Wednesday, September 9, 2009

తెలుగు సినిమాలకు అవార్డులు ఎందుకు?

2007 సంవత్సరానికిగానూ 55వ జాతీయ చలనచిత్ర అవార్డులు మొన్ననే ప్రకటించారు. ఎప్పటిలాగే మన తెలుగు సినిమా ఏ అవార్డూ దక్కలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు, "Telugu film industry produces films in great quantities. But,they failed to impress the jury with quality films this year"అని జాతీయ అవార్డుల కమిటీ చైర్మెన్ ప్రముఖదర్శకురాలు సాయ్ పరాంజిపే అన్నారు.

ఈ మాటకు మన ఇండస్ట్రీ పెద్దలకు భలే కోపం వచ్చేసింది. ‘ఇది విదేశీ కుట్ర’ అన్న సహజరీతిలో "అవార్డుల జ్యూరీ తెలుగు సినిమాలపైన వివక్ష చూపించారు" అని ‘చందమామ’ చిత్ర నిర్మాత కళ్యాణ్ ఒక ఆరోపణ చేసి చేతులు దులుపుకున్నారు.

ఏ కేటగిరీలో అవార్డుల కోసం పంపారోగానీ, పంపిన మూడు సినిమాలు... మీ శ్రేయోభిలాషి, చందమామ,హ్యాపీడేస్.

అవార్డులు లిస్టు వాటి కేటగిరీలు ఇక్కడ ఇస్తున్నాను....


ఉత్తమ చిత్రం: కాంచీవరం (ఈ తమిళ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు)

ఉత్తమ నటుడు: ప్రకాష్ రాజ్ ( ‘కాంచీవరం’ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది)

ఉత్తమ నటి: ఉమశ్రీ (‘గులాబి టాకీస్’ అనే గిరీశ్ కాసరవళ్ళి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది)

ఉత్తమ సహాయనటుడు: దర్శన్ జరీవాలా (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో గాంధీ పాత్రకుగానూ ఈ నటుడికి ఈ అవార్డు దక్కింది)

ఉత్తమ సహాయనటి "షెఫాలీ ఛాయా (గాంధీ మై ఫాదర్ లో కస్తూర్బా పాత్రకుగానూ ఈ నటికి అవార్డుగక్కింది)

ఉత్తమ స్క్రీన్ ప్లే : ఫిరోజ్ ఖాన్ (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఫిరోజ్ ఖాన్ వహించారు. ఇది పిరోజ్ మొదటి చిత్రం)

ఉత్తమ దర్శకుడు: అడూర్ గోపాలకృష్ణన్ (‘నాలు పెణ్ణుంగల్ చిత్రానికి గానూ ఈ అవార్డు దక్కింది)

షారుఖ్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ చిత్రానికి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. భావనా తల్వార్ దర్శకత్వంలో వచ్చిన వివాదాస్పద చిత్రం ‘ధర్మ’ కు ఉత్తమ జాతీయ సమగ్రతను ప్రేరేపించే చిత్రంగా అవార్డు లభించింది. అమీర్ ఖాన్ నిర్మించి,దర్శకత్వం వహించిన ‘తారే జమీన్ పర్’ ఉత్తమ కుటుంబ సంక్షేమ చిత్రంతోపాటూ ఉత్తమ గీత రచయిత (ప్రసూన్ జోషి), ఉత్తమ గాయకుడు (శంకర్ మహదేవన్) కు అవార్డులు లభించాయి. ఉత్తమ గాయనిగా ‘జబ్ వుయ్ మెట్’ చిత్రానికి శ్రేయా ఘోషాల్ కు లభించింది. చివరిగా ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ గానూ రజనీకాంత్ - శంకర్ ల ‘శివాజీ’ చిత్రానికి అవార్డు లభించింది.


ఉత్తమనటుడిగా ప్రకాష్ రాజ్. బాలీవుడ్ బాద్షాలైనా షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు ఈ అవార్డు కోసం రేసులో ఉండగా, ‘కాంజీవరం’ చిత్రంలో ప్రకాష్ రాజ్ "నటనకు" గానూ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. మన తెలుగు నామినేటెడ్ సినిమాల్లో మంచి నటన మీ శ్రేయోభిలాషి లో రాజేంద్ర ప్రసాద్ చేశారనుకున్నా, ప్రకాష్ రాజ్ నటనకు పోటీ ఇవ్వదగిన నటన చేశారా అంటే "లేదు" అనే చెప్పుకోవాలి.

ఉత్తమ నటిగా ఉమశ్రీకి. చందమామ నుంచీ,హ్యాపీడేస్ నుంచీ తెలుగు రాని (డబ్బింగ్ చెప్పుకోలేని) హీరోయిన్లు జాతీయ అవార్డుకు మొత్తంగా అనర్హులు. ఒకవేళ అవార్డు "నటనకు" ఇద్దామనుకున్నా, వారి నటన ఏపాటిదో అందరికీ తెలిసిందే. మరి ఎవరికి అవార్డు ఇవ్వాలి?

ఓకే...(ఉత్తమ చిత్రం ఎలాగూ ఇవ్వలేరు) మొత్తంగా సినిమాకు ఏదైనా ఒక అవార్డు ఇద్దామా అంటే, సందేశాత్మక చిత్రమైన ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ చేనేత కార్మికుల పోరాటం గురించి ఒక సినిమా, హిందూ-ముస్లింల మధ్య పెరుగుతున్న అపనమ్మకాన్ని గురించి మరొకటి, హిందూమతంలోని resilience గురించి చెప్పిన చిత్రం ఒంకొకటి, పిల్లల పెంపకం గురించి హృద్యంగా,వినోదాత్మకంగా చెప్పింది మరొకటి, ఒక మహిళా హాకీటీం ప్రేరణాత్మక ప్రయాణాన్ని రసభరితంగా తెరకెక్కించిన సినిమా మరొక్కటి. ఇలాంటి వాటి మధ్య, మన ‘మీ శ్రేయోభిలాషి’ అవార్డు దక్కించుకోలేక పోవడం నిజంగా వివక్షేనా?

ఆడలేక మద్దెల ఓడన్న సామెత గుర్తొస్తోంది నాకు. బాక్సాఫీస్ కలెక్షన్లు తప్ప మాకు వేటితో పనిలేదనిచెప్పే మన సినీజనాలు అవార్డులు రాకపోతే ఇంత ఇదిగా ఎందుకు బాధపడాలి? మనకు వాటితో సంబంధం లేనప్పుడు, అసలు నామినేషన్ వెయ్యడం ఎందుకు? అవార్డు రాకపోతే వివక్ష అంటూ లేనిపోని అభాంఢాలు ఎందుకు? అత్యధిక సినిమాలు తీసే పరిశ్రమగా, ఇండస్ట్రీ కొత్త టేడ్ టాక్ సృష్టించే సినిమాలు తీసే గొప్ప పరిశ్రమగా సంతోషపడక ఈ అర్థంలేని అవార్డుల ఆశలేల....రాకపోతే ఈ నిరాశలేల?

మనం నామినేట్ చేసిన మూడు చిత్రాల్లో దేనికి ఏ అవార్డు ఇచ్చుండచ్చో కనీసం మీరైనా చెప్పడానికి ప్రయత్నించండి.
*****

23 comments:

Prashanth.M said...

కంలి, సిరా, గ్రహణం..ఇవి తెలుగు సినిమాలు కావా? చందమామ లో సందేశం ఎముంది? మీ శ్రేయొభిలాషి సెంటిమెంటు చిత్రమే కానీ సందేశమేమీ లేదు. తెలుగు సినిమా ఫాస్టు ఫుడ్డు లాంటి సినిమా, అలాగని హింది సినిమా గొప్పదనీ అనట్లేదు! సినిమాలు తీసే సబ్జెక్టు లో భారత దేశపు దర్షకులు (except satyajit ray ) ఇంకా LKG లోనే ఉన్నారు! వీరికి అవార్డులు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక్కటే!

Vinay Chakravarthi.Gogineni said...

ee year levani.............i agre but aa naluguriki enduku ivvaledo naaku artham kaadu aa year humtum hereo saif ki vachhindanukunta...........

adi eligible kaada national award ki cheppandi.......ila chaala vunnay boss...y u crticize telugu films always........

సుజాత వేల్పూరి said...

అవార్డులకు ఏ మాత్రం సరి తూగని సినిమాలను పోటీకి పంపి వివక్ష అంటే చాలదు. చందమామ సినిమా చూడ్డానికే చాలా సహనం కావాలి! ప్రశాంత్ బాగా చెప్పారు.

ఆ నలుగురు సినిమా నటనకు కాకపోయినా ఉత్తమ చిత్రం స్థాయిలో జాతీయ అవార్డుకు వెళ్ళదగ్గ సినిమాయే మరి! దానికెందుకు రాలేదో అవార్డు!

Kathi Mahesh Kumar said...

@సుజాత: జాతీయ అవార్డులకు నామినేట్ చెయ్యడానికి రూల్స్ ఉన్నాయిగానీ, ఎంపిక చెయ్యడానికి "eligibility criterion" అంటూ ఏమీ ఉండదు. ప్రతి సంవత్సరం కొందరు లబ్ధప్రతిష్టులైన జ్యూరీ సభ్యుల్ని ఎంపికచేసి వారికి ఆ బాధ్యత Directorate of Film Festivals అప్పగిస్తుంది.

వచ్చిన నామినేషన్లను ఆ జ్యూరీ పరిశీలించి(సినిమాల్ని చూసి),ఏకాభిప్రాయంతోనో లేక ఓటింగ్ ద్వారానో అవార్డు గ్రహీతలను నిర్ణయిస్తారు.సినిమా గురించి జ్ఞానం ఉన్న ఈ జ్యూరీ మెంబర్లలోకూడా చాలా విషయాలలో ఏకాభిప్రాయం కుదరదు."కళ"ను జడ్జిచెయ్యడంలో ఎప్పుడూ ఈ తంటా ఉంటుంది.కాబట్టి,చాలా వరకూ ఓటింగ్ తప్పదు.

అంతమాత్రానా ఇదేదో రిగ్గింగ్ చేసెయ్యదగ్గ జ్యూరీ అనుకోనవసరం లేదు.జాతీయ అవార్డుల వెనుకనున్న మూల ఉద్దేశమైన "to encourage the furthering of Indian art and culture"ని మాత్రం వీరెప్పుడూ విస్మరించలేరు.దీనితోపాటూ cinematic craft,socially relevant cinema అనే మరో సిద్ధాంతాన్నీ వీడలేరు.

వీరు ఎంపికచేసిన చిత్రాలను/నటులను ఎందుకు ఎంపికచేసారు అనే కారణాన్ని ఒక రిపోర్టులో భద్రపరుస్తారు. ఉదాహరణగా 2004 సంవత్సరానికిగానూ ఇచ్చిన రిపోర్ట్ సమరీ ఈ క్రింది లంకెలో చూడండి.
http://www.manoramaonline.com/advt/movie/NationalFilmAwards2004/52_NFA_Awards.pdf

అవార్డు ఎందుకిస్తున్నారో చెబుతారేగానీ, అవార్డు ఎందుకు ఇవ్వలేదో చెప్పాల్సిన బాధ్యతను వీరికి ఎవరూ ఇప్పటివరకూ ascribe చెయ్యలేదు. కాబట్టి "ఆ నలుగురు" చిత్రానికి ఎందుకు అవార్డు రాలేదు అంటే దానికి సమాధానం మనకు దొరక్కపోవచ్చు.

@గోగినేని వినయ్ చక్రవర్తి: డబ్బుల కోసం/ప్రేక్షకుల కోసం సినిమాలు తీసేప్పుడు అవార్డులు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదుకదా!

సినిమా మన తెలుగు నిర్మాతలకు ఒక వ్యాపారం.కళ కాదు. అలాంటప్పుడు they should be happy with box office collection and care not for awards.

ఒకవేళ నిజంగానే అవార్డు కావాలంటే అంతే నిబద్ధతతో సినిమాలు తియ్యాలి.So our film makers should decide what they want or create a path where they can get both money and awards both. As Amir Khan and Sharukh Khan did it in Hindi.

భావన said...

చందమామ ను ఎందుకు నామినేట్ చేసేరో.. సుజాత గారన్నట్లు చూడటానికే చాలా సహనం కావాలి. గ్రహణం మంచి సినిమా ఎందుకు నామినేట్ అవ్వలేదో... సొంత థీం లేని కాపీ సినిమా హాపీ డేస్ ఎందుకు నామినేట్ అయ్యిందో... మీ శ్రేయోభిలాషి పర్లేదు, ఆ నలుగురు కూడా మంచి సినిమా, వినోదాత్మకం గానో కుటుంబ (తెలుగు కుటుంబం) పరం గానో సినిమాలు వస్తాయి కాని ఆలోచించతగ్గ సినిమాలు 2007 లో పెద్ద గా రాలేదనుకుంటా.. హింది ఇండస్ట్రీ లో అమిర్ ఖాన్ కు తప్ప అంత నిబద్ధత ఎవరికి వుంది మహేష్..

శేఖర్ పెద్దగోపు said...

నిన్న మహా టీ.వీ లో దీని మీద పెద్ద చర్చ జరిగింది. అందులో మోహన కృష్ణ గారు పాల్గొన్నారు. ఓ పెద్దయన ఇలా చెప్పారు.
"మనకి కొత్తగా వస్తున్న నటులు ఒకేసారి స్టార్ ఐపోదామనుకుంటారు గానీ మంచి నటుడు అవుదామని అనుకోరు"
"పెద్ద హీరోలు ఇమేజ్ అని అంటారు గానీ..ఆ ఇమేజ్ ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? సపోజ్ నేను కమల్ సినిమాకి వెళ్తే సినిమా ఎలా అయినా ఉండొచ్చు అన్న భావనతో వెళ్తాను. ఎందుకంటే మొదటినుండీ ఆయన విభిన్న పాత్రలు చేసాడు కాబట్ట్టి...మరి మనహీరోలు మొదటే ఇమేజీ చెట్రంలో ఇరుక్కోక ఎందుకు ఇలా చెయ్యరు?"

ఇలా ఎంతో అర్ధవంతమైన వాఖ్యలు చేసారు చర్చలో పాల్గొన్న పెద్దలు.

సుజాత వేల్పూరి said...

ఆ నలుగురు సినిమాకి అవార్డ్ ఎందుకు రాలేదెందుకో అన్న ప్రశ్న కాజువల్ గా మనసులో అనుకుంటూ బయటికి రాసేశాను లెండి!

మీరిచ్చిన లింక్ ప్రస్తుతానికి ఓపెన్ కాలేదు. మళ్ళీ ప్రయత్నిస్తాను.

Anil Dasari said...

హ్యాపీడేస్ తెలుగు సినిమానా? కనీసం పేరు కూడా తెలుగులో లేదు. దాన్ని అవార్డులకోసం పంపిన శుంఠ ఎవరు?

Anonymous said...

అసలెందుకు మనకి అవార్డులు? సినిమాలను కొలవడానికి అవార్డులు కొలబద్ధా? అసలు సినిమాలు కళకోసం అన్నది మొహమాటానికి అంటున్నారు తప్పితే కాసుల కొసం అన్నది నిర్వివాదాంశం. కొన్ని కోట్ల వ్యాపారం జరిగేటప్పుడు పెట్టిన ప్రతి పైసా తిరిగి రావాలని కోరుకోవాలే తప్ప కళామతల్లి కి నీరాజనం గా సమర్పిచుకోవడానికి ఎ నిర్మాత సాహసించడు. అలాంటప్పుడు అవార్డుల కోసం సినిమాలు తీసి ఎవరయినా ఎం బావుకుంటారు?

Anonymous said...

అబ్రకదబ్ర said...

హ్యాపీడేస్ తెలుగు సినిమానా? కనీసం పేరు కూడా తెలుగులో లేదు. దాన్ని అవార్డులకోసం పంపిన శుంఠ ఎవరు?
-----
చందమామ మాంఛి తెలుగు పేరు అని నామినేట్ చేశారు గామోసు!!!! ఆ ఒక్క క్వాలిటి తప్ప మరేమి లేదు ఆ సిన్మా లో !!! :):)

$h@nK@R ! said...

I think none of the films for that year will have valid reasons to get awards..!

వాసు said...

అబ్రకదబ్ర గారు,
బాగా చెప్పారు.

Vidyamanohar said...
This comment has been removed by the author.
Vidyamanohar said...

ప్రేక్షకులు చూస్తున్నారు ...మేము తీస్తున్నాం అని అర్థం లేని కారణాలు చెపుతూ ...అంతకంటే అర్థం లేని హాస్యం, హింస, శృంగార రసాలను పోషించే ఈ కళా మూర్ఖులకి...sorry..మూర్తులకి అవార్డులు రాక పొతే తెలుగు చలనచిత్ర లోకానికి జరిగే నష్టమేమీ లేదు ... అరువు తెచ్చుకున్న, భాష అసలు మాట్లాడలేని కథానాయికలు, ప్రతినాయకులు ...కథలు కూడా దాదాపుగా అరువేగా ... అవార్డులనవసరం

Unknown said...

ముమ్మాటికీ నిజం . జ్యూరీ సభ్యుల మాయ ,అది అంతే!
ప్రపంచ స్థాయిలో - ఆస్కారు అవార్డులు ASistE
adi pEraasE!
" శ్రేయోభిలాషి " ;
" ఆ నలుగురు " వంటి చిత్రాలపైన శీత కన్ను ;

Vidyamanohar said...

ప్రేక్షకులు చూస్తున్నారు ...మేము తీస్తున్నాం అని అర్థం లేని కారణాలు చెపుతూ ...అంతకంటే అర్థం లేని హాస్యం, హింస, శృంగార రసాలను పోషించే ఈ కళా మూర్ఖులకి...sorry..మూర్తులకి అవార్డులు రాక పొతే తెలుగు చలనచిత్ర లోకానికి జరిగే నష్టమేమీ లేదు ... అరువు తెచ్చుకున్న, భాష అసలు మాట్లాడలేని కథానాయికలు, ప్రతినాయకులు ...కథలు కూడా దాదాపుగా అరువేగా ... అవార్డులనవసరం

మరువం ఉష said...

పునరావృతాల కంఠశోష. మరలిరాని ప్రాభవాల మరణఘోష.

Bala said...

If they do not give idea film fare gives us.........how come other people understand our films......

todalu kottali, chillara veshalu veyyali evvani lekunda cinema ledanaa

నీటి బొట్టు said...

మిగతా కమర్షియల్ సినిమాల మధ్య మన తెలుగు సినిమా జ్యూరీ వాళ్లకు ఎందుకు కానరాకుండా పోయింది...దీనిలో లోపం మనం తీసే సినిమా లో సందేశం కూడా కమర్షియల్గా వుండడమే.. అసలు ఫీల్ అనేది రావాలి కదా.

Unknown said...

Baasu ...Mahesh...This article is pretty realistic..and this should be accepted by every matured person who has knowledge of movies from Indian and Hollywood cinema.

One cannot expect an award just becoz he has directed or produced a semi-porn or bloody violent nonsense movie.Telugu movies are taken just for earning money (particularly movies released after year 2000)...in AP and other overseas markets.Thoug all our Telugu IT people are based at all parts of the world..they still encourage these kind of meaningless movies like their co-viewers in AP who watch the movies in theaters , and wasting their money...as a result...producers keep making same stupid movies..!!
Viewrs should reject all these non-sense movies..like they did in year 2009...just 4 mobies able to survive (please observe - i am not using the word celebarting) for 100 days..!!
I am not at all surprised at Jury's decision NOT to award any telugu movie.I am not expecting any award for movies like Arundhati or Magadheera...except may be good graphics work, sound recording or cinematography..!!

Vidyamanohar said...

ఈ వాదనతో నేను అంగీకరించను.
అవార్డు రాదగ్గ లేక అవార్డు పొందగలిగే చిత్రాలను మనవాళ్ళు తీయటం లేదనడం కొంతవరకు సబబు అనుకున్నా... తెలుగు ప్రేక్షకులు 'meaningless movies' ని encourage చేస్తారనడం సరి కాదు. నా వరకు నాకు హాలీవుడ్ బ్లాక్ బస్టర్లు ఎన్నో మన విఠలాచార్య సినిమాల ముందు ఎందుకూ పనికి రావేమో అనిపిస్తాయి....
మనల్ని మనం విమర్శించు కోవడానికి మనల్ని మనం కొంచంగా చూపించుకోనవసరం లేదు

Kathi Mahesh Kumar said...

@విద్యామనోహర్ గారు: తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం చెత్తమాత్రమే చూస్తున్నారు,చూస్తారు అనడంలో నాకైతే ఏమాత్రం సందేహం లేదు. మీరు చెబుతున్న విఠలాచార్య కాలం నుంచీ బయటొచ్చి వర్తమానాన్ని చూడండి. మనల్ని మనం కించపరుచుకునే ఔన్నత్యం సినిమాల విషయంలో మనకు లేదులెండి.

Vidyamanohar said...

మహేష్ గారు : బహుశ నా ఆంతర్యాన్ని వాక్యాల్లో పెట్టడం లో నేను సఫలీకృతుడిని కాలేదేమో కాని ...నేననేది తెలుగు సినిమాలు చెత్తగా వస్తుండవచ్చు కాని చెత్త సినిమాలు చూడడం తెలుగువాడి choice కాదు అని నా అభిప్రాయం. తీస్తున్న ఎన్నో సినిమాలు ఎవడూ చూడకుండానే వెళ్ళిపోతున్నాయి ....వచ్చి వెళ్ళిపోయినా విషయం కూడా తెలియట్లేదు ...అయినా తీస్తున్నారు...విఠలాచార్య తో కాని మరి ఇంకా పాతవాళ్ళతో కంపరే చెయ్యడం కాని ...ఉద్దేశ్యం ఏమిటంటే ఇప్పటి వాలు ఎగబడి చూస్తున్న కొన్ని సినిమాలు మనవాళ్ళు ఎప్పుడో తీసారు అని చెప్పడం....పాత వాళ్ళు మంచి సినిమాలు తీసారు అంటే ఇప్పటివాళ్ళు మంచివి తీస్తున్నారు అని కాదు..

చెత్త సినిమాలు వస్తున్నాయనడం లో నాకూ సందేహం లేదు...