతాం. పరిశుభ్ర భారతదేశానికి నాంది పలుకుదాం.

Praveen Mandangi said...

రమేశ్ గారు చూసిన ఘటనలే నేను కూడా చూశాను. ఆ రోజు గరీబ్ రథ్ లో వెళ్తున్నాను. రాత్రి ట్రైన్ ఖమ్మం స్టేషన్ దాటి వెళ్తోంది. ట్రైన్ నెమ్మదిగా వెళ్తోంది. ఒక మహిళ పట్టాల దగ్గర చెంబు పట్టుకుని నిలబడింది. ట్రైన్ ప్రయాణికులు ఎక్కడ చూస్తారోనని కూరోలేదు. మగవాళ్లైతే సిగ్గు లేకుండా చెరువుల దగ్గర, కాలువ గట్ల మీద, రైలు పట్టాల పక్కన వెళ్లి అశుభ్రం చేసేస్తారు.

కెక్యూబ్ వర్మ said...

నిజంగా అవసరమైన, బాధ్యతాయుతమైన సమస్యను టచ్ చేసారు. గ్రామీణ ప్రాంతంలో వున్న మాకు ఇది నిత్యం ఎదురయ్యే సమస్యే. ముఖ్యంగా స్త్రీలు పడే బాధ వర్ణణాతీతం. చంద్రబాబు పాలనా కాలంలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వపరంగా సబ్సిడీ ఇచ్చి ISL programme పేర చేపట్టారు. కానీ వాటి వాడుకకు మీరన్న నీటి సమస్య, అవగాహనా లోపంతో వాటిని బాత్రూంలుగా కట్టుకున్నారు. అలాగే నిధులకైంకర్యం కామన్ గా జరిగింది. మరల ఇప్పుడు కడుతున్న ఇందిరమ్మ ఇళ్ళకు తప్పనిసరిగా కట్టమని చెప్తున్నారు. ఇలా పదే పదే చెప్పడం వలన కొంత మార్పు వచ్చింది. అయినా నీటి సమస్య వున్న చోట వ్యక్తిగత మరుగుదొడ్ల కంటే సామూహిక మరుగుదొడ్లను నిర్మించి టెక్నాలజీని ఉపయోగిస్తే బాగుంటుంది. అనేక అంటురోగాలు మాయమవుతాయి. అలాగే పల్లెల్లో ఈ సమస్యవలన స్త్రీలకే కాదు పురుషులు కూడా మూలవ్యాధి, పిస్టులా వంటి వ్యాధులకు గురవుతున్నారు.

సమస్యను ముందుకు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు..

..nagarjuna.. said...

good move....

Anonymous said...

మనమేదైనా చెయ్యటానికి ఉందా???