Wednesday, July 14, 2010

అభివృద్ధి టెర్రరిస్టు



"శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగటంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.మరో 60 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది పోలీసులు"    - ఈనాడు 


ఎవరికోసం ఈ అభివృద్ధి?  
ఎందుకోసం చేస్తున్నారు?
వరు చేస్తున్నారు ఈ టెర్రరిజం?

అర్థరహిత అభివృద్ధి నమూనాను “భలే భలే” అని మోస్తున్న మధ్యతరగతి కళ్ళన్నీ పల్లకి ఎక్కే క్షణం కోసం మాత్రమే చూస్తున్నన్నినాళ్ళూ ప్రభుత్వాలు ఈ మారణహోమాల్ని చేస్తూనే ఉంటాయి. బలయ్యే సామాన్యుల కష్టాలు “అనాగరికంగా” వాళ్ళ పోరాటాలు “నక్సలిజంగా” చాలా కన్వీనియంట్గా పేర్లు పెట్టి ఈ దారుణాల్ని మహదర్జాగా కానిస్తూనే ఉంటారు. 

అందుకే alternate media అవసరం. ప్రత్యామ్న్యాయ ధృక్కోణాలు అవసరం. ఒక అభివృద్ధి డిబేట్ పెద్దస్థాయిలో అవసరం.



****

10 comments:

తార said...

అక్కడ వున్న దళితుల కోసం, దళితోధ్ధరణ కోసం..
తరువాత ఆ పేరు చెప్పి, వై.యస్.అర్. అల్లుడో, కొడుకో తింటారు మెల్లగా ఏముంది.
పీడిత పక్షం పక్కన కుర్చునే కమ్యునిస్టులు ఎమైపొయ్యారు? ఇడ్లీ లో చికెన్ కోసం వెతుక్కుంటున్నారా?
ప్రధాన ప్రతిపక్షం ఏమి చేస్తున్నది? ఏముంది తన బావమరిదో, అల్లుడో సినిమాల్లో ఫైట్లు చేసి కాపాడతారని వోల్వో బస్సులో సింహా సినిమా చూస్తూ నిద్దరోతున్నారు.
మరి లోక్ సత్తా? పత్తానే లేదు కదా ఇంక ఈ గొడవా, ఏసీ శాసన సభలో ఖండిస్తారెమో జేపీ,
చిరూ పులి పనుల్లో బిజీ, తెలంగాణా కాదు కాదా, కేసిఆర్ కి పట్టదు, బిజేపీ ఇంకెక్కడ,
ప్రభుత్వాన్ని కాదు, ప్రతి రాజకీయ పక్షానికి దీన్లో వాటా వున్నది, మాకొద్దు బాబూ ఈ ప్రాజేక్టులు అంటుంటే, ఒక్కడు, ఒక్కడు మాట్లాడలేదు అంటే వారికి లాభం లేకపొతే ఒక్క ముక్కా యెందుకు ఏడవరు??
ఏ లోక్‌సభ సభ్యుని ఇంట్లోనో కుర్చోని ప్రజాభిప్రాయ సేకరణ చేసే అధికారులు..
వేల వెల కోట్లు సంపాదించి, శవాలపై బంగ్లాలు కట్టే అంబానీలు...
మొత్తం కలిసి చేస్తున్న మారణ హోమం.

తార said...

అక్కడ వున్న దళితుల కోసం, దళితోధ్ధరణ కోసం..
ఇది నా సొంతది కాదు, ప్రభుత్వమే చెప్పింది, శ్రీకాకుల పేద, దళిత అభ్యున్నతికి అని.. దానిలో గుడార్ధం నాకు ఇప్పుదు అర్ధం అయ్యింది, అందర్ని చంపేస్తె, మిగిలేది ధనికులే కదా.. బాగు బాగు..

Praveen Mandangi said...

మహేశ్ గారు. అక్కడ పచ్చని జేడి తోటలు, కొబ్బరి తోటలు ఉన్న ఉద్దానం ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం కట్టాలనుకున్నారు. అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం కడితే విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే వేడికి ఆ ప్రాంతంలోని గోనామరి గెడ్డ అనే నది ఎండిపోతుంది. మీ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఒకప్పుడు పచ్చని అడవులు ఉండేవని విన్నాను. అవి ఇప్పుడు ఉన్నాయో అంతరించిపోయాయో తెలియదు. ఇక్కడ కూడా అడవులు చాలా వరకు అంతరించిపోయాయి. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం వేడికి కొండపల్లి అడవులు అంతరించినట్టు ఉద్దానం కొబ్బరి తోటలు కూడా అంతరిస్తాయి.

తార said...

ధర్మల్ విద్యుత్ కేంద్రాలనుంచి అంత వినాశక వేడి వెలువడదు, వనరులు చట్టబద్దంగా వాడితే అక్కడ విద్యుత్ కేంద్రం వలన నష్టం లేదు, కానీ వచ్చిన చిక్కే అది, నీటి లభ్యత తక్కువ వున్నప్పుడు ప్రభుత్వం వేలల్లో వున్న రైతులని చూస్తుందా? కోట్లల్లో వున్న వోట్లని చూస్తుందా అనేదే ప్రశ్న, ఎవరైనా కోట్లే చూస్తారు, దాని వలన రైతులకి పంటలకి నీరు అందదు, ఇది ఒక్క వేసవో కరువొచ్చినప్పుడో కాదు, దొంగతనంగా ఇచ్చిన నీటి కన్నా ఎక్కువ వాడుకుంటే?
తరువాత పర్యావరణ సమస్య, వెలువడిన బూడిడ వలన పంటలు పండవు, చుట్టూ వున్న చెట్లకి ఆ బూడిద కప్పు వలన సూర్యరశ్మి పడక చచ్చిపోతాయి, కానీ వాటన్నిటినీ పర్యావరణ చట్టం ప్రకారం వచ్చిన బూడిద, ఇతర చెత్తని ఎటువంటి చెడు లేకుండా పారేయవచ్చు, కానీ దానికి ఖర్చు ఎక్కువ, అందుకే ఎక్కువ భూమి సేకరించి, దానిలో పడేస్తారు, చట్టరిత్యా అది నేరం ఐనప్పటికీ ప్రభుత్వమే వారికి వంత పాడుతుంది కాబట్టి సామాన్య ప్రజలకి నష్టమే..
అంతే తప్ప సమస్త ప్రాణులూ అంతరించిపొయే వేడి వస్తే, మనుషులు ఎల బ్రతకగలరు?
అసలు విద్యుత్ లేకపొతే మన మనుగడ సాధ్యమేనా?
వచ్చిన చిక్కు చట్టాన్ని సమగ్రంగా అమలు చేయకపోవటమే

కెక్యూబ్ వర్మ said...

రాజ్యం టెఱరిస్టులా వ్యవహరిస్తుందన్నది ఈ సంఘటన ద్వారా రుజువయ్యింది. మూడు నెలలకు పైగా అక్కడి ప్రజానీకం నిరవధిక నిరాహారదీక్ష ద్వారా గాంధేయ పద్ధతుల్లో చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఎన్నోవిధాలుగా అడ్డుకోజూసిన ప్రభుత్వం నేడు 1500 మంది సాయుధ పోలీసు గూండాలను, ప్రైవేటు సైన్యాన్ని వారిపైకి తరిమి కాల్పులు జరిపింది. అక్కడి ఆడవారి చేతిలో చీపుర్లు కన్పిస్తున్నాయి విజువల్స్ లో. నిరాయుధులైన వారిపై ఇలా కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా అక్కడ స్థాపించదలచిన వ్యాపార థర్మల్ ప్రాజెక్టుల ద్వారా పెట్టుబడిదారులకు లాభాలను కట్టబెట్టడానికి ఈ దుశ్చర్యకు పాల్పడ్డ పాలకులు అసెంబ్లీలో కూడా తప్పించుకో జూస్తున్న వైనం సిగ్గుచెటు. ఇంత జరిగినా సి.ఎమ్.కు సమాచారం లేదంట. వీళ్ళ బాధ్యతా రాహిత్యకామెంట్లకు ప్రజలే తగిన రీతిలో స్పందించాలి.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I don't think we are living in a democracy.that's why our rulers are doing whatever the want to do.

Unknown said...

అవును మనకు మనగల, ప్రత్యామ్నాయ అభివృద్ది నమూనా కావాలి. దానికొరకు చర్చ జరగాలి.

ఆ.సౌమ్య said...

ఇక్కడ పర్యావరణం, కాలుష్యం సంగతి పక్కనపెడితే ఉత్తరాంధ్ర జిలాలు వెనుకబడిన జిల్లాలు. నీటి ఎద్దడి కాస్త తక్కువే అయినా పచ్చని పంటపొలాలతో, కాలుమీద కాలు వేసుకుని కూర్చునే రైతులు లేరు ఇక్కడ (గోదారి ప్రాంతాల్లా.) అందరూ పూట తిండికి శ్రమ పడే రైతన్నలే. తార చెప్పినట్టు చట్టబద్దంగా వనరులను వడితే ఈ ధర్మల విద్యుత్ కేంద్రాలు ఆయా ప్రాతాలను అభివృద్ధి పరచొచ్చేమో. ఎన్నో యేళ్ళగా వెనుకబడి ఉన్న జిల్లాలు, ఈ కారణంగా అభివృద్ధి సాధిస్తాయేమో?

హరి said...

మనం స్వాతంత్ర్యం వచ్చాక మన దేశాన్ని అమెరికా లాంటి స్వేచ్ఛాయుత ఆర్ధిక వ్యవస్థగా కాకుండా మిశ్రమ ఆర్టిక వ్యవస్థగా అభివర్నించు కున్నాం. అంతే సగం సోషలిస్టు వ్యవస్థ అన్నమాట. తదనుగుణంగానే సోషలిస్టు వ్యవస్థ ఆర్థిక నియంతృత్వ పోకడలను కూడా దఖలు పరుచుకున్నాం. దరిమిలా సంస్కరణల బాట పట్టి దేశాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థకు తలుపులు బార్లా తెరిచాం. కాని ప్రభుత్వ నియంతృత్వ లక్షణాలు మాత్రం అలాగే ఉన్నాయి. చివరికి జరిగిందేమంటే, మనకు సోషలిజంలో, క్యాపితలిజంలో ఉండే అవలక్షణాలన్నీ సమకూరాయి.

ఏ వ్యవస్థ అయినా కానివ్వండి, సామాన్య పౌరుడి హక్కులకు భంగం కలిగించే హక్కు ప్రభుత్వానికి ఉండ కూడదు. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది.

"Government control of a country’s economy—any kind or degree of such control, by any group, for any purpose whatsoever—rests on the basic principle of statism, the principle that man’s life belongs to the state." - Ayn Rand

మీ శ్రేయోభిలాషి said...

They selected Srikakulam because:
1) Nearer to mines (Talcher)
2) Nearer to railway line and NH5
3) Nearer to PORT - so that Australian caol can be imported cheapely

Who cares about environment?