"నేను వెతికినవాళ్ళలో నీకు ఇష్టమైతేనే ఒకర్ని పెళ్ళిచేసుకో" అని ఒకరు చెప్పొచ్చు.
"నీ ఇష్టమొచ్చినవాడ్ని చూపించు. వాడితో పెళ్ళిచేస్తాంకానీ ఒకే కులమోడైతే చాలు." అని మరొకరు అనొచ్చు.
"నువ్వు ప్రేమించిన ఎవరైనా ఫరవాలేదమ్మా, తెలుగోడైతే చాలు" అని ఒకరనొచ్చు.
"హిందువైతే చాలు" అని మరొకరు.
"భారతీయుడైతే చాలు" అని మరొకరు.
"ఎవడినా ఫరవాలేదు. డబ్బులుంటే చాలు" అని మరొకరు.
"ఎవరైనా ఫరవాలేదు. మగాడైతే చాలు" అని మరొకరు.
"అడామగాఎవరైనా చాలు" అనే వాళ్ళు మరొకరు.
పైన చెప్పిన అన్నీ ఆధునికాలే విశాలదృక్పధాలే. కానీ వాటిల్లోకూడా స్థాయిలున్నాయి. అంటే modernity is highly subjective and often personal. అందుకే దాన్ని ఇతరులకోసం నిర్వచించలేము. morals కి కూడా ఇదే వర్తిస్తుంది.
కాకపోతే ఒకటి. ఆధునికం అన్నది ఒక alternative vision. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఆలోచనా ధోరణికి కొంచెం భిన్నమైనది. అంతే!
ఆధునికత-సాంప్రదాయం వేరువేరు కాదు. అవి జీవితాన్ని చూసే రెండు భిన్నమైన ధృక్కోణాలు(visions). అవి భిన్నంగా ఉన్నా వచ్చే నష్టం లేదు. Because they can co-exist and be in transition for most of the time. కానీ,నాసమస్య ఆ "మార్పు continuum"లోని అఘాధాల్ని మర్చిపొమ్మని, ఆదికాలానికీ-ఆధునిక యుగానికీ లంకెకట్టి వాదించే నియో-సాంప్రదాయవాదుల హిపోక్రసీతోనే.
సాంప్రదాయం అంతా బంగారమూ కాదు. ఆధునికత అంతా శృంగారమూ కాదు. రెంటిలోనూ లోటుపాట్లున్నాయి. కానీ మార్పు దిశగా ప్రయాణించాలంటే ఆధునిక ఒక అవసరం. ఆ అవసరాన్ని అందిపుచ్చుకుంటూ కూడా కేవలం లిప్ సర్విస్ చేసే ద్వంద్వప్రవృత్తినే నేను వ్యతిరేకించేది. ప్రశ్నించ లేని సంప్రదాయం, అర్థం లేని ఆధునికతా రెండూ కూడా వ్యర్థమే. మనకు కావాల్సింది నిర౦తర మార్పు. హేతుబద్ధమైన ఆధునికత ! నిర౦తర మార్పు లేని నాడు, ఈ నాటి ఆధునికత కూడా రేపటి సంప్రదాయం గా మిగిలిపోతుంది.
****
15 comments:
నిజం చెప్పారు.
ప్రతి మనిషి ఎంతో కొంత ఆధునికతని ఆచరిస్తూనే ఉంటాడు. అయినా తాను ఆచరించే స్కేలు కన్నా ఎక్కువ కనపడితే మాత్రం ఆమోదించ లేడు. పైగా సంప్రదాయం అంటూ మొదలు పెడతాడు. కాని తాను చెప్పే ఆ సంప్రదాయం ఎంతవరకు ఆచరిస్తున్నది మాత్రం విస్మరిస్తాడు.
>>విశాలధృక్పధం వైశాల్యమెంత?
ఆమోదించగలిగినంత. అంతేనా??
meaningful.
>>>odernity is highly subjective and often personal. అందుకే దాన్ని ఇతరులకోసం నిర్వచించలేము. morals కి కూడా ఇదే వర్తిస్తుంది...
>>>సాంప్రదాయం అంతా బంగారమూ కాదు. ఆధునికత అంతా శృంగారమూ కాదు....
>>>ప్రశ్నించ లేని సంప్రదాయం, అర్థం లేని ఆధునికతా రెండూ కూడా వ్యర్థమే..
చాలా బాగా చెప్పారు..
true
true
well said.
మోహన గారి వ్యాఖయ్ కూడా.
>>ఆ అవసరాన్ని అందిపుచ్చుకుంటూ కూడా కేవలం లిప్ సర్విస్ చేసే ద్వంద్వప్రవృత్తినే నేను వ్యతిరేకించేది.
సూపర్. అయితే ఒకటి. డబ్బు అనే అవసరాన్ని క్రైస్తవ మతంలోకి చేరటం ద్వారా అందిపుచ్చుకుంటూ, నేను క్రైస్తవుణ్ణి అని ప్రభుత్వ రికార్డుల కోసమే లిప్ సర్వీస్ చేసే దళిత ద్వంద్వప్రవృత్తిని కూడా మీరు వ్యతిరేకిస్తారనే అనుకుంటాను మరి :-)
"సాంప్రదాయం అంతా బంగారమూ కాదు. ఆధునికత అంతా శృంగారమూ కాదు. రెంటిలోనూ లోటుపాట్లున్నాయి."
అలాగే రెండిటిలోనూ మంచివి గూడా ఉన్నాయి.
బాగా చెప్పారు.
Why not leave it to the girls to find their own husbands, if they want to marry.
good one, well said!
People are mistaking Westernization to Modernization.. ఇది మన దుర్భాగ్యం.. modern is different from being western.. modernity should happen from within (the way you think) but not by wearing western clothes. ఈ భావం ఎప్పుడైతే మనుషుల్లో ప్రత్యేకంగా భారతీయుల్లో తొలగిపోతుందో .. అప్పుడు మన సమాజం బాగుపడుతుంది. మనకంటూ ఒక గుర్తింపు ఉంది..కానీ అది మనకు వద్దు.. ఎంత western గ ఉంటే అంత modern గా ఉన్నట్టు.. ఇది కేవలం మన ఖర్మ..ఆధునిక భావాలు వేరు పాశ్చాత్య భావాలు వేరు.. ఈ సంగతి జనాలకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో. మహేష్ గారూ మీరు వీలైతే ఈ టాపిక్ మీద ఒక చిన్న టపా వేసుకోండి..
That is the sort of system we followed. I lucked out in marriage; in India any idiot can find a wife and I went in to an arranged marriage with the help of friends since I did not have confidence in my father. My wife turned out to be a caring and independent woman. She felt that the system was loaded against women and we generally left the children to their own devices in career and marriage. One daughter married, another has a boy friend but they are living in different countries now. The third felt that many men she met are sexist and did not marry. So far they seem quite happy pursuing their interests.
@మహేష్: I second Shivudu. You should run a post "Westernization Vs Modernization"
WP's link in his latest post got me here. Good one, well said..
one of the excellent post i hv ever read
Post a Comment