Tuesday, February 10, 2009

బ్లాగడం ఆపను. కానీ...


ఈ రోజు విశ్వప్రేమికుడు అనే బ్లాగులో ఒక వ్యాఖ్యరాస్తూ, "బ్లాగు వ్యక్తిగత అభివ్యక్తికి వేదికైతే,బయటి ప్రపంచానికి ఒక మినీరూపం బ్లాగుసమాహారాలూ,సంకలినులు.బ్లాగులో ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది.కానీ,కూడలి లేక జల్లెడకొచ్చాక అదొక "సంఘం"లాగా మారి సమస్యలొస్తాయి. అది తప్పదు. అందుకని బ్లాగులు రాయటం సమస్య కాకూడదు. ప్రపంచం కోసం మనం మన వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టకూడదు కదా!" అన్నాను. వ్యాఖ్య రాసిన తరువాత ఒక్క క్షణం ఆలోచించిచూస్తే, వ్యక్తిగత అభివ్యక్తిని అమితంగా ఆకాంక్షించే నేను, ఈ సంఘం చట్రంలో వ్యవహరిస్తూ అప్పుడప్పుడూ నా వ్యక్తిత్వాన్ని పక్కనపెడుతున్నానేమో అనే సందేహం వచ్చింది.


నాకోసం నేను రాసుకునే బ్లాగుకి నేను రాసింది చదివించాలనుకునే కొందరు మిత్రులో లేక యాధృశ్చికమైన పాఠకులో లభించడంలో ఒక అర్థముంది. కానీ, కూడలి, జల్లెడ లాంటి సమాహారాల యొక్క సౌకర్యం మూలంగా తెలుగు బ్లాగులోకమనే ఒక సమాజంలోకి వచ్చిపడ్డాను. నేను రాసింది చదివేవాళ్ళుండటం అదృష్టం అనుకునే సమయంలో స్పందనలు, ప్రతిస్పందనలూ, చర్చలూ,వాదాలూ మరికొన్ని వివాదాలూ కలగలిపి నన్నొక బ్లాగ్సమాజజీవిని చేసేసాయి. నేను రాయాలనుకున్నదే ఇప్పటికీ రాస్తున్నా, "వీళ్ళందరూ చదువుతారు" అనే ఒక ఆలోచన మెదడులో నిక్షిప్తంగా నిలిచి ఉండేది. ఆ ఆలోచన మూలంగా ఎంతో కొంత (అనవసరపు) ఒత్తిడి.


నా ఆలోచనలూ, అభిప్రాయాలూ,భావజాలం ఇతరులపై రుద్దే ఉద్దేశంగానీ ఆశయంగానీ ఎప్పుడూ నాకు లేదు. బ్లాగు రాయడంద్వారా వాటికి జనామోదంగానీ, ప్రజాదరణగానీ మూటగట్టాలనే ఆలోచనా ఎప్పుడూ రాలేదు. స్వీయానుభవంద్వారా సంపాదించిన జ్ఞానమే శాశ్వతమని నమ్మే నేను, ఇతరులు నా అనుభవాల ప్రాతిపదికమీద మారాలనే కోరిక ఎప్పుడూ కలగలేదు.


కాకపోతే ఈ మధ్య నా బ్లాగుపై మొదలైన చర్చలూ, అపోహలూ చూసిన తరువాత. వాటిని చూస్తూ కేవలం నిశ్శబ్దంగా ఉండలేని నా అసహనాన్ని అనుభవించిన తరువాత. ఇవన్నీ కమ్యూనిటీ బ్లాగింగ్ వలన ఏర్పడిన సమస్యలు అనిపించింది. అందుకే కూడలి, జల్లెడలకు తాత్కాలికంగా బైబై చెప్పే నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే నా బ్లాగును చదవాలుకునేవాళ్ళకు చిరునామా తెలుసుగనక, పెద్ద తేడా రాదనే అనుకుంటాను.


బ్లాగడం ఆపను. కేవలం కూడలి, జల్లెడల్లో కనిపించడం మాత్రం మానేస్తున్నాను. ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు చేస్తూ చర్చల్లో భాగస్వామిగా కనిపిస్తాను. కేవలం పర్ణశాల కొత్త టపాలు నా బ్లాగు చిరునామాకొస్తే మాత్రమే కనిపిస్తాయి. అంతే తేడా!


****

54 comments:

మోహన said...

A matured thought. I appreciate. keep writing.

Shiva Bandaru said...

కొత్త ప్రయత్నం! ఫలితాలు చూడాలి :)

Anonymous said...

చాలా రోజులకు మీకు దీపం వెలిగింది. ఇక హాయిగా వుంటారు చూడండి. బ్లాగు లోకంలో మీకు అక్కలు, అన్నయ్యలు అవసరంలేదని అర్ధం అయ్యింది కదా.

Chari Dingari said...

అదేంటి...నీ బ్లాగు కి రావాలనుకున్న వాళ్ళు వస్తారు, కూడలి, జల్లెడ ల లో కనిపించినంత మాత్రాన నష్టం లేదని నా అభిప్రాయం...కాని నీ నిర్ణయం నాకు నచ్చలేదు ...

సూర్యుడు said...

Good analysis :-)

The last two paragraphs are your individual decision and I don't have any comment on it.

I was seeing a phrase in your few of your posts, "స్వీయానుభవంద్వారా సంపాదించిన జ్ఞానమే శాశ్వతమని నమ్మే నేను". Why do you say that? I don't believe it completely, you should be able to gain knowledge by observing others also. Learning by own experience is some times hard way of learning, don't you agree?

Anil Dasari said...

డీ-లిస్ట్ అవ్వటం మీ సమస్యని ఏ రకంగా దూరం చేస్తుందో నాకర్ధం కావటంలేదు. మీ బ్లాగు కూడలి, జల్లెడల్లో ఉండటమే మంచిదని నా అభిప్రాయం.

శ్రీధర్ said...

మీరు కూడలి నుండి ఎలా వెళ్లి పోతామో చూస్తాం .... అని మల్లి కొత్త గొడవ మొదలు అవుతుందేమో ... వివాదాల నుండి మీరు దూరం గా వెళ్తే .... వివాదాలు మీకు దూరంగా వెళ్తాయి అనుకుంటున్నారా ... తప్పు తప్పు .... మీ బ్లాగ్ బుక్మార్క్ ఐ వుండి చాల మంది దగ్గర మీరు ఎక్కడికి పారి పోలేరు... సరదాగా రాసాను .... బాష లో తప్పులుంటే మన్నించండి ..అసలు భావమే తప్పు అంటే తొలగించండి .... చివరి రెండు వాక్యాలు మోహన్ బాబు స్టైల్ లో చదువుకొని తరించండి :)

శరత్ కాలమ్ said...

ఒక రకంగా కత్తి ఒరలో దూర్చేస్తున్నారన్నమాట. మీ నిర్ణయం సరికాదనిపిస్తోంది. ఇలా కన్నా ఎదుటివారి అసంబద్ధమయిన వ్యాఖ్యలని బొత్తిగా పట్టించుకోకుండా వుంటే పోలా? నా పద్ధతి అయితే అదే.

ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యల ద్వారానయినా పబ్లిక్లో కనిపిస్తుంటారా?

Anonymous said...

అభిప్రాయ భేధాలు సహజం. వాదనకు దిగకుండా అభిప్రాయం వరకు తెలియజేస్తే సమస్యలు రావు. విమర్శలను ఈజీ గా తీసుకోవాలి. take it easy and keep rocking ..

కన్నగాడు said...

మంచి నిర్ణయం నాకు కారణమదే అనిపించింది, కాని కొత్తవాళ్లకు ఇలాంటి సౌకర్యాలే చేయూతనిస్తాయి.

కొత్త పాళీ said...

Interesting thought.
కొన్ని కొన్ని వ్యవస్థలు ఎప్పటికీ మనకి మేలు కోసమే అని లోలోపల నమ్మేస్తాం. కూడలీ జల్లెడా కూడా అలాగేనేమో అనిపంస్తోంది ఇప్పుడిప్పుడే. వాటి వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి, సందేహం లేదు. ముఖ్యంగా కొత్త బ్లాగర్లకి. కానీ బ్లాగ్లోకంలో కొంత రాటు దేలిన తరువాత ఇవి ప్రతిబంధకాలేనేమో ఆలోచించాల్సిన విషయమే.

cbrao said...

బ్లాగు, ఎవరి కోసం, ఎందుకోసం? ఆసక్తికరమైన విషయమేమంటే ముష్కరులు ప్రచలిత బ్లాగుల రచయితలనే లక్ష్యంగా ఎంచుకొన్నారు, తమ వ్యంగ రాతలకు. కూడలి నుంచి నిష్క్రమిస్తే వారి వ్యూహం పారినట్లే. ఓటమిని ఒప్పుకున్నట్లా?

Kathi Mahesh Kumar said...

అందరికీ ధన్యవాదాలు.
@సీబీ రావు:బ్లాగు నాకోసం, నా ఆలోచనలు రాసుకోవడం కోసం.అందుకే, వాటి మీద చర్చలకేగానీ నన్నొప్పించాలనుకునే వాదనలపట్ల నాకు ఆసక్తి లేదు.కానీ అలాంటి వాదనల్లో పాల్గొనాల్సివచ్చేది.సహజంగా నా అభిప్రాయాల్ని ఇతరులపై రుద్దే అలవాటులేని నాకు, ఇక్కడ అవి బలంగా చెప్పే ఉద్దేశంతో అవే సత్యం అన్నంతస్థాయిలో వాదించాల్సొచ్చేది. That is not me.As I am interested in living my own life rather than propagating what I believe in.

సూటిగా చేసిన యుద్ధాలకే భయపడని వాడిని ఈ అనామక వ్యంగ్యరాతలకు భయపడతానా!కారణం వీరు కాదు. ఈ నిర్ణయానికి కారణం నేనే. నా భావవైరుధ్యాలను ప్రపంచాన్ని మూసల్లో పోసిబ్రతకాలనుకునే organized groups ఎప్పటికీ భరించలేవు.కూడలి,జల్లెడ ఇప్పుడు gated communities గా మారుతున్నాయి.అలాంటి గుంపుల్లో నేనూ ఇమడాలని ప్రయత్నించలేను. అందుకే ఈ విరామం.

నేను రాయటం మానను. బ్లాగుల్లో వ్యాఖ్యానించడం మానను. కానీ,తెలుగు బ్లాగుల గుంపులో భాగంగా ఉండటం లేదంతే! ఇందులో గెలుపు ఓటముల ప్రసక్తి లేదు.

@కొత్తపాళి: నిజమే ఇది ప్రతిబంధకమనే ఆలోచన వచ్చే ఈ విరామాన్ని కోరుకుంటున్నాను. నా ఆలోచన ఎంతవరకూ సరైనదో సమయం నిర్ణయించాలి.

@కన్నగాడు: కూడలి,జల్లెడ ద్వారా నాకంటూ కొందరు dedicated readers దొరకారు. అంతకంటేనా! కాబట్టి కొత్తవారికి ఇవి పట్టుగొమ్మలు.

@శరత: బ్లాగుల్లో వ్యాఖ్యల్లో ఖచ్చితంగా కనిపిస్తాను.

@అబ్రకదబ్ర: డీలిస్టింగ్ ఈ సమస్యను తీరుస్తుందో లేదో అనేది కొన్నాళ్ళకుగానీ తెలీదు. చూద్ధాం.

@సూర్యుడు: ఇతరుల అనుభవాలద్వారా కూడా మనం మనకు కావలసిన అర్థాల్నే గ్రహిస్తాం. అందుకే అదికూడా స్వీయానుభవమే. అంతెందుకు పుస్తకాలు, సినిమాల ద్వారా గ్రహించేవికూడా స్వీయానుభవాలే.

పరిమళం said...

మహేష్ గారూ !మీరు అనుభవజ్ఞులు .మీకు చెప్పగలిగే సాహసం లేదు కాని మీ నిర్ణయం బాధ కలిగించింది .ఏదేమైనా మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ .....

Anonymous said...

నిర్ణయం కారణాలేమైనా, బ్లాగుల సమాహారానికి మీ లోటు స్పష్టంగా తెలుస్తుంది. అయినా, మిగతా బ్లాగుల్లో వ్యాఖ్యలు చేస్తాననీ, మీ బ్లాగు లింకు ద్వారా వచ్చి టపాలు చదవవచ్చనీ అంటున్నారు కదా..ధన్యవాదాలు.

Anonymous said...

నిన్ను కాగడా గారు అసలు తిట్టలేదు....ఆయననేది ఒక్కటే....ఈ ప్రపంచాన్ని నడిపించేది...."Sex,Money,Power"....
దాన్ని నమ్మమన్నాడు....అంతే తప్ప....పత్తిత్తులా నటించ వద్దన్నాడు....నీ లాంటి చదుకున్న వాల్లే...నిజాన్ని నమ్మక పొతే....inka Illeterate ల పరిస్థితి ఏంటి.....

ఏంటి కాదంటారా.... అయితే "Sex,Money,Power " కాకుండా ఇంకేమి ఈ లోకాన్ని నడిపిస్థున్నాయో....అనే అంశం మీద ఒక టపా రాయొచుగా....
నువ్వు నిజాన్ని గ్రహించ లేదు కాబట్టి ఇలా నీలో వున్న ఆవేసాన్ని బ్లాగుల రూపం లో మాకు చెబుతున్నావు....మంచిదే....కాని "Ultimate Truth " ని కూడా నమ్మే సత్తా నీకు వుండాలి....
చలం చెప్పినా, కాగడ శర్మ చెప్పినా అదే చెప్పారు....
నీకు నిజం అర్దం అయితే కచితంగా ఈ దేశ అబివ్రుద్ది కోసం బ్లాగ్ రాయాల్సిన పని లేదు.....
నిజాన్ని నమ్మ డానికి మీ అందరి ప్రొబ్లెం ఎంటో నాకు అర్దం కావట్లేదు....

Anonymous said...

I think everyone are getting dragged off from the actual reason. It's funny to say that RSS aggregators are reason for this blunder. Anywhere in this world, people and their hidden agendas, egos, publicity madness are the problems for any such issue.

In this case also, the issue has been created by people and not by some aggregator.Even yahoo and MSN are aggregating telugu blogs just like koodali and jalleda. If you are writing a blog with out end points of RSS or ATOM, please dont call it as blog. Just call it as web site.

సుజాత వేల్పూరి said...

ఓడిపోయారా? సరే పొండి!

ఏకాంతపు దిలీప్ said...

@ మహేష్ గారూ

సమస్య కూడలి, జల్లెడలలో లేదు. వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. జనాల ఆలోచనా విధానంలో ఉంది.

అతి వేగంగా స్నేహితులని, సన్నిహితులని, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే సంఘంలోనే ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువమందికి, అత్యంతగ సహాయపడాలన్నా సంఘంలోనే ఉండాలి. మనం చేసే సహాయం అది ఎలాంటిదైనా వారి వారి జీవితాల్లో చిన్న మార్పునైనా తీసుకొస్తుంది..

"ఇతురలు నా అనుభవాల ప్రాతిపదికమీద మారాలనే కోరిక ఎప్పుడూ కలగలేదు" అది అబద్ధం. ఈ టపా రాసేప్పుడో, గత కొంతకాలంగా గురైన భావావేశపు ఒత్తిడి మూలంగా అలా రాసారేమో. మీ రచనా, వ్యాఖ్యల పరంపరలో అంతర్గతంగా ఆ తృష్ణ ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. అన్ని వ్యాఖ్యలలో కాకపోవచ్చు.

మీలా ఆలోచించే లేక మీలా దృక్పథం ఉన్న వారు ఎక్కువ మంది పరిచయం కావాలన్నా సంఘం లోనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువమంది సంఘాన్ని వదిలిపోవాలి అనుకోరు కాబట్టి.

మీరు చేసే శొధనా, సాధనా తరవాత వచ్చిన జ్ఞానాన్ని పంచుకోడానికి, దాని గురించి సమాలోచన చెయ్యడానికి మీకు స్నేహితులు ( స్నేహితులు కాకపోయినా, నిఖార్సైన వ్యక్తులు) కావాలన్న మీరు శొధించి పట్టుకోవాల్సిందే. బయట ఉండి అది చెయ్యలేరు. ఏందుకంటే నిరంతరం వెతికితే గానీ అలాంటి వాళ్ళు కనపడరు. శోధించేది నేను కదా, దానికి సంఘంలో సభ్యత్వం ఎందుకంటే.. సంఘంలో ఉన్న మీలాంటి వాళ్ళకి మీరు కనపడరు కాబట్టి.

మీరు నిర్ణయం తీసుకున్న తరవాత మిమ్మల్ని మార్చడం కష్టం అని తెలుసు. కానీ నా వ్యాఖ్య మిమ్మల్ని ఆలోచింప చేస్తుంది అని నమ్మకం. ఇప్పుడున్న భావావేశపు ఒత్తిడి తగ్గిన తరవాత, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలానే ఆలోచిస్తారని, మరలా కూడలిలో మాకు మీ టపాలు కనపడతాయి అని నమ్ముతున్నాను.

Anil Atluri said...

"కూడలి,జల్లెడ ఇప్పుడు gated communities గా మారుతున్నాయి" - ఈ రోజున మీరు.
మొన్న ఆ మధ్య తాడేపల్లి గారనుకుంటా, "గేటెడ్ కమ్యూనిటి" అని అన్నారు.
నిన్న కిరణ్..అవును.
నిజమే, కూడలి, జల్లెడ బయట కూడా బ్లాగ్ లోకం ఉంది. అందులో తెలుగు ప్రపంచం కూడా ఉంది. ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండవచ్చు. ఒకసారి అటు వెళ్ళి > రావడం (?)లో తప్పేమి లేదు. కాస్త గాలి పీల్చుకున్నట్టు ఉంటుంది. కనపడుతునే ఉంటారుగా..స్వల్పవిరామం..మళ్ళీ పలకరించుకునేదాకా .. :)

Unknown said...

Leaving from the koodali, jalleda is the ultimate solution for this. Withstand, against the situations....!!! and i agree with the cbrao garu.

Anonymous said...

Good.

Take a break.

Kit-Kat ? :)

- chavakiran

సత్యసాయి కొవ్వలి Satyasai said...

మీ బ్లాగు మీయిష్టం. మీ అభిప్రాయం మీది. మీటపా చదివాక అచ్చు గవర్నమెంటు వారి సమస్యాపరిష్కారధోరణి లోనే సాగిందనిపించింది - పరిష్కారానికీ సమస్యకీ పొంతనలేకుండా. వ్యక్తిలేకుండా సమాజం ఎలాఉండలేదో, సమాజం లేకుండా వ్యక్తిమనుగడకి అర్ధంలేదు. మీకు కూడలి అవసరం లేదనిపించి వెళ్ళిపోతున్నారు. కానీ కూడలికి మీఅవసరం లేదంటారా. కూడలంటే koodali.org కాదు. కొంతమంది బ్లాగరులమధ్యనున్న బాధ్యత, (అను)బంధం. ఇలాంటి చర్చ అంబానాధ్ గారు తన బ్లాగుని రెజిస్టర్డ్ పాఠకులకే అన్నప్పుడు కూడా జరిగింది. Anyway all the best.

Anonymous said...

మహేష్ గారు మీ పోస్ట్ లు నేను పూర్తిగా చదవలేను ఒక్కోసారి అంత గంబీరమైన తెలుగు నాకర్దం కాదు...కాని మీ అభిప్రాయాలు వెల్లిబుచ్చే తీరునాకు నచ్చుతుంది,నిన్న సరస్వతి కుమార్ గారి పోస్ట్ చదివాకా అనుకున్నాను మీరు ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటారని.. కాని వెంటనే మహేష్ గారు ఇంత చిన్న విషయాలు మనసులో పెట్టుకోరులే అనుకున్నాను ..మీకు ఎంత మంది విమర్శకులున్నారో అంతకంటె ఎక్కువ అభిమానులున్నారు ,ఉదాహరణకు నేను మీ పోస్ట్ లో ఒక్కసారి కూడా వాక్య రాయలేదు అయినా మీ అభిమానిని.. ఇక మీ ఇష్టం ...కాగడ శర్మగారు కేవలం మనీ ,పవర్,సెక్స్ ప్రపాంచాన్ని నడిపించినట్లయితే ఈ పాటికి ప్రపంచం అంతం అయిపోయి ఉండేది ,ఈ ప్రపంచాన్ని నడిపేది ప్రేమ ..ప్రేమ అనగానే మీకు కామంతో నిండినటువంటి ప్రేమ గుర్తు వస్తుందేమో .. ఉదాహరణకు ఇప్పుడు మీరు అన్న మనీ,సెక్స్,పవర్ సిద్దాంతాన్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టే ప్రతి చోటా అందరీనీ ఆ విషయాన్ని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు .. భయంకరమైన ద్వేషం కంటే ప్రేమ పాళ్ళు ఎక్కువ గా ఉండబట్టే ఈ ప్రపంచం ఇంకా ఇలా ఉంది.. లేక పోతే ఈ భార్య భర్తలు కామానికి ఇచ్చిన ప్రాదాన్యత పిల్లలను కనడానికి పెంచడానికి ఇవ్వరు..సృష్టే ఆగిపోతుంది ..అసలు మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టే ఇంకా బ్రతికి ఉన్నాం ..

Anonymous said...

మీరు కూడలి వదిలేసి వెళ్ళడం బాధాకరమే గానీ, ఒక్కమాట. ఇటువంటి అనుభవాలు మిగతా అందరికన్నా మీకే ఎక్కువ ఎదురయ్యాయంటే, మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందనే అర్థం. అభిప్రాయాల్లో తప్పొప్పులు పక్కన పెడితే, వాటిని మీరు వ్యక్తం చేసే తీరు కొంచం రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. మీ రచనాశైలికి కొంచం మెరుగులు దిద్దుకుంటే ఇలా ’సంఘాన్ని’ వీడిపోవాల్సిన అవసరం ఉండదు.

చంద్ర మోహన్ said...

మీరు కూడలినుండి వైదొలగడం వలన ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో నాకు అర్థం కాలేదు.’తెలిసిన వారు ఎలాగూ బుక్ మార్క్ ద్వారా చదువుతారు... ’ ఆ తెలిసిన వారిలో మీ అనామక మిత్ర, శత్రు బృందం కూడా ఉంటుంది కదా. వాళ్ళు వెతికి పట్టుకొని మరీ కామెంట్లు వ్రాయక పోరు. నష్టమేమిటంటే, కొత్తగా బ్లాగులను దర్శించేవారికి మీ బ్లాగు పరిచయం కాకపోయే అవకాశాలెక్కువ. ఈ నష్టం ... మీకు కాదు, బ్లాగులకు, బ్లాగు పఠితలకు.

ఐనా మీరివన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకొనివుంటారని అనుకొంటాను. చూద్దాం, ఏమౌతుందో!

Purnima said...

No, I don't understand. Assuming, you're bogged down by visitors from koodali and all, how are you stopping them by this? More than the post update on koodali, I guess, we pull in more visitors because of the comments. So, yes, that is the only thing you're achieving. Otherwise, it is all but same.

Anyway, individual opinions / decisions should be respected. All the best, with the new experiment. But as sometime back, in the same blog we discussed, we gotta have a real understanding of why we blog! Every decision would be made easy by that understanding!

Enjoy your stay! Happy Blogging!

Anonymous said...

".. అంతే తేడా!" -మీరు సాధించదలదేమిటో అర్థం కాలేదు.

కూడళ్ళ నుండి తప్పుకోవడమా! ఎందుకలాగ? మీ బ్లాగును కమ్యూనిటీ చదవకూడదనా! రేప్పొద్దున ఎవరైనా మీ భావజాలాన్ని విమర్శిస్తే "అదంతా నీకనవసరం, నేనేమైనా కూడళ్ళలో పెట్టానా?" అని అనే అవకాశం ఉంటుందనా? అదే అయితే మీ కోరిక నెరవేరదు. చదువరులు నేరుగానే ఇక్కడికి రావొచ్చు. మీ వ్యాఖ్యల లింకు ద్వారానే రావొచ్చు. వస్తారు, చదువుతారు. వ్యాఖ్యానిస్తారు కూడా!


"ప్రపంచాన్ని మూసల్లో పోసిబ్రతకాలనుకునే organized groups" ఇక మీ బ్లాగును చూడలేవా? వ్యాఖ్యానించలేవా? మీ బ్లాగును ఫలానావాళ్ళు మాత్రమే చూడాలి, ఫలానావాళ్ళు చూడకూడదు అని మీరనుకుంటే అనుమతి ఉన్నవాళ్ళకే కనబడేలా పెట్టుకోవాలి. కానీ కూడళ్ళనుండి బయటికిపోవడం ఏ ప్రయోజనం ఆశించి చేసారో తెలీడం లేదు.

కూడళ్ళ కారణంగా బ్లాగు సమాజంలోకి వచ్చిపడ్డాను, అంచేత కూడళ్ళలోంచి బయటికి పోతున్నానన్నారు. కూడళ్ళే సమాజమా? బ్లాగు రాస్తున్నారంటేనే ఆ సమాజంలో ఉన్నట్టు. కాదా?

Bhaskar said...

I am one of the regular followers of your blog.

I could not understand how to take the statement.

Good: Here after you will write what you think and feel internally without being afraid of society's feelings

Bad: Are you afraid of making your real inner thoughts to society?

Kathi Mahesh Kumar said...

@చదువరి: కూడలి,జల్లెడలు తెలుబ్లాగులోకం గా పరిగణించబడుతున్నాయి. ఈ సమయంలో ఎవరు ఆదరణ పొందితే వారిని టార్గెట్ చెయ్యడం. ఎవరు విప్లవాత్మకంగా తమ వ్యక్తిత్వాన్ని బ్లాగులద్వారా వ్యక్తీకరిస్తే వారిని తీవ్రవాదులనడం. విస్తృతంగా చదివేవారినీ,రాసేవారినీ కేవలం పాప్యులారిటీ కోసం చేస్తున్నారనడం వంటి పోకడలు మొదలయ్యాయి.ఇవేవీ నాకు అవసరం లేదు. నేను రాసేది నాకోసం.అందుకే, "బ్లాగులోకం"గా భ్రమిస్తున్న సంకలినులనుంచీ వైదొలగి నిజమైన విస్తృత బ్లాగుప్రపంచంలో మిగిలాలని ప్రయత్నిస్తున్నాను.

Unknown said...

Katti garu, Nenu mee blog regular follower ni. Meeru cheppedi kontavaraku nijame. Meeru chese prayatnam manchide kavocchu ... Kaani., meekoka vishayam teluso ledo .. nenu mee blog ni jalleda dwara no, koodalidwarano choodaledu. Just google blogs lo search chesanu, daantlo dorikindi. U r ultimately in the real blog world. Koodali, jalleda lantivi, kottaga chadivevariki,vetukkovadam sulabhataram chestundi. Kotta ga chadavatam start chese vallaku mee blog choose avakaasham lekapovacchu....

Mahesh garu, Okkati matram Nijam. Meeru koodalinunchi, jalledanunchi vidoligina, Nenu matram mee blog ni regular ga follow avutanu :)

So now its time to come up with new topic in ur blog. Artham partham leni ee vivadam kosam mee viluvina samayanni vrudha cheyyadam avivekamemo...

జీడిపప్పు said...

మహేశ్ గారు,
ఇందాకే కూడలిలో కామెంట్స్ విభాగంలో మీ కామెంటు చూసి ఇక్కడికొచ్చాను.

"బ్లాగులోకం"గా భ్రమిస్తున్న సంకలినుల" అన్నారు. కూడలి, జల్లెడలు సంకలినులు అనేది భ్రమ కాదు, నిజం. ఇన్నిరోజులు మీకు అది భ్రమ అని తెలియలేదా మహేశ్ గారు? కూడలి, జల్లెడలు లేకుంటే బ్లాగులు దిక్కుమొక్కూ లేకుండా ఎక్కడున్నాయో ఎవరికీ తెలియవు కదా. అంతెందుకు, కూడలి, జల్లెడ ద్వారానే కదా మీ బ్లాగు గురించి అందరికీ తెలిసింది? వాటివల్లే మీ గురించి నలుగురికి తెలిసింది. ఈ రోజేమో "నిజమైన విస్తృత బ్లాగుప్రపంచంలో మిగిలాలని ప్రయత్నిస్తున్నాను." అంటున్నారు. అంటే ఇన్నాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియదా?

చదువరి గారు అన్నట్లు - మీరు సాధించదలదేమిటో అర్థం కాలేదు. కూడలి, జల్లెడ లాంటి భ్రమ సంకలినిలో ఉండను కానీ, వాటిలో కనిపించే బ్లాగుల్లో కామెంటు వేస్తాను. ఇంకొకరి పోస్టుల్లో నేను వేసే కామెంట్లు మాత్రమే కూడలి, జల్లెడలాంటి భ్రమ బ్లాగులోకాల్లొ కనిపిస్తుంటాయి కానీ నా పోస్టులు కనపడవు అంటున్నారు!

"ఈ సమయంలో ఎవరు ఆదరణ పొందితే వారిని టార్గెట్ చెయ్యడం." అన్నారు- పూర్తిగా పొరబడుతున్నారు. నేను ఇంతకుముందే ఎక్కడో చెప్పినట్లు, బ్లాగులోకంలో మీ కంటే బాగా రాసేవారు, ఆదరణ ఉన్నవారు కోకొల్లలు. మీరు "విభిన్న" బ్లాగరు మాత్రమే కానీ వారిలా వ్రాయలేరు. వారి అందరి పైనా దాడి జరిగిందా? అసలు బ్లాగులోకంలో మొదటిసారి కల్లోలానికి కారణమెవరో చెప్పండి. పైన కామెంటులో ఎవరో అన్నట్టు, ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకొని "బ్లాగులోకం gated community" అనే భ్రమలోనుండి బయటకు రండి.

Kathi Mahesh Kumar said...

@జీడిపప్పు: ముందుగా నావ్యాఖ్యని పూర్తిగా చదవండి.వక్రీకరించాలంటే కనీసం కూలంకషంగా చదవడం ముఖ్యం.

Anonymous said...

మీ అంతర్మథనం అర్థమయింది. (నాకూ ఇలాంటిదే ఒకటి మొదలయ్యింది ఈ మధ్యన. త్వరలో నా బ్లాగు మూసినా మూసెయ్యచ్చు.)

ప్రయోజనం అన్నది మీకు సంబంధించిన విషయం కాబట్టి అనవసరం.

Anonymous said...

>>>కాగడ శర్మగారు కేవలం మనీ ,పవర్,సెక్స్ ప్రపాంచాన్ని నడిపించినట్లయితే ఈ పాటికి ప్రపంచం అంతం అయిపోయి ఉండేది....

ఈ భూమి మీద 60% మంది ప్రజలు (మన దేసాన్ని వదిలేసెయ్ ) ఈ నియమాన్నే పాటిస్తున్నారు...మరి అంతం కాలేదేం....

>>ఈ ప్రపంచాన్ని నడిపేది ప్రేమ ..ప్రేమ అనగానే మీకు కామంతో నిండినటువంటి ప్రేమ గుర్తు వస్తుందేమో ...ఉదాహరణకు ఇప్పుడు మీరు అన్న మనీ,సెక్స్,పవర్ సిద్దాంతాన్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టే ప్రతి చోటా అందరీనీ ఆ విషయాన్ని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు ....
ప్రేమంటే.....
Case I :
నువ్వు రోడ్డు మీద వెలుతున్నావు.....ఒక అందమైన అమ్మయిని చూసావు...వెల్లి మాట్లాడావు కూడా...ఫోన్ నంబర్ కూడా ఇచింది....నైట్ మాట్లాడుకున్నారు....నువ్వెంతలా ఆ అమాయు ని ఇస్ట పడ్డావంటే ...ఇంక ఆ అమ్మాయి లేకుండా బ్రతికి వుండలేవని ప్రామిస్ కూడా చేసావ్....పెల్లికి మీ వాల్లు కూడా వొప్పుకున్నారు....చివర్లో....ఆ అమ్మాయి నాకు ఒక ఫ్లాష్ బాక్ వుందండి...నాకు 18 యేల్లు వున్నప్పుడు....మా వాల్లు నాకు పెల్లి చేసారండి ...కాని కచితంగా పెల్లైన 8 వ రోజు వాల్లు మోసగాల్లని...మద్యవర్తి వాడికి రోగం వున్న సంగతి దాచి పెట్టాడని తెలిసింది....కాని మీరనుకున్నట్టు అలాంటివేమి జరగ లేదండి....అన్నదనుకో.....ఎమ్మటే నువ్వేమనవు కాని ....ఇవన్ని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటావ్.... నీను మీరు అందరిలా కాదనుకున్నను అన్నదనుకో...నువ్వేం చెస్తావ్.....???
నీను చెబుతున్నా ....ఇక్కడ బ్లాగే ఎవ్వడు కూడా ....నెక్స్ట్ డే అటు వైపు వెల్లడు....ముక్యంగా నువ్వు....బతుకు దేవుడా అంటూ బయట పడతావ్.... ఇప్పుడు చెప్పు నీది కామమా లేదా ప్రేమా.....
కామం తో కూడని ప్రేమ వుండదు రా అబ్బాయ్....నువ్వెక్కడ అంటే ఏ దేశం లో వున్నవో తెలియదు కాని నువ్వు ఇండియా లో లేకపొతే మాత్రం...నీ చుట్టు చూడు...వాల్లెందుకు అంత హాపి గా బ్రతుకుతారో ఆలోచించు....ఆ వాల్లెం హాపి గా వున్నరన్నావనుకో....నువ్వు బ్లాగడం ఆపు.....
మన దేశ విసయానికి వస్తే....మనవన్ని దొంగ ప్రేమలు రా అబ్బయ్...దీనినే నీను "Virgin Loves " అంటాను....ఇక్కడ కామం తప్ప ప్రేమ వుండదు రా అబ్బాయ్....
(పైన చెప్పిన కత నిజంగా జరిగింది....చిన్న వయసులోనే పెల్లై ...విడిపొయి...ఆ అమ్మయిని అందరు "Second Hand or Not virgin " అంటుంటే ఆమె పడ్డ నరకం నీను ప్రత్యక్షంగా చూసాను...సరసానికి ఓకే కాని వివాహానికి కస్టం అని ఆమెకి చాలా మంది చెప్పారంట)
Case II:

నేను నా చిన్న నాటి స్నెహితురాలు వయసులో వున్నప్పుడు విచల విడిగా ఎంజాయ్ చేసాం...ఎవరు చూడలేదా అనే అనుమానం తీసెయ్....మూడో కంటికి కూడా తెలియదు...నీను తర్వాత హైదరబాద్ వచాను....అప్పట్లో సెల్లు ఫొనులు లేవు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేదు....సంవత్సరం తర్వాత...చక్కగా పెల్లి చేసుకుంది...నన్ను పిలవలేదు...ఎందుకో నాకు తెలియదు....బంగారం లాంటి అమ్మాయి దొరికింది అన్నారంటా....ఎవడికి తెలుసు ఆ అమ్మాయి బంగారమో కాదో....నాకు తప్ప...
చక్క గా ఇద్దరు పిల్లలతో హాపి గా వుంది....మొన్న కలిస్తే అసలు అదే మొదటి సారి చాల రొజుల తర్వాత చూడడం అన్నంతగా నటిస్తుంది....

ఇప్పుడు చెప్పరా అబ్బాయ్.....కామమంటే ఎంటో ప్రేమంటే ఎమిటో....
నీను ఒకటి చెబుతున్నా విను....ఒక అమ్మాయిని చూసి...మాట్లాడి...ఆ అమ్మాయి "పతివ్రత" అని చెప్పలేం....అలాగే ఒక అబ్బాయిని చూసి మాట్లాడి...."శ్రీ రామ చంద్రు" డనలేం.....నీను చెప్పేది ఒకటే ముసుగులు తీద్దాం ....దైర్యంగా ముందుకు సాగుదాం....ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం.....అది ముందు మనమే ప్రారంబిద్దాం....మన దేసాన్ని "పవిత్రులనుంచి ,పతివ్రతలనుంచి " కాపాడుదాం....

నీనెవరిని నమ్మించట్లేదు రా అబ్బాయ్ నిజం చెబుతున్నాను....
అలా చేస్తున్న ఎన్నో దేశాలు ,..ఈ నిజాన్ని అంగీకరించిన ఎంతో మంది...చాల సంతోసంగా వున్నారు అది నీకు కూడ తెలుసు కాని నన్ను వ్యతిరేకించి "పవిత్రున్నని" అనిపించు కోవాలనుకుంటున్నావ్.....

>>> భయంకరమైన ద్వేషం కంటే ప్రేమ పాళ్ళు ఎక్కువ గా ఉండబట్టే ఈ ప్రపంచం ఇంకా ఇలా ఉంది..

నీను అన్ని దేశాల దగ్గర Nuclear బాంబు లున్నాయి కాబట్టి ఇంకా ఇలా వుందనుకుంటున్నాను

>>>లేక పోతే ఈ భార్య భర్తలు కామానికి ఇచ్చిన ప్రాదాన్యత పిల్లలను కనడానికి పెంచడానికి ఇవ్వరు..సృష్టే ఆగిపోతుంది ....
అంటే ఈ దేశం లో ఎవరు కండోంస్ వాడట్లేదా...కేవలం పిల్లల కోసమే కలుస్తున్నారా....
ఈ ఒక్క లైన్ చాలురా నాయనా నువ్వెంత వెనక బడి వున్నావో అని చెప్పడానికి ....
చదువు రాని వాల్లు కాదు ఈ దేసానికి ప్రమాద కరం ....నీలాంటి సగం తెలిసిన వాల్లు.....

>>>అసలు మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టే ఇంకా బ్రతికి ఉన్నాం ...
ఇది ఎవరైనా చేస్తారు....

చిన్నప్పుడు క్లాస్ ఫస్ట్ రాలేదని మా నాన్న నన్ను కొట్టాడు....రానప్పుడల్లా కొట్టాడు... కాని నా దేశం ర్యాంకు 136/160(తలసరి ఆదాయం) అని తెలవగానే నాకు చాలా కోపం వచింది ...ఇప్పుడు నీను ఎవర్ని కొట్టాలి....ఆలోచించాను...పరిసీలించాను....కొట్టుకోవల్సింది నన్నే నని తెలిసింది....నన్ను నీను మార్చు కోవడమే నీను ఈ దేసానికి చేసే మంచి పని...మార్చు కున్నాను "పవిత్రుడనే " బిరుదు నుంచి బయటికి వచాను... కొత్త కల్లతో ఈ లోకాన్ని చూస్తున్నాను...సాద్య మైనంత మందికి చెబుతున్నాను...కాని నువ్వేం చెస్తున్నావ్....సలహాలు చెబుతున్నావ్....మారు నాయనా మొదట నువ్వు మారు ...తర్వాత సలహాలు చెప్పు....నిజాన్ని నమ్ము....స్వెచగా బ్రతుకు....నలుగురికి నువ్వు చెయగలిగినంత చెయ్యి....సలహాలు చెప్పకు ....ప్రాక్టికల్ గా ఆలోచించు .....మనదేసాన్ని మనం పొయ్యే లోపు ఎన్ని రాంకులు ముందుకు జరప గలమో ఆలోచించు...అప్పుడు వచి ఈ బ్లాగ్ లు చదువు....నీకే తెలుస్తుంది....లేదు నాకు సంబందం లేదు అనుకుంటే హాపి గా ఇంట్లో కూర్చో.... నాలుగు పూటలా తిను...నీ పిల్లలు...బందువులు చూస్తుండగా...పిరికి వాడిలాగ చని పో....
పో...పొయ్యి నిన్ను నువ్వు మార్చుకో....
"
మార్పు మొదట తిరస్కరించ బడుతుంది
తర్వాత వాదించ బడుతుంది
తర్వాత పరిసీలించ బడుతుంది
తర్వాత అంగీకరించ బడుతుంది
"

స్వేచగా ఒక్కరోజు నీ ముసుగు తీసి బ్రతికి చూడు నీకే తెలుస్తుంది ....నువ్వెమి కొల్పోయావో...

నీను శర్మ ని కాదు.....ఒక మామూలు మద్య తరగతి కి చెందిన వాన్ని.....నన్ను నీను మార్చుకుంటూ దేశం బాగు పడాలంటే ఏమి చెయాలా అని నిరంతరం ఆలోచించే వాన్ని.....మీలా "పవిత్రున్ని" మాత్రం కాదు.....
---జై హింద్

Anonymous said...

చాలా కష్టపడ్డావ్ కానీ నేను చెప్పేది సరిగా చదువు ప్రేమ అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన కోరిక తీర్చుకునే యువతీ యువకుల మద్య ప్రేమ కాదు ..తల్లీ బిడ్డలు మద్య ప్రేమ ,భార్య భర్తలు మద్య ప్రేమ ,మనం నమ్మే సిద్దంతాల పై ప్రేమ అని.. చిన్నపుడు నువ్వేదొ ఒక ఆడదానితో తిరిగితే మీ కామానికి ప్రేమా అని పేరు పెట్టేసి నువ్వు ఫీల్ ఐతే ఎవడి ఏం చేయలేడు ,తీవ్రమైన జబ్బుతో బాధ పడుతున్న భార్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఆమెనే ప్రేమిస్తున్న (with out sex) నా స్నేహితుడే దీనికి ఉదాహరణ .. దాదాపు 15 years నుండి ఆమె మంచం మీదే ఉంది .. భార్య చనిపోయినా పిల్లల కోసం అని మళ్ళా పెళ్ళి చేసుకోను అని భీష్మించిన వాళ్ళను కూడా చూసాను ,ఇది పిల్లల మీద ప్రేమ ,భర్త తాగి అల్లరి చేసి నానా గొడవ చేసినా నా చెల్లి మార్చుకోడానికే ప్రయత్నిస్తుంది గాని వదలదు ..ఎందుకూ అని అడిగితే మొదటి లో ఈ అలవాటు లేదన్నయ్యా ఆయనకు ఆ వ్యసనం తప్పా మరొక చెడ్డ అలవాటు లేదు,ఇప్పుడంటే నన్ను తిడుతున్నారు గాని పెళ్ళయిన కొత్తలో ఎంత ప్రేమ గా చూసే వారో ,ఎలా వదిలేసి నా దారి నేను చూసుకోను అంటుంది ..అది భర్త మీద ప్రేమ ..
'అంటే ఈ దేశం లో ఎవరు కండోంస్ వాడట్లేదా...కేవలం పిల్లల కోసమే కలుస్తున్నారా....'
ఈ లైను చాలు నువ్వు అసలు ఏది అర్దం చేసుకోవని,నువ్వనుకున్న మనీ ,పవర్,సెక్స్ ముఖ్యం అనుకుంటే అసలు అడ్డం గా పిల్లలు ఎందుకూ? పెళ్ళి ఎందుకు స్వేచ్చగా జంతువుల్లా 10 మందితో అదే మనీ వాళ్ళ మొహం మీద పడెసి మన కోరిక తీర్చుకోవచ్చు కదా ,పెళ్ళి ఎందుకు దండగా..
ఎందుకంటే మన పెద్దలు ముందే ఇలాంటి విచ్చల విడితనం జంతువులకే తప్పా మానవ మనుగడకు మంచిది కాదని కొన్ని నిర్దుష్టమైన విదానాలు మనకు చెప్పారు.. వాటిని మనం ఇంకా ప్రేమిస్తున్నాం కాబట్టే ఈ సమాజం ఇంకా ఇలా ఉంది..
నువ్వు అన్నట్లుగా ఈ దేశానికి ఏదన్నా చేయాలంటే, ఇంకా తోటి వారికి మంచి చేయాలంటే సెక్సో పవరో మనియో ఉంటే చేయక్కరలేదు మనకున్నదానిలోనే చేయచ్చు..
చివరిగా ఏమన్నావ్ నాలుగు పూటలా తిను...నీ పిల్లలు...బందువులు చూస్తుండగా...పిరికి వాడిలాగ చని పో....
అవును ఈ మనీ సెక్స్ పవర్ ల కోసం పాకులాడి అందరి చేత చ్చీ అనిపించుకుని మనకంటూ ఎవరూ లేకా కుక్క చావు చచ్చే కంటే అందరినీ ప్రేమిస్తూ అందరి మద్యా చావడం ఎంతో ఉన్నతం నా దృష్టి లో
నువ్వు కాగడా శర్మ వనే అనిపిస్తుంది కాకపోయినా నా సిద్దంతం ఇదే మనిషికన్నిటికంటే ప్రేమ ముక్యం..

కామేశ్వరరావు said...

మహేష్ గారు,

ఈ వ్యాఖ్య రాస్తున్నది మీ నిర్ణయాన్ని సమర్ధించడానికో తప్పుబట్టడానికో (అలా చెయ్యడానికి నేనన్విర్ని!) కాదు. మీతో ఉట్టినే వాదించడానికీ కాదు. బ్లాగడం గురించి నాకున్న అస్పష్టతని తొలగించుకొనే ప్రయత్నమిది.
"నా ఆలోచనలూ, అభిప్రాయాలూ,భావజాలం ఇతరులపై రుద్దే ఉద్దేశంగానీ ఆశయంగానీ ఎప్పుడూ నాకు లేదు. బ్లాగు రాయడంద్వారా వాటికి జనామోదంగానీ, ప్రజాదరణగానీ మూటగట్టాలనే ఆలోచనా ఎప్పుడూ రాలేదు."
"As I am interested in living my own life rather than propagating what I believe in."

మీ అభిప్రాయాల ద్వారా ఇతరులు మారాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, మీ నమ్మకాలని ప్రచారం చెయ్యడం ఇష్టం లేనప్పుడు అసలు మీ ఆలోచనలని బ్లాగు రూపంలో పెట్టడం ఏందుకు? పదిమందితో మీ నమ్మకాలని కాని అభిప్రాయాలని కాని పంచుకోడం ప్రచారం అవ్వదా?
ఇతర బ్లాగుల్లో మీరు వ్యాఖ్యలు రాస్తే మాత్రం అది మీ ఆలోచనల, నమ్మకాల ప్రచారం అవ్వదా? మరది ఎందుకు మాననంటున్నారు?
మీరు మీ బ్లాగులో కాని, ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యల్లో కాని ఇచ్చేది కేవలం సమాచారం అయితే అది వేరే విషయం. కాని వాటిలో మీ అభిప్రాయాలు, నమ్మకాలు వ్యక్తమైతే, అది మీ ఆశయానికి భంగం కాదా?
ఒక వ్యక్తి కేవలం తనకోసమే రాసుకొనేమాటైతే దానికి బ్లాగెందుకు? కవిత్వం నేను నా కోసం "మాత్రమే" రాసుకొనేది అని చెప్పే కవి, ఆ కవిత్వాన్ని ప్రచురించడం లాంటిదే కాదా ఇది?

Anonymous said...

నేను మల్లి కష్ట పడదలుసుకు లేదు....నీను పైన చెప్పిందాన్ని నువ్వు చాలా పర్సెనల్ గా తీసుకున్నావ్....నిన్ను అవమానించే వుద్దేస్యం నాకు అసలు లేదు....నీను కూడ అంత కామ పిశాచాన్ని కాను....అవి జస్ట్ e.g...genrally everybody writes my frend...but I dont have any probs that is why I mention me as the person...but they are real....

ఇప్పుడున్న పరిస్థితుల్లో .....మనమేమి చెస్తే టాప్ 50 కంట్రిస్ లో వుంటాం చెప్పు ....?
మనం Idealistic గా వుందామా లేదా సాద్యమైనంత తొందరగా MaterialisTic గా మారి మన దేసాన్ని ముందుకి తీసుకెలదామా....నువ్వే చెప్పు....నీను పైన కస్టపడిన విధంగా కాక ఇంకెదైనా మార్గం వుందేమో చెప్పు....పాటించడానికి నీను రేడీ....ఎవరైనా చెప్పొచు.....ప్రాబ్లెం అల్రేడి వుంది కావల్సింది "Solution ".....
నీను అల్రేడి చెప్పాను...ఇది materialistic వరల్డ్ అని...మరి ఇప్పుడు నువ్వు చెప్పు ....ఎలా వెలదాం ముందుకి.... ఎలా మన కంట్రీ ని WIN/WIN గా మారుద్దాం చెప్పు....at least next TEN years లో టాప్ ఫిఫ్టి లో వుండే మార్గం వుందేమో చెప్పు.......ఎవరేమి చేసినా.... నా దేశం పేద కంట్రి లిస్ట్ లో వుండడం నాకు ఇష్టం లేదు...

చివరగా ఒక్క విషయం...ఈ క్రింది లైనే నా జీవితాన్ని మార్చింది....

>>>ఈ మనీ సెక్స్ పవర్ ల కోసం పాకులాడి "అందరి చేత చ్చీ" అనిపించుకుని మనకంటూ ఎవరూ లేకా కుక్క చావు చచ్చే కంటే...


"ఆ నలుగురు" ఎవరో తెలుసుకోవడమే జీవితం....."చి" అంటే తెలుసు కోవడమే జీవితం....నువ్వు జాగర్తగా చూడు "ఏ నలుగురైతే " నిన్ను మోస్తారో వాల్లే జీవితంతం నీకు "సుఖం" లేకుండా చేస్తారు....


మనిద్దరం వాదించు కోవడం కన్నా ఒక Solution ని తీసుకొద్దాం అది పాటిస్తే వచే లాభాలు నష్టాలు ఆలోచిద్దాం....నీ solution కోసం ఎదురు చూస్తాను...

Anonymous said...

నాకేమీ మీ పైన వ్యక్తిగత ద్వేషం లేదు కానీ కొన్ని టపాలలో మీరు నిరాశావాది లాగ వాదిస్తున్నారని నేను విమర్శలు వ్రాయడం జరిగింది.

Bolloju Baba said...

dear mahesh
your are always interesting.

though chalaM moved to ramanacalam. telugu people still admire him.

Anonymous said...

అసలు కథ వినండి.

లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో...

ఇంటర్నెట్ అప్పుడప్పుడే మన (అంటే తెలుగువాళ్లకీ)కి చేరవయింది.గంటకి 60 రూపాయలనుంచి పది రూపాయలకే ఇంటర్నెట్ కెఫేలు రన్ కావడం మొదలయ్యాయి.ఆ రోజుల్లో ఇంటర్నెట్ ఎలా ఉండేదంటే అంతా ఆంగ్లమయం. ఛస్ ఎన్ని రోజులు ఇలా ఆంగ్లంలో చదువుతామని జనాలు ఇంగ్లీషు లెటర్స్ వాడి తెలుగులో రాయడం మొదలుపెట్టారు. ఇంకా కొన్నాళ్ళకి తెలుగు ఫాంట్లను ఇమేజ్ ఫైల్స్ గా రెండర్ చేయడం ద్వారా కొన్ని తెలుగు సైట్లు పుట్టుకొచ్చాయి. ఇంకా కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే తెలుగు ఫాంట్స్ ని డైరెక్ట్ గా వెబ్ సైట్లలో డిస్ప్లే చెయ్యగలిగేలా ప్రగతి సాధించారు. అలా పుట్టిన ఒక సైటు తెలుగు పీపుల్ డాట్ కాం.ఆ రోజుల్లో ఫుర్తిగా తెలుగులో ఉన్న ఒకే ఒక్క సైటు ఇదే. చాలా కాలం, నిజానికీ ఇప్పటికీ ఇందులో చాలామంది సభ్యులే ఉన్నారు, ఈ సైటు ద్వారా ఎంతో మంది తమ వ్యాసాలు, కథలు, కవితలు అచ్చ తెలుగులో పంచుకున్నారు. ఈ విధంగా అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి ఎంతో కౄషి చేసిన వారిలో తెలుగు పీప్పుల్ డాట్ కాం వాళ్ళు కూడా ముఖ్యులు. కాకపోతే తెలుగు పీపుల్ డాట్ కాం సాధించినట్టుగా చాలా మంది తమ వెబ్ సైట్లలో తెలుగు వ్యాసాలు, కథలు, కవితలు వ్రాయడం మొదలుపెట్టినా చాలా కాలం విలవలేక పోయాయి. ఇలా తెలుగు ఫాంత్లతో సైటు నడపడం ఒక విధంగా కష్తమైన పనే అని ప్రయత్నించిన వారికెవరికైనా తెలుస్తుంది. అందుకే ఇప్పటికీ చాలా వెబ్ సైట్లలో తెలుగు ఫాంత్లు కాకుండా తెలుగుని ఇమేజ్ ఫైల్స్ గా రెండర్ చేసి చూపిస్తున్నారు.

Anonymous said...

ఇప్పుడు అసలు కథ.
ఐదారఏళ్ళ క్రితం యీనికోడ్ అని ఒకటి పుట్టుకొచ్చింది. ఈ యూనికోడ్ ద్వారా పెద్దగా కష్టపడకుండానే తెలుగులో వెబ్ సైట్లను తయారు చెయ్యవచ్చు. ఈ యూనికోడ్ సౌకర్యంతోపాటు బ్లాగులు కూడా అప్పుడే పుట్టుకొచ్చాయి. నీపేరుతో నీకొక సైటు, దాంతో పాటు తెలుగులో ఎంచక్కా వ్రాయగలిగే సౌకర్యం రెండూ అందుబాటులోకి రావడం అప్పట్లో అందరికీ తెలియదు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇలాంటివి ఫస్ట్ క్యాచ్ చేస్తారు కాబట్టి కొంతమంది సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళు తమ బ్లాగులు తెలుగులో వ్రాయడం మొదలుపెట్టారు. అరే ఇదేదో బావుంది కదా అని మరి కొంత మంది ...ఇలా పాకి పాకి ఈ రోజు దాదాపు వెయ్యికి పైగానే బ్లాగర్లు తెలుగులో పుట్టుకొచ్చారు.
ఇక వివాదం.

తెలుగు పీపుల్ లో చాలా మంది సభ్యులు తమ తమ వ్యాసాల ద్వారా స్నేహితులు, శత్రువులు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలుగు పీపుల్ లో ఒక బాధేమిటంటే సభ్యుడికంటూ పెద్ద ఐడెంటిటీ ఉండదు. అంతా ఒకే గుంపు. అఫ్ కోర్స్ మనకొక ఐడి ఉంటుంది కానీ ఒక బ్లాగుతో కంపేర్ చెస్తే అది పెద్ద ఐడెంటిటీ కాదు. ఇక బ్లాగు సంగతి వేరు. మీ పేరు రమేహ్ అయితే రమేష్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కాం అని మీ బ్లాగుకి పేరు పెట్టెయ్యొచ్చు. ఈ సౌకార్యం గురించి సాఫ్ట్ వేర్ వాళ్ళే బాగా తెలుసుకున్నారు కనుక ఎక్కువ సాఫేత్ వేర్ వాళ్ళే మొదట బ్లాగులు పెట్టుకున్నారు. సాఫ్ట్ వేర్ వాళ్లల్లో అందరూ కాకపోయినా కొంతమంది బాగానే వ్రాసే వాళ్ళున్నారు. ఇలా కొన్ని మంచి బ్లాగర్స్ వల్ల తెలుగు బ్లాగర్స్ అనే ఒక ఐడెంటిటి క్రియేట్ అయ్యింది. అయితే ఈ బ్లాగర్లు ఒక టైపు. నువ్వు నాకు కామెంట్ రాస్తే నేను నీకు కామెంట్ రాస్తా అనేది వీళ్ళ మంత్రం. ఎవరైనా నూతన బ్లాగర్ వచ్చాడంటే వెల్కం, స్వాగతం అనీ తెగ కామెంట్లు రాస్తారు. ఒక బ్లాగర్ తను రాసిందిం జనాలకి నచ్చిందా లేదా తెలుసుకోడానికి ఉపయోగపడే ఆటిల్లో ముఖ్యమైనవి కామెంట్స్. సో జనాలు వావ్ నా పోస్టుకి ఇన్ని కామెంత్స్ వచ్చాయి అని మురిసిపోతుంటారు. ఇంకేముంది మన నూతన బ్లాగరు రెచ్చిపోయి రాస్తాడు. ఈ రాయడంలో మిగిలిన తెలుగు బ్లాగుల గురించి పెద్దగా పట్టించుకోడు. తను రాసుకుంటూ పోతుంటాడు. కొన్నాళ్ళకి కామెంట్లు తగ్గిపోతాయి. చివరకి ఎంత బాగా రాసాననుకున్నా ఒక్క కామెంటూ రాదు. ఎందుకంటే తెలుగు బ్లాగు ప్రపంచంలో ఇదో జబ్బు. అంతా ఇచ్చి పుచ్చుకోవడమే. అదీ కాక తెలుగు బ్లాగర్లు పెట్టుకున్న పొద్దు అనే వెబ్ పత్రికలో ఈ పోస్టు కి ఇన్ని కామెంట్లు వచ్చాయి టైపు పొగడ్తలు ఉంటాయి. కాబట్టి ఈ బ్లాగ్ ప్రపంచంలో కామెంట్లు తెచ్చుకుంటూ నిలబడాలంటే చదివిన ప్రతి పోస్టుకీ నేనున్నానంటూ 'హహహా అనో మొక్కుబడిగా 'బావుందీ అనో లేదా ఒక స్మైలీ పెట్టో కామెంటావనుకో ఈ సారి నువ్వు రాస్తే వాడు వచ్చి ఇలాంటి కామెంటే ఒకటేస్తాడు నీ బ్లాగు కామెట్లతో కలకలలాడుతుంది.

Anonymous said...

ఇది కామెంట్ల వరకే. ఇక కొంత మంది బ్లాగర్లున్నారు. వాళ్ళు తమ బ్లాగులో రోజుకొక పోస్టు రాయాల్సిందే. ఆ రోజూ ఈమీ లేకపోతే యూ ట్యూబ్ లోనుంచి ఒక పాట తెచ్చి మంచి పాట వింటారా? అనో లేదా ఆ రోజు ఎవరిదైనా బర్త్ డే అయితే వాళ్లకి శుభాకాంక్షలు చెప్తూనో, లేదా అప్పుడే జరిగిన ఒక సెన్సేషనల్ సంఘటన గురించి, ఉన్న్న న్యూస్ రిసోర్సస్ చాలవన్నట్టు, మల్లీ తమ బ్లాగులో పోస్టుతారు. ఇలా ఒక విధంగా బ్లాగుకి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇలా మొదలయినా తెలుగు బ్లాగింగ్ ఒక పెద్ద కమ్యూనిటీగా మారింది. వీళ్లలో కొంతమంది బడా బ్లాగర్లు గా మారారు. ఎలా అంటే వీళ్ళు అన్ని బ్లాగులు చదివి వాళ్లకి కామెంట్లు రాస్తుంటారు. అలా నేనున్నానని అందరికీ తెలియచేయడమే కాకుండా నా బ్లాగులో మీ గురించి, మీ బ్లాగులో నా గురించి ఇంతర్వ్యూలు, బ్లాగ్ పరిచయాలు ఇలా మరో రకమైన ఇచ్చి పుచ్చుకోవడం బాగా జరిగాయి. పొద్దు అనే పత్రికలో అయితే కొన్నాళ్ళు బ్లాగర్స్ ఏదో పెద్ద సెలబ్రిటీల్లాగా వాళ్లని నెలకొకరిని పరిచయం చేసే వారు. ఇదంతా చూసి బ్లాగ్ లోకం వదిలి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది వున్నారు.
అలాగే తెలుగు బ్లాగుల గురించి పత్రికల్లో కూడా రావడం మొదలయింది. బ్లాగ్ లోకంలో ఇలా జరుగుతుండగా అక్కడ తెలుగు పీపుల్ లో చాలా ఏళ్ళుగా తెలుగులో రాస్తూ ఉన్న వాళ్ళకి ఈ బ్లాగుల గురించి తెలిసింది. అప్పటికే చాలామంది తెలుగు పీపుల్ వదిలి ఆవకయ, జాం కాయ అని కొన్ని వెబ్ సైట్లు పెట్టి యూనికోడ్ లో తెలుగు వ్యాసాలు రాయాలని ప్రయత్నించినా ఆది పెద్ద ఫెయిల్యూరే అయింది. కొన్నాళ్ళూ ఆ సైట్ల ద్వారానే బ్లాగర్లను ఎగతాళి చెయ్యడానికి ఉపయోగించారు కానీం అక్కడికి వెళ్ళే తెలుగు బ్లాగర్లు తక్కువ కావడంతో వాళ్ళు అనుకున్న ఫలితాలు లభించలేదు. కొన్నాళ్ళు చూసాక మనమూ చూద్దాం అసలీ బ్లాగుల సంగతేంటో అని ఇటొచ్చారు అక్కడి జనాలు.
వచ్చిన వాళ్ళు ఆలా ఎక్కువ expectations తో వచ్చారేమో, ఇక్కడ (తెలుగు బ్లాగులు) చూస్తే ఇక్కడ గొప్పగా అంటూ పెద్దగా ఏమీ లేకపోగా ఎంతసేపటికీ తెలుగు బ్లాగు, వాటి చరిత్ర, తెలుగు బ్లాగుల్లో ఫేమస్ బ్లాగర్లు ఇలా బావి లో కప్పల్లాగా అంతా తమ బ్లాగూల చుట్టూనే తిరుగుతున్న భాగోతం చూసి ఒళ్ళుమండినట్టుంది. అసలే కాస్తా దెబ్బ తిన్న పులులు వీళ్ళు. ఎందుకంటే ఇన్నాళ్ళూ అక్కడా ఇక్కడా తెలుగు లో వ్రాయడానికి కృషి చేస్తూ వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇక్కడ చూస్తే చదువుకున్నోళ్ళు, చదువు రానోళ్ళూ అసలు ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని వాళ్ళూ కూడా ఏ టూ జెడ్ వ్రాసేస్తుండం బాధ కలిగించింది. అంతే కాదు తెలుగు ని బతికిస్తాం అని తెగ హడావుడి చేస్తున్న ఈ బ్లాగర్లు ఇప్పటి దాకా తాము (అంటే తెలుగు పీపుల్ లాంటి సైట్ల సభ్యులు) చేసిందంతా తెలుగు వ్యాప్తి కోసం కృషి కాదా? ఎందుకు వీళ్ళే పెద్ద సేవకుల్లా ఫీలయిపోతున్నారని మండిపోయింది.

Anonymous said...

ఇక్కడే అసలు గొడవ మొదలయింది.తెలుగు బ్లాగర్లపై ఉన్న అక్కసు ప్రదర్శించడానికి తాము తెలుగు బ్లాగులు మొదలుపెట్టారు. ఒక్కక్కొరిగా తెలూగ్ బ్లాగర్లని అటాక్ చెయ్యడం మొదలుపెట్టారు.
ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే తెలుగు బ్లాగర్లందరూ ఒక కుటూంబం అన్న ఒక పెద్ద భ్రమ వీడిపోవడానికి వీళ్ళు కారణమయ్యారు. కొంతమంది ఫేమస్ తెలుగు బ్లాగర్లని వేరే వాళ్ళు అటాక్ చెస్తుంటే చాలా మంది తెలుగు బ్లాగల్రు వాళ్ళకి సపోర్ట్ గా నిలవలేదు సరికదా, అటాక్ చేస్తున్నా వారితో చేతులు కలిపారు.
ఇందుకు కారణాలేంటంటే, తమకంటూ ఒక అస్థిత్వం లేని వాళ్ళు బ్లాగు ద్వారా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని తమేదో లెజెండ్ లు సెలబ్రిటీ లు అయినట్టు సంతోషపడిపోయారు. చాలామందికి ఈ విషయం బొత్తిగా నచ్చలేదు.
ఇక ఈ తెలుగు అని ఒక గ్రూపు ఏర్పాటు చేసి ఏదో సాధిస్తున్నామని చెప్పుకునే వాళ్ళంతా వాళ్ళ అసలు ఎజెండా ఏంటో కూడా తెలియక సతమతమయ్యారు. ఈ గ్రూపు లో పెద్దలు ఎలా ఉన్నారంటే మనలో పుట్టి పెరిగి ఎమ్మెల్యే నో ఎంపీ నో ఆయిన ఒక రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తారు. మనమేం చెప్పినా వాళ్ళు వినరు. అంతా వాళ్ళిషటమొచ్చినట్టే చేస్తారు. కొంతమంది అనుమానం ఏంటంటే వీళ్ళూ ఈ సంఘం ద్వారా ప్రభుత్వాన్ని బతిమాలో బెదిరించో డబ్బులు దండుకోవడమే కాకుండా ఇళ్ల స్థలాలు కూడా కొట్టేయ్యాలని ప్లాన్ చేస్తున్నారని.


ఇలా తవ్వుకుంటూ పోతే బ్లాగ్ ప్రపంచంలో ఎన్నో భాగోతాలు. చేసిందేమీ లాకపోయినా తెలుగు బ్లాగర్స్ అంటే ప్రజా రాజ్యం పార్టీ కంటే పెద్ద పార్టీలా వీళ్ళ ఫోజులు.
వీళ్లిలా ఉంటే అటు తెలుగు పీపుల్ ఆ టైపింగ్ తో చావలేక, ఇక్కడ తెలుగు బ్లాగ్ ప్రపంచంలో లేట్ గా వచ్చి పెద్దగా ఫేమస్ కాలేక పోయిన మిగిలిన వాళ్ళూ ఒక రకం. వీళ్ల బాధ తెలుగు బ్లాగర్ల మీదకంటే తాము ఫేమస్ అయ్యే మార్గం ఇక లేకపోయిందనే ఆవేదనే. అందుకే అటాక్ మొదలుపెట్టారు. ఒక విధంగా గెలిచారు కూడా.
అయితే ఈ గందరగోళంలో తేలిందేమిటంటే తెలుగు బ్లాగుల్లో అంతా సవ్యంగా లేదనే.కాకపోతే ఈ గందరఓళంలో ఎఫెక్ట్ అయిన బ్లాగర్లు ఎవరంటే ఏదో ఊసుపోక సరదాగా బ్లాగు రాసుకునే వాళ్ళు కాదు. అలాగే ఒక విషయం పై మంచి అవగాహన ఉండి ఆ విషయాల్ని అందరితో పంచుకునే వాళ్ళు కూడా కాదు. ఇంతకీ దెబ్బతిన్న వాళ్ళు ఎవరంటే హిట్ల కోసం తాపత్రయపడి, ఉన్నదీ లేనిదీ రాస్తు ఎడా పెడా నోటికొచ్చింది వ్రాసే వాళ్ళు, నేనో పెద్ద ఆరిందా అని కేవలం సెన్సేషనల్ విషయాల గురించి వ్రాసే వాళ్ళు, తెలుగు బ్లాగర్ల కుటుంబమనే ఒక లేని బృందాన్ని సృష్టించి అందులో తమకు నచ్చిన వాళ్ళ గురించి పొగుడుతూ రాసే వాళ్ళు, ఇంకా పనీ పాట లేకుండా బ్లాగుల చుట్టూ తిరుగుతూ భజన చేసే వాళ్ళు ఈ అటాక్ లో బాగా గాయపడ్డారు.ఎవరూ అటాక్ చెయ్యకుండానే అత్యాశ కి పోయి బ్లాగు ద్వారా ఏదేదో చేసేద్దామనుకునే వాళ్ళు వాళ్ళని వాళ్ళే గాయపరుచుకున్నారు. కొంతమంది బ్లాగులు వదిలేసి పారిపొయ్యారు కూడా. ఈ అటాక్ లో కొంతమంది మంచి బ్లాగర్లు కూడా అనవసరంగా మాట పడిన మాట నిజం. అయితే ఈ గందరగోళం లో నేర్చుకోవాల్సిన లెసన్స్ చాలా ఉన్నాయి. అవేంటో నేను చెప్పక్కర్లేదు. బ్లాగర్లందరికీ తెలుసనే అనుకుంటాను.

సూర్యుడు said...

భలే :-) ఇద్దరు ఆకాశరామన్నలు కలిసి భారతదేశాని మొదటి 50 జాబితాలోకి చేర్చే ప్రయత్నంలో ఉన్నారు :-)

ఆర్కిమెడిస్ లా "నాకు ఒక్క బ్లాగుకామెంట్ వ్రాసే అవకాశమిస్తే భారతదేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేస్తాను" :-)

Anonymous said...

ఇవన్నీ చదువుతుంటే చాలా కామెడీగా వుంది. సాంకేతిక విషయాలు పెద్దగా తెలీకపోతే జనాలు సిట్ కామ్ ఎలా మొదలెడతారో ఇక్కడ చూడొచ్చు.

కూడలి, జల్లెడలు అసలు ఏమిటి? అవేమైనా భవంతులా బయటకు పోవటానికి ? పోతే ఏమైనా అభిప్రాయాలు మారుతాయా?

ఎద్దు తోక తొక్కింది. పిల్లి ఎలక వైపు ఎర్రగా చూసింది. అంతే.

జీడిపప్పు said...

మహేష్ గారు, ఇందాకే కూడలిలో కుడి వైపున వ్యాఖ్యల జాబితాలో మీ పేరు, వ్యాఖ్య కనిపించింది. కూడలి జల్లెడలాంటి "భ్రమ"లకు దూరంగా ఉండాలనుకుంటున్నారు కదా. 1) కూడలిలో ఉన్న బ్లాగుల్లో మీరు వ్యాఖ్యలు చేయకపోవడం 2) మారు పేరుతో లేదా anonymous గా వ్యాఖ్యలు వేయడం. ఈ రెంటిలో ఏదో ఒకదానివల్ల వల్ల మీ పేరు కూడలిలాంటి gated communityలో కనపడదు. ఆ విధంగా మీ ప్రయత్నం సులభమవుతుంది

Kathi Mahesh Kumar said...

@జీడిపప్పు: ఈ నా టపాని మరొసారి శ్రద్ధగా చదువుకోండి.

Anonymous said...

anonymous - awesome explanation!!

Malakpet Rowdy said...

వీళ్లిలా ఉంటే అటు తెలుగు పీపుల్ ఆ టైపింగ్ తో చావలేక, ఇక్కడ తెలుగు బ్లాగ్ ప్రపంచంలో లేట్ గా వచ్చి పెద్దగా ఫేమస్ కాలేక పోయిన మిగిలిన వాళ్ళూ ఒక రకం. వీళ్ల బాధ తెలుగు బ్లాగర్ల మీదకంటే తాము ఫేమస్ అయ్యే మార్గం ఇక లేకపోయిందనే ఆవేదనే. అందుకే అటాక్ మొదలుపెట్టారు. ఒక విధంగా గెలిచారు కూడా.
___________________________________


ఇంకో రాయి పడిండొచ్! కానీ ఒక్కటే ప్రాబ్లం ఇక్కడ. ఇంటర్నెట్ లో గెలుపు - ఓటమి అనే ప్రసక్తే ఉండదని తెలియదా ఎనానిమస్?

gaddeswarup said...

Mahesh garu,
I have not really been following any blog regularly except a few like 3quarksdaly. The few times that I visited your blog, I found the posts interesting. I hope that you will continue.
I find that blog are useful for learning and discussions after a while are a distraction. But blogs do give a diversity of views and reference and I find that eventhough I do not heavily participate in discussions, my views have been changing from reading blogs and what they lead to.
With best regards,
Swarup

Anonymous said...

@సూరీడు....
నీ వెటకారానికి థాంక్స్....ఇద్దరు అనామకులు దేశాన్ని మారుస్తారంట....అని వెటకారంగా అన్నావు గా....నీకో చిన్న suggestion వీలుంటే Denzel Washington direct చేసిన "The Great Debators(2006)" అనే సినెమా చూడు....కొన్ని సమస్యల్ని "Debating" ద్వార ఎలా సాల్వ్ చేసుకోవచో నీకు అర్దం అవుతుంది...Its a real story....

ఇంక అనామకుల విషయానికి వస్తే.....
>>>>ఎందుకంటే మన పెద్దలు ముందే ఇలాంటి విచ్చల విడితనం జంతువులకే తప్పా మానవ మనుగడకు మంచిది కాదని కొన్ని నిర్దుష్టమైన విదానాలు మనకు చెప్పారు....
--నాకు మన దేసం లో నచ్చిన ఒకే ఒక్క విషయం ఏదైనా వుందంటే ఇదే....నిజమే జంతువులను మనుషులను విడదీసే ఒకే ఒక్క విషయం "విచ్చలవిడితనం"....
>>>మన పెద్దలు...

ఎవరు వాల్లు.....ఎక్కడుంటారు....ఎలాంటి పరిస్తుతుల్లో ఇలాంటి నియమాల్ని రూపొందిచారు....
>>>>నిర్దుష్టమైన విదానాలు మనకు చెప్పారు...

నిర్దుష్టమైన అంటే....నీ వుద్దేస్యం....దీనికొక పుస్తకం లాంటిది వుంటుందనేగా....వుంటే అది ఎక్కడ వుంది....నాకు చెప్పు....క్రిస్టియన్ లకు టెన్ కమాండ్మెంట్స్ వున్నట్టు....మనకు అలాంటివి ఏమైనా వున్నాయా.....వుంటే దయ చేసి నాకు చెప్పు....వాటిని పాటించడానికి నీను రెడీ...
రామాయణం లో మాత్రం నాకు అస్సలు కనిపించలేదు.....ఒకవేల నువ్వు చదివిన వర్షన్ లో వుంటే...నాకు చెప్పు.....పరిశీలిద్దాం....
>>>>విచ్చల విడితనం జంతువులకే తప్పా....

జంతువలని అంత చీప్ గా తీసెయ్యకు....
ఇంత వరకు ఏ జంతువు ఆడ జంతువుల మీద యాసిడ్ పొయ్యలేదు....
ఏ జంతువు డబ్బు కోసం ఇంకో జంతువును చంపలేదు....
ఏ జతువు ల సమూహం కూడా ఆడ జంతువుల కోసం యుద్దం చేయలేదు....
అంతెందుకు గడిచిన 5000 సంవత్సరాలలో ఏ జంతువు కూడా హాస్పిటల్ గడప తొక్కలేదు...బలిసిన జంతువులు తప్ప...
ఏ ఒక్క జంతువు కూడా సైకాలజిస్ట్ ని కలవలేదు....సమరాన్ని కలవ లేదు....
ఏ శునకము కూడా ఆడ శునకాల్ని తాకి "శునకానందాన్ని" పొందలేదు....
ఏ జంతువు కి కూడా సుగర్ కాని, బిపి కాని వున్నట్టు చరిత్రలో లేదు...
ఏ జంతువు కూడా కనపడని దేవుడికోసం కొట్టుకోలేదు.....
అన్నింటి కన్నా ముఖ్యంగా ఏ జంతువు ఇంతవరకు బ్లాగ్ రాయలేదు....రాసినా వాదించుకోలేదు....
ఇంతవరకు ఏ కుక్క కూడ ఇంకో కుక్కని "పంది చావు చావు " అని అనలేదు....
ఏ జంతువు ఇంకో జంతువుని తిట్టదు , అవమానించదు , అసలు వాటి మద్య కులాలు మతాలని తేడానే లేదు....
ఏ జంతువు కూడా తల్లి దండ్రులు పెడుతుంటే తిని సోమరిపోతుల్లా తయారవ్వలేదు.....
ఏ జంతువు జైలుకెల్ల లేదు, మోసం చెయ్యలేదు, ఫ్రీడం కోసం ఫైట్ చేయలేదు...
దేవుడా నువ్వు నిజంగా వుండి వుంటే ...నేను నిన్ను ఎదురిస్తున్నట్ట్లైతే...నన్ను వచ్చే జన్మలో జంతువు గా పుట్టించు....స్వేచ్చగా నాలుగు రోజులు బతకాలని వుంది....

>>>>అవును ఈ "మనీ,సెక్స్,పవర్" ల కోసం పాకులాడి "అందరి" చేత "చ్చీ" అనిపించుకుని మనకంటూ ఎవరూ లేకా "కుక్క చావు" చచ్చే కంటే అందరినీ "ప్రేమిస్తూ" అందరి మద్యా చావడం ఎంతో "ఉన్నతం" నా దృష్టి లో
నువ్వు "కాగడా శర్మ" వనే అనిపిస్తుంది కాకపోయినా నా సిద్దంతం ఇదే మనిషికన్నిటికంటే "ప్రేమ" ముక్యం....

ఇది నాయనా అసలు ప్రశ్న అంటే....దీన్ని ప్రశ్న అనే కంటే అభిప్రాయం అంటే మంచిదేమో....ఇది నీ అభిప్రాయం కాదు.... 3000 సంవత్సరాల క్రితం....కురుక్షేత్ర సంగ్రామం లో యుద్దం ఎందుకు చెయవు అని క్రిష్ణ భగవానుడు అడిగితే ...అర్జునుడు చెప్పిన అభిప్రాయం కూడా ఇదే.....
యుద్దం లో రాజ్యం కోసం తమ ప్రాణాల్ని కూడా లెక్క చేయక నిలబడ్డ...తన బంధువులని చూసి అర్జునుడు క్రిష్ణుడితో ఇలా అంటాడు....
"క్రిష్ణా యుద్దం లో గెలిస్తే లభించే రాజభోగాలు (Power,Money,Sex) కోసం మన వాల్లని చంపడం ఎంత వరకు న్యాయమో నాకు అర్దం కావట్లేదు...యుద్దం లో మన వాల్లని చంపడం కన్నా హాయిగా అడవిలో పాంచాలి తో తొక్కుడు బిల్ల, కోతి కొమ్మచ్చి ,అష్టా చమ్మా ఆడు కోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది...." .
అని చేతిలో వున్న AK-47 విసిరేసిన అర్జునిని తో క్రిష్ణుడేమన్నాడో నువ్వే వెల్లి చదువు....

http://www.telugubhakti.com/telugupages/Gita/Gita.html

రాజభొగాల కోసం యుద్దం చేయ మన్నాడా లేక....సన్నాసి లాగ కూర్చో మన్నాడో నువ్వే వెల్లి తెలుసుకో .....
ఏది ఏమైనా నీకు మెని థాంక్స్......నీవల్ల కొద్ది రోజుల విరామం తర్వాత బగవద్గీత మల్లీ చదివాను....
నీను .., కాగడా ఒకటేమో గాని ....నేను "క్రిష్ణుడు" ఒకటి మాత్రం కాదు ....నువ్విది గుర్తిస్తే చాలు...
WARNING: though gita is a good book ,It has got corrupted in some of its Sloakas...read at your own risk...my rating 3.8/5....Read,Realize,Enjoy....

Padmarpita said...

మహేష్ గారూ....మరి మాలాంటి చిన్ని బ్లాగర్స్ వైపు కన్నెత్తికూడా చూడరా???
మేమేం పాపం చేసామండి???

Praveen Mandangi said...

బ్లాగడం ఎందుకు ఆపాలి? హిందూత్వవాదుల్ని సంతృప్తి పరచడానికా?

--- మార్తాండ