మొదటి సినిమా "పాంచ్" ఇప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ వాళ్ళు ఆపేసారు. రెండో సినిమా "బ్లాక్ ఫ్రైడే" విడదలచెయ్యకుండా దాదాపు మూడు సంవత్సరాలు కోర్టు ఆపేసింది. ఆ తరువాత "నో స్మోకింగ్" అని తనకు తప్ప చాలా మందికి అర్థం కాని ప్రయోగాన్ని చేసి ‘బాగుంది కానీ అర్థం కాలేదు’ అనిపించుకున్నాడు. ఈ మధ్యనే దేవదాసుకు "దేవ్ డి" అని కొత్త భాష్యం చెప్పిన అనురాగ్ కశ్యప్ మరొక్కసారి ప్రేక్షకుల్ని తన సినెమాటిక్ ఫైర్ తో అబ్బురచిరిచిన చిత్రం "గులాల్".
సమకాలీన భారతీయ సినీదర్శకుల్లో ఇంత అలజడిని, భవిష్యత్తుపై ఆశనూ కలిగించిన మరో దర్శకుడు లేడేమో! ఇప్పటి వరకూ తను తీసిన చిత్రాలు తన వ్యక్తిగత expression కూ, cinematic excellence కూ, విషయవస్తువులోని integrity కీ మధ్య పొంతన కుదరని ప్రయత్నాలుగా మిగిలిపోయాయి. కానీ వాటిని అధిగమించి ఒక పూర్ణచిత్రంగా ఆవిర్భవించిన సినిమా, గులాల్ అని చెప్పుకోవచ్చు.
కథా పరంగా రాజస్థాన్ ప్రాంతాన్ని కథా ప్రదేశంగా ఎంచుకున్నా, సమస్త భారతదేశానికీ అన్వయించుకోదగిన ఒక శక్తివంతమైన సామాజిక,రాజకీయ, వ్యక్తిగత కోణాల్ని గులాల్ అనే రంగులరాట్నంలో కలగలిపి, ప్రేక్షకుడికి ఒకవైపు నేలపైనున్న నిజాల్ని చూపిస్తూనే తన స్క్రీన్ ప్లే తో, సాంకేతిక నైపుణ్యంతో ఆకాశాన్ని మించిన ఆలోచనల్ని అందించడంలో అనురాగ్ కశ్యప్ సఫలమయ్యాడు. ఇదొక అరుదైన ప్రయోగం. అర్థవంతమైన ప్రయత్నం. అధ్బుతమైన సినిమా లోకం.
పూర్తి సమీక్ష కోసం నవతరంగం చదవండి.
Monday, March 16, 2009
రాజకీయ ‘రంగు’లరాట్నం - గులాల్
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
Dev D చూసాను... మధ్య మధ్యలో కాస్త బోర్ గా అనిపించినా... దేవదాస్ కథని ఆధునీకరించిన పద్ధతి నచ్చింది. కెమెరా (ఫోటోగ్రఫీ అంటారా!?) చాలా బాగా నచ్చింది...
సినిమా చూసాక... దర్శకుడు ఎవరా అని చూసాను... మంచి విషయం ఉంది అనిపించింది...
తప్పకుండా Gulal చూడటానికి ప్రయత్నిస్తాను.
సామాన్యంగా తెలుగు దర్శకులు పలికే చిలుక పలుకులు వినే సినిమాపై వ్యమోహం పెంచుకొని గుడ్డలు చింపుకొని థియేటరు కెళ్లే నేను మీరింత చేప్పాకచూడకుండా ఉండలేను వెంటనే మొదలెట్టేస్తాను.
కత్తన్నా యాద్ మర్శినా, నేనో కొత్త బ్లాగు షురూ జేశినా జరంత దాని పోంటి ఒకపారి సూశి ఎమన్నా చెప్పాలనుంటే చెప్పరాదు. గా బ్లాగు మన తెలుగోళ్ల యూట్యూబు సైనిమాల గురించేనే.
మహేష్ గారు సినిమా చూసాను, చాలా బాగుంది. అన్నింటి కంటే నచ్చింది అయేషా పాత్ర, మగవాడి విజయం వెనకే కాదు అపజయం వెనక కూడా ఆడది ఉంటుందేమో!
మహేష్ గారు...
ఐతే .. నేను చూడాలి ఈ సినిమా!!!
Post a Comment