ఫిబ్రవరి 21 నాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘తెలుగు భాషోద్యమ సమాఖ్య’ హైదరాబాద్ ఇందిరాపార్క్ లోని ధర్నాచౌక్ లో ఉదయం 9 నుండీ సాయంత్రం 7 గంటల వరకూ సామూహిక నిరాహారదీక్ష చేపట్టనుంది. ఈ ఉద్యమంలో తెలుగును ప్రేమించే అందరూ పాల్గొనొచ్చు.
ఈ ఉద్యమదీక్ష ద్వారా ప్రభుత్వాన్ని కోరదలచిన విషయాలు ఈ క్రింది మూడు.
1. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కావాలి: తెలుగు రాష్ట్రానికి ఒక భాషా విధానం ఉండాలి. తెలుగు రక్షణ, అభివృద్ధి-భాషావిధాన లక్ష్యాలుగా ఉండాలి. తెలుగు భాషా సాహిత్యాల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి. ఈ శాఖను ప్రాధమిక విద్యాశాఖతో పాటూ ఒకే మంత్రి అధీనంలో ఉంచాలి.
2. మాతృభాషలోనే ప్రాథమిక విద్య: ప్రాధమిక విద్యను మాతృభాషలోనే బోధించడం శాస్త్రీయమైన, హేతుబద్ధమైన పద్దతి. ప్రభుత్వ,ప్రభుత్వేతర పాఠశాలలన్నింటిలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని శ్రద్ధతో అమలు చెయ్యాలి.
3. ప్రజల భాషలోనే పరిపాలించాలి: చట్టసభలు, అన్ని స్థాయిల్లో పరిపాలన, న్యాయస్థానాలు తెలుగులోనే నడవాలి. ఇందుకోసం ప్రత్యేకించి తెలుగు ప్రాధికార సంస్థను అన్ని అధికారాలతో ఏర్పరచాలి.
Thursday, February 19, 2009
తెలుగుకోసం నిరాహారదీక్ష
****
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
ఈ ౩ కోరికలలో చాలా త్వరగా తీరబోయే కోరిక మొదటిది. ఎందుకంటే ఈ ఒక్క దాంట్లో మాత్రమే కొంత మందికి లాభాన్నిచ్చే(ఆర్థికంగా) అంశాలున్నాయి. నా వరకైటే ఈ మొదటి ౨ కోరికలు పెద్దగా ఉపయోగకరం కాదు అనే అన్పిస్తోంది. మూడవది దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
౧.దీని వల్ల కొంత మంచి జరగచ్చేమో కానీ డబ్బు తినే వాళ్ళకు మంచి అవకాశం.
౨.ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలోనే కాదు, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో కూడా తెలుగు ఒక తప్పనిసరి సబ్జెక్ట్ గా ఉండాలి, ప్రతి ఒక్కరూ తెలుగును తప్పని సరిగా చదవాలి. అంతేకానీ... ప్రాథమిక స్థాయి విద్యను తప్పని సరిగా తెలుగు లో మత్రమే బోధించాలి అనేది సరి కాదని నా అభిప్రాయం. ప్రాథమిక స్థాయి దాకా తెలుగు లో చదినిన వాడు ఉన్నత విద్య స్థాయి లో ఆంగ్లం లోకి మారినపుడు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉంటాయి. ఇప్పటి విద్యా ప్రమాణాలను దృష్టి లో ఉంచుకొని ఆలోచించండి.
౩. దీనితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
the first one as already said by pichodu, may be done for the benefit of politicians.
the second one is ridiculous. yes you read it correctly, ridiculous only.
the third one makes the things complicated. because a GO in single language is intrepreted in many ways, if it comes bilingual leads to much confusion. :-)
నాక్కూడా ఒక్క మూడో పాయింటే సబబుగా అనిపిస్తుంది.
పిల్లలు భాషను సులభంగా నేర్చుకునే వయసులో కేవలం తెలుగునే నేర్పటం మంచి ఆలోచన అనిపించట్లేదు. ఆ తరువాత వాళ్ళు ఇంగ్లీషు నేర్చుకోటానికి చాలా పాట్లు పడాలి.
ఇంక మంత్రిత్వ శాఖ అంటారా. బాగా పనిచేస్తే ఉండటం మంచిదే.
మన తెలుగువాళ్ళలో చాలా మందికి తెలుగు సరిగ్గా రాదు. ఈ రోజు నా ఆఫీస్ లో ఒక కంప్యూటర్ అనుకోకుండా రీస్టార్ట్ అయ్యింది. నేను సర్వర్ కి మాత్రమే యు.పి.ఎస్. పెట్టాను. ఏమి జరిగింది అని ఒకతను అడిగాడు. పవర్ ఫ్లక్షుయేషన్ అని ఇంగ్లిష్ లో చెపితే అతనికి అర్థం కాలేదు. కరెంట్ ఒడిదిడుకులు అని తెలుగులో చెప్పాను. అది కూడా అతనికి అర్థం కాలేదు. మనం చదివే చదువులు మనకి ఏ భాషనీ సరిగ్గా నేర్పించలేని స్థితిలో ఉన్నాయి. తెలుగులో ఇంగ్లిష్ పదాలు కలపకుండా మాట్లాడితే సంస్కృతంలో మాట్లాడుతున్నానని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. తెలుగులో సంస్కృత పదాలు తక్కువ. ఎందుకంటే ఇది ద్రవిడ భాష. హిందీ, ఉర్దూ, పంజాబీ లాంటి ఆర్య భాషలలో ఇంతకంటే ఎక్కువ సంస్కృత పదాలు ఉంటాయి. ఈ విషయం తెలియక స్వఛ్ఛమైన తెలుగులో మాట్లాడడాన్ని సంస్కృతంతో పోలుస్తూ వెక్కిరిస్తారు.
మాతృ బాషా దినోత్సవ శుభాకాంక్షలు :: తెలుగువాళ్ళు అందరూ తెలుగులోనే మాట్లాడి మనందరి అమ్మ ని గౌరవిద్దాం.
mee alochana bagane undi kaani practical ga alochinchi chuddam sir koncham kashtanga untundi.manam poti prapanchanni edurkovali ante english tappanisari ala ani mana telugu uniki kolpoye pani cheyakudadu.tegu develop cheyadaniki dani protection kosam oka porfolio avasaramani nenu anukovatledu.mundu mana alochanalo teda ravali manabhasha unikolpokunda chusukone bhadyata manapaine undi.2nd point ki vaste english medium ina telugu okati compulsory paper undali andulo mana culture literature gurinchi undali 3rd pont ite possible.
నాకు మొదటిది, చివరిది సబబుగా అనిపిస్తోంది. రెండోది కూడా మారిస్తే సరిపోతుందేమో.
తెలుగుకి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ ఉంటే, దానికి సంబందించిన విషయాలకు ఎవర్ని సంప్రదించాలో, అది ఎవరి బాధ్యతో, నెరవేర్చకపోతే అది ఎవరి వైఫల్యమో కొంత స్పష్టత వస్తుంది. ఇప్పుడున్న భాషా సంఘానికి ఎటువంటి అధికారాలు లేవు. కాబట్టి వారిని మనం నిలదీయలేం. అదే ఒక మంత్రిత్వ శాఖ ఉంటే, దానికి అధికారాలు ఉంటాయి కాబట్టి బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడున్న మంత్రిత్వ శాఖలు బాధ్యతలు నెరవేరుస్తున్నాయా? వారిని మనం నిలదీస్తున్నామా? అనేది వేరే ప్రశ్న. కనీసం ఒక శాఖ అంటూ ఉంటే దాని పట్ల ప్రభుత్వం ఏదో ఒకటి చెయ్యాలి కదా.
ప్రాథమిక విద్యా స్థాయిలో పిల్లలు ఒకటి కంటే ఎక్కువ భాషలు సులువుగా నేర్చుకోగలరు. ఆ స్థాయి దాటాక ఇంగ్లీషు ప్రవేశపెట్టినా మారటం కష్టం అవ్వచ్చు. కాబట్టి చాదస్తానికి పోకుండా రెండిటిని నేర్పొచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలన్నిటిలో తెలుగుని లాంగ్వేజ్ సబ్జక్ట్ గా తప్పని సరి చేస్తే సరిపోతుంది. కాబట్టి “మాతృభాషలో ప్రాథమిక విద్య” అనేకన్నా, “ప్రాథమిక విద్యలో తప్పనిసరిగ్గ మాతృభాష” అంటే బావుంటుంది. పిల్లలకు మాతృభాష నేర్పే బాధ్యత పూర్తిగా పాఠశాలదే కాదు, ఇంట్లో కూడా భాష పట్ల ఆసక్తి కలిగించే వాతావరణం ఉండాలి.
ఇక మూడవ విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. తెలుగు రాష్ట్రంలో పరిపాలన అన్ని స్థాయిల్లోను తెలుగులోనే నడవాలి.
ఇక్కడ చాలా మంది చాలా వ్యాపారధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రాధమిక స్థాయిలో తెలుగు నిర్భంధ విధ్య చేయాలి అని అనగానే చాలా మందికి..బాధ కలుగుతున్నట్లుంది. కేవలం మీ స్వార్థం కోసం మన ఉనికినే కోల్పోవాలా, ఒక పరాయి వారి మాతృ భాష కోసం..? ఆంగ్లం మనలాగే ఒకదేశపు మాత్రు భాష మాత్రమే..! మరొక దేశపు మాత్రు భాష కోసం తల్లి లాంటి మన మనుగడను అవమాన పరచాలా..? అది లేక పోతే పోటి ప్రపంచం లో గెలవలేమా..? మరి రష్య, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలన్నీ ఎలా మనుగడ సాదిస్తున్నాయి ఆంగ్లం లేకుండానే..? ఒక సారి వాటివైపున దృష్టి సారించండి మీకే తెలుస్తుంది,ఆంగ్లము మాట్లాడే దేశాలు కేవలం మూడే ఇంగ్లాండ్ , అమెరికా, ఆస్ట్రేలియ. మరి ప్రపంచం లో మిగతా దేశాలన్ని వారి వారి విధ్యను వారి భాషలోనే భోదిస్తున్నారు, దురదృష్టవశాత్తు మన సాంకేతిక విధ్యన మన మాతృ భాషలోకి మార్చుకోలేకపోతున్నాము, కేవలం పోటి ప్రపంచం లో వ్యాపారధోరణి వల్ల. ఫ్రాన్స్ , ఇటలీ, జర్మనీ తదితర ఐరోపా దేశాల్లో ఎవరూ కూడ ఆంగ్లం లో సంభాషించుకోరే, అక్కడి ప్రధానులు కాని దేశ అధ్యక్షులు కాని మన దేశం లోకి వచ్చినప్పుడు గమనించారా..? వారెప్పుడు ఆంగ్లం లో మాట్లాడిందిలేదు, రెండు దేశాల అధికారుల మధ్యన ఇక అనువాదకుడు ఉంటారు. వారి ద్వారానే సంప్రదింపులు జరుపుతారు, చైనా వారు కూడ ఆంగ్లం మాట్లాడరు, కాని ప్రపంచాన్ని శాసిస్తున్నారు కదా..? అది కేవలం వారి సాధికారత వలన, మనం ఆ దిశలో ఎప్పుడూ ఆలోచించం, ఎప్పుడూ పరాధీనతే, ఆంగ్లం లేక పోతే అసలు మన భారతీయులకి మనుగడే లేనట్లు మాట్ళాడుతున్నారు. ఇంతకన్న సిగ్గుచేటు లేదు. అంతగా మన తల్లి భాష మీద గౌరవం లేకపోతే వెల్లి ఆంగ్ల దేశాల్లలోనే బ్రతకండి, దయచేసి మీ పునాదులు, మీ రూట్స్, మీ మాతౄదేభాష, దేశం ఏది అని అడిగితే భారతదేశం అని మాత్రం చెప్పకండి. అంతకన్న అవమానం ఏమి ఉండదు. ఎందుకంటే మీకు ఈ దేశపు సొంత ఆలోచనల మీద ఎటువంటి అవగాహన ఉండదు ఎందుకంటే మీ ఊహ తెలిసినప్పటి నుండీ ఆంగ్ల భాషలో చదివుంటారు కావున, భారతదేశపు ఆచారాలు గాని సంస్కృతుల మీద కాస్త అవగాహన ఉండు. అసలు మీరేంటో కూడ మీకు తెలీదు, అటువంటిది భారతీయులు అని చెప్పి, మీ పునాధూలమీద అవగాహన రాహిత్యం తో ఏవేవో వారితో మాట్లాడి, భారతీయ పరువు తీయకండి..! కమల్.
ఆయ్యొ, తెలిసుంటే, నేను ఆ నిరాహార దీక్షలో పాల్గొనేదాన్నే!
మరదే జల్లెడలోనో, కూడలిలోనే కనపడేదిగా ఈ టపా!
మాకేమో ఈనాడు వార్త కి సాక్షి ఉండదు.:(
Post a Comment