ఒకసారి ప్రేమించాక
నువ్వేనేననుకున్నాక
తలుచుకోవడం
లేమి ఉనికికి చిహ్నం కాదు
నేనే నువ్వయ్యాక
కలిమి కౌగిలిలో మిగిలాక
నాలో నువు
లేవనుకోవడంలోనూ అర్థం లేదు
అందుకే...
తలుచుకోవడం
మరుపుకు చిహ్నం కాదు
భౌతికంగా నువు లేకున్నా...
నాలోని నీ ఉనికిని అనుభవించేందుకు
ఒక ప్రయత్నం మాత్రమే!
****
13 comments:
bhale undi
చాలా బాగుంది.!
లేమి ఆ? లేని ఆ? రెండిటికీ దాదాపు ఒకే అర్ధం ఉండటం వల్ల ఏది మీరు ప్రయోగించారో అర్ధం కాలేదు...
భౌతికంగా నువ్వు లేకున్నా.. అంటే చనిపోయారనా? అలా కాకపోయి ఉంటే "నువ్వు నా చెంత లేకున్నా" మరింత నప్పుతుంది అనిపిస్తుంది...
అనుమానాలు పక్కన పెట్టేసి, నాకు అర్ధం అయినట్టు చూసుకుంటే బాగుంది...
very nice :)
మహేశా నీ "కత్తికి" రెండు పక్కలా పదునేనోయ్...
ఇబ్బంది లేకుండా అర్ధం అయింది.చాలా బాగా చెప్పారు.
ఆహా ?! అచ్చా ?! హిందీ లోనో బెంగాలీ లో నో రాయాల్సింది ! :D
good show.
చదివాకా ఇంతకన్నా ఏమీ చెప్పాలో తెలియట్లేదు...చాలా బాగుంది.
చాలా బాగుంది. ఎవరికైనా అంకితం ఇవ్వడం గురించి ఆలోచించారా?
మీ కవిత చదివిన తరువాత తొలకరిజల్లులకి తడిసిన నేలనుండి వచ్చిన హాయిని గొలిపే వాసనలాంటి ఫీలింగ్.....
It is quite like how I think of my lover!
Post a Comment