దర్శకత్వ శాఖలో కోకొల్లలుగా తెలుగు జనాలున్నారు. ప్రతి సినిమాకూ ఆరు మందికి తగ్గకుండా సహాయదర్శకులుగా పనిచేస్తుంటారు. అయినా అవకాశాలు, ముఖ్యంగా పెద్ద అవకాశాల దగ్గరికొచ్చేసరికీ తమిళంవాళ్ళే కావలసొస్తుంది. తమిళులకు దర్శకత్వ అవకాశం ఇవ్వడం వరకూ బాగానే ఉంది, కానీ వాళ్ళ కంఫర్ట్ కోసం ముఖ్యపాత్రల్నో లేదా సహాయపాత్రల్నో తమిళ నటులతో, సాంకేతిక వర్గాన్నంతా తమిళ సాంకేతిక నిపుణులతో నింపడం ఎందుకో ఒక అర్థంకాని పరిణామంగానే మిగిలిపోతోంది. ‘డార్లింగ్’లో ప్రభాస్ ఫాదర్‌గా ప్రభు చేసిన క్యారెక్టర్ మన తెలుగులో ఎవరూ చేయలేరా? అలాగే, ఈనెల 26న విడుదల కానున్న ‘ఆరెంజ్’లోనూ ప్రభు ఓ ముఖ్యపాత్ర పోషించాడు. కారణం ఆ నటుడి అవసరమా లేక దర్శకుడి విజన్ లో ప్రభు తప్ప మరే ఇతర తెలుగు నటుడూ కనిపించకపోవడమా?
ఎమ్.ఎస్.విశ్వనాధన్ నుంచీ ఇళయరాజా వరకూ అటు తమిళం ఇటు తెలుగులో మహత్తరమైన సంగీతం ఇచ్చినా, భాషకు అనుగుణంగానే బాణీలు కూర్చారు. ఆ తరువాత తరంలో తమిళ బాణీల్ని డబ్బింగ్ రూపంలో తప్ప స్ట్రైట్ ఫిల్మ్ గా సంగీతం కూర్చి, తెలుగు సంగీతాన్ని ఇవ్వడంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కూడా ఎదురుదెబ్బే తిన్నారు. అయినా మనోళ్ళు ఈ మధ్య హ్యారిస్ జైరాజ్(ఆరంజ్), జి.వి.ప్రకాష్ (డార్లింగ్) అంటూ మళ్ళీమళ్ళీ బొక్కబోర్లా పడటానికి తయారైపోతున్నారు. ఇది మోజుకాక మరేమిటి? నిజంగా హైదరబాద్ లో మ్యూజిక్ డైరెక్టర్లు లేరా? చక్రిలాంటి వాళ్ళు వచ్చిన పదేళ్ళలో దాదాపు వంద సినిమాలకు సంగీతం అందించలేదూ! మన దగ్గర ప్రతిభకు కొదవలేదు, కానీ గుర్తించేవాళ్ళే కరువు.
మనోళ్ళ తమిళ పైత్యానికి పరాకాష్ట ఏమిటంటే, తమిళ్ సినిమాలపైన ఈ మధ్య సెటైర్ గా వచ్చిన, “తమిళ్ పడం” అనే సినిమాని మనోళ్ళు రీమేక్ రైట్స్ తీసుకోవడం. తమిళ సినిమాల మీద తీసిన వ్యంగ్యాస్త్రాన్ని తెలుగులో హక్కులు తీసుకోవడం ఒక హాస్యాస్పదమైన ప్రక్రియ అయితే, దాన్ని రీమేక్ ఎలా, ఎందుకు చేస్తారనేది పెద్ద జోకు. ఏం… తెలుగు సినిమాల మీద సెటైర్ మనం సొంతంగా రాసుకోలేమా? దాన్నీ తమిళం నుంచీ దించుకోవాలా? హతవిధీ!
***
9 comments:
ఆరెంజ్ మ్యూసికల్ గా మంచి హిట్టు. సినిమా గురించి ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం కష్టం. అందరు సంగీత దర్శకులు కాపీలు కొట్టడం నిజమే అయినా, కొంతమందికి కాపీ కొట్టడం కూడా సరిగారాదు. అలాంటప్పుడు కాపీ కొట్టడం బాగా వచ్చినవాడు తమిలంలో ఉన్నా తెచ్చుకోవడంలో తప్పులేదు గదా..!!
మనది కానిదేదైనా మధురమే మనవాళ్ళకి
ఈ విషయం లో పెద్ద నటులలో ఒక్క కోట శ్రీనివాస రావు తప్పించి మిగతా వారు నోరు మెదపరు. మొన్న తనికెళ్ళ భరణి సన్మాన సభలో కూడా ఆయాన అందరి దర్శకుల ముందర తన ఆవేదనని వ్యక్తం చేశారు. ఎంత సేపటికి ఆయన ఒక్కరే మొత్తుకోవాలి తప్పా మిగతావారు గమ్ముగా ఉంటారు. నేను అనుకోవటం నటులలో కొంతమంది బాగా సంపాదించి రిలాక్స్ అయ్యారు, వారికి కొత్త కొత్త పాత్రలు వేయాలి, నటించాలన్న తపన కోటా గారి కి ఉన్నట్టు లేదు. ఈ విషయం లో కోటాగారిని అభినందించాలి. అతను ఇంకొక రెండు సార్లు ఇదే విషయం పై మాట్లాడితే మన వారు తెలుగు నటులకు ప్రోత్సహించటం సంగతి దేవుడెరుగు కోటా గారి పర భాషా నటులంటె కుళ్ళు అని ప్రచారం మొదలు పెట్టినా ఆశ్చర్య పోనక్కరలేదు.
పచ్చిగా చెబుతున్నాని అనుకోకండి మనోళ్ళకి బయటవాడి-- మహా రుచి మరి
సొంతింటి వైద్యం పనికిరాదన్న సామెత బాగా వంటబట్టించుకున్నారు మనవాళ్ళు. చక్రి, దేవిశ్రీ లాంటి వారిని పక్కనబెడుతున్నారు. సంగీతంలో కూడా మన వాళ్ళు కాపీ బాణీలే ఎక్కువ చేస్తున్నారు. క్రియేటివిటీ మన దర్శకులలో వుందంటారా? ఇంగ్లీషు సినిమాల కాపీ కథలే తీస్తుంటారు. మన నేటివిటీకి తగ్గ సినిమాలు వచ్చి చాలా కాలమైంది. చూసే వాళ్ళ టేస్ట్ కూడా మారడంకూడా కారణం కావచ్చునేమో. కోట్లలో జరిగే వ్యాపారం కాబట్టి రిస్క్ తీసుకోవడం లేదనుకుంటా. అప్పుడప్పుడు క్రిష్ లాంటి వారి ప్రయోగాలుతో మనం వున్నామని గుర్తుచేస్తుంటారు. ప్రేమిస్తే లాంటి సినిమా స్ట్రైట్ గా వస్తే చూసేవారా? ఇలా నాకే చాలా సందేహాలు వచ్చేస్తున్నాయి ఇక్కడ.
మణి శర్మ మెలొడీకి ఇచ్చే ప్రాధాన్యతను ఎవరూ పట్టించుకోవడం లేదని నా బాధ! ఆయన కూర్చిన "యమహా నగరి", అర్జున్ లో మధుర మధుర తర మీనాక్షీ, మురారి లో పాటలూ, చాలా బాగుంటాయి. సీతారామ కల్యాణం పాట ఆధారంగా తను కూచిన పెళ్ళి పాట మురారి లో సూపర్ హిట్!
ఈ పరిస్థితి కి కారణం మన తెలుగు చిత్ర పరిశ్రమ మూలాలన్నీ మద్రాసులో ఉండటమేనా? లేక ఇక్కడి ప్రతిభను వెదికి పట్టుకునే ప్రతిభ లేకపోవడమా? లేక కొత్తదనం అనే పేరుతో వెంపర్లాటా?
Buying the remake rights for a satire on a tamil movies is looking like ..... exam లో ప్రక్క వాడి paper నుంచి copy చేసి వాడి hall ticket number నే వ్రాసి వచ్చినట్టుంది
EE madhya kaalam lo vachchina oka pedda telugu hit, Arundathi...Kaadu kaadu oka Dubbing Hit....
Anushka,
Sayaji Shinde,
Sonu Sood,
Manorama,
Anta vere bhasha vallu. Okka mukhya patraku kuda telugu vallu sariporu...
Long live Telugu ..Sorry Dubbing industry..
Why there is no post for long time
Post a Comment